transfer
-
విద్యుత్తు ఉద్యోగులకు బదిలీల ‘షాక్’
సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమ్మతితో పని లేదు.. సాధారణ బదిలీల్లో ఇచ్చే వెసులుబాట్లూ లేవు.. ఎప్పుడూ ఉండే.. వైకల్యం, భార్యాభర్తలు, అనారోగ్యం, స్థానికం ‘ఆప్షన్లు’ లేవు.. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ..! విద్యుత్తు శాఖలో ఇప్పుడీ అంశం కలకలం రేపుతోంది. ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏ ప్రభుత్వ విభాగంలోనూ ఇలాంటి నిర్భంధ బదిలీలు జరగలేదని, ఎందుకింత కఠినం అని ఉన్నతాధికారులను అడిగితే.. ‘మేం చెప్పిన చోటకు వెళ్లండి.. లేదంటే మానేయండి’ అనే సమాధానం వస్తోందని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. విమర్శలు రావడంతో అనుమతి పాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వంలో 13 జిల్లాలను 26గా చేశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లలో దాదాపు 1.92 కోట్లమంది విద్యుత్తు వినియోగదారులకు సేవలందించేందుకు కొత్తగా ఏర్పడ్డ 13 జిల్లాలకు ఎలక్ట్రికల్ ఇంజనీర్ (ఈఈ) స్థాయి అధికారులను ఇన్చార్జులుగా నియమించారు.కూటమి ప్రభుత్వంలో కొత్త జిల్లాల్లో సర్కిల్, డివిజన్, ఏఈ కార్యాలయాల ఏర్పాటుతో పాటు అధికారులు, సిబ్బందిని కేటాయించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంపై విమర్శలొచ్చాయి. దీంతో కొంతకాలం క్రితం కొత్త సర్కిళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. చెరో జిల్లాకు భార్యాభర్తలు..!రాష్ట్రంలోని 3 డిస్కంలలో సుమారు 23 వేల మంది శాశ్వత సిబ్బంది ఉన్నారు. వీరినే పాత, కొత్త డివిజన్లకు సర్దుబాటు చేసుకోమని, కొత్త పోస్టులు ఇవ్వడం కుదరదని చెప్పింది. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా సర్కిళ్లు ఏర్పాటు చేయాలంది. డిస్కంలు దీనికితగ్గట్లు.. కమిటీలు వేసి ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. అయితే, సాధారణ బదిలీల్లో అనుసరించే నిబంధనలను పక్కనపెట్టాయి. ఈ కారణంగా ఒక డిస్కం పరిధిలో భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉంటే వారు చెరో జిల్లాకు బదిలీ కావాల్సి వస్తోంది. కొత్త సర్కిళ్ల పేరు చెప్పి ఇప్పటికే సగం సర్వీసులు తగ్గించేశారు. కొన్ని సర్కిళ్లలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎస్‌ఏవో) పోస్టులను తీసేశారు. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏవో) పోస్టులను ఎత్తేశారు. టెక్నికల్ పోస్టులను కుదించేశారు. ఒక్కో ఉద్యోగి రెండు మూడు విభాగాల పనిచేసే విధంగా భారం మోపుతున్నారు. వీటితోనే సతమతం అవుతున్న ఉద్యోగులు శాశ్వత కేటాయింపులపై ఆందోళనకు గురవుతున్నారు. -
సన్యాసిగా మారిన వ్యక్తి ఆర్బీఐ బాండ్ల బదిలీకి బాంబే హైకోర్టు నో
ముంబై: ప్రాపంచిక జీవితాన్ని వదిలేసి జైన సన్యాసం స్వీకరించిన వ్యక్తి పేరుతో ఉన్న ఆర్బీఐ బాండ్లను తమకు బదిలీ చేయాలంటూ అతడి భార్య, తల్లి వేసిన రిట్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. ప్రాపంచిక జీవితాన్ని త్యజించడమంటే మరణంతో సమానమని, అతడి ఆస్తులకు తామే వారసులమవుతామన్న వారి వాదనలను తోసిపుచ్చింది. మనోజ్ జవెర్‌చంద్ దెధియా అతడి కుమార్తె, కుమారుడు జైన సన్యాసం స్వీకరించి, సాధువులుగా మారారు. పేర్లను సైతం మార్చుకున్నారు. అయితే, 2022 నవంబర్‌లో మనోజ్ సన్యాసం తీసుకోకమునుపు, తన పేరుతో ఉన్న ఆర్బీఐ బాండ్లను ట్రాన్స్ఫర్ చేసే విషయంలో హెచ్డీఎఫ్సీ అధికారులను సంప్రదించారని పిటిషనర్ల లాయర్ హితేశ్ సోలంకి కోర్టుకు తెలిపారు. తమ నిబంధనల ప్రకారం సన్యాసమంటే మరణంతో సమానం కాదని వారు ఆయన వినతిని తిరస్కరించారన్నారు. స్పందించిన ధర్మాసనం.. కేవలం సన్యాసం స్వీకరించిన ఫొటోలు, ఆహ్వాన పత్రికలుంటే చాలదని, అందుకు అనుగుణమైన క్రతువులు జరిపినట్లు ఆధారాలు చూపాల్సి ఉందంది. ఈ వ్యవహారంపై సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
తెలంగాణలో పది మంది ఐపీఎస్ అధికారులు బదిలీ
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 మంది ఏఎస్పీలను బదిలీ చేస్తూ సీఎం రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.2021, 2022 బ్యాచ్‌లకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేసినట్లు తెలంగాణ పోలీస్ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్, భువనగిరి ఏఎస్పీగా కంకణాల రాహుల్ రెడ్డి, ఆసిఫాబాద్ ఏఎస్పీగా చిత్తరంజన్, కామారెడ్డి ఏఎస్పీగా బొక్కా చైతన్య, జనగామ ఏఎస్పీగా పందిరే చైతన్య రెడ్డి, భద్రాచలం ఏఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్, కరీంనగర్ రూరల్ ఏఎస్పీగా నగ్రాలే శుభం ప్రకాశ్, నిర్మల్ ఏఎస్పీగా రాజేశ్ మీనా, దేవరకొండ ఏఎస్పీగా పీ మౌనిక బదిలీ అయ్యారు. -
రాహుల్‌పై కేసు క్రైమ్ బ్రాంచ్‌కు...
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం జరిగిన తోపులాటకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై నమోదైన కేసును ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. బీజేపీ ఫిర్యాదు మేరకు రాహుల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ఈ కేసును క్రైమ్‌బ్రాంచ్ దర్యాప్తు చేస్తుందని అధికారులు శుక్రవారం వెల్లడించారు. భారత న్యాయ సంహితలోని సెక్షన్ 117, 125, 131, 351, 3(5) కింద రాహుల్‌పై పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్లో కేసు నమోదయ్యింది. తోపులాటలో గాయపడిన ఇద్దరు బీజేపీ ఎంపీల స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. అలాగే రాహుల్ గాం«దీని పిలిపించి ప్రశ్నించనున్నట్లు తెలిపారు. పార్లమెంట్లో గురువారం జరిగిన తోపులాటకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ కోసం పార్లమెంట్ సెక్రటేరియట్‌కు లేఖ రాస్తామని వెల్లడించారు. తోపులాటలో బీజేపీ ఎంపీలు ప్రతాప్‌చంద్ర సారంగి(69), ముకేశ్ రాజ్‌పుత్(56) గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని, కోలుకుంటున్నారని డాక్టర్లు శుక్రవారం తెలియజేశారు. -
బాపూఘాట్ అభివృద్ధికి.. 222.27 ఎకరాలు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో బాపూఘాట్ అభివృద్ధి కోసం ఆ ప్రాంతంలో ఉన్న 222.27 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ మంగళవారం సాయంత్రం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ను కలిశారు. మహాత్మాగాంధీ చితాభస్మాన్ని కలిపిన ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో ఏర్పాటు చేయనున్న బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాతి్వకతను చాటే కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. బాపూఘాట్ వద్ద గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, మెడిటేషన్ విలేజ్, చేనేత ప్రచార కేంద్రం, ప్రజావినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్ ఘాట్లు, శాంతి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ పీస్), మ్యూజియంలతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నామని కేంద్ర మంత్రికి తెలిపారు. ఇందుకోసం రక్షణ శాఖ భూమిని బదిలీ చేయాలని కోరారు. కొత్త విమానాశ్రయాలకు అనుమతివ్వండి తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, ప్రజలకు రవాణా వసతులను మెరుగుపర్చడంలో భాగంగా కొత్త విమానాశ్రయాలకు అనుమతి ఇవ్వాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన ఎన్వోసీని రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ నుంచి పొందిందని వివరించారు. 253 ఎకరాల భూసేకరణకు అవసరమైన రూ.205 కోట్లను భారత విమానయాన సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని..ఈ మేరకు విమానాశ్రయ పనులకు, విమానాలు నడిపేందుకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇక కొత్తగూడెం జిల్లా పాల్వంచ, పెద్దపల్లి జిల్లా అంతర్గాం, ఆదిలాబాద్‌లలోనూ విమానాశ్రయాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులతో భేటీల్లో సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, ఆర్.రఘురామిరెడ్డి, కడియం కావ్య తదితరులు ఉన్నారు. -
గందరగోళంగా 'ఉన్నత విద్య'
డాక్టర్ ధనశ్రీ.. బయోకెమిస్ట్రీ లెక్చరర్. కర్నూలు కేవీఆర్‌లో పనిచేసేవారు. లాంగ్ స్టాండింగ్ పేరుతో 2022–23లో గుంతకల్లు డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. అక్కడ ఫైనలియర్లో కేవలం ఆరుగురు మాత్రమే విద్యార్థులున్నారు. వారు వెళ్లిపోయిన తర్వాత బయో కెమి్రస్టికి ఒక్క అడ్మిషన్ కూడా రాలేదు. విద్యార్థులు లేరు.. పైగా బయోకెమిస్ట్రి అక్కడ తొలగించారు. దీంతో ధనశ్రీ ఖాళీగా ఉన్నారు. పని ఉన్న కాలేజీకి బదిలీచేయాలని ఉన్నత విద్యాశాఖకు లేఖ రాయగా ఆమెను నంద్యాల డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. అక్కడ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటే లేదు. దీంతో అక్కడ కూడా ఆవిడ పనిలేకుండా ఖాళీగా ఉన్నారు. కేవీఆర్, సిల్వర్ జూబ్లీలో బయో కెమిస్ట్రి విభాగంలో ఖాళీలున్నాయి, విద్యార్థులూ ఉన్నారు. కానీ, వారికి నాణ్యమైన బోధన అందడంలేదు. భారీ వేతనాలిచ్చి సబ్జెక్ట్‌లేని కాలేజీలో పనిలేకుండా అధికారులు ఉంచడం ఎందుకో!?డాక్టర్ రవిశంకర్ శర్మ.. గుంతకల్లు డిగ్రీ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్. గుంతకల్లులో ఉన్న పోస్టుల కంటే ఎక్కువగా ఫిజిక్స్ లెక్చరర్లు ఉన్నారు. దీంతో పనిలేకుండా ఖాళీగా ఉన్నానని, పత్తికొండలో పోస్టు ఖాళీగా ఉందని అక్కడికి పంపాలని రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అయితే, శర్మను అనంతపురం డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. అక్కడ కూడా ఉన్న పోస్టుల కంటే ఎక్కువగానే ఉన్నారు. అక్కడా ఆయన పనిలేక ఖాళీగా ఉన్నారు. పత్తికొండలో మాత్రం ఖాళీ పోస్టును భర్తీచేయలేదు. డాక్టర్ కోటేశ్వరరావు.. గుంటూరు డిగ్రీ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్. 2022లో సర్దుబాటు పేరుతో ఇతన్ని బనగానపల్లిలో వేశారు. అక్కడ పూర్తిస్థాయిలో లెక్చరర్లు ఉన్నా అదనంగా నియమించారు. దీంతో ఏడాది పాటు పనిలేకుండా ఆయన ఖాళీగా ఉన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి అక్కడ నియమించాలని ఇక్కడ తనకు పనిలేదని కోరారు. ఏడాది తర్వాత ఆయన్ను తిరిగి డోన్‌కు పంపారు.డాక్టర్ ఫరీదా ఇంగ్లీషు లెక్చరర్. లాంగ్‌స్టాండింగ్ పేరుతో కేవీఆర్ నుంచి పాణ్యం డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. అక్కడ పిల్లలు లేరు. పనిలేకుండా ఫరీదా కూడా ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఉన్నారని అక్కడి ప్రిన్సిపాల్ ఫరీదాకు వేతనం నిలిపేశారు. పిల్లలు లేనప్పుడు తానేం చేయాలని, తన అవసరం ఉన్న కాలేజీకి బదిలీచేయాలని ఆవిడ విన్నవించారు. కేవీఆర్‌లో ముగ్గురు కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు. రెగ్యులర్ పోస్టు ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వారితో విద్యార్థులకు క్లాస్‌లు చెప్పించడం ఏమిటో!?.. ఈ నాలుగు ఉదాహరణలు పరిశీలిస్తే డిగ్రీ కాలేజీలో లెక్చరర్ల నియామకాలు, పనితీరు, విద్యార్థులకు అందుతున్న బోధన, వారి భవిష్యత్తుపై ఉన్నత విద్యాశాఖకు, ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎంత డొల్లగా ఉందో స్పష్టమవుతోంది. సబ్జెక్ట్‌లేని చోట సబ్జెక్ట్ లెక్చరర్‌ను నియమించడం, పిల్లలులేని చోట వారిని ఉంచడం, అవసరమైన చోట ఖాళీలు పెట్టడం చూస్తే అసలు డిగ్రీ కాలేజీల పనితీరుపై, విద్యార్థుల భవిష్యత్తుపై ఉన్నతాధికారులకు ఏమాత్రం అవగాహనలేదని తేటతెల్లమవుతోంది. – సాక్షి ప్రతినిధి, కర్నూలుఫారిన్ సర్వీసులు చేసి వస్తే సరిహద్దులకే..⇒ ఓ లెక్చరర్ విజయనగరం జిల్లా ఎస్ఎస్ఏ ఏపీసీగా పనిచేశారు. తిరిగి అతను సొంతశాఖలోకి వస్తే ఖాళీలున్నా అతన్ని మాత్రం పార్వతీపురం డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. ⇒ నంద్యాలలోని ఓ లెక్చరర్‌ను సర్దుబాటు పేరుతో విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురానికి బదిలీ చేశారు. చుట్టపక్కల కాలేజీల్లో ఖాళీలున్నా దూరానికి బదిలీ చేశారు.⇒ కర్నూలు జిల్లాలోని ఓ లెక్చరర్ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎస్ఎస్ఏ ఏపీసీగా పనిచేశారు. కర్నూలు జిల్లాలో ఖాళీలు ఉన్నప్పటికీ కడప జిల్లాకు బదిలీ చేశారు. ⇒ కర్నూలు ఎస్ఎస్ఏ ఏపీసీగా పనిచేసిన ఓ కెమిస్ట్రీ లెక్చరర్‌ను కర్నూలులోని రెండు కాలేజీల్లో ఖాళీలున్నప్పటికీ నంద్యాల జిల్లా కోవెలకుంట్లకు బదిలీ చేశారు. డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తూ ఫారిన్ సర్విసుల కింద బయటకెళ్లిన వారందరినీ ఆయా జిల్లాల్లోని డిగ్రీ కాలేజీల్లో ఖాళీలున్నప్పటికీ ఉన్నత విద్యాశాఖాధికారులు వారిని రాష్ట్ర సరిహద్దుల్లోని డిగ్రీ కాలేజీలకు బదిలీ చేస్తున్నారు. దీనికి కారణం వారు ‘ఫారిన్ సర్విసు’లకు వెళ్లడమే. వారిపై ఉన్న కోపంతో దూర ప్రాంతాలకు బదిలీచేసే సమయంలో అక్కడ ఖాళీలున్నాయా? వారి సొంత జిల్లాల్లో ఉన్న ఖాళీల పరిస్థితి ఏంటి? ఆ ఖాళీలను అలాగే ఉంచితే అక్కడున్న విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? అని ఆలోచన చేయడంలేదు.దీంతో 13 జిల్లాల్లోని ఏ డిగ్రీ కాలేజీ లెక్చరర్ కూడా ‘ఫారిన్ సర్విసు’కు వెళ్లినా వారిని ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోకి బదిలీ చేశారని లెక్చరర్లు చర్చించుకుంటున్నారు. ఉన్నత విద్యాశాఖలో ఇటీవల బదిలీ అయిన ఓ ఉన్నతాధికారి పనిగట్టుకుని ఇదంతా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ అధ్యాపకులు అవసరం? ఎక్కడ అవసరంలేదని గ్రహించకుండా కేవలం ఫారిన్ సర్వీసుకు వెళ్లారు కాబట్టి ‘శిక్ష’గా వీరిని దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నట్లుగా ఉంది.రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నప్పుడు ‘కాంట్రాక్టు’ బోధన ఎందుకు?.. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో దాదాపు 2,400 మంది రెగ్యులర్ అధ్యాపకులున్నారు. 740 మంది కాంట్రాక్టు, వెయ్యిమంది వరకు ఎయిడెడ్ లెక్చరర్లు ఉన్నారు. యూనివర్శిటీ స్థాయి పొందిన కాలేజీలో పీహెచ్డీ చేసిన అధ్యాపకులే యూజీ, పీజీ విద్యార్థులకు బోధించాలి. అయితే, రెగ్యులర్ పోస్టులున్నా వారిని ఇతర జిల్లాల్లోని డిగ్రీ కాలేజీలకు బదిలీచేసి యూనివర్శిటీ పరిధిలో కాంట్రాక్టు లెక్చరర్లతో నడిపిస్తున్నారు. వీరిలో సింహభాగం లెక్చరర్లకు పీహెచ్డీ లేదు. రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నప్పుడు వారిని ఖాళీగా ఉంచి కాంట్రాక్టు లెక్చరర్లపై ఆధారపడటం ఏమిటని మిగిలిన అధ్యాపకులు ప్రశి్నస్తున్నారు. కమిషనరేట్‌లో ఏళ్ల తరబడి డిప్యుటేషన్.. మరోవైపు.. కమిషనరేట్‌లో నలుగురు లెక్చరర్లు డిప్యుటేషన్‌పై 15 ఏళ్లుగా కొనసాగుతున్నారు. వీరు ఉద్యోగానికి వచ్చింది విద్యార్థులకు చదువు చెప్పేందుకా? లేదంటే కమిషనరేట్‌లో డిప్యుటేషన్‌పై కొనసాగేందుకా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 15 ఏళ్లుగా వారిని ఓ స్థానంలో అదీ డిప్యుటేషన్‌పై ఎందుకు కొనసాగిస్తున్నారని తోటి లెక్చరర్లు ప్రశి్నస్తున్నారు. క్లస్టర్ యూనివర్సిటీపై శీతకన్ను.. కర్నూలు జిల్లా సిల్వర్ జూబ్లి కాలేజీని, నగరంలోని కాలేజీలను క్లస్టర్ యూనివర్సిటీగా గత ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో ఖాళీలు లేకుండా పోస్టులు కూడా భర్తీచేశారు. అయితే, ఇక్కడ ఉన్న వీసీ సాయిగోపాల్కు, ఉన్నత విద్యాశాఖ నుంచి ఇటీవల బదిలీ అయిన ఓ కీలక అధికారికి మధ్య వ్యక్తిగత విభేదాలతో ఈ కాలేజీ వారిని బయటికి పంపడం, బయటి వారిని ఇక్కడకు పంపకుండా ఖాళీలు ఉండేలా చేస్తున్నారని లెక్చరర్లు చర్చించుకుంటున్నారు. వీసీలకు, ఉన్నతాధికారులకు మధ్య విభేదాలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు యూజీ, పీజీపై సమీక్షించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
విద్యుత్ సంస్థల్లో ఆగని అక్రమ బదిలీలు
సాక్షి, అమరావతి: ‘ఏలూరు ఆపరేషన్ సర్కిల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా పనిచేస్తున్న కె.మధుకుమార్‌ను నరసాపురం ఆపరేషన్ ఈఈగా అక్టోబర్ 5న బదిలీ చేశారు. నిబంధనల ప్రకారం ఏడాదిలోపు పదవీ విరమణ చేసే వారిని బదిలీ చేయకూడదు. కానీ ఆరు నెలల్లో రిటైర్ అయ్యే బి.సురేశ్ కుమార్‌ను ఆయన స్థానంలో నియమించారు. పలాసలో కొత్త పోస్టు సృష్టించి మరీ టెక్కలి లైన్ ఇన్స్పెక్టర్ బి.కోదండరావును అక్టోబర్ 26న అక్కడికి బదిలీ చేశారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(డీఈఈ)గా అక్టోబర్ 25న బదిలీపై భీమవరం నుంచి తాడేపల్లిగూడెం టౌన్ వచ్చిన ఎం.రాజగోపాల చౌదరి వారం రోజులకే కాకినాడ టౌన్ ఆపరేషన్ డీఈఈగా అక్టోబర్ 30న బదిలీపై వెళ్లిపోయారు.’.. ఇవి విద్యుత్ సంస్థల్లో అక్రమ బదిలీలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. నిబంధనల ప్రకారం సెపె్టంబర్ 22 నుంచే బ్యాన్ అమలులోకి వచ్చింది. కానీ అది విద్యుత్ సంస్థల్లో ఎక్కడా అమలు అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. నవంబర్ వచ్చినా ఉద్యోగుల బదిలీ ఉత్తర్వులు వెలువడుతూనే ఉన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ముడుపులు చేతులు మారడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అవినీతి ఆరోపణలున్న వారికే ప్రాధాన్యత విద్యుత్ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచీ కూటమి ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు సగటున ఐదు సిఫారసు లేఖలను విద్యుత్ సంస్థలకు ఇచ్చారు. ఒక్కో పోస్టుకు వచ్చిన డిమాండ్‌ను బట్టి ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగులకు సిఫారసు లేఖలు మంజూరు చేసి, అందిన కాడికి దోచుకున్నారు. ఈ క్రమంలో వారిలో వారికే ఇబ్బందులు తలెత్తాయి. సిఫారసు లేఖల ప్రకారం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనేదానిపై విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులకు స్పష్టత లేకపోవడంతో కొన్ని పోస్టులు కూటమి పెద్దల అభిమతానికి విరుద్ధంగా జరిగాయి. దీంతో ఆగ్రహానికి గురైన నేతలు మళ్లీ ఒత్తిళ్లు తెచ్చి తమ వారికి పోస్టింగులు తెప్పించుకుంటున్నారు. అందుకోసమే బ్యాన్ అమలులో ఉన్నా వందల మందికి బదిలీలు చేయించుకున్నారు. ఈ క్రమంలో అవినీతి ఆరోపణలు, ఏసీబీ కేసులు ఉన్న వారికి కూడా ప్రాధాన్యత పోస్టులు ఇప్పించుకుంటున్నారు. భీమవరం టౌన్ సబ్ డివిజన్లో టిడ్కో ఇళ్లకు ఇవ్వాల్సిన దాదాపు 250 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, ఇతర సామగ్రిని పక్కదారి పట్టించారనే ఆరోపణలున్న డీఈఈని ఆ స్కామ్ నుంచి కాపాడేందుకు తాడేపల్లిగూడెం బదిలీ చేశారు. కానీ అక్కడ పొసగకపోవడంతో ఆయన పైరవీలు చేసుకుని కాకినాడలో ప్రాధాన్యమున్న పోస్టుకు వెళ్లిపోయారు. విద్యుత్ పంపిణీ సంస్థల్లో జరుగుతున్న ఈ అక్రమ బదిలీలపై విజిలెన్స్ అధికారులు కళ్లు మూసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రజాప్రతినిధుల సిఫారసులకు డిస్కంల సీఎండీలు తలొంచి, సంస్థల పరువు మంటగలపడంపై విద్యుత్ సంఘాలు మండిపడుతున్నాయి. -
Gift Deed: ముందే పకడ్బందీగా రాసుకోవాలి
నాకు, నా భార్యకి కలిపి కొంత ఆస్తి ఉండేది. వయసు అయిపోతుంది అని మా ఇద్దరి పిల్లలకి సమానంగా పంచుతూ గిఫ్ట్ డీడ్ చేశాము. అందులో ప్రస్తుతం మేము ఉంటున్న ఇల్లు కూడా వుంది. గిఫ్ట్ ఇచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది. మా పిల్లల మధ్య వచ్చిన మనస్పర్థల వల్ల మమ్మల్ని పట్టించుకోవడం లేదు. పరస్పరం తగాదా పడుతున్నారు. మాకు ఇదంతా చాల ఇబ్బందిగా మారింది. మేము ఇచ్చిన గిఫ్టు తిరిగి తీసుకోవాలి అనుకుంటున్నాము. పరిష్కారం తెలుపగలరు.– నరసింహ శర్మ, గుంటూరుట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ (ఆస్తి బదిలీ చట్టం) ప్రకారం ఒకసారి ఆస్తిని బదిలీ చేసిన తర్వాత, అది గిఫ్ట్ (బహుమతి) అయినప్పటికీ, సాధారణ పరిస్థితులలో రీవోకేషన్ (రద్దు చేయటం) సాధ్యపడదు. ఒకవేళ మీరు గిఫ్ట్‌గా ఇస్తున్న ఆస్తిని ఏదైనా కారణంచేత భవిష్యత్తులో తిరిగి తీసుకోవాలి అని మీరు అనుకుంటే, అలాంటి నిబంధనని, ఎలాంటి పరిస్థితులలో తిరిగి తీసుకోవచ్చు అన్న అంశాలను గిఫ్ట్ డీడ్ లో పొందుపరచవలసి ఉంటుంది. అలా రద్దు చేసుకోవచ్చు అని మీరు పేర్కొన్న సందర్భం ఎదురైతే, రద్దునకు తగు చర్యలు చట్టపరంగా తీసుకోవచ్చు. మీరు సీనియర్ సిటిజన్ అని అర్థం అవుతోంది. అందుకే మీకు అదనంగా తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం కింద కూడా కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు కనుక, మీరు చేసిన గిఫ్ట్ రిజిస్ట్రేషన్ పత్రంలో సదరు ‘గిఫ్టు తల్లిదండ్రులు, వయో వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం నిబంధనలకు లోబడి ఉంటుంది’ అనే అర్థం వచ్చేట్టు రాసుకుని వుంటే గనుక, మీరు ఇచ్చిన గిఫ్టును సులభంగా రద్దు చేసుకోవచ్చు లేదా ఉపసంహరించవచ్చు అంటే తిరిగి వెనక్కి తీసుకోవచ్చు. అలా కాకపోయినా తిరిగి తీసుకునే అవకాశం ఉందా లేదా అనే విషయం, కేవలం మీ పత్రాలు చూసిన తర్వాత మాత్రమే చెప్పగలం.తల్లిదండ్రులు – వయోవృద్ధులు తమ పిల్లలకి, కుటుంబ సభ్యులకు, మరే ఇతర వారసులకు లేదా మీరు ఆస్తి గిఫ్టు గా ఇవ్వాలి అనుకునే ఎవరికైనా సరే, గిఫ్టు డీడ్ (బహుమాన పత్రం/ఒప్పందం) లో కనీసం పైన పేర్కొన్న చట్టానికి ఆ గిఫ్టు లోబడి ఉంటుంది అని రాసుకోవటం ఉత్తమం. మీ వారసులు ఏదో చేస్తారు అని కాదు కానీ, మీ ప్రయోజనార్థం ఈ సూచన ఇస్తున్నాను.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
సీడీఎంఏగా శ్రీదేవి.. హరీశ్‌కు ఐఅండ్‌పీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రస్థాయి కమిషనర్లు, డైరె క్టర్లు, జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఈ జాబి తాలో ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు ఐఎఫ్ఎస్ అధికా రులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమ వారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ టి.కె. శ్రీదేవిని మళ్లీ పుర పాలక శాఖకు పంపారు. ఆమెను కమిషనర్ అండ్ డైరె క్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ)గా బదిలీ చేస్తు న్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ప్రస్తుతం సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐఅండ్‌పీఆర్) స్పెషల్ కమిషనర్‌గా ఉన్న ఎం. హనుమంతరావును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేయగా, ఐఅండ్‌పీఆర్ బాధ్యతలను రెవెన్యూ జాయింట్ సెక్ర టరీ ఎస్.హరీశ్‌కు అప్పగించారు. ఆయనను ఐఅండ్‌పీఆర్ స్పెషల్ కమిషనర్‌గా బది లీ చేసినప్పటికీ రెవెన్యూ శాఖ జాయింట్ సెక్రటరీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో వెల్లడించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సి.నారాయణరెడ్డిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేయగా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న శశాంకకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. కాగా సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌గా నియమితులైన ఎస్.హరీశ్ సోమవారం ఆన్లైన్లో బాధ్యతలు స్వీకరించారు. (వీరితో పాటు టీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తికి వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌గా, హాకా ఎండీ కె. చంద్రశేఖర్‌రెడ్డికి పాడి అభివృద్ధి సమాఖ్య ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీగా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారిణి సోని బాలాదేవిని డైరెక్టర్, స్పోర్ట్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీగా పునర్నియమించారు. మేడ్చల్–మల్కాజ్గిరి జెడ్పీ సీఈవోగా ఉన్న ఎస్.దిలీప్‌కుమార్‌ను నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. రాజన్న సర్కిల్లో అసిస్టెంట్ కన్జర్వేటర్‌గా ఉన్న అటవీశాఖ అధికారి జి.జ్ఞానేశ్వర్‌ను వికారాబాద్ జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో)గా నియమించారు.) -
వైద్య కళాశాలల్లో ప్రిన్సిపల్స్, సూపరింటెండెంట్ల బదిలీ
రాష్ట్రంలో పలు ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల ప్రిన్సిపల్స్, సూపరింటెండెంట్లను బదిలీ చేస్తూ సోమవారం వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీచేశారు. – సాక్షి, అమరావతి: -
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
-
పీజీ మెడికల్ సీట్లపై కత్తి!
సాక్షి, హైదరాబాద్: కొత్త మెడికల్ కాలేజీలు తేవాలన్న తాపత్రయంతో ఉన్న కాలేజీల్లోని ప్రొఫెసర్లను, అసోసియేట్ ప్రొఫెసర్లను బదిలీ చేయడంతో కథ అడ్డం తిరిగింది. వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) కార్యాలయం నిర్వాకంతో రాష్ట్రంలో పీజీ మెడికల్ సీట్లకు గండిపడే ప్రమాదం నెలకొంది. సాధారణ బదిలీల్లో భాగంగా ఇష్టారాజ్యంగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల బదిలీలు చేపట్టడంతో ఈ పరిస్థితి నెలకొంది. గాందీ, ఉస్మానియా, కాకతీయ వంటి అనేక ప్రముఖ మెడికల్ కాలేజీల నుంచి అత్యంత సీనియర్లను బదిలీ చేశారు. కానీ వారి స్థానాలను భర్తీ చేయకపోవడంతో పెద్ద ఎత్తున పీజీ సీట్లకు కోత పడే ప్రమాదం నెలకొంది. వెనుకా ముందు చూడకుండా బదిలీలు చేపట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఖాళీలు భర్తీ చేసే చాన్సూ లేదు ఉస్మానియా, గాందీ, కాకతీయ వంటి ఎంబీబీఎస్, పీజీ సీట్లతో కూడిన వైద్య కళాశాలలకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందో అంచనా వేయకుండానే, ఈ ఏడాది 40 శాతం సాధారణ బదిలీల నెపంతో 8 కొత్త మెడికల్ కాలేజీలను సాధించేందుకు ప్రొఫె సర్లను, అసోసియేట్ ప్రొఫెసర్లను బదిలీ చేశారు. ఉస్మానియా, గాంధీ వంటి కాలేజీల్లో ప్రస్తుతం అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్లు లేరు. కాకతీయ మెడికల్ కాలేజీలోనూ అదే పరిస్థితి నెలకొంది. దీంతో ఉస్మానియా, గాం«దీ, కాకతీయ లోని ఓబీజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జన రల్ సర్జరీ, అనస్థీషియా, రేడియాలజీ వంటి విభాగాల్లో పీజీ సీట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. పదోన్నతులకు అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో ఈ ఖాళీలను భర్తీ చేసే అవకాశం కూడా లేదని వైద్య నిపుణులు అంటున్నారు. బోధనా సిబ్బందిపై ఎప్పటికప్పుడు ఎన్ఎంసీ సమీక్ష రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో మొత్తం 1,148 పీజీ సీట్లు ఉన్నాయి. ఒక ప్రొఫెసర్‌కు మూడు పీజీ మెడికల్ సీట్లు కేటాయిస్తారు. ఐదేళ్లు బోధనానుభవం ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్‌కు ఒక పీజీ సీటు కేటాయిస్తారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు తగ్గితే ఆ ప్రకారం జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పీజీ సీట్లకు కోత పెడుతుంది. ప్రతి నెలా, రెండు నెలలకోసారి ఫ్యాకల్టీని ఎన్ఎంసీ సమీక్షిస్తుంది. అంతేకాదు బయోమెట్రిక్ హాజరు విధానంతో ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనే టీచింగ్ ఫ్యాకల్టీ సంఖ్యపై అంచనా వేస్తుంది. కాబట్టి పీజీ సీట్లకు గండం తప్పేలా లేదు. ఉదాహరణకు.. ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీలో 481 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి. ఇక్కడ 188 ప్రొఫెసర్ పోస్టుల మంజూరు ఉండగా, ఇటీవల బదిలీల కారణంగా ప్రస్తుతం కేవలం 86 మంది ప్రొఫెసర్లే పనిచేస్తున్నారు. అంటే 102 ప్రొ ఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక 178 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకుగాను కేవలం 26 మంది మాత్రమే ఉన్నారు. అంటే అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు 152 ఖాళీగా ఉన్నాయి. అంటే ప్రస్తుతం ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు 284 పీజీ సీట్లకు సరిపోను మాత్రమే ఉన్నారు. కాగా బదిలీల కారణంగా ఉస్మానియాలోని 197 పీజీ సీట్లకు కత్తెర పడే ప్రమాదం నెలకొంది. ఇక గాంధీ మెడికల్ కాలేజీలో 213 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి. అయితే బదిలీల కారణంగా అక్కడ 60 మంది ప్రొఫెసర్లకు గాను 35 మందే మిగిలారు. 73 మందిఅసోసియేట్ ప్రొఫెసర్లకుగాను 40 మందే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు 145 పీజీ సీట్లకు మాత్రమే సరిపోతారు. అంటే మిగిలిన 68 పీజీ సీట్లపై కత్తి వేలాడుతోందన్న మాట. ఇలా ఒక్క ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల్లోనే ఏకంగా 265 పీజీ సీట్లకు కోత పడే ప్రమాదం నెలకొంది. ఇలాగే కాకతీయ, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలు, ఆదిలాబాద్‌లోని రిమ్స్ వంటి చోట్ల కూడా పీజీ సీట్లు కోల్పోయే ప్రమాదం నెలకొంది.సీట్లు కోల్పోయే అవకాశం లేదు పీజీ సీట్లు కోల్పోయే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న సీట్లు అలాగే ఉంటాయి. అవసరమైన ఫ్యాకల్టీని కాంట్రాక్ట్ ప్రాతిపదికన, పదోన్నతులపై నియమించాం. – డాక్టర్ వాణి, డీఎంఈ -
గనుల శాఖలో బదిలీల ‘వేలం’
సాక్షి, అమరావతి: రాష్ట్ర గనుల శాఖలో బదిలీల పర్వం కనక వర్షం కురిపించే కామధేనువులా మారింది. నిబంధనలతో పని లేకుండా.. ఎవరు ఎంత ఎక్కువ ముట్టజెపితే వారికే కీలకమైన పోస్టులు కట్టబెట్టేందుకు వేలం నిర్వహిస్తున్న వైనం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో సాక్షాత్తూ చినబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన వ్యక్తి తెరవెనుక చక్రం తిప్పుతుండగా.. తెరపై సంబంధింత మంత్రి, ఆయన బంధువు వ్యవహారాన్ని నడిపిస్తున్నారు.సాధారణంగా బదిలీల ప్రక్రియను ముఖ్య కార్యదర్శి ఆమోదంతో ఆ శాఖ డైరెక్టర్ నిర్వహిస్తారు. అందులో కొన్ని ముఖ్యమైన, కీలకమైన వాటికి రాజకీయంగా సిఫారసు చేసి మంచి పోస్టింగ్‌లు ఇప్పించుకోవడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ.. ఇప్పుడు ఏకంగా బదిలీల ప్రతిపాదనలన్నీ తనకు పంపాలని సదరు మంత్రి ఆ శాఖ డైరెక్టర్‌కు నోట్ పంపడం చర్చనీయాంశమైంది. తాను చెప్పినట్టు బదిలీలు చేయాలనే దశ దాటిపోయి బదిలీల ప్రతిపాదనలన్నీ తనకు పంపాలని డైరెక్టర్‌ను ఆదేశించడంతో గనుల శాఖలో సీనియర్లే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ నెల 4వ తేదీన మంత్రి పేషీ కమిషనర్ అండ్ డైరెక్టర్‌కు ఈ నోట్‌ను అధికారికంగా పంపింది. ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారితోపాటు వ్యక్తిగత అభ్యర్థనలు, పరిపాలనా పరమైన అవసరాల కోసం చేసే బదిలీల జాబితాను తనకు పంపాలని అందులో స్పష్టం చేశారు. డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ జియాలజిస్టులు, రాయల్టీ ఇన్స్పెక్టర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, మినరల్ రెవెన్యూ ఆఫీసర్లు, ఆఫీసు సూపరింటెండెంట్లు సహా అన్ని బదిలీ ప్రతిపాదనలను ఈ నెల 10వ తేదీలోపు తనకు పంపాలని ఆదేశించారు. వాటిని పరిశీలించి బదిలీలను తాను ఖరారు చేస్తానని మంత్రి అందులో పేర్కొన్నారు.మంత్రి చెప్పినట్టే చేయాలని డైరెక్టర్‌కు ఆదేశాలుమంత్రి నుంచి బదిలీల కోసం నేరుగా ఇలాంటి నోట్ రావడంతో ఆశ్చర్యపోయిన డైరెక్టర్ అలా చేస్తే ఇబ్బందుల్లో పడతానని భావించినట్టు తెలిసింది. అందుకే.. బదిలీలపై తనకున్న అధికారాలు, మంత్రి సూచనలు ఎంతవరకూ పాటించవచ్చనే అంశంపై న్యాయ సలహా తీసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత బదిలీల ప్రతిపాదనలు పంపాలని మంత్రి నుంచి నోట్ వచ్చిందని, దీనిపై ఏం చేయాలో తెలపాలని ఆయన ఆ శాఖ ముఖ్య కార్యదర్శిని క్లారిఫికేషన్ అడిగారు.దీనిపై ఏం చేయాలోనని డైరెక్టర్, ముఖ్య కార్యదర్శి మల్లగుల్లాలు పడుతుండగానే.. చినబాబు సన్నిహితుడు రంగప్రవేశం చేసి ఏమీ ఆలోచించకుండా మంత్రి నోట్‌కి అనుగుణంగా పని చేయాలని ఆర్డర్ వేశారు. ఆయన ఆర్డర్ అనధికారిక రాజముద్రతో కావడంతో ముఖ్య కార్యదర్శి మౌనంగా ఉండిపోయారు. దీంతో బదిలీ ప్రతిపాదనల్ని మంత్రికి పంపడం మినహా డైరెక్టర్‌కి మరో మార్గం లేకుండాపోయింది.విజయవాడ హోటల్లో వేలం పాటమరోవైపు అధికారుల ప్రతిపాదనలతో సంబంధం లేకుండానే మంత్రి బంధువు ఒకరు విజయవాడలోని ఒక హోటల్లో గనుల శాఖ అధికారులు, ఉద్యోగులను పిలిపించుకుని బేరసారాలు జరుపుతున్నట్టు తెలిసింది. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల డీడీ, ఏడీ పోస్టుల కోసం పలువురు తీవ్రంగా పోటీ పడుతుండటంతో వారికి వేలం పాట పెట్టినట్టు చెబుతున్నారు. ఆ జిల్లాల విజిలెన్స్ విభాగాల్లోని పోస్టులకు మంచి గిరాకీ ఉండటంతో వాటినీ బేరం పెట్టారు. ప్రకాశం, అన్నమయ్య, పల్నాడు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల డీడీ పోస్టుల కోసం రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకూ ఇచ్చేందుకు కొందరు అంగీకరించినట్టు సమాచారం.ఆ జిల్లాల ఏడీ పోస్టులు కూడా రూ.కోటి నుంచి కోటిన్నర పలుకుతున్నా ఇచ్చేందుకు పలువురు వెనుకాడటంలేదు. మిగిలిన పోస్టులకు సైతం రూ.15 లక్షల నుంచి రూ.కోటి వరకూ ధర నిర్ణయించి.. ఎవరు ఎక్కువ ఇస్తానంటే వారిని అక్కడకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదంతా పేరుకు మంత్రి బంధువు చేస్తున్నా తెరవెనుక మాత్రం చినబాబు సన్నిహితుడే అంతా తానై నడుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ వేలం పాటలో ఎక్కువ ముట్టజెప్పుకున్న వారిని బదిలీ చేసేందుకు వీలుగా సంబంధిత ప్రతిపాదనల ఫైలు తనకు పంపాలని మంత్రి డైరెక్టర్‌కు నోట్ పంపినట్టు స్పష్టమవుతోంది. -
ఆ స్కూలు మళ్లీ సైకిలెక్కింది!
వాయనాడ్ వరదలకు రెండు నెలల ముందు షాలినీ టీచర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్లి΄ోయింది. స్కూల్ పిల్లల యూనిఫామ్‌లోనే సైకిల్ మీద తిరుగుతూ పిల్లలతో ఆడినఆమె వీడియో ఇంటర్నెట్లో ఎందరికో ఇష్టం. తర్వాత వరదలు వచ్చాయి. వీడియోలో ఉన్న పిల్లలు ముగ్గురు చని΄ోయారు. ‘నేను ఎప్పటికీ ఆ స్కూల్‌కి వెళ్లలేను’ అని బాధపడింది షాలినీ టీచర్. కాని వారం క్రితం స్కూల్ తెరిచాక పిల్లలు కోరింది షాలినీ టీచర్ కావాలనే. వారి టీచర్ వారికి దొరికింది. ఇక గాయం తప్పక మానుతుంది.టీచర్ల జీవితంలో అత్యంత కఠినమైన సందర్భం ఏమిటో తెలుసా? విగత జీవులుగా ఉన్న పిల్లల ముఖాలను గుర్తు పట్టమని వారిని పిలవడం. జూలై 30 వాయనాడ్‌లోని కొండ్ర΄ాంత పల్లెలు ముండక్కై, చూరలమల వరదల్లో పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఊహించని వరద నిద్రలో ఉన్నవారిని నిద్రలోనే తీసుకెళ్లింది. ముండక్కైలో చిన్న ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్ మొత్తం బురదతో నిండి΄ోయింది. దాని చుట్టూ ఉండే ఇళ్లు ధ్వంసమై΄ోయాయి. స్కూల్లోని 9 మంది విద్యార్థులు మరణించారు. వారిలో ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మరణించారు. మృతదేహాల ఆచూకీ దొరికాక వారిని గుర్తించడానికి టీచర్లనే పిలిచారు. అక్కడ పని చేసిన షాలినీ టీచర్‌కు ఆ ఘటన ఎంత మనోవేదన కలిగించిందో! మిగిలిన టీచర్లు మళ్లీ ఈ స్కూల్ ముఖం చూడకూడదని ఎంతగా ఏడ్చారో!!షాలినీ టీచర్‌ది కొట్టాయం. కాని పట్నంలో ΄ాఠాలు చెప్పడం కన్నా వాయనాడ్ ్ర΄ాంతం ఆహ్లాదంగా ఉంటుంది... ప్రజలు అమాయకంగా ఉంటారని ముండక్కైలో ఎలిమెంటరీ స్కూల్లో అడిగి మరీ టీచర్‌గా చేరింది. అక్కడ పిల్లలకు ఆమె ఇష్టమైన టీచర్. వారి యూనిఫారమ్‌లాంటి చుడిదార్ వేసుకుని స్కూల్‌కు వచ్చి పిల్లల్లో కలిసి΄ోయేది. చిన్న స్కూలు... పిల్లల సంఖ్య తక్కువ కావడంతో అందరి ఇళ్లు, తల్లిదండ్రులు తెలుసు. ఒకరోజు గేమ్స్ పిరియడ్‌లో ఒక ΄ాప సైకిల్‌ను ఆసక్తిగా చూడటం గమనించింది షాలినీ టీచర్. ఆ ΄ాప స్లోచైల్డ్. తానుగా సైకిల్ తొక్కలేదు. షాలినీ టీచర్ అది గమనించి ‘సైకిల్ ఎక్కుతావా’ అని వెనుక నిలబెట్టి తాను తొక్కుతూ గ్రౌండ్లో ఒక రౌండ్ వేసింది. పిల్లలందరూ చుట్టూ చేరి ఎంజాయ్ చేశారు. ఎవరో ఇది షూట్ చేయగా ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. రెండేళ్లు పని చేశాక షాలినీ టీచర్‌కి జూన్ నెలలో దగ్గరలోనే ఉన్న మీనన్‌గడి అనే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. పిల్లలు ఆమె వెళ్లడానికి ఒప్పుకోలేదు. కాని వెళ్లక తప్పలేదు. ఆ రోజు షాలినీ టీచర్ అనుకోలేదు.. వారిలో కొందరిని మళ్లెప్పుడూ చూడలేనని. వాయనాడ్ వరదలు పిల్లలకూ ఆమెకూ మధ్య శాశ్వత దూరం తెచ్చాయి. చని΄ోయిన పిల్లలను గుర్తు పట్టమని ΄ోలీసులు ఆమెను పిలిచినప్పుడు ఆమె హృదయం బద్దలైంది. వాయనాడ్ కోలుకుంది. సెప్టెంబర్ 2న ముండక్కైలోని స్కూల్‌ను రీ ఓపెన్ చేస్తూ సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి వి.శివకుట్టి హాజరయ్యారు. దారుణమైన విషాదాన్ని చవిచూసిన ఆ పిల్లల ముఖాలను చూసిన మంత్రి ‘మీకు ఏం కావాలో అడగండి చేస్తాను’ అన్నారు. వెంటనే పిల్లలు ‘మా షాలినీ టీచర్‌ను మా దగ్గరకు పంపండి’ అన్నారు. ఇలాంటి సమయంలో వారికి ఇష్టమైన టీచర్ తోడుంటే బాగుంటుందనుకున్న మంత్రి వెంటనే ఆదేశాలు ఇచ్చారు. షాలినీ తన స్కూల్‌కు తాను తిరిగి వచ్చింది.ఆమెను చూసిన పిల్లలు కేరింతలు కొట్టారు. ఆమె కన్నీరు కార్చింది చని΄ోయిన పిల్లలను తలుచుకుని. కాని ఆనందించింది తన స్కూలుకు తాను వచ్చానని.ఆ స్కూల్‌ను తిరిగి ఆట΄ాటలతో నింపడమే ఆమె లక్ష్యం.పిల్లల మోముల్లో చిర్నవ్వును పూయించడమే కర్తవ్యం.షాలిటీ టీచర్ తప్పక సాధిస్తుంది. -
TG: పలువురు ఐపీఎస్‌ల బదిలీ.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో భాగంగా విజిలెన్స్ డీజీగా హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్‌రెడ్డి బదిలీ అయ్యారు. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్, ఏసీబీ డీజీగా విజయ్‌కుమార్ నియమితులయ్యారు.బదిలీల ప్రకారం.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ఏసీబీ డీజీగా విజయ్ కుమార్విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా రమేష్‌కు అదనపు బాధ్యతలు. పోలీస్ పర్సనల్ ఏడీజీగా మహేష్ భగవత్‌కు అదనపు బాధ్యతలు. -
డీఎస్పీల బదిలీల్లోనూ వివక్ష
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీసు అధికారులపై కక్షసాధింపు చర్యల్లోనూ వికృత పోకడలకు బరితెగిస్తోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట కక్షసాధింపు చర్యల్లో భాగంగా కొన్ని సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుంది. రాష్ట్రంలో డీఎస్పీల బదిలీ ప్రక్రియ ఇందుకు తాజా ఉదాహరణ. టీడీపీ కూటమి ప్రభుత్వం భారీస్థాయిలో 96 మంది డీఎస్పీలను గురువారం బదిలీ చేసింది. వారిలో బదిలీ చేసిన 96 మంది జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీలు 15 మంది ఉన్నారు. ఆ 15 మందిలో కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం విభ్రాంతి కలిగిస్తోంది. జి.నాగేశ్వర్‌రెడ్డి (కాశీబుగ్గ), కె.శ్రీనివాసరెడ్డి (తూర్పు గోదావరి క్రైం), వి.నారాయణస్వామిరెడ్డి ( భీమవరం), పి.మురళీకృష్ణారెడ్డి( విజయవాడ వెస్ట్ ఏసీపీ), పి.వీరాంజనేయరెడ్డి (నెల్లూరు రూరల్), ఎం.సూర్యనారాయణరెడ్డి (గూడూరు), వి.శ్రీనివాసరెడ్డి (నాయుడుపేట), బి.ఉమామహేశ్వరరెడ్డి (శ్రీకాళహస్తి), వై.శ్రీనివాసరెడ్డి (డోన్), జి.ప్రభాకర్‌రెడ్డి (మదనపల్లి), జి.శివభాస్కర్‌రెడ్డి (గుంతకల్లు), ఎన్.రవీంద్రనాథ్‌రెడ్డి (నంద్యాల), పి.రవీంద్రనాథ్‌రెడ్డి (ఇంటెలిజెన్స్), వి.వేణుగోపాల్‌రెడ్డి, (ఇంటెలిజెన్స్), జి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (ఇంటెలిజెన్స్)లను బదిలీ చేస్తూ వారికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులను ఉద్దేశపూర్వకంగా వేధించాలన్నది టీడీపీ విధానంగా చేసుకుందన్నది స్పష్టమవుతోంది. ఇంకా అనంతపురం రూరల్ డీఎస్పీ శివారెడ్డి, నెల్లూరు టౌన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ కోటా రెడ్డి ఉన్నారు. వారిని కూడా బదిలీ చేస్తున్నట్టు ఇప్పటికే మౌఖికంగా చెప్పేశారని సమాచారం. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 300 మందికి పైగా డీఎస్పీలను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారిలో మొదటి విడతలో 96 మందిని బదిలీ చేసింది. మరో రెండు విడతల్లో మిగిలిన వారిని బదిలీ చేయనుంది. -
బల్దియాలో బదిలీలు నై?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ విభాగాల్లో బదిలీలు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీలోనూ బదిలీల పర్వం ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపు పదిమంది మున్సిపల్ కమిషనర్లు, ఇతర త్రా విభాగాల్లో ఒకరో, ఇద్దరివో బదిలీలు మాత్రమే జరిగాయి తప్ప కీలక విభాగాల్లో ఉన్న వారివి జరగలేదు. వారితో పాటు సీనియర్లుగా ఎంతోకాలంగా ఇక్కడే పాతుకుపోయిన ఉన్నతస్థాయిల్లోని వారి బదిలీలూ జరగలేదు. వారిలో చాలా మంది తామిక్కడే ఉంటామని, తమనెవరూ కదల్చలేరని సన్నిహితుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం మున్సిపల్ శాఖలో తమ హోదాకు తగిన పోస్టులు రాష్ట్రంలో ఇతర కార్పొరేషన్లలో ఖాళీ లేనందున తమను ఎక్కడికీ పంపలేరని చెబుతున్నారు. రాష్ట్రంలోని పెద్ద కార్పొరేషన్లకు ఐఏఎస్ అధికారులు కమిషనర్లుగా ఉన్నందున, తమను ఎక్కడికీ ఎవరూ కదల్చలేరని భరోసాగా ఉన్నారు. అంతేకాదు బదిలీలు 40 శాతానికి మించి జరగరాదనే నిబంధనతోనూ అన్ని స్థాయిల పోస్టులను పరిగణనలోకి తీసుకొని తమను కదల్చలేరని పదేళ్లకుపైగా పని చేస్తున్నవారు సైతం నమ్మకంగా ఉన్నారు. వారే కాదు.. ఎంటమాలజీ వంటి విభాగాల్లోని వారిది సైతం అదే ధీమా. సీనియర్ ఎంటమాలజిస్టు పోస్టు లు రాష్ట్రంలో చాలా స్వల్పంగా మాత్రమే ఉన్నందున తాము ఇక్కడే ఉంటామని ధీమాగా ఉన్నారు. కదలరు అంతే.. జీహెచ్ఎంసీలో దాదాపు రెండేళ్లు పనిచేసినా చాలు ఎవరైనే సరే ఇక్కడినుంచి ఇంకెక్కడికీ కదలరు. అందుకు కారణం ఇక్కడ లభించే సదుపాయాలు, పై ఆదాయాలు ఇంకెక్కడా లభించవు. అందుకే పదోన్నతులను సైతం కాదనుకొని ఇక్కడే ఉంటున్నవారు. ఉండేందుకు ప్రయతి్నస్తున్న వారూ ఉన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో కమిషనర్ స్థాయి వారికి, క్షేత్రస్థాయి పర్యటనలు ఉండేవారికి మాత్రమే వాహన సదుపాయం ఉంటుంది. ఇక్కడైతే సూపరింటెండెంట్లకు, అంతకంటే దిగువ స్థాయి వారికి సైతం వాహన సదుపాయం ఉంటుంది. అంతేకాదు.. కార్యాలయం నుంచి కాలు బయట పెట్టని వారికి సైతం వాహన సదుపాయం ఉంటుంది. దాన్ని మరోలా వినియోగించుకొని నెలవారీ ఆదాయం పొందుతున్న వారూ తక్కువేం లేరు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా వివిధ వై¿ోగాలకు అవకాశం ఉన్నందున, వాటికి అలవడిన వారు ఇక్కడి నుంచి కదలడం లేదు. వచ్చేవారే.. వెళ్లేవారు లేరు ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యుటేషన్లపై బల్దియాకు వచ్చిన వారు సైతం ఇక్కడి నుంచి కదలనే కదలరు. డిప్యుటేషన్లు ముగిసినా, ఏళ్లకేళ్లుగా తిష్టవేసిన ఎందరో ఉన్నారు. యూసీడీ విభాగం నుంచి మొదలు పెడితే ఇలాంటి వారికీ లెక్కేలేదు. బదిలీల సమయంలో సైతం వారిని కదల్చలేకపోతున్నారంటే వారి ‘పవర్’ ఏమిటో అంచనా వేసుకోవచ్చు. మున్సిపల్ శాఖకు చెందిన వారు ఎందరో కొందరు బదిలీ అవుతున్నప్పటికీ, ఇతర విభాగాల వారు మాత్రం కావడం లేదంటే వారి హవా ఎంతో ఊహించుకోవచ్చు. ఏళ్లకేళ్లుగా.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ హోదాలో కొనసాగుతున్న వారు ఎందరో ఉన్నారు. వీరిలో ఇరవయ్యేళ్లకుపైగా ఇక్కడే ఉంటున్నవారు ఎందరో ఉన్నారు. అంతేకాదు.. 30 నుంచి 40 ఏళ్లుగా నగరంలోనే ఉంటున్నవారు కూడా ఉన్నారంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు. సీనియర్లయిన తమను ఎక్కడకూ పంపలేరని భావిస్తున్న వారు ఇతర ప్రాంతాల్లో తమ హోదాకు తగ్గ పోస్టుల్లేవంటున్నారు. కానీ.. ఇతర విభాగాల నుంచి ఇక్కడికి డిప్యుటేషన్‌పై వస్తుండగా లేనిది మున్సిపల్ శాఖ నుంచి ఇతర విభాగాలకు ఎందుకు డిప్యుటేషన్లపై వెళ్లడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. అన్నింటికీ ఒకటే సమాధానం. సదుపాయాలు.. పై ఆదాయం. ప్రత్యేక చాంబర్లు. అందుకే వచ్చేవారు తప్ప వెళ్లేవారు కనబడటం లేదు. గతంలో ఇద్దరు ముగ్గురు అధికారులు మాత్రం అలా ఇతర విభాగాలకు వెళ్లారు. అలా మిగతా వారెందుకు వెళ్లరో వారితోపాటు ఉన్నతాధికారులకే తెలియాలి. బల్దియాకు భారం.. స్టాఫింగ్ ప్యాటర్న్‌పై ప్రసాదరావు కమిటీ సిఫార్సుల మేరకు జీహెచ్ఎంసీలో ఆరుగురు అడిషనల్ కమిషనర్లు మాత్రమే ఉండాలి. కానీ ప్రస్తుతం డజను మంది ఉన్నారు. గతంలో ఐదారుగురు అడిషనల్ కమిషనర్లు మాత్రమే అన్ని విభాగాలనూ నిర్వహించేవారు. ప్రస్తుతం అధికారులు పెరిగారు. పనులు తగ్గాయి. పనులు తగ్గినందున సమర్థంగా పని చేస్తున్నారా అంటే అదీ లేదు. ఎస్టేట్స్, అడ్వర్టయిజ్‌మెంట్స్, ట్రేడ్‌లైసెన్స్‌ల వంటి విభాగాల ద్వారా జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయంలో ఇరవై శాతం కూడా రావడం లేదంటే పరిస్థితిని అంచనా వేసుకోవవచ్చు. సీనియర్లు, పెద్ద హోదాల వల్ల వారి జీతభత్యాలు, సదుపాయాల కల్పనతో జీహెచ్ఎంసీకి ఆర్థిక భారం పెరుగుతోంది. అయినా.. మేమింతే. ఇక్కడే ఉంటామంటున్న వారిని ఎవరైనా కదల్చగలరా? వేచి చూడాల్సిందే! ప్రసాదరావు కమిటీ సిఫారసుల మేరకు సర్కిల్ కార్యాలయాలను 12 నుంచి 30కి పెంచారు. అయిదు జోన్లను ఆరుగా చేశారు. ప్రధాన కార్యాలయంలో 11 మంది అడిషనల్ కమిషనర్లను 6కు తగ్గించాలని సిఫారస్ చేస్తే ప్రస్తుతం డజను మంది ఉన్నారు. బదిలీలపై వచ్చేవారితో ఈ సంఖ్య ఇంకా పెరగనుంది. టౌన్ న్‌ప్లానింగ్, రెవెన్యూ, హెల్త్, ఎస్టేట్స్, అడ్వర్టయిజ్‌మెంట్స్ తదితర విభాగాలను బలోపేతం చేయాల్సి ఉందని కమిటీ సూచించింది. కానీ మెరుగవలేదు. -
పోలీసు శాఖలో ‘రెడ్‌బుక్’ రూల్
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీసు శాఖలో మంత్రి నారా లోకేశ్ ‘రెడ్‌బుక్’ రాజ్యమేలుతోంది. కూటమి ప్రభుత్వం పోలీసు అధికారుల బదిలీలను ‘రెడ్‌బుక్’ను అనుసరించి కక్షపూరిత వైఖరితోనే చేపడుతోంది. సీఐ నుంచి ఐపీఎస్‌ల వరకు అధికారులపై వేధింపులకు పాల్పడుతోంది. ఇప్పటికే 24 మంది ఐపీఎస్ అధికారులకు ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టిన సందర్భం లేదు. ఇదే అత్యంత వివాదాస్పద రీతిలో డీఎస్పీలను బదిలీ చేసింది. బుధవారం భారీస్థాయిలో 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో ఏకంగా 57 మంది డీఎస్పీలకు ఎక్కడా పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం గమనార్హం. వీరందరినీ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయమని ఆదేశించారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం కక్ష పూరిత ధోరణికి ఇది మరో నిదర్శనమని స్పష్టమవుతోంది. తుళ్లూరు డీఎస్పీ ఇ. అశోక్ కుమార్ గౌడ్, రాజంపేట డీఎస్పీ చైతన్యను మంగళవారం బదిలీ చేసి రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయమని ప్రభుత్వం ఆదేశించింది. తుళ్లూరు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ బుధవారం రిటైర్ అయ్యారు. ఇలా రిటైర్మెంట్కు ఒక రోజు ముందు బదిలీ చేయడం, మరో చోట పోస్టింగ్ ఇవ్వకుండా పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించడం నిబంధనలకు విరుద్ధం. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ వ్యవహారంపై డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ డీజీపీ ద్వారాకా తిరుమలరావును కలిసి తన అసంతృప్తిని తెలియజేసినట్లు సమాచారం. పోలీసు అధికారుల పట్ల టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరిపై పోలీసువర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. -
నిబంధనలకు విరుద్ధంగా బదిలీల నుంచి కొందరి మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: సాధారణ బదిలీల నుంచి కొంతమంది డాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా మినహాయింపు పొందారని ఎస్సీ, ఎస్టీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబూరావు మంగళవారం ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. డాక్టర్ పల్లం ప్రవీణ్, డాక్టర్ లాలూప్రసాద్ తదితరులు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీజీజీడీఏ) ఆఫీస్ బేరర్లమని చెప్పుకుని బదిలీల నుంచి మినహాయింపు పొందారని, ప్రభుత్వం ఇచి్చన ఉత్తర్వుల ప్రకారం వీరు మినహాయింపులకు అర్హులు కారని బాబూరావు తెలిపారు.పల్లం ప్రవీణ్ 19 ఏళ్లుగా, లాలూప్రసాద్ 12 ఏళ్లుగా హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నారని, నిబంధనల ప్రకారం ఆరేళ్లకు పైబడి ఒకే జిల్లాలో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాల్సి ఉన్నా.. అధికారులు వీరిని హైదరాబాద్ నుంచి కదపడం లేదని ఫిర్యాదు కాపీలో పేర్కొన్నారు. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని ఆయన కోరారు. కాగా, ఆయుష్ డిపార్ట్మెంట్లో బదిలీలు చాలా అన్యాయంగా జరిగాయని పలువురు డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆన్లైన్ ద్వారా కాకుండా ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు తీసుకొని ఇష్టారాజ్యంగా బదిలీలు చేశారని పలువురు అభ్యర్థులు మండిపడుతున్నారు. ఒక డాక్టర్ తన భర్త చనిపోయినట్లు విడో ఆప్షన్ కింద దరఖాస్తు చేస్తే, విడో సరి్టఫికెట్ చింపేసి ఆమెను బదిలీ చేయకుండా నిలిపివేశారు. దీంతో ఆమె ఆయుష్ అధికారులను నిలదీయగా అసలు ఆ సర్టిఫికెట్ పెట్టలేదని బుకాయిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. లక్షలాది రూపాయలు లంచంగా తీసుకొని ఇష్టమైన వారికి నచి్చన చోట బదిలీ చేపట్టారని చెబుతున్నారు. అలాగే రీజనల్ డైరెక్టర్ పోస్టును అర్హులకు కాకుండా ఇతరులకు ఇచి్చనట్లు ఒక డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
వైద్య బదిలీల్లో భారీ అవినీతి!
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది బదిలీల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగినట్లు ప్రభుత్వానికి నిఘా విభాగం శుక్రవారం నివేదిక అందజేసింది. ఈ దందాలో ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం మొదలు పైస్థాయి వరకు అందరి హస్తం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఒక విభాగానికి చెందిన అధిపతితోపాటు ఆయన వద్ద పనిచేసే ఇద్దరు అధికారులు, సచివాలయంలోని ఇద్దరు అధికారుల పేర్లను నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ సొంత క్లినిక్‌లు, ఆసుపత్రులను నడుపుతున్న కొందరు డాక్టర్లు బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడక రూ. లక్షల్లో లంచాలు సమరి్పంచినట్లు తెలిసింది. ఇలా ఒక ఉన్నతాధికారి ఏకంగా రూ. 5 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.ముఖ్యంగా నర్సులకు సంబంధించిన సీనియారిటీ లిస్టు మాయాజాలంగా మారింది. దీనిపై నర్సులు పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేయడం తెలిసిందే. దీనిపై సీఎం కూడా ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే 23 ఆసుపత్రుల్లోని నర్సింగ్ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారమంతా ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా ప్రభుత్వానికి చేరింది.పలు జిల్లాల డీఎంహెచ్వోలు కూడా డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం. యాదాద్రి భువనగిరికి చెందిన ఒక కీలకాధికారి ఐదారు రోజుల కిందటే బదిలీపై మరో ప్రాంతానికి వెళ్లి రిపోర్టు చేసినప్పటికీ పాత కేంద్రంలో ఉంటూనే ఇప్పటికీ వర్క్ ఆర్డర్లు ఇస్తున్నట్లు తెలిసింది. -
హేరామ్.. ‘గాంధీ’ ఖాళీ
గాంధీ ఆస్పత్రి: తెలంగాణ వైద్యప్రదాయిని, కోవిడ్ సంక్షోభ వేళ వేలాది మంది ప్రాణాలు కాపాడిన కోవిడ్ నోడల్ సెంటర్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి బదిలీల విఘాతం తగిలింది. సుమారు 2 వేల మంది ఇన్‌పేషెంట్లు, మరో మూడు వేల మంది అవుట్‌పేòÙంట్లకు వైద్యసేవలు అందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో పెద్దసంఖ్యలో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఒకేసారి బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. లాంగ్‌స్టాండింగ్ పేరిట బోధనాసుపత్రి నిర్వహణలో ఉన్న కీలకమైన ప్రొఫెసర్లను మూకుమ్మడిగా బదిలీ చేయడంతో గాంధీ ఆస్పత్రి నిర్వహణపై పెనుప్రభావం పడనుంది. ఆస్పత్రి సూçపరింటెండెంట్తోపాటు ఆయా విభాగాలకు చెందిన సుమారు 40 మంది ప్రొఫెసర్లను ఒకేసారి బదిలీ చేయడంతో మేజర్ సర్జరీల్లో జాప్యం నెలకొనే అవకాశం ఉంది. పోస్ట్‌గ్రాడ్యుయేట్ వైద్యులకు గైడ్లుగా వ్యవహరించే ప్రొఫెసర్లకూ బదిలీ కావడంతో పీజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. సీనియర్, జూనియర్ నిష్పత్తిలో కాకుండా నిష్ణాతులైన వైద్యులందరినీ ఇష్టారాజ్యంగా శుక్రవారం బదిలీ చేయడంపై వైద్యవర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. జనరల్ సర్జరీ విభాగంలో ఆరుగురు ప్రొఫెసర్లకు.... కీలకమైన గాంధీ జనరల్ సర్జరీ విభాగంలో ఆరుగురు ప్రొఫెసర్లను ఒకేమారు బదిలీ చేయడంతో సర్జరీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. నూతనంగా బదిలీపై వచ్చే ప్రొఫెసర్లకు ఇక్కడి పరిస్థితులు ఆకళింపు చేసుకునేందుకు కొంత సమయం పడుతుంది. అప్పటివరకు అరకొరగా ఉన్న అసోసియేట్, అసిస్టెంట్ వైద్యులతో నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. జనరల్ మెడిసిన్ విభాగంలో ఆరుగురు ప్రొఫెసర్లకుగాను ఐదుగురు బదిలీ అయ్యారు. అత్యంత కీలకమైన అనస్తీషియా విభాగంలో ముగ్గురు ప్రొఫెసర్లు, ఆరుగురు అసోసియేట్లు బదిలీ కావడంతో ఆపరేషన్లలో జాప్యం నెలకొనే పరిస్థితి ఏర్పడింది. ఆర్థోపెడిక్ విభాగంలో ముగ్గురు ప్రొఫెసర్లు బదిలీకాగా ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. గైనకాలజీ విభాగంలో నలుగురు ప్రొఫెసర్లు బదిలీ అయ్యారు.ఒక్కో ప్రొఫెసర్ ఉన్న విభాగంలో కూడా యూరాలజీ, సీటీ సర్జరీ, కార్డియాలజీ తదితర విభాగాల్లో ఉన్న ఒకే ఒక్క ప్రొఫెసర్‌ను కూడా బదిలీ చేయడంతో ఆయా విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితిపై ప్రభావం పడనుంది. -
మైనారిటీ గురుకులాల్లో బదిలీల నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ అధీనంలోని సంస్థల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. గురుకుల సరీ్వస్ నిబంధనలకు విరుద్ధంగా జూలై 6న జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హేమలత సహా మరికొందరు ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్‌పై జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం విచారణ చేపట్టింది. గురుకుల సిబ్బందిని తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సరీ్వస్ నిబంధనల పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం 2022లో ఉత్తర్వులు ఇచి్చందని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా స్టే విధించిందని, స్టే ఉండగా బదిలీ మార్గదర్శకాలు జారీ చేయడం చట్టవిరుద్ధమని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. దీనిపై వివరణ ఇవ్వాలని గురుకులాల కార్యదర్శిని ఆదేశిస్తూ, బదిలీ మార్గదర్శకాలను 18 వరకు నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
ప్రిన్సిపాల్ గదిలో బీరు సీసాలు
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని బాలెంల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో మద్యం సీసాలు దర్శనమివ్వడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తరచూ మద్యం తాగుతూ ప్రిన్సిపాల్ శైలజ తమను వేధింపులకు గురిచేసు్తన్నారని వారు ఆరోపించారు. ప్రిన్సిపాల్ అర్థరాత్రి వేళ సహాయ కేర్ టేకర్ సౌమిత్రితో కలిసి మద్యం తాగుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రిన్సిపాల్ రూమ్ కు తాళం వేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఆర్డీవో వేణుమాధవ్‌రావు, కళాశాలలో ఆర్సీవో అరుణకుమారి, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి జ్యోతి, డీఎస్పీ రవికుమార్ కశాశాలకు చేరుకున్నారు. వాస్తవాలను విచారించి ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా విద్యార్థినులు శాంతించలేదు. ఈ ఘటనపై మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌ను ఆదేశించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు పూర్తి స్థాయి విచారణ కమిటీ అధికారిగా అదనపు కలెక్టర్ బీఎస్ లతను నియమిస్తూ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రాథమిక విచారణ ఆధారంగా కళాశాల ప్రిన్సిపాల్‌ను బదిలీ చేస్తున్నట్టు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి ఒక ప్రకటనలో తెలిపారు. -
TG: ఎనిమిది మంది ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సోమవారం(జులై1) బదిలీ చేసింది. హైదరాబాద్ సౌత్ ఈస్ట్‌జోన్ డీసీపీగా సుభాష్, కొత్తగూడెం ఓఎస్డీగా పరితోష్ పంకజ్, ములుగు ఓఎస్డీగా మహేష్ బాబాసాహెబ్గవర్నర్ ఓఎస్డీగా సిరిశెట్టి సంకీర్త్, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్, భైంసా ఏఎస్పీగా అవినాష్ కుమార్, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి, ఏటూరునాగారం ఏఎస్పీగా శివమ్ ఉపాధ్యాయలను ప్రభుత్వం నియమించింది. -
యువకుడిపై దాడి కేసులో నిర్లక్ష్యం..
సాక్షి, హైదరాబాద్: దళిత యువకుడిపై దాడి కేసులో పోలీసులు స్పందించలేదు. బాధితుడు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందిన అనంతరం ఠాణాను ఆశ్రయించినా నిర్లక్ష్యం వహించిన నాగోలు ఇన్స్పెక్టర్ పరశురాంపై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోసి బదిలీ వేటు వేశారు. ఇదే కేసులో నాగోలు ఎస్ఐ మధు, ఏఎస్ఐ అంజయ్యపై అధికారులు చర్య తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కాగా.. నాగోలు ఇన్చార్జి ఇన్స్పెక్టర్గా ఎల్బీనగర్ డీఐ సుధాకర్‌ను నియమించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎల్బీనగర్లోని భరత్‌నగర్ కాలనీకి చెందిన దాసరి గౌతమ్ అలియాస్ బద్దు (20) ప్రైవేట్ ఉద్యోగి. నాగోలు సాయినగర్ కాలనీలో నివాసం ఉండే వేముల మల్లేశ్, అతని కుమారుడు (16), గౌతమ్‌ల మధ్య గతంలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో గౌతమ్‌ను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 6న నాగోలు సాయినగర్ కాలనీలో స్నేహితుడి ఇంట్లో నిద్రస్తున్న గౌతమ్‌పై మల్లే‹Ù, నరే‹Ù, అనిల్, జ్యోతి, నాగరాజు, పవన్‌కుమార్, మరో ఇద్దరు మైనర్లు దాడి చేశారు. భవనం పైఅంతస్తు నుంచి కిందకు లాక్కు వచ్చి రాయి, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో గౌతమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం టెలిఫోన్ స్తంభానికి కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. గౌతమ్ మృతి చెందినట్లు భావించి నిందితులు అక్కడి నుంచి వెళ్లి పోయారు.అనంతరం గాయపడిన గౌతమ్‌ను కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్లో చేరి్పంచారు. బాధితుడు గౌతమ్ తనపై జరిగిన దాడిపై ఈ నెల 21న నాగోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ.. ఇన్స్పెక్టర్ పరశురాం స్పందించలేదు. దీంతో బాధితుడు తగిన ఆధారాలతో ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 22న ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు జువైనల్ అఫెండర్లను హోంకు తరలించారు. ఉప్పల్ ఎస్ఐపై కూడా.. ఉప్పల్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, పోకరీలతో అంటకాగుతున్నాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉప్పల్ ఎస్ఐ సీహెచ్ శంకర్‌పై రాచకొండ సీపీ సస్పెన్షన్ వేటు వేశారు. ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్ భగాయత్ లే అవుట్లో ప్రేమ జంట ఇచ్చి న ఫిర్యాదుపై ఉప్పల్ ఎస్ఐ కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించాడని, ఇందుకోసం భారీగా ముడుపులు తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు శనివారం ఉప్పల్ ఎస్ఐ శంకర్‌పై విచారణకు ఆదేశించి, ఆదివారం శంకర్‌ను సస్పెండ్ చేస్తూ రాచకొండ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఐతో పాటు ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని రాచకొండ సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇన్చార్జి ఇన్స్పెక్టర్గా డీఐ మన్మథరావును నియమించారు. -
ఏపీలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా రాజేంద్రనాథ్‌రెడ్డి బదిలీ అయ్యారు. జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా సునీల్‌కుమార్‌కు ఆదేశాలిచ్చింది. రిషాంత్‌రెడ్డిని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది.ఏసీబీ డీజీగా అతుల్‌సింగ్‌కు, ఫైర్ సేప్టీ డీజీగా శంకబ్రత బాగ్బీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. -
సార్.. లెటర్ ప్లీజ్!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇప్పుడు ఏ నేత ఇంటి ఎదుట చూసినా పలువురు పాత పోలీసులు తారసపడుతున్నారు. ‘సార్.. పోస్టింగు కోసం లెటర్ కావాలి.. ఇప్పటివరకూ లూప్లైన్లో ఉన్నాం. మీరు లెటరిస్తే వెళ్లి పోస్టింగుల్లో చేరతాం’ అంటూ పైరవీలు ప్రారంభించారు. ఇది కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకే పరిమితం కాలేదు.రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వీలైనంత త్వరగా పోస్టింగులు తెచ్చుకోవాలని మెజారిటీ పోలీసు అధికారులు ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభించారు.సామాజికవర్గాల వారీగా..పోలీసు పైరవీల్లో తొలి ప్రాధాన్యం సామాజికవర్గానికే. రాజధానిలోని హైదరాబాద్, సైబరాబా ద్, రాచకొండల్లో ఈ పోకడ తక్కువే గానీ, జిల్లాలో పోలీసు పోస్టింగుల్లో తొలి ప్రాధాన్యం మా త్రం సామాజికవర్గానిదే. ఈ క్రమంలోనే నేతలు కూడా తమ సామాజికవర్గాల అధికారులకు పెద్దపీట వేస్తున్నారు. ఆ తరువాతే సమర్థత, పనితీ రు, విశ్వసనీయత, పాత పరిచయాలు తదితర విషయాలను బేరీజు వేసుకుంటున్నారు. ఇప్పటికే పోలీసు అధికారుల్లో చాలామంది తమ సొంత సామాజికవర్గానికి చెందిన నాయకులను లెటర్ల కోసం ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అయ్యారు.ఐఏఎస్‌ల, ఐపీఎస్ బదిలీలతో..గత ప్రభుత్వ హయాంలో ఉన్న పలువురు ఐఏఎ స్, ఐపీఎస్ అధికారులను ఎలక్షన్ కమిషన్ అసెంబ్లీ ఎన్నికల ముందు బదిలీ చేసింది. తరువాత వారిస్థానాల్లో కొత్త అధికారులను నియమించింది. ఇటీవల పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో తనదైన ముద్ర వేసేలా మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈనెల 15వ తేదీన ఉమ్మడి జిల్లాల కలెక్టర్లను మార్చింది.సోమవారం సాయంత్రం తొలి విడతగా పలువురు ఐపీఎస్‌లను బదిలీచేసింది. జగిత్యాల ఎస్పీగా సురేశ్ కుమార్‌ను నియమించింది. ఇక్కడ పనిచేసిన సన్ప్రతీసింగ్ను సూర్యాపేటకు బదిలీ చేసింది. మరో విడతలో మరికొందరిని కూడా బదిలీ చేయనుంది. దీంతో ఎస్సై నుంచి ఏసీపీ వరకు రెండో విడత ఐపీఎస్ బదిలీ లకోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ఐపీఎస్ అధికారుల్లో చాలామంది ఎన్నికల సంఘం నియమించిన వారే ఉన్నారు.ఒకవేళ ఎవరైనా కిందిస్థాయి అధికారి ఫలానా చోట పోస్టింగ్ కావాలని లెటర్ తెచ్చుకున్నా.. సదరు ఐపీఎస్ అధికారి వ్యతిరేకించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ అలా అంటే మొదటికే మోసం వస్తుంది. వారి శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని భావిస్తున్నారు. అందుకే, ఈ విషయంలో కిందిస్థాయి పోలీసు అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.వారు వద్దంటే వద్దు..మరోవైపు గత ప్రభుత్వ హయాంలో తమను ఇబ్బంది పెట్టిన పోలీసు అధికారులకు పోస్టింగుల కోసం లెటర్లు ఇవ్వొద్దని కొందరు నేతలు బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఇవేం పట్టించుకోవడం లేదని, తమ డిపార్టుమెంటు ప్రభుత్వం చెప్పినట్లు వింటుందే తప్ప, తామేపార్టీ పక్షం కాదని స్పష్టంచేస్తున్నారు. దీన్ని ముందుగానే గుర్తించిన ఉమ్మడి జిల్లాలో కొందరు తెలివైన అధికారులు ఏకంగా పొరుగు జిల్లాల్లో పోస్టింగులు సాధించుకుని డ్యూటీలు చేస్తుండటం గమనార్హం.కరీంనగర్ హాట్ కేక్..కరీంనగర్ కమిషనరేట్ పోలీసు వర్గాల్లో హాట్‌కేక్‌గా మారింది. చాలామంది పోలీసు అధికారులు పిల్లల చదువుల కోసం ఇక్కడే పోస్టింగులు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో నాలుగు ఆకులు ఎక్కువే చదివిన సీనియర్లు అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇతర కమిషనరేట్లకు వలసవెళ్లారు.ఇప్పుడు ఎన్నికల సీజన్ ముగిసింది. దీంతో తిరిగి వెనక్కి వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇక సుదీర్ఘకాలంగా లూప్లైన్లో ఉన్నవారు, గత ప్రభుత్వ హయాంలో పోస్టింగులు దక్కని వారు సైతం ఈసారి ఎలాగైనా లా అండ్ ఆర్డర్లో ఉండేందుకు, నాయకులను కలుస్తూ లెటర్లు పొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. -
ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్
-
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఎన్నికల కమిషన్(ఈసీ) ఆదివారం(మే5) బదిలీ చేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని డీజీపిని ఆదేశించింది. డీజీపీని వెంటనే బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)కు ఆదేశాలు జారీ చేసింది. కొత్త డీజీపీ నియామకం కోసం ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల పేర్లు పంపాలని సీఎస్‌ను ఈసీ కోరింది. సోమవారం(మే6) ఉదయం 11 గంటల లోపు ప్రతిపాదనలు పంపాలని కోరింది. -
ఒడిషా: బీజేడీకి ‘ఈసీ’ బిగ్ షాక్
భువనేశ్వర్: ఎన్నికల వేళ ఒడిషాలో ఎన్నికల కమిషన్(ఈసీ)కొరడా ఝుళిపించింది. ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా ఉన్న సుజాత ఆర్.కార్తికేయన్‌ను ఈసీ బదిలీ చేసింది. ప్రభుత్వ బాధ్యతలను దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ చేసిన ఫిర్యాదుతో గంట్లోపే ఈసీ చర్య తీసుకుంది. ఎన్నికల వ్యవహారాలకు సంబంధం లేని విభాగానికి సుజాతను బదిలీ చేసింది. ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ సన్నిహితుడికి వీకే పాండియన్ సతీమణి సుజాత. దీంతో సుజాత బదిలీ రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. సుజాత మిషన్ శక్తి విభాగంలో సెక్రటరీగా నిధులు నిర్వర్తించారు.ఈమె భర్త వీకేపాండియన్ ఐఏఎస్ అధికారిగా గత ఏడాది వీఆర్ఎస్ తీసుకున్నారు. పాండియన్ ప్రభుత్వంలో పనిచేసినపుడు సీఎం నవీన్ పట్నాయక్‌కు నమ్మకమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. తెరవెనుక పాలనను మొత్తం నడిపేవారని పాండియన్‌కు పేరుంది. పదవీవిరమణ తర్వాత బీజేడీలో చేరారు. ప్రతిపక్షాలు పాండియన్‌ను సూపర్‌సీఎంగా పిలుస్తాయి. -
మూడు జిల్లాల కలెక్టర్లు బదిలీ
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పలువురు ఉన్నతాధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ముగ్గురు ఐఏఎస్ అధికారులను, ఆరుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. వీరి స్థానంలో కొత్త అధికారులను నియమించేందుకు ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లు సూచిస్తూ వెంటనే జాబితా పంపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజాబాబు, అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి గౌతమి, తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీశాతో పాటు ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి, చిత్తూరు జిల్లా ఎస్పీ పి.జాషువా, అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజును కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వీరికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది. -
గురుకుల బోర్డుకు కొత్త సారథులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ)లో మార్పులు జరగనున్నాయి. కీలకమైన చైర్మన్, కన్వినర్ పోస్టుల్లో త్వరలోనే కొత్తవారిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి, టీఆర్‌ఈఐఆర్‌బీ కన్వినర్‌గా ఉన్న మల్లయ్య బట్టును రా ష్ట్ర ప్రభుత్వం ఇటీవల బదిలీచేసింది. సొసైటీ నూత న కార్యదర్శిగా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి బి.సైదులను నియమించింది. దీంతో గత వారం ఆయ న బాధ్యతలు స్వీకరించారు. అయితే టీఆర్‌ఈఐఆర్‌బీ కన్వినర్‌గా వ్యవహరించిన మల్లయ్య బట్టు ఆ బాధ్యతల నుంచి కూడా తప్పుకోవడంతో కన్వినర్ సీటు ఖాళీ అయ్యింది. ఉద్యోగ నియామకాల ప్రక్రియలో అత్యంత కీలకంగా వ్యవహరించే కన్వినర్ సీటు ఖాళీ కావడంతో బోర్డు పరిధిలో పలు నియామకాలకు సంబంధించిన అంశాలు పెండింగ్ లో పడిపోయాయి. ఈ క్రమంలో వాటి భర్తీతో పాటు ఇతర కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే బో ర్డుకు కన్వినర్ నియామకం అనివార్యం కానుంది. బోర్డు సభ్యులుగా సొసైటీల కార్యదర్శులు రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీని వేగవంతంగా చేపట్టేందుకు వీలుగా టీఆర్‌ఈఐఆర్‌బీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్)లతో పాటు విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)ల కార్యదర్శులు బోర్డులో సభ్యులుగా ఉంటారు. గురుకుల సొసైటీల్లో సీనియర్ కార్యదర్శి ఈ బోర్డుకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మరో సభ్యుడు కన్వినర్‌గా ఉంటారు. బోర్డు సభ్యుల అంగీకారం, ప్రభుత్వ ఆమోదంతో సొసైటీల్లోని అదనపు కార్యదర్శుల్లో ఎవరినైనా కూడా కన్వినర్/ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించుకోవచ్చు. ప్రస్తుత చైర్మన్‌గా ఆయేషా మస్రత్ ఖానమ్ ప్రస్తుతం బోర్డు చైర్మన్‌గా మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆయేషా మస్రత్ ఖానమ్ ఉన్నారు. కన్వినర్‌గా కొనసాగిన మల్లయ్య బట్టును టీఎస్ఈడబ్ల్యూఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్, సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా బి.సైదులు నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న గురుకుల సొసైటీ కార్యదర్శుల్లో ఈయనే సీనియర్ అధికారి. బోర్డు చైర్మన్‌గా సీనియర్ అధికారిని నియమించాల్సి ఉండటంతో ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న మస్రత్ ఖానమ్‌కు కూడా స్థాన చలనం తప్పదని అధికారులు అంటున్నారు. కన్వినర్ పోస్టు కూడా ఖాళీ కావడంతో చైర్మన్, కన్వీనర్ రెండు పోస్టుల్లోనూ కొత్త వారినే నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బోర్డు అధికారులు ఒకట్రెండు రోజుల్లో సొసైటీ కార్యదర్శుల సీనియారీ్ట, తదితర పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాత చైర్మన్, కన్వినర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. -
తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్ ఎస్పీ పాటిల్ సంగ్రామ్ సింగ్‌ను డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేసింది. మహబూబ్‌నగర్ ఎస్పీగా సుధీర్ రామ్‌నాథ్, సెంట్రల్ డీసీపీగా ఆకాంక్ష యాదవ్, మంచిర్యాల డీసీపీగా అశోక్ కుమార్ బదిలీ అయ్యారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటన -
ఇవాళ ఇక్కడికి.. రేపు ఎక్కడికో
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్‌లు మొదలు డీఎస్పీల వరకు ఇటీవల పోలీస్‌శాఖలో పెద్ద ఎత్తున బదిలీ లు జరిగాయి. అయితే సివిల్ డీఎస్పీల పోస్టింగ్‌లు మారుస్తూ జరిగిన వరుస బదిలీలు మాత్రం చర్చనీయాంశమయ్యాయి. ఈ నెల 12న ఏకంగా 110 మంది సివిల్ డీఎస్పీలు, 14వ తేదీన మరో 95మంది, 15న మరో 26 మంది సివిల్ డీఎస్పీలను బదిలీ చేశారు. ఆ తర్వాత ఈనెల 17న వెల్లడైన ఉత్తర్వుల్లోనూ మరో 61 మంది సివిల్ డీఎస్పీలను బదిలీ చేశారు. ప్రతిశాఖలోనూ బదిలీల ప్రక్రియ అత్యంత సహజమే అయినా, ఒకసారి ఇచ్చిన పోస్టింగ్ మారుస్తూ...లేదంటే అప్పటికే ట్రాన్స్ఫర్ చేసిన వారిని తిరిగి అక్కడే కొనసాగి స్తున్నట్టు పేర్కొంటూ వరుస ఉత్తర్వులు వెలువడుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ‘పట్టు’నిలుపుకుని.. ‘అనుకూల’పోస్టింగ్‌లు కొందరు అధికారులు బదిలీ అయినా తమ ‘పట్టు’నిలుపుకొని తిరిగి అదే స్థానాల్లో కొనసాగుతున్నారు. మరికొందరు బదిలీ అయిన స్థానంలో చేరకముందే రోజుల వ్యవధిలోనే ‘అనుకూల’పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారన్న ప్రచా రం జరుగుతోంది. ఒకే సారి పెద్ద సంఖ్యలో బదిలీ జరిగినప్పుడు కొద్దిమేర పోస్టింగ్‌ల్లో మార్పులు సహజమే కానీ గత మూడు రోజుల్లో విడుదల చేసిన పోస్టింగ్ ఉత్తర్వులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని పోలీసు వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఎప్పుడు ఎక్కడికో అనే ఆందోళనలో కొందరు ఒక రోజు వచ్చిన ఆర్డర్ కాపీలో ఉన్న పోస్టింగ్‌లు ఆ తర్వాతి బదిలీ ఉత్తర్వులు వచ్చే సరికి మారిపోతుండడం కొంతమందిని మాత్రం కలవరానికి గురి చేస్తోంది. ఎప్పుడు ఎక్కడికి బదిలీ అవుతామో..అక్కడి నుంచి మళ్లీ ఎక్కడికి మారుస్తున్నారో అన్న గందరగోళం నెలకొందని కొందరు అధికారులు వాపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగిన వారికే మళ్లీ కీలకస్థానాల్లో పోస్టింగ్‌లు దక్కుతున్నాయన్న చర్చ జరుగుతోంది. ‘పోలీసులపై రాజకీయ పెత్తనం ఉండబోదు’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టు గెదర్‌లో చెప్పినా, వాస్తవ పరిస్థితి మాత్రం అలా లేదని కొందరు వాపోతున్నారు. -
తెలంగాణలో నలుగురు ఐఏఎస్, 12 మంది ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్, 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ► నిజామాబాద్ అదనపు కలెక్టర్ చిత్రమిశ్రాను ఐటీడీఏ ఏటునాగారం ప్రాజెక్టు అధికారిగా బదిలీ చేశారు. ఐటీడీఏ ఏటునాగారం ప్రాజెక్టు అధికారి అంకిత్‌ను నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా బదిలీ చేశారు. ► ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తాను ఉట్నూరు ప్రాజెక్టు అధికారిగా బదిలీ చేశారు. ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చేతన్ బాజ్‌పాయ్‌ను తదుపరి పోస్టింగ్‌కు సాధారణ పరిపాలన శాఖను రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. రాచకొండ సీపీగా తరుణ్‌జోషీ రాచకొండ పోలీస్ కమిషనరేట్ సీపీగా మల్టీజోన్–2 ఐజీగా ఉన్న డా.తరుణ్‌జోషి నియమితులయ్యారు.రాచకొండ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సుదీర్‌బాబును మల్టీజోన్ –2 ఐజీగా నియమించారు. మల్టీజోన్–1 ఐజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. -
టీఎస్పీఎస్సీ కార్యదర్శి బదిలీ
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆమెస్థానంలో ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి నవీన్‌నికోలస్‌ను నియమించారు. వీరితోపాటు పలు వురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆది వారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మత్స్యశాఖ డైరెక్టర్‌గా ఉన్న లచ్చిరాంభూక్యను ప్రభుత్వం బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర సరీ్వసులకు తిప్పి పంపించింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా ఉన్న బి.గోపికి ఫిషరీస్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ► హైదరాబాద్ జిల్లా చీఫ్ రేషనింగ్ అధికారి బి.బాలమాయాదేవి బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా, ► రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావును రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ ఆఫీషియో సెక్రటరీగాను ► సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫీషియో సెక్రటరీ కె. అశోక్‌రెడ్డిని ఉద్యానవనశాఖ డైరెక్టర్‌గా క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ ఎ.నిర్మలకాంతి వెస్లీని స్త్రీ, శిశు, వయోజనుల సంక్షేమ శాఖకు బదిలీ చేస్తూ, ఆమెకే ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ పోస్టును సైతం ప్రభుత్వం అప్పగించింది. ► హైదరాబాద్ జూ పార్క్ డైరెక్టర్‌గా ఉన్న విఎస్‌ఎన్‌వి.ప్రసాద్‌కు పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ నియమించింది. ► వెయిటింగ్లో ఇద్దరిలో సీతాలక్ష్మిని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీల కార్యదర్శిగాను, జి.ఫణీంద్రరెడ్డికి హైదరాబాద్ జిల్లా రేషనింగ్ అధికారిగా బదిలీ చేసింది. -
Panjagutta PS: సిబ్బందిపై వేటు వెనక కారణాలివే?
హైదరాబాద్, సాక్షి: రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇదో సంచలనం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే పీఎస్ లోని మొత్తం 86 మందిని బదిలీచేస్తూ ఉత్తర్వులిచ్చారు పోలీస్ కమీషనర్. ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డ్ వరకు అందరినీ బదిలీ చేశారు. పంజాగుట్ట పోలీసులపై పలు ఆరోపణలు రావడంతో.. తొలిసారి పీఎస్ లో ఉన్న 80శాతం సిబ్బందిని బదిలీచేస్తూ సీపీ శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ట్రాన్స్‌ఫర్స్‌తో పోలీసులు అవినీతికి పాల్పడితే ఇలాంటి పరిణామాలే ఉంటాయని రాష్ట్రవ్యాప్తంగా వార్నింగ్ ఇచ్చినట్లయింది. సిటీలో ప్రధాన పోలీస్ స్టేషన్స్ లో పంజాగుట్ట ఒకటి. నాలుగేళ్ల క్రితం దేశంలోనే రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా అవార్డు పొందింది. మూడున్నర లక్షల మంది జనాభా.. ఐదు సెక్టార్లు.. వందకు పైగా పోలీస్ సిబ్బంది.. అంతటి పేరున్న పంజాగుట్ట పీఎస్ రీసెంట్ గా వివాదాల్లో నిలిచింది. రాజకీయ పలుకుబడితో ఈ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్స్ కోసం ఆఫీసర్లు వెంటబడేవారు. ఇట్లాంటి పోలీస్ స్టేషన్స్ లోని సిబ్బంది పలు కీలక కేసులను తప్పుదారి పట్టిస్తున్నారు. దీంతో స్టేషన్ సిబ్బందిని భారీగా ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. నిన్న జరిగిన ఇన్స్పెక్టర్ల బదిలీల్లో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ ని బదిలీ చేస్తూ శోభన్ అనే కొత్త ఇన్స్పెక్టర్ ని సీఐగా నియమించారు. ఈరోజు పీఎస్‌లోని ఆరుగురు ఎస్సైలు, 9 మంది ఏఎస్సైలు, 16 మంది హెడ్ కానిస్టేబుల్స్ తో పాటు కానిస్టేబుల్స్, హోమ్ గార్డులను బదిలీ చేస్తూ సర్క్యులర్ జారీ చేశారు సీపీ. పీఎస్‌లో మొత్తంగా వందకు పైగా సిబ్బంది ఉండగా అందులో 85 మందిని ఈరోజు ట్రాన్స్ ఫర్ చేశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, ఎస్సైలను మినహా మిగతా అందరినీ ట్రాన్స్ ఫర్ చేశారు. ట్రాన్స్ ఫర్ అయిన వారి స్థానంలో కొత్తగా 82 మందిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ప్రజాభవన్ ముందు జరిగిన యాక్సిడెంట్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్‌ని తప్పించి మరొకరిపై కేసు పెట్టారని అప్పట్లో పని చేస్తున్న సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు సీపీ. సీఐ దుర్గారావుకు మరికొంత మంది సిబ్బంది సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. రీసెంట్ గా పంజాగుట్టలో ఒక వ్యక్తి ఫుల్లుగా తాగి తన కారుతో రోడ్డుపై ఉన్నవారందరినీ గుద్దుకుంటూ వెళ్లాడు. అతడ్ని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రిమాండ్ కి తరలిస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. వివిధ కేసుల్లో అరెస్టయిన నిందితులను కోర్టులకు, జైళ్లకు తరలించే టైమ్ లో పంజాగుట్ట పోలీసులు ఏమరపాటుగా ఉంటున్నారనే విమర్శలు వచ్చాయి. నిందితులకు సహకరిస్తూ వారి బంధువులతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. నెల క్రితం డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి.. న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఇద్దరిని ట్రాఫిక్ పోలీసులు పంజాగుట్ట పోలీసులకు అప్పగించగా.. వారిద్దరూ పోలీసుల నుంచి పారిపోయారు. గతంలో ఇదే పీఎస్ కి చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ, లిక్కర్ తాగుతూ పట్టుబడ్డారు. ఇదే పీఎస్ లోని ఓ ఎస్సై.. మహిళా బాధితుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ కదలికల్ని సైతం లీక్ చేస్తున్నారని సమాచారం అదింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఒకేసారి భారీగా ట్రాన్స్ ఫర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నగర కమీషనర్. అవినీతికి పాల్పడ్డా.. సివిల్ వివాదాల్లో తలదూర్చినా.. ట్రాన్స్ ఫర్స్ తో పాటు సస్పెన్షన్స్ ఉంటాయంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఆరోపణలు వచ్చిన ప్రతీ పోలీస్ పై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేయించి, రుజువైతే చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇదీ చదవండి: తెలంగాణ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మళ్లీ పెంపు -
HYD: పంజాగుట్ట పీఎస్ మొత్తం సిబ్బందిపై వేటు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ ఎస్ఐ మొదలు.. హోంగార్డ్ వరకు సిబ్బందిని బదిలీ చేశారు. వివాదాల పోలీస్‌స్టేషన్‌గా పేరు పడ్డ పంజాగుట్టను రిపేర్ చేయలేమని భావించిన పోలీస్ శాఖ మొత్తానికి మొత్తం సిబ్బందిపై బదిలీ వేటు వేసింది. నగరం నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట స్టేషన్లో హోంగార్డు నుంచి ఇన్స్పెక్టర్ దాకా ఎన్నో వివాదాలు ఉన్నాయి. పోలీసు శాఖకు తలవంపులు తెచ్చేవిధంగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 85 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో సీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వం.. ప్రజా భవన్‌లోని ప్రభుత్వ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని ఆరోపణలపై బదిలీ వేటు వేసింది. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియామకం జరిగింది. -
అరవింద్ కుమార్‌కు ‘విపత్తు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌ను ప్రభుత్వం రెవెన్యూ శాఖ పరిధిలోని విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దాన కిశోర్‌ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా స్థానచలనం కల్పించింది. కీలకమైన హెచ్ఎండీఏ కమిషనర్, పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ పదవుల అదనపు బాధ్యతల నుంచి సైతం అరవింద్‌కుమార్‌ను తప్పించింది. ఆ రెండు పోస్టుల అదనపు బాధ్యతలనూ దానకిశోర్కే అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో లీజుపై అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) అప్పగింతపై నిర్వహించిన టెండర్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని అప్పట్లో రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై హెచ్ఎండీఏ కమిషనర్‌గా అరవింద్ కుమార్ స్పందిస్తూ రేవంత్‌రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో అరవింద్‌కుమార్‌ను అప్రధానమైన విపత్తుల నిర్వహణ విభాగానికి బదిలీ చేయడం గమనార్హం. గత ప్రభుత్వంలో సీఎం కార్యదర్శిగా వ్యవహరించిన రాహుల్ బొజ్జాను సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా అదనపు బాధ్యతల్లో ఆయన్ను కొనసాగించింది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను తప్పించి ఆమెను స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు బదిలీ చేసింది. ఆమె స్థానంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంను విద్యాశాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. గత ప్రభుత్వంలో అప్రాధాన్య పోస్టుల్లో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ క్రిస్ట్రీనా జెడ్.చొంగ్తును కీలకమైన వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించడం విశేషం. -
నల్లగొండ కలెక్టర్ ఆర్వి.కర్ణన్ బదిలీ
నల్లగొండ : జిల్లా కలెక్టర్ ఆర్వి.కర్ణన్ బదిలీ అయ్యారు. ఆయనను రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. కలెక్టర్ ఆర్వి.కర్ణన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కరీంనగర్ నుంచి బదిలీపై నల్లగొండకు వచ్చారు. జూలై 26, 2023న ఇక్కడ విధుల్లో చేరారు. జిల్లా యంత్రాంగంతో కలిసి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. అయితే నల్లగొండ కలెక్టర్‌గా ఇంకా ఎవరినీ నియమించలేదు. -
TS:ఐపీఎస్ అధికారుల బదిలీ..ఎవరు ఎక్కడికంటే..?
సాక్షి,హైదరాబాద్: సివిల్ సర్వీసు అధికారుల బదిలీపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆదివారం మధ్యాహ్నమే 12 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం రాత్రి 8 గంటలకు 9 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.10 మంది ఐపీఎస్‌లు, ఐదుగురు నాన్ క్యాడర్ ఐపీఎస్‌లను బదిలీ చేసింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా బాలాదేవిని ప్రభుత్వం నియమించింది. వరంగల్ కమిషనర్‌గా ఉన్న రంగనాథ్‌ను హైదరాబాద్ జాయింట్ సీపీగా బదిలీ చేశారు. మాదాపూర్ డీసీపీ సందీప్‌పై వేటు వేశారు. రైల్వే అడ్మిన్ ఎస్పీగా సందీప్ రావును నియమించారు. వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవీస్ ఎస్బీ హైదరాబాద్ డీసీపీగా బదిలీ అయ్యారు. నార్త్ జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శినిని నియమించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ జాయింట్ సీపీగా విశ్వప్రసాద్, సిట్, క్రైమ్స్ జాయింట్ సీపీగా ఏవీ రంగనాథ్, పశ్చిమ మండల డీసీపీగా విజయ్‌కుమార్, ఉత్తర మండల డీసీపీగా రోహిణి ప్రియదర్శిని, సీసీఎస్ డీసీపీగా ఎన్.శ్వేత, హైదరాబాద్ ట్రాఫిక్-1 డీసీపీగా ఎస్ సుబ్బారాయుడిని బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీచదవండి..నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్: సీపీ శ్రీనివాస్‌రెడ్డి -
తెలంగాణలో త్వరలో ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు
-
రైల్వే ఘనకార్యం! మూడు రోజుల్లో రిటైరయ్యే ఉద్యోగి బదిలీ
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ డివిజన్‌కు చెందిన ఒక సీనియర్ ఇంజనీర్ విషయంలో రైల్వేబోర్డ్ ఘనకార్యం చేసింది. మరో మూడు రోజుల్లో రిటైరవుతున్న కేపీ ఆర్యను ఢిల్లీలోని నార్తర్న్ రైల్వే జోన్‌కు బదిలీ చేసింది. ఖంగుతిన్న ఆయన బదిలీపై నిరాశను వ్యక్తం చేస్తూ రైల్వే బోర్డు సెక్రటరీకి ఘాటు లేఖ రాశారు. బదిలీ ఆర్డర్‌ను ఆయన బుద్ధిలేని పనిగా పేర్కొన్నారు. బదిలీ ఉత్తర్వు ప్రకారం కేపీ ఆర్య నవంబర్ 28న హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ పోస్ట్‌పై నార్తర్న్ రైల్వేలో చేరాల్సి ఉంది. అయితే ఆయన పదవీ విరమణ నవంబర్ 30న ఉంది. ఈ ఆర్డర్ పైకి బాగానే మూడు రోజుల్లో రిటైరవుతున్న తనను బదిలీ చేయడంలో పిచ్చితనమే కనిపిస్తోందని ఆర్య అన్నారు. ఇది జీవితమంతా ఇండియన్ రైల్వే సంస్థకు సేవ చేసిన ఒక ఉద్యోగిని పదవీ విరమణ సమయంలో కావాలని బదిలీ చేయడమే తప్ప మరొకటి కాదు అన్నారు. దీని వల్ల పదవీ విరమణ సెటిల్మెంట్కు అంతరాయం ఏర్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్లో హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ పోస్ట్ ఖాళీగా ఉన్నప్పటికీ, రైల్వే బోర్డు తనను నార్తర్న్ రైల్వే జోన్లో ఖాళీగా ఉన్న పోస్ట్‌కు బదిలీ చేసిందని ఆర్య పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. పదవీ విరమణకు ముందు కేవలం మూడు రోజులు తాను న్యూఢిల్లీలోని నార్తర్న్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం రైల్వే శాఖ తనకు దాదాపు రూ. 3 లక్షలు చెల్లిస్తుందని, ఇది ప్రజాధనాన్ని పూర్తిగా వృధా చేయడమేనని ఆయన ఆక్షేపించారు. ఇది ప్రమోషనల్ ట్రాన్స్‌ఫర్‌గా చెబుతున్నప్పటికీ దీని వల్ల తనకు అదనపు ఆర్థిక ప్రయోజనాలేవీ అందించలేదని ఆర్య పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తనకు ఇప్పటికే ఆర్థిక ప్రయోజనాలకు అర్హత ఉన్నప్పటికీ తన పదోన్నతిని ఆరు నెలలు ఆలస్యం చేశారని ఆరోపించారు. -
ఇద్దరు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. జస్టిస్ సుధీర్‌కుమార్‌ను మద్రా స్ హైకోర్టుకు, జస్టిస్ చిల్లకూర్ సుమలతను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని కొద్ది రోజుల కిందట సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఆ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. వీరితోపాటు ఇతర రాష్ట్రాల కు చెందిన మరో ముగ్గురు న్యాయమూర్తుల బదిలీకికూడా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. తెలంగాణ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తు ల సంఖ్య (సీజేతో కలిపి) 42 కాగా, ప్రస్తుతం 28 మంది ఉన్నారు. జస్టిస్ చిల్లకూర్ సుమలత, జస్టిస్ సుధీర్‌కుమార్ బదిలీతో ఆ సంఖ్య 26కు చేరగా.. ఖాళీల సంఖ్య 16కు పెరిగింది. చదవండి: కేసీఆర్‌కు కోటి అప్పు ఇచ్చిన వివేక్ -
హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీపై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీపై బదిలీ వేటు పడింది. ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం బదిలీ చేసింది. నాలుగేళ్లుగా టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా రాధాకృష్ణ కొనసాగుతున్నారు. పదవీ విరమణ తర్వాత ఓఓస్డీగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్స్ లభించాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ►టీఎస్పీఎస్ఏ జాయింట్ డైరెక్టర్‌గా రంగనాథ్ ►టీఎస్పీఎస్ఏ డిప్యూటి డైరెక్టర్ గా రాజేంద్ర ప్రసాద్ ►సీఐడీ ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి ►గ్రే హౌoడ్స్ ఎస్పీగా వెంకటేశ్వర్లు ►సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా నితికా పంత్ ►సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా రోహిత్ రాజ్ ►ట్రాఫిక్ డీసీపీగా ఆర్. వెంకటేశ్వర్లు ►పెద్దపల్లి డీసీపీగా సునీతా మోహన్ -
పైరవీ పోస్టింగ్ లపై వేలాడుతున్న కత్తి..!
జనగామ: ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి.. పైరవీలతో కోరుకున్నచోట పోస్టింగ్‌లు కొట్టిన రెవెన్యూ, పోలీస్ అధికారులపై బదిలీ కత్తి వేలాడుతోంది. వరంగల్, కరీంనగర్, రామగుండం కమిషనరేట్లతోపాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల జిల్లాల్లో 51మంది పోలీస్ అధికారుల బదిలీల్లో ఎన్నికల నిబంధనలు పాటించలేదని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అత్యధికంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్స్పెక్టర్ నుంచి ఏసీపీల వరకు 21 మంది ఈ తరహా పోస్టింగ్‌లు పొందారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలను నివేదిక ద్వారా అందజేయాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి అవినాష్ కుమార్‌కు, సంబంధిత అధికారులకు లేఖ నం. 434/1/టీఈఎల్/ ఎస్‌ఓయు3/ 2023 ద్వారా రాశారు. వరంగల్ కమిషనర్‌తోపాటు మహబూ బాబాద్, ములుగు ఎస్పీలు బదిలీల్లో నిబంధన ఉల్లంఘన లేదంటూ వివరాలు పంపారు. ఇది జరిగి సుమారు రెండు నెలలు కావస్తుండగా.. తాజాగా బుధవారం వరంగల్ సీపీ ఏవీ.రంగనాథ్, మహబూబాబాద్, భూపాలపల్లి ఎస్పీలు చంద్రమోహన్, పుల్లా కరుణాకర్‌లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు, రెవెన్యూ అధికారులపైనా త్వరలోనే బదిలీ వేటు పడనుందన్న చర్చ జరుగుతోంది. నిబంధనల ఉల్లంఘనపై ఈసీఐ ఆరా... వరంగల్ సీపీ, భూపాలపల్లి, మహబూబాబాద్ ఎస్పీలపై బదిలీ వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. రెవెన్యూ, పోలీసుశాఖల్లో జరిగిన అన్ని బదిలీల్లో నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీస్తోంది. ఎన్నికల నేపథ్యంలో పారదర్శకంగా బదిలీలు, పోస్టింగ్‌లు ఇవ్వాలని జూన్‌లోనే కమిషన్ సూచించింది. జిల్లాలు, కమిషనరేట్లలో పోలీస్ అధికారులకు సంబంధించి పలు మార్గదర్శకాలను పంపింది. అందుకు విరుద్ధంగా నాలుగేళ్లలో మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అనేక మంది తిరిగి జిల్లాలోనే పోస్టింగ్‌లు పొందారు. ఈ తరహాలో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌తో పాటు ఉమ్మడి జిల్లాలో 27 మంది పోస్టింగ్‌లు పొందినట్లు ఎన్నికల సంఘానికి లిఖితపూర్వమైన ఫిర్యాదులు అందాయి. రాజకీయ ఒత్తిళ్లు, ఎమ్మెల్యేల సిఫారసుల కారణంగా అడుగడుగునా ఉల్లంఘనలు జరిగాయంటూ వెల్లువెత్తిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణకు మరోసారి గురువారం ఎన్నికల సంఘం ఆదేశించడం పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది. ‘రెవెన్యూ’లోనూ ఇదే తంతు.. మరోవైపు రెవెన్యూలోనూ అదే పరిస్థితి నెలకొంది. హనుమకొండ ఆర్డీఓగా రెండున్నర సంవత్సరాలకు పైగా పని చేసిన వాసుచంద్రను ఎన్నికల సంఘం నిబంధనల పరిధిలోకి వస్తారని మొదట హైదరా బాద్‌కు బదిలీ చేశారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలు గ్రేటర్ వరంగల్ పరిధిలోకి వస్తాయి కూడా. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు బదిలీ చేసిన ఐదారు రోజులకే ఆయనను వరంగల్ జిల్లాలో ఆర్డీఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీని వెనుక ఓ కీలక ప్రజాప్రతినిధితో పాటు మరో ఇద్దరు నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధుల సిఫారసుల లేఖలు ఉన్నట్లు రెవెన్యూశాఖలోని కొందరు ఫిర్యాదు చేశారు. హనుమకొండ జిల్లాకు చెందిన చాలామంది తహసీల్దార్లు పొరుగు జిల్లా అయిన వరంగల్‌కు బదిలీ అయ్యారు. పలు నియోజకవర్గాలు రెండు జిల్లాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు ఒక జిల్లాలో పనిచేసిన ఇద్దరు తహసీల్దార్లు ఇప్పుడు వరంగల్‌కు బదిలీ అయినా పాత నియోజకవర్గంలోకే మళ్లీ వచ్చారు. ఇలా జరిగిన చాలా బదిలీలు, పోస్టింగ్‌లపైనా ఎన్నికల సంఘం ఆరా తీస్తుండటం కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లాలో ఏడు సంవత్సరాలు పనిచేసిన ఎస్ఐ ఎస్కే యాసిన్, నాలుగేళ్లు పూర్తయిన శ్రీనునాయక్‌ను అదే జిల్లాలో కొనసాగిస్తున్నారు. క్రిమినల్ కేసులో భాగస్వామన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాణాప్రతాప్‌ను గూడూరు ఎస్ఐగా కూడా నియమించారు. ములుగు జిల్లా డీఎస్‌బీగా ఉన్న సట్ల కిరణ్, ఆర్ఐ కిరణ్, సీసీఎస్‌లో ఉన్న శివకుమార్‌లు దీర్ఘకాలికంగా అదే జిల్లాలో పనిచేసినా.. తిరిగి అక్కడే నియమించారన్న చర్చ ఉంది. ఎనిమిదేళ్లుగా వరంగల్ జిల్లాలో పనిచేసి ఎస్బీ ఏసీపీ నుంచి అదే కమిషనరేట్ పరిధిలోని నర్సంపేటకు ఏసీపీగా పి.తిరుమల్ బదిలీ అయ్యారు. పరకాల ఏసీపీగా పోస్టింగ్ తీసుకున్న కిషోర్ ఏడేళ్లుగా ఇదే జిల్లాలో పనిచేస్తున్నారు. డేవిడ్‌రాజ్ కాజీపేట ఏసీపీగా నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జిల్లాలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన ఆయన కేయూసీ తదితర పీఎస్‌లలో పని చేశారు. సి.సతీష్‌ను జూలై 15న మామునూరు ఏసీపీగా నియమించారు. గతంలో దుగ్గొండి సీఐతోపాటు ఆరేళ్ల పాటు వరంగల్ జిల్లాలో పని చేశారు. ఇది ఎన్నికల కమిషన్ సూచించిన నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో ఉంది. .. ఇలా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 21 మంది పోస్టింగ్‌లపై ఫిర్యాదులు ఉన్నాయి. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో ముగ్గురు, ములుగు జిల్లాలో ముగ్గురి పోస్టింగ్‌లు వివాదాస్పదమయ్యాయి. అడుగడుగునా ఉల్లంఘనలు జరిగాయంటూ వెల్లువెత్తిన ఫిర్యాదుల నేపథ్యంలో వీరిపై ఎన్నికల సంఘం ఆరా తీస్తుండటం కలకలం రేపుతోంది. -
రంగనాథ్‌పై బదిలీ వేటు.. వరంగల్ ఇన్చార్జ్ సీపీగా దాసరి మురళీధర్
వరంగల్ క్రైం: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బదిలీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో క్రైం డీసీపీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి దాసరి మురళీధర్‌ను ఇన్చార్జ్ సీపీగా నియమించారు. గురువారం సీపీ రంగనాథ్ నుంచి దాసరి మురళీధర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏవీ రంగనాథ్ వరంగల్ పోలీస్ కమిషనర్‌గా 2022 డిసెంబర్ 3న బాధ్యతలు స్వీకరించారు. మొదటి రోజునుంచే అనేక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు, బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు క్షేత్రస్థాయిలో ఉన్న అనేక సమస్యలను స్వయంగా పరిశీలన చేసి సంబంధిత అధికారులకు పరిష్కార మార్గాలను చూపించారు. తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. భూకబ్జాదారుల గుండెల్లో రైళ్లు.. సామాన్యుల భూములను ఆక్రమించి వ్యాపారం చేసే భూకబ్జాదారుల గుండెల్లో సీపీ రంగనాథ్ రైళ్లు పరిగెత్తించారు. సుమారు 2,500కు పైగా ఫిర్యాదులను బాధితులు, ప్రజలు స్వయంగా సీపీకి అందజేశారు. ఆ ఫిర్యాదులను సీపీ.. సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతోపాటు ఏసీపీ, డీసీపీ, టాస్క్‌ఫోర్స్, ఎస్బీ విభాగాల ద్వారా విచారణ చేయించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. దీంతో భూకబ్జాలకు పాల్పడుతున్న వారు చాలామంది వెనక్కి తగ్గారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో అధికా రులు సమస్యాత్మక విషయాల్లో రెండు వర్గాలను సీపీ దగ్గర ప్రవేశపెట్టడంతో స్వయంగా పరిష్కార మార్గాలను చూపెట్టారు. మొదట్లో చాలామంది ప్రజలు సీపీ ఫొటోలకు పాలాభిషేకాలు నిర్వహించి కొత్త ఒరవడికి నాంది పలికారు. 10 నెలలు.. 24 మందిపై సస్పెన్షన్ వరంగల్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన 10 నెలల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్న 24 మంది పోలీస్ అధికారులపై సీపీ రంగనాఽథ్ సస్పెన్షన్ వేటు వేశారు. భూకబ్జాదారులకు సహకరించి నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్న పోలీస్ అధికారులను హెచ్చరించారు. పద్ధతి మార్చుకోని వారిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కమిషనరేట్‌లో ఏడుగురు ఇన్స్పెక్టర్లు, ఒక ఆర్ఐ, ఏడుగురు సబ్ ఇన్స్పెక్టర్లు, ఒక ఏఎస్సై, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులపై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో పాటు పలువురిని క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఏఆర్‌కు అటాచ్డ్ చేశారు. చిట్‌ఫండ్ యాజమాన్యాలపై కొరడా... రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మోసాలకు పాల్పడిన చిట్‌ఫండ్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. సామాన్యులను మోసం చేసి సకాలంలో చెల్లింపులు చేయకుండా డబ్బులు ఎగ్గొట్టి ఇబ్బందులకు గురిచేసిన చిట్‌ఫండ్ యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. కమిషనరేట్‌లో పలుమార్లు సమావేశాలు నిర్వహించి ప్రతి నెల చిట్టి డబ్బులను చెల్లించేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీని పర్యవేక్షణ కోసం డీసీపీ స్థాయి అధికారిని నియమించారు. సుమారు రూ.200 కోట్లకు పైగా యజామాన్యాల ముక్కుపిండి చెల్లింపులు చేయించారు. ప్రతి శుక్రవారం చిట్స్‌ఫండ్ యాజమాన్యాలు ఎంతెంత చెల్లించాయో వివరాలు తెలిపేలా ప్రత్యేకంగా వ్యవస్థను సిద్ధం చేయించారు. బండి సంజయ్ ఫిర్యాదుతోనేనా? రాష్త్రంలో పలువురు అధికారుల బదిలీ ఎలక్షన్ కమిషన్ చేసినప్పటికి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాఽథ్ బదిలీ వెనక బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తన పాత్ర లేకున్నా అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారనే కోపంతో బండి సంజయ్ సీపీ బదిలీ కోసం కేంద్రంతో పట్టుబట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవల ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో పర్యటించిన సమయంలో బండి సంజయ్.. సీపీ రంగనాథ్‌పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీపీ వెంట మరికొంత మంది అధికారులు..? ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కమిషనరేట్‌లో పనిచేస్తున్న కొంతమంది అధికారులపై కూడా బదిలీ వేటు పడే అవకాశం ఉందని పోలీస్ శాఖలో పలువురు చర్చించుకుంటున్నారు. గతంలో కొంత మంది అధికారులపై కొందరు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఆ అధికారులపై ఈ సమయంలో వేటు పడే అవకాశం ఉందనే సమాచారం. 21 మంది అధికారులపై వచ్చిన అభియోగాలపై సీపీ రంగనాఽథ్ గతంలో ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చారు. పాలనపై ప్రత్యేక ముద్ర వేసిన సీపీ రంగనాఽథ్ బదిలీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిదిలో సంచలనంగా మారింది. -
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బదిలీ
యాదాద్రి: జిల్లా కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వినయ్ కృష్ణారెడ్డి నల్లగొండ జిల్లాకు కూడా కలెక్టర్ పని చేశారు. అయితే ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజులు పాటు రాష్ట్రంలో పర్యటించి సమీక్ష సమావేశాలు నిర్వహించింది. మునుగోడు ఉప ఎన్నికల్లో ధన, మద్యం ప్రవాహం, డబ్బులు పంచలేదని ఓటర్లు ధర్నాలు చేయడం, పోలింగ్ కేంద్రాలకు వెళ్లకపోవడం, కొందరు అధికారుల పనితీరుపై ఆరోపణలు రావడం వంటి విషయాలను ఎత్తి చూపింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అధికారులపై ఫిర్యాదులు రావడాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు స్థానభ్రంశం కలిగించింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డిని కూడా బదిలీ చేసింది. వినయ్ కృష్ణారెడ్డి యాదాద్రి జిల్లా కలెక్టర్‌గా రెండు నెలలకు పైగా పని చేశారు. ఆయన స్థానంలో గురువారం సాయంత్రం 5 గంటల లోగా నూతన కలెక్టర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. -
మాకు ఎన్నాళ్లీ శిక్ష?
సాక్షి, హైదరాబాద్: వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న తమను ఒకేచోటుకు బదిలీ చేయాలంటూ 13 జిల్లాల స్పౌజ్ ఉపాధ్యాయులు పిల్లలతో కలసి సోమవారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన మౌనదీక్ష ఉద్రిక్తతకు దారి తీసింది. దీక్ష చేస్తున్న ఉపాధ్యాయ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఉపాధ్యాయులకు మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. మహిళలని కూడా చూడకుండా బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్లు ఎక్కించడాన్ని ఉపాధ్యాయ దంపతులు తీవ్రంగా ప్రతి ఘటించారు. గాంధీ జయంతి సాక్షిగా ఈ తరహా పోలీసు దౌర్జన్యం సరికాదంటూ నినదించారు. 317 జీవో అమల్లో భాగంగా గతేడాది ఉపాధ్యాయ భార్యాభర్తలను వేర్వేరు జిల్లాలకు బదిలీ చేశారు. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమవడంతో కొన్ని జిల్లాల స్పౌజ్ కేసులను పరిష్కరించారు. కానీ ఇప్పటికీ 13 జిల్లాల స్పౌజ్‌ల బదిలీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వానికి వారు అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. తాము తీవ్ర మనోవేదనతో ఉన్నామని, కిలోమీటర్ల దూరంలో భార్య ఒకచోట, భర్త ఒకచోటపనిచేయడం సమస్యగా మారిందని, పిల్లల ఆలనాపాలన చూసే దిక్కులేకుండా పోయిందని ప్రభుత్వానికి విన్నవించారు. అయినప్పటికీ దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ఎదుట మౌనదీక్షకు దిగారు. మాకెందుకీ అన్యాయం గత జనవరిలో కేవలం 615 స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలు మాత్రమే చేపట్టారు. ఇంకా 1500 మంది బదిలీలకు నోచుకోక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో దీక్ష చేస్తుంటే అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యను సానుభూతిలో పరిష్కరించాలి. – నరేశ్, స్పౌజ్ ఫోరంకో–కన్వీనర్ మానసిక క్షోభకు పరిష్కారం లేదా? గత 22 నెలలుగా ఉపాధ్యాయ దంపతులు బదిలీల్లేక మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈ పరిస్థితికి పరిష్కారం లేదా అనే అనుమానం కలుగుతోంది. పెద్ద మనసుతో వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలి. – వివేక్, స్పౌజ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు -
ఎన్డీఏ సర్కార్‌పై బాంబు పేల్చిన ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)మాజీ డిప్యూటీ గవర్నర్ విరేల్ ఆచార్య సంచలన విషయాలు ప్రకటించారు. నిర్దేశిత గడువు కంటే ముందే ఆరు నెలల పదవీకాలం ఉండగానే 2019లో తన పదవికి రాజీనామా చేసిన ఆచార్య తన పుస్తకంలో కొన్ని విషయాలను తొలిసారి బహిర్గతం చేశారు. ముఖ్యంగా 2018లో కేంద్రం, ఆర్బీఐ మధ్య బహిరంగ ఘర్షణకు దారితీసిన సంఘటనల వివరాలను పంచుకున్నారు. అంతేకాదు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని విషయాలను మూసి తలుపుల వెనుక చర్చించడం కంటే బహిరంగంగా చర్చించడం మేలని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలకు ముందు 2.-3 లక్షలు అడిగిని ఎన్డీఏ సర్కార్ ప్రధానంగా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు ఖర్చు కోసం 2018లో బ్యాలెన్స్ షీట్ నుండి 2-3 లక్షల కోట్ల రూపాయలను ఉపసంహరించుకోవాలని ఎన్‌డిఎ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను (ఆర్బిఐ) తిరస్కరించిందని విరాల్ ఆచార్య వెల్లడించారు. మింట్ నివేదిక ప్రకారం 2020లో పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురించిన క్వెస్ట్ ఫర్ రిస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనే పుస్తకానికి అప్డేట్ ప్రిల్యూడ్ బుక్‌లో దీనికి సంబంధి చాలా విషయాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. రికార్డు లాభాలు బదిలీ గత ప్రభుత్వాల హయాంలో ఆర్బిఐ కి చెందిన నగుదును ప్రభుత్వ ఖాతాకు బదిలీకి సంబంధిచి బ్యూరోక్రసీ అండ్ ప్రభుత్వంలోని క్రియేటివ్ మైండ్స్ రూపొందించిన ప్రణాళిక ప్రకారం ప్రతీ ఏడాది ఆర్బీఐ తన లాభంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి పంచిపెట్టే బదులు, నోట్ల రద్దుకు దారితీసిన మూడేళ్లలో, ప్రభుత్వానికి రికార్డు లాభాలను బదిలీ చేసిందని చార్య చెప్పారు. అలాగే ఆర్బిఐపై ఒత్తిడి తీసుకురావడానికి మరో కారణం డివెస్ట్మెంట్ రాబడులను పెంచడంలో ప్రభుత్వం వైఫల్యం అని పేర్కొన్నారు. అలాగే 2023లో బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ మెరుగుపడటాన్ని ప్రస్తావించిన ఆయన బ్యాడ్ లోన్స్ గుర్తింపు, దిద్దుబాటు చర్యల అమలు లక్ష్యంగా 2015లో రిజర్వ్ బ్యాంక్ ప్రారంభించిన ఆస్తుల నాణ్యత సమీక్ష నిరంతరం అమలుతోనే సాధ్యమైందన్నారు. ఆర్బీఐ సెక్షన్ -7 వివాదం నిధుల బదిలీలో ఆర్బీఐ 80 ఏళ్ల చరిత్రలో సెక్షన్ 7ను సెక్షన్‌ను అమలు చేయడం అనూహ్యమైన చర్య అని ఆర్థిక నిపుణులు భావించారు. ఈ విభేదాలు, ఒత్తిడి నేపథ్యంలోనే ఆప్పటి ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన మూడేళ్ల పదవీకాలం పూర్తి కావడానికి తొమ్మిది నెలల ముందు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఆయన వ్యక్తిగత కారణాలను ఉదహరించినప్పటికీ, సెంట్రల్ బ్యాంక్ స్వయంప్రతిపత్తిపై ప్రభుత్వం ఒత్తిడి క్రమంలోనే పటేల్ రాజీనామా అని అంతా భావించారు. కాగా 2022లో రూ.30,307 కోట్లతో పోలిస్తే FY23లో, సెంట్రల్ బ్యాంక్ ప్రభుత్వానికి రూ. 87,416 కోట్ల డివిడెండ్ చెల్లించింది. .2019లో ఆర్బీఐ అత్యధికంగా రూ.1.76 లక్షల కోట్ల మిగులును ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఆర్బిఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సుకు అనుగుణంగా, ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్, ఎంత మూలధన నిల్వ ఎంత ఉండాలనేది నిర్ణయిస్తారు. -
శ్రీశైలం నూతన ఈవోగా పెద్దిరాజు
సాక్షి, నంద్యాల: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం, సింహాచలం దేవాలయాల ఈవోలు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం కొత్త ఈవోగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పెద్దిరాజు నియామకం అయ్యారు. వివరాల ప్రకారం.. శ్రీశైలం ఈజవో లవన్న బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో శ్రీశైలం కొత్త ఈవోగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పెద్దిరాజు నియామకం అయ్యారు. ఇక, లవన్న.. శ్రీశైలం ఈవోగా రెండేళ్ల కాలం పూర్తి చేసుకున్నారు. అలాగే, సింహాచలం దేవస్థానం ఈవోగా శ్రీనివాసమూర్తి నియామకమయ్యారు. ఇది కూడా చదవండి: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: టీటీడీ చైర్మన్ భూమన -
Mahabubabad: రేఖా నాయక్ అల్డుడి ఆకస్మిక బదిలీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ బదిలీ అయ్యారు. ఆయనను తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎస్పీగా పనిచేస్తున్న చంద్రమోహన్ గుండేటిని నియమిస్తూ సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆకస్మికంగా జరిగిన ఎస్పీ బదిలీపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నాయకులు ఏరికోరి తెచ్చుకున్న ఎస్పీ ఎన్నికల వరకు ఉంటారని అందరూ భావించగా.. ఊహించని విధంగా బదిలీ కావడానికి ‘రేఖా నాయక్ ఎఫెక్ట్’ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ Ajmeera Rekha Nayak ఎస్పీకి స్వయాన బిడ్డను ఇచ్చిన అత్తగారు. ఈసారి ఆమెకు టికెట్ రాకపోగా, ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. రేఖా నాయక్‌పై కోపంతో ఆమె అల్లుడిని ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ మారతానని ప్రకటించిన గంటల్లోనే ఈ ఆదేశాలు వెలువడడం గమనార్హం. -
అత్తమీద కోపం.. అల్లుడిపై ప్రతాపం
సాక్షి, మహబూబాబాద్: జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్‌ను రాష్ట్ర పోలీస్ అకాడమికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో డీజీపీ కార్యాలయంలోని మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్లో ఎస్పీగా పనిచేస్తున్న చంద్రమోహన్‌ను బదిలీపై జిల్లాకు పంపారు. ఈ మేరకు మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆకస్మిక బదిలీపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. 2021 డిసెంబర్ 26న జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు ఏరికోరి తెచ్చుకున్న ఎస్పీ.. ఎన్నికల వరకు ఉంటారని అందరూ భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా 20 నెలల్లో బదిలీ కావడం.. దీని వెనుక ఏం జరిగింది అనేది అటు అధికారులు.. ఇటు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఆకస్మిక బదిలీతో షాక్.. జిల్లా పోలీస్‌బాస్ ఆకస్మిక బదిలీతో ఆశాఖ అధికారులు విస్మయానికి గురయ్యారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు జిల్లా ఎస్పీని బదిలీ చేయలేదు. దీంతో ఆయన ఎన్నికల వరకు ఉంటారని అందరు భావించారు. అయితే కుటుంబ సభ్యుల్లో జరిగిన రాజకీయ పరిణామాలే ఆయన బదిలీకి కారణం అని కొందరు చెబుతుండగా.. ఎస్పీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శాఖ తీసుకున్న నిర్ణయం అని మరికొందరు చెబుతున్నారు. కుటుంబ రాజకీయ పరిణామాలే కారణమైతే ఎస్పీ బదిలీతోనే ఆగిపోతుంది. అలా కాకుంటే ఎస్పీతో పాటు మరికొందరిపై బదిలీ వేటు పడే అవకాశం ఉందని పలువురు సీనియర్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఎస్పీ బదిలీ వార్తతో ఆయనకు అనుకూలంగా ఉండే అధికారులు మాత్రం ఆందోళనగానే ఉన్నట్లు సమాచారం. ఆ కోపమేనా..? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ తన బిడ్డను ఎస్పీ శరత్చంద్ర పవార్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆమెకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వడం లేదు. ఇటీవల విడుదల చేసిన జాబితాలో కూడా ఆమె పేరు లేదు. దీంతో ఆమె మనస్తాపం చెందిగా.. భర్త శ్యాం నాయక్ ఉద్యోగం వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈమేరకు నేడో రేపో రేఖానాయక్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆమె పార్టీ మారకుండా ఉండేందుకు పలువురు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. అయినా చర్చలు ఫలించలేదు. దీంతో రేఖానాయక్‌పై కోపంతో ఆమె అల్లుడు ఎస్పీ శరత్ చంద్రపవార్‌ను ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసినట్లు మానుకోటలో ప్రచారం జరుగుతోంది. -
అధికారి ధిక్కారం..టెండర్ ‘అప్రూవ్’ ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థ అధికారుల్లో అలసత్వం, ధిక్కారం పెరిగిపోతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో కూడా కొందరు అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలోని రైస్‌మిల్లుల వద్ద లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో గ్లోబల్ టెండర్ల ద్వారా బహిరంగ మార్కెట్లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేసేందుకు ఈనెల 21న గ్లోబల్ ఈ– టెండర్ ప్రకటన విడుదల చేసింది. 22వ తేదీ నుంచి ఆన్లైన్లో బిడ్స్ ఆహ్వానించారు. సెపె్టంబర్ 5వ తేదీని బిడ్డింగ్‌కు ఆఖరి తేదీగా నిర్ణయించారు. అయితే టెండర్ ప్రకటన విడుదల చేసినప్పటికీ, వేలానికి సంబంధించిన నిబంధనలేవీ ఆన్లైన్లో పెట్టలేదు. ఈఎంఐ, డిపాజిట్లు, అర్హతలు, ఇతర వేలం నిబంధనలేవీ ఆన్లైన్లో పొందుపరచలేదు. దీంతో బుధవారం సాయంత్రంలోగా టెండర్ వివరాలను అప్లోడ్ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని సంస్థ ఎండీ అనిల్‌కుమార్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అయితే పౌరసరఫరాల సంస్థలో టెండర్లకు సంబంధించి ఆన్లైన్ డిజిటల్ కీ మార్కెటింగ్ సెక్షన్ జీఎం వద్ద ఒకటి, పీడీఎస్ డీజీఎం వద్ద మరొకటి ఉంటుంది. ఈ మేరకు కమిషనర్ ఇద్దరు అధికారులకు స్వయంగా ఫోన్ చేసి, గ్లోబల్ టెండర్లకు సంబంధించిన విధి విధానాలను అప్లోడ్, అప్రూవ్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మార్కెటింగ్ సెక్షన్ జీఎం తన వద్ద ఉన్న డిజిటల్ కీతో అప్లోడ్ చేశారు. కానీ పీడీఎస్ డీజీఎంగా ఉన్న అధికారి, అప్లోడ్ అయిన వివరాలను తన వద్ద ఉన్న కీతో అప్రూవ్ చేయాల్సి ఉండగా, లాగిన్ కావడానికి కూడా ఒప్పుకోలేదని సమాచారం. స్వయంగా సంస్థ ఎండీ ఫోన్ చేసి డిజిటల్ కీతో టెండర్ ప్రక్రియను అప్రూవ్ చేయాలని ఆదేశించినప్పటికీ, ఆ అధికారి ససేమిరా అన్నట్లు సమాచారం. డిజిటల్ కీ ఇవ్వడానికి కూడా నిరాకరించిన ఆ అధికారి బుధవారం రాత్రి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు తెలిసింది. దాంతో బుధవారం రూ. వేల కోట్ల విలువైన టెండర్లకు సంబంధించిన విధి విధానాలను అప్లోడ్ చేయలేకపోయారు. గురువారం ఈ విషయం తెలుసుకున్న పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు అధికారిపై చర్యలకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన పౌరసరఫరాల సంస్థ అధికారులు.. పీడీఎస్ డీజీఎం పేరుపై ఉన్న డిజిటల్ కీ స్థానంలో మరో కీని రూపొందించి వివరాలను అప్లోడ్ చేశారు. బదిలీ చేశారనే కోపంతో..? పీడీఎస్ డీజీఎంగా ఉన్న ఆ అధికారిని ఇటీవలే హెడ్ ఆఫీస్ నుంచి వికారాబాద్‌కు బదిలీ చేశారు. అయితే అక్కడ జాయిన్ కాకుండా తిరిగి యథాస్థానంలో కొనసాగేందుకు పైరవీ చేసుకున్నా, ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఆయన 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలానికి సంబంధించిన టెండర్ విధి విధానాలను అప్రూవ్ చేసే విషయంలో మొండిగా వ్యవహరించడం సంస్థలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ఆ అధికారిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
TS Election 2023: పోలీస్‌లకు ఝలక్..! ఎన్నికల సంఘం ఆదేశం..!
వరంగల్: పోలీస్‌శాఖలో బదిలీలు, పోస్టింగ్‌లపై రచ్చ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో ఎన్నికల కమిషన్ విధానాన్ని అమలు చేయకపోవడంపై అందిన ఫిర్యాదులపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) స్పందించింది. వరంగల్, కరీంనగర్, రామగుండం పోలీసు కమిషనరేట్లతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల జిల్లాల్లో 51మంది పోలీసు అధికారుల పోస్టింగ్‌ల్లో కమిషన్ నిబంధనలు పాటించలేదని పేర్కొన్నారు. అత్యధికంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో 21 మందికి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ముగ్గురు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు, పోస్టింగ్‌లు ఇచ్చారని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ కోణం, వాస్తవాలను నివేదిక ద్వారా అందజేయాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి అవినాష్ కుమార్ తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారికి లేఖ నం. 434/1/టీఈఎల్/ ఎస్ఓయూ 3/ 2023 ద్వారా రాశారు. అడుగడుగునా ఉల్లంఘనలే...? ఫిర్యాదుల పరంపరపై ఆరా... ఎన్నికల నేపథ్యంలో పారదర్శకంగా బదిలీలు, పోస్టింగ్‌లు ఇవ్వాలని లెటర్ నంబర్ 437/6/1/ఐఎన్ఎస్టీ/ఈసీఐ/ఎఫ్యుఎన్సీటీ/ఎంసీసీ/2023 ద్వారా తేదీ 02.06.2023న కమిషన్ సూచించింది. జిల్లాలు, కమిషనరేట్లలో పోలీస్ అధికారులకు సంబంధించి పలు మార్గదర్శకాలను పేర్కొంది. అందుకు విరుద్ధంగా గత నాలుగేళ్లలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అనేక మందికి తిరిగి జిల్లాలోనే పోస్టింగ్‌లు ఇచ్చారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ తరహా పోస్టింగ్‌లకు సంబంధించి 51 మంది పేర్లతోపాటు వారు ఎక్కడెక్కడ, ఎంతకాలం పని చేశారన్న వివరాలను ఫిర్యాదులో చేర్చారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 21 మంది పో స్టింగ్లపై ఫిర్యాదులు ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ముగ్గురు, ములుగు జిల్లాలో ముగ్గురి పోస్టింగ్‌లు వివాదాస్పదం అయ్యాయి. ఈ పోస్టింగ్‌ల పైనే వివాదం.. నాలుగేళ్లలో మూడేళ్లు పూర్తి చేసిన కొందరికి అదే ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారని ఫిర్యాదులున్నాయి. చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ కార్యదర్శి రాసిన లేఖలో పేర్కొన్న ఎన్నికల కోడ్ వర్తించే అధికారుల జాబితా ఇలా ఉంది. ► జూలై 15న మామునూరు ఏసీపీగా నియమితులైన సి.సతీష్.. దుగ్గొండి సీఐతోపాటు ఆరేళ్ల పాటు వరంగల్ జిల్లాలో పనిచేశారు. ఇది కమిషన్ నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలానికి చెందిన వారు కూడా ఉన్నారు. ► ఎన్నికల కమిషన్ సూచనల మేరకు జరిగిన బదిలీల్లో పరకాల ఏసీపీగా పోస్టింగ్ తీసుకున్న కిషోర్ ఏడేళ్లుగా ఇదే జిల్లాలో పనిచేస్తున్నారు. ► 2014 ఎన్నికల్లో పని చేసిన డేవిడ్‌రాజ్ కాజీపేట ఏసీపీగా నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జిల్లాలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన ఆయన కేయూసీ తదితర పీఎస్‌లలో పని చేశారు. ► గత ఎనిమిదేళ్లుగా వరంగల్ జిల్లాలో పనిచేసి ఎస్బీ ఏసీపీ నుంచి నర్సంపేటకు ఏసీపీగా బదిలీ అయిన పి.తిరుమల్ ఎనిమిదేళ్లు వరంగల్ కమిషనరేట్ పరిధిలోనే పని చేశారు. ► ఇంతేజార్గంజ్ సీఐ నుంచి శాయంపేట ఇన్స్పెక్టర్గా బదిలీ అయిన మల్లేశ్ ఆయన సర్వీసు కాలమంతా వరంగల్ జిల్లా, కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించారు. జనగామ, నర్మెటలలోనూ సీఐగా పనిచేశారు. ► సీసీఎస్, టాస్క్‌ఫోర్స్‌లలో ఇన్స్పెక్టర్గా పనిచేసిన కె.శ్రీనివాస్ ఐటీకోర్.. టాస్క్‌ఫోర్స్‌లకు మారగా.. ఎనిమిది సంవత్సరాలుగా వరంగల్ (కమిషనరేట్) జిల్లాలోనే పనిచేశారు. ► హనుమకొండ జిల్లాకు చెందిన పలువురు కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్, డీసీఆర్బీ, వెకెన్సీ రిజర్వు (వీఆర్)లలో పోస్టింగ్‌లు కొ ట్టారు. ఏసీపీ విజయ్‌కుమార్, సీఐలు రవికుమార్, దేవేందర్, కె.కుమారస్వామి, ఓ.రమేష్‌లు పై పోస్టింగ్‌లలో ఉన్నారు. సుబేదారి ఎస్హెచ్ఓ షుకూరుది వరంగల్ జిల్లా. ► ధర్మసాగర్ ఎస్హెచ్ఓగా నియమితులైన శ్రీధర్ తొమ్మిదేళ్లుగా వరంగల్ జిల్లా (పోలీస్ కమిషనరేట్)లో పని చేస్తున్నారు. హసన్‌పర్తి ఎస్హెచ్ఓగా, ఎస్బీ ఇన్స్పెక్టర్గా పని చేసిన ఆయన ధర్మసాగర్ ఎస్హెచ్ఓగా నియమితులయ్యారు. ► వరంగల్ జిల్లాలోనే తన సర్వీసు కాలమంతా పని చేసిన సీఐ సుజాతను కాజీపేట ట్రాఫిక్‌గా నియమించడం వివాదాస్పదమైంది. ఆరేళ్లుగా జిల్లాలోనే పనిచేస్తున్న మరో మహిళా అధికారిణి సువర్ణను కూడా రూరల్ మహిళ పోలీసుస్టేషన్ సీఐగా నియమించారు. ► ఆరేళ్లుగా జిల్లాలోనే పని చేస్తున్న రామకృష్ణ సీఐని గీసుకొండ ఇన్స్పెక్టర్గా నియమించారు. ఐదేళ్లుగా అర్బన్ మహిళ పోలీసుస్టేషన్ సీఐగా ఉస్మాన్ షరీప్ పనిచేస్తున్నారు. ► మహబూబాబాద్ జిల్లాలో ఏడు సంవత్సరాలు పనిచేసిన ఎస్ఐ ఎస్కే యాసిన్, నాలుగేళ్లు పూర్తయిన శ్రీనునాయక్‌ను ఆదే జిల్లాలో కొనసాగిస్తున్నారు. క్రిమినల్ కేసులో భాగస్వామి అని ఆరోపణలున్న రాణాప్రతాప్‌ను గూడూరు ఎస్ఐగా కూడా నియమించారు. ► ములుగు జిల్లా డీఎస్‌బీగా ఉన్న సట్ల కిరణ్, ఆర్ఐ కిరణ్, సీసీఎస్‌లో ఉన్న శివకుమార్‌లు దీర్ఘకాలికంగా అదే జిల్లాలో పనిచేసినా.. తిరిగి అక్కడే నియమించారన్న చర్చ ఉంది. -
పరువు నష్టం కేసులో రాహుల్ శిక్షపై స్టేకు నిరాకరణ.. జడ్జి బదిలీ
న్యూఢిల్లీ: ‘మోదీ ఇంటి పేరు’ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి జైలు శిక్షపై స్టే విధించేందుకు నిరాకరించిన గుజరాత్ హైకోర్టు జడ్జిపై బదిలీపై వెళ్లనున్నారు. పై పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా వెళ్లనున్నారు. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ జాబితాలో ఆయన కూడా ఉన్నారు. మెరుగైన న్యాయ నిర్వహణ కోసం జస్టిస్ ప్రచక్ను పాట్నా హైకోర్టుకు పంపుతున్నట్లు కొలీజియం తెలిపింది. గుజరాత్ హైకోర్టు జడ్జి అయిన హేమంత్ ఎమ్ ప్రచక్.. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ జూలైలో 123 పేజీల తీర్పు వెల్లడించారు.అంతేగాక 2002 గుజరాత్ అల్లర్ల కేసులో నిందితురాలిగా ఉన్న మాజీ బీజేపీ మంత్రి మాయా కొద్నానీ తరుపున వాదించిన న్యాయవాదులలో జస్టిస్ ప్రచ్చక్ ఒకరిగా గతంలో ఉన్నారు. జస్టిస్ ప్రచక్తోపాటు 2002 గోద్రా అల్లర్లకు సంబంధించి హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ బెయిల్ కేసు విచారణ నుంచి తప్పుకున్న గుజరాత్ హైకోర్టు జడ్జి మరో జస్టిస్ సమీర్ దవే.. రాహుల్ గాంధీ జైలు శిక్షను రద్దు చేయాలనే పిటిషన్‌పై విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ గీతా గోపి కూడా ఉన్నారు.వీరితోపాటు పంజాబ్, హర్యానా హైకోర్టుకు చెందిన నలుగురు న్యాయమూర్తులు, అలహాబాద్ హైకోర్టు నుంచి ఒకరు కూడా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన తొమ్మిది పేర్ల జాబితాలో ఉన్నారు. సుప్రీంకోర్టు సీజే డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన కొలీజియం ఈనెల 3న సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. మెరుగైన న్యాయం అందించేందుకే బదిలీలు సిఫార్సు చేస్తున్నట్లు కొలీజియం గురువారం పేర్కొంది. చదవండి: మణిపూర్ అంశం.. మోదీపై అమెరికా సింగర్ మిల్ బెన్ కీలక వ్యాఖ్యలు కాగా గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన జస్టిస్ ప్రచక్.. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో గుజరాత్ ప్రభుత్వంలో అసిస్టెంట్ ప్లీడర్‌గా పనిచేశారు. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2015లో గుజరాత్ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. 2019 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఇక 2021లో గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మరోవైపు అత్యాచారానికి గురైన మైనర్ బాలిక గర్బం దాల్చగా.. అబార్షన్‌కు అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ సమీర్ దవే ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మనుస్మృతి ప్రకారం చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని, 17 ఏళ్లు రాకముందే పిల్లల్ని కనడం ఒకప్పుడు సహజమేనని వ్యాఖ్యానించారు. ‘కావాలంటే మీ అమ్మ.. అమ్మమ్మను అడగండి.. అప్పట్లో వివాహానికి గరిష్ఠ వయసు 14, 15 ఏళ్లే.. 17 ఏళ్లు రాక మునుపే తన తొలి బిడ్డకు జన్మనిచ్చేవారు.. అబ్బాయిల కంటే అమ్మాయిలు ముందుగానే పెద్దవారు అవుతారు.. మీరు మనుస్మృతి చదవలేదేమో.. ఓసారి చదవండి’ జస్టిస్ దవే అన్నారు. -
దేశంలో 24 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ
ఢిల్లీ : దేశంలో 24 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఒకేసారి ఈ స్థాయిలో న్యాయమూర్తులను బదిలీ చేయడం బహుశా ఇదే అత్యధికం. ఏపీ, తెలంగాణ, పంజాబ్, గుజరాత్, అలహాబాద్, పట్నాతో సహా పలు హెకోర్టుల్లో పని చేస్తున్న జడ్జీలను బదిలీలను ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ మేరకు సీజేఐ నేతృత్వంలోని కొలీజియం ప్రతిపాదించింది. న్యాయమూర్తుల బదిలీ అంశం కొన్ని రోజులుగా కొలీజియం ప్రతిపాదిత ప్రముఖ అంశాల్లో ఒకటిగా ఉంది. బదిలీకి సంబంధించిన లేఖలు కూడా ఆయా న్యాయమూర్తులకు ఇప్పటికే పంపినట్లు తెలుస్తోంది. బదిలీ అంశాన్ని ఏ న్యాయమూర్తైనా పునపరిశీలించాలని కోరితే.. తుది నిర్ణయం కొలీజియందే ఉంటుంది. సీజేఐ ప్రతిపాదించిన బదిలీ పత్రాలను సంబంధిత కేంద్ర మంత్రి ప్రధానమంత్రికి సమర్పిస్తారు. ప్రధాని ఆయా ప్రతిపాదనలను రాష్ట్రపతికి సమర్పిస్తారు. ఇదీ చదవండి: Anti Sikh Riots Case: కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్‌పై హత్యానేరం అభియోగాలు -
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఐఏఎస్ అధికారులతో పాటు జాయింట్ కలెక్టర్లను, ఇతర ముఖ్య విభాగాల్లోనూ అధికారులను బదిలీ చేయడం జరిగింది. అన్ని విభాగాల్లో కలిపి మొత్తంగా ఏడుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ గా శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, హార్టికల్చర్ మరియు సెరికల్చర్ డైరక్టర్ గా గంధం చంద్రుడు, విలేజ్ వార్డు సెక్రటేరియట్ అదనపు డైరక్టర్ గా ధ్యానచంద్ర లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కూడా చదవండి: ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ప్రమాణం -
భారీగా ఏసీపీ, ఇన్స్పెక్టర్ల ట్రాన్స్ఫర్.. బదిలీలకు ఈనెల 31 టార్గెట్..
వరంగల్: పోలీసుశాఖలో బదిలీలు భారీగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి అనధికారికంగా ప్రారంభమైంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీసీపీ స్థాయి అధికారి నుంచి సబ్ ఇన్స్పెక్టర్ అధికారి వరకు ఎన్నికల ఎఫెక్ట్‌లో భాగంగా బదిలీలు జరుగుతున్నాయి. జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనరేట్ల కమిషనర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమించారు. దీంతో ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. దీనికి అనుగుణంగా ఎన్నికల సమయంలో కీలకపాత్ర పోషించే పోలీస్ శాఖలో భారీగా మార్పులు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారుల ఎంపిక విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మార్గ నిర్దేశం చేసినట్లు సమాచారం. దానికి అనుగుణంగా ఎన్నికల నిబంధనలు వర్తించే పోలీస్ అధికారులను ఆయా నియోజకవర్గాలకు సాగనంపుతున్నారు. దీంతోపాటు ఎన్నికల సమయంలో సామాజిక సమీకరణాలతో పాటు ఏమేరకు ఎన్నికల విధుల్లో ఉపయోగపడుతారనే కోణంలో క్షుణంగా పరిశీలించిన తర్వాతనే పోస్టింగ్‌లకు సిఫార్సు చేస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల బదిలీ.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేసే ఇద్దరు డీసీపీలు పుల్లా కరుణాకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీగా, కర్రి పుష్పారెడ్డి తెలంగాణ కమాండ్ కంట్రోల్ విభాగం ఎస్పీగా బదిలీ అయ్యారు. వీరితో పాటు పరకాల, కాజీపేట, మామునూరు, క్రైం, ఏసీపీలు బదిలీ అయ్యారు. ఇన్స్పెక్టర్లు.. పరకాల, గీసుకొండతో పాటు కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. దీంతోపాటు చాలా కాలంగా ఖాళీగా ఉన్న హసన్‌పర్తి, కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లకు ఖమ్మం, కొత్తగూడెం నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్‌లు కేటాయించారు. కోడ్ ఎఫెక్ట్‌లో భాగంగా సుబేదారిలోని రూరల్ మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్, భరోసా ఇన్స్పెక్టర్లను బదిలీ చేశారు. గత నాలుగైదు రోజుల్లో వరుసగా సబ్ ఇన్స్పెక్టర్లను వివిధ పోలీస్స్టేషన్లకు బదిలీ చేస్తూ.. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనా«థ్ ఉత్తర్వులు జారీ చేశారు. నేతల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు! ఎన్నికల ముందు ప్రశాంతత కోసం కొంత మంది అధికారులు లూపులైన్ల కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా.. మరికొంత మంది ఎన్నికల కోడ్ వర్తించని చాలామంది అధికారులు సిఫారసు లేఖల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈసమయంలో నాయకులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఏమేరకు ఉపయోగపడతారని వారి అనుచర గణంతో లెక్కలు వేసుకుంటున్నారు. అధికారి పనితీరుతో పాటు సామాజిక అంశాన్ని ప్రధానంగా చూస్తున్నారు. ఒక్కో పోస్టింగ్ కోసం పదుల సంఖ్యలో అధికారులు క్యూ కట్టడం విశేషం. ఏసీపీ పోస్టుల కోసం కూడా అధికారులు ఒక్కో ప్రజాప్రతినిధిని పలుమార్లు కలుస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న కొంత మంది అధికారులు వారి పీరియడ్ పూర్తి కాకపోయినప్పటికీ పోస్టింగ్ ఉంటుందో? ఉడుతుందో.. తెలియని అయోమయ స్థితిలో ఉద్యోగం నెట్టుకొస్తున్నారు. వరంగల్ సబ్ డివిజన్లో మిల్స్‌కాలనీ, ఇంతేజార్గంజ్ వర్ధన్నపేట, ధర్మసాగర్, కమలాపూర్, నర్సంపేట, రఘునా«థపల్లి, నర్సంపేట రూరల్, నర్మెట్ట పోలీస్స్టేషన్లకు కొత్త అధికారులు రానున్నారు. ఈపోస్టింగ్ల కోసం ఇప్పటికే చాలా మంది అధికారులు ప్రజాప్రతినిధుల నుంచి లెటర్లు పోలీస్‌బాస్‌కు అందించినట్లు సమాచారం. ఇందులో కొంత మందికి ఎలక్షన్ ఎఫెక్ట్ ఉండగా.. మరికొంత మంది ప్రవర్తన సరిగ్గా లేక మార్పు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అరెస్ట్‌లకు రంగం సిద్ధం! పోలీసు అధికారుల లెక్కల ప్రకారం వివిధ కేసుల్లో ఇప్పటి వరకు అరెస్టు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న సుమారు 180 మంది నిందితుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. వీరిని అరెస్ట్ చేయడానికి ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ఎస్హెచ్ఓలకు నిర్ధిష్టమైన ఆదేశాలు అందాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపనున్నారు. దీంతో పాటు ఆయా పోలింగ్స్టేషన్ల వారీగా మాజీలతో పాటు గతంలో జరిగిన ఎన్నికల్లో ఇబ్బదులు సృష్టించిన వ్యక్తుల జాబితాలు కూడా ఆయా పోలీస్స్టేషన్లలో సిద్ధంగా ఉన్నాయి. తుపాకుల జాబితా రెడీ.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తుపాకుల లైసెన్స్‌లు 230 ఉన్నాయి. ప్రస్తుతం తుపాకుల లైసెన్స్ కలిగిన వ్యక్తులు వివిధ గొడవల్లో చిక్కుకున్న, కేసులు నమోదైన వారి లైసెన్స్‌లు రద్దు చేశారు. దీంతో కమిషనరేట్ పరిధిలో 180 వరకు లైసెన్స్ తుపాకులున్నాయి. ఎన్నికల ముందు వీటిని ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తుపాకుల లెక్కలను సైతం పోలీసు అధికారులు సిద్ధం చేసి ఉంచారు. ఈనెల 31 వరకు ప్రక్రియ పూర్తి చేస్తాం.. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఈనెల 31వ తేదీ వరకు ఎన్నికల బదిలీ ప్రక్రియను పూర్తి చేస్తాం. సొంత జిల్లా, సొంత నియోజవర్గం ఉన్న అధికారులతో పాటు చివరి నాలుగేళ్లలో మూడు సంవత్సరాలు ఒకే దగ్గర పనిచేసే అధికారులను నిబంధనల ప్రకారం బదిలీ చేస్తాం. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పని చేస్తున్న అధికారులను రెవెన్యూ జిల్లాను ప్రతిపాదికన బదిలీలు చేపడుతున్నాం. ఏసీబీ, క్రిమినల్ కేసులు ఉన్న అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతాం. – ఏవీ. రంగన్నాథ్, వరంగల్ పోలీస్ కమిషనర్ -
టీఆర్‌ఈఐఆర్‌బీకి కొత్త చైర్మన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ)కు కొత్త చైర్మన్ ఎంపిక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగ వంతం చేసింది. ఇప్పటివరకు చైర్మన్‌గా వ్యవహరించిన రొనాల్డ్ రోస్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించడంతో చైర్మన్ కుర్చీ ఖాళీ అయింది. ప్రస్తుతం గురుకుల నియామకాల బోర్డు పరిధిలో భారీగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు 9 వేల ఉద్యో గాల భర్తీకి వివిధ ప్రకటనలు జారీ చేసిన గురుకుల బోర్డు... వచ్చే నెల నుంచి అర్హత పరీక్షలను నిర్వ హించేందుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో బోర్డు చైర్మన్ బదిలీ కావడంతో ఆ స్థానాన్ని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే బోర్డు చైర్మన్‌కు సంబంధించి సొసైటీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలి స్తోంది. గత నాలుగు రోజులుగా వర్షాల నేపథ్యంలో నిర్ణయం కాస్త ఆలస్యం కాగా... ఒకట్రెండు రో జుల్లో ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. పెద్ద సొసైటీ... సీనియర్ కార్యదర్శికే పగ్గం... టీఆర్‌ఈఐఆర్‌బీ చైర్మన్ విషయంలో ప్రత్యేక నిబంధనలున్నాయి. కేవలం గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ నియామకాల కోసం తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు 2018లో ఏర్పా టైంది. ప్రస్తుతం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గిరి జన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీలున్నాయి. ఈ ఐదు సొసైటీల్లోని కొలువుల భర్తీ గురుకుల బోర్డు నిర్వహిస్తోంది. ఈ బోర్డుకు చైర్మన్‌గా అత్యధిక పాఠశాలలున్న సొసైటీ కార్య దర్శి, అదేవిధంగా సొసైటీ కార్యదర్శుల్లో సీనియ ర్కు ఈ బాధ్యత అప్పగించాలనే నిబంధన ఉంది. ఇప్పటివరకు బోర్డు చైర్మన్‌గా మాజీ ఐపీఎస్ అధి కారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఆ తర్వాత రొనాల్డ్ రోస్ వ్యవహరించారు. ప్రస్తుతమున్న వారిలో ఒక కార్యదర్శికి బోర్డు చైర్మన్ బాధ్యత అప్పగించాలి. ఇప్పుడున్న కార్యదర్శుల్లో ఇద్దరు సివిల్ సర్వెంట్లు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఇ.నవీన్ నికోలస్ కొనసాగుతుండగా మైనారిటీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా షఫీయుల్లా ఉన్నారు. వారిద్దరిలో ఒకరు బోర్డు చైర్మన్ కానున్నారు. అయితే ఇద్దరిలో ఒకరు ఐఏఎస్ కాగా మరొకరు ఐఎఫ్ఎస్ అధికారి. ఐఎఫ్ఎస్ అధికారిగా ఉన్న షఫీ యుల్లా దాదాపు 8 ఏళ్లుగా కార్యదర్శిగా కొనసాగు తున్నారు. ఐఏఎస్ అధికారి నవీన్ నికోలస్ గతంలో ఎస్టీ గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా, గురుకుల నియామకాల బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, కన్వీనర్‌గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఇరువురి పని చరిత్రను పరిశీలించి ఒకరికి ప్రభుత్వం చైర్మన్ బాధ్యత అప్పగించనుంది. వచ్చే వారంలో చైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
మా డాక్టర్.. మాకు కావాలి!
ఆదిలాబాద్: జైనూర్ మండలంలోని ఉషెగాం ప్రాథమి ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు రాజును అక్రమంగా బదిలీ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం గిరిజనులు అందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఆర్మీలో విధులు నిర్వహించి గతేడాది నుంచి ఉషెగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు రాజును అక్రమంగా లింగాపూ ర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ చేశారని ఆరోపించారు. మా డాక్టర్ మాకు కావాలని, లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్‌రావు సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఐదు రోజుల్లో రీపోస్టింగ్ ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినా జిల్లా వైద్యశాఖ కార్యాలయంలోని కిందిస్థాయి అధికారులు అక్రమంగా బదిలీ చేస్తూ వైద్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. లింగాపూర్‌లో పనిచేస్తున్న వైద్యుడిని కాగజ్‌నగర్ ప్రాంతానికి బదిలీ చేసి నిస్వార్థంగా పనిచేస్తున్న డాక్టర్ రాజును అక్రమంగా ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. కలెక్టర్ చొరవ తీసుకుని అక్రమ బదిలీని నిలిపి వేయాలని, లేకుంటే కలెక్టరెట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్, యూత్ పాల్గొన్నారు. -
తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్, డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్‌గా కమలాసన్‌రెడ్డి, హోంగార్డు డీఐజీగా అంబారి కిషోర్, మేడ్చల్ డీసీపీగా శబరీస్, పర్సనల్ అడిషనల్ డీజీగా సౌమ్యామిశ్రా బదిలీ అయ్యారు. -
ఇదేందయ్యా ఇది! ఎస్సై చనిపోయి 35 రోజులు.. ఇప్పుడు బదిలీ ఉత్తర్వులు
దుండిగల్: చనిపోయి 35 రోజులైన ఓ ఎస్సైని మరో పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయడం విడ్డూరంగా ఉంది. దుండిగల్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న బి.ప్రభాకర్‌రెడ్డి జూన్ 8న గుండెపోటుతో మృతి చెందారు. చనిపోయి నెల రోజులు దాటింది. కాగా.. సైబరాబాద్ పరిధిలో 83 మంది సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ గురు వారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో సీరియల్ నంబరు 26లో ప్రభాకర్‌రెడ్డిని జినోమి వ్యాలీ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయడం గమనార్హం. సైబరాబాద్ పోలీసు అధికారుల నిర్లక్ష్యం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగి.. ప్రభాకర్‌రెడ్డి పేరును జాబితాలోంచి తొలగించి మరోసారి ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. -
ఏపీలో భారీగా టీచర్ల బదిలీలు
సాక్షి, విజయవాడ: ఏపీలో భారీగా టీచర్ల బదిలీలు చేపట్టింది విద్యాశాఖ. 56, 829 మంది టీచర్లను బదిలీ చేస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో టీచర్ల బదిలీలు చేపట్టింది. ఉద్యోగుల సీనియారిటీ, మెరిట్ ఆధారంగా టీచర్ల బదిలీల నిర్వహణ చేపట్టింది. ఉమ్మడి 13 జిల్లాల్లోనూ బదిలీ ప్రక్రియ షురూ చేసింది ఏపీ విద్యాశాఖ. -
బదిలీలకు 15,526 మంది ‘సచివాలయాల’ ఉద్యోగులు దరఖాస్తు
సాక్షి, అమరావతి: బదిలీల కోసం గ్రామ, వార్డు సచివాయాల ఉద్యోగులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేశారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జరుగుతున్న ఈ బదిలీలకు సొంత జిల్లాల్లోనే మరో స్థానానికి బదిలో కోరుతూ 13,105 మంది, ఒక జిల్లా నుంచి వేరొక జిల్లాకు బదిలీ కోసం మరో 2,421 మంది దరఖాస్తు చేసుకున్నట్టు గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో ఒకే విడతలో 1.34 లక్షల గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం తెలిసిందే. వీరికి ప్రభుత్వం ఈ ఏడాది బదిలీలకు అవకాశం కల్పించింది. బదిలీలకు ఈ నెల 3వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా పరిధిలో, అంతర్ జిల్లాల బదిలీలకు కలిపి మొత్తం 15,526 మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం దరఖాస్తుల పరిశీలన చేపట్టారు. మంగళవారం రాత్రికల్లా జిల్లాల వారీగా, వివిధ కేటగిరీ పోస్టుల ప్రకారం బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారికి మెరిట్ ర్యాంకులు ఇస్తామని గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు వెల్లడించారు. బదిలీలకు అర్హత ఉన్న వారికి 8, 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి వారు కోరుకున్న మేరకు కేటాయించే సచివాలయాల వివరాలతో ప్రొసీడింగ్స్ జారీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల్లోనే అత్యధికంగా కర్నూలు జిల్లా నుంచి 1,581 మంది బదిలీ కోరుతూ దరఖాస్తు చేశారు. ప్రత్యేకించి ఒక జిల్లా నుంచి వేరొక జిల్లాకు అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 233 మంది దరఖాస్తు చేసుకోగా, ఆ తర్వాత గుంటూరు జిల్లా నుంచి 232 మంది దరఖాస్తు చేసినట్టు అధికారులు వివరించారు. అత్యధికంగా డిజిటల్ అసిస్టెంట్లు 1,976 మంది బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. ఒక జిల్లా నుంచి వేరొక జిల్లాకు బదిలీ కోరుతూ అత్యధికంగా మహిళా పోలీసులు 389 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఇంజనీరింగ్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు ఎక్కువ మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. చదవండి: Fact Check : పేదల ఇళ్లపై పిచ్చి రాతలు.. బాబు కొంప కొల్లేరవుతుందనే! -
కేంద్రానికి ఆర్బీఐ రూ. 87 వేల కోట్ల డివిడెండ్ .. గతేడాది కంటే ట్రిపుల్
ముంబై: గత ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ. 87,416 కోట్ల మొత్తాన్ని డివిడెండ్‌గా చెల్లించే ప్రతిపాదనకు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన దానితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు. 2021–22లో డివిడెండ్ కింద ఆర్బీఐ రూ. 30,307 కోట్లు చెల్లించింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సారథ్యంలో శుక్రవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 602వ సమావేశంలో డివిడెండ్‌పై నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. బోర్డు సమావేశంలో దేశీ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను, సవాళ్లను కూడా సమీక్షించినట్లు పేర్కొంది. 2022–23లో ఆర్బీఐ పనితీరును చర్చించి, వార్షిక నివేదికను ఆమోదించారు. -
ఏపీలో పలువురు అడిషనల్ ఎస్పీల బదిలీ
సాక్షి, విజయవాడ: ఏపీలో పలువరు అడిషనల్ ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 37 మంది అడిషనల్ ఎస్పీలను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. వీరిలో 18 మందికి పదోన్నతులు లభించాయి. -
గూగుల్ పే 88 వేల క్యాష్ బ్యాక్...
-
ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు
-
రూ.35,000 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎన్బీ) ఫిబ్రవరి 2023 నాటికి గడచిన 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆపరేట్ చేయని దాదాపు రూ.35,012 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కి బదిలీ చేసినట్లు ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ పార్లమెంటుకు తెలియజేశారు. ఇవి దాదాపు రూ.10.24 కోట్ల అకౌంట్లకు సంబంధించినవని ఆయన వెల్లడించారు. బదలాయింపులకు సంబంధించి తొలి స్థానాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.8,086 కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ.5,340 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ.4,558 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.3,904 కోట్లు) ఉన్నాయి. రెండు సంవత్సరాలకుపైగా నిర్వహణలో లేని ఖాతాలకు సంబంధించి ఖాతాదారులు/చట్టబద్ధమైన వారసుల ఆచూకీని కనుగొనడం కోసం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించే అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకులకు సూచించినట్లు మంత్రి వెల్లడించారు. -
తెలంగాణ: పోలీసు అధికారుల బదిలీకి రాజకీయానికి లింకేంటీ?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పోలీసుల బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరో ఐదారు నెలల్లో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరం జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు పూర్తిచేసింది. ఇక తరువాత స్థాయిలో ఉన్న ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సబ్– ఇన్స్పెక్టర్ల స్థాయి అధికారుల బదిలీలపై కొంతకాలంగా హోంశాఖ కసరత్తు చేస్తోంది. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ కమిషనరేట్, రామగుండం కమిషనరేట్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో కిందిస్థాయిలో ఎస్సైల బదిలీలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇక కీలకమైన సీఐ, ఏసీపీల బదిలీల విషయంలో ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎవరిని ఎక్కడ నియమించాలన్న విషయంలో ఇటు ఉన్నతాధికారులు, అటు హోంశాఖ పకడ్బందీగా ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం అధికారుల ట్రాక్ రికార్డుతోపాటు, సమర్ధతపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అమ్మో..! ఆ నియోజకవర్గమా? ఉమ్మడి జిల్లాలో మూడు జిల్లాల్లో విస్తరించిన ఓ నియోజకవర్గం పేరు చెబితేనే.. పోలీసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇక్కడ విధులు నిర్వహించాలంటే సిఫారసు లేఖలు తప్పనిసరి. వాటితో విధుల్లో చేరిన పోలీసులను ఇప్పటికీ సిఫారసు లేఖలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు 10 నెలలు డ్యూటీ చేసిన అనంతరం మరో అధికారికి ఆ స్థానంలో లేఖలు ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో ఇప్పటికే పలువురు ఎస్సై, సీఐలు చేతులు కాల్చుకున్నారు. తాజాగా కూడా ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని సమాచారం. ఇటీవల కూడా జరిగిన బదిలీల్లోనూ ఇలాగే తమకు అన్యాయం జరిగిందని కొందరు, జరగనుందని మరికొందరు పోలీసులు బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఇంటలిజెన్స్ విభాగం ఇప్పటికే సీఎం కార్యాలయానికి సైతం చేరవేసిందని సమాచారం. అందుకే.. ఆ నియోజకవర్గం పేరు చెబితేనే.. పోలీసులు బెంబేలెత్తిపోతున్నారు. మూడేళ్ల నిబంధన కీలకం..! క్రితంసారి జరిగినట్లుగా ఈసారి అసెంబ్లీ ఎన్నికలు వన్‌సైడ్‌గా జరిగే అవకాశాలు చాలా తక్కువ. అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీల నుంచి మునుపటి కంటే పోటీ అధికంగా ఉండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఎన్నికలలో సున్నితమైన, కీలకమైన నియోజకవర్గాల్లో ప్రతిభావంతులైన అధికారులకు పోస్టింగులు ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నియామకాన్ని రద్దు చేస్తూ.. కేంద్రం ఆయన్ని ఏపీ కేటాయించింది. దీంతో ప్రభుత్వం డీజీపీ విషయంలోనూ ఆచితూచి వ్యవహరించి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలే అప్పగించింది. ట్రాన్స్ ఫర్స్ లో పాలిట్రిక్స్ ప్రస్తుతం కేంద్రం–రాష్ట్రం మధ్య పరస్పర రాజకీయ ఆధితప్య పోరు తీవ్రమైన నేపథ్యంలో పోస్టింగుల విషయంలో ఎక్కడా సాంకేతిక పరమైన లోపాలు, పొరబాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే.. ఇటీవల జరిగిన ఐఏఎస్, ఐపీఎస్‌ల విషయంలోనూ జాగరుకతతో వ్యవహరించింది. ఇందులో భాగంగానే.. కరీంనగర్ సీపీగా సుబ్బారాయుడు, రామగుండం సీపీగా రెమా రాజేశ్వరి, సిరిసిల్ల ఎస్పీగా అఖిల్‌మహాజన్, జగిత్యాల ఎస్సీగా భాస్కర్లను నియమించి మొత్తం ఉమ్మడి జిల్లా పోలీసు బాసులను ఏకకాలంలో మార్చింది. ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం.. గత ఎన్నికల సమయంలో పనిచేసిన రెవెన్యూ, పోలీసు అధికారులు లేదా మూడేళ్లకు మించి ఒకే కుర్చీలో విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు స్థాన చలనం తప్పేలా లేదు. ఈ విషయంలో ఇప్పటికే కొన్నిస్థానాల్లో ఎస్సై ర్యాంకు ఆఫీసర్లను ఉన్నతాధికారులు మార్చారు కూడా. లేఖల కోసం ఏసీపీలు, సీఐల పైరవీలు..! రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం డీఎస్పీల జాబితాను ఇప్పటికే తెప్పించుకుంది. అదే సమయంలో కరీంనగర్, రామగుండం కమిషనరేట్లతోపాటు సిరిసిల్ల, జగిత్యాల పోస్టింగుల కోసం పలువురు డీఎస్పీలు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా చాలాకాలంగా పోస్టింగులు లేకుండా లూప్‌లైన్లలో ఉంటున్న అధికారులు తమకు తెలిసిన నాయకుల ద్వారా ఈసారి ఎలాగైనా పోస్టింగ్ దక్కించుకోవాలని నేతల లేఖలు సంపాదించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు సైతం తాము పనిచేసే నియోజకవర్గం, జిల్లాను కుదిరితే జోన్ సైతం మారేందుకు వెనకాడటం లేదు. తమకు తెలిసిన నాయకుడు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా సరే.. వెళ్లి వెంటనే చేరిపోతున్నారు. ఇదే రకంగా ఇప్పటికే పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు జోన్లు మారి మరీ విధుల్లో జాయినయ్యారు. కరీంనగర్లో విచిత్రం..! కరీంనగర్ కమిషనరేట్ విషయానికి వస్తే.. ఇక్కడ పోలీసుల తీరు విచిత్రంగా ఉంటుంది. ఇక్కడే ఎ స్సైలుగా సర్వీసులో చేరిన కొందరు ఇప్పటికీ ఏ సీపీలుగా కొనసాగుతున్నారు. వీరికి బదిలీ గండం వెంటాడుతుండటంతో లూప్లైన్లోకి వెళ్లాలా ? లేక అలవాటు ప్రకారం.. ఐదారు నెలలు మరో ప్రాంతానికి బదిలీపై వెళ్లి.. సరిగ్గా ఎన్నికల ముందు తిరిగి రావాలా? అన్న ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి కరీంనగర్‌ను వదిలేందుకు వీరంతా ససేమీరా అంటున్నారు. అందుకే.. ఏ చిన్న అవకాశం దొరికినా.. దాన్ని సద్వినియోగ పరచుకుని ఇక్కడే రిటైర్ అవ్వాలని కంకణం కట్టుకున్నారు. -
ఫస్ట్ సిటిజన్స్ చేతికి ఎస్వీబీ
న్యూయార్క్: సంక్షోభంతో మూతబడిన సిలికాన్ వేలీ బ్యాంక్ (ఎస్వీబీ) సింహభాగం కార్యకలాపాలను ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ దక్కించుకుంది. దీంతో ఎస్‌వీబీకి చెందిన అన్ని డిపాజిట్లు, రుణాలు ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ అండ్ ట్రస్టుకు బదిలీ అవుతాయి. ఎస్వీబీ కస్టమర్లు ఆటోమేటిక్‌గా ఫస్ట్ సిటిజన్స్ ఖాతాదారులుగా మారతారని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ) తెలిపింది. ఫస్ట్ సిటిజన్స్‌లో ఎఫ్‌డీఐసీకి 500 మిలియన్ డాలర్ల విలువ చేసే షేర్లు దక్కుతాయి. ఎస్‌వీబీకి చెందిన 167 బిలియన్ డాలర్ల అసెట్లలో 90 బిలియన్ డాలర్ల అసెట్లు ఎఫ్‌డీఐసీ వద్దే ఉంటాయి. 72 బిలియన్ డాలర్ల అసెట్లు, ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్‌కు భారీ డిస్కౌంటుపై 16.5 బిలియన్ డాలర్లకు దక్కుతాయి. ఎస్వీబీ వైఫల్యంతో డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫండ్‌పై 20 బిలియన్ డాలర్ల మేర ప్రభావం పడనుంది. ఎస్వీబీ దెబ్బతో కుదేలైన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు అమెరికాలోని 11 భారీ బ్యాంకులు దాదాపు 30 బిలియన్ డాలర్ల ప్యాకేజీని అందించాయి. 1898లో ఏర్పాటైన ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ .. నార్త్ కరోలినాలోని రాలీ ప్రధాన కేంద్రంగా పని చేస్తోంది. 100 బిలియన్ డాలర్ల పైచిలుకు అసెట్లతో 21 రాష్ట్రాల్లో 500 శాఖలు ఉన్నాయి. బ్యాంకు ఆర్థిక పరిస్థితిపై అనుమానాలతో ఖాతాదారులు తమ డిపాజిట్లను భారీగా వెనక్కి తీసుకుంటూ ఉండటంతో మార్చి 10న ఎస్వీబీ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులకు సిగ్నేచర్ బ్యాంక్ కూడా మూతబడింది. -
బదిలీ నిబంధనపై గుబులు
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎప్ఓ) పరిధిలో ఉద్యోగులకు సంబంధించి సంస్థ తీసుకొచ్చిన నూతన బదిలీ విధానం–2022 క్లరికల్ స్థాయి ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈపీఎఫ్ఓలో క్లర్క్(సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్) లేదా సీనియర్ క్లర్క్ (సీనియర్ సొషల్ సెక్యూరిటీ అసిస్టెంట్) ఒకేచోట మూడు సంవత్సరాల సర్విసు పూర్తి చేసుకుంటే వెంటనే ఇతర కార్యాలయానికి బదిలీ చేయాలనేది పాలసీలోని ప్రధానాంశం. ఈపీఎఫ్ఓ కార్యక్రమాల అమలులో పారదర్శకత పాటించడంతో పాటు పనుల్లో వేగం పెంచేందుకు ఈ తరహా మార్పు తప్పనిసరి అని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు గతేడాది డిసెంబర్ 12న కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో మూడేళ్ల సర్విసు పూర్తి చేసుకున్న వారికి ఏటా నిర్వహించే బదిలీలకు సంబంధించిన నిబంధనలను వివరించింది. అయితే ఎలాంటి నిర్ణయాధికారాలు లేని క్లర్క్ స్థాయి ఉద్యోగికి కూడా ఈ నిబంధన వర్తింపజేసి మూడేళ్లకోసారి బదిలీ చేయడం వల్ల వారి కుటుంబాల భవిష్యత్ ఇబ్బందికరంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కావాలంటే సెక్షన్లు మార్చండి.. ఈపీఎఫ్ఓకు సంబంధించి తెలంగాణలో ఎనిమిది చోట్ల కార్యాలయాలున్నాయి. హైదరాబాద్‌లోని బర్కత్‌పురా, మాదాపూర్, కూకట్పల్లి, పటాన్‌చెరుతో పాటు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేటలో ఇవి కొనసాగుతున్నాయి. ఆంద్రప్రదేశ్‌లో కడప, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరులో ఈ కార్యాలయాలున్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 2 వేల వరకు క్లరికల్ ఉద్యోగులుంటారు. కాగా ఈపీఎఫ్ఓ తాజా నిబంధనతో వీరు ఆ రాష్ట్ర పరిధిలోని ఏ కార్యాలయానికైనా బదిలీ అయ్యే అవకాశం ఏర్పడింది. దీన్ని అమలు చేస్తే తమ పిల్లల చదువులు తీవ్ర ఇబ్బందుల్లో పడతాయని, భవిష్యత్తులో స్థానికత అంశం పెద్ద సమస్యగా మారుతుందని ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. బదిలీ చేయాలనుకుంటే ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి కాకుండా.. ప్రస్తుతం పనిచేస్తున్న కార్యాలయంలోనే సెక్షన్ల మార్పు చేస్తే ఉద్యోగికి వెసులుబాటు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనివల్ల ఉద్యోగికి బదిలీ సమయంలో ఇచ్చే ఒక నెల అదనపు వేతనానికి సంబంధించిన నిధులు కూడా సంస్థకు మిగులుతాయని చెబుతున్నారు. ఈ మేరకు క్లరికల్ కేడర్ ఉద్యోగులు ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తున్నారు. మరోవైపు నూతన పాలసీ అమల్లోకి వచ్చి రెండు నెలలు కావస్తుండడం, త్వరలోనే బదిలీలు చేసే అవకాశం ఉండటంతో.. ఉద్యోగుల సంఘం న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతోంది. -
మెడికో ప్రీతి ఘటన.. హెచ్ఓడీపై బదిలీ వేటు.. పనిష్మెంటా? ప్రమోషనా?
సాక్షి, వరంగల్: మెడికో ప్రీతి ఘటన నేపథ్యంలో కాకతీయ మెడికల్ కాలేజ్, ఎంజీఎం ఆసుపత్రి అనస్తీసియా హెచ్ఓడీ నాగార్జున రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఆయనను భూపాలపల్లి మెడికల్ కాలేజీకి అనస్తీసియా ప్రొఫెసర్‌గా బదిలీ చేస్తూ తెలంగాణ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీతి ఆత్మహత్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నాగార్జున రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనను వేధించిన సైఫ్‌పై ప్రీతి ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే నాగార్జున రెడ్డి గత కొంతకాలంగా భూపాలపల్లి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన కోరుకున్నట్లే భూపాలపల్లికి బదిలీ కావడంతో ఇది ప్రమోషనా? లేక పనిష్మెంటా అనే చర్చ జరుగుతోంది. చదవండి: నిందితుడు హరిహరకృష్ణకు వారం రోజుల పోలీస్ కస్టడీ.. -
డబుల్ స్ట్రోక్.. ఇద్దరు సివిల్ సర్వెంట్లకు బొమ్మ చూపించిన బొమ్మై సర్కార్
-
Karnataka: ఇద్దరు ఆఫీసర్లకూ ఝలక్
బెంగళూరు: కర్ణాటక మహిళా అధికారుల వివాదం ప్రభుత్వ జోక్యంతో సరికొత్త మలుపు తిరిగింది. ఇద్దరు మహిళా అధికారిణిలకు అక్కడి ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వకుండానే.. ఇద్దరినీ బదిలీ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. తక్షణమే ఈ బదిలీలు అమలులోకి వస్తున్నట్లు తెలిపింది. బదిలీకి ముందుదాకా.. రూప కర్ణాటక హస్త కళల అభివృద్ధి సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఇక సింధూరి ఏమో ధర్మాధయ శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ బహిరంగ విమర్శలు చేసుకోవడం తెలిసిందే. మరోవైపు రూప భర్త మునీష్ మౌద్గిల్ ఐఏఎస్ అధికారి కాగా, ఆయన్ని పబ్లిసిటీ విభాగంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది ప్రభుత్వం. వీళ్ల వ్యవహారంపై సమగ్ర విచారణ, చర్యల తర్వాత పోస్టింగ్ విషయంలో ఒక స్పష్టత రావొచ్చని సీనియర్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఐపీఎస్ అధికారిణి రూపా మౌద్గిల్, ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి వ్యక్తిగత విమర్శలతో ప్రజలనే కాదు.. ప్రభుత్వాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేశారు. ఆదివారం ఫేస్బుక్లో.. రూపా, రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను ఉంచడంతో వ్యవహారం మొదలైంది. తన వ్యక్తిగత జీవితాన్ని రచ్చకీడ్చిందంటూ రూపపై రోహిణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. మరోవైపు రూప, రోహిణిపై అవినీతి విమర్శలు చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఇద్దరి వ్యవహారంపై సీఎం బసవరాజ్ బొమ్మై కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎస్ ద్వారా నివేదిక తెప్పించుకున్న ఆయన.. ఇద్దరిపై చర్యలు తప్పవనే సంకేతాలను నిన్ననే(సోమవారం) అందించారు. -
టీచర్ల బదిలీలపై స్టే.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. బదిలీలకు సంబంధించి వారం క్రితం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం థోల్‌కట్టకు చెందిన సక్కుబాయితో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి జారీ చేసిన జీవోను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. లేదా.. ప్రత్యామ్నాయంగా టీచర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లకు, జీవిత భాగస్వామి కేటగిరీ కింద కొందరికి ఎలాంటి అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలను చేపట్టేలా ప్రతివాదులను ఆదేశించాలని కోరారు. ప్రతివాదులుగా పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ కమిషనర్, డైరెక్టర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పీఆర్టీయూ, టీఎస్‌యూటీఎఫ్ సంఘాలను చేర్చారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాస నం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున పీవీ కృష్ణయ్య వాదనలు వినిపించారు. జీవోలో పేర్కొన్న తెలంగాణ టీచర్స్ రూల్స్ 2023 ప్రకారం బదిలీలు చేపట్టాలంటే వాటికి అసెంబ్లీ ఆమోదం అవసరమని చెప్పారు. ఆరి్టకల్ 309 ప్రకారం చేయాలన్నా గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఎలాంటి ఆమోదం లేకుండా నేరుగా ప్రభుత్వం జీవోలు విడుదల చేయడం చట్టవిరుద్ధమని నివేదించారు. ఉపాధ్యాయ సంఘాలకు, స్పౌజ్ కేటగిరీకి అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయా లని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్ల వాదనను పరిగణనలో తీసుకుని బదిలీలపై స్టే ఇస్తూ, విచారణను వాయిదా వేసింది. -
బదిలీ వెనుక రాజకీయం.. చక్రం తిప్పిన ఇద్దరు ప్రజాప్రతినిధులు..?
నిజామాబాద్ : ఏసీపీ వెంకటేశ్వర్ ఆకస్మిక బదిలీ రాజకీయ రంగు పులుముకుంది. రెండేళ్లు పూర్తి కాకుండానే బదిలీ జరగడం నగరంలో హాట్టాఫిక్ మారింది. ఏసీపీ నిజామా బాద్‌లో ఏడాదిన్నరకు పైగా పని చేశారు. ఏసీపీగా వచ్చిన వెంకటేశ్వర్ సమర్థుడైన అధికారిగా గుర్తింపు పొందుతూనే ప్రజలతో సంత్సంబంధాలు కొనసాగించారు. నిజామాబాద్ డివిజన్ నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది. అయితే అధికారు లు తప్పనిసరిగా ఇక్కడి ప్రజాప్రతినిధుల కన్నుసన్న ల్లో పనిచేయాల్సి ఉంటుంది. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉండటంతో పాటు మరో ప్రజాప్రతినిధి కలిసి ఏసీపీ బదిలీకి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. కొన్నాళ్లుగా ఎడమోహం పెడమోహంగా ఉన్న సదరు ఇద్దరు ప్రజాప్రతినిధులు చివరకు ఒక్కట య్యారు. తమ మధ్య విబేధాలను పక్కన పెట్టారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్లుగా వారిద్దరు ఒక్కటై చివరికి ఏసీపీ బదిలీకి చక్రం తిప్పినట్లు సమాచారం. రెండు నెలలుగా అంతర్గత చర్చ.. ఏసీపీని బదిలీ చేయాలని రెండు నెలల నుంచి ప్ర జాప్రతినిధులు భావించినట్లు తెలిసింది. తమకు వ్యతిరేకంగా ఉన్న వారికి ఏసీపీ పనులు చేస్తున్నా రని కొందరు ప్రజాప్రతినిధులు భావించి ఆయన ను బదిలీ చేయించాలని ఓ ప్రజాప్రతినిధికి లేఖలు రాసినట్లు సమాచారం. ఈ లేఖలను ఆధారంగా చేసుకుని ఓ పోలీస్ అధికారి అభిప్రాయం మేరకు ఏసీపీ బదిలీ జరిగినట్లు తెలిసింది. రెండు నెలలుగా ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా కొనసాగించినట్లు సమాచారం. మంగళవారం రాత్రి తెలంగాణవ్యాప్తంగా 16 మంది ఏసీపీలు, డీఎస్పీల బదిలీలో ఏసీపీ పేరుండడం నగర పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ బదిలీని ఆపాలని సదరు ఏసీపీ ఎవరి వద్దకు వెళ్లలేదని తెలిసింది. రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లోని డీజీపీ ఆఫీస్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ఎన్నికల కోసమేనా..? ఎక్కుడగా లాంగ్‌స్టాండింగ్ ఉన్న అధికారులను బ దిలీ చేస్తుంటారు. వచ్చే ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉండాలనే ఇద్దరు ప్రజాప్రతినిధులు చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. ఎన్నికలకు మరో పదినెలల కాలం ఉన్నప్పటికీ తమకు అనుకూలంగా ఉండే వారిపై ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఏసీపీ బదిలీ జరిగినట్లు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
కొత్త టీచర్లు వచ్చే వరకు అక్కడే కొనసాగాలి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలతో పాఠశాలలు ఖాళీ అయ్యే ప్రసక్తే ఉండదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ పాఠశాలల్లో పూర్తిస్థాయి ఉపాధ్యాయులకు స్థానచలనం జరిగి, కొత్త టీచర్లు రాని పరిస్థితి ఉన్నప్పుడు బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయబోమని, కొత్త టీచర్లు వచ్చే వరకు అక్కడే కొనసాగాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. బడ్జెట్‌పై సభ్యుల ప్రసంగాల్లో భాగంగా ఉపాధ్యాయ బదిలీలపై పలు అంశాలు లేవనెత్తారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సైతం జోక్యం చేసుకుంటూ జీఓ 317లో భాగంగా పలువురు ఉపాధ్యాయులకు పల్లె బడుల్లో పోస్టింగ్ లిచ్చారని, తాజాగా బదిలీల నిబంధనల సడలింపుతో ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఖాళీ అయ్యే ప్రమాదముందంటూ సూచనలు చేశారు. దీనిపై మంత్రి పైవిధంగా స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడా టీచర్ లేని పాఠశాలలు ఉండకూడదనేది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని వివరించారు. జీఓ 317 బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, జిల్లాల్లో ఖాళీల ఆధారంగా వారికి సొంత ప్రాంతాలు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని సభ్యుడు ఏ.నర్సిరెడ్డి సూచించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతన క్రమబదీ్ధకరణ చేయాలని, కనిసీ వేతనాన్ని రూ.25వేలకు పెంచాలని కోరారు. యూనివర్సిటీల్లో నియామకాలకు సంబంధించిన బోర్డు ఏర్పాటుకు సంబంధించిన బిల్లును గవర్నర్ త్వరితంగా ఆమోదించాలని, దీంతో నియామకాల ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. మైనార్టీ గురుకుల పాఠశాలలు నిర్దేశించిన లొకేషన్లలో కాకుండా ఇష్టానుసారంగా ఏర్పాటు చేశారని, దీంతో ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సంతృప్తికరంగా లేదని, తక్షణ చర్యలు తీసుకోవాలని మరో సభ్యుడు కె.జనార్ధన్‌రెడ్డి కోరారు. పాడి రైతుకూ ఉచిత కరెంట్ ఇవ్వాలి వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తున్నట్లుగానే పాడి రైతులకూ ఉచిత కరెంటు ఇవ్వాలని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పాడి రైతులు గడ్డికోత మెషీన్లు, ఇతరాలకు కరెంటును వినియోగిస్తుండగా... అధికారులు వాటికి చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో చాలాచోట్ల రైతాంగం కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతోందని, వాటిని అరికట్టేందుకు స్టెరిలేజేషన్ యూనిట్లను ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ రంగంలో 2,42,142 ఉద్యోగాలు కల్పించామని, ఇప్పుడు 80వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేసి భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి కేంద్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందని, ఈ అంశంపై నిలదీస్తే రాష్ట్రాలను బదనాం చేస్తోందని ఎమ్మెల్సీ బండప్రకాశ్ అన్నారు. తెలంగాణ ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడే వ్యవహరిస్తోందని, కానీ కేంద్రం మాత్రం పరిధులు దాటి దేశాన్ని అప్పులపాలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఇప్పటివరకు రూ.54వేల కోట్లు ఖర్చు చేసిందని, ఇక రైతుబందు బడ్జెట్లో 40శాతానికిపైగా బీసీలు లబ్ధి పొందుతున్నారన్నారు. ఇతర పద్దుల్లోనూ బీసీలకు సమ వాటా అందిస్తోందని ఆయన తెలిపారు. -
TS: ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల వివరాలు... -
కలెక్టర్ సిక్తా పట్నాయక్ బదిలీ
సిక్తా పట్నాయక్.. రెండున్నరేళ్లు ఆదిలాబాద్: పెద్దపల్లి కలెక్టర్‌గా పనిచేస్తూ 2020 జూలై 17న ఆదిలాబాద్ కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్ శ్రీదేవసేన నుంచి బాధ్యతలు స్వీకరించారు. రెండు సంవత్సరాల ఆరు నెలల పాటు కలెక్టర్‌గా సేవలందించిన ఆమె ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు తొలి ప్రాధాన్యతనిచ్చారు. కోవిడ్ రెండో దశ తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో జిల్లాలో వైరస్ కట్టడికి ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వైరస్ కారణంగా పాలనకు ఇ బ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆఫీస్ అమలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళితబంధు అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఎక్కుమంది ఎస్సీలకు భూ పంపిణీ చేపట్టి జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాను ముందుంచేలా అధికా రులకు మార్గనిర్దేశం చేస్తూ వాటి ఫలితాలను రాబట్టేందుకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. క్షేత్రస్థాయి పర్యటనలు సైతం చేపట్టి వారిని ప్రోత్సహించారు. ముఖ్యంగా 2021లో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట లు, ఆదివాసీగూడేలు, తండాలను కాలినడకన వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్లి పరిశీలించారు. వారితో మమేకమై సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారికి అండగా నిలిచా రు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలను అందించారు. ప్రజాప్రతినిధులు, అధికారులనే తారతమ్యం లే కుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో అందరినీ భాగస్వాములను చేసి విజయవంతం చేశారు. వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించి రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. కొత్త కలెక్టర్‌గా రాహుల్‌రాజ్ ఆదిలాబాద్ జిల్లా కొత్త కలెక్టర్‌గా రాహుల్‌రాజ్ నియామకమయ్యారు. ప్రస్తుత కలెక్టర్ సిక్తా పట్నాయక్ హనుమకొండ కలెక్టర్‌గా బదిలీపై వెళ్లనున్నారు. అలాగే ఉట్నూర్ ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డిని నిర్మల్ కలెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాహుల్‌రాజ్ జిల్లా కలెక్టర్‌గా రానున్నట్లు కొద్ది రోజులుగా ఇక్కడి ప్రజల్లో జరుగుతున్న చర్చ నిజమైంది. కుమురంభీం ఆసిఫాబాద్ కలెక్టర్‌గా పనిచేస్తున్న రాహుల్‌రాజ్‌ను ఆదిలాబాద్ కలెక్టర్‌గా నియమించారు. గతేడాది కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రసూతి సెలవులకు వెళ్లిన సందర్భంలో ఈయన నెల పాటు జిల్లా ఇన్చార్జి కలెక్టర్‌గా పనిచేశారు. ఆయనే జిల్లా కలెక్టర్‌గా రానుండటంతో తన పనితీరుతో ఎలాంటి ముద్ర వేస్తారనే చర్చ సాగుతోంది. ఆయన గురువారం జిల్లాలో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లుగా అధికారిక వర్గాల సమాచారం. -
తెలంగాణలో భారీగా ఐపీఎస్ లు బదిలీలు
-
హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ రంగనాథ్ బదిలీ..
సాక్షి, హైదరాబాద్/వరంగల్: హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం సంయుక్త పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. ఆయనను వరంగల్ పోలీసు కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ ఎస్పీగా పని చేస్తూ డీఐజీగా పదోన్నతి పొందిన రంగనాథ్ గతేడాది డిసెంబర్ 29న సిటీ ట్రాఫిక్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండకు వెళ్లే ముందూ ఆయన సిటీ ట్రాఫిక్ డీసీపీగా పని చేశారు. రోడ్డు ఆక్రమణల నిరోధం కోసం నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు అమలులోకి వచ్చిన ఆపరేషన్ రోప్లో రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తున్న వ్యాపారులపై క్రిమినల్ కేసులు, తప్పుడు నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వారిపై చర్యలు, అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు, మలక్‌పేట్ వద్ద మూడో మార్గం పనుల వేగవంతం... ఇలా నగర ట్రాఫిక్‌పై రంగనాథ్ తనదైన ముద్ర వేశారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ లోక్ అదాలత్‌ను ఆన్లైన్లో నిర్వహించేలా చేశారు. ట్రాఫిక్ విభాగంలోనూ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహణ, జంక్షన్లలో డైరీలు ఏర్పాటు, అడ్డదిడ్డంగా సంచరిస్తున్న అంబులెన్స్‌ల క్రమబద్దీకరణ, జంక్షన్లలో గ్రీన్ లైట్ వినియోగం పెంపు, కార్ల అద్దాల నల్ల ఫిల్మ్ తొలగింపు, అతిగా శబ్దం చేసే హారన్ల వినియోగంపై ఆంక్షలు.. ఇలా ఎన్నో సంస్కరణలు రంగనాథ్ తీసుకువచ్చారు. ఆయన అమలు చేసిన జూబ్లీహిల్స్ రోడ్ నెం.45తో పాటు ఇతర మార్గాల్లో మళ్లింపులు ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్నాయి. ట్రాఫిక్ విభాగానికి కొత్త చీఫ్ వచ్చే వరకు మరో అధికారి ఇన్చార్జిగా ఉండనున్నారు. 19నెలలు పనిచేసిన తరుణ్‌జోషి వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న డాక్టర్ తరుణ్జోషిని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. 2004 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన తరుణ్‌జోషి 2021 ఏప్రిల్ 4న వరంగల్ పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు పోలీస్ వర్టికల్స్, వెల్ఫేర్ విషయంలో నిజాయితీగల అధికారిగా పేరున్న ఆయన సుమారు 19 నెలల పాటు తన మార్కు వేసుకున్నారు. ఐజీగా పదోన్నతి పొందిన తరుణ్‌జోషి సెంట్రల్ సర్వీసెస్‌కు వెళ్తున్నారన్న ప్రచారం కొంతకాలంగా జరిగింది. ఇదే సమయంలో గురువారం ఆయనను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ఏవీ రంగనాథ్‌ను నియమించింది. చదవండి: Hyderabad: ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. పోలీస్‌శాఖలో రంగనాథ్ తనదైన మార్క్ ఏవీ రంగనాథ్ 1970 అక్టోబర్‌లో నల్లగొండలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం హుజూర్నగర్ తదితర ప్రాంతాల్లో చేసిన ఆయన తర్వాత గుంటూరులో పదో తరగతి వరకు చదివారు. ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ఓయూలో ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులో ఐడీబీఐ బ్యాంకు అధికారిగా కొంతకాలం పనిచేసి పోలీస్ బాస్ కావాలన్న లక్ష్యంతో గ్రూప్–1 పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. గ్రూప్ –1 లో స్టేట్ 13వ ర్యాంకు సాధించారు. పోలీస్ బాస్ కావాలన్న ఏకైక లక్ష్యంతో డీఎస్పీ ఆప్షన్ ఖరారు చేసుకున్నారు. 1996 బ్యాచ్‌లో డీఎస్పీ ర్యాంక్‌లో స్థిరపడి 2000 సంవత్సరంలో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కొత్తగూడెం డీఎస్పీగా బదిలీ అయిన రంగనాథ్ 2003 వరకు కొత్తగూడెంలో పనిచేసి, ఆ తర్వాత సంవత్సరంపాటు వరంగల్ జిల్లా నర్సంపేట డీఎస్పీగా పనిచేశారు. 2004లో ఎన్నికల వేళ నక్సల్స్ అడ్డా అయిన ప్రకాశం జిల్లా మార్కాపురంలో విధులు నిర్వర్తించారు. వైఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం, నక్సల్స్ చర్చల సందర్భంలో నక్సల్స్ కేంద్ర నాయకులు రామకృష్ణ వంటి వారిని స్థానిక అధికారిగా స్వాగతించారు. అనంతరం తూర్పు గోదావరి అడిషనల్ ఎస్పీగా పనిచేసిన సమయంలో బలిమెల రిజర్వాయర్ వద్ద నక్సల్స్ చేతిలో గ్రేహౌండ్స్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన తర్వాత రంగనాథ్‌ను ఆ ప్రాంతానికి బదిలీ చేశారు. అక్కడ గ్రేహౌండ్స్ ఆపరేషన్స్ పునరుద్ధరించడంలో కీలకంగా ఉన్న ఏవీఆర్.. 2012 చివరివరకు అక్కడ పనిచేశారు. ఆ సమయంలో రంగనాథ్ పనికి గుర్తింపుగా రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు దక్కింది. 2014 వరకు ఖమ్మం ఎస్పీగా పనిచేసి, అక్కడినుంచి నల్లగొండకు బదిలీ అయ్యారు. దాదాపు నాలుగేళ్లు పనిచేసి తన మార్కు వేసుకున్నారు. నల్లగొండలో ఉన్నసమయంలోనే డీఐజీగా పదోన్నతి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ సిటీలో జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్)గా విధులు నిర్వర్తించిన ఏవీ రంగనాథ్ వరంగల్ పోలీసు కమిషనర్‌గా నియమితులయ్యారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అయేషా, నల్ల గొండ జిల్లాలో అమృత ప్రణయ్ కేసు విషయంలో ఎంతో చొరవ చూపారు. నర్సంపేటలో పనిచేసినప్పుడు నక్సల్స్ సమస్యపై కీలకంగా పనిచేశారు. కాగా, ఆయన సీపీగా రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. ప్రొఫైల్ పూర్తి పేరు : ఆవుల వెంకట రంగనాథ్ పుట్టిన తేదీ : అక్టోబర్ 22, 1970 పుట్టిన ప్రదేశం : నల్లగొండ తల్లిదండ్రులు : సుబ్బయ్య, విజయలక్ష్మి భార్య : లక్ష్మీలావణ్య పిల్లలు : రుషిత, కౌశిక్ గ్రూప్ –1 : 1996 డీఎస్పీ, 2006లో ఐపీఎస్ మొదటి పోస్టింగ్ : గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ ఇష్టమైన ఆట : టెన్నిస్ ప్రదేశం : కశ్మీర్ చదవండి: Hyderabad: ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. -
డాక్టర్ల బదిలీలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) పరిధిలోని స్పెషలిస్ట్ డాక్టర్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. వారికి జోనల్ కేటాయింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. 317 జీవో ప్రకారం జోనల్ కేటాయింపులు చేపట్టనున్నారు. మల్టీ జోనల్ కేడర్ పరిధిలోకి వచ్చే సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ కేడర్‌లో ఉన్న డాక్టర్ల నుంచి ఆప్షన్లు తీసుకోవాలని తన పరిధిలోని అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు ఇచ్చారు. జోనల్ కేటాయింపు పూర్తయ్యాక కొన్ని ఆసుపత్రుల్లో అవసరానికి మించి ఎక్కువ మంది డాక్టర్లు ఒకేచోట పనిచేస్తున్నారు. వారిలో అనేకమందిని అవసరం ఉన్నచోటకు బదిలీ చేసేందుకుగాను డాక్టర్ల రేషనలైజేషన్(హేతుబద్ధీకరణ) ప్రక్రియ చేపడతారు. ఆ తర్వాత నర్సులు, పారామెడికల్, క్లర్క్‌లకు కూడా జోనల్ కేటాయింపు చేసి బదిలీలు చేస్తారు. 600 మంది డాక్టర్లు... 2 వేలకుపైగా నర్సులు రాష్ట్రంలో ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని వైద్యులకు, ఇతర ఉద్యోగులకు ఇప్పటికే బదిలీలు జరిగిన విషయం విదితమే. ఏడు జోన్ల పరిధిలో డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్యసిబ్బందికి పెద్దఎత్తున జోనల్ కేటాయింపులు, బదిలీలు జరిగాయి. అప్పుడు జోనల్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని అనేకమంది ఉద్యోగులు ఆందోళన చెందారు. కానీ, ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉండటంతో వారంతా ఎక్కడికక్కడే ఉండిపోయారు. ప్రస్తుతం టీవీవీపీ పరిధిలోని జిల్లా, ఏరియా, సామాజిక ఆసుపత్రుల్లో జోనల్ కేటాయింపులు, అనంతరం బదిలీలు జరగనున్నాయి. ఆయా ఆసుపత్రుల్లో 600కుపైగా సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఇతరులు స్పెషలిస్ట్ వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడు 2 వేలకుపైగా నర్సులు, 500కుపైగా ఉన్న పారామెడికల్ సిబ్బందికి బదిలీలు జరుగుతాయి. ముందుగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ కేడర్‌లోని డాక్టర్లు, ఆ తర్వాత నర్సులు, ఇతర ఉద్యోగులకు జోనల్ కేటాయింపులు జరిపి బదిలీలు చేస్తారు. జోనల్ కేటాయింపులు కఠినంగా కాకుండా, ఉద్యోగుల ఆప్షన్ల ప్రకారమే చేపడతారు. ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇష్టారాజ్యంగా జోనల్ మార్పులు జరిగాయని వచ్చిన విమర్శల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు. చేనేతపై జీఎస్టీ రద్దుచేయాలి కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి లేఖ సాక్షి, హైదరాబాద్: చేనేతపై విధించిన 5% జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు చేపట్టిన పోస్ట్ కార్డ్ ఉద్యమంలో భాగంగా ఎర్రబెల్లి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం చేనేతను ప్రోత్సాహకాలిచ్చి ఆదుకుంటుంటే, కేంద్రం మాత్రం జీఎస్టీతో వారి నడ్డి విరుస్తోందన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత ప్రజలు ఎక్కువగా ఆధార పడిన చేనేత రంగంపై జీఎస్టీ విధించడం అన్యాయమన్నారు. -
Kanipakam: కాణిపాకం ఇన్‌ఛార్జి ఈఓ సురేష్ బాబుపై బదిలీ వేటు
సాక్షి, చిత్తూరు: టికెట్ ధరల పెంపుపై కాణిపాకం ఇన్ ఛార్జి ఈఓ సురేష్ బాబు ఇచ్చిన ఉత్తర్వులపై దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఆయనపై బదిలీ వేటు వేసింది. సురేష్ బాబును కాణిపాకం ఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాణిపాకం ఇన్‌ఛార్జి ఈఓగా కర్నూలు డిసి రాణా ప్రతాప్ కి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కమీషనర్ హరి జవహర్ లాల్ ఇప్పటికే సురేష్ బాబుకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. కాణిపాకంలో అభిషేకం టిక్కెట్ ధరని పెంచడానికి ప్రజాభిప్రాయం పేరుతో జారీ చేసిన ఉత్తర్వులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిక్కెట్ ధరని పెంచడం లేదంటూ ఇప్పటికే దేవాదాయ శాఖ స్పష్టమైన ప్రకటన చేసిందని ఆయన తెలిపారు. సురేష్ బాబుపై విచారణ చేపటనున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. -
సీబీఐ దాడుల ఎఫెక్ట్?.. భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
ఢిల్లీ: ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఇతరులపై సీబీఐ దాడుల నేపథ్యంలో.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ఆరోపణలపై.. ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంపై శుక్రవారం సాయంత్రం దాడులు నిర్వహించింది. సిసోడియాతో పాటు మాజీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణతో పాటు పలువురు అధికారులు, వ్యాపారవేత్తలు, మద్యం వ్యాపారులు తదితరుల నివాసాల్లో.. మొత్తం దేశవ్యాప్తంగా 31 చోట్ల సోదాలు చేసింది. సుమారు 14 గంటల తనిఖీల తర్వాత మనీశ్ సిసోడియా ఫోన్, కంప్యూటర్లను సీబీఐ సీజ్ చేసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జంకే ప్రసక్తే లేదని, ఉచిత విద్య-ఆరోగ్యం అందించి తీరతామంటూ ప్రకటన చేశారు. మరోవైపు ఆప్ జాతీయ కన్వీనర్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఇది బీజేపీ ప్రతీకార రాజకీయమంటూ మండిపడ్డారు. దర్యాప్తు ఏజెన్సీలతో ప్రతీకార దాడులకు పాల్పడుతోందంటూ విమర్శించారు. క్లిక్: సిసోడియాపై దాడులు, కేసు ఏంటంటే.. ఇదిలా ఉంటే.. ఒకవైపు సీబీఐ తనిఖీలు కొనసాగుతున్న వేళ మరోవైపు ఎల్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారీగా ఐఏఎస్‌లను బదలీలు చేశారు. బదిలీ అయిన వాళ్లలో ఆరోగ్య-కుటుంబ సంక్షేమ ప్రత్యేక కార్యదర్శి ఉదిత్ ప్రకాశ్ రాయ్ సైతం ఉండడం గమనార్హం. ఆయన్ని పరిపాలన సంస్కరణల విభాగానికి బదిలీ చేసింది ఢిల్లీ సర్కార్. అరుణాచల్ ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఉదిత్ ప్రకాశ్‌రాయ్‌పై ఈ మధ్యే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు కూడా చేశారు. రెండు అవినీతి కేసులతో పాటు ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి రూ. 50 లక్షల లంచం తీసుకున్నాడని, వెంటనే తప్పించాలని కేంద్ర హోంమంత్రిత్వ వ్యవహారాల శాఖకు ఎల్జీ సిఫార్సు చేశారు. వీళ్లతో పాటు మనీశ్ సిసోడియాకు దగ్గరగా ఉండే.. విజేంద్ర సింగ్ రావత్, జితేంద్ర నారాయిన్, వివేక్ పాండేలు, శుభిర్ సింగ్, గరిమా గుప్తా సైతం ట్రాన్స్‌ఫర్డ్ లిస్ట్‌లో ఉండడం గమనార్హం. మొత్తం పన్నెండు మందిని ఆఘమేఘాల మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు ఎల్జీ వినయ్ కుమార్. ఇదీ చదవండి: బీజేపీ ఆరోపణలపై న్యూయార్క్ టైమ్స్ రియాక్షన్ -
సార్.. ప్లీజ్ సార్.. వెళ్లొద్దు సార్
వైరల్: గురువులకు గౌరవం ఇచ్చే విద్యార్థులు.. ఈరోజుల్లో చాలా అరుదు. లాక్డౌన్ టైంలో టీచర్ల పట్ల విద్యార్థుల మానసిక స్థాయి ఏరేంజ్‌లో ఉందో పలు వీడియోల ద్వారా కళ్లారా చూశాం కూడా. కానీ, విద్యార్థులకు తగ్గట్లుగా ఉంటూనే.. వాళ్ల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆ గురువు అనుకున్నాడు. మరి అలాంటి ఫేవరెట్ గురువును వదులుకునేందుకు ఏ విద్యార్థికి అయినా ఎందుకు మనసు ఒప్పుతుంది?. తమకు నాలుగేళ్లపాటు పాఠాలు చెప్పిన శివేంద్ర సింగ్ సార్‌ను.. మరో స్కూల్‌కు బదిలీ చేసింది ప్రభుత్వం. దీంతో ఆయన కోసం మంగళవారం వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడి విద్యార్థులు ఆయన్ని వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. కన్నీళ్లతో ఆయన్ను హత్తుకుని ‘వెళ్లొద్దు సార్..’ అంటూ రోదించారు. యూపీ రాయ్‌గఢ్ చందౌలీ ప్రైమరీ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వీడ్కోలు సభలో కానుకలు ఇచ్చి, తోటి టీచర్లు ప్రశంసలు గుప్పించారు. సభ అయిపోగానే పిల్లలంతా ఆయన చుట్టూ చేరి కన్నీళ్లు గుప్పించారు. ‘‘త్వరలోనే వస్తా.. బాగా చదువుకోండి.. మీరంతా బాగుండాలి అంటూ వాళ్లను ఓదార్చి.. ఆల్ ది బెస్ట్ చెప్పాడు ఆయన. తోటి పిల్లలతో కలిసి కొండ ప్రాంతంలో క్రికెట్ ఆడేవాడినని అనుభవాలను గుర్తు చేసుకున్నాడాయన. శివేంద్ర సింగ్.. చాలా వైవిధ్యమైన పద్ధతిలో పాఠాలు చెప్తాడు. అందుకే ఆయనంటే పిల్లలకు అంత ఇష్టం. 2018లో ఆయన అసిస్టెంట్ టీచర్‌గా ఆ స్కూల్‌కు వెళ్లారు. ఆటలు, సోషల్ మీడియా, బొమ్మలు, పాటల ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పేవారాయన. కేవలం పాఠాలు మాత్రమే కాదు.. ప్రపంచం గురించి కూడా ఆయన వాళ్లకు వివరించేవాడు. లాక్డౌన్ టైంలో ఆయన తీసుకున్న చొరవకు ఆ జిల్లాలోనే ప్రముఖ స్థానం దక్కింది. ఆయన ప్రభావంతోనే స్కూల్ హాజరు శాతం పెరిగింది కూడా. అందుకే ఆయన సేవలను ఉపయోగించుకోవాలని.. పక్క జిల్లాలోని ఓ స్కూల్‌కు ట్రాన్స్ఫర్ చేసింది యూపీ విద్యాశాఖ. Video: At UP Teacher's Farewell, Students Weep, Refuse To Let Him Go https://t.co/H9vCNQK0aj pic.twitter.com/7o0dqECKe5 — NDTV (@ndtv) July 15, 2022 ఇదీ చదవండి: గురుబ్రహ్మ.. కారడవిలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా..! -
ఏసీబీ అవినీతిపై ఆరోపణలు.. హైకోర్టు న్యాయమూర్తికి బెదిరింపులు
సాక్షి, బెంగళూరు: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అనేది కలెక్షన్ సెంటర్‌గా మారిందని, అదో అవినీతి కూపమైందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌పీ సందేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా ఆరోపించడం వల్ల తనకు బదిలీ బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు. ప్రజా శ్రేయస్సు, న్యాయం కోసం బదిలీ బెదరింపును ఎదుర్కోవడానికి సిద్ధమన్నారు. 2021 మేలో రూ.5 లక్షల లంచంతీసుకుంటూ అరెస్టయిన బెంగళూరు అర్బన్ కలెక్టరేట్లోని డిప్యూటీ తహశీల్దార్ పీ.ఎస్.మహేశ్ సమర్పించిన బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో జస్టిస్ హెచ్.పీ.సందేశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఏసీబీలో అక్రమాలను ప్రశ్నించినందుకు నాకు బదిలీ బెదిరింపు వచ్చాయి. గతంలో కూడా ఓ న్యాయమూర్తి ఇలా బదిలీ అయ్యారు. నాకు ఎవరైనా భయం లేదు. పిల్లికి గంట కట్టేందుకు సిద్ధంగా ఉన్నాను. జడ్జి అయిన తరువాత ఒక్క పైసా కూడా లంచం తీసుకోలేదు. ఉద్యోగం పోయినా పర్వాలేదు. నేను రైతు కొడుకును. ఎలా జీవించాలో నాకు తెలుసు. 50 రూపాయలతో బతకగలను. అలాగే రూ.50 వేలతోనూ జీవించడం తెలుసు. నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదు. రాజ్యాంగానికి మాత్రం కట్టుబడి ఉంటాను. ఏ పార్టీకి లొంగను’ అని స్పష్టం చేశారు. చదవండి: కేటీఆర్ సెటైర్, దేశ ప్రజలకు మోదీ అందించిన బహుమతి ఇదే! జడ్జి లకే భద్రత లేదు ఎస్ఐ నియామక అక్రమాలకు సంబంధించి ఏడీజీపీ అరెస్ట్ అయినే నేపథ్యంలో హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్రను సస్పెండ్ చేయాలని, సీఎం బసవరాజ బొమ్మై రాజీనామా చేయాలని సీఎల్పీ నేత సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం కేపీసీసీ కార్యాలయంలో వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో రాష్ట్ర పాలనా యంత్రాంగానికి కళంకం వచ్చిందని, న్యాయ వ్యవస్థకు భద్రత లేని పరిస్థితి ఉద్భవించిందన్నారు. సోమవారం ప్రభుత్వ అధికారులు ఇద్దరు అరెస్ట్ అయ్యారు. అధికారి అరెస్ట్ అయిన అర్ధ గంటలో ఆరోగ్య పరీక్షలకు పంపించారు. అంత త్వరగా విచారణ పూర్తి చేసింది ఎందుకు? అని అన్నారు. కుంభకోణానికి బాధ్యత వహించి సీఎం, హోంమంత్రి తప్పుకోవాలన్నారు. యడ్డి కొడుకుపై ఆరోపణలు మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర, మంత్రి అశ్వత్థ్ నారాయణ పీఎస్ఐ అక్రమ నియామకాల్లో ప్రమేయముందని, వీరిని సీఎం కాపాడుతున్నారని ఆరోపించారు. ఇక హైకోర్టు న్యాయమూర్తిని బెదరించారని, బదిలీ చేస్తామని భయపెట్టారని, న్యాయమూర్తికే భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. ఏసీబీ కలెక్షన్ బ్యూరో అయిందని విమర్శించారు. -
ఆ అధికారి ఒకప్పుడు ‘సింహస్వప్నం’.. ఇప్పుడేమో ఇలా..
ఒకప్పుడు.. ఆయనంటే నిజాయితీకి మారుపేరు. రంగంలోకి దిగితే ఎంతటి వాళ్లనైనా వదిలేవాడు కాదు అని ఆయన పని చేసే సంస్థలే ఆకాశానికి ఎత్తేవి. కానీ, ఇప్పుడు విమర్శలు, రాజకీయాలతో వివాదాలలో చిక్కుకున్నాడు. చివరకు బదిలీల మధ్య నలిగిపోతోంది ఆయన ప్రయాణం. యాంటీ నార్కోటిక్స్ మాజీ అధికారి సమీర్ వాంఖేడేపై మరో బదిలీ వేటు పడింది. తాజాగా ఆయన్ని చెన్నైలోని పన్నుల శాఖ విభాగానికి డైరెక్టోరేట్ జనరల్‌గా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముంబై: షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌పై ఆరోపణలు వచ్చిన ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసును దర్యాప్తు చేసింది తొలుత ఈయనే. అయితే ఈ విచారణ సందర్భంగా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీంతో ఈ కేసు నుంచి తప్పించి.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)కు పంపారు. ఆపై ముంబైలోని అనలైటిక్స్ అండ్ రిస్క్‌మేనేజ్‌మెంట్‌కు బదిలీ చేశారు. ఇప్పుడేమో నాన్-సెన్సిటివ్ పోస్టింగ్ మీద చెన్నైకు బదిలీ చేశారు. షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ లభించిన నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చీఫ్‌గా ఉన్న టైంలో క్రూయిజ్ డ్రగ్స్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చాడాయన. దీంతో ఆయన్ని అంతా హీరోగా చూశారు. అయితే దర్యాప్తులో ఆయన పక్కాగా వ్యవహరించలేదని, కీలక విషయాల్ని పొందుపర్చలేదని, పైగా ఆర్యన్ ఖాన్‌ను ఇరికించే ప్రయత్నం చేశాడంటూ విమర్శలు వచ్చాయి. దీంతో గుర్రుగా ఉన్న కేంద్రం.. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఇక ఉద్యోగంలో చేరే సమయంలో ఫేక్ కాస్ట్ సర్టిఫికెట్ సమర్పించారని ఆయనపై మరో ఆరోపణ ఉండగా.. దానిపైనా విచారణ జరుగుతోంది. ముంబైలో పుట్టి, పెరిగిన సమీర్ వాంఖడే.. ఆయన తల్లిదండ్రులది మతాంతర వివాహం కావడంతో చిక్కుల్ని ఎదుర్కొంటున్నారు. 2008 ఇండియన్ రెవెన్యూ బ్యాచ్ కు చెందిన సమీర్ వాంఖడే.. అత్యున్నత దర్యాప్తు సంస్థలలో పనిచేయడంతో పాటు దాదాపు ప్రతి చోటా మెడల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ► 2008లో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్లో ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్న సమీర్.. ముంబై ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసినప్పుడు కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టే సెలబ్రెటీల పాలిట సింహస్వప్నంగా మారాడు. ► 2010లో మహారాష్ట్ర టాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన సమీర్. ఆ ఏడాది 2,500 మంది టాక్స్ ఎగవేత దారులపై కేసులు నమోదు చేశారు.. ఇందులో 200 మందికి పైగా సెలబ్రెటీలే ఉన్నారు.. ఆ ఏడాది ముంబైలో అదనంగా 87 కోట్ల పన్నులు వసూలు అయ్యింది. ► తను ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వర్తించే సమయంలో జరిగిన 2011 క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీకి సైతం కస్టమ్ డ్యూటీ వేశారు సమీర్.. బాలీవుడ్ సెలబ్రెటీల ఇళ్లల్లో అనేక రైడ్లు చేశారు.. ఇందులో అనురాగ్ కశ్యప్, వివేక్ ఒబేరాయ్, రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు. ► బ్యాంకాక్ నుంచి తిరిగి వచ్చిన సింగర్ మికా సింగ్.. దగ్గర నిబంధనలకు మించి కరెన్సీ, మద్యం దొరకడంతో అదుపులోకి తీసుకున్నాడు సమీర్. ఆపై నాలుగు గంటల తర్వాత లక్ష రూపాయల జరిమానాతో మికాను విడుదల చేశాడు. ► 2014-16 మధ్య డిప్యూటేషన్‌పై ఎన్ఐఏలో పనిచేసిన సమీర్.. ఆ సమయంలో ఎన్నో హై ప్రొఫైల్ టెర్రరిస్ట్ కేసులను హ్యాండిల్ చేసి ఎక్సలెన్స్ ఇన్ సర్వీస్ మెడల్ కూడా అందుకున్నారు.. ► ఆ తర్వాత 2017-20 మధ్య డీఆర్ఐ జాయింట్ డైరెక్టరేట్‌గా బదిలీ అయ్యారు.. ఆ సమయంలో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 180 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ గుర్తించి.. సమీర్ ఓ రికార్డ్‌నే సృష్టించారు. ► బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో కూడా సమీర్ వాంఖడేను ఏరికొరి మరి పిలిపించుకోని దర్యాప్తు బాధ్యతలను అప్పగించింది ఎన్సీబీ.. అప్పటి నుంచే ఈ కేసు దర్యాప్తులో వేగం పెరిగింది. ఈ కేసు టేకప్ చేశాక 33 మందిని అరెస్ట్ చేశారాయన. ► ఎన్సీబీలో తన పదవీ కాలం ముగుస్తుందనగా క్రూయిజ్ షిప్ డ్రగ్ రాకెట్ ను బయట పెట్టారు సమీర్… దీంతో ఆయన పదవీకాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది ఎన్సీబీ. ► అయితే ఎన్నో కేసుల్లో నిందితులతో ముందుగానే వాంగ్మూలాలను ఇప్పించేవారని.. దీనికి తన సోదరి క్రిమినల్ లాయర్ యాస్మిన్‌కు కూడా లింక్ ఉందన్న ఆరోపణలు వచ్చాయి. దానిపై సమీర్ కూడా కౌంటర్ ఇస్తూనే ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు.. నిజాయితీపరుడు, హీరో అనే ప్రశంసలు అందుకున్న ఓ అధికారి అవమానకరరీతిలో ఇలా బదిలీలు ఎదుర్కొవాల్సి వస్తోంది. సంబంధిత వార్త: నేను దళితుడినే.. సమీర్ వాంఖెడే -
పాలనలో ప్రవీణ్ ముద్ర
సాక్షి, విజయవాడ: ప్రజా సమస్యలను సత్వరం ఎలా పరిష్కరించవచ్చో.. పారదర్శకంగా పని చేస్తే ఎలాంటి ఫలితాలొస్తాయో.. చేసి చూపించారాయన. మారువేషంలో వెళ్లి అక్రమాలు బట్టబయలు చేశారు. అర్ధరాత్రి ఆస్పత్రులు సందర్శించారు. ఏడాది పాలనలో విజయవాడ సబ్ కలెక్టర్‌గా యువ ఐఏఎస్ అధికారి జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ర పాలనలో తనదైన ముద్ర వేశారు. ప్రజల సమస్యలపై సత్వరమే స్పందించి, వాటి పరిష్కారానికి కృషి చేశారు. ప్రభుత్వాస్పత్రి ప్రక్షాళన.. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు అందుతున్న వైద్య సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు. అర్ధరాత్రి ఆస్పత్రిని సందర్శించడం, ఉదయం 6 గంటలకు, రాత్రి 10 గంటలు ఇలా అన్ని వేళల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వైద్య సేవల్లో పురోగతికి కృషి చేసారు. కోవిడ్ సమయంలో ఐసోలేషన్ వార్డుల్లోకి వెళ్లి, అక్కడ కోవిడ్ రోగులకు అందుతున్న సేవలను వారినే అడిగి తెలుసుకున్నారు. కొత్తగా సూపర్‌స్పెషాలిటీ విభాగాలు తీసుకు రావడం, పోస్టులు మంజూరు వంటి అంశాల్లో ఎంతో కృషి చేసారు. తన పాలనతో ప్రభుత్వాస్పత్రిని ప్రక్షాళన చేసారు. చదవండి: (పరిశ్రమలకు 'పవర్' ఫుల్) ఎరువుల అక్రమాలకు అడ్డుకట్ట... విజయవాడ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలినాళల్లో మారువేషంలో వెళ్లి ఎరువుల అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. నాటి కలెక్టర్ నివాస్ ఆదేశాలతో కైకలూరులో రైతు వేషంలో బైక్‌పై ఎరువుల దుకాణానికి వెళ్లి , వారి అక్రమాలను బట్టబయలు చేశారు. స్పందన అర్జీలకు సత్వర పరిష్కారం.. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో తనకు వచ్చే అర్జీలపై సత్వరమే స్పందించి చర్యలు తీసుకునే వారు. దీంతో సబ్‌కలెక్టర్ ప్రవీణ్‌చంద్‌కు అర్జీ ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందని భావించిన ప్రజలు పెద్ద ఎత్తున స్పందనలో వినతులు ఇచ్చేందుకు వచ్చేవారు. ప్రస్తుతం సబ్ కలెక్టర్ ప్రవీణ్‌చంద్ వైఎస్సార్ కడప నగరపాలక సంస్థ కమిషనర్‌గా బదిలీపై వెళ్లనుండటంతో ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడుతున్నారు. -
ఏపీలో 15 మంది ఐపీఎస్‌ల బదిలీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదిహేను మంది ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీ ప్రక్రియ జరిగింది. మంగళవారం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పేరు మీదుగా ప్రభుత్వ జీవో విడుదల అయ్యింది. ఎల్‌కేవీ రంగారావు, ఎస్వీ రాజశేఖర బాబు, పీహెచ్డీ రామకృష్ణ, కేవీ మోహన్ రావు, ఎస్ హరికృష్ణ, గోపినాథ్ జట్టి, కోయ ప్రవీణ్, విశాల్ గున్నీ, రవీంద్ర బాబు, అజిత వెజెండ్ల, జీ కృష్ణకాంత్, పీ జగదీశ్, తుహిన్ సిన్హా, బిందు మాధవ్ గరికపాటి, పీవీ రవికుమార్ బదిలీ జాబితాలో ఉన్నారు. విజయవాడ రైల్వే ఎస్పీగా విశాల్ గున్నీకి అదనపు బాధ్యతలు అప్పగించగా, శాంతి భద్రతల డీఐజీగా రాజశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కోస్టల్ సెక్యూరిటీ డీఐజీగా ఎస్ హరికృష్ణకు, న్యాయవ్యవహారాల ఐజీపీగా గోపీనాథ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. గుంతకల్లు రైల్వే పోలీస్ సూపరింటెండెంట్‌గా అజిత వేజెండ్లకు అదనపు బాధ్యతలు అప్పగించగా, పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు డీఎన్ మహేష్‌ను బదిలీ చేశారు. ఐజీపీ స్పోర్ట్స్, సంక్షేమ బాధ్యతలు ఎల్ కె వి రంగారావుకు, గ్రేహౌండ్స్ డీఐజీగా గోపీనాథ్ శెట్టికి బాధ్యతలు అప్పగించారు. ఇక ప్రస్తుతం కాకినాడ ఎస్పీగా ఉన్న రవీంద్రనాథ్ బాబుకు కాకినాడ థర్డ్ బెటాలియన్ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ డీఐజీగా పీహెచ్డీ రామకృష్ణ బదిలీ కాగా, 16వ బెటాలియన్ కమాండెంట్‌గా కోయ ప్రవీణ్‌ను బదిలీ చేశారు. పల్నాడు అదనపు ఎస్పీ అడ్మిన్‌గా బిందు మాధవ్ బాధ్యతలు తీసుకోనున్నారు. తాజా బదిలీలు, పోస్టింగ్‌లు తక్షణమే అమలులోకి వస్తాయని సీఎస్ తాజా జీవోలో పేర్కొన్నారు. -
సీఎస్ సోమేశ్ బదిలీ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ బదిలీకి రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. త్వరలోనే సోమేశ్ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేయనున్నట్లు సచివాలయంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2023లో ఎన్నికలు జరిగే వరకు సోమేశ్ కుమార్ సీఎస్‌గా కొనసాగుతారని భావించినా.. ఇటీవలి పరిణామాలను చూస్తే ఆయన బదిలీ తప్పదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల సోమేశ్ కుమార్ తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులతో ఢిల్లీలో గత వారం నిర్వహించిన సదస్సులో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ సీఎస్ తీరును వివరించారు. సీఎం కేసీఆర్, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సోమేశ్ కుమార్‌తో ఇటీవల తాను సమావేశమైనప్పుడు న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు సమస్యలను వారికి వివరించానని, వాటిపై కేసీఆర్ స్పందించి.. రెండు రోజుల్లో పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్‌ను ఆదేశించారని, అయినా నేటి వరకు సీఎస్ నుంచి సరైన స్పందన లేదని హైకోర్టు సీజే.. జస్టిస్ ఎన్వీ రమణ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే సీజేఐ.. ముఖ్యమంత్రి, హైకోర్టు సీజే కలిసి తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుండా సీఎస్ పెండింగ్‌లో పెట్టడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితోపాటు సీఎస్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని, కొంతమంది ఉన్నతాధికారులను మినహా ఇతరులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ధరణి పోర్టల్‌లోని పొరపాట్లను దిద్దడంలో విపరీతమైన జాప్యం వల్ల రైతులు ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. హైకోర్టులో కూడా సీఎస్‌పై అనేక వ్యాజ్యాలు నడుస్తున్నాయి. దీనికితోడు ఆయనను ఏపీకి పంపించాలని కేంద్రం సైతం పిటిషన్ వేయడంపై విచారణ జరుగుతోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సోమేశ్ బదిలీ జరుగుతుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఆయన స్థానంలో భర్తీ చేయడానికి సీనియర్ అధికారుల పేర్లను పరిశీలిస్తున్నారు. -
జూన్‌లో టీచర్లు.. బదిలీలు, పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను జూన్ మొదటి వారంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఈ నెలాఖరులోగా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. బదిలీలు, ట్రాన్స్ఫర్లపై ఉపాధ్యాయ సంఘాలతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం మరో దఫా చర్చలు జరుపనున్నారు. అయితే అన్ని స్థాయిల్లో ప్రమోషన్లకు అవకాశం లేకపోవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. జిల్లా విద్యా శాఖాధికారులు (డీఈవో), ఎంఈవోలు, డైట్ లెక్చరర్ల ప్రమోషన్లకు సంబంధించి కోర్టు కేసులున్నాయి. ఇవి పరిష్కారం అయ్యాకే పదోన్నతులు కల్పించే వీలుంది. ఈ నేపథ్యంలో న్యాయపరమైన సమస్యల పరిష్కారం చేపడుతూనే ఇబ్బందుల్లేని వాటిల్లో ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు ఎలా ఉండాలో ఉపాధ్యాయ సంఘాలు, టీచర్స్ ఎమ్మెల్సీల నుంచి మంత్రి సలహాలు తీసుకోనున్నారు. వీటిపై అధికారులతో చర్చించి, సీఎం దృష్టికి తీసుకెళ్తారని విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. అన్ని స్థాయిల్లో ఏకకాలంలో బదిలీలు, పదోన్నతులు కల్పించాలన్న డిమాండ్ వస్తుండటంతో మంత్రి ఆకస్మికంగా చర్చలు జరపడం ప్రాధాన్యం ఏర్పడింది. హెచ్ఎం స్థాయి వరకూ ఓకే సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) నుంచి స్కూల్ అసిస్టెంట్ స్థాయికి పదోన్నతి పొందాల్సిన వారు దాదాపు 8,500 మంది ఉన్నారు. గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందాల్సిన వాళ్లు 1,970 మంది ఉన్నారు. వీటిల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని విద్యా శాఖ భావిస్తోంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులను ఉమ్మడి సీనియారిటీ ప్రకారం పాత నిబంధనల మేరకే ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే అప్‌గ్రేడ్ చేసిన పోస్టుల విషయంలో కొన్ని కోర్టు వివాదాలు, పాలన పరమైన సమస్యలున్నాయి. దీనిపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం కన్పించట్లేదు. భాషా పండితుల పదోన్నతులకు బ్రేక్ పడే వీలుందని తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరంలో 1–8 తరగతులకు ఇంగ్లిష్ మీడియంలో బోధించాలని నిర్ణయించిన సర్కారు.. ఇప్పటికే ఇంగ్లిష్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించింది. మరోవైపు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో భాగంగా కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులు జరిగాయి. వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుని సీనియారిటీని రూపొందించాల్సి ఉంది. దీనిపై సమావేశంలో ఓ స్పష్టత వచ్చే వీలుందని అధికారులు భావిస్తున్నారు. టెన్త్ పరీక్షలు కాగానే.. వాస్తవానికి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను మే నెలలోనే పూర్తి చేయాలని భావించారు. కానీ మే 23 నుంచి 10వ తరగతి పరీక్షలు మొదలవుతాయి. ఇవి జూన్ 1 వరకు కొనసాగుతాయి. ఈ పరీక్షలు ముగియగానే బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని నిర్ణయించారు. ప్రత్యక్ష విధానంలో బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నా ఆన్లైన్ విధానంలో వెబ్ ఆప్షన్ల ద్వారానే ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 317 జీవో అమలులో అనేక సమస్యలతో విద్యా శాఖ ఇబ్బంది పడుతోంది. బదిలీల ప్రక్రియలో ఇది సమస్య తీవ్రతను పెంచుతుందనే సంకేతాలు రావడంతో వెబ్ ఆధారిత బదిలీ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. త్వరగా పూర్తి చేయాలి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను త్వరగా, వివాద రహితంగా పూర్తి చేయాలి. అన్ని స్థాయిల్లో పోస్టులను భర్తీ చేస్తేనే విద్యా శాఖ బలోపేతమవుతుంది. న్యాయపరమైన చిక్కులను పరిష్కారానికి సమన్వయంతో ముందుకెళ్లాలి. – చావ రవి, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఇప్పుడే ‘ఎన్నికల’ బదిలీలు!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం గా పోలీసుశాఖలో బదిలీలకు కసరత్తు జరుగుతోంది. ఎన్నడూ లేనివిధంగా అధికారుల ప్రొఫైల్స్‌ను ఇంటెలిజెన్స్ విభాగం వడపోస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇటు నేతలకు ఇబ్బందిలేకుండా, అటు ఎన్నికల కోడ్ సందర్భంగా ఈసీ వేటు పడకుండా ఉండేలా అధికారుల జాబితాపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ రెండేళ్లపాటు వారిని కదిపే అవసరం రాకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ కూడా.. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు ఇంటెలిజెన్స్ చీఫ్ చాలా ముఖ్యమైన అధికారి. రాష్ట్రంలోని అన్ని విభాగాలు, అన్ని రాజకీయ పార్టీలు, ఆ పార్టీ నేతల కదలికలు వంటి విషయాలను ప్రభుత్వానికి చేరవేయడంలో వారే కీలకం. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంటెలిజెన్స్ చీఫ్‌ను మా ర్చాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత అధికారిస్థానంలో రాజధానిలోని కీలక కమిషనరేట్‌కు బా«ధ్యులుగా ఉన్న సీనియర్ ఐపీఎస్‌ను నియమించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఆ కమిషనర్ల మార్పు కూడా.. కరీంనగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, సిద్ధిపేట సహా కీలకచోట్ల పోలీస్ కమిషనర్లను మార్చేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. పదోన్నతులు పొందడం, లాంగ్ స్టాండింగ్, వివాదాస్పద అంశాలు వంటి కారణాల రీత్యా సంబంధిత అధికారులను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇక సిరిసిల్ల, జగిత్యాల, వనపర్తి, సూర్యాపేట, గద్వాల ఎస్పీలతోపాటు వరం గల్, పెద్దపల్లిలోని డీసీపీలను మార్చనున్నట్టు తెలిసింది. ఆయా కమిషనరేట్లలో శాంతిభద్రతల విభాగంలో అదనపు ఎస్పీలుగా పనిచేస్తున్న అధికారులను మార్చే కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. అటాచ్డ్ అధికారులకు జూన్‌లో.. రాష్ట్రంలో 20 మందికిపైగా పదోన్నతి పొంది వెయిటింగ్, అటాచ్మెంట్, లుక్ ఆఫ్టర్ ఆదేశాలతో ఉన్న ఐపీఎస్ అధికారులకు జూన్ తొలి వారంలో పోస్టిం గ్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. జోన్లు, అదనపు సీపీలు, ఇంటెలిజెన్స్, సీఐడీ, ఏసీబీ, జైళ్లశాఖ, అగ్నిమాపక శాఖ తదతర విభాగాల అధికారులను కూడా బదిలీ చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. వీరిలో కొందరిని కమిషనర్లుగా నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇన్‌స్పెక్టర్లకూ సిఫార్సులు! జిల్లాలతోపాటు కమిషనరేట్లలో పనిచేస్తున్న ఎస్‌హెచ్‌వోలు (ఇన్స్పెక్టర్లు), సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీ లు సైతం ఎన్నికలే లక్ష్యంగా జరగనున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ఇన్స్పెక్టర్లను ఇప్పటినుంచే ఎంచుకుని పోస్టింగ్ ఇప్పించుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇలా సిఫార్సుల కోసం ఇతర జిల్లా లేదా ఇతర రేంజ్ పరిధిలో పనిచేసిన వారిని ఎంచుకోవాలని సూచనలు వచ్చినట్టు తెలిసింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమిషనరేట్లు, జిల్లా యూనిట్లలో ఎలక్షన్ కమిషన్ కొందరు అధికారులను బదిలీ చేసింది. ఈసారి అలా జరగకుండా ఉండేందుకే.. స్థానికత, వివాదాలు, పనితీరు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సిఫార్సులు చేయాలని సూచనలు వచ్చినట్టు సమాచారం. వచ్చే నెలాఖరు నాటికి కసరత్తు పూర్తిచేసి జూన్‌లో బదిలీలు చేపట్టనున్నట్టు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులకు ప్రాధాన్యత రాష్ట్రంలో డీఎస్పీలు, ఏసీపీల బదిలీలు భారీగా ఉంటాయని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఆరు నెలలుగా బదిలీ కోసం నేతల చుట్టూ తిరుగుతున్న డీఎస్పీ/ఏసీపీలకు జూన్ మొదటివారంలో మోక్షం కలుగుతుందని తెలిసింది. డీఎస్పీ పోస్టింగ్ విష యంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు పోలీస్‌శాఖలో చర్చ జరుగు తోంది. ఆయా జిల్లాల్లో ఎక్కువకాలం పనిచేయనివారు, వివాదాలు లేని అధికారులకే సిఫార్సులు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. పోస్టింగ్‌ల కోసం ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సులపై ఇంటెలిజెన్స్‌లో అధికారులు పరిశీలన చేస్తారని, సంబంధిత అధికారి పూర్తి ప్రొఫైల్‌ను పరిశీలించాకే పోస్టింగ్‌కు ఆదేశాలు వెలువడతాయని సమాచారం. -
సీఎం భగవంత్ మాన్ మరొకటి.. చండీగఢ్ పంజాబ్‌కే సొంతం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో సంచలనానికి తెర తీశారు. శుక్రవారం విధాన సభ ప్రత్యేక సమావేశాల్లో ఒక తీర్మానం ప్రవేశపెట్టారాయన. చండీగఢ్ నగరాన్ని పంజాబ్‌కు బదిలీ చేయాలంటూ తీర్మానం చేశారాయన. చండీగఢ్‌పై సర్వహక్కులు తమవేనని, వెంటనే దానిని వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేశారాయన. కేంద్రపాలిత ప్రాంత హోదాలో చండీగఢ్ ప్రస్తుతం పంజాబ్-హర్యానాల సంయుక్త రాజధానిగా ఉన్న సంగతి తెలిసిందే. పరిపాలనాపరంగా 60:40గా పంజాబ్, హర్యానాలు చండీగఢ్‌నును పంచుకుంటున్నాయి. ఈ తరుణంలో చండీగఢ్‌పై సర్వహక్కులు పంజాబ్‌వేనని, అందుకే పూర్తిగా పంజాబ్‌కు బదిలీ చేయాలంటూ ఒక తీర్మానం చేశారు సీఎం భగవంత్ మాన్. దీనికి ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా మద్దతు ప్రకటించగా.. తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇదిలా ఉండగా.. పంజాబ్ సర్వీస్ రూల్స్‌కు బదులు ఛండీగఢ్ ఉద్యోగులకు సెంట్రల్ సర్వీస్ రూల్స్ వర్తిస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ మధ్య ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కౌంటర్‌గా చండీగఢ్.. పంజాబ్‌కే పూర్తి రాజధానిగా ఉండాలంటూ తీర్మానం సీఎం భగవంత్ మాన్ ప్రవేశపెట్టడం విశేషం. తీర్మానం సందర్భంగా.. భగవంత్ మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఛండీగఢ్ నుంచి కాకుండా బయటి వాళ్లను(కేంద్ర సర్వీస్ ఉద్యోగులతో) నియమించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారాయన. అంతేకాదు ఇంతకాలం కొనసాగిన సమతుల్యతను దెబ్బ తీయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారాయన. భాక్రా బియస్ మేనేజ్మెంట్ బోర్డులో కేంద్ర ఉద్యోగుల్ని నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారాయన. ఛండీగఢ్ పంజాబ్ రాజధానిగా పునరుద్ఘాటించిన సీఎం మాన్.. ఇంతకు ముందు ఇలా రాష్ట్రాలు విడిపోయిన సందర్భాల్లో రాజధాని మాతృరాష్ట్రంతోనే ఉన్న విషయాన్ని సైతం ప్రస్తావించారు. కాబట్టి, చంఢీగఢ్ను పంజాబ్‌కు బదిలీ చేయాలని అన్నారు. గతంలో సభ ఇందుకు సంబంధించి ఎన్నో తీర్మానాలు చేసినా లాభం లేకుండా పోయిందని, ఈసారి దానిని సాధించి తీరతామని చెప్పారాయన. పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 1966 ప్రకారం.. పంజాబ్ రాష్ట్రం ఏర్పడింది. ఆపై పునర్వ్యవస్థీకరణతో హర్యానా పుట్టుకొచ్చింది. ఛండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా, పంజాబ్‌లో కొంత భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లో కలిసిపోయాయి. అప్పటి నుంచి భాక్రా బియస్ మేనేజ్మెంట్ బోర్డు లాంటి సంయుక్త ఆస్తుల మీద పరిపాలనను పంజాబ్-హర్యానాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. -
సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డి
AP: ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె.ఎస్.జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. టీటీడీ ఈవో అదనపు బాధ్యతలను ఆయనకే కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో ఎనిమిదిమంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీచేశారు. చదవండి: ‘జగనన్న తోడు’ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే.. -
టీచర్‌కు విద్యార్థుల వినూత్న వీడ్కోలు.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!
కోల్కత్తా: మనం ఏ స్థాయిలో ఉన్నా మనకు విద్య నేర్పించిన గురువులను గుర్తుపెట్టుకుట్టాం. వారికి తగిన గౌరవం ఇస్తాం. మనకు నచ్చిన టీచర్ బదిలీ అవుతున్న సందర్బంగా వారికి గుర్తుండిపోయేలా ఫెర్వల్ను ప్లాన్ చేస్తుంటం. తాజాగా ఇలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బెంగాల్‌లోని 24 పరగణా ప్రాంతంలో కటియాహట్ బికేఏపీ బాలికల పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో సంపా అనే టీచర్ విధులు నిర్వహిస్తోంది. ఆమెతో పాఠశాలలోని విద్యార్థులకు అవినాభావ సంబంధం ఏర్పడింది. ఇదిలా ఉండగా ఆమె బదిలీ అవుతున్నారన్న విషయం తెలుసుకున్న విద్యార్థులు ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. Students pouring out their love to Sampa mam, probably one of the best teachers in the world. @iamsrk pic.twitter.com/XEQg7MFTbk — kishan kuliyal (@KishanlalK) February 19, 2022 ఈ క్రమంలోనే తమకు ఎంతో ఇష్టమైన టీచర్‌కు వినూత్నంగా వీడ్కోలు పలకాలని భావించారు. దీని కోసం విద్యార్థులు టీచర్ కళ్లకు గంతలు కట్టారు. ఆ తర్వాత ఆమెను పాఠశాల గ్రౌండ్లోకి తీసుకెళ్లి.. విద్యార్థినిలందరూ మోకాళ్లపై కూర్చుని.. ‘రబ్నే బనాదీ జోడి’ సినిమాలోని ఒక పాటను పాడారు. ఆ తర్వాత టీచర్ ముందు కూర్చుని గులాబీ పువ్వులను ఆమెకు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కన్నీరు పెట్టుకోవడంతో సంపా కూడా ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ఆమె వారిని హత్తుకుని ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసి వారంతా తమ స్కూల్ డేస్ గుర్తుకు వస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
తుది తీర్పునకు లోబడే ఉపాధ్యాయుల కేటాయింపులు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులపై తెలంగాణ హైకోర్టులో విచారణ మొదలైంది. ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులు తుది తీర్పునకు లోబడే జరగాలని ఈ సందర్భంగా బెంచ్ స్పష్టం చేసింది. జీవో 317పై స్టే ఇవ్వాలని ఉపాధ్యాయుల తరపు న్యాయవాదులు కోరగా.. కొత్త జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులు విధుల్లో చేరారని అదనపు ఏజీ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో జీవో 317పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అంతేకాదు పిటిషన్లపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశిస్తూ.. ఉపాధ్యాయుల పిటిషన్లపై తదుపరి విచారణ ఏప్రిల్ 4కి వాయిదా వేసింది. -
‘పిల్లలను చూసైనా బతకాలనిపించలేదా?’
సాక్షి, మోర్తాడ్ (నిజామాబాద్): వేరే జిల్లాకు బదిలీ కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయురాలు సరస్వతికి కుటుంబ సభ్యులు, సహచర ఉపాధ్యాయులు కన్నీటితో వీడ్కోలు పలికారు. భీమ్‌గల్ మండలం బాబాపూర్‌లో సోమవారం పోలీసు బందోబస్తు నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. సరస్వతి ఆత్మహత్య విషయం తెలిసి ఖతర్‌లో ఉంటున్న ఆమె భర్త భూమేశ్ హుటాహుటిన స్వగ్రామానికి వచ్చారు. రాజకీయ నాయకులు రాకుండా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఇతర పార్టీల నాయకులు వచ్చే అవకాశం ఉందనే సమాచారంతో గ్రామానికి వచ్చే అన్ని దారుల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. టీఎస్ యూటీఎఫ్, తపస్, డీటీఎఫ్ తదితర సంఘాల నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సరస్వతి ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని, ఆమె ఆశయాలను సాధించడానికి, జీవో నెం.317 జీవో రద్దు చేసే వరకు పోరాడతామని హెచ్చరించారు. సరస్వతి అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు మంత్రి పర్యటన రద్దు.. రైతుబంధు పెట్టుబడి సహాయం రూ.50 వేల కోట్లకు చేరిన నేపథ్యంలో నిర్వహిస్తున్న సంబురాల్లో పాల్గొనడానికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే, సరస్వతి ఆత్మహత్య అనంతరం ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయోననే సందేహంతో మంత్రి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. చదవండి: (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. అదే కారణమా..?) ‘పిల్లలను చూసైనా బతకాలనిపించలేదా?’ ‘గాంధారిలో ఉద్యోగం చేయడం ఇష్టం లేకుంటే రాజీనామా చేయు అని చెప్పానుగా సరస్వతి.. ఉద్యోగం మానేస్తే మరో నాలుగేళ్లు ఎక్కువ కష్టపడతా అన్నానుగా.. రామ్లక్ష్మణ్లను మంచిగా చదివించుకోవడమే ముఖ్యం అంటే సరే అన్నావు.. మరి ఎందుకిలా చేశావు సరస్వతి.. నా ముఖం, పిల్లల ముఖం చూసైనా బతుకుదామనిపించలేదా సరస్వతి... నీ దారిన నీవు పోయి మా అందరి దారి మూసేసావు సరస్వతి..’ అంటూ భర్త భూమేశ్ విలపించడం అక్కడున్న వారిని కలిచి వేసింది. పదేళ్ల నుంచి ఖతర్‌లో ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న భూమేష్ ఏడాది కిందనే సెలవుపై వచ్చి వెళ్లాడు. మరో ఏడా ది తరువాత ఇంటికి రావాల్సి ఉండగా భార్య సరస్వతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పా ల్పడిన విషయం తెలుసుకుని సోమవారం హుటాహుటిని ఇంటికి చేరుకున్నాడు. -
మూడు రోజుల్లో ముగ్గురు ఎస్సైలు.. కారణమేంటంటే
సాక్షి, కోనరావుపేట (కరీంనగర్): కోనరావుపేట పోలీస్‌స్టేషన్‌లో మూడు రోజుల్లో ముగ్గురు ఎస్సైలు విధులు నిర్వర్తించారు. ఇప్పటి వరకు ఎస్సైగా పనిచేసిన క్రాంతికిరణ్ ఈ నెల 6న బదిలీ కాగా.. 7వ తేదీన శ్రీనివాస్ జాయినయ్యారు. ఆయన వచ్చిన కొద్ది గంటల్లోనే మరో ఎస్సై శ్రీరాం ప్రేమ్‌దీప్‌కు కోనరావుపేట పోలీస్‌స్టేషన్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శనివారం శ్రీరాం ప్రేమ్‌దీప్ బాధ్యతలు స్వీకరించారు. కత్తులతో వీరంగం.. పరస్పరం ఫిర్యాదు తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఒక యువకుడిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి కత్తులతో దాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు.. ఇటీవల గ్రామానికి తిరిగొచ్చాడు. అతనికి గ్రామంలోనే ఉంటున్న మరో యువకుడి మధ్య వాగ్వాదం జరిగింది. పక్కనే ఉన్న గౌడ్‌కులస్తుని దగ్గర నుంచి కల్లుగీసే కత్తులను లాక్కుని దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆ యువకుడు ప్రాణ భయంతో పరుగులు పెట్టాడు. ఈ ఘటనపై పోలీసులను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: నీ కూతురు వేరే వ్యక్తితో చాటింగ్ చేసింది.. డిలీట్ చేయాలంటే! -
పక్షవాతంతో ఉన్నా హెచ్ఎం బదిలీ.. మనస్తాపానికి గురై..
సాక్షి,మహబూబాబాద్ రూరల్: ఆర్నెల్లుగా పక్షవాతంతో బాధపడుతున్నానని.. స్పౌజ్ కేట గిరీనీ పరిగణనలోకి తీసుకొని తనను బదిలీ చేయొద్దని కోరినప్పటికీ ప్రభుత్వం బదిలీ చేసిందనే ఆవేదనతో ఓ ప్రధానోపాధ్యాయుడు గుండెపోటుతో మృతిచెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పంచముఖ ఆంజనేయస్వామి సమీపంలో నివసించే బానోతు జైత్రాం (57) నెల్లికుదురు మండలం చిన్నముప్పారం ఎంపీపీఎస్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచేస్తున్నాడు. ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలు చేపడుతున్న నేపథ్యంలో జైత్రాం తనను స్పౌజ్ కేటగిరీ కింద మహబూబాబాద్ జిల్లాలోనే ఉంచాలని ఆప్షన్ ఇచ్చాడు. తన భార్య పద్మ మహబూబాబాద్ జిల్లా సంధ్య తండాలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నందన ఈ ఆప్షన్‌ను ఎంచుకున్నాడు. అయినప్పటికీ ఆయనకు ములుగు జిల్లాకు బదిలీ కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులుగా బజారుకు వెళ్లగా.. దీనిపైనే మదనపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో పడిపోయాడు. కుటుంబ సభ్యులు తిరిగొచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్నాడు. హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన వారికి నేడు నగదు జమ
-
పథకాలు అందని అర్హులకు నగదు జమ చేసిన సీఎం జగన్
Live Updates: ►సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన వారికి మంగళవారం ఆయన నగదు జమ చేశారు. కంప్యూటర్లో బటన్ నొక్కి 9,30,809 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.703 కోట్లు జమ చేశారు. Time:11:06 AM ►గతంలో సంక్షేమ పథకాలకు ఎదురు చూసే పరిస్థితి ఉండేదని.. నేడు ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. నేడు అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన వారికి నగదు జమ చేస్తున్నామన్నారు. 9,30,809 మంది ఖాతాల్లో రూ.703 కోట్లు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. Time:10:50 AM ఇచ్చిన ప్రతీ మాట సీఎం జగన్ నిలబెట్టుకుంటున్నారు: పెద్దిరెడ్డి ►ఇచ్చిన ప్రతీ మాట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకుంటున్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.ఇంటింటికీ నవరత్నాలు అందిస్తున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. సాక్షి, అమరావతి: ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ పథకాలకు సంబంధించి, అర్హత ఉన్నప్పటికీ సాయం పొందలేకపోయిన 9,30,809 మంది లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.703 కోట్లను జమ చేయనున్నారు. ఇంతే కాకుండా 3,44,497 మందికి పెన్షన్ కార్డులు, 3,07,599 మందికి బియ్యం కార్డులు, 1,10,880 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 90 రోజుల్లో ఇళ్లపట్టాల లబ్ధిదారులతో కలిపి మొత్తంగా 18,47,996 మందికి ప్రయోజనం కల్పించనున్నారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు జమ చేయనున్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరోసారి వెరిఫికేషన్ చేసి.. ఏటా జూన్, డిసెంబర్లలో సంక్షేమ పథకాల లబ్ధి అందజేస్తామని సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో సాధ్యమైనంత మందికి పథకాల లబ్ధిని ఎలా ఎగ్గొట్టాలా అనే ఆరాటమే కనిపించేది. ఇప్పుడు అర్హులైన ఏ ఒక్కరూ పథకాల లబ్ధికి దూరం కాకూడదనే సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ► అర్హులై ఉండి, ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారు.. సంక్షేమ పథకం అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తులు పరిశీలించి, అర్హులైన వారికి డిసెంబర్ నుండి మే వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి జూన్‌లో లబ్ధి కల్పిస్తారు. జూన్ నుండి నవంబర్ వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి డిసెంబర్లో లబ్ధి కల్పిస్తారు. ► వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత పారదర్శకంగా సోషల్ ఆడిట్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాను ప్రదర్శించి, నూటికి నూరు శాతం సంతృప్త స్ధాయిలో అర్హులకు లబ్ధి కల్పిస్తోంది. ► వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ (మహిళలు), వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు రబీ (2019–20), ఖరీఫ్ (2020), వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ (రెండవ విడత), జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ వాహన మిత్ర, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ నేతన్న నేస్తం, పెన్షన్ కార్డులు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాల పథకాల కింద నేడు లబ్ధి పొందనున్న వారి సంఖ్య 18,47,996. గత ప్రభుత్వ తీరు ఇలా ► అస్మదీయులకు మాత్రమే సంక్షేమ ఫలాలు. అర్హులకు ఎలా ఎగ్గొట్టాలనే ఆలోచనలు. సంక్షేమానికి ఎలా కోత పెట్టాలా అనేపరిస్థితి. ► తమ వర్గం, తమ పార్టీ, తమ వారికే లబ్ధినందించే పక్షపాత జన్మభూమి కమిటీలు. ►సంక్షేమ పథకాల లబ్ధి కోసం ఆత్మాభిమానాన్ని చంపుకుని వృద్ధులు, దివ్యాంగులు, అక్కచెల్లెమ్మలు కాళ్లరిగేలా జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి మోకరిల్లాల్సిన దీనస్థితి. అయినా తప్పని లంచాలు, వివక్ష. ► గ్రామానికి ఇంత మందికే లబ్ధి అనే కోటాలు. ► లబ్ధిదారుల ఎంపికలో కాలయాపన, ఎంత లబ్ధి కల్పిస్తారో.. ఎప్పుడు అందజేస్తారో తెలియని అనిశ్చితి. ► పథకాల సొమ్మును లబ్ధిదారుల ఇతర రుణాలకు జమ చేసుకునే దుస్థితి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇలా.. ►కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా.. అవినీతి, వివక్ష, ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు. ►అర్హులై ఉండి ఒకవేళ ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందని వారికి మరో అవకాశమిస్తూ ప్రతి ఏటా రెండు సార్లు లబ్ధి కల్పిస్తున్నారు. ►సంక్షేమ పథకాల లబ్ధి కోసం మధ్యదళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాల ప్రదర్శన. సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక. ►దళారులకు, పైరవీకారులకు తావులేకుండా, ఇతర లోన్ల బకాయిలకు బ్యాంకర్లు మళ్లించుకోలేని విధంగా పథకాల సొమ్ము నేరుగా లబ్ధిదారుల అన్ ఎన్కంబర్డ్ ఖాతాలకు జమ. ►సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి, నిర్దిష్ట సమయంలోనే ఠంచన్‌గా లబ్ధి పంపిణీ. ►ఆత్మాభిమానం నిలబడేలా వలంటీర్, సచివాలయ సిబ్బంది సేవలు. -
వివాదాస్పదంగా మారిన ఉపాధ్యాయ బదిలీల వ్యవహారం
-
ప్లీజ్ సార్, వెళ్లొద్దు.. బోరున విలపిస్తు రోడ్డెక్కిన విద్యార్థులు
జయపురం(భువనేశ్వర్): సమాజంలో తల్లీ, తండ్రి, తరువాతి స్థానం గురువులదే. అటువంటి ఉన్నతమైన గురువులపై ఆరోపణలు చేసేవారే ప్రస్తుతం ఎక్కువ మంది తారస పడుతుంటారు. అయితే ఒక ఉపాధ్యాయుడిని బదిలీ చేసినందుకు ఆ పాఠశాలలోని విద్యార్థులంతా అన్న, పానీయాలు విడిచిన ఘటన సర్వత్రా ఆసక్తి రేపింది. వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు సైతం విలపించిన ఘటన నవరంగపూర్ జిల్లా డాబుగాం సమితి మెదన ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో గురువారం చోటు చేసుకుంది. పిల్లల ఆవేదనను తెలుసుకున్న డాబుగాం పంచాయతీ అధ్యక్షుడు వంశీధర మఝి, సర్పంచ్ దివాకర పూజారి, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు సబితా కొలారి, గ్రామస్తులు ఉపాధ్యాయుడి బదిలీని రద్దు చేయాలని బ్లాక్ విద్యాధికారిని కోరారు, వివరాల్లోకి వెళ్తే... డాబుగాం సమితిలో కొద్ది రోజుల క్రితం 27 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో ఆరుగురిని ఎమ్మెల్యే అనుమతితో ఇతర సమితులకు బదిలీ చేశారు. వారిలో మెదన ఉన్నత పాఠశాలలో మెచ్ఎంగా పనిచేస్తున్న దివాకర బారిక్ ఒకరు. ఆయన గత 22 ఏళ్లుగా ఇదే పాఠశాలలో పని చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొంది, అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. సమర్థవంతంగ సేవలందిస్తూ.. విద్యార్థుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకొని, వారి అభిమానానికి పాత్రుడయ్యారు. గుణాత్మకమైన విద్య అందించడం, క్రమశిక్షణ అలవరచడం, ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దటంలో అందరి మన్ననలు పొందారు. అటువంటి ఉపాధ్యాయుడు బదిలీ కావడంతో విద్యార్థులు తీరని ఆవేదనకు గురయ్యారు. తామంతా అభిమానించే ఉపాధ్యాయుడు వెళ్లిపోతున్నారని తెలిసిన బోరున విలపించారు. వెంటనే హెచ్ఎం దివాకర బారిక్ బదిలీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. చదవండి: Gram Sarpanch: గ్రామ ప్రజల పాట.. 44 లక్షలకు సర్పంచ్ పదవి! -
16లోగా విభజన ప్రక్రియ పూర్తి..
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజనకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఈ మేరకు షెడ్యూల్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం రాత్రి రెండు జీవోలను జారీ చేశారు. ఇప్పటికే పూర్తయిన సీనియారిటీ జాబితాపై అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీలోగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ విభజన పూర్తి చేయాలని, 20వ తేదీలోగా సంబంధిత అధికారులు కేటాయింపు ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. ఇది పూర్తయిన వారం రోజుల్లో ఉద్యోగులు కేటాయించిన విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. ఈ దిశగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ కోసం జిల్లా అధికారుల నేతృత్వంలో కమి టీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జోనల్ పరిధిలో రిపోర్టింగ్ అథారిటీ ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలు జీవోల్లో వివరించారు. -
త్వరలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరగనున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసే 16వ తేదీ తర్వాత ట్రాన్స్ఫర్లపై రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎక్కువ కాలం ఒకే పోస్టులో ఉంటున్న.. ముఖ్యంగా ప్రత్యేక ప్రధాన, ముఖ్య కార్యదర్శులుగా కొనసాగుతున్న సీనియర్లను స్థానచలనం చేయనున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు అత్యంత నమ్మకస్తులుగా ఉండి కీలక శాఖల్లో ప్రధాన, ముఖ్య కార్యదర్శులుగా చాలాకాలంగా కొనసాగుతున్న కొంత మంది సీనియర్ ఐఏఎస్‌లను పరస్పరం బదిలీ చేయనున్నట్టు తెలిసింది. కీలక శాఖలకు కొత్త అధికారులు వస్తారని తెలుస్తోంది. ప్రాధాన్యం లేని పోస్టుల్లో మగ్గుతున్న కొందరు అధికారులకూ కొత్త పోస్టింగ్స్‌లో కొంత ప్రాధాన్యం కల్పించాలనుకుంటున్నట్టు సమాచారం. ఆర్థిక, ఐటీ, సింగరేణి, జలమండలిల్లో.. దీర్ఘకాలంగా ఒకే పోస్టులో కొనసాగుతున్న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు.. పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లొకేశ్కుమార్కు స్థానచలనం కల్పించే అవకాశముంది. కీలకమైన రెవెన్యూ శాఖతో పాటు కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, సీసీఎల్ఏ శాఖల కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో సీఎస్ సోమేశ్‌కుమార్ కొనసాగుతున్నారు. ఆయనపై భారం తగ్గించేందుకు కొన్ని శాఖలు/విభాగాలను సీనియర్ ఐఏఎస్‌లకు అప్పగించే అవకాశముంది. ఎన్నికల నేపథ్యంలో కొత్త జట్టు మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జట్టు కూర్పుపై దృష్టి పెట్టినట్టు తెలిసింది. యువ, సీనియర్ అధికారుల సమ కూర్పుతో పాలన యంత్రాంగంలో కొత్త ఉత్తేజం నింపాలని సర్కారు భావిస్తోంది. ఈ దిశగా బదిలీలపై చేపట్టిన కసరత్తు కొంత కొలిక్కి వచ్చినట్టు సమాచారం. కొందరు అధికారులు చాలాకాలంగా ఒకే పోస్టులో ఉండటంతో ఆ శాఖల్లో కొంత నిస్తేజం నెలకొంది. ఆ శాఖలకు త్వరలో కొత్త అధికారులను నియమించే అవకాశముంది. ఎన్నికల నాటికి జిల్లా పాలన యాంత్రాంగంపై పట్టు సాధించేలా భారీగా కలెక్టర్లు, ఎస్పీల బదిలీలూ చేసే అవకాశం కనిపిస్తోంది. పలువురు అదనపు డీజీలు, ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు కూడా బదిలీ అయ్యే అవకాశముంది. -
మూడేళ్లుగా ఒకేచోట.. సైబరాబాద్‌లో ఎస్హెచ్ఓల బదిలీలు?
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడేళ్లకు పైగా ఒకటే పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్హెచ్ఓ)లు బదిలీ కానున్నారు. మాదాపూర్, బాలానగర్ జోన్లలో దీర్ఘకాలికంగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆయా అధికారుల పనితీరు సక్రమంగా లేకపోవటమే సస్పెన్షన్‌కు కారణాలని తెలిసింది. రెండు మూడు వారాల్లో ఆయా బదిలీలు జరుగుతాయని సమాచారం. శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల కోడ్ ఎత్తివేసిన నేపథ్యంలో ఈ బదిలీలు చేయాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర నిర్ణయించినట్లు తెలిసింది. సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పలు భూ వివాదాల్లో తలదూర్చినందుకు నార్సింగి పీఎస్ ఇన్స్పెక్టర్ మధనం గంగాధర్, ఎస్ఐ కే లక్ష్మణ్‌లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 66 మంది ఎస్ఐలకు పోస్టింగ్‌లు.. సైబరాబాద్‌లో మాదాపూర్, బాలానగర్, శంషాబాద్ మూడు జోన్లలో కలిపి 36 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లున్నాయి. ఇన్చార్జి ఇన్స్పెక్టర్లతో నెట్టుకొస్తున్న పలు పోలీస్ స్టేషన్లకు శాశ్వత అధికారులను నియమించనున్నట్లు తెలిసింది. ఇటీవలే 66 మంది సబ్ ఇన్స్పెక్టర్లు (ఎస్ఐ) సైబరాబాద్ కమిషనరేట్‌కు రిపోర్ట్ అయ్యారు. ప్రస్తుతం వీళ్లంతా జోన్లకు అటాచ్‌లో ఉన్నారు. త్వరలోనే వీళ్లందరికీ కొత్త పోస్టింగ్స్ ఇవ్వనున్నట్లు తెలిసింది. చేవెళ్ల వంటి సున్నితమైన ప్రాంతాలలోని పీఎస్‌లలో ఎస్ఐల విద్యార్హతలు, నిబద్ధత, క్రమశిక్షణలను బట్టి పోస్టింగ్ ఇవ్వనున్నట్లు తెలిసింది. పీఎస్‌లను సందర్శిస్తూ.. సీపీగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే శాంతి భద్రతలపై సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. క్రమం తప్పకుండా పోలీస్ స్టేషన్లను సందర్శిస్తూ, పోలీసుల పనితీరును సీపీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. స్టేషన్, రికార్డ్ల నిర్వహణలను లోతుగా పరిశీలించారు. రిసెప్షన్, జేడీ ఎంట్రీ ప్రతి రికార్డ్లను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. లా అండ్ ఆర్డర్, నేరాల నివారణ వ్యూహాలపై ఎప్పటికప్పుడు పోలీసులకు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే కూకట్పల్లి, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌లలో సందర్శించారు. చదవండి: హృదయ విదారకం: రోగికి ఊపిరి పోస్తుండగా.. ఆగిన డాక్టర్ గుండె -
‘సీజే బదిలీ ప్రజా ప్రయోజనాల కోసమేనా?’
సాక్షి, న్యూఢిల్లీ: వాక్ స్వాతంత్య్రం, లౌకికవాదం, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు, ఆరోగ్య హక్కు, రాష్ట్ర జవాబుదారీతనంపై అనేక ఉత్తర్వులు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీని ఎందుకు బదిలీ చేశారంటూ సుప్రీంకోర్టు కొలీజియంను ఆ కోర్టు లాయర్లు ప్రశ్నించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. జస్టిస్ సంజీబ్ బెనర్జీని మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయాలన్న కొలీజియం సిఫార్సుపై మద్రాస్ హైకోర్టు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన 10 నెలల్లోపే బదిలీ చేయడం ప్రజా ప్రయోజనం కోసమా? లేక మెరుగైన న్యాయ నిర్వహణ కోసమా? అని తమ లేఖలో ప్రశ్నించారు. 75 మంది న్యాయమూర్తులుండే మద్రాసు హైకోర్టు నుంచి కేవలం ఇద్దరు న్యాయమూర్తులుండే మేఘాలయా హైకోర్టుకు బదిలీ చేయడం విస్తుగొలిపే ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోం దని పేర్కొన్నారు. ఈ తరహా బదిలీ నిజాయితీ కలిగిన న్యాయమూర్తి ప్రతిష్టను దెబ్బతీయడంతోపాటు ప్రజల దృష్టిలో న్యాయవ్యవస్థ ప్రతిష్టను సైతం దిగజారుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆర్యన్ కేసు నుంచి వాంఖెడే అవుట్
న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ నిందితుడుగా ఉన్న ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేని ఈ కేసు విచారణ నుంచి తప్పించారు. ఆర్యన్‌ను విడిచిపెట్టడానికి ముడుపులు అడిగారని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్యన్ డ్రగ్స్‌తో సహా ఆరు కేసుల్ని ముంబై జోన్ నుంచి ఢిల్లీలోని ఎన్సీబీ కేంద్ర కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కేసుల్ని విచారించడానికి ఎన్సీబీ సీనియర్ అధికారి సంజయ్ సింగ్ ఆధ్వర్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్, నటుడు అర్మాన్ కొహ్లి కేసులు కూడా ఇందులో ఉన్నాయి. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ను విడిచిపెట్టడానికి రూ.25 కోట్లకు డీల్ కుదిరిందని అందులో వాంఖెడే వాటా రూ.8 కోట్లు అంటూ ఈ కేసులో సాక్షి ప్రభాకర్ సాయిల్ ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై వాంఖెడేపై శాఖాపరమైన దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఇక మంత్రి నవాబ్ మాలిక్ అడుగడుగునా వాంఖెడేపై ఆరోపణలు చేయడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. ఎన్సీబీ మాత్రం డ్రగ్స్ కేసులో జాతీయ, అంతర్జాతీయ ముఠా హస్తం ఉందని, దీనిపై లోతుగా విచారించడం కోసమే సిట్ ఏర్పాటు చేసినట్టుగా తెలిపింది. వాంఖెడే ముంబై జోనల్ డీజీగా కొనసాగుతారని స్పష్టం చేసింది. ఇలా ఉండగా, ఆర్యన్ ఖాన్ శుక్రవారం ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లి హాజరు వేయించుకున్నాడు. బాంబే హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్ ఇస్తూ ప్రతీ శుక్రవారం ఎన్సీబీ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరుకావాలని షరతు విధించింది. బెయిల్ వచ్చి న తర్వాత తొలిసారి శుక్రవారం మధ్యాహ్నం ఎన్సీబీ కార్యాలయానికి ఆర్యన్ వచ్చాడు. -
ఎయిరిండియా ఇంధన బకాయిలు బదిలీ
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ బాట పట్టిన ఎయిరిండియాకు చెందిన ఇంధన చెల్లింపులు తదితర బకాయిలు అనుబంధ సంస్థ ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్(ఏఐఏహెచ్ఎల్)కు బదిలీకానున్నాయి. రూ. 16,000 కోట్ల విలువైన ఇంధన బిల్లులు తదితరాలు పెండింగ్‌లో ఉన్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. చమురు కంపెనీలు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, వెండార్లు తదితరాలకు బిల్లులు చెల్లించవలసి ఉన్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. ప్రయివేటైజేషన్‌లో భాగంగా ఎయిరిండియాను టాటా గ్రూప్ సొంతం చేసుకోనున్న సంగతి తెలిసిందే. కంపెనీ పగ్గాలను టాటా గ్రూప్‌నకు అప్పగించేముందుగానే బకాయిల బదిలీ జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఎయిరిండియాకు చెందిన కీలకంకాని ఆస్తులను ఎస్పీవీగా ఏర్పాటు చేసిన ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ చేసేందుకు గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఎయిరిండియా విక్రయానికి మార్గాన్ని ఏర్పాటు చేసింది. భవనాలు, భూములు తదితర ఆస్తులతోపాటు ఎయిరిండియా రుణాలలోనూ 75 శాతంవరకూ ఎస్పీవీకి బదిలీ చేయనుంది. డిసెంబర్‌లోగా బ్యాలెన్స్ షీట్... ఎయిరిండియాను టాటా గ్రూప్‌నకు బదిలీ చేసే ముందు డిసెంబర్ నాటికి ప్రభుత్వం బ్యాలెన్స్‌షీట్‌ను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మదింపులో ఇతర బకాయిలు(లయబిలిటీస్) ఏమైనా ఉంటే వీటిని సైతం ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ చేయనుంది. కాగా.. ఆగస్ట్ 31కల్లా ఎయిరిండియా రుణ భారం రూ. 61,562 కోట్లు. వీటిలో టాటా సన్స్ హోల్డింగ్ కంపెనీ టాలేస్ ప్రయివేట్ లిమిటెడ్ రూ. 15,300 కోట్ల రుణాలను టేకోవర్ చేయనుంది. మిగిలిన రూ. 46,262 కోట్ల రుణాలు ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ కానున్నాయి. సంస్కరణలకు సంకేతం ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణపై సీఐఐ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణతో సంస్కరణల విషయంలో మార్కెట్లు, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్ని ఇచి్చందని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. బ్యాంకింగ్ విభాగంలో ప్రభుత్వం ఎంపిక చేసిన రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణతో పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేసేందుకు సరైన సమయంగా అభిప్రాయపడింది. ‘‘ఎన్నో ప్రయత్నాల తర్వాత ఎయిర్ ఇండియాను విజయవంతంగా విక్రయించడం ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విషయమై ప్రతిష్టాత్మక ప్రణాళికకు తాజా ఉత్సాహాన్నిచి్చంది’’ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. ప్రైవేటీకరణ ప్రణాళికలను ప్రభుత్వం అనుకున్నట్టుగా పూర్తి చేయగలదని, భవిష్యత్తు విక్రయాల్లో బిడ్డింగ్‌ను ప్రోత్సహించగలదన్న విశ్వాసాన్ని తాము కలిగించినట్టు చెప్పారు. -
ఏపీలోని తెలంగాణ ఉద్యోగులకు లైన్ క్లియర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులు తమ రాష్ట్రానికి శాశ్వతంగా వెళ్లేందుకు లైన్ క్లియర్ అయ్యింది. తెలంగాణ స్థానికత, భార్య లేదా భర్త ఆ రాష్ట్రంలో పనిచేస్తుండటం, అనారోగ్యం తదితర కారణాలున్నవారిని తెలంగాణకు బదిలీ చేసేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణీత నమూనా మేరకు వచ్చే నెల 7లోగా సంబంధిత శాఖాధిపతులకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. చదవండి: పెద్దమనసు చాటుకున్న కేటీఆర్ 190 అసిస్టెంటు ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ -
తెలంగాణలో 20 మంది డీఎస్పీలకు స్థానచలనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. చదవండి: నాలా విషాదం: మణికొండ డీఈ సస్పెన్షన్! -
జెఫ్‌బెజోస్‌కు భారీ దెబ్బకొట్టిన భారత సంతతి వ్యక్తి..!
వాషింగ్టన్: అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్‌కు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. తాజాగా జెఫ్ బెజోస్‌కు చెందిన స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ నుంచి టాప్ ఇంజనీర్ బయటకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. భారత సంతతికి చెందిన నితిన్ అరోరా బ్లూ ఆరిజిన్ కంపెనీలో మూన్ ల్యాండర్ మిషన్‌కు లీడ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. నితిన్ మూడు సంవత్సరాల పాటు బ్లూఆరిజిన్ సంస్థలో లీడ్ ఇంజనీర్‌గా కొనసాగుతున్నారు. (చదవండి: Wikipedia:హ్యాక్..! లిస్ట్‌లో టాప్ సెలబ్రిటీలు..!) మూన్ ల్యాండింగ్ మిషన్‌లో భాగంగా వివిధ రకాల పేలోడ్లను చంద్రునిపైకి తీసుకెళ్లే మాడ్యుళ్లను నితిన్ డిజైన్ చేశారు. నితిన్ బ్లూ ఆరిజిన్ సంస్థను వీడుతూ..బ్లూ ఆరిజిన్ సంస్థలో మూడు సంవత్సరాల పాటు పనిచేసినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాగా నితిన్ బ్లూ ఆరిజిన్ సంస్థ నుంచి స్పేస్ ఎక్స్ సంస్థలో జాయిన్ అయ్యారు. తాజాగా నాసా ఏకపక్షవిధానాన్ని అవలంభించినందుకుగాను బ్లూ ఆరిజిన్ నాసాపై కోర్టులో దావా వేసింది. బ్లూ ఆరిజిన్ ప్రతినిధి ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. "నాసా హ్యూమన్ ల్యాండింగ్ మిషన్‌లో భాగంగా అక్వసిషన్ ప్రాసెస్‌లో(సముపార్జన) దొర్లిన తప్పులను పరిష్కారించాలని వెల్లడించింది. కోర్టుకు వెళ్లేముందు బ్లూ ఆరిజిన్ నాసా నిర్ణయంపై గొంతెత్తింది. అంతేకాకుండా బ్లూ ఆరిజిన్ సంస్థ మూన్ ల్యాండర్ మిషన్కోసం భారీగా 2 బిలియన్ల డాలర్లును నాసాకు ఆఫర్ చేసింది. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!) -
ట్విటర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరి బదిలీ.!
ట్విటర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరి తొలగిస్తూ ట్విటర్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ట్విటర్ ఇండియా హెడ్ నియమితులైన మనీష్ మహేశ్వరి అమెరికాకు బదిలీ చేసింది. మనీష్‌ను అమెరికాలో కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్‌గా ట్విటర్ నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ చట్టాలను అనుసరించి ఇండియా హెడ్‌గా మనీశ్ మహేశ్వరి నియమితులయ్యారు. గత ఏడాది కాలంగా ఇండియాలో ట్విట్టర్‌కి కలిసి రావడం లేదు. కొత్త ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా కొంత కాలం గళం విప్పింది ట్విటర్. గ్రీవెన్స్ అధికారిగా ఇండియన్నే నియమించాలనే నిబంధన అమలు చేసేందుకు మీన మేషాలు లెక్కించింది. దీంతో భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పింది. చివరకు భారతీయుడినే గ్రీవెన్స్ అధికారిగా నియమించింది. తాజాగా రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకుల ఖాతాలను ట్విటర్ నిలిపివేసింది. -
ఏపీలో 13 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అవరావతి: ఏపీలో 13 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో రాజమండ్రి అర్బన్ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి , విజిలెన్స్&ఎన్ఫోర్స్మెంట్ (జనరల్ అడ్మిన్) ఎస్పీగా డా.షీమోషి, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్‌దేవ్ శర్మ, ఆక్టోపస్ ఎస్పీగా కోయా ప్రవీణ్.. దీంతో పాటు పీటీవోగా ఆయన అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించనున్నారు. ఇక విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా విక్రాంత్ పాటిల్, డీజీపీ ఆఫీస్‌లో లాండ్ ఆర్డర్ ఏఐజీగా అమ్మిరెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్, విజయవాడ రైల్వేస్ ఎస్పీగా రాహుల్‌దేవ్ సింగ్, మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా అజిత వేజెండ్ల, కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా జీఎస్ సునీల్, విశాఖ డీసీపీ-1గా గౌతమి శాలి , ఇంటెలిజెన్స్ సీఎం ఎస్జీ ఎస్పీగా వకుల్ జిందాల్‌లు బదిలీ అయ్యారు. ఇక నారాయణ్ నాయక్‌కు డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
Telangana: భారీగా జిల్లా విద్యాశాఖ అధికారుల బదిలీలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు డీఈవోలను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం డీఈవోగా ఎస్.యాదయ్య, భద్రాద్రి కొత్తగూడెం డీఈవోగా పి.అనురాధరెడ్డి, ఎస్సీఈఆర్టీ డిప్యూటీ డైరెక్టర్ గా చైతన్య జైనీ దీంతోపాటు యాదాద్రి భువనగిరి డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మోడల్ స్కూల్స్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎస్.ఎస్.సూర్యప్రసాద్, మేడ్చల్ మల్కాజ్గిరి డీఈవోగా సూర్యప్రసాద్(అదనపు బాధ్యతలు), సంగారెడ్డి డీఈవోగా నాంపల్లి రాజేశ్, కరీంనగర్ డీఈవోగా సీహెచ్.వి.ఎస్.జనార్దన్‌రావు, రంగారెడ్డి డీఈవోగా పి.సుశీంద్రరావు, నారాయణపేట డీఈవోగా లియాఖత్ అలీ, వనపర్తి డీఈవోగా ఎ.రవీందర్, జోగులాంబ గద్వాల డీఈవోగా మహ్మద్ సిరాజుద్దీన్, జనగాం డీఈవోగా టి.రాము(అదనపు బాధ్యలు) నియమించారు. మేడ్చల్ జిల్లా డీఈవోగా ఉన్న విజయకుమారిని స్కూల్ ఎడ్యూకేషన్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. చదవండి: TS: సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు.. ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు ప్రమోట్ -
యాదాద్రి కలెక్టర్ అనితా రామచంద్రన్ బదిలీ
సాక్షి, యాదాద్రి: కలెక్టర్ అనితా రామచంద్రన్ బదిలీ అయ్యారు. పల్లె, పట్టణ ప్రగతిలో అలసత్వం చేసినందుకు ఆమెను వేరే చోటికి బదిలీ చేసినట్లు తెలిసింది. కాగా అనితా రామచంద్రన్ స్థానంలో యాదాద్రి కొత్త కలెక్టర్‌గా పమేలా సత్పతి నియామకం అయ్యారు. కాగా అంతకముందు పల్లె ప్రగతి, పట్టణ పురోగతిపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కొత్త కలెక్టర్‌గా పమేలా సత్పతి -
Rohini Sindhuri Emotional: ఇంటి బిడ్డగా చూసుకున్నారు..
సాక్షి, మైసూరు(కర్ణాటక) : జిల్లా ప్రజలు నన్ను తమ ఇంటి బిడ్డగా చూసుకున్నారు. ఇక్కడి నుంచి వెళుతుంటే పుట్టింటి నుంచి వెళుతున్నట్లు ఉంది, ప్రజలకు చాలా ధన్యవాదాలు అని అని బదిలీ అయిన కలెక్టర్ రోహిణి సింధూరి అన్నారు. సోమవారం మైసూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. మైసూరు గురించి అన్ని విషయాలను కొత్త కలెక్టర్‌కు వివరించానని తెలిపారు. తాను ఇలాంటి సమయంలో బదిలీ అవుతానని అనుకోలేదన్నారు. కలెక్టర్ రోహిణి సింధూరికి, మైసూరు పాలికె కమిషనర్ శిల్పానాగ్ల మధ్య సీఎస్ఆర్ నిధుల విషయంలో రగడ జరిగిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేయలేనని, రోహిణి సింధూరి ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఐఏఎస్‌ల మధ్య వివాదం.. పెద్ద సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన కర్ణాటక సీఎం యడియూరప్ప వీరిద్దరిని బదిలీ చేసిన విషయం తెలిసిందే. రోహిణి సింధూరిని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌గా ఇది వరకే బదిలీ చేశారు. అయితే, ఈ బదిలీని రద్దు చేయాలని రోహిణి సింధూరి, సీఎం యడియురప్పను కోరగా సాధ్యంకాదని చెప్పినట్లు తెలిసింది. చదవండి: ఐఏఎస్‌ల మధ్య రగడ: ఇద్దరిపై బదిలీ వేట -
టీకా టెక్నాలజీ బదిలీకి సిద్ధం
సెయింట్ పీటర్స్బర్గ్ (రష్యా): రష్యా అభివృద్ధి చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్ స్పుత్నిక్–వీ తయారీకి భారతీయ కంపెనీలు ముందుకు వస్తున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాక్సిన్ టెక్నాలజీ బదిలీకి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. విదేశాల్లో కూడా టీకా ఉత్పత్తిని విస్తృతం చేస్తామన్నారు. వ్యాక్సిన్ టెక్నాలజీని పంచుకోవడానికి సిద్ధమైన ఏకైక దేశం రష్యాయేనని చెప్పారు. అమెరికా, భారత్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌కు చెందిన అంతర్జాతీయ వార్తా సంస్థల సీనియర్ ఎడిటర్లతో పుతిన్ శనివారం ఆన్లైన్లో సంభాషించారు. పీటీఐ, అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్ తదితర సంస్థల ఎడిటర్లతో మాట్లాడుతూ స్పుత్నిక్– వీ సమర్థతపై వస్తున్న ఆరోపణల్ని తోసిపుచ్చారు. 97.6 శాతం సామర్థ్యంతో తమ వ్యాక్సిన్ పని చేస్తోందని స్పష్టం చేశారు. యూరప్ దేశాల్లో వ్యాక్సిన్ కంపెనీల మధ్య పోటీ, వాణిజ్యపరమైన కారణాల వల్ల స్పుత్నిక్– వీ రిజిస్ట్రేషన్‌లో జాప్యం జరుగుతోందని అన్నారు. ఇప్పటికే 66 దేశాల్లో స్పుత్నిక్– వీని విక్రయిస్తున్నామని, తమ వ్యాక్సిన్ మంచి మార్కెట్ ఉందన్నారు. స్పుత్నిక్– వీ వ్యాక్సిన్ తయారీకి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి డీసీజీఐ ప్రాథమిక అనుమతులు ఇచ్చిన నేపథ్యంలోనే పుతిన్ టెక్నాలజీని పంచుకోవడానికి సిద్ధమని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఈ వ్యాక్సిన్ పంపిణీ బాధ్యతల్ని చేపట్టింది. మరోవైపు అమెరికా సహా కొన్ని దేశాలు కరోనా సంక్షోభానికి చైనాయే కారణమని నిందిస్తున్న అంశంపై అడిగిన ప్రశ్నకు పుతిన్ సమాధానమిస్తూ ఇప్పటికే ఈ విషయంపై చాలా ఎక్కువగా తాను మాట్లాడానని, కొత్తగా చెప్పడానికి ఏమీలేదన్నారు.సంక్షోభాన్ని ఎప్పుడూ రాజకీయం చేయకూడదని హితవు పలికారు. మోదీ, జిన్‌పింగ్ బాధ్యతాయుత నాయకులు భారత్, చైనా సరిహద్దు వివాదాల్ని ఆ రెండు దేశాలే పరిష్కరించుకోవాలని పుతిన్ వ్యాఖ్యానించారు. మూడోదేశం ఈ అంశంలో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎంతో బాధ్యత కలిగిన నాయకులని... సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునే సామర్థ్యం వారికుందని అభిప్రాయపడ్డారు. రష్యా, చైనాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం... భారత్, రష్యాల రక్షణ బంధంపై ప్రభావం చూపిస్తుందా అని అడిగిన ప్రశ్నకు భారత్‌తో కూడా తమకు బలీయమైన బంధం ఉందని అన్నారు. రష్యా, భారత్ మధ్య బంధం నమ్మకం అనే పునాది మీద ఏర్పడిందని, దానికొచ్చే ఇబ్బందేమీ లేదని చెప్పారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌లు క్వాడ్ పేరుతో ఒక బృందంగా ఏర్పడడం, భారత్ అందులో భాగస్వామ్యం కావడంపై రష్యా విదేశాంగ మంత్రి బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై పుతిన్ మాట్లాడుతూ ఏ దేశంతో సన్నిహితంగా మెలగాలి, ఎంతవరకు సంబంధాల్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకునే హక్కు ప్రతీ సార్వభౌమ దేశానికి ఉంటుందని, దానిని ఎవరూ కాదనలేరని వ్యాఖ్యానించారు. -
నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్‌పై వేటు
సాక్షి, నెల్లూరు: లైంగిక వేధింపుల ఘటనలో నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి ప్రభాకర్‌ను తొలగించారు. తిరుపతి రుయా ఆసుపత్రికి ఆయనను బదిలీ చేశారు. కాగా జీజీహెచ్ ఘటనపై రెండు కమిటీలు విచారణ చేపట్టిన సంగతి విదితమే. డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ట్ త్రిసభ్య కమిటీలు లైంగిక వేధింపుల ఘటనపై లోతుగా దర్యాప్తు చేశాయి. ఈ క్రమంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా.. ఆయనను నెల్లూరు జీజీహెచ్ బాధ్యతల నుంచి తొలగించారు. కాగా, ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులపై మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆళ్ల నాని శుక్రవారం ఆదేశించారు. విచారణ చేపట్టిన రెండు కమిటీలు.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి. చదవండి: టెన్త్ పరీక్షలు రద్దు చేయం: మంత్రి సురేష్ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోవద్దు: టీటీడీ ఈవో -
దీదీ సంచలన నిర్ణయం.. పాతవారికే బాధ్యతలు
కోల్‌కతా: టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్ డీజీపీ నీరజ్ నయన్‌ను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాత డీజీపీ వీరేంద్రను తిరిగి బెంగాల్ డీజీపీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్లో హింస చెలరేగింది అంటూ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాషాయ పార్టీ వ్యాఖ్యలపై దీదీ స్పందించారు. రాష్ట్రంలో చెలరేగిన హింసకు ఎన్నికల కమిషనే కారణమని ఆరోపించారు. ఇక మీదట రాష్ట్రంలో శాంతిభద్రతలను తానే పర్యవేక్షిస్తానని తెలిపారు. ఇక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిని ఘర్షణలకు సంబంధించి గవర్నర్ డీజీపీని పిలిచి మాట్లాడారు. దీనిపై నివేదిక ఇవ్వాలని కోరారు. కేంద్ర హోం శాఖ కూడా దీనిపై నివేదిక కోరిన సంగతి తెలిసిందే. కేంద్రానికి దీదీ లేఖ సీఎం ప్రమాణం చేసిన అనంతరం మమతా బెనర్జీ తన తొలి ప్రాధాన్యత కోవిడ్ కట్టడే అని స్పష్టం చేశారు. ఈ మేరకు చర్యలు ప్రారంభించారు. రాష్ట్రానికి సరిపడా ఆక్సిజన్ పంపాలని కోరుతూ దీదీ కేంద్రానికి లేఖ రాశారు. -
టీచర్‌పై మమకారం.. అపురూప దృశ్యం ఆవిష్కృతం
సాక్షి, శ్రీకాకుళం : ఇంటి ఆడ పడుచు వేరే ఇంటికి వెళ్లిపోతున్న బాధ ఆ గ్రామస్తుల కళ్లలో కనిపించింది. అమ్మ ఊరెల్లిపోతుంటే అడ్డుకునే బిడ్డల అమాయకత్వం ఆ పిల్లల ముఖాల్లో అగుపించింది. నాలుగేళ్ల పాటు పాఠాలు చెప్పి, బడిని బాగు చేసి బదిలీపై వెళ్లిపోతున్న టీచర్‌ను విద్యార్థులు వదల్లేకపోయారు. వీడ్కోలు కూడా మర్చిపోలేని విధంగా ఉండాలని భావించారు. టీచర్ పనితీరు తెలిసిన గ్రామస్తులు కూడా పిల్లలకు జత కలవడంతో గొనకపాడులో అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. ఇక్కడి జెడ్పీ హైసూ్కల్లో నాలుగేళ్లు హెచ్ఎంగా పనిచేసి బదిలీపై వెళ్లిన అల్లాడ లలితకుమారిని విద్యార్థులు, గ్రామస్తులు బగ్గీపై ఊరేగించారు. పాఠశాల అభివృద్ధికి ఆమె అందించిన సేవలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని స్థానికులు చెప్పారు. – సోంపేట చదవండి: ఏపీ: గవర్నర్‌ను కలిసిన ఎస్ఈసీ నీలం సాహ్ని -
వీరప్పన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌కు షాకిచ్చిన డిపార్ట్మెంట్
సాక్షి, చెన్నై: ఎన్నికల్లో భార్య పోటీ చేస్తుండడం ఓ పోలీసు అధికారిని ఇరకాటంలో పడేసింది. ఆయన్ను బదిలీ చేస్తూ, ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ పోలీసు బాసుల నిర్ణయం తీసుకున్నారు. తిరునల్వేలి జిల్లా అంబాసముద్రం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థిగా రాణిరంజితం పోటీ చేస్తున్నారు. ఆమె నామినేషన్ దాఖలు, ప్రచారంలో బిజీ అయ్యారు. ఈ పరిస్థితుల్లో అదే జిల్లాలో నగర అదనపు కమిషనర్‌గా ఆమె భర్త వెల్లదురై పనిచేస్తుండడంతో రచ్చకెక్కింది. చందనపు దొంగ వీరప్పన్ ఎన్కౌంటర్ టీంలో కీలక పాత్ర పోషించడమే కాదు, అనేక ఎన్కౌంటర్లతో ఎన్కౌంటర్ వెల్లదురైగా పేరు గడించిన ఈ అధికారికి భార్య రూపంలో విధి నిర్వహణలో చిక్కులు తప్పలేదు. దీంతో తిరునల్వేలి కమిషనర్ అన్బు ఆయన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, అధికార అన్నాడీఎంకే నుంచి చీలిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంలో ఈ అధికారి సతీమణి పోటీ చేస్తుండడం కాబోలు, ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా చెన్నై డీజీపీ కార్యాలయంలో ఎన్నికల విధులకు దూరంగా ఓ మూలన కూర్చోబెట్టడం గమనార్హం. శ్రీరంగంలో చిన్నమ్మ పూజలు సాక్షి, చెన్నై: తిరుచ్చి శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో శుక్రవారం చిన్నమ్మ శశికళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, సమయపురం మారియమ్మన్ ఆలయాన్ని కూడా సందర్శించారు. పరప్పన అగ్రహార చెర నుంచి చెన్నైకు వచ్చిన 41 రోజుల తర్వాత ఇంటి నుంచి శశికళ అడుగు బయటపెట్టారు. గురువారం తంజావూరులోని కులదైవం ఆలయంలో పూజలు నిర్వహించారు. శుక్రవారం తిరుచ్చి శ్రీరంగం చేరుకుని రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ పూజల అనంతరం మధ్యాహ్నం తిరుచ్చిలోని బంధువు కళియ పెరుమాల్ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం సమయపురం మారియమ్మన్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. శనివారం చిన్నమ్మ భర్త నటరాజన్ మూడో వర్ధంతి. ఈసందర్భంన్ని పురస్కరించుకుని తంజావూరు ముల్లైవాయికాల్ స్తూపం ఎదురుగా ఉన్న నటరాజన్ సమాధి వద్ద చిన్నమ్మ నివాళులర్పించే అవకాశాలు ఉన్నాయి. చిన్నమ్మ తిరుచ్చి ఆలయ సందర్శన సమయంలో ఆమె వెన్నంటి అన్న కుమారుడు వెంకటేషన్ మాత్రమే ఉన్నారు. ఒకప్పుడు వీవీఐపీగా ఆలయ సందర్శనకు వచ్చిన శశికళ ఇప్పుడు సాదాసీదా వ్యక్తిగా వెళ్లి దర్శించుకుని వచ్చారు. -
అంబానీ ఇంటి వద్ద కలకలం: ‘అందుకే తనని బదిలీ చేశాం’
ముంబై: గత కొద్దిరోజులుగా నగరంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా పోలీసులు తీవ్రమైన తప్పిదాలు చేశారని ప్రాథమిక నిర్ధరణకు వచ్చి.. వారిని బాధ్యులను బదిలీ చేశామని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. అంతేకాకుండా ఎన్ఐఏ కేసులో సచిన్ వజేపై దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్ధేశంతో పలువురిపై బదిలీ వేటు వేశామని స్పష్టం చేశారు. దక్షిణముంబైలోని ముకేష్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు లభించడం, వ్యాపారవేత్త హిరానీ మరణించడం, పోలీస్ అధికారి సచిన్ వజే అరెస్టు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముంబై వార్తల్లో నిలిచింది. అయితే పోలీసు సహచరుల తప్పిదాలకు కమిషనర్ పరం వీర్‌సింగ్‌ను బాధ్యుడిగా చేస్తూ బుధవారం హోంమంత్రి బదిలీ ఉత్తర్వులు జారీచేశారు. కొత్తగా ముంబై కమిషనర్‌గా హేమంత్ నాగ్రలే నియమితులయ్యారు. దీంతో హోం మంత్రి బదిలీపై ఓ ఛానెల్‌తో మాట్లాడారు. ఆయా కేసులపై ఏటీఎస్, ఎన్ఐఏ దర్యాప్తు నిష్పక్షపాతం గా జరుపుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే ఏటీఎస్, ఎన్ఐఏ విచారణలో కొన్ని విషయాలు బయటపడటమూ బదిలీలకు కారణమని హోం మంత్రి స్పష్టంచేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. చదవండి: ముంబై పోలీసు కమిషనర్‌పై బదిలీ వేటు -
ముంబై పోలీసు కమిషనర్‌పై బదిలీ వేటు
ముంబై: ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడుపదార్థాలున్న కారు నిలిపిన కేసుకు సంబంధించి సర్వత్రా విమర్శల పాలైన మహారాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ముంబై నగర పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్‌ను హోంగార్డ్స్ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. అదనపు డీజీపీ అయిన హేమంత్ నగ్రాలెను ముంబై నగర పోలీసు కమిషనర్‌గా నియమిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న∙కారు పార్కు చేసి ఉండడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పోలీసు అధికారి సచిన్ వాజేని అరెస్ట్ చేసింది. అయితే దీని వెనుక ఇంకా చాలా మంది ఉన్నారని తమ దర్యాప్తులో తేలిందని త్వరలోనే ఈ కుట్ర కోణాన్ని బయట పెడతామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే సీఎం ఠాక్రేను హోంశాఖ మంత్రి అనిల్ కలిశారు. -
ప్రవీణ్ ప్రకాష్ బదిలీకి సర్కారు ‘నో’
సాక్షి, అమరావతి: సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) ప్రవీణ్ ప్రకాష్‌ను బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) జారీచేసిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. అఖిల భారత సర్వీసు అధికారిపై నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఎస్ఈసీకి లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదివారం ఎస్ఈసీకి లేఖ రాశారు. ప్రవీణ్ ప్రకాష్ మీద చేసిన ఆరోపణలు నిరాధారమని స్పష్టంచేస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలనే విషయాన్ని పునఃపరిశీలించాలని సీఎస్ కోరారు. (చదవండి: జేసీ విజయకు హైకోర్టులో చుక్కెదురు) -
ఐజీ సంతకం ఫోర్జరీపై విచారణాధికారిగా సురేశ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: నార్త్‌జోన్ ఐజీ కార్యాలయంలో వెలుగుచూసిన ఫోర్జరీ గ్యాంగ్ బాగోతంపై డీజీపీ కార్యాలయం స్పందించింది. కోవిడ్–19 కాలంలో ఐజీ కార్యాలయం నుంచి వెలువడిన 191 అధికారిక ఉత్తర్వుల్లో మొత్తం ఐదు ఉత్తర్వులను ఐజీ కిందిస్థాయి సిబ్బంది తమకు అనుకూలంగా మార్చుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు జగిత్యాల అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సురేశ్‌కుమార్‌ను విచారణాధికారిగా నియమించారు. త్వరలోనే దీనిపై విచారణ జరుగుతుందని, నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఐజీ నాగిరెడ్డి ఆదివారం తెలిపారు. బదిలీలకు సంబంధించి సంబంధిత ఎస్పీలు, కమిషనర్లతో సంప్రదించాకే ముందుకెళతామని పేర్కొన్నారు. పిల్లల చదువు, అనారోగ్యం తదితర కారణాలకు మాత్రమే బదిలీలను పరిగణనలోకి తీసుకుంటామని, ఎలాంటి మధ్యవర్తిత్వాలు, లంచాలు డిమాండ్ చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. -
రిజిస్ట్రేషన్ల శాఖ జాయింట్ ఐజీ బదిలీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ కీలక అధికారి, రిజిస్ట్రేషన్ చట్టంపై సంపూర్ణ అవగాహన కలిగిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ వేముల శ్రీనివాసులును బదిలీ చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ సేవలను సరళతరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను విజయవంతం చేయాలనే కోణంలోనే శ్రీనివాసులును తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ (టీఎస్ టీఎస్) ఓఎస్డీగా నియమించినట్టు సమాచారం. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఎలాంటి సాంకేతిక, శాఖాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్న ఉద్దేశంతోనే సమర్థ అధికారికి ఈ బాధ్యత అప్పగించినట్టు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విలీనమేనా? శ్రీనివాసులు బదిలీతో రిజిస్ట్రేషన్ల శాఖలో కలవరం మొదలైంది. రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి సమక్షంలో మంగళవారం జరిగిన రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ఈ నిర్ణయం వెలుగులోకి రావడంతో చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతున్న విధంగా రిజిస్ట్రేషన్ల శాఖను రెవెన్యూలో అంతర్భాగం చేస్తారని, తమను సీసీఎల్ఏ పరిధిలోకి తెస్తారనే చర్చ మొదలైంది. అయితే, శ్రీనివాసులు సమర్థత మేరకే ఆయన్ను ఐటీ శాఖకు బదిలీ చేశారా? 110 ఏళ్ల చరిత్ర గల రిజిస్ట్రేషన్ల శాఖను రెవెన్యూలో అంతర్భాగం చేస్తారా? రాబడిపై ప్రభావం లేకుండా రిజిస్ట్రేషన్ల శాఖను యథాతథంగా కొనసాగిస్తారా? అన్నది రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు వెలువడేంతవరకు వేచి చూడాల్సిందే. -
తెలంగాణలో 15 మంది డీఎస్పీలు బదిలీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో 15 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీఎస్పీలను బదిలీలు చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయింది వీరే కాచిగూడ ఏసీపీగా ఆకుల శ్రీనివాస్ బంజారాహిల్స్ ఏసీపీగా సుదర్శన్ సంగారెడ్డి డీఎస్పీగా బాలాజీ ఎల్బీనగర్ డీఎస్పీగా శ్రీధర్ రెడ్డి పఠాన్ చెరువు డీఎస్పీగా భీం రెడ్డి పంజాగుట్ట ఏసీపీగా గణేష్సిద్దిపేట ఏసీపీగా రామేశ్వర్ శంషాబాద్ ఏసీపీగా భాస్కర్ బాన్సువాడ డీఎస్పీగా జైపాల్ రెడ్డి ఇంటిలిజెన్స్ డీఎస్పీగా కె.శ్రీనివాస్ రావు బదిలీ -
నా బదిలీకి నిర్మలా పట్టుబట్టారు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి పని చేయడం కష్టమని ఆ శాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్ శనివారం బ్లాగ్‌లో పేర్కొన్నారు. తనను ఆర్థిక శాఖ నుంచి బదిలీ చేయాలంటూ ఆమె పట్టుబట్టారని తెలిపారు. స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) చేసిన ఏడాది తర్వాత అందుకు గల కారణాలను ఆయన బహిర్గతం చేశారు. తన బ్లాగ్ పోస్టులో పలు అంశాలను ప్రస్తావించారు. నిర్మలా సీతారామన్‌తో కలిసి పనిచేయడం చాలా కష్టమని తాను భావించానని, అందుకే వీఆర్ఎస్ తీసుకున్నానని వివరించారు. ఆమెతో తనకు కలిసి రాలేదన్నారు. ఆమె తన బదిలీ కోరేకంటే ముందే తమ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో కాకుండా మరో శాఖలో పనిచేయాలని తాను భావించలేదని పేర్కొన్నారు. దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పోలిస్తే నిర్మలది భిన్నమైన వ్యక్తిత్వమని, అరుణ్ జైట్లీతో పనిచేయడం తనకు వృత్తిపరంగా సంతృప్తినిచ్చిందన్నారు. -
అక్కడికి పంపండి.. కాదు..కాదు.. ఇక్కడికి!
పైరవీకారులకు ఇష్టమైన స్థానానికి బదిలీ చేయడం.. అదీ నచ్చలేదంటే వారు కోరుకున్న చోటుకు పంపండం విద్యుత్ శాఖకే చెల్లింది. నిషేధ సమయంలో ఏడుగురు ఏఈలకు స్థానచలనం కల్పించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఓ డీఈకి కోరుకున్న చోట పోస్టింగ్ ఇవ్వడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. అయినా బదిలీ విషయంలో తగ్గకపోగా తాత్కాలిక పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్వర్వులు జారీ చేయడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఏది ఏమైనా విద్యుత్ శాఖకు రెగ్యులర్ అధికారి లేకపోవడంతో పాలన పట్టు తప్పుతోంది. కర్నూలు(రాజ్‌విహార్): సాధారణ బదిలీల కు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుంది. దీనికి అనుగుణంగా ట్రాన్స్‌కో ఆఫీస్ ఆర్డర్ పేరుతో టీఓఓ విడుదల చేస్తుంది. వీటి ప్రకారమే విద్యుత్ పంపిణీ సంస్థలు బదిలీలు చేపడతాయి. అయితే ఏపీ ఎస్పీడీసీఎల్ కర్నూలు సర్కిల్లో అందుకు విరుద్ధంగా బదిలీలు చేపడుతున్నారు. అధికారిని మెప్పిస్తే చాలు.. అధికారి మొప్పు పొందితే చాలు..కోరుకున్న స్థానానికి బదిలీ చేస్తున్నారు. ఒక వేళ ఆ స్థానం నచ్చలేదని అడిగితే.. రాత్రికి రా త్రి వారికి ఇష్టమైన స్థానంలో నియమిస్తున్నారు. కార్మిక, ఉద్యోగ సంఘాల ప్రతి నిధుల ప్రశ్నిస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బదిలీ చేశామని చెప్పొకొస్తున్నారు. ఏడుగురికి బదిలీలు.. ♦ 15 రోజుల క్రితం ఏఈ నాగేంద్ర ప్రసాద్‌ను నంద్యాల ప్రొటెక్షన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయన అక్కడ విధుల్లో చేరలేదు. ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించడంతో పాత ఆర్డర్స్‌ను పక్కన పడేసి కర్నూలు ఎల్టీ మీటర్స్ విభాగానికి బదిలీ చేశారు. ♦ గతంలో పత్తికొండ సెక్షన్లో ఏఈగా పనిచేసిన నారాయణ స్వామి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ఏడాది క్రితం మంత్రాలయానికి బదిలీ చేశారు. అంతలోనే ఇప్పుడు ఆయన్ను తిరిగి పత్తికొండకు బదిలీ చేశారు. ♦ వెల్దుర్తిలో పనిచేస్తున్న శ్రావణ్‌కుమార్‌రెడ్డి మూడునెలల క్రితం తెలంగాణకు బదిలీ అ య్యారు. అయితే కోర్టు ఆయను తిరిగి కర్నూలులోనే నియమించాలని ఉత్తర్వులు ఇవ్వగా కర్నూలు క్యాంప్స్ సెక్షన్‌కు బదిలీ చేశారు. ♦ కర్నూలు క్యాంప్స్ సెక్షన్లో పనిచేస్తున్న ఏఈ భానుచందర్‌ను అనతికాలంలోనే నంద్యాల పట్టణంలోని ప్రొటెక్షన్స్ విభాగానికి బదిలీ చేశారు. ♦ ఆదోని డివిజన్లోని హొళగుంద ఏఈగా పనిచేస్తున్న నాగభూషణంను ఆరు నెలల వ్యవధిలోనే తిరిగి ఆదోని పట్టణంలోని డిస్ట్రిబ్యూషన్–1కు బదిలీ చేశారు. ♦ ఆలూరు ఏఈగా పనిచేస్తున్న సంతోష్‌ను బదిలీ మార్గదర్శకాలు రాకముందే ఆదోని పట్ణణంలోని డిస్ట్రిబ్యూషన్–3కి, ఇక్కడ పనిచేస్తున్న నరసన్నను ఆలూరుకు బదిలీ చేశారు. ♦ కర్నూలులో పనిచేస్తున్న శిలింగయ్యను నంద్యాలకు, నంద్యాలలో పనిచేస్తున్న దావిద్‌ను కర్నూలుకు బదిలీ చేశారు. ♦ కర్నూలు కస్టమర్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్న జాన్ బెర్నాడ్ను గూడూరుకు, ఇక్కడ పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డిని కర్నూలు సిటీ మీ టర్స్కు,ఆత్మకూరు రూరల్ ఏఈ రాజేంద్రబా బును కర్నూలువిద్యత్ భవన్‌కు బదిలీ చేశారు. ♦ విద్యుత్ భవన్లో పనిచేస్తున్న ఓ డీఈని ఆపరేషన్స్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వగా ఫిర్యాదులు వెళ్లడంతో వెనక్కి తగ్గి ఉత్తర్వులు తొలగించారు. ♦ కర్నూలు సర్కిల్ కార్యాలయంలో నాన్పోక ల్ పోస్టులో నెలన్నర కిత్రం బాధ్యతలు చేపట్టి న డీఈని ఆపరేషన్స్ డివిజన్‌కు బదిలీ చేశారు. మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి... గైడ్‌లైన్స్ ప్రకారం ఒకే హోదా ఉండి.. ఒకే పోస్టులో మూడేళ్లు పూర్తి చేసుకున్న వారిని ఒక సబ్ డివిజన్ నుంచి మరో సబ్‌డివిజన్‌కు బదిలీ చేయాలి. ఒకే హోదాలో వివిధ పోస్టుల్లో పనిచేసినా ఒకే పట్టణం (స్టేషన్)లో ఐదేళ్లు పూర్తయితే ఒక డివిజన్ నుంచి మరో డివిజన్‌కు బదిలీ చేయాలి. అయితే బదిలీలకు అర్హులైన వారి సంఖ్యలో 20శాతంలోపు వారికి మాత్రమే స్థాన చలనం కల్పించాలి. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లు, జూనియర్ అసిస్టెంట్లు (ఎల్డీసీ), సీనియర్ అసిస్టెంట్లు (యూడీసీ) తదితర విభాగాలకు చెందిన సిబ్బందిని అర్హతలను బట్టి బదిలీ చేయాలి. మెడికల్ గ్రౌండ్స్ కింద మినహాయింపు లేదా కోరుకున్న స్థానంలో నియమించాల్సి ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఏఈల ను బదిలీలు చేశాం. ఏదైనా మ్యూచువల్, మెడికల్ గ్రౌండ్స్ కింద ఎవరైనా రిక్వెస్టు చేసి ఉండవచ్చు. బదిలీల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోలేదు. – ఓబుల కొండారెడ్డి, ఇన్చార్జ్ -
మంత్రి కొడుకు కారు అడ్డగింపు.. మహిళా పోలీస్‌ను
గాంధీనగర్ : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి కర్ఫ్యూ సమయంలో ప్రయాణిస్తున్న మంత్రి కొడుకు కారును అడ్డగించినందుకు మహిళా పోలీసు అధికారిని బదిలీ చేశారు. ఈ ఉదంతం గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సూరత్‌లో కర్ఫ్యూ అమలులో ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి కుమార్ కనాని కొడుకు ప్రకాశ్ కనాని స్నేహితులు బుధవారం లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి కారుతో రోడ్డుపైకెక్కారు. మాస్క్ ధరించకుండా కర్ఫ్యూ సమయంలో బయటకు వచ్చినందుకు వారి కారును మహిళా కానిస్టేబుల్ సునీతా యాదవ్ అడ్డుకుది. దీంతో వారు ఎమ్మెల్యే కొడుకు ప్రకాశ్‌ను రప్పించారు. (టీచర్ నిర్వాకంపై తీవ్ర విమర్శలు) అనంతరం మరో కారులో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కొడుకు, అతని స్నేహితులతో కలిసి మహిళా కానిస్టేబుల్‌తో గొడవకు దిగారు. కానిస్టేబుల్‌ను అనుచిత వ్యాఖ్యలతో దూషించి, తమతో పెట్టుకుంటే ఆమెను 365 రోజులు అదే రోడ్డుపై నిలబెట్టేలా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై స్పందించిన కానిస్టేబుల్ ఆమె తమకు బానిసను కాదని బదులిచ్చారు. కాగా రాజకీయ ప్రోద్భలంతో అధికారులు మహిళా కానిస్టేబుల్‌ను మరో చోటుకు బదిలీ చేశారు. కాగా ఈ సంభాషణకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవ్వడంతో ఈ సంఘటనపై సూరత్ పోలీస్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. అంతేగాక ప్రకాశ్ కనాని, అతని ఇద్దరు స్నేహితులను పోలీసులు ఆదివారం అరెస్టు చేయగా.. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. (ఫోటోగ్రఫీ ‘పిచ్చి’ : చివరికి కొడుకులకు) -
బదిలీపై స్పందించిన జస్టిస్ మురళీధర్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చెలరేగిన అల్లర్లపై విచారణ సందర్భంగా పోలీసుల తీరును ప్రశ్నించి రాత్రికి రాత్రే బదిలీ అయిన ఢిల్లీ హైకోర్టు జడ్జి ఎస్.మురళీధర్ తన బదిలీపై స్పష్టతనిచ్చారు. బదిలీ విషయం ముందే తెలుసని చెప్పారు. పంజాబ్, హరియణా హైకోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో ఢిల్లీలో గురువారం ఢిల్లీ హైకోర్టు జడ్జీలు, లాయర్లు ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో జడ్జి మురళీధర్ మాట్లాడారు. ‘సత్యం వైపు నిలవండి. తప్పకుండా న్యాయం జరుగుతుంది’ అని పేర్కొన్నారు. (అర్థరాత్రి విచారణ.. ఆ న్యాయమూర్తి బదిలీ) తన బదిలీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందస్తుగానే సమాచారం అందించారని, ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతోనే పంజాబ్–హరియాణా కోర్టుకు బదిలీ చేశారని తెలిపారు. ఫిబ్రవరి 26న తన బదిలీ ఉత్తర్వులు అందాయని పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలో విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నాయకలు అనురాగ్ ఠాకూర్, పర్వీష్ వర్మ, కపిల్ మిశ్రాలపై ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించిన మురళీధర్‌ను కేంద్రం బదిలీ చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. (చదవండి: ఢిల్లీ హైకోర్టు జస్టిస్ బదిలీ ఓ శేష ప్రశ్న!) -
ఏపీలో 41 మంది డీఎస్పీల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 41మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు ఇచ్చారు. 41మంది డీఎస్పీల బదిలీల్లో 37మంది వెయింటింగ్‌లో ఉన్నవారికి పోస్టింగ్‌లు ఇవ్వగా, మరో నలుగురిని పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. పోస్టింగ్‌లు ఇచ్చినవారిలో ఆరుగురు సీఐడీ విభాగానికి, ఒకరు ఏసీబీకి, ఇద్దరు ఏపీఎస్పీ బెటాలియన్‌కు, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పోస్టులను కేటాయించారు. చిత్తూరు ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎస్ఆర్ వంశీధర్‌గౌడ్, కర్నూలు డీటీసీ పీఎన్ బాబు, రాజమండ్రి డీటీసీ ఆర్.సత్యనారాయణ, రాజమండ్రి డీఎస్ఆర్పీ ఎస్.మనోహర్‌రావులను పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. -
ఏపిలో 12మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు మున్సిపల్ ఉన్నతాధికారులను పురపాలక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్లో ఆర్‌ఎండీఏ జి.శ్రీనివాసరావును రాష్ట్ర మున్సిపల్ కమిషరేట్‌లో జాయింట్ డైరెక్టరేట్‌గా బదిలీ చేశారు. ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ కె.వెంకటేశ్వర్లును గుంటూరు మున్సిపల్కార్పోరేషన్ ఆర్‌ఎండీఏగా నియమించారు. అదే విధంగా రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు,ఇతర అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఖమ్మం జిల్లాలో 28 మంది ఎస్సైల బదిలీ
సాక్షి, ఖమ్మం: ఎట్టకేలకు ఏడాది తర్వాత ఎస్సైల బదిలీలు జరిగాయి. ఈ మేరకు వరంగల్ రేంజ్ డీఐజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ప్రొబేషనరీ పూర్తి చేసుకున్న ఎస్సైలకు పోస్టింగ్‌లు కల్పించారు. ప్రొబేషనరీ పూర్తయిన మహిళా ఎస్సైలు ఇద్దరికి మండలాల ఎస్‌హెచ్‌ఓలుగా స్థానం కల్పించారు. -
కలెక్టర్ సర్ఫరాజ్‌పై వేటు
సాక్షి, కరీంనగర్: ఊహించిందే జరిగింది. ‘సాక్షి’ కథనం నిజమైంది. మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను రాష్ట్ర ఎక్సైజ్æ శాఖ డైరెక్టర్‌గా నియమిస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా ప్రస్తుతం జోగులాంబ–గద్వాల జిల్లాలో బాధ్యతలు నిర్వహిస్తున్న 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కొండూరు శశాంకకు పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఉత్తర్వులు(జీవో నెంబర్ 3320) జారీ చేశారు. కాగా ఐఏఎస్‌గా జగిత్యాల సబ్ కలెక్టర్‌గా తొలుత బాధ్యతలు నిర్వర్తించిన శశాంక ఆ తరువాత సుమారు రెండేళ్లపాటు కరీంనగర్ మునిసిపల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించి సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. మంత్రి గంగుల తన పంతం నెగ్గించుకోవడంలో సఫలమయ్యారు. వివాదాల మధ్య సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ జిల్లాల పునర్విభజన అనంతరం కరీంనగర్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన 2009 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ మూడేళ్లకు పైగా ఒకే చోట కొనసాగారు. మునిసిపల్ ఎన్నికలు ముగిసేంత వరకు ఇతర అధికారుల తరహాలోనే కలెక్టర్ కూడా కొనసాగుతారని భావించారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచే కరీంనగర్‌కు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌తో కలెక్టర్‌కు సత్సంబంధాలు కొరవడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన కలెక్టర్ ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా వ్యవహరించారని గంగుల ఆరోపణ. దీనికి సంబంధించి ప్రభుత్వ పెద్దలకు పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు. అయినా వరుస ఎన్నికల నేపథ్యంలో బదిలీల ప్రక్రియ ఆగుతూ వచ్చింది. కాగా ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ మొబైల్ ఆడియో టేప్ రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదమైంది. 2018 ఎన్నికల ఫలితాల అనంతరం అప్పటి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్‌తో జరిపిన సంభాషణపై మంత్రి గంగుల సీరియస్ గా తీసుకున్నారు. తనను ఓడించేందుకు చేసిన కుట్రలు ఫలించకపోవడంతో గెలిచిన ఎమ్మెల్యేను అనర్హుడిగా చేసేందుకు గల అవకాశాలపై బీజేపీ అభ్యర్థితో కలెక్టర్ చర్చించడం ఏంటని మంత్రి సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ అనివార్యమైంది. ప్రొటోకాల్ ఉల్లంఘనలపై సైతం ఫిర్యాదు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రైస్తవ కుటుంబాలకు దుస్తుల పంపిణీ, వేడులకు నగదు సహాయం అందించే కార్యక్రమంపై సంఘం పెద్దలతో ఇటీవల కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం జరిగింది. దీనికి మంత్రి గంగుల కమలాకర్ హాజరు కాగా, అధికారులు ఎవరూ సమావేశానికి రాలేదు. అదే సమయంలో గవర్నర్ కార్యక్రమంపై కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. తన చాంబర్ పక్కనే కాన్ఫరెన్స్ హాల్లో తాను పాల్గొన్న సమావేశానికి కలెక్టర్, ఇతర అధికారులు రాకుండా తహసీల్దార్లను పంపించడాన్ని మంత్రి గంగుల తీవ్రంగా పరిగణించారు. దీనిపై ప్రభుత్వానికి సమాచారం అందించడమే గాకుండా, మునిసిపల్ ఎన్నికలకు ముందే కలెక్టర్‌ను మార్చాలని కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న తరుణంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను బదిలీ చేసి, కరీంనగర్‌కు సుపరిచితుడైన శశాంకకు తీసుకురావడం గమనార్హం. -
తహసీల్దార్ల బదిలీలపై స్పందించిన ప్రభుత్వం
సాక్షి, సంగారెడ్డి: తహసీల్దార్ల బదిలీపై రెవెన్యూ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం స్పందించిందని జిల్లా అధ్యక్షుడు బొమ్మరాములు తెలిపారు. 2018 అక్టోబర్ ఎన్నికలకు ముందు జిల్లాకు బదిలీ అయిన తహసీల్దార్లు అంతా పూర్వ జిల్లాలకు బదిలీ కానున్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్కుమార్, ట్రెస్సా (తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ) ప్రతినిధులు ఆదివారం చర్చించారని చెప్పారు. తమ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌లు స్పందించారని ఆయన చెప్పారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి షఫీయోద్దీన్, కార్యవర్గ సభ్యుడు గోపాల్, కిరణ్‌కుమార్, దశరథ్, కార్తీక్, వీరేశం, బాల్‌రాజ్, గుండేరావు, ఉమర్పాష, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో భారీగా తహశీల్దార్లు బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా తహశీల్దార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 378 మంది తహశీల్దార్లను బదిలీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బదిలీ అయిన వారిని తిరిగి వారి స్థానాలకు పంపుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తమను బదిలీ చేయాలంటూ గత కొంత కాలంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. బదిలీల ప్రక్రియ పూర్తి చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ఉద్యోగ జేఏసీ కృతజ్ఞతలు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న తహసీల్దారు బదిలీల ప్రక్రియను పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. బదిలీలు చేపట్టడంతో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు మరింత భాధ్యత విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందేలా కృషి చేస్తారని ఆకాంక్షించింది. ఈమేరకు తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు కారం రవిందర్ రెడ్డి, మమత, మామిళ్ళ రాజేందర్, ఎ.సత్యనారాయణ, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత పద్మాచారి, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేత చిలగాని సంపత్ కుమారస్వామి తదితరులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
నల్లగొండ కలెక్టర్ బదిలీ
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ వి.చంద్రశేఖర్ (నాన్ కేడర్)ను తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు జిల్లా కలెక్టర్‌గా అదనపు బా ధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు వ్యవహరిస్తున్న సహాయ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం రవిని అదనపు బాధ్యతల నుంచి తప్పించినట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సైరా సినిమాకు వెళ్లిన ఎస్ఐలపై వేటు
సాక్షి, కర్నూలు : విధి నిర్వహణలో ఉండి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ‘సైరా’ సినిమాకు వెళ్లిన ఆరుగురు ఎస్ఐలపై బదిలీ వేటు పడింది. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సినిమాకు వెళ్లారంటూ జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాకఉ చెందిన ఆరుగురు ఎస్ఐలు బుధవారం తెల్లవారుజామున సైరా సినిమాకు వెళ్లారు. అయితే వీరంతా సమాచారం ఇవ్వకుండా వెళ్లడంతో ఆరుగురు ఎస్ఐలను ఎస్పీ వీఆర్‌కు బదిలీ చేశారు. బదిలీ వేటు పడినవారిలో ...అవకు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, కొలిమిగుండ్ల ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి, నందివర్గం ఎస్ఐ హరిప్రసాద్, బండి ఆత్మకూర్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య, రాచర్ల ఎస్ఐ ప్రియతంరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ అశోక్ ఉన్నారు. చదవండి: ‘సైరా’ మూవీ రివ్యూ కాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఏపీలో ఈ సినిమా అదనపు షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అక్టోబర్ 2 నుంచి 8 తేదీ వరకు స్పెషల్ షోలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రతి రోజు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం పది గంటల వరకు స్పెషల్ షో లకు అనుమతించింది. థియేటర్లో ‘సైరా’ చిత్రం వీక్షిస్తున్న ఎస్ఐలు.. -
జస్టిస్ తాహిల్‌కు అనూహ్య మద్దతు
చెన్నై: మేఘాలయ హైకోర్టుకు బదిలీకి నిరసనగా రాజీనామా చేసిన మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విజయ కమలేష్ తాహిల్ రమణి తన సహచరుల నుంచి భారీ మద్దతులభిస్తోంది. ఆమె బదిలీని వ్యతిరేకిస్తే వేలాది మంది న్యాయవాదులు పోరాటాన్ని చేపట్టారు. సోమవారం నాటి ఆందోళనకు కొనసాగించిన మద్రాస్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్‌కు చెందిన 18 వేల మంది న్యాయవాదులు మంగళవారం కూడా కోర్టు విధులను బహిష్కరించారు. ప్రభుత్వ న్యాయవాదులు మాత్రమే విధులకు హాజరయ్యారు. జస్టిజ్ వీకే తాహిల్ రమణి బదిలీని ఖండిస్తూ సోమవారం మధ్యాహ్నం మద్రాస్ హైకోర్టున్యాయవాదులు భోజన విరామ సమయంలో కోర్టు ప్రాంగణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆమె రాజీనామాను ఉపసంహరించుకోవాలని జస్టిస్ తాహిల్ రామణికి విజ్ఞప్తి చేయడంతో పాటు బదిలీ ఉత్తర్వులను ఆమోదించిన సుప్రీంకోర్టు కొలీజియంకు అప్పీల్ చేయాలని న్యాయవాదులు భావిస్తున్నారు. మంగళవారం నుంచి తమ ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నామని ప్రకటించారు. మరోవైపు తాహిల్ రమణిని ఆమె నివాసంలో కలుసుకున్న తమిళనాడు న్యాయశాఖా మంత్రి సీవీ షణ్ముగం తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని అభ్యర్థించారు. ఆమె బదిలీ అప్రజాస్వామికమనీ, ఇది న్యాయమూర్తుల స్వాతంత్ర్యాన్ని, కేసులపై వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునే శక్తిని ప్రభావితం చేస్తుందని అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి మోహనకృష్ణన్ ఆరోపించారు. కాగా మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న తనను ఆకస్మికంగా మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని ఉపసంహరించాలని జస్టిస్ తాహిల్ సుప్రీంకోర్టు కొలీజియంకు ఇదివరకే ఆమె చేసుకున్న అభ్యర్థన తిరస్కరణకు గురైంది. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌కు పంపించిన సంగతి తెలిసిందే. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గత ఏడాది ఆగస్టు 8న ఆమె నియమితులయ్యారు. -
ఇన్స్పెక్టర్ల బదిలీలపై ‘లీకుల’ ఎఫెక్ట్!
సాక్షి, కరీంనగర్ : ఇన్స్పెక్టర్ల బదిలీలకు సంబంధించి ప్రతిపాదిత జాబితా లీక్ కావడం పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లింది. బదిలీల సమయంలో ఎవరిని ఎక్కడికి పంపించాలనే విషయంలో తమకు స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సిఫారసులకు అనుగుణంగా ఆయా జిల్లాల కమిషనర్లు, ఎస్పీలు ఐజీకి పంపించడం సర్వసాధారణం. అందులో భాగంగానే కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ నుంచి ఐజీ కార్యాలయానికి వెళ్లిన ప్రతిపాదిత బదిలీల జాబితా ఈ నెల 15న లీక్ అయింది. అంతకుముందు రోజు అంటే 14న కూడా ఆరుగురు ఇన్స్పెక్టర్ల బదిలీలకు సంబంధించి కూడా ఉత్తర్వులు వాట్సాప్ పోలీస్ గ్రూపుల్లో అనధికారికంగా లీకయ్యాయి. ఈ విషయాన్ని ఫోకస్ చేస్తూ ఈ నెల 16న ‘సాక్షి’ దినపత్రికలో ‘పోలీస్ ఇన్స్పెక్టర్ల బది‘లీకులు’’ శీర్షికతో వార్త కథనం ప్రచురితమైంది. కమిషనరేట్ నుంచి ఐజీ స్థాయి అధికారికి వెళ్లే ప్రతిపాదనలు పోలీస్ వాట్సాప్ గ్రూపుల్లో లీక్ కావడంపై కమిషనర్ కమలాసన్‌రెడ్డి, ఐజీ నాగిరెడ్డి తీవ్రంగా పరిగణించారు. సోషల్ మీడియాలో ప్రతిపాదిత బదిలీ జాబితాను పెట్టిన వ్యక్తి వన్‌టౌన్ కానిస్టేబుల్ గౌస్‌గా గుర్తించిన అధికారులు సోమవారం అడవి ముత్తారం పోలీస్‌స్టేషన్‌కు అటాచ్డ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇన్స్పెక్టర్ల బదిలీలకు సంబంధించి ఉత్తర్వుల జారీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రతిపాదిత జాబితాను మార్చే ఆలోచన? ఈ నెల 15న లీక్ అయిన ప్రతిపాదిత జాబితాలో 13 మంది సీఐల పేర్లు ఉన్నాయి. వారిలో ఎస్బీ ఇన్స్పెక్టర్ టి.మహేష్‌ను తిమ్మాపూర్ సర్కిల్‌కు, సీటీసీ ఇన్స్పెక్టర్ తిరుమల్ను కరీంనగర్ ట్రాఫిక్‌కు బదిలీ చేస్తూ జిల్లా ఉత్తర్వులు(డీవో) జారీ అయ్యాయి. వీరితోపాటు వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ తులా శ్రీనివాసరావును రూరల్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు వచ్చాయి. శ్రీనివాస్‌రావు పేరు అంతకుముందు రోజు లీక్ అయిన ఉత్తర్వుల జాబితాలో ఉంది. వీరు గాకుండా మరో 11 మందికి సంబంధించి ప్రతిపాదనలు పెండింగ్‌లో పడ్డాయి. వారిలో కరీంనగర్ ట్రాఫిక్–2 కు ప్రతిపాదించిన ఎస్.సదానందంను వేరే చోటికి బదిలీ చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. మిగతా 10 మందితోపాటు రామగుండం కమిషనరేట్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన పలువురు ఇన్స్పెక్టర్లు బదిలీ ఉత్తర్వుల కోసం వేచి చూస్తున్నారు. రామగుండం కమిషనరేట్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన వారు చాలామంది కరీంనగర్ జిల్లాలో పోస్టింగ్ కోసం వేచి చూస్తున్నారు. వరంగల్ కమిషనరేట్, ఖమ్మం కమిషనరేట్ నుంచి ఎంత మంది ఉమ్మడి జిల్లాకు ఆప్షన్లు ఇచ్చారో తెలియదు. ఈ నేపథ్యంలో నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కరీంనగర్లో లీకైన ప్రతిపాదిత జాబితా ప్రకారమే పోస్టింగ్‌లు ఇస్తే తప్పుడు సంకేతాలు పోతాయని కూడా భావిస్తున్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధులు సిఫారసు చేసిన వారి జోలికి వెళ్లకుండా ప్రతిపాదిత జాబితాలో ఉన్న మిగతా ఇన్స్పెక్టర్ల పోస్టింగ్‌లను మార్చాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలిసింది. జిల్లాల వారీగా కాకుండా నార్త్ జోన్లో అర్హత గల వారందరినీ ఒకేసారి బదిలీ చేసే అవకాశం కూడా ఉందని ఓ అధికారి తెలిపారు. ఎమ్మెల్యేల చుట్టూ ఇన్స్పెక్టర్లు బదిలీల ప్రక్రియలో జాప్యంతో పలువురు ఇన్స్పెక్టర్లు స్థానిక ఎమ్మెల్యేల ద్వారా చివరి ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయా పోలీస్స్టేషన్లలో ఇన్స్పెక్టర్ పోస్టుకు సంబంధిం చి ఎమ్మెల్యే ప్రతిపాదనలకు తొలి ప్రాధాన్యత ఇస్తుండడంతో పోలీ స్ అధికారులు పైరవీలు ముమ్మరం చేశారు. ఉ మ్మడి జిల్లాలోని 13 ని యోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు ఇన్స్పెక్టర్లు సిఫారసు లేఖల కోసం తిరుగుతున్న దృశ్యాలు సర్వసాధారణం అయ్యాయి. నేడో రేపో అధికారికంగా ఇన్స్పెక్టర్ల బదిలీల ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. -
ఉద్యోగుల రవాణా
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణా శాఖ ప్రత్యేకతలు చెప్పక్కర్లేదు. ఇక్కడి నుంచి ఆరు జిల్లాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉప రవాణా కమిషనర్‌పై ఉంది. అయితే, రవాణా శాఖ ఉన్నతాధికారుల తీరుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులకు నచ్చితే చాలు... ఆ ఉద్యోగి కోరుకున్న చోటకు అంతర్గత, అనధికారికంగా బదిలీ చేయడమే కాదు, దానినే శాశ్వత బదిలీల్లో చూపిస్తున్నారు. గతంలోనే కాకుండా ప్రస్తుతం కూడా ఇదే తంతు కొనసాగిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతా తాత్కాలికమే ఉమ్మడి వరంగల్ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన ఆరు జిల్లాల ఆర్టీఓ కార్యాలయాల్లో చిన్నస్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు అందరూ తాత్కాలిక విధులే నిర్వహిస్తున్నారు. పలువురు ఉన్నతాధికారులు హైదరాబాద్ స్థాయిలో నేతలను ప్రసన్నం చేసుకుని... రెండు, మూడు పోస్టుల్లో కూడా కొనసాగుతుండడం గమనార్హం. కొందరైతే ఉమ్మడి వరంగల్ కేంద్రంగా అనధికారికంగా చెక్‌పోస్టుకు విధులు కేటాయించుకుని ఇక్కడి నుంచే వేతనాలు తీసుకుంటున్నారు. ఇలా ఇష్టారీతిన ఎవరికి వారు వెళ్తుండడం..ఉన్నతాధికారులు కూడా బదిలీలు చేయడంతో కార్యాలయాల్లో సరిపడా సిబ్బంది లేక వివిధ పనులపై రవాణా శాఖ కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఖాళీల పేరిటే ఓడీ వ్యవహారం రవాణాశాఖలో 2013 సంవత్సరం తర్వాత పదోన్నతులు లేవు. కానిస్టేబుళ్లు, క్లర్క్‌లు, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల నుంచి మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ల వరకు పదోన్నతులు నిలిచిపోయాయి. దీంతో కొందరు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు ‘ఖాళీల’ పేరిట వ్యవహారానికి తెర తీశారు. ఎంవీఐల నుంచి డీటీఓ/ఆర్టీఓల పదోన్నతుల్లో జాప్యం జరిగినా.. మూడు నెలల కిందట హఠాత్తుగా ఐదుగురు జిల్లా రవాణాశాఖ అధికారు(డీటీఓ)లకు ఉప కమిషనర్(డీటీసీ)లుగా పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్ ఇచ్చారు. అయితే క్లర్క్‌లు, కానిస్టేబుళ్ల నుంచి ఏఎంవీఐలుగా ప్రమోషన్లు పొందాల్సిన వారి ఫైలు మాత్రం ఆరేళ్లుగా ముందుకు కదలడం లేదు. రెండు, మూడు చోట్ల బాధ్యతలు రవాణాశాఖలో పదోన్నతులు, హోదాలతో పని లేకుండా పలువురు ఎంవీఐలు ఇన్చార్జ్ డీటీఓలు, డీటీసీలుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇవీ చాలదన్నట్లు పొరుగు జిల్లాల బాధ్యతల కోసం హైదరాబాద్ స్థాయిలో పైరవీలు కూడా సాగిస్తున్నారు. వరంగల్ రూరల్ రెగ్యులర్ ఎంవీవై రమేష్‌రాథోడ్ జనగామ ఇన్చార్జ్ ఎంవీఐ, డీటీఓగా మూడు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి ఎంవీఐగా రెగ్యులర్ పోస్టులో ఉన్న పి.రవీందర్ ఇన్చార్జ్ డీటీఓతో పాటు ఖమ్మం ఇన్చార్జ్ ఎంవీఐగా కూడా బాధ్యతల్లో ఉన్నారు. అలాగే మహబూబాబాద్ రెగ్యులర్ ఎంవీఐగా ఉన్న భద్రునాయక్ అక్కడే ఇన్చార్జ్ డీటీఓగా, ఖమ్మం ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తున్నారు. వరంగల్ డీటీఓ కార్యాలయంలో ఎంవీఐగా పని చేస్తున్న కె.వేణు నెల కిందటి వరకు ఇన్చార్జ్ డీటీవో, డీటీసీగా వ్యవహరించారు. ఇటీవలే పదోన్నతిపై పురుషోత్తం డీటీసీగా విధుల్లో చేరగా, వేణు ఎంవీఐ, ఇన్చార్జ్ డీటీఓగా కొనసాగుతున్నారు. అదే విధంగా క్లర్క్‌లు, సూపరింటెండెంట్ తదితర పోస్టుల్లోని ఉద్యోగులు కూడా పలువురు రెండు, మూడు చోట్ల ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఆన్ డిప్యూటేషన్ల పేరిట ఇష్టారాజ్యంగా పరిమితికి మించిన పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారంటూ ఆ శాఖలో కొందరు రవాణాశాఖ మంత్రి, ఉన్నతాధికారులకు తాజాగా నాలుగు రోజుల కిందట ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ ఫిర్యాదుతోనైనా మంత్రి, ఉన్నతాధికారులు స్పందిస్తారేమో వేచి చూడాలి. డీపీసీ వేయాలన్న ప్రభుత్వం శాఖలోని కొందరు ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నేతల విజ్ఞాపన మేరకు పదోన్నతుల రవాణాశాఖలో డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) వేయాలని 2014 అక్టోబర్‌లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ప్రక్రియ మొదలైనట్లే కనిపించినా అనేక కారణాలతో ఇప్పటి వరకు జరగలేదు. ఫలితంగా పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోగా రవాణాశాఖలో ఖాళీల పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను బుట్టదాఖలు చేసిన పలువురు పెద్ద ఎత్తున ‘రేటు’ ఫిక్స్ చేసి మరీ ఆన్ డిప్యూటేషన్లను సాగిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు, మూడు పదవుల్లో కొనసాగుతున్న పలువురు ఉద్యోగులు వివాదాల నుంచి తప్పుకునేందుకు బదిలీల కోసం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తాజా సమాచారం. -
అధికారుల వనవాసం ముగిసింది
సాక్షి, శ్రీకాకుళం : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పక్క జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లు, ఎంపీడీవోలు తిరిగి తమ పూర్వ స్థానాలకు చేరుకున్నారు. నాలుగు నెలల క్రితం జిల్లాలోని తహసీల్దార్లను, మండల అభివృద్ధి అధికారులను జోనల్ పరిధిలో గల విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు బదిలీ చేశారు. వారు తిరిగి సోమవారం నాటికి సొంత జిల్లాకు చేరుకున్నారు.అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు తహసీల్దార్లు, ఎంపీడీవోలు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి వచ్చారు. వారు కూడా ఒకటి రెండు రోజుల్లో వారి జిల్లాలకు వెళ్లనున్నారు. 41 మంది తహసీల్దార్లు జిల్లాకు రాక సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు వెళ్లిన 41 మంది తహసీల్దార్లు జిల్లాకు చేరుకున్నారు. వీరికి జిల్లా కలెక్టర్ జె.నివాస్ జిల్లాలో వివిధ మండలాలు, ఆర్డీఓ కార్యాలయంలో పోస్టింగులు ఇవ్వాల్సివుంది. మన జిల్లాలో ఎన్నికల విధుల్లో గత నాలుగు నెలలుగా ఉన్న 41మంది తహసీల్దార్లు కూడా వారి స్వంత జిల్లాలకు వెళ్లనున్నారు. మన జిల్లాకు విజయనగరం నుంచి 13, విశాఖపట్నం నుంచి 28 మంది తహసీల్దార్లు వెనక్కు వచ్చారు. వీరికి పోస్టింగ్‌లు ఇవ్వాల్సివుంది. శ్రీకాకుళం డివిజన్‌కు తహసీల్దార్ల కొరత తహసీల్దార్లు వెనక్కు వచ్చినా శ్రీకాకుళం రెవిన్యూ డివిజన్ పరిధిలో కొరత అలాగే ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రెవిన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకు వచ్చిన దృష్ట్యా స్వంత రెవిన్యూ డివిజన్లో వారికి పోస్టింగ్ ఇవ్వరాదని జీవోను విడుదల చేసింది. ఈ జీవో మంచిదే అయినప్పటికీ, అంత పెద్ద మొత్తంలో తహసీల్దార్లు లేదు, జిల్లాలో ఉన్న 41 మంది తహసీల్దార్లలో ఇతర రెవిన్యూ డివిజన్లకు చెందిన వారు 8మంది మాత్రమే ఉన్నారు. ఇతర జిల్లాకు చెంది ఈ జిల్లాలో ఉండాలని కోరుకున్న వారు మరో ముగ్గురు ఉన్నారు. అంటే 11 మంది తహసీల్దార్లు అందుబాటులో ఉన్నారు. వాస్తవానికి శ్రీకాకుళం రెవిన్యూ విడిజన్ పరిధిలో 13 మండలాలకు 13 మంది తహసీల్దార్లు ఉండాలి, అలాగే శ్రీకాకుళం రెవిన్యూ డివిజనల్ కార్యాలయంలో కూడా ఇద్దరు ఉండాలి. అలా ఇతర శాఖల్లో కూడా అంటే ఎపీఈపీడీసీఎల్, ఎస్సీ కార్పొరేషన్, డ్వామా, డీఆర్డీఎ, సాంఘిక సంక్షేమ శాఖ, ఇలా పలు శాఖల్లో తహసీల్దార్ల అవసరం ఉంది. రెవిన్యూ డివిజన్లో స్థానికులకు తహసీల్దారు పోస్టింగ్ ఇవ్వరాదని నిబంధనల వలన ఈ సమస్య వచ్చింది. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం వెసులుబాటు ఇస్తే తప్ప తహసీలార్ల కొరత తీరే అవకాశం లేదు. సీనియర్ ఎంపీడీవోలు ఉండాలి స్థానిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలో మండల అభివృద్ధి్ద కార్యాలయాల్లో సీనియర్ ఎంపీడీవోలు ఉండాల్సిన అవసరముంది. అభివృద్ధి, నవరత్నాల అమలు, స్థానిక ఎన్నికల నేపథ్యంలో మండల అభివృద్ధి అధికారులు అనుభవజ్నులై ఉండాలి. జిల్లాలో ఉన్న సీనియర్ ఎంపీడీవోలు ఎక్కువ మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఫారిన్ సర్వీసుల్లో డెçప్యుటేషన్‌లో ఉన్నారు. ఈసారి పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మండలాలకు సీనియర్ ఎపీడీవోలకు పోస్టింగ్ కల్పిస్తే, నవరత్నాల అమలు సజావుగా సాగుతోందని సీనియర్లు చెపుతున్నారు. -
ఇద్దరు డీసీపీల బదిలీ
కృష్ణ జిల్లా ఎస్పీగా రవీంద్రబాబు, ఈస్టు గోదావరి జిల్లా ఎస్పీగా హష్మీ గ్రేహౌండ్ గ్రూప్ కమాండర్‌గా రాహుల్‌దేవ్ శర్మ రైల్వే ఎస్పీగా కోయ ప్రవీణ్, విశాఖ డీసీపీ–1గా విక్రాంత్ పాటిల్ డీసీపీ–2గా ఉదయభాస్కర్ బిల్లా ద్వారకానగర్(విశాఖ దక్షిణ): రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీసీపీ–1గా విధులు నిర్వహిస్తున్న ఎం.రవీంద్రబాబును కృష్ణా జిల్లా ఎస్పీగా, డీసీపీ–2 నయి హష్మీని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. అలాగే విశాఖ పోలీస్ కమిషనరేట్ డీసీపీ–1గా చిత్తూరు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను, డీసీపీ–2గా ఉదయ భాస్కర్ బిల్లాను నియమించారు. గతంలో విక్రాంత్ పాటిల్ విజయనగరం జిల్లా ఓఎస్డీగా పనిచేశారు. అనంతరం చిత్తూరు జిల్లా ఎస్పీగా బదిలీపై వెళ్లారు. ఎం.రవీంద్రబాబు కడప జిల్లాకు చెందిన ఎం.రవీంద్రబాబు 2001 గ్రూప్–1 అధికారి. గురజాల, వరంగల్ రూరల్, గుంటూరు టౌన్లో డీఎస్పీగా పనిచేశారు. అలాగే ఓఎస్డీ విజయనగరం, హైదరాబాద్ టాస్క్ఫోర్సులో డీఎస్పీగా, తరువాత విజయవాడ డీఎస్పీగా, గ్రేహౌండ్స్ డీఎస్పీగా, కృష్ణా జిల్లాలో విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ డీసీపీగా పనిచేశారు. 2018లో విశాఖ డీసీపీ–1గా బదిలీపై వచ్చారు. ఇప్పుడు కృష్ణా జిల్లా ఎస్పీగా బదిలీపై వెళ్తున్నారు. నయిం హష్మీ 2013 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హష్మీ 2018 నవంబర్‌లో విశాఖ పోలీస్ కమిషనరేట్ డీసీపీ–2గా బదిలీపై వచ్చారు. గతంలో రెండేళ్లు రంపచోడవరంలో పనిచేశారు. పది నెలలు కడప ఏఎస్డీగా పనిచేశారు. కడప అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తూ విశాఖకు డీసీపీగా వచ్చారు. తనపై నమ్మకం ఉంచి ప్రభుత్వం బదిలీ చేసిందని, మరింత బాధ్యతగా విధులు నిర్వహిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. విశాఖ అంటే తనకు చాలా ఇష్టమని.. విశాఖ ప్రజలు చాలా మంచి వారని.. అభిమానిస్తారన్నారు. విక్రాంత్ పాటిల్ 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విక్రాంత్ పాటిల్‌ది కర్ణాటక, దార్వాడ్. 2018లో విజయనగరం జిల్లా ఓఎస్డీగా పనిచేశారు. అక్కడ నుంచి చిత్తూరు జిల్లా ఎస్పీగా బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. విశాఖ పోలీస్ కమిషనరేట్‌కు డీసీపీ–1గా బదిలీపై వస్తున్నారు. ఉదయ్ భాస్కర్ ఆంధ్రాకు చెందిన ఉదయభాస్కర్ జమ్ము కాశ్మీర్ క్యాడర్ (ఐపీఎస్) అధికారి. ప్రస్తుతం విశాఖ సీఐడీ ఎస్పీగా డిప్యూటేష¯Œన్లో పనిచేస్తున్నారు. ఈయన విశాఖ పోలీస్ కమిషనరేట్‌కు డీసీపీ–2గా బదిలీపై వస్తున్నారు. ఆయన భార్య ఆదాయ పన్నుల శాఖలో పనిచేస్తున్నారు. -
పోలీసు శాఖలో బదిలీల కాక
కర్నూలు: రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడి నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖలో నాలుగైదు రోజులుగా ఎస్ఐ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయి అధికారుల వరకు బదిలీ జ్వరం పట్టుకుంది. గత ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖలో పోస్టింగ్‌లు అన్నీ రాజకీయాల కనుసన్నల్లోనే జరిగాయి. స్థానిక ప్రజాప్రతినిధి ప్రమేయం లేకుండా పోస్టింగ్‌లు తెచ్చుకున్న అధికారులను బాధ్యతలు స్వీకరించకుండానే వెనక్కి తిప్పిపంపిన సందర్భాలు జిల్లాలో అనేకం. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో బదిలీలపై ఆసక్తి నెలకొంది. చక్రం తిప్తేందుకు సీనియర్ల యత్నాలు జిల్లాలో పాలనా విభాగం తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న పోలీసుశాఖ పరంగా ప్రస్తుతం ఆసక్తి కర పరిణామాలు ఊపందుకున్నాయి. ఎక్కడిక్కడ చక్రం తిప్పే దిశగా కొందరు సీనియర్లు యత్నిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. గతేడాది బదిలీ వేటు పడిన వారు, ఎన్నికల ముందు జరిగిన బదీలీల్లో మార్పులు చేర్పులకు గురైన వారు కలిసి తమకు ఇష్టమైన ప్రాంతాలకు చేరేందుకు ఉవ్వీళ్ళూరుతున్నట్లు సమాచారం. ఎన్నికల ముందు వరుసగా మూడేళ్లు జిల్లాలో పని చేసిన సుమారు 25 మంది సీఐలు, 8 మంది డీఎస్పీలు బదీలపై పొరుగు జిల్లాలకు వెళ్లారు. వారంతా త్వరలోనే జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో వారు నచ్చిన స్టేషన్లు, ఆదాయం పుష్కలంగా ఉండే విభాగాల్లోకి చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఆ శాఖలో చర్చ సాగుతోంది. ఇపుడు అవకాశం కోల్పోతే మరో ఏడాదిపాటు ఆగాల్సి రావడంతో చాలామంది అధికారులు అవకాశాన్ని వదులుకోనేందుకు ఆసక్తి చూపడం లేదన్నది ప్రధానంగా వినిపిస్తున్న మాట. పీఎస్ఐల పనితీరుపై నిశిత పరిశీలన.. జిల్లాలో ఏడుగురు ప్రొబేషనరీ ఎస్ఐలకు ఈ నెల 7వ తేదీన పోస్టింగులు కేటాయిస్తూ ఎస్పీ ఫక్కీరప్ప ఉత్తర్వులు ఇచ్చారు. శిక్షణలో ఉన్న ఏడుగురుతో పాటు వివిధ స్టేషన్లలో పనిచేస్తున్న మరో 8 మందిపై బదీలీ వేటుపడింది. ఇందులో సీసీఎస్‌కు ఆరుగురు, వీఆర్‌కు ఇద్దరు బదీలీ అయ్యారు. పీఎస్ఐలో నలుగురు మహిళలు ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న మహిళ ఎస్ఐల పనితీరు ఏలా వుందన్న అంశంపై ఉన్నతాధికారులు నిశిత çపరిశీలన జరుపుతున్నారు. ప్రజా సంబంధాలు, కేసుల దర్యాప్తులో వ్యవహరించే తీరు, సాంకేతిక అంశాలపై పట్టు, ఎన్నికల సమయంలో వారి పనితీరు తదితర అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఆయా అంశాలపై నిఘా వర్గాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రస్తుత బ్యాచ్‌లో ఐదుగురు మహిళ ఎస్సైలు ఉన్నారు. హలహర్వి, కోడుమూరు. దొర్నిపాడు, రేవనూరు, బండి ఆత్మకూరు స్టేషన్లలో వీరు విధులు నిర్వహిస్తున్నారు. పక్షపాతం చూపిన అధికారులు.. గత ప్రభుత్వ హయాంలో అధికార పార్టీకి కొమ్ముకాసి ఇతరులపై పక్షపాతం చూపిన కొందరు అధికారులు బదిలీలకు ముందే మూటముళ్లే సర్దుకుని సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సుమారు 45 మంది ఇన్స్పెక్టర్లు, నలుగురు సబ్ డివిజన్ అధికారులు తెలుగుదేశం కార్యకర్తల్లా వ్యవహరించారనే అపవాదు మూటకట్టుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఏకపక్షంగా తెలుగుదేశంకు కొమ్ముకాసిన వారంతా బదీలీలపై వెళ్లేందుకు మానసికంగా సిద్ధపడ్డారన్న చర్చ నడుస్తోంది. -
ఏపీ వైద్యశాఖ పోస్టుల భర్తీలో అక్రమాలు
-
ఈసీ ఆగ్రహం.. సీఐపై బదిలీ వేటు
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా మదనపల్లి టూ టౌన్ సీఐ సురేశ్ కుమార్‌పై బదిలీ వేటు పడింది. టీడీపీ ప్రచార సభలో కోడ్ ఉల్లంఘనకు సంబంధించి రాజంపేట పార్లమెంట్ అబ్జార్వర్ నవీన్ కుమార్ చెప్పిన కూడా సురేశ్ కేసు నమోదు చేయలేదు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సురేశ్ తీరుపై నవీన్ ఆంధ్ర ప్రదేశ్ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ద్వివేదీ సురేశ్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగించారు. సురేశ్ స్థానంలో కొత్తవారిని నియమించేందుకు మూడు పేర్లను సూచించాలని డీఐజీని ద్వివేదీ ఆదేశించారు. ఆదివారం ఉదయం 11 గంటల్లోపు కొత్త సీఐని నియమిస్తామని ద్వివేదీ తెలిపారు. మరోపైపు టీడీపీకి ఓటేయమని ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సెర్ప్ సీఈఓ కృష్ణమోహన్‌పై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. కృష్ణమోహన్‌పై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ద్వివేదీ ఏపీ ప్రభుత్వాని కోరారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోయినా, ప్రజలను ఇబ్బంది పెట్టిన చర్యలు తీసుకుంటామని ద్వివేదీ హెచ్చరించారు. ఎన్నికల సంఘం హెచ్చరికలతో ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల్లో ఆందోళన నెలకొంది.