Bengal Teacher Farewell: Students Heart Warming Farewell To Teacher At Bengal, Video Viral On Social Media - Sakshi
Sakshi News home page

టీచర్‌కు విద్యార్థుల వినూత్న వీడ్కోలు.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!

Published Sat, Feb 19 2022 9:14 PM | Last Updated on Sun, Feb 20 2022 8:53 AM

Students Heart Warming Farewell To Teacher At Bengal - Sakshi

కోల్‌కత్తా: మనం ఏ స్థాయిలో ఉన్నా మనకు విద్య నేర్పించిన గురువులను గుర్తుపెట్టుకుట్టాం. వారికి తగిన గౌరవం ఇస్తాం. మనకు నచ్చిన టీచర్‌ బదిలీ అవుతున్న సందర్బంగా వారికి గుర్తుండిపోయేలా ఫెర్‌వల్​ను ప్లాన్‌ చేస‍్తుంటం. తాజాగా ఇలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది.  

వివరాల ప్రకారం.. బెంగాల్‌లోని 24 పరగణా ప్రాంతంలో కటియాహట్ బికేఏపీ బాలికల పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో సంపా అనే టీచర్‌ విధులు నిర్వహిస్తోంది. ఆమెతో పాఠశాలలోని విద్యార్థులకు అవినాభావ సంబంధం ఏర్పడింది. ఇదిలా ఉండగా ఆమె బదిలీ అవుతున్నారన్న విషయం తెలుసుకున్న విద్యార్థులు ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. 

ఈ క్రమంలోనే తమకు ఎంతో ఇష్టమైన టీచర్‌కు వినూత్నంగా వీడ్కోలు పలకాలని భావించారు. దీని కోసం విద్యార్థులు టీచర్‌ కళ్లకు గంతలు కట్టారు. ఆ తర్వాత ఆమెను పాఠశాల గ్రౌండ్‌లోకి తీసుకెళ్లి.. విద్యార్థినిలందరూ మోకాళ్లపై కూర్చుని.. ‘రబ్​నే బనాదీ జోడి’ సినిమాలోని ఒక పాటను పాడారు. ఆ తర్వాత టీచర్‌ ముందు కూర్చుని గులాబీ పువ్వులను ఆమెకు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కన్నీరు పెట్టుకోవడంతో సంపా కూడా ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ఆమె వారిని హత్తుకుని ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసి వారంతా తమ స్కూల్‌ డేస్‌ గుర్తుకు వస్తున్నాయంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement