Kolkatta
-
సంజయ్ రాయ్ దోషే
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్జీ కర్ వైద్య కళాశాల, ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా కోర్టు తేల్చింది. 2024 ఆగస్ట్ 9న జరిగిన ఈ దారుణంపై నెలలపాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగడం తెలిసిందే. బాధితురాలికి న్యాయం జరగాలంటూ వైద్యులతో పాటు యువత పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు. రాయ్‌పై భారతీయ న్యాయ సహిత సెక్షన్లు 64, 66తో పాటు మరణ శిక్ష, లేదా జీవిత ఖైదుకు వీలు కలి్పంచే 103(1) కింద కేసులు నమోదయ్యాయి. వాటిపై 2024 నవంబర్ 12 నుంచి సీల్డా అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అనిర్బణ్ దాస్ రెండు నెలలపాటు రహస్య విచారణ జరిపారు. రాయ్‌పై మోపిన అన్ని ఆరోపణలనూ సీబీఐ రుజువు చేసిందని పేర్కొన్నారు. వైద్యురాలిపై అతను లైంగిక దాడి చేయడమే గాక ఊపిరాడకుండా చేసి చంపినట్లు తేలిందన్నారు. ‘‘తెల్లవారుజాము 4 గంటల సమయంలో ఆస్పత్రిలోకి చొరబడ్డావు. సెమినార్ హాల్లో నిద్రిస్తున్న ఆన్‌డ్యూటీ వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డావు. ఆమెకు ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశావు. సంబంధిత సాక్ష్యాధారాలు పరిశీలించి, వాదనలు విన్న మీదట నువ్వే దోషివని నిర్ధారించా. నిన్ను శిక్షించాల్సిందే’’ అని నిందితున్ని ఉద్దేశించి జడ్జి పేర్కొన్నారు. కేసులో ఇరికించారు తనను ఈ కేసులో ఇరికించారని రాయ్ అన్నాడు. ‘‘నేనే గనుక ఈ నేరం చేసుంటే నా మెడలోని రుద్రాక్షమాల అక్కడే తెగిపోయి ఉండేది’’ అన్నాడు. ‘నన్నీ కేసులో ఇరికించిన వారిని ఎందుకు వదిలేశారు?’ అని ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, స్థానిక పోలీస్ స్టేషన్ మాజీ ఎస్‌హెచ్‌వోలను ఉద్దేశించి ప్రశ్నించాడు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు దోషి వాంగ్మూలం తీసుకుంటామని, అనంతరం అతనికి శిక్ష ఖరారు చేస్తూ తుది తీర్పు వెలువరిస్తానని జడ్జి తెలిపారు. బాధితురాలి తండ్రి లేవనెత్తిన పలు అంశాలకు కూడా అందులో బదులిస్తానని చెప్పారు. తర్వాత రాయ్‌ను పోలీసులు ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోంకు తీసుకెళ్లారు. అతడిని మీడియాతో మాట్లాడనివ్వలేదు. తీర్పును పాలక తృణమూల్ కాంగ్రెస్ స్వాగతించగా ఇక పార్టీ ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. తుదిశ్వాస వరకు పోరాడుతాం తీర్పు విన్నాక బాధితురాలి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రి మీడియాతో మాట్లాడారు. ‘మీపై పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకున్నారు’ అని జడ్జినుద్దేశించి పేర్కొన్నారు. తల్లి మాత్రం పూర్తి న్యాయం జరగలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘కుమార్తెను చిత్రహింసలు పెట్టి పొట్టన పెట్టుకున్న రాయ్ విచారణ సమయంలో మౌనంగా ఉండిపోయాడు. ఈ దారుణానికి అతడొక్కడే కారణం కాదు. ఇతర దోషులనూ చట్టం ముందు నిలబెట్టాలి. అందుకు తుదిశ్వాస దాకా పోరాడతాం’’ అని చెప్పారు. కుట్ర తేలేదాకా పోరు: వైద్యులు పాక్షిక న్యాయమే జరిగిందంటూ తీర్పు అనంతరం జూనియర్ వైద్యులు పెదవి విరిచారు. ‘‘ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. ఈ నేరంతో పెద్ద వ్యక్తులకు కచి్చతంగా సంబంధముంది. అందుకే క్రైం సీన్‌ను మార్చేశారు. ఆధారాలను చెరిపేశారు. ఆ దిశగా మరింత విచారణ జరపాలి’’ అని డిమాండ్ చేశారు. అప్పటిదాకా తమ పోరు ఆగదని స్పష్టం చేశారు. రాయ్ ఒక్కడే దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతుండగా ఇందులో మరికొందరి హస్తముందని బాధితురాలి తల్లిదండ్రులు, వైద్యులు వాదిస్తుండటం తెలిసిందే. 50 మంది సాక్షులు కోల్‌కతా పోలీసు విభాగంలో పౌర వలంటీర్ అయిన రాయ్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సీబీఐ పేర్కొంది. నవంబర్ 12న మొదలైన రహస్య విచారణ జనవరి 9న ముగిసింది. 50 మంది సాక్షులను విచారించారు. ఘటన జరిగిన మర్నాడు రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. కోర్టు తీర్పును సవాలు చేయబోమని సంజయ్ రాయ్ సోదరి తెలిపారు. ‘‘అతను నేరం చేసినట్లయితే శిక్ష అనుభవించాల్సిందే. విచారణకు మా కుటుంబం హాజరవడం లేదు’’ అని చెప్పారు. 9 Aug: A Trainee doctor was R*PED and MURDERED in #RGKar Hospital.13 Aug: Calcutta HC ordered CBI Probe2 Sept: Former principal Sandip Ghosh arrested.7 Oct: Chargesheet Filed. Sanjay Roy named the key accused.18 January: Trial Court will pronounce the VERDICT Today. pic.twitter.com/NxVA6CXD5o— SAVE THE WORLD 🗺 (@ProtecterIM) January 18, 2025 -
కోల్‌కతా అభయ కేసులో బిగ్ ట్విస్ట్.. సీబీఐకి ఎదురుదెబ్బ
కోల్‌కతా: బెంగాల్‌లోని ఆర్జీకార్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అభయ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో నిందితుడి విషయంలో సీబీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కి నార్కో అనాలసిస్ పరీక్ష చేయడానికి సీబీఐ సిద్ధమైంది ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించగా సీబీఐకి ధర్మాసనం షాకిచ్చింది. కోల్‌కతా హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్‌కు నార్కో పరీక్షలు నిర్వహించేందుకు న్యాయస్థానం అనుమతి నిరాకరించింది. నిందితుడికి నార్కో పరీక్షకు అనుమతివ్వాలన్న సీబీఐ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. దీంతో, సీబీఐ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. RG Kar Medical College and Hospital rape-murder case | Arrested accused Sanjay Roy refuses to give consent for Narco analysis test. The Sealdah Court in Kolkata rejected the CBI's prayer for Sanjay Roy's narco-analysis test.— ANI (@ANI) September 13, 2024 అయితే, అభయ హత్యాచార ఘటన కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కు సీబీఐ ఇప్పటికే పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన వివరాలను సీబీఐ బయటకు వెల్లడించలేదు. ఇక, పాలీగ్రాఫ్ పరీక్షలో నిందితుడులు చెప్పిన విషయాలను అధికారులు గోప్యంగా ఉంచారు. మరోవైపు.. పాలీగ్రాఫ్ టెస్టులో సంజయ్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని సీబీఐ అధికారులకు చెప్పాడనే లీకులు బయటకు రావడం గమనార్హం. తాను వెళ్లేసరికే ఆ వైద్యురాలు చనిపోయి ఉందని, తాను భయంతో పారిపోయానని అతడు చెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అభయ కేసుకు సంబంధించి అసలు నిజాలను రాబట్టేందుకే నిందితుడు సంజయ్ రాయ్‌కు నార్కో పరీక్షలు నిర్వహించాలని సీబీఐ భావించింది. #WATCH | RG Kar Medical College and Hospital rape-murder case | West Bengal: Arrested accused Sanjay Roy being brought out of Sealdah Court in Kolkata.He was brought to the Court from Presidency Correctional Home for a hearing related to his Narco test. CBI filed a petition to… pic.twitter.com/XhReY58vdb— ANI (@ANI) September 13, 2024 నార్కో టెస్ట్ ఇలా.. ఈ పరీక్షకి ముందు కొన్ని మందులు లేదంటే ఇంజెక్షన్లు(సోడియం పెంటోథాల్, స్కోపలామైన్, సోడియం అమైథాల్) ఇస్తారు. తద్వారా నిందితుడు/అనుమానితుడు అపస్మార స్థితిలోకి జారుకుంటాడు. మనస్సుపై నియంత్రణ కోల్పోతాడు. అప్పుడు అతని ద్వారా నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తారు. అయితే.. కొన్ని సందర్భాల్లో, సదరు వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకోవచ్చు. డోస్ ఎక్కువగా ఇస్తే కోమాలోకి వెళ్లిపోవడం లేదంటే చనిపోవచ్చూ కూడా. కాబట్టి, నార్కో టెస్ట్‌కు కోర్టు లేదంటే దర్యాప్తు సంస్థల అనుమతి తప్పనిసరి. అంతేకాదు.. అతను నార్కో టెస్ట్‌కు అర్హుడేనా? అనేది కూడా బాడీ టెస్ట్ ద్వారా ధృవీకరించుకుంటారు. ఫోరెన్సిక్ నిపుణులు, దర్యాప్తు అధికారులు, వైద్యులు, మనస్తత్వవేత్తల సమక్షంలో ఈ పరీక్ష జరుగుతుంది. పరీక్ష జరిగే టైంలో వీళ్లలో ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఆ టెస్ట్ ఆపేయాల్సిందే!.. ఇక కొందరు ఈ పరీక్షలో కూడా దర్యాప్తు బృందం నుంచి తప్పించుకుంటున్నారు. అందుకే ఈ పరీక్షపైనా తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి. కానీ, మన దేశంలో నార్కో టెస్ట్, పాలీగ్రాఫ్ టెస్ట్‌ల ద్వారా కేసుల దర్యాప్తులో పురోగతి సాధించిన సందర్భాలు, కేసుల చిక్కుముడులు విప్పిన దాఖలాలే ఎక్కువగా నమోదు అయ్యాయి.గతంలో చాలా కీలకమైన కేసులను ఛేదించడంలో ఈ పద్ధతులను ఉపయోగించారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల కేసు, అబ్దుల్ కరీం తెల్గీ స్టాంపు పేపర్ల కుంభకోణం, 2006లో నోయిడా సీరియల్ మర్డర్స్, 26/11 ముంబయి ఉగ్రదాడి కేసులో కసబ్ విచారణ సమయంలో నార్కో పరీక్షలు నిర్వహించారు.పాలీగ్రాఫ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే.. పాలీగ్రాఫ్ టెస్ట్.. నేర పరిశోధనలో ప్రయోగాత్మకమైన పద్ధతి. దీన్ని లైడిటెక్టర్ పరీక్ష అని కూడా వ్యవహరిస్తుంటారు. నిజాలను రాబట్టడం అనడం కంటే.. అబద్ధాలను గుర్తించడం అనే ట్యాగ్‌తో ఈ పరీక్షగా ఎక్కువగా పాపులర్ అయ్యింది. 1921లో కాలిఫోర్నియా యూనివర్సిటీ మెడికో జాన్ అగస్టస్ లార్సన్ ఈ విధానాన్ని కనిపెట్టారు. ఎలక్ట్రానిక్ యంత్రాల సాయంతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. వైర్లు, ట్యూబుల్లాంటి వాటితో శరీరానికి సెన్సార్ల వంటి నిర్దిష్ట పరికరాలను జోడించి.. బీపీ, పల్స్, వివిధ భావోద్వేగాలు, శరీర కదలికలను జాగ్రత్తగా పర్యవేక్షించడం ద్వారా ఈ టెస్ట్ నిర్వహిస్తుంటారు.శరీరం ఎలా స్పందిస్తుందో నిశితంగా గమనించి ఆ వ్యక్తి చెప్పేది నిజమో అబద్ధమో అనే నిర్ధారణకు అధ్యయనం చేపట్టడం ద్వారా వస్తారు. క్రిమినల్ కేసుల దర్యాప్తుల్లో కీలకంగా వ్యహరిస్తుంటుంది ఈ పరీక్ష. కానీ, ఇదే ఫైనల్ రిజల్ట్ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. నేరస్థులు ప్రాక్టీస్ ద్వారా ఈ పరీక్ష నుంచి తప్పించుకున్న దాఖలాలు బోలెడు ఉన్నాయి. అందుకే ఈ పరీక్ష కచ్చితత్వంపై తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి.ఇది కూడా చదవండి: ట్రెయినీ ఆర్మీ అధికారులపై దాడి -
ఆస్పత్రులపై దాడులు.. కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: బెంగాల్‌లోని కోల్‌కతాలో వైద్యురాలి హత్యచార ఘటనపై ఆందోళనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం.. అన్నీ అసుపత్రులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రి వైద్యులపై, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలపై దాడి జరిగితే.. ఆరు గంటల్లోగా పోలీసు కేసు కావాల్సిందేని పేర్కొంటూ.. అన్ని ఆసుపత్రులకు మెమో జారీ చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఫిర్యాదు అందకపోతే.. సంబంధిత ఆసుపత్రి, ఇన్స్టిట్యూట్ అధిపతి దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందిపై దాడులు ఎక్కువైనట్లు మా దృష్టికి వచ్చింది. అనేక మంది ఆరోగ్య కార్యకర్తలు తమ విధి నిర్వహణలో శారీరక హింసకు గురవుతున్నారు. మరికొందరికి బెదిరింపులు, వస్తున్నాయి.ఇందులో ఎక్కువ శాతం రోగి, వారి వెంట వచ్చిన అటెండర్ల వల్ల ఎదుర్కొన్నవే.. దీనిని పరిగణనలోకి తీసుకొని ఆసుపత్రులకు ఆదేశాలు ఇచ్చాం. విధుల్లో ఉండగా వైద్య సిబ్బంది హింసను ఎదుర్కొంటే.. ఆరు గంటల్లోగా ఆసుపత్రి హెడ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని కేంద్రం వెల్లడించింది. In the event of any violence against any healthcare worker while on duty, the Head of Institution shall be responsible for filing an Institutional FIR within a maximum of 6 hours of the incident: Ministry of Health and Family Welfare pic.twitter.com/2YGDZVRx8O— ANI (@ANI) August 16, 2024కాగా కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో పనిచేసే వారికి మెరుగైన రక్షణ, సురక్షితమైన పని వాతావరణం కల్పించాలని కోరుతూ దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్ధులు సమ్మెకు దిగారు. ఈ క్రమంలోనే కేంద్రం ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
కోల్‌కతా వైద్యురాలి ఉదంతం.. ప్రతిపక్షాలవి చిల్లర రాజకీయాలు: మమతా
కోల్‌కతాలోని వైద్యురాలి హత్యాచార ఘటన దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో గత శుక్రవారం తెల్లవారుజామున వైద్యారాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఉదంతం దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ కేసును రాష్ట్ర పోలీసుల నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తమ ఆధీనంలోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించింది.మరోవైపు ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా వైద్య విద్యార్ధులు, డాక్టర్లు పశ్చిమబెంగాల్, ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అత్యాచారం-హత్య కేసులో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ కేసులో సీఎం మమత నిందితులను రక్షించాలని ప్రయత్నిస్తున్నారని, ముఖ్యమంత్రి పదవికి ఆమె రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.అయితే వైద్యురాలిపై హత్యచారం ఉదంతాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయడాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విపక్ష బీజేపీ నాయకులు చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బెంగాల్లో బంగ్లాదేశ్ తరహా ఆందోళనలు సృష్టించేందుకు బీజేపీ, సీపీఎం ప్రత్ని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.‘బాధిత కుటుంబానికి అండగా నిలబడాల్సింది పోయి.. వామపక్షాలు, బీజేపీ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. వారు ఇక్కడ ఓ బంగ్లాదేశ్‌ను చేయగలమని భావిస్తున్నారు. అయితే నేనేం అధికారం కోసం అత్యాశతో లేను. ఈ కేసులో అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ తీరును కొందరు తప్పుపడుతున్నారు. ఈ కేసులో మేం ఏం చేయలేదా? ఎలాంటి చర్యలు తీసుకోలేదా? సంఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసు కమిషనర్‌తో మాట్లాడాను. బాధిత మహిళ తల్లిదండ్రులతోనూ మాట్లాడాను. అత్యాచారం చేసిన వ్యక్తిని ఉరితీస్తానని వారితో చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్నాను.ఘటజన జరిగిన రాత్రంతా కేసును పర్యవేక్షిస్తున్నాను. దహన సంస్కారాలు జరిగే వరకు పోలీసులతో టచ్‌లో ఉన్నాను. పోలీసులు ఆమె కుటుంబంతోనే ఉన్నారు. అంతేగాక 12 గంటల్లో హంతకుడిని అరెస్టు చేశారు. బాధితురాలి మృతదేహాన్ని తీసుకెళ్లడం, డీఎన్ఏ టెస్టు చేయడం, సీసీటీవీ ఫుటేజీ, సమగ్ర దర్యాప్తు అన్నింటిని పోలీసులు పూర్తి చేశారు.ఏదైనా విచారణ కోసం ముందు సమయం ఇవ్వాలి. నేను ఆదివారం వరకు పోలీసులకు గడువు విధించాను. సరైన విచారణ చేయకుండా ఎవరిపైనా చర్యలు తీసుకోలేరు. నేను సీనియర్, జూనియర్ డాక్టర్లను గౌరవిస్తాను. సరైన విచారణ లేకుండా నేను వ్యక్తులను అరెస్టు చేయలేను’అని తెలిపారు.ఈ వ్యవహారంలో కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకోవడంతో కేసును మంగళవారం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ దర్యాప్తుపై మమతా మాట్లాడుతూ.. తాము పూర్తిగా హైకోర్టు మార్గదర్శకాలను అనుసరిస్తామని, సీబీఐ దర్యాప్తుకు సహరిస్తున్నామని తెలిపారు. కేసును త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే ముప్పై నాలుగు మందిని పోలీసులు విచారించారని, మరికొంతమందిని విచారించాల్సి ఉందన్నారు. అయితే ఈ లోపే హైకోర్టు జోక్యం చేసుకుని కేసును సీబీఐకి బదిలీ చేసిందని చెప్పారు. -
సందేశ్‌ఖాలీ ర్యాలీలో 'మమతా బెనర్జీ' ఘాటు వ్యాఖ్యలు
రగులుతున్న సందేశ్‌ఖాలీ సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీ తృణమూల్ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన తర్వాత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 'మమతా బెనర్జీ' ఈ రోజు కోల్‌కతాలో మహిళలకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సందేశ్‌ఖాలీ ద్వీపానికి చెందిన కొందరు మహిళలు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. మహిలాడర్ అధికార్, అమదర్ అంగీకార్ (మహిళల హక్కులు, మా నిబద్ధత) అనే అంశంతో ర్యాలీ సాగింది. దీనికి సంబంధించిన ఓకే వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో మమతా బెనర్జీ ముందు నడుస్తుంటే.. ప్రముఖ మహిళా తృణమూల్ నాయకులలైన సుస్మితా దేవ్, శశి పంజా, కొత్తగా ఎన్నికైన రాజ్యసభ ఎంపీ & పాత్రికేయురాలు సాగరిక ఘోష్ వెనుక నడిచారు. ఈ ర్యాలీలో బీజేపీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీను కూడా మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్లో మహిళలను హింసిస్తున్నట్లు బీజేపీ నేతలు ఆరోపించడాన్ని ఖండించారు. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు, హత్రాస్‌లో మహిళపై అత్యాచారం చేసి, ఆమె మృతదేహాన్ని బలవంతంగా దహనం చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని బీజేపీని ఉద్దేశించి అన్నారు. బెంగాల్లోనే మహిళలు అత్యంత సురక్షితమని, దీనిని తాను నిరూపించగలనని సవాల్ చేశారు. కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ బీజేపీలో చేరడంపై కూడా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఒక బీజేపీ బాబు గద్దె మీద కూర్చున్నాడు, అతను ఇప్పుడు బీజేపీలో చేరాడు, అలాంటి వారి నుంచి మీరు న్యాయం ఎలా ఆశించగలరని అన్నారు. ప్రతి ఏడాది మమతా బెనర్జీ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల మార్చ్‌కు నాయకత్వం వహిస్తారు. అయితే ఈ సారి అంతకంటే ముందే ర్యాలీ నిర్వహించారు. మహిళా ఓటర్లు తృణమూల్ కాంగ్రెస్‌కు కీలకమైన మద్దతు. పార్టీ అధికారంలో కొనసాగిన 13 సంవత్సరాలుగా.. కన్యాశ్రీ, రూపశ్రీ, లక్ష్మీర్ భండార్ వంటి పథకాల ద్వారా మహిళలకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం తప్పకుండా దోహదపడుతుందని అన్నారు. -
Love Story: పాక్ యువతితో ప్రేమ.. భారత్‌లో అడుగుపెట్టిన జావెరియా
ఢిల్లీ: ఇటీవల కొన్ని ప్రేమలు దేశాలు దాటుతున్నాయి. ఒక దేశానికి చెందిన యువతి/యువకుడు.. మరో దేశానికి చెందిన వారితో ప్రేమలో పడటంతో వారు అక్కడికి వెళ్లడం పెళ్లిళ్లు చేసుకుంటున్న ఘటనలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరోసారి వెలుగుచూసింది. తన తల్లి మొబైల్లో ఉన్న ఓ యువతి ఫోటోను చూసి మనసు పడ్డ ఓ యువకుడి లవ్‌స్టోరీ ఇది. వీరి ప్రేమకథ 2018లో మొదలైంది. ఇక్కడ అమ్మాయిది పాకిస్తాన్, అబ్బాయిది భారత్‌కు చెందిన కోల్కత్తా.. ఇంతకీ ఏం జరిగిందంటే.. వివరాల ప్రకారం.. కోల్‌కతాకు చెందిన సమీర్‌ఖాన్ జర్మనీలో చదువుకున్నాడు. అయిదేళ్ల కిందట భారత్‌కు వచ్చినప్పుడు తన తల్లి ఫోనులో కరాచీకి చెందిన జావెరియా ఖానుమ్ ఫొటో చూసి మనసు పారేసుకున్నాడు. పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని పట్టుబట్టాడు. పెద్దలు అంగీకరించినా వీరి పెళ్లికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే, భారత్‌కు వచ్చేందుకు రెండుసార్లు జావెరియా ప్రయత్నించగా ఆమె వీసా తిరస్కరణకు గురైంది. మధ్యలో కొవిడ్ కష్టాలు వచ్చిపడ్డాయి. మొత్తం అయిదేళ్లు అలా గడిచిపోయాయి. #WATCH | Amritsar, Punjab: A Pakistani woman, Javeria Khanum arrived in India (at the Attari-Wagah border) to marry her fiancé Sameer Khan, a Kolkata resident. She was welcomed in India to the beats of 'dhol'. She says, "I am extremely happy...I want to convey my special thanks… pic.twitter.com/E0U00TIYMX — ANI (@ANI) December 5, 2023 ఎట్టకేలకు 45 రోజుల గడువుతో జావెరియాకు ఇపుడు భారత్ వీసా దక్కింది. అమృత్సర్ నుంచి కోల్‌కతాకు ఈ జంట విమానంలో చేరుకుంది. జావెరియాకు వీసా మంజూరు చేసినందుకు భారత ప్రభుత్వానికి సమీర్‌ఖాన్ కృతజ్ఞతలు తెలిపాడు. ఇక, మంగళవారం వాఘా - అటారీ అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోకి అడుగుపెట్టిన పాక్ యువతికి బాజా భజంత్రీలతో యువకుడి కుటుంబం ఘనస్వాగతం పలికింది. వచ్చే జనవరిలో ఇరువురి వివాహం జరగనుంది. -
దుర్గామాతకు పానీపూరీల అలంకరణ.. ఎక్కడంటే?
కోల్‌కతాలో జరిగే దుర్గా పూజలలో భక్తుల సృజనాత్మకత కనిపిస్తుంటుంది. ఈసారి నగర దక్షిణ శివారు బెహలాలోని ఒక దుర్గామండపం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ మండపం అందంలో మాత్రమే కాదు రుచిలో కూడా పోటీ పడుతోంది. బెహలా నోటున్ దాల్ క్లబ్ ఏర్పాటు చేసిన ఈప్రత్యేక దుర్గా మండపం అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మండపాన్ని పానీపూరీలతో అలకంరించారు. దీనిని గోల్గప్ప అని కూడా అంటారు. చాలామందికి ఇష్టమైన ఈ స్ట్రీట్ ఫుడ్‌తో దుర్గాపూజను ముడిపెట్టడాన్ని పలువురు ఎంజాయ్ చేస్తున్నారు. వ్యాపార దిగ్గజం హర్ష్ గోయెంకా ఈ దుర్గామండపం క్లిప్‌ను షేర్ చేశారు. ఇది కూడా చదవండి: కశ్మీర్ శక్తిపీఠంలో నవరాత్రులు Kolkata's Durga Puja pandals: where phuchka (panipuri) meets divine architecture, a truly heavenly combination! 🙌🏛️ pic.twitter.com/Ytz6a0Aafy — Harsh Goenka (@hvgoenka) October 16, 2023 -
ఇండస్ట్రియల్ పార్క్‌లో భారీ అగ్ని ప్రమాదం
కలకత్తా: పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇండస్ట్రియల్ పార్క్‌లోని వేర్ హౌజ్‌లో అగ్ని ప్రమాదం చెలరేగగా.. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలను ఆర్పడానికి అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగారు. దాదాపు 11 ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పుతున్నాయి. అగ్ని ప్రమాదానికి కారణం మాత్రం ఇంకా తెలియలేదు. నష్టానికి సంబంధించిన విషయాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఇదీ చదవండి: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. భారత్ వ్యూహాత్మక వైఖరి Follow the Sakshi TV channel on WhatsApp: -
అపోలో హాస్పిటల్స్ చేతికి ‘కోల్‌కతా’ ఆస్పత్రి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ తూర్పు రాష్ట్రాల్లో మరింతగా కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కోల్‌కతాలో పాక్షికంగా నిర్మించిన ఓ ఆస్పత్రిని కొనుగోలు చేసింది. ఫ్యూచర్ ఆంకాలజీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి తమ అనుబంధ సంస్థ అపోలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ రూ. 102 కోట్లకు ఈ హాస్పిటల్‌ను కొనుగోలు చేసినట్లు సంస్థ వెల్లడించింది. కోల్‌కతా ప్రాంతంలో అపోలో హాస్పిటల్‌కు ఇది రెండో ఆస్పత్రి కాగా, తూర్పు ప్రాంతంలో అయిదోది. దీనితో కోల్‌కతా, భువనేశ్వర్, గువాహటివ్యాప్తంగా 1,800 పైచిలుకు పడకలతో అతిపెద్ద హెల్త్‌కేర్ ప్రొవైడర్‌గా తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగలమని తెలిపింది. తూర్పు రాష్ట్రాల్లో వచ్చే 3 ఏళ్ల వ్యవధిలో పడకల సంఖ్యను మరో 700 మేరకు పెంచుకోనున్నామని, తద్వారా సదరు ప్రాంతంలో మొత్తం పడకల సంఖ్య 2,500కి చేరగలదని వివరించింది. తాజాగా కొనుగోలు చేసిన సోనార్‌పూర్‌లో ఆస్పత్రిని 325 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇందులో తొలి దశ కింద 1.75 లక్షల చ. అ. విస్తీర్ణంలోని 225 పడకలు వచ్చే 12 నెలల్లో అందుబాటులోకి రాగలవని సంస్థ ఎండీ సునీతా రెడ్డి తెలిపారు. అధునాతన సాంకేతికతతో అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్న అపోలో హాస్పిటల్స్‌ను రెండు దశాబ్దాలపైగా కోల్‌కతా, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తున్నారని ఆమె చెప్పారు. -
జనాభా పెరుగుదలపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు..
ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి (Narayana Murthy) ఇటీవల కోల్‌కతాలోని టెక్నో ఇండియా యూనివర్శిటీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం గురించి, జనాభా నియంత్రణ గురించి వ్యాఖ్యానించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నారాయణ మూర్తి స్నాతకోత్సవంలో మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు తన విశ్వాసాలను స్వేచ్ఛగా ఆచరించుకోవచ్చు. అలాంటి సమాజంలో ప్రజాస్వామ్యం ఉత్తమంగా ఉంటుందని వ్యక్తం చేశారు. దేశ జనాభా నియంత్రణకు సరైన ప్రాధాన్యం లేదని వెల్లడించారు. దేశంలోనో కొన్ని ప్రాంతాల్లో నియంత్రణ ఉన్నప్పటికీ.. చాలా ప్రాంతాల్లో దీన్ని పూర్తిగా విస్మరించినట్లు చెప్పుకొచ్చారు. నిజనమైన ప్రజాస్వామ్యానికి నాలుగు స్వేచ్ఛలు ఉంటాయని, అవి.. భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసాల మీద స్వేచ్ఛ, భయం నుంచి స్వేచ్ఛ, కోరికల పట్ల స్వేచ్ఛ అని అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్ట్ మాటలు గుర్తు చేశారు. ఇదీ చదవండి: అదే జరిగితే 70 వేల ఉద్యోగాలు పోతాయ్.. ఎక్కడో తెలుసా? భారతదేశం గత మూడు దశాబ్దాలుగా ప్రశంసనీయమైన ఆర్థిక పురోగతి ఉన్నప్పటికీ, పేదరికం, త్రాగునీరు, విద్య, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ వంటి వాటిలో ఇంకా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నట్లు తెలిపారు. జనాభా పెరుగుదలను తగ్గించడం ఇప్పుడు చేయవల్సిన ముఖ్యమైన పని. జనాభా సమస్య రానున్న 20 నుంచి 25 ఏళ్లలో మన దేశంపై విధ్వంసం సృష్టించే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు. -
వీడెవండి బాబు.. వారానికి 4 రోజుల పని.. రూ.50 వేల జీతం.. ఇవి సరిపోతాయా సార్!
ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం సాధించడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. కాలేజ్‌లో ఎంత బాగా చదివిన ఎన్ని మార్కులు వచ్చినా .. జాబ్‌కు దగ్గరకు వచ్చే సరికి అవన్నీ ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లడం వరకు మాత్రమే పని చేస్తాయి. అక్కడి నుంచి ఉద్యోగం తెచ్చుకోవడం మన స్కిల్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఇక అంత కష్టపడి జాబ్ వచ్చాక మనకు నచ్చినట్లు ఉండాలంటే కదరదు. రోజూ 8 గంటల పని.. ఇక ఆఫీసులో క్షణం తీరిక లేకుండా సంస్థను మెప్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగి దినచర్య అంటే ఇలానే ఉంటుంది. అయితే ఇటీవల ఓ ఫ్రెషర్‌ను ఇంటర్వ్యూ చేయగా.. అతని డిమాండ్లు చూసి ఇంటర్వ్యూర్ షాక్ అయ్యాడు. ఈ విషయాన్నే సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. కోల్‌కతాలోని ఒక న్యాయవాది ఇటీవల లిటిగేషన్ అసోసియేట్ పోస్ట్ కోసం ఒక ఫ్రెషర్‌ను ఇంటర్వ్యూ చేశాడు. అయితే ఇంటర్య్వూకి వచ్చిన ఆ అభ్యర్థి తనుకు ఉన్న డిమాండ్లతో పాటు రూ. 50,000 జీతం కావాలని చెప్పడట. దీంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ.. 'లిటిగేషన్ అసోసియేట్ పోస్ట్ కోసం ఓ ఫ్రెషర్‌ను ఇంటర్వ్యూ చేశాను. అతను పని చేయాలంటే.. తనకి వారంలో 4 రోజులు, రోజుకు 4 గంటలు మాత్రమే పని చేస్తానని చెప్పాడు. అలాగే కోర్టుకు వెళ్లడం కూడా తనకి ఇష్టం లేదని, అందుకే ఆఫీసులో ఉండి చేసే ఉద్యోగం కావాలని చెప్పాడు. కోల్‌కతలో ఉద్యోగం కాబట్టి జీతం రూ.50 వేలు ఇవ్వాలన్నాడు. ఈ తరానికి నా ఆశిస్సులు.' అని అన్నారు. కోల్‌కతాలో జీవన వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ కంపెనీ మెర్సెర్ ప్రపంచ వ్యాప్తంగా 227 నగరాలపై కాస్ట్ ఆఫ్ లివింగ్ 2023 సర్వే నిర్వహించగా అందులో కోల్‌కతా 211వ స్థానంలో నిలించింది. అంటే చాలా తక్కువ ఉంటుందని దాని అర్థం. ముంబై, ఢిల్లీ వంటి నగరాలు భారతీయ నగరాల్లో అగ్ర స్థానాల్లో ఉన్నాయి. కోల్‌కతా వంటి నగరాలలో ఉండి కూడా.. ఒక ఫ్రెషర్ అయ్యిండి అంత ఎక్కువ శాలరీతో పాటు ఇన్ని డిమాండ్ చేయడంపై నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలా అయితే ఎక్కడ ఉద్యోగం రాదని కామెంట్ చేయగా.. మరికొందరు ఈ డిమాండ్లు సరిపోతాయా అంటూ కామెంట్లు పెడుతున్నారు. Interviewed a fresher for a litigation associate post who wants 4 days work week, 4 hrs/day work (because he doesn't like going to court and will only be in chamber he said), and 50K salary in Kolkata. Bless this generation. ❤️ — Jhuma (@courtinglaw) July 23, 2023 చదవండి రోడ్డుకు అడ్డంగా పడుకుని పోలీసు వినూత్న నిరసన.. ఏం జరిగిందంటే? -
టైటానిక్ ప్యాలెస్!
ఫొటోలో కనిపిస్తున్న టైటానిక్‌ని పోలి ఉండే ఈ ఓడ విరిగిపోదు, మునిగిపోదు. ఎందుకంటే, ఇది అసలు ఓడే కాదు. ఇదొక ఇల్లు, ఈ ఇంటి యజమాని పేరు మింటు రాయ్. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ ఇతని ఊరు. కోల్‌కతాలో చదువుతున్న రోజుల్లో ఒకసారి టైటానిక్‌ని పోలి ఉండే దుర్గాపూజ పెండాల్ని చూసి ఆకర్షితుడయ్యాడు. చాలామంది దేవి కోసం కంటే ఆ నిర్మాణాన్ని చూడటానికి రావడం గమనించి, తన ఇళ్లు కూడా ఇంతే అందంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం చాలామంది ఇంజనీర్లను సంప్రదించాడు. అయితే, వారికి అతను డబ్బు చెల్లించలేడని వారు తప్పుకున్నారు. ఆర్థికంగా స్థిరపడటానికి వివిధ రకాల పనులతో పాటు, కొంతకాలం నేపాల్ వెళ్లి తాపీపని కూడా నేర్చుకున్నాడు. చివరకు 2010లో ఈ ఓడలాంటి ఇంటిపనులు ప్రారంభించాడు. 39 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పుతో తానే ఓ ప్లాన్ తయారు చేశాడు. దాదాపు పదమూడు సంవత్సరాల పాటు అక్కడే నివాసం ఉంటూ, పనులను కొనసాగిస్తూ, తన టైటానిక్ ప్యాలెస్‌ని చివరి దశకు తీసుకువచ్చాడు. ఇప్పటి వరకు రూ. 15 లక్షలు ఖర్చు చేసినట్లు అంచనా. ఇతని కలకు అతని భార్య ఇతిరాయ్, కొడుకు కిరణ్ రాయ్ కూడా తోడున్నారు. ‘వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నా. ఆ తర్వాత ఇదే టైటానిక్ పైఅంతస్తులో ఓ రెస్టారెంట్ నిర్మించి, ఆదాయం పొందుతా’ అని అంటున్నాడు మింటు. చదవండి: ఉడుత సాయం కాదు... ఉడుతకే సాయం! -
బీజేపీ యూత్ లీడర్ హల్చల్.. లాయర్ కాలర్ పట్టుకుని దాడి
బీజేపీ యూత్ లీడర్ హల్చల్ చేశాడు. ఓ లాయర్‌పై విచక్షణారహితంగా.. అతడి కాలర్ పట్టుకుని దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా పోలీసులు.. బీజేపీ నేతపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఐసీసీఆర్ ఆడిటోరియంలో బీజేపీ ఓ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ హాజరయ్యారు. ఇక, బీజేపీ మీటింగ్ కావడంతో సమావేశంలో పాల్గొనేందుకు స్థానిక నేతలతో పాటుగా ఉత్తర కోల్‌కతాకు చెందిన బీజేపీ యూత్ వింగ్ లీడర్ అభిజిత్ కూడా అక్కడికి వచ్చాడు. కాగా, కాసేపట్లో సమావేశం ముగుస్తుందనగా అభిజిత్ హల్చల్ చేశాడు. ఇక,ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేత సమిక్ భట్టాచార్యను కలిసేందుకు సబ్యసాచి రాయ్ చౌదురి అక్కడికి వచ్చాడు. ఈ క్రమంలో సబ్యసాచి రాయ్ చౌదురిని చూసిన అభిజిత్.. ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయాడు. సబ్యసాచి రాయ్.. టీఎంసీ నాయకుడని, ఐపీఎస్ అధికారుల పేర్లు చెప్పి చాలా మంది వద్ద డబ్బులు వసూలు చేశాడని ఆరోపిస్తూ.. అతడి కాలర్ పట్టుకుని చితకబాదాడు. గట్టిగా అరుస్తూ విచక్షణారహితంగా కొట్టాడు. ఈ సందర్భంగా చౌదురి.. తాను ఓ లాయర్నని, టీఎంసీ కార్యకర్తను కాదని చెబుతున్నా.. అభిజిత్ పట్టించుకోలేదు. చివరకు.. తనను కలిసేందుకే చౌదురి ఇక్కడకు వచ్చారని.. సమిక్ భట్టాచార్య నిర్ధారించడంతో శాంతించాడు. కాగా, ఈ దాడిపై చౌదురి పోలీసులకు ఆశ్రయించగా.. ఆడిటోరియం వద్ద వీడియో ఆధారంగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. #RaviVisvesvarayaSharadaPrasad https://t.co/QhHvYVS0yw Kolkata BJP youth leader caught beating man on camera — #RaviVisvesvarayaSharadaPrasad #Telecom #InfoTech (@rvp) August 27, 2022 -
పెళ్లితో ఒక్కటైన స్వలింగ సంపర్కులు.. వైరలవుతోన్న ఫోటోలు
ప్రేమ అంటే ప్రేమే.. దానికి సరైన అర్థం చెప్పడం కష్టం. అది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మధ్య చిగురిస్తుందో తెలియదు. అదేదో కవులు వర్ణించినట్లు ప్రేమ అందమైన కావ్యం మాత్రమే కాదు. పోరాటాలు, త్యాగాలు చేయాలి. ఎన్నో అవమానాలు ఛీత్కారాలు ఎదర్కొని నిలబడాలి. మనకు తెలిసి ప్రేమ గుడ్డిందంటారు. ప్రేమకు కులం, మతం, రంగు, డబ్బు అనే తేడాలు లేవంటుంటారు. కానీ ఇప్పుడు దీనిలో ఇంకొన్ని మార్పులు చేయాల్సి వస్తుందేమో. ప్రేమ అనేది ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ఏర్పడేదే కాదు.. ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిల మధ్య కూడా పుట్టొచ్చు. అంతేందుకు మొన్నటికి మొన్న ఓ యువతి తనను తాను మనువాడి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం గుర్తుండే ఉంటుంది కదూ. ఇదంతా ఇప్పుడేందుకంటే.. ఈ మధ్య కాలంలో ధైర్యం చేసి, సమాజంలోని మూస పద్దతులను బద్దలు కొట్టి చాలా మంది స్వలింగ సంపర్కులు ఒకటవుతున్నారు. గతేడాది హైదరాబాద్‌లో ఇద్దరు అబ్బాయిలు ఒకటైన విషయం తెలిసిందే. తాజాగా కోల్‌కతా, గుర్గావ్లకు చెందిన మరో గే జంట(స్వలింగ సంపర్కులు) జూలై 3న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ద్వారా తమ బంధాన్ని అధికారికంగా మార్చుకున్నారు. పూజారి వేద మంత్రాల సాక్షిగా అభిషేక్ రే, చైతన్య శర్మతో ఏడడుగులు వేశారు. పవిత్ర అగ్ని చుట్టూ తిరిగి జీవితాంతం ఒకరినొకరు తోడుంటామని ప్రమాణం చేశారు. కుటుంబం, బంధువుల మధ్య అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. పూర్తి హిందూ సంప్రాదయం ప్రకారం బెంగాలీ, మార్వాడీ ఆచారాల ప్రకారం వివాహ తంతు నిర్వహించారు. అభిషేక్ ధోతీ, కుర్తా ధరించగా, చైతన్య షేర్వాణీ వేసుకున్నారు. ఆదివారం కోల్‌కతాలో విందు కూడా ఏర్పాటు చేశారు. చదవండి: అచ్చం సీఎం షిండేలా ఉన్నారే!.. ప్రముఖ వ్యాపారవేత్త ట్వీట్ వైరల్ వీరి పెళ్లి, హల్దీ వేడుకలకు సంబంధించిన అందమైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా అభిషేక్, ఫ్యాషన్ డిజైనర్ కాగా చైతన్య జిటల్ మార్కెటింగ్ నిపుణుడని తెలిసింది. తమ పెళ్లిపై అభిషేక్ మాట్లాడుతూ..‘‘అంతిమంగా ప్రేమ అన్నింటిని జయిస్తుంది. దానికి కులం, మతం, ముఖ్యంగా లింగం(జెండర్)అవసరం లేదకు. ‘సమాజం ఏమనుకుంటుంది’’ అని ఆలోచించడం మానేసి మీ జీవితాన్ని మీకు నచ్చిన మార్గంలో గడపడం ప్రారంభించండి’’ అని తెలిపారు. -
ఆస్పత్రి బిల్డింగ్ ఎక్కి రోగి హల్చల్.. రెండు గంటలు శ్రమించినా చివరకు
కోల్‌కతా: కోల్‌కతా న్యూరోసైన్స్ హాస్పిటల్లో ఓ రోగి హల్చల్ చేశాడు. రెండు గంటల పాటు అందర్నీ పరుగులు పెట్టించి, చివరికి బిల్డింగ్ పైనుంచి దూకి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ హాస్పిటల్లో సుజిత్ అనే పేషెంట్ తన బెడ్ నుంచి తప్పించుకుని ఆస్పత్రి భవనం ఏడవ అంతస్తులోని ఓ గోడ అంచున కూర్చుని దూకేస్తానంటూ రెండు గంటలు పాటు హంగామా చేశాడు. ఆ పేషంట్ చికిత్స తాను పొందుతున్న వార్డులోని గ్లాస్ కిటికీలోని గ్యాప్ ద్వారా తప్పించుకుని ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆసుపత్రి ఉద్యోగులు, అగ్నిమాపక దళం సిబ్బంది పేషంట్ని వార్డుకు తిరిగి రావాలని ఎంత విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. పేషంట్ని కాపాడేందుకు హైడ్రాలిక్ నిచ్చెన సాయంతో సిబ్బంది కిందకు దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చివరికి ఆస్పత్రి సిబ్బంది, అగ్ని మాపక సిబ్బంది అతన్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బిల్డింగ్‌పై నుంచి దూకేశాడు. దీంతో అతని పుర్రె, పక్కటెముక, ఎడమ చేయి తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆసుపత్రి అధికారి తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని పేషంట్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చదవండి: భార్యను కాటేసిన పాము.. బాటిల్లో బంధించి మరీ ఆస్పత్రికి.. సమాధానం విని ఘొల్లుమని నవ్వులు -
వివాదాస్పద వ్యాఖ్యలు.. నుపుర్ శర్మకు సమన్ల వెల్లువ
థానె: ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సస్పెండైన బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మకు సమన్లు వెల్లువెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల పోలీసులు ఆమెకు ఇప్పటికే నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తాజాగా కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 20వ తేదీన నర్కెల్‌దంగా పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని కోరారు. టీఎంసీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సొహైల్ ఫిర్యాదు మేరకు నోటీసులిచ్చారు. నుపుర్ శర్మ అభ్యర్థన మేరకు ఆమె హాజరు కావాల్సిన గడువును మరికొద్ది రోజులు పొడిగించినట్లు మహారాష్ట్రలోని థానె జిల్లా భివాండి పోలీసులు తెలిపారు. ఈనెల 22వ తేదీన హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా నుపుర్ శర్మకు నోటీసులు ఇచ్చినట్లు థానెలోని ముంబ్రా పోలీసులు, 25న హాజరు కావాలంటూ ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. బెంగాల్లో ఇంకా ఉద్రిక్తతే బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైలు మార్గాలపై నుపుర్ దిష్టిబొమ్మలను దహనం చేసి, బైఠాయించడంతో సియల్డా–హష్నాబాద్ మార్గంలో సోమవారం ఉదయం 20 నిమిషాలపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఈస్టర్న్ రైల్వే తెలిపింది. ముర్షిదాబాద్, నడియా జిల్లాలతోపాటు హౌరాలోని కొన్ని ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమలవుతోంది. యూపీలో 325 మంది అరెస్ట్ శుక్రవారం నాటి అల్లర్లకు సంబంధించి యూపీలోని 8 జిల్లాలకు చెందిన 325 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అల్ల్లర్లకు సూత్రధారి జావెద్ అహ్మద్ అక్రమంగా నిర్మించుకున్న ఇంటిని అధికారులు కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ కొందరు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇది అన్యాయం, అక్రమమని బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఆరోపించారు. -
టీచర్‌కు విద్యార్థుల వినూత్న వీడ్కోలు.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!
కోల్కత్తా: మనం ఏ స్థాయిలో ఉన్నా మనకు విద్య నేర్పించిన గురువులను గుర్తుపెట్టుకుట్టాం. వారికి తగిన గౌరవం ఇస్తాం. మనకు నచ్చిన టీచర్ బదిలీ అవుతున్న సందర్బంగా వారికి గుర్తుండిపోయేలా ఫెర్వల్ను ప్లాన్ చేస్తుంటం. తాజాగా ఇలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బెంగాల్‌లోని 24 పరగణా ప్రాంతంలో కటియాహట్ బికేఏపీ బాలికల పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో సంపా అనే టీచర్ విధులు నిర్వహిస్తోంది. ఆమెతో పాఠశాలలోని విద్యార్థులకు అవినాభావ సంబంధం ఏర్పడింది. ఇదిలా ఉండగా ఆమె బదిలీ అవుతున్నారన్న విషయం తెలుసుకున్న విద్యార్థులు ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. Students pouring out their love to Sampa mam, probably one of the best teachers in the world. @iamsrk pic.twitter.com/XEQg7MFTbk — kishan kuliyal (@KishanlalK) February 19, 2022 ఈ క్రమంలోనే తమకు ఎంతో ఇష్టమైన టీచర్‌కు వినూత్నంగా వీడ్కోలు పలకాలని భావించారు. దీని కోసం విద్యార్థులు టీచర్ కళ్లకు గంతలు కట్టారు. ఆ తర్వాత ఆమెను పాఠశాల గ్రౌండ్లోకి తీసుకెళ్లి.. విద్యార్థినిలందరూ మోకాళ్లపై కూర్చుని.. ‘రబ్నే బనాదీ జోడి’ సినిమాలోని ఒక పాటను పాడారు. ఆ తర్వాత టీచర్ ముందు కూర్చుని గులాబీ పువ్వులను ఆమెకు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కన్నీరు పెట్టుకోవడంతో సంపా కూడా ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ఆమె వారిని హత్తుకుని ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసి వారంతా తమ స్కూల్ డేస్ గుర్తుకు వస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
స్మార్ట్ ఫోన్ కొన్న భార్య.. హత్యకి ప్లాన్ చేసిన భర్త
Hanband Plans To Murder Wife For Buying Smart Phone: కోల్‌కతా: అనుమతి లేకుండా స్మార్ట్ ఫోన్ కొన్నందుకు తన భార్యను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు ఓ కిరాతక భర్త. అందుకు కాంట్రాక్ట్ కిల్లర్స్ ని కూడా నియమించాడు. అదృష్టవశాత్తు ఆ మహిళ ఈ ప్రమాదం నుంచి బయట పడింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని కోల్ కత్తాలో జరిగింది. వివరాల ప్రకారం.. ఓ మహిళ కొన్ని నెలల క్రితం తన భర్తను స్మార్ట్‌ఫోన్ కొనమని కోరింది. అయితే అతను కొనేందుకు నిరాకరించాడు. ట్యూషన్ తరగతులు చెబుతూ కొంత డబ్బు సంపాదిస్తున్న మహిళ జనవరి 1న స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో కోపంతో ఆమెను చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆ వ్యక్తి ఇంటి మెయిన్ డోర్‌కు తాళం వేసి మహిళ భర్త వెళ్ళిపోయాడు. ఏదో తప్పుగా భావించిన మహిళ అతని కోసం వెతకుతున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. తీవ్ర రక్తస్రావమైన మహిళ ఇంటి నుంచి పారిపోయి అరవడం ప్రారంబించింది. మహిళ అరుపులు విన్న స్థానికులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. దుండగుల్లో ఒకరిని, భర్తను పట్టుకున్నారు. అయితే, మరో దుండగుడు తప్పించుకోగలిగాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు -
పగిలిన డిస్ప్లే ఫోన్లకు ఐఐటీ పరిశోధకుల అద్భుత ఆవిష్కరణ
స్మార్ట్‌ఫోన్ మన నిత్యజీవితంలో ఒక భాగమైంది. వేలకువేలు డబ్బులు పోసి మీరు స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే, ఒక్కసారిగా మీ ఫోన్ అనుకోకుండా కింద పడి డిస్ప్లే పగిలిపోతే అంతే సంగతులు...! గుండె బద్దలైపోతుంది. ఎంతోకొంత డబ్బును వెచ్చించి తిరిగి ఫోన్‌కు కొత్త డిస్ప్లే వేయిస్తాం..! మనలో చాలా మంది ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్న వారిమే. ఫోన్ పొరపాటున ఎక్కడ కింద పడిపోతదేమో అనే భయంతో మన ఫోన్లను జాగ్రత్తగా చూసుకుంటాం. ఇకపై ఫోన్ కింద పడితే డిస్ప్లే పగిలిపోతుందన్న భయం వీడండి. ఎందుకంటే భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే పగిలితే స్క్రీన్ తనంతటతాను స్క్రీన్ మంచిగా కానుంది. ఈ అద్భుతమైన ఆవిష్కరణకు ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐఎస్ఈఆర్ కోల్కత్తా పరిశోధకులు పురుడుపోశారు. పగిలిన ఫోన్ల డిస్ప్లే దానంతటా అదే హీల్ అయ్యే టెక్నాలజీను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన విషయాలను ‘ సేల్ఫ్ హీలింగ్ క్రిస్టలిన్ మెటిరియల్’ జర్నల్ పేపర్లో పబ్లిష్ చేశారు. ఈ బృందం స్పటికకార స్థితిలో ప్రత్యేక సాలిడ్ మెటిరియల్‌ను తయారుచేశారు. ఈ పదార్థం ఫీజోఎలక్ట్రిక్ ధర్మాన్ని కలిగి ఉంది. మెకానికల్ ఎనర్జీను ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేయనుంది. ఈ పదార్థంలో ఏర్పడిన పగుళ్లలో ఉపరితలాల వద్ద వ్యతిరేక విద్యుత్ శక్తిని ప్రేరేపిస్తుంది. దీంతో ఈ పదార్థం తిరిగి సెల్ఫ్ హీల్ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఆవిష్కరణతో డిస్ప్లే క్రాక్‌లకు చెక్ పెట్టవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు. -
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం
కోల్‌కతా: కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం జరిగింది. ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా విస్తారా విమానం కుదుపునకు లోనయ్యింది. దీంతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. విమానంలో కుదుపుల కారణంగా ప్రయాణికులు కొందరు గాయపడ్డారు. 15 నిమిషాల్లో కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంటుందనుకున్న సమయంలో విమానం ఒక్క సారిగా భారీగా కుదుపునకు లోనైంది. దీంతో విమానంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఈ క్రమంలోనే 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికి ఆసుపత్రికి తరలించినట్లు కోల్‌కతా విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై విస్తారా ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన వారికి విమానంలోనే ప్రథమ చికిత్స అందించి కోల్‌కతా చేరుకున్న తరువాత ఆస్పత్రికి తరలించాము. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నామన్నారు. కాగా విస్తారా యూకే 775 విమానం మహారాష్ట్రలోని ముంబై నుంచి పశ్చిమ బెంగాల్‌కు సోమవారం బయల్దేరింది. 8 passengers including 3 suffered major injuries after Vistara's Mumbai-Kolkata flight hit turbulence. The 3 passengers with major injuries shifted to a local hospital in Kolkata: Kolkata Airport Director— ANI (@ANI) June 7, 2021 చదవండి: భారీ అగ్ని ప్రమాదం.. 15 మంది సజీవ దహనం? -
గంగూలీపై ఒత్తిడి తెచ్చి వాడుకోవాలని చూస్తున్నారు!
కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి గుండె పోటు రావడానికి రాజకీయ ఒత్తిళ్లే కారణమని సీనియర్ సీపీఐ(ఎమ్) నాయకుడు అశోక్ భట్టాచార్యా అభిప్రాయపడ్డారు. కొన్ని పార్టీలు గంగూలీ క్రేజ్‌ను వాడుకోవడానికి యత్నిస్తున్నాయని, ఈ క్రమంలోనే అతను ఒత్తిడికి గురై గుండెపోటుకు గురైనట్లు ఆరోపించారు. ‘ కొన్ని పార్టీలు గంగూలీని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నాయి. అది కచ్చితంగా గంగూలీపై ఒత్తిడి తేవడమే. (సిక్స్ కొడితే బీర్ మగ్‌లో పడింది..!) అతనేమీ పొలిటికల్ లీడర్ కాదు. గంగూలీని ఒక స్పోర్ట్స్ ఐకాన్‌గా మాత్రమే మనం గుర్తుంచుకోవాలి’ అని గంగూలీ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన భట్టాచార్యా పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గంగూలీని పరామర్శించడానికి వెళ్లిన భట్టాచార్యా మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు కొన్ని పార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా కూడా గంగూలీని రాజకీయాల్లోకి రమ్మని ఒత్తిడి చేయవద్దని హితవు పలికారు. గతవారమే గంగూలీతో రాజకీయాల్లో జాయిన్ అవుతున్నారా అనే విషయాన్నిఅడిగితే.. అదేమీ లేదని తేల్చిచెప్పాడని, అటువంటి సమయంలో ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. ఉదయం తన ఇంట్లోని జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా గంగూలీకి గుండెపోటుకు గురయ్యారు. దీంతో సౌరవ్‌ను హుటాహుటిన ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. సౌరవ్‌కు గుండెపోటుగా వైద్యులు నిర్దారించిన తర్వాత యాంజియో ప్లాస్టీ చేశారు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉంది. -
‘ది డర్టీ పిక్చర్’ నటి అనుమానాస్పద మృతి
కోల్‌కతా: బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. నటి, మోడల్ అర్య బెనర్జీ(33) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ‘ది డర్టీ పిక్చిర్’లో విద్యాబాలన్‌తో కలిసి నటించిన ఆమె కోల్‌కతాలోని తన నివాసంలో శుక్రవారం శవమై కనిపించారు. ఆమె ఇంటి పనిమనిషి వచ్చి తలుపులు కొట్టగా బెనర్జీ ఎంతకీ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమచారం అందించింది. దీంతో అక్కడికి చేరుకున్న కోల్‌కతా పోలీసులు తలుపులు పగలకొట్టి గది లోపలికి వెళ్లి చూడగా బెడ్‌పై బెనర్జీ అపస్మారక స్థితిలో పడిఉన్నారు. అయితే నటి ముఖంపై గాయాలు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కొద్ది కాలంగా బెనర్జీ కలకత్తాలో ఒంటిరిగా జీవిస్తున్నారని ఆమె పనిమనిషి పోలీసులకు తెలిపింది. దీంతో పనిమనిషి అందిచిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెనర్జీది హత్య, ఆత్మహత్య అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా నటి మరణ వార్త తెలియడంతో బాలీవుడ్ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతి పట్ల సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు. బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన ఆమె ప్రముఖ నటి సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ది డర్టీ పిక్చర్’లో షకీలా పాత్ర పోషించారు. -
సోనూ సూద్‌కు అరుదైన గౌరవం
కోల్‌కతా: నటుడు సోనూ సూద్‌కు అరుదైన గౌరవం దక్కింది. లాక్డౌన్లో వలస కార్మికుల కోసం ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు చేర్చిన విషయం తెలసిందే. దీంతో ఆయన రియల్ హీరో అయ్యారు. కరోనా కాలంలో ఇబ్బందుల్లో ఉన్న ఎంతోమందికి చేయూతనిచ్చిన ఆయనను కోల్‌కతాలోని కేష్టోపూర్ ప్రఫుల్ల కననదుర్గా పూజ కమిటీ వారు ప్రత్యేకంగా సత్కరించారు. ప్రస్తుతం కోల్‌కతాలో జరుగుతున్న దుర్గపూజ పండల్లో సోనూ సూద్ విగ్రహాన్ని ప్రదర్శించి ఇలా ఆయనపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. అది చూసిన సోనూ సూద్ స్పందిస్తూ... ఇది తనకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం అంటూ అనందం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం ట్వీట్ చేస్తూ.. ‘ఎప్పటికైన ఇదే నాకు అతిపెద్ద ఆవార్డు’ అంటూ ట్వీట్ చేశారు. అదే విధంగా కెష్టోపర్ ప్రఫుల్ల దుర్గా కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: వలస దుర్గమ్మ..) అయితే ఈ పండల్లో లాక్డౌన్లో వలస కార్మికులను బస్సులో తరలిస్తున్నప్పటి సోనూసూద్ విగ్రహాంతో పాటు ఎదురుగా వలస కార్మికులు చేతులు జోడిస్తున్న విగ్రహాలను ఉంచారు. అదే విధంగా సంక్షోభ కాలంలో వలసదారులకు సంబంధించిన హృదయ విదాకర దృశ్యాలను కూడా పండల్లో ప్రదర్శించారు. హర్యానాలోని గురుగ్రామ్ నుంచి బీహార్ వరకు 1200 వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ తన కూమరుడిని సూట్‌కేసుపై లాక్కెళుతున్న మహిళా, బాబును ఓడిలో పెట్టుకుని గాయపడిన తన తండ్రిని దొపుడు బండిపై కుర్చోపెట్టి లాక్కెడం, సైకిల్ తోక్కుతున్న మహిళ విగ్రహాలను కూడా ప్రదర్శించారు. అయితే లాక్డౌన్లో సోనూ సూద్ వలస కార్మికులను సొంత ఖర్చులతో వారి గ్రామాలకు చేర్చడంతో పాటు విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సైతం స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. (చదవండి: మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్) My biggest award ever 🙏 https://t.co/4hOUeVh2wN — sonu sood (@SonuSood) October 21, 2020 -
నా ఫొటో వాడారు: పోలీసులకు నటి ఫిర్యాదు
కలకత్తా: అనుమతి లేకుండా తన ఫొటో ఉపయోగించిన వీడియో చాట్ యాప్‌పై నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ మంగళవారం కలకత్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ ప్రమోషన్ కోసం తన ఫొటో వాడటంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు యాప్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె పోలీసులను కోరారు. అంతేగాక ప్రకటనకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ట్విటర్లో షేర్ చేస్తూ పోలీసు కమిషనర్ అనుప్ శర్మను ట్యాగ్ చేశారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ.. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం సైబర్ సెల్‌తో దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. చదవండి: ‘టిక్‌టాక్ నిషేధం నోట్ల రద్దు వంటిదే’ -
ఎంపీతో అసభ్య ప్రవర్తన, ట్యాక్సీ డ్రైవర్ అరెస్టు
కోల్‌కత: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, హీరోయిన్ మిమి చక్రవర్తితో అసభ్యకరంగా ప్రవర్తించిన ట్యాక్సీ డ్రైవర్‌ను కోల్‌కత పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. జిమ్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న ఎంపీ కారును పశ్చిమ బెంగాల్‌లోని గరియాహట్ వద్ద సదరు ట్యాక్సీ డ్రైవర్ వెంబడించడమే కాకుండా ఆసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో డ్రైవర్‌ను మిమి పోలీసులకు పట్టించి అతడిపై ఫిర్యాదు చేశారు. వివరాలు.. సోమవారం మధ్యాహ్నం జిమ్ నుంచి తిరిగి వస్తున్న ఎంపీ మిమి చక్రవర్తి కారును ఓ ట్యాక్సీ డ్రైవర్ వెంబడించడం ఆమె గమనించారు. అతడు కారు పక్కనే తన ట్యాక్సీని తీసుకువచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే మొదట ఆమె దీనిని పట్టించకోకుండా తన దారిన తను వెళ్లిపోయారు. సదరు డ్రైవర్ మళ్లీ తన కారును ఓవర్ టేక్ చేసి అదే తరహాలో ప్రవర్తించడంతో అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. (చదవండి: కరోనా ఎఫెక్ట్ : స్వీయ నిర్బంధంలో హీరోయిన్) ఎంపీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసినట్లు గరియాహట్ పోలీసులు తెలిపారు. నిందితుడిని మెట్ర పాలిటన్ బైపాస్ సమీపంలోని ఆనందపూర్‌కు చెందిన లక్ష్మణ్ యాదవ్ (32)గా గుర్తించారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 354,354ఎ,354డి, 509 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఎంపీ మాట్లాడుతూ.. ‘నా కారును ఓ ట్యాక్సీ వెంబడించడం గమనించాను. నేను నా కారులో ఉన్నాను. అయితే ఆ డ్రైవర్ నా వైపు చూస్తూ అసభ్యకరంగా సైగ చేశాడు. మొదట అది నేను పట్టించుకోకుండా నా కారు వేగంగా ముందుకు పోనిచ్చాడు. అతడు నా కారు అతి వేగంగా ఓవర్ టేక్ చేసి మళ్లీ అదే తరహా ఆసభ్యకరంగా సైన్ చేశాడు. ఇప్పుడు నేను అతడిని వదిలేస్తే ఆ తర్వాత అతడి ట్యాక్సీలో ప్రయాణించే మరికొందరూ స్త్రీలు కూడా అతడి వేధింపులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అది సురక్షితం కాదని ఆలోచించాను. వెంటనే అతడి కారును వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించాను’ అని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.(చదవండి: శివసైనికుల దాడి : బీజేపీలో చేరిన నేవీ అధికారి)