Kolkata Gay Couple Get Married In Traditional Way, Wedding Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Kolkata Gay Couple Marriage: ప్రేమ అంటే ప్రేమే.. పెళ్లితో ఒక్కటైన స్వలింగ సంపర్కులు.. వైరలవుతోన్న ఫోటోలు

Published Tue, Jul 5 2022 3:29 PM | Last Updated on Tue, Jul 5 2022 4:06 PM

Kolkata Gay Couple Tie Knot In Traditional Ceremony, Pics Goes Viral - Sakshi

ప్రేమ అంటే ప్రేమే.. దానికి సరైన అర్థం చెప్పడం కష్టం. అది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మధ్య చిగురిస్తుందో తెలియదు. అదేదో కవులు వర్ణించినట్లు ప్రేమ అందమైన కావ్యం మాత్రమే కాదు. పోరాటాలు, త్యాగాలు చేయాలి. ఎన్నో అవమానాలు ఛీత్కారాలు ఎదర్కొని నిలబడాలి. మనకు తెలిసి ప్రేమ గుడ్డిందంటారు. ప్రేమకు కులం, మతం, రంగు, డబ్బు అనే తేడాలు లేవంటుంటారు. కానీ ఇప్పుడు దీనిలో ఇంకొన్ని మార్పులు చేయాల్సి వస్తుందేమో. ప్రేమ అనేది ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ఏర్పడేదే కాదు.. ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిల మధ్య కూడా పుట్టొచ్చు.  

అంతేందుకు మొన్నటికి మొన్న ఓ యువతి తనను తాను మనువాడి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం గుర్తుండే ఉంటుంది కదూ. ఇదంతా ఇప్పుడేందుకంటే.. ఈ మధ్య కాలంలో ధైర్యం చేసి, సమాజంలోని మూస పద్దతులను బద్దలు కొట్టి చాలా మంది స్వలింగ సంపర్కులు ఒకటవుతున్నారు. గతేడాది హైదరాబాద్‌లో ఇద్దరు అబ్బాయిలు ఒకటైన విషయం తెలిసిందే. తాజాగా కోల్‌కతా, గుర్గావ్‌లకు చెందిన మరో గే జంట(స్వలింగ సంపర్కులు) జూలై 3న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ద్వారా తమ బంధాన్ని అధికారికంగా మార్చుకున్నారు.

పూజారి వేద మంత్రాల సాక్షిగా అభిషేక్ రే, చైతన్య శర్మతో ఏడడుగులు వేశారు. పవిత్ర అగ్ని చుట్టూ తిరిగి జీవితాంతం ఒకరినొకరు తోడుంటామని ప్రమాణం చేశారు. కుటుంబం, బంధువుల మధ్య అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. పూర్తి హిందూ సంప్రాదయం ప్రకారం బెంగాలీ, మార్వాడీ ఆచారాల ప్రకారం వివాహ తంతు నిర్వహించారు. అభిషేక్ ధోతీ, కుర్తా ధరించగా, చైతన్య షేర్వాణీ వేసుకున్నారు. ఆదివారం కోల్‌కతాలో విందు కూడా ఏర్పాటు చేశారు. 
చదవండి: అచ్చం సీఎం షిండేలా ఉన్నారే!.. ప్రముఖ వ్యాపారవేత్త ట్వీట్‌ వైరల్‌

వీరి పెళ్లి, హల్దీ వేడుకలకు సంబంధించిన అందమైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా అభిషేక్, ఫ్యాషన్ డిజైనర్ కాగా చైతన్య జిటల్ మార్కెటింగ్ నిపుణుడని తెలిసింది. తమ పెళ్లిపై అభిషేక్‌ మాట్లాడుతూ..‘‘అంతిమంగా ప్రేమ అన్నింటిని జయిస్తుంది. దానికి కులం, మతం, ముఖ్యంగా లింగం(జెండర్‌)అవసరం లేదకు. ‘సమాజం ఏమనుకుంటుంది’’ అని ఆలోచించడం మానేసి మీ జీవితాన్ని మీ‍కు నచ్చిన మార్గంలో గడపడం ప్రారంభించండి’’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement