gay couple
-
ఉద్యోగాలు పోతున్నాయి.నాకు మాత్రం సూపర్: క్రేజీ ‘బారీ’ ప్రకటన ఏంటంటే!
బ్రిటీష్ మల్టీ-మిలియనీర్, పారిశ్రామికవేత్త బారీ డ్రివిట్-బార్లో (53) గుర్తున్నాడా. గే కపుల్‌గా క్రేజీ రికార్డు క్రియేట్ చేసిన బారీ ఇపుడు మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. రానున్న క్రిస్మస్ సందర్భంగా తన ఖర్చును తగ్గించుకుంటున్నట్టు తాజాగా ప్రకటించాడు. ఎందుకంటే దేశం కష్టాల్లో ఉంది. అలాగే ప్రపంచంలో చాలా మంది ఉద్యోగాలు, ఇళ్లను కోల్పోతున్న బాధలో ఉన్నారు. అందుకే ఈ ఏడాది క్రిస్మస్ ఖర్చును కేవలం 28 కోట్ల రూపాయలకు పరిమితం చేయబోతున్నానని తెలిపాడు. అలాగే తన హాలిడే షాపింగ్‌ను తగ్గించాలని ప్లాన్ చేసుకున్నానని కూడా పేర్కొన్నాడు. కానీ తనకు, తన వ్యాపారాలకు మాత్రం 2023 సూపర్ రికార్డ్ సంవత్సరం అని ప్రకటించాడు. అయితే ఇప్పటికే క్రిస్మస్ బడ్జెట్లో తన ఫియాన్సీ స్కాట్ కోసం 1.9కోట్ల రూపాయల విలువైన బ్రాండ్ న్యూ ఆడి ఆర్8ని కొనుగోలు చేశాడు. అలాగే కొడుకు ఆస్పెన్ కోసం లగ్జరీ అపార్ట్మెంట్లు, ఇళ్లను నిర్మించడానికి భూమిని కొనుగోలు చేశాడు. వ్యాపారంలో విజయం,క్రిస్మస్ సందర్భంగా ఆస్పెస్కి ప్రత్యేకంగా ఏదైనా ఇవ్వాలని నిర్ణయించు కున్నాడట. అందుకే ఖరీదైన కొత్త రోలెక్స్ G-వ్యాగన్ రడీ చేశాడు. అతని భార్య పిమ్ కోసం, ఆమె ఫ్యామిలీకి దగ్గరగా ఉండేలా ఆమె సొంత ఊరు బ్యాంకాక్‌లోని కోట్ల విలువచేసే కొత్త అపార్ట్మెంట్, కొత్త రోజ్ గోల్డ్ రోలెక్స్ వాచ్ కొనుగోలు చేశాడు. ఇంకా అయిపోలేదు అతని కుమార్తె సఫ్రాన్ కోసం, ప్లాటినం రోలెక్స్ వాచ్, లెక్కలేనన్ని దుస్తులు, లేటెస్ట్ లూయిస్ విట్టన్ బ్యాగ్‌లు ఇలా బోలెడు విలువైన వస్తువులు ఆమె కోసం సిద్ధం చేశాడు. దీంతో పాటు మిగిలిన పిల్లలకి కూడా క్రిస్మస్ కానుకలుగా లగ్జరీ వాచీలు, కార్లు, ఆస్తులను పొందబోతున్నారని స్వయంగా బారీ మీడియాకు వెల్లడించాడు. బారీ డ్రూవిట్-బార్లో టోనీ రికార్డులు, పిల్లలు బ్రిటన్‌లో బారీ డ్రివిట్-బార్లో భాగస్వామి టోనీతో కలిసి తొలి గే కపుల్‌గా రికార్డు సృష్టించారు. దాదాపు 11 సంవత్సరాలు కలిసి వున్న తరువాత పిల్లల్ని దత్తత తీసుకోవాలని భావించారు. కానీ 1999లో కాలిఫోర్నియాలో సరోగేట్ ద్వారా కవలలు సాఫ్రాన్, ఆస్పెన్ జన్మనిచ్చి మరో హిస్టరీ క్రియేట్ చేశారు. అంతేకాదు జనన ధృవీకరణ పత్రాలపై తల్లి, తండ్రికి బదులుగా పేరేంట్ -1, పేరెంట్-2 అని నమోదు చేసేలా స్వలింగ తల్లిదండ్రులను అనుమతించాలని ఈ జంట కోర్టును ఆశ్రయించి విజయం సాధించింది. LGBTQ కమ్యూనిటీకి సంబంధించి ఇదొక చారిత్రాత్మక సందర్బంగా నిలిచింది. ఇపుడు ముగ్గురు తల్లిదండ్రులుగా నమోదయ్యేందుకు ప్రయత్నస్తున్నాడు ఈ క్రేజీ గే బారీ. అంతేకాదు అంతర్జాతీయ స్పెర్మ్ డోనర్‌గా ఇప్పటికే 17మంది పిల్లలకు జీవసంబంధమైన తండ్రిని అని ఇటీవల ప్రకటించాడు బారీ. ఆ తరువాత ఈ జంట సరోగసీ ద్వారా ఓర్లాండో, జాస్పర్ , డల్లాస్ అనే కవల పిల్లలు సహాఎనిమిది మంది పిల్లలున్నారు. కూతురు సాఫ్రాన్ మాజీ ప్రియుడు స్కాట్ హచిసన్‌తో ప్రేమ కారణంగా 2019లో టోనీతో 32 ఏళ్ల సంబంధాన్ని తెంచుకున్నాడు బారీ. 2020లో, బారీ స్కాట్ తొలిబిడ్డ వాలెంటినా పుట్టింది. ఇక బారీ- టోనీ వ్యాపారానికి విషయానికి వస్తే రియల్ ఎస్టేట్, ట్రాన్స్-అట్లాంటిక్ సరోగసీ వ్యాపారం, గ్లోబల్ మెడికల్ రీసెర్చ్ కంపెనీతో సహా అనేక వ్యాపారాలతో కోట్లకు పడగలెత్తారు. ముఖ్యంగా తన సంతానానికి ప్రతీ ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఖరీదైన బహుమతులిచ్చి ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాడు బారీ . గత ఏడాది క్రిస్మస్ కోసం సుమారు 4 మిలియన్ యూరోలు ఖర్చు చేశాడట. కొడుకు కోసం ఏకంగా రూ.25 కోట్ల విలువైన బోటును గిఫ్ట్‌గా ఇచ్చాడు పుట్టిన రెండు రోజులకే మిలియనీర్ క్లబ్లో మనవరాలు అంతేకాదు తన మనవరాలికి భారీ ఎత్తున ఆస్తులను పంచి ఇచ్చి పుట్టిన 2 రోజులకే మిలియనీర్‌గా అవతరించిన రికార్డును అందించాడు. విలాసవంతమైన ఇల్లు, 10 కోట్ల ఆస్తి, 52 కోట్ల ట్రస్ట్‌ను ఆమెకు రాసిచ్చానని బార్లో ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడం అప్పట్లో వైరల్ అయింది.ఈ భవనంలో పాపాయికి సేవలు చేసేందుకు సకల ఏర్పాట్లు చేసినట్లు పేర్కొనడం విశేషంగా నిలిచింది. -
సుప్రీంకోర్టు ఎదుటే నిశ్చితార్థం చేసుకున్న గే కపుల్
స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్దతకు సుప్రీంకోర్టు నో చెప్పిన విషయం తెలిసిందే. ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం అలాంటి వివాహాలకు సమాన హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీన్ని పార్లమెంటే తేల్చాలని పేర్కొంది.అయితే వారు సహజీవనంలో ఉండొచ్చని, స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్షా చూపించొద్దని తెలిపింది. వారి హక్కులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో స్వలింగ సంపర్కులు నిరాశ చెందారు. అయితే తాము ఇక్కడితో ఆగిపోలేదని.. మళ్లీ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న అనన్య కోటియా వార్తల్లో నిలిచారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం సోషల్ మీడియాలో అతడు చేసిన పోస్టే ఇందుకు కారణం. తీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే స్వలింగ సంపర్కుల జంట సుప్రీం కోర్టు ఎదుట నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చేస్తున్న అనన్య కోటియా, అతని భాగస్వామి అయిన న్యాయవాది ఉత్కర్ష్ సక్సేనా నేడు సుప్రీంకోర్టు ఎదుట ఉంగరాలు మార్చుకొని తమ నిశ్చితార్థాన్ని జరుపుకున్నారు. ఉత్కర్ష్ సక్కేనా మోకాలిపై నిలబడి ఉండి.. అనన్యకు ఉంగరాన్ని తొడిగాడు. ఈ ఫోటోను అనన్య సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. చదవండి: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య Yesterday hurt. Today, @utkarsh__saxena and I went back to the court that denied our rights, and exchanged rings. So this week wasn't about a legal loss, but our engagement. We'll return to fight another day. pic.twitter.com/ALJFIhgQ5I — Kotia (@AnanyaKotia) October 18, 2023 న్యాయపరంగా ప్రతికూల తీర్పు వచ్చినప్పటికీ.. భవిష్యత్తులో సమాన హక్కులు, గుర్తింపు కోసం తమ పోరాటాన్ని కొనసాగించాలనే సంకల్పంతో నిశ్చితార్థాన్ని జరుపుకున్నట్లు ఈ జంట వెల్లడించింది. ‘సుప్రీంకోర్టు తీర్పు మమ్మల్ని బాధించింది. అయినా నేడు మేము మా హక్కులను నిరాకరించిన అదే కోర్టు ప్రాంగణానికి తిరిగి వచ్చి నేను ఉత్కర్ష్ సక్కేనా ఉంగరాలు మార్చుకున్నాం. ఈ వారం మా వివాహాల చట్టబద్దతపై ఎదురుదెబ్బ తగిలిన విషమం గురించే కాదు మా నిశ్చితార్థం గురించి కూడా.. మరో రోజు పోరాడేందుకు తిరిగి వస్తాం’ అని అనన్య ట్వీట్ చేశారు. కాగా స్వలింగ వివాహాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. 10 రోజులు పాటు సుదీర్ఘ విచారణ చేపట్టి.. మే 11న తన తీర్పును రిజర్వు చేన రాజ్యాంగ ధర్మాసనం.. నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకోవడం సహా కొన్ని అంశాలపై ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. ఈ మేరకు 3:2తో మెజారిటీ తీర్పు వెలువరించింది. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్ స్వలింగ సంపర్క జంటలు పిల్లలను దత్తత తీసుకోవచ్చని తెలియజేయగా.. జస్టిస్ కే రవింద్ర భట్, జస్టిస్ పీఎస్ నరసింహచ జస్టిస్ హిమా కోహ్లి నిరాకరించారు. అయితే, స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైనదనే అపోహను వీడాలని ధర్మాసనం ఏకగ్రీవంగా పేర్కొంది. అదే సమయంలో, స్వలింగ జంటల సమస్యలు, ఆందోళనల పరిష్కారానికి తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలను పరిశీలించేందుకు కేబినెట్ కార్యదర్శి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ వేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఎల్జీబీటీ కమ్యూనిటీతో పాటు సామాజిక తదితర రంగాల నిపుణులకు అందులో చోటుండాలని సూచించింది. -
పేరెంట్స్ కాబోతున్న 'గే' జంట.. ఎలా సాధ్యం?
న్యూజెర్సీ: అమిత్ షా, ఆదిత్య మదిరాజు. 2019లో అమెరికా న్యూజెర్సీ వేదికగా ఒక్కటైన ఈ స్వలింగ సంపర్కులు అప్పట్లో ఇంటర్నెట్లో ప్రకంపనలు సృష్టించారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఈ జంట గురించి అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు వీళ్లు చేసిన చేసిన ప్రకటన మరోసారి సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. తామిద్దరం పేరెంట్స్ కాబోతున్నామని అమిత్ షా, ఆదిత్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్వలింగ సంపర్కులైన వీళ్లు సహజంగా పేరెంట్స్ కావడం అసాధ్యం. అయితే ఓ మహిళ వీళ్లకు అండాన్ని దానం చేసింది. దీంతో ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫర్టిలైజేషన్) పద్ధతిలో వీళ్లు ఓ బిడ్డకు పేరెంట్స్ కాబోతున్నారు. మే నెలలో తాము పేరెంట్స్ కాబోతుండటం ఎంతో సంతోషంగా ఉందని ఈ గే జంట ఆనందం వ్యక్తం చేసింది. అందరిలాగే తమకు కూడా ఓ బిడ్డ ఉంటుందని పేర్కొంది. తమను చూసి ఎంతో మంది స్వలింగ సంపర్కులు ధైర్యం చేసి ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారని, ఇప్పుడు వాళ్లు పిల్లలను కనే మార్గం కూడా ఉందని తాము నిరూపిస్తున్నామని అమిత్ షా, ఆదిత్య వివరించారు. 4 రౌండ్ల ఐవీఎఫ్ తర్వాత తాము పేరెంట్స్ కాబోతున్నామనే విషయం ఖరారైందని చెప్పారు. ఇకపై స్వలింగ సంపర్కులు కూడా పెళ్లి, పిల్లల విషయంపై ఆందోళన చెందకుండా సంతోషంగా అందరిలాగే సాధారణ జీవితాన్ని ఆస్వాదించవచ్చని ఈ గే జంట చెబుతోంది. అమిత్ షా గుజరాత్‌కు చెందిన వాడు. న్యూజెర్సీలో స్థిరపడ్డాడు. ఆదిత్య తెలుగు రాష్ట్రాలకు చెందినవాడు ఢిల్లీలో నివసించేవాడు. 2016లో ఓ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరూ పరిచయమయ్యారు. ఆ తర్వాత మూడేళ్లకు 2019లో న్యూజెర్సీలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. చదవండి: 25 దేశాల్లో ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ .. డబ్ల్యూహెచ్ఓ అలర్ట్.. -
పెళ్లితో ఒక్కటైన స్వలింగ సంపర్కులు.. వైరలవుతోన్న ఫోటోలు
ప్రేమ అంటే ప్రేమే.. దానికి సరైన అర్థం చెప్పడం కష్టం. అది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మధ్య చిగురిస్తుందో తెలియదు. అదేదో కవులు వర్ణించినట్లు ప్రేమ అందమైన కావ్యం మాత్రమే కాదు. పోరాటాలు, త్యాగాలు చేయాలి. ఎన్నో అవమానాలు ఛీత్కారాలు ఎదర్కొని నిలబడాలి. మనకు తెలిసి ప్రేమ గుడ్డిందంటారు. ప్రేమకు కులం, మతం, రంగు, డబ్బు అనే తేడాలు లేవంటుంటారు. కానీ ఇప్పుడు దీనిలో ఇంకొన్ని మార్పులు చేయాల్సి వస్తుందేమో. ప్రేమ అనేది ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ఏర్పడేదే కాదు.. ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిల మధ్య కూడా పుట్టొచ్చు. అంతేందుకు మొన్నటికి మొన్న ఓ యువతి తనను తాను మనువాడి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం గుర్తుండే ఉంటుంది కదూ. ఇదంతా ఇప్పుడేందుకంటే.. ఈ మధ్య కాలంలో ధైర్యం చేసి, సమాజంలోని మూస పద్దతులను బద్దలు కొట్టి చాలా మంది స్వలింగ సంపర్కులు ఒకటవుతున్నారు. గతేడాది హైదరాబాద్‌లో ఇద్దరు అబ్బాయిలు ఒకటైన విషయం తెలిసిందే. తాజాగా కోల్‌కతా, గుర్గావ్లకు చెందిన మరో గే జంట(స్వలింగ సంపర్కులు) జూలై 3న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ద్వారా తమ బంధాన్ని అధికారికంగా మార్చుకున్నారు. పూజారి వేద మంత్రాల సాక్షిగా అభిషేక్ రే, చైతన్య శర్మతో ఏడడుగులు వేశారు. పవిత్ర అగ్ని చుట్టూ తిరిగి జీవితాంతం ఒకరినొకరు తోడుంటామని ప్రమాణం చేశారు. కుటుంబం, బంధువుల మధ్య అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. పూర్తి హిందూ సంప్రాదయం ప్రకారం బెంగాలీ, మార్వాడీ ఆచారాల ప్రకారం వివాహ తంతు నిర్వహించారు. అభిషేక్ ధోతీ, కుర్తా ధరించగా, చైతన్య షేర్వాణీ వేసుకున్నారు. ఆదివారం కోల్‌కతాలో విందు కూడా ఏర్పాటు చేశారు. చదవండి: అచ్చం సీఎం షిండేలా ఉన్నారే!.. ప్రముఖ వ్యాపారవేత్త ట్వీట్ వైరల్ వీరి పెళ్లి, హల్దీ వేడుకలకు సంబంధించిన అందమైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా అభిషేక్, ఫ్యాషన్ డిజైనర్ కాగా చైతన్య జిటల్ మార్కెటింగ్ నిపుణుడని తెలిసింది. తమ పెళ్లిపై అభిషేక్ మాట్లాడుతూ..‘‘అంతిమంగా ప్రేమ అన్నింటిని జయిస్తుంది. దానికి కులం, మతం, ముఖ్యంగా లింగం(జెండర్)అవసరం లేదకు. ‘సమాజం ఏమనుకుంటుంది’’ అని ఆలోచించడం మానేసి మీ జీవితాన్ని మీకు నచ్చిన మార్గంలో గడపడం ప్రారంభించండి’’ అని తెలిపారు. -
తెలంగాణలో మొదటి ‘గే’ వివాహం: జంటగా మారనున్న ఇద్దరు పురుషులు
హైదరాబాద్: తెలంగాణలోని తొలిసారి ఇద్దరు స్వలింగ సంపర్కులు పెళ్లితో ఒక్కటి కానున్నారు. హైదరాబాద్‌కు చెందిన సుప్రియో, అభయ్‌లకు 2013లో డేటింగ్ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో వీరిద్దరు ఎనిమిదెళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుప్రియో హైదరాబాద్‌లో.. హోటల్ మెనేజ్మెంట్ స్కూల్లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా.. అభయ్ సాఫ్ట్వేర్ కంపెనీలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకారం తెలిపారు. దీంతో వీరు.. వచ్చే డిసెంబరులో వివాహంతో ఒక్కటికానున్నట్లు సుప్రియో జంట ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో ఇద్దరు స్వలింగ సంపర్కులు(గే) చేసుకుంటున్న తొలి వివాహం ఇదే. తమ వివాహనికి కుటుంబ సభ్యులను ఒప్పించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిందని సుప్రియో తెలిపాడు. కాగా, తమ పెళ్లిలో సంప్రదాయ బద్ధంగా మంగళస్నానాలు, సంగీత్ వంటి కార్యక్రమాలు ఉంటాయని స్వలింగ సంపర్కులు తెలిపారు. చదవండి: 300 అడుగుల లోతున పడిన బస్సు.. 13 మంది మృతి -
గే తమ్ముడి దంపతుల బిడ్డకు జన్మనిచ్చిన అక్క
మాంచెస్టర్ : అక్క అన్న పదానికి, అనుబంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందో మహిళ. గే తమ్ముడి కోరికను నెరవేర్చడానికి ఏ అక్కా చేయని పనికి పూనుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన గే దంపతులు ఆంథోనీ బీగన్, రే విలియమ్స్ ఎంతోకాలంగా ఓ బిడ్డ కావాలనుకుంటున్నారు. సరోగసీ పద్దతి ద్వారా బిడ్డకు జన్మనివ్వాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఓ మహిళను అన్వేషించసాగారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించకపోవటంతో తీవ్ర నిరాసకు గురయ్యారు. అలాంటి సమయంలో ఆంథోనీ డీగన్ అక్క ట్రేసీ హల్స్ ఓ దేవతలా వారికి సహాయం చేయటానికి ముందుకు వచ్చింది. అయితే ఆమె వయసు 40 ఏళ్లు పైబడి ఉండటంతో భర్త అభ్యంతరం తెలిపాడు. కానీ, ట్రేసీ వెనకడుగు వేయలేదు. గే దంపతులు సరోగసి కోసం దాదాపు 36 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇద్దరూ తమ వీర్యాన్ని దానం చేశారు. ఆమె గే దంపతుల మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డకు బయోలాజికల్ తండ్రి ఎవరన్న దాన్ని తెలుసుకోవటానికి గే దంపతులు ఇష్టపడలేదు. దీనిపై ఆంథోనీ మాట్లాడుతూ.. ‘‘ పదిహేడేళ్ల తర్వాత ట్రేసీ మమ్మల్ని మా కుమారుడికి పరిచయం చేస్తుంది. ఆ క్షణం మాకు ఎంతో ప్రత్యేకం. ఆమె మాకోసం చేసిన పని వెలకట్టలేనిది’’ అని అన్నాడు. చదవండి : ‘ఆ హెయిర్ కట్ చాలా దారుణంగా ఉంటుంది’ ఫ్రాంక్‌తో తల్లిని హడలుగొట్టిన కుమారులు -
ప్రేయసితో యువతి.. ఒక్క ట్వీట్‌తో!
జకార్తా: స్వలింగ సంపర్క జంటలకు ఇండోనేషియా స్వర్గధామం వంటిదంటూ చేసిన ట్వీట్ ఓ యువతిని కష్టాల్లోకి నెట్టింది. తన గర్ల్‌ఫ్రెండ్‌తో పాటు దేశాన్ని వీడాల్సిందిగా స్థానిక అధికారులు ఆమెను ఆదేశించారు. వీరి వ్యవహారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. అమెరికాకు చెందిన క్రిస్టిన్ గ్రే అనే యువతి తన ప్రేయసి సాండ్రాతో కలిసి కొన్ని నెలల క్రితం బాలికి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే నివాసం ఏర్పరచుకున్న ఈ జంట.. ఆదాయ మార్గాలను అన్వేషించింది. ఈ నేపథ్యంలో బాలిలో తమ జీవన విధానం, అక్కడ నివసించేందుకు అవుతున్న ఖర్చు, పొందుతున్న సౌకర్యాలు తదితర అంశాల గురించి అవర్ బాలి లైఫ్ ఈజ్ యువర్స్ పేరిట పుస్తకం రాశారు. గ్రాఫిక్ డిజైనర్ అయిన క్రిస్టిన్ ఈ ఇ-పుస్తకాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇందులో వారు పంచుకున్న అనుభవాలు వివాదానికి దారి తీశాయి. (చదవండి: ఇక్కడ ఒక్క రాత్రికి రూ. 58 లక్షలు) ‘‘కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో మేం వేసుకున్న ప్రణాళికలు చెల్లాచెదురైపోయాయి. అందుకే లాస్ ఏంజెల్స్‌లో ఉండే మేం బాలికి మకాం మర్చాం. అతి తక్కువ ధరలో ఇక్కడ విలాసవంతమైన జీవితం గడపవచ్చు. ఇక్కడి పరిసరాలు అత్యద్భుతం. ముఖ్యంగా ఎల్జీబీటీ కమ్యూనిటీ ఇక్కడ హాయిగా జీవించవచ్చు’’ అని క్రిస్టినా పేర్కొంది. అంతేగాకుండా.. కోవిడ్ సమయంలో అక్రమ పద్ధతుల్లో బాలికి ఎలా రావాలో తమ వీసా ఏజెంట్ల ద్వారా చెబుతామంటూ ఓ లింక్‌ను ట్విటర్లో షేర్ చేసింది. ఈ విషయంపై స్పందించిన న్యాయ శాఖ అధికారులు.. క్రిస్టిన్, ఆమె సహచరి ఉద్దేశపూర్వకంగానే తమకు సమాచారం ఇవ్వకుండా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. బాలి సంస్కృతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా.. వారిని అమెరికా తిరిగి పంపివేస్తామని, ఇందుకు సంబంధించిన న్యాయ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక స్థానిక ఎల్జీబీటీ కమ్యూనిటీ సైతం క్రిస్టిన్ తీరును తప్పుబట్టింది. ఇండోనేషియాలో స్వలింగ సంపర్కం నేరం కానప్పటికీ, తమ పరిస్థితి అంత మెరుగ్గా ఏమీ లేదని, దుష్ప్రచారాలు మానేయాలని హితవు పలుకుతున్నారు. అయితే క్రిస్టిన్ మాత్రం తానేమీ నేరం చేయలేదని, తాను గే అయినందు వల్లే దేశం నుంచి పంపేస్తున్నారంటూ గగ్గోలు పెట్టడం గమనార్హం. For anyone curious about the deleted/hidden Bali thread pic.twitter.com/FYA3mRcMNf — Salt chip (@gastricslut) January 17, 2021 -
గే పెళ్లి: కులాన్ని భ్రష్టు పట్టించావ్ కదరా!
బెంగళూరు: అమెరికాలో ఓ గే జంట పెళ్లిపై కర్ణాటకలోని కొడగు జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని కొడవ సామాజిక వర్గానికి చెందిన శరత్ పొన్నప్ప, కాలిఫోర్నియాలో డాక్టర్‌గా పనిచేస్తున్న సందీప్ దోసాంజిని సెప్టెంబర్ 26న వివాహం చేసుకున్నారు. కొందరు మిత్రుల సమక్షంలో కొడవ సంప్రదాయంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. కొడవ వేషధారణలో ఉన్న పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విషయం తెలియడంతో శరత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు ఆ కులస్తులు. అనాదిగా వస్తున్న ఆచారాలను భ్రష్టు పట్టించావని శరత్‌పై మండిపడ్డారు. (చదవండి: వెలుగులోకి వచ్చిన రహస్య బీచ్) ఈ పెళ్లిని ఖండిస్తున్నామని మడికెరి కొడవ సమాజ ప్రెసిడెంట్ కేఎస్ దేవయ్య స్పష్టం చేశారు. తమ కులానికి శరత్ మచ్చ తెచ్చాడని ఆవేదన ఆయన వ్యక్తం చేశారు. ఇలాంటివి సహించబోమని దేవయ్య హెచ్చరించారు. శరత్‌ను కులం నుంచి వెలివేస్తున్నామని అన్నారు. గతంలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదని తెలిపారు. వారి పెళ్లితో తమకు సంబంధం లేదని.. కొడవ వేషాధరణలో వివాహం చేసుకోడం కలచివేస్తోందని చెప్పారు. తమ సంప్రదాయాలను అవమాన పరచవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, కుల పెద్దల ఆగ్రహావేశాలపై స్పందించేందుకు శరత్ ఇంతవరకు స్పందించలేదు. అనుకరించి అవమానిస్తే సహించరు ఇక దుబాయ్‌లో నివాసం ఉంటున్న అతని తల్లిదండ్రులు ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షల జనాభా ఉన్న కొడవ కులస్తుల స్వస్థలం కొడగు జిల్లా. వారు ప్రధానంగా కాఫీ తోటలు పండిస్తారు. అడవులు, పర్వతాలు, నదులు, నీటి కాలువల దగ్గర నివాసం ఉంటారు. ప్రత్యేక వేషధారణతో వేడుకలు చేసుకుంటారు. ఇతరులు వాటిని అనుకరించి అవమానిస్తే సహించరు. గతేడాది కొడగు జిల్లాలోని ఓ ఫైవ్‌స్టార్ రిసార్ట్ కొడవ వేషధారణలో సేవలు అందించినందుకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో రిసార్ట్ యాజమాన్యం క్షమాపణలు చెప్పి తప్పు సరిదిద్దుకుంది. కొడగులో పుట్టిన కావేరీ నదిని వారు దేవతగా కొలుస్తారు. (చదవండి: శ్రుతిమించిన ‘గే’ ఆగడాలు) -
‘తను వెళ్లిపోయాడు; రెండేళ్లు నరకం అనుభవించా’
తిరువనంతపురం : ‘మేమిద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం. గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు పిల్లలను దత్తత తీసుకునేందుకు పోరాటం కొనసాగిస్తాం’ అంటూ కేరళకు చెందిన నికేశ్ ఉషా పుష్కరన్, సోను తాము స్వలింగ సంపర్కులమన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. సమాజం నుంచి ఎన్నో ఛీత్కారాలు, అవమానాలు ఎదుర్కొన్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో తమ పెళ్లి విషయం బయటపెట్టే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. ఏడాది క్రితమే గురవాయర్ శ్రీకృష్ణ గుడిలో తాము వివాహబంధంతో ఒక్కటయ్యామని, తమ బంధానికి దేవుడు మాత్రమే సాక్షి అని తెలిపారు. ఈ విషయం గురించి నికేశ్ చెబుతూ..‘ మాది త్రిసూర్ జిల్లాలోని గురువాయూర్. నేను గతంలో ఓ వ్యక్తితో పద్నాలుగేళ్లు ప్రేమలో ఉన్నాను. పెళ్లి చేసుకుని మన బంధం గురించి అందరికీ చెప్పమని అతడిని అడిగాను. కానీ సమాజానికి భయపడి తను నాకు దూరంగా వెళ్లిపోయాడు. అలా దాదాపు రెండేళ్లపాటు నరకం అనుభవించాను. అందరిలాగా మాకు ప్రత్యేక మ్యాట్రిమొనీలు లేవు. అందుకే వ్యాపారంలో కాస్త తీరిక దొరికితే చాలు బెంగళూరు, తిరువనంతరపురం వెళ్లి నాకు నచ్చిన వ్యక్తి దొరుకుతాడేమోనని వెదికేవాడిని. అలా ఓ ఎల్జీబీటీ సంస్థ ద్వారా సోను పరిచయమయ్యాడు. తను నాకంటే ఐదేళ్లు చిన్నవాడు. రెండు రోజుల చాటింగ్ చేసిన తర్వాత ప్రత్యక్షంగా తనను చూశాను. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం గురించి మా అమ్మకు చెప్పినపుడు చాలా భయపడింది. అమెరికా లేదా యూకేకు వెళ్లి అక్కడే ఉండమని సలహా ఇచ్చింది. ఇండియాలో మాలాంటి వాళ్లను సమాజం గేలి చేస్తుందని, కుటుంబాన్ని వెలి వేస్తుందని ఆమె భయం. కానీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నా హక్కు. అందుకే మేమిద్దరం గుడిలో దేవుడి ఎదుట ఉంగరాలు మార్చుకున్నాం. కారు పార్కింగ్ ఏరియాలో ఒకరి మెడలో ఒకరం తులసిమాలలు వేసుకుని దంపతులమయ్యాం’ అని ఫేస్బుక్లో సుదీర్ఘ పోస్టు పెట్టాడు. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న సోను.. తన 29వ ఏట వధువు వెతుకుతున్న సమయంలో తల్లిదండ్రులకు తన గురించిన నిజాన్ని చెప్పాడన్నాడు. మొదట వాళ్లు భయపడినప్పటికీ.. తన వల్ల ఏ అమ్మాయి జీవితం నాశనం కాకూడదని ఆలోచించిన తనను ప్రశంసించారని చెప్పుకొచ్చాడు. నికేశ్, తాను ప్రస్తుతం కొత్త జీవితం గడుపుతున్నామని, అయితే పిల్లలు లేని లోటు, చట్టబద్ధత లేని వివాహం తమను వేదనకు గురిచేస్తుందన్నాడు. కాగా ఈ విషయమై ఎల్జీబీటీ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయని, తాము కూడా ఇందులో సగర్వంగా భాగస్వాములమవుతామని నికేశ్, సోను పేర్కొన్నారు. తాము ఇప్పుడు అనుభవించే కష్టాలు భవిష్యత్ తరాలు పడకూడదనే తమ పోరాటం ఉధృతం చేస్తామని వెల్లడించారు. స్వలింగ సంపర్కం నేరంకాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సెప్టెంబరు 6 తమ జీవితాల్లో వెలుగునింపిందని అయితే తమ మనుగడకు ఇది సరిపోదని వ్యాఖ్యానించారు. కాగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటున్న భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377 రద్దు చేయడం ద్వారా ఎల్జీబీటీ (లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్‌జెండర్) హక్కులను కాపాడాలని పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు సెప్టెంబరులో తుది తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
స్వలింగ సంపర్కుల ఫొటో.. సారీ చెప్పిన ఇన్స్టాగ్రామ్
సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ తమ యూజర్లకు క్షమాపణ చెప్పింది. లండన్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ స్టెలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో జూన్ 30వ తేదీన ఓ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో స్వలింగ సంపర్కులైన ఇద్దరు పురుషులు(జోర్డాన్, లుకాలు) లిప్ కిస్ చేసుకుంటున్నారు. ఇంగ్లాడ్‌కు చెందిన ఓ మ్యాగజైన్ కోసం జోర్డాన్, లుకాలు ఆ విధమైన స్టిల్స్ ఇచ్చారు. కాగా తమ నియమ, నిబంధనలకు ఈ ఫొటో వ్యతిరేకంగా ఉందంటూ ఇన్స్టాగ్రామ్ ఈ ఫొటోను తొలగించింది. గత కొంత కాలంగా మోడ్రన్ రిలేషన్స్‌పై పోస్ట్‌లు చేస్తున్న స్టెలా.. ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ఉంచిన ఫొటోను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎలా నిబంధనల ప్రకారం లేదో చెప్పాలంటూ ఇన్స్టాగ్రామ్ ప్రతినిధులను ప్రశ్నించారు. స్వలింగ సంపర్కాన్ని మీరు నేరంగా ప్రజల్లోకి తీసుకువెళ్లదలుచుకున్నారా అంటూ ధ్వజమెత్తారు. ఆ ఫొటోలోని జోర్డాన్, లుకాలు కూడా ఇన్స్టాగ్రామ్ చర్యపై మండిపడ్డారు. దీనిపై వెనక్కి తగిన ఇన్స్టాగ్రామ్ ప్రతినిధులు ఈ ఫొటో పొరపాటున తొలగించినందుకు క్షమాపణలు చెప్పారు. అలాగే ఫొటోను తిరిగి పోస్ట్ చేయనున్నట్టు ప్రకటించారు. -
సేమ్ సెక్స్ మ్యారేజ్.. మహిళా జోడీ కొత్త చరిత్ర
-
సేమ్ సెక్స్ మ్యారేజ్.. మహిళా జోడీ కొత్త చరిత్ర
మెల్బోర్న్: స్వలింగ వివాహాలకు ఇటీవల రూపొందించిన బిల్లు సభలో కార్యరూపం దాల్చడంతో ఆస్ట్రేలియాలో కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో లారెన్ ప్రైస్, అమీ లేకర్లు శనివారం తమ బంధువులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. దీంతో లెస్బియన్ మ్యారేజ్ చేసుకున్న తొలి జంటగా లారెన్ ప్రైస్, అమీ లేకర్ల పేరు ఆస్ట్రేలియాలో మార్మోగి పోతోంది. సిడ్నీకి చెందిన ఈ జంట గత కొంతకాలం నుంచి పెళ్లి గురించి ఆలోచిస్తుంది. కాగా, స్వలింగ వివాహాలకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంతో వీరికి చట్టపరంగా మార్గం సుగమమైంది. దీంతో అధికారులకు సమాచారమిచ్చిన లారెన్ ప్రైస్, అమీ లేకర్లు అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని నూతన విధానాలకు నాంది పలికారు. మరోవైపు మెల్బోర్న్కు చెందిన ఎమీ, ఇలైస్ మెక్‌డొనాల్డ్ లు అధికారికంగా గే మ్యారేజ్ చేసుకున్న తొలి జంటగా నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలు స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించగా, అందులో 16 దేశాలు యూరప్‌లోనే ఉండటం గమనార్హం. -
పార్టీకి వెళ్లిన గే కపుల్స్‌కు షాక్!
లండన్: పుట్టినరోజు విందు ఎంజాయ్ చేసేందుకు రిసార్టుకు వెళ్లిన స్వలింగ సంపర్కులు (గే దంపతులు)కు విచిత్రంగా అవమానానికి గురయ్యారు. యూకేలోని నార్త్ వేల్స్ లో సోమవారం ఇది చోటుచేసుకుంది. నార్త్ వేల్స్ కు చెందిన బెలిండా మల్కాహై, జోయాన్నె షేఫర్డ్ లు గే కపుల్స్. బెలిండా పుట్టినరోజు సందర్భంగా గత సోమవారం సరదాగా షికారుకెళ్లిన వీరు అనంతరం పెల్హేలి రిసార్టుకు వెళ్లారు. తమకు కావలసిన ఆహారాన్ని ఆర్డర్ ఇచ్చారు. వెయిటర్ తెచ్చిన ఫుడ్ తిని బిల్లు పే చేసేందుకు వెళ్లగా వీరికి రిసార్ట్ స్టాఫ్ భారీ షాకిచ్చింది. బిల్లు రిసిప్ట్ మీద లెస్బియన్ అని ఉన్నట్లు గమనించిన బెలిండా మల్కాహై, జోయాన్నె షేఫర్డ్ లకు కాసేపు నోట మాటరాలేదు. అసలు తమను లెస్బియస్స్ (లేడి కపుల్స్) లుగా ఎందుకు భావించారో అర్థం కాలేదని, రిసార్ట్ మేనేజ్ మెంట్ కు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించారు. తాము చెప్పకుండా లెస్బియన్లుగా ఎందుకు భావించారని నిలదీశారు. తప్పును ఒప్పుకున్న మేనేజ్ మెంట్ గే కపుల్స్ కు క్షమాపణ చెప్పింది. ఆపై వారికి కూల్ డ్రింక్స్ ఇచ్చి కూల్ చేసినట్లు వారు వివరించారు. -
స్వలింగ దంపతులకు 85 కొరడా దెబ్బలు
స్వలింగ సంపర్కులైన ఇద్దరు పురుషులకు ఇండోనేషియాలోని షరియా కోర్టు 85 చొప్పున కొరడా దెబ్బల శిక్ష విధించింది. ఆ శిక్షను కూడా బహిరంగంగా అమలుచేయాలని తెలిపింది. ఇటీవల ఇదే దేశంలో ఒక క్రిస్టియన్ రాజకీయ నాయకుడిని దేవుడికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించారంటూ జైల్లో పెట్టిన తర్వాత.. ఇప్పుడు ఈ కొరడా దెబ్బల నిర్ణయం వెలువడింది. 20, 23 ఏళ్ల వయసున్న ఇద్దరు పురుషులు లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు వారిద్దరికీ బహిరంగంగా 85 చొప్పున కొరడాదెబ్బలు కొట్టాలని ఆ కోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు చదివే సమయంలో ఆ ఇద్దరిలో ఓ యువకుడు విపరీతంగా ఏడ్చి, తనను క్షమించాలని కోరాడు. రంజాన్ నెల ప్రారంభానికి ముందే వీళ్లిద్దరికీ ఈ శిక్ష అమలు అవుతుందని చీఫ్ ప్రాసిక్యూటర్ గుల్మైనీ తెలిపారు. రాష్ట్ర రాజధాని బందా అసెలో ఈ ఇద్దరూ ఒకే గది తీసుకుని ఉండటం, వాళ్ల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో వీళ్ల చుట్టుపక్కల ఉండేవాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో మార్చి నెలాఖరులో వీళ్లను అరెస్టు చేశారు. వాళ్లిద్దరూ నగ్నంగా ఉండగా తీసిన మొబైల్ వీడియో ఫుటేజి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అయ్యింది. వాళ్లిద్దరూ స్వలింగ సంపర్కులన్న విషయం చట్టబద్ధంగా రుజువైందని, అందువల్ల వాళ్లకు కొరడా దెబ్బలు విధించాలని జడ్జి ఖైరిల్ జమాల్ చెప్పారు. గరిష్ఠంగా వీళ్లకు 100 కొరడా దెబ్బల వరకు విధించే అవకాశం ఉన్నా, వాళ్లు కోర్టుతో మర్యాదపూర్వకంగా ఉండటంతో కొంత తగ్గించామన్నారు. అయితే మానవ హక్కుల సంఘాలు మాత్రం ఇది అన్యాయమని, వాళ్లిద్దరినీ విడిచిపెట్టాలని అంటున్నాయి. -
గే జంటకు కేక్ నిరాకరణ:రూ. 85లక్షల జరిమానా
లాస్ ఏంజిల్స్:గత రెండు సంవత్సరాల క్రితం ఓ స్వలింగ సంపర్క జంటకు పెళ్లి కేక్ ఇవ్వడానికి నిరాకరించినందుకు బేకరీ యజమానికి లక్షా ముప్పైదు వేల డాలర్లు(రూ. 85 లక్షలు) జరిమానా విధిస్తూ తాజాగా ఆరిగాన్ లేబర్ కమిషన్ తీర్పునిచ్చిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. 2013 లో పెళ్లి కేక్ తీసుకుందామని గ్రీషమ్ లోని మెలీస్సా బేకరీకి రిచెల్ మరియు లారెల్ బోమన్ అనే స్వలింగ సంపర్క జంట వచ్చారు. అయితే వారికి అక్కడ నిరాశే ఎదురైంది. పెళ్లి కేక్ ను ఇవ్వడానికి యజమాని నిరాకరించాడు. స్వలింగ సంపర్క వివాహాలకు తమ మత సంప్రదాయాలు ఒప్పుకోవని బేకరీ యజమాని క్లెయిన్స్ అందుకు విముఖత వ్యక్తం చేశాడు. దీనిపై ఆ జంట లేబర్ కమిషన్ ను ఆశ్రయించింది. ఈ అంశంపై గురువారం లేబర్ కమిషనర్ బ్రాడ్ తుది తీర్పును వెలువరించారు. ఆ జంట అడిగిన పెళ్లి కేక్ ను నిరాకరించింనందుకు లక్షా ముప్ఫై ఐదు వేల డాలర్లు వారికి పరిహారంగా చెల్లించాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆ యజమాని ప్రస్తుతం బేకరీని మూసివేయడం గమనార్హం. గత సంవత్సరం నవంబర్ లో స్వలింగ వివాహాలకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.దేశంలో నివసించే స్వలింగ సంపర్క పౌరులకు ఇది చట్టపరంగా లభించిన హక్కుగా ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొంది. -
గే జంటలతో కొత్త సవాళ్లు: పోప్
వాటికన్: ప్రస్తుత సమాజంలోని కొన్ని విభిన్నమైన నిజాలు కేథలిక్ సంఘానికి కొత్త సవాళ్లు విసురుతున్నాయని పోప్ ఫ్రాన్సిస్ భావిస్తున్నారు. ఇలాంటి పలు అభిప్రాయూలతో కూడిన పోప్ సందేశాలను లా సివిలిటా కాటోలికా పత్రిక ప్రచురించింది. ముఖ్యంగా గే జంటలతో పిల్లలు కలిసి నివసించడమనేది కేథలిక్ సంఘానికి విద్యాపరంగా, అన్నిటికీ మించి సువార్త ప్రకటన పరంగా.. కొత్త సవాలులా పరిణమిస్తోందని పోప్ చెప్పారు. ‘నా తల్లి స్నేహితురాలు నన్ను ఇష్టపడదు..’ అంటూ ఓ బాలిక తన టీచర్‌తో చెప్పుకున్న సందర్భాన్ని ఆయన గుర్తుచేశారు.