పార్టీకి వెళ్లిన గే కపుల్స్‌కు షాక్! | Gay couple are shocked to see bill shows them lesbians | Sakshi
Sakshi News home page

పార్టీకి వెళ్లిన గే కపుల్స్‌కు షాక్!

Published Wed, Aug 30 2017 10:40 PM | Last Updated on Sun, Sep 17 2017 6:09 PM

పార్టీకి వెళ్లిన గే కపుల్స్‌కు షాక్!

పార్టీకి వెళ్లిన గే కపుల్స్‌కు షాక్!

లండన్: పుట్టినరోజు విందు ఎంజాయ్ చేసేందుకు రిసార్టుకు వెళ్లిన స్వలింగ సంపర్కులు (గే దంపతులు)కు విచిత్రంగా అవమానానికి గురయ్యారు. యూకేలోని నార్త్ వేల్స్ లో సోమవారం ఇది చోటుచేసుకుంది. నార్త్ వేల్స్ కు చెందిన బెలిండా మల్కాహై, జోయాన్నె షేఫర్డ్ లు గే కపుల్స్. బెలిండా పుట్టినరోజు సందర్భంగా గత సోమవారం సరదాగా షికారుకెళ్లిన వీరు అనంతరం పెల్హేలి రిసార్టుకు వెళ్లారు. తమకు కావలసిన ఆహారాన్ని ఆర్డర్ ఇచ్చారు. వెయిటర్ తెచ్చిన ఫుడ్ తిని బిల్లు పే చేసేందుకు వెళ్లగా వీరికి రిసార్ట్ స్టాఫ్ భారీ షాకిచ్చింది.

బిల్లు రిసిప్ట్ మీద లెస్బియన్ అని ఉన్నట్లు గమనించిన బెలిండా మల్కాహై, జోయాన్నె షేఫర్డ్ లకు కాసేపు నోట మాటరాలేదు. అసలు తమను లెస్బియస్స్ (లేడి కపుల్స్) లుగా ఎందుకు భావించారో అర్థం కాలేదని, రిసార్ట్ మేనేజ్ మెంట్ కు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించారు. తాము చెప్పకుండా లెస్బియన్లుగా ఎందుకు భావించారని నిలదీశారు. తప్పును ఒప్పుకున్న మేనేజ్ మెంట్ గే కపుల్స్ కు క్షమాపణ చెప్పింది. ఆపై వారికి కూల్ డ్రింక్స్ ఇచ్చి కూల్ చేసినట్లు వారు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement