![One Person Arrest In Filmnagar Police](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/2555.jpg.webp?itok=S9xfAMVK)
ఫిలింనగర్: ‘గే’ యాప్‌లో పరిచయం చేసుకుని బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న నిందితుడిని ఫిలింనగర్ పోలీసులు ఫోన్ పే ద్వారా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. డబీర్‌పురాలో నివసించే పర్హాన్‌బేగ్ (25) జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం జెండర్ యాప్‌లో ’గే’లను పరిచయం చేసుకుంటూ వారిని తనవద్దకు రప్పించి వీడియోలు తీస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు.
షేక్‌పేట జైహింద్‌నగర్‌కు చెందిన ఓ యువకుడి (22)ని గత నెల జెండర్ యాప్‌లో పరిచయం చేసుకుని తన వద్దకు రప్పించుకున్నాడు. ఇంటికి వెళ్లిన సదరు యువకుడితో సన్నిహితంగా మెలుగుతూ వీడియో రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి రూ.15 వేలు డిమాండ్ చేశాడు. అయితే బాధితుడు రూ.10 వేలను ఫోన్ పే ద్వారా నిందితుడికి బదిలీ చేశాడు.
తాను మోసపోయానని తెలుసుకుని ఈ నెల 1న ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడి ఫోన్ పే ఆధారంగా కాల్ డేటా సేకరించి ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పర్హానబేగ్ ‘గే’ కాదని, కేవలం ‘గే’లను పరిచయం చేసుకుని బ్లాక్ మెయిల్ చేసేందుకు జెండర్ యాప్‌లో ఉన్నాడని, గతంలో కూడా ఇలాంటి బ్లాక్‌మెయిలింగ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment