North Wales
-
ఆ కుక్కకు ఆకలేసి డబ్బులు తినేసింది
నార్త్‌వేల్స్ : ఓ కుక్కకు ఆకలేసి 14 వేల రూపాయల(నోట్లు)ను నమిలిమింగేసింది. ఈ సంఘటన యూకేలోని నార్త్‌వేల్స్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నార్త్వేల్స్కు చెందిన ఓ వ్యక్తి లాబ్రడూడిల్ రకానికి చెందిన ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ఓ రోజు అతని ఇంటికి డబ్బులతో ఉన్న ఎన్వలెప్ కవర్ పార్సిల్ వచ్చింది. అందులో దాదాపు 160 పౌండ్ల కరెన్సీ నోట్లు ఉన్నాయి. భారతీయ కరెన్సీలో వాటి విలువ దాదాపు 14వేల రూపాయలు. దీన్ని గమనించిన ఆ కుక్క వెంటనే దాన్ని పక్కకు తీసుకెళ్లి, నమిలి తినేసింది. విషయం తెలుసుకున్న దాని ఓనరు నెత్తిబాదుకున్నాడు. ఆ కుక్క అంతచేసినా దాని మీద ఉన్న ప్రేమకొద్ది దాని ఆరోగ్యం పాడు కాకుండా ఉండేందుకు పశువైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ డాక్టర్ నానాతంటాలు పడి దాని కడుపులో ఉన్న చెత్తను మొత్తం బయటకు తీసేశాడు. మొత్తానికి ఓ 11 వేలరూపాయల బిల్లు వేశాడు. ఆ బిల్లు చూసిన దాని ఓనరు మరోసారి షాక్ తిన్నాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
పార్టీకి వెళ్లిన గే కపుల్స్‌కు షాక్!
లండన్: పుట్టినరోజు విందు ఎంజాయ్ చేసేందుకు రిసార్టుకు వెళ్లిన స్వలింగ సంపర్కులు (గే దంపతులు)కు విచిత్రంగా అవమానానికి గురయ్యారు. యూకేలోని నార్త్ వేల్స్ లో సోమవారం ఇది చోటుచేసుకుంది. నార్త్ వేల్స్ కు చెందిన బెలిండా మల్కాహై, జోయాన్నె షేఫర్డ్ లు గే కపుల్స్. బెలిండా పుట్టినరోజు సందర్భంగా గత సోమవారం సరదాగా షికారుకెళ్లిన వీరు అనంతరం పెల్హేలి రిసార్టుకు వెళ్లారు. తమకు కావలసిన ఆహారాన్ని ఆర్డర్ ఇచ్చారు. వెయిటర్ తెచ్చిన ఫుడ్ తిని బిల్లు పే చేసేందుకు వెళ్లగా వీరికి రిసార్ట్ స్టాఫ్ భారీ షాకిచ్చింది. బిల్లు రిసిప్ట్ మీద లెస్బియన్ అని ఉన్నట్లు గమనించిన బెలిండా మల్కాహై, జోయాన్నె షేఫర్డ్ లకు కాసేపు నోట మాటరాలేదు. అసలు తమను లెస్బియస్స్ (లేడి కపుల్స్) లుగా ఎందుకు భావించారో అర్థం కాలేదని, రిసార్ట్ మేనేజ్ మెంట్ కు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించారు. తాము చెప్పకుండా లెస్బియన్లుగా ఎందుకు భావించారని నిలదీశారు. తప్పును ఒప్పుకున్న మేనేజ్ మెంట్ గే కపుల్స్ కు క్షమాపణ చెప్పింది. ఆపై వారికి కూల్ డ్రింక్స్ ఇచ్చి కూల్ చేసినట్లు వారు వివరించారు.