ఆ కుక్కకు ఆకలేసి డబ్బులు తినేసింది | North Wales Pet Dog Eats Cash Notes | Sakshi
Sakshi News home page

ఆ కుక్కకు ఆకలేసి డబ్బులు తినేసింది

Published Sun, May 5 2019 5:10 PM | Last Updated on Sun, May 5 2019 5:14 PM

North Wales Pet Dog Eats Cash Notes - Sakshi

నార్త్‌వేల్స్‌ : ఓ కుక్కకు ఆకలేసి 14 వేల రూపాయల(నోట్లు)ను నమిలిమింగేసింది. ఈ సంఘటన యూకేలోని నార్త్‌వేల్స్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నార్త్‌వేల్స్‌కు చెందిన ఓ వ్యక్తి లాబ్రడూడిల్‌ రకానికి చెందిన ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ఓ రోజు అతని ఇంటికి డబ్బులతో ఉన్న ఎన్వలెప్‌ కవర్‌ పార్సిల్‌ వచ్చింది. అందులో దాదాపు 160 పౌండ్ల కరెన్సీ నోట్లు ఉన్నాయి. భారతీయ కరెన్సీలో వాటి విలువ దాదాపు 14వేల రూపాయలు. దీన్ని గమనించిన ఆ కుక్క వెంటనే దాన్ని పక్కకు తీసుకెళ్లి, నమిలి తినేసింది.

విషయం తెలుసుకున్న దాని ఓనరు నెత్తిబాదుకున్నాడు. ఆ కుక్క అంతచేసినా దాని మీద ఉన్న ప్రేమకొద్ది దాని ఆరోగ్యం పాడు కాకుండా ఉండేందుకు పశువైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ డాక్టర్‌ నానాతంటాలు పడి దాని కడుపులో ఉన్న చెత్తను మొత్తం బయటకు తీసేశాడు. మొత్తానికి ఓ 11 వేలరూపాయల బిల్లు వేశాడు. ఆ బిల్లు చూసిన దాని ఓనరు మరోసారి షాక్‌ తిన్నాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement