‘టాటూగా రతన్ టాటా’
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా అస్తమయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని దుఃఖసాగరంలో ముంచేసింది. పారిశ్రామిక వేత్తగానే కాకుండా, ప్రముఖ దాతగా మానవతావాదిగా నిలిచిన ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ అభిమానులు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. అయితే ఈ విషయంలో మరో అడుగు ముందు కేశాడు రతన్ టాటా అభిమాని ఒకరు. ఏకంగా ఆయన టాటూను గుండెలపై ముద్రించుకుని అపారమైన ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విశేషంగా మారింది.
రతన్ టటా ఫొటోను ఒక అభిమాని గుండెపై టాటూగా ముద్రించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను టాటూ ఆర్టిస్ట్ మహేష్ చవాన్, ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను నెటిజనులను ఆకట్టుకుంటోంది. రతన్ టాటాను తమ దేవుడిగా భావిస్తున్నట్లు వీడియోలో ఆ యువకుడు తెలిపాడు. ఈ సందర్భంగా హృదయాన్ని హత్తుకునే ఒక విషయాన్ని కూడా వెల్లడించాడు. కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన స్నేహితడు వైద్యం కోసం ఎంతో కష్టపడ్డాడని ఆ సమయంలో టాటా ట్రస్ట్ ఆదుకుని, వైద్యం అందించి అతడి ప్రాణాలను కాపాడిందని గుర్తు చేసుకున్నాడు. అందుకే తాను రతన్ టాటా ఫొటోను గుండెలపై టాటూ వేయించుకున్నానని తెలిపాడు.
దీంతో ‘‘దేశం ఒక తన రతన్ (రత్నం)ని కోల్పోయింది అని ఒకరు, నిజంగానే ఆయన చాలా గ్రేట్, నిజమైన కోహినూర్‌ను కోల్పోయాం’’ అంటూ నెటిజన్లు ఆయనకు నివాళి అర్పించారు. ఈ వీడియో లక్షలకొద్దీ లైక్స్‌ను 80 లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించింది.
కాగా గతవారం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో 86 ఏళ్ల రతన్ టాటా కన్నుమూశారు. భారతీయ వ్యాపారరంగంలో ఒక శకం ముగిసింది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇంకా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment