అమెరికన్ స్టార్ సింగర్ సెలెనా గోమెజ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది ఈ హాలీవుడ్ బ్యూటీ. ప్రియుడు బెన్నీ బ్లాంకోతో ఎంగేజ్‌మెంట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఫరెవర్ బిగిన్స్ నౌ అంటూ షేర్ చేసిన సెలెనా గోమెజ్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె చేతి డైమండ్ రింగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది.
సెలెనా గోమెజ్, బెన్నీ బ్లాంకో రిలేషన్ ఎప్పటినుంచో వార్తల్లో ఉన్నప్పటికీ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నట్లు ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు. చిరకాల ప్రయాణం షురూ(ఫరెవర్ బిగిన్స్ నౌ) గురువారం (డిసెంబర్ 12) ఎంగేజ్‌మెంట్ ఫోటోలను పోస్ట్ చేసింది ‘సింగిల్ సూన్’ సింగర్ . దీనికి స్పందించిన ఆమె కాబోయే భర్త బెన్నీ బ్లాంకో ఈ పోస్ట్‌పై ‘హే వెయిట్... ఆమె నా భార్య’ అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఈ లవ్‌బర్డ్స్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అద్భుతమైన మార్క్విస్ సాలిటైర్ డైమండ్ రింగ్‌తో సెలెనా గోమెజ్ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
బెన్నీ బ్లాంకో ఎవరు?
బెన్నీ బ్లాంకో ప్రసిద్ధ హాలీవుడ్ నిర్మాత , రచయిత. ప్రధానంగా బీటీఎస్ , స్నూప్ డాగ్, హెల్సే, ఖలీద్, ఎడ్ షీరాన్, జస్టిన్ బీబర్, ది వీకెండ్, అరియానా గ్రాండే, బ్రిట్నీ స్పియర్స్ , సెలీనా గోమెజ్ వంటి కళాకారులతో కలిసి పనిచేశాడు. బెన్నీ సెలీనా ట్రాక్ ఐ కాంట్ గెట్ ఎనఫ్‌ను కూడా నిర్మించారు. సెలెనా గోమెజ్ బెన్నీ బ్లాంకో 2023 డిసెంబర్‌లో తమ సంబంధాన్ని ధృవీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment