
దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి నటిగా మేకప్ వేసుకున్నారు ప్రియాంకా చోప్రా. ఇద్రిస్ ఎల్బా, జాన్ సెనా, ప్రియాంకా చోప్రా, జాక్ క్వాయిడ్, స్టీఫెన్ రూట్ ప్రధాన పాత్రధారులుగా హాలీవుడ్‌లో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ అనే కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ అమెరికాలో మొదలైంది.
‘‘..అండ్ వుయ్ ఆర్ బ్యాక్..’’ అంటూ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ సినిమా స్క్రిప్ట్‌ను తన ఇన్‌స్టా స్టేటస్‌లో షేర్ చేశారు ప్రియాంకా చోప్రా. దీంతో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ షూట్‌లో ఆమె పాల్గొంటున్నారని స్పష్టమైంది. ఇక రెండు నెలల క్రితం తన వ్యక్తిగత పనుల కోసం ప్రియాంకా చోప్రా ఇండియా వచ్చారు. సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నిశ్చితార్థం వేడుకలో చురుగ్గా పాల్గొన్నారు ప్రియాంక. ఈ వేడుకతో పాటు మరికొన్ని పనులను చక్కబెట్టుకుని ప్రియాంకా చోప్రా మళ్లీ నటిగా బిజీ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment