Priyanka Chopra brother
-
కొత్త పెళ్లికూతురికి పసుపుతో భయంకరమై ఎలర్జీ వచ్చిందట! ఫోస్ట్ వైరల్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా తన ప్రేయసి, నటి నీలమ్ ఉపాధ్యాయను ( ఫిబ్రవరి 7న) పెళ్లి చేసుకున్నాడు. ఎంతో ఘనంగా జరిగిన ఈ వివాహ మహోత్సవానికి భార్యాభర్తలు ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ వచ్చి సందడి చేశారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, మరీ ముఖ్యంగా ఆడపడుచు హోదాలో ప్రియాంక స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 'సిడ్నీ కి షాదీ' తన సోదరుడి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ను హల్దీ వేడుకతో ప్రారంభిస్తున్నట్లు ఫ్యాన్స్‌తో పంచుకుంది. హల్దీ, బారాత్, వెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేసి అందర్నిఫిదా చేసింది. భర్త నిక్, కుమార్తెతో కలిసి కొత్త జంట సిద్ధార్థ్ చోప్రా, నీలం ఉపాధ్యాయతో పాటు, నిక్ జోనాస్ తల్లిదండ్రులుతో కలిసి స్పెషల్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. అయితే తాజాగా మరో విషయం నెట్టింట వైరల్‌గా మారింది.ప్రియాంక చోప్రా 'భాభి', నీలం ప్రీవెడ్డింగ్ వేడుకల అయిన హల్దీ వేడుక (ఫిబ్రవరి 5న)లో స్కిన్ ఎలర్జీతో బాధపడిందట. 'హల్దీ' మూలంగా తనకు అలర్జీ వచ్చిందని నీలం వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీని ప్రకారం మెడ , కాలర్‌బోన్ ప్రాంతం చుట్టూ భయంకరమైన చర్మ అలెర్జీ స్పష్టంగా కనిపిస్తోంది. బహుశా సేంద్రీయ పసుపుకాకపోవడంతో ఆమెకు ఎలర్జీ వచ్చినట్టుంది. ముందుగా టెస్ట్ చేసినప్పిటికీ, ఎలర్జీ వచ్చిందని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వాపోయింది. ఈ ఫోటోలు నీలం నల్లపూసలతో కూడా మంగళసూత్రాన్ని కూడా చూపించింది. ఎండలో ఉండటం వల్ల ఇలా వచ్చిందా; అప్లయ్ చేయడానికి కొన్ని రోజుల ముందు ప్యాచ్ టెస్ట్ కూడా చేసా, అన్నీ బాగానే ఉన్నాయి. దీనికేంటి పరిష్కారం, అసలు ఎందుకిలా అయింది.. దయచేసి ఎవరైనా సలహా చెప్పండి అంటూ అభ్యర్థించింది.ఇదీ చదవండి :బిలియనీర్‌తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి!పసుపుతో అలెర్జీ వస్తుందా? పసుపు సాధారణంగా చాలా మందికి సురక్షితమైనది . ప్రయోజనకరమైనది. కానీ కొందరిలో దుష్ప్రభావాలను కలిగిస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారిలో ఇది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అత్యంత ముఖ్యమైన దుష్ప్రభావం అలెర్జీ. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, వాపు మచ్చలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని చర్మంపై పూసినప్పుడు కాంటాక్ట్ డెర్మటైటిస్ లాంటి అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది. ఒక్కోసారి శ్వాస ఆడకపోవడంలాంటి కనిపించవచ్చు. ఇంకా లోపలికి తీసుకుంటే విరేచనాలు, వికారం,కడుపు నొప్పి వంటి తేలికపాటి జీర్ణ సమస్యల నుండి ఇనుము లోపం, పిత్తాశయ సమస్యలు, తక్కువ రక్తంలో చక్కెర స్థాయిలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.ఎవరు జాగ్రత్తగా ఉండాలి?పిత్తాశయ వ్యాధి ఉన్నవారు పసుపును నివారించాలి. ఎందుకంటే ఇది పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. ఆస్ప్రిన్, వార్ఫరిన్ వంటి రక్తాన్ని పలుచబరిచే మందులు వాడేవారు పసుపు రక్తస్రావం పెంచే అవకాశం ఉన్నందున దానిని నివారించాలి. గర్భిణీలు , పాలిచ్చే స్త్రీలు కూడా పసుపును జాగ్రత్తగా వాడాలి.పసుపులో ఉండే పదార్ధం కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇవి అలెర్జీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే, ఇది వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది.దురదలు, దద్దుర్లు తగ్గించే యాంటిహిస్టామైన్ లాంటి మందులను వాడాలి. సమస్య బాగా తీవ్రంగా ఉంటే కార్టికోస్టెరాయిడ్, అనాఫిలాక్సిస్ లాంటి మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. ఇంకా సమస్య తీవ్రతను బట్టి సబ్లింగ్యువల్ ఇమ్యునోథెరపీ అవసరం అవుతుంది. ఏదిఏమైనా సమస్యను వైద్యుడి దృష్టికి తీసుకెళ్లి, తగిన పరీక్షల అనంతరం నిపుణుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి.కాగా సిద్ధార్థ్ చోప్రా పెళ్లి చేసుకున్న నీలం ఉపాధ్యాయ తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. 2012లో నక్షత్ర అనే మూవీతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తరువాత 2013లో హీరో అల్లరి నరేష్‌కు జోడీగా యాక్షన్ 3డి మూవీలో హీరోయిన్గా నటించింది నీలం. ఆ తరువాత తమిళ మూవీల్లో కూడా నటించింది. -
బ్యాక్ టు షూట్
దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి నటిగా మేకప్ వేసుకున్నారు ప్రియాంకా చోప్రా. ఇద్రిస్ ఎల్బా, జాన్ సెనా, ప్రియాంకా చోప్రా, జాక్ క్వాయిడ్, స్టీఫెన్ రూట్ ప్రధాన పాత్రధారులుగా హాలీవుడ్లో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ అనే కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ అమెరికాలో మొదలైంది. ‘‘..అండ్ వుయ్ ఆర్ బ్యాక్..’’ అంటూ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ సినిమా స్క్రిప్ట్‌ను తన ఇన్‌స్టా స్టేటస్‌లో షేర్ చేశారు ప్రియాంకా చోప్రా. దీంతో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ షూట్లో ఆమె పాల్గొంటున్నారని స్పష్టమైంది. ఇక రెండు నెలల క్రితం తన వ్యక్తిగత పనుల కోసం ప్రియాంకా చోప్రా ఇండియా వచ్చారు. సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నిశ్చితార్థం వేడుకలో చురుగ్గా పాల్గొన్నారు ప్రియాంక. ఈ వేడుకతో పాటు మరికొన్ని పనులను చక్కబెట్టుకుని ప్రియాంకా చోప్రా మళ్లీ నటిగా బిజీ అవుతున్నారు. -
తమ్ముడు వండితే చక్కగా లాగిస్తా!
అన్న అయితే అండగా ఉంటాడు. తమ్ముడైతే అండ కోరుకుంటాడు. సిద్ధార్థ అలా కోరుకున్నప్పుడు అక్క ప్రియాంక అతడి వెంట నిలబడింది. ప్రోత్సహించింది. అది ఆ తమ్ముడు మర్చిపోలేదు. తమ్ముడినైనా అన్నలా జీవితాంతం నీకు అండగా ఉంటానంటూ అక్కయ్యకు మాటిచ్చాడు. అక్క కోసం ఏం చేసేందుకైనా సిద్ధమంటాడు. అందుకే... అక్కాతమ్ముళ్ల అనుబంధానికి అసలైన నిర్వచనంగా వాళ్లిద్దరినీ చూపిస్తారంతా! ఏ ఆడపిల్ల అయినా తన అన్నను చూసుకుని చాలా ధైర్యంగా ఉంటుంది. నాకు అన్న లేడు. తమ్ముడున్నాడు. వయసులో చిన్నవాడు కనుక తమ్ముడంటున్నాను కానీ అన్నకంటే ఎక్కువ భరోసా ఇస్తాడు. నాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ శ్రద్ధ చూపిస్తాడు. తను ఉంటే బాగుణ్ను అని నేననుకునేలోపు నా దగ్గరుంటాడు. మా తమ్ముడు సిద్ధార్థ అంటే నాకు ప్రాణం. చిన్నప్పట్నుంచీ వాడిని బాగా ముద్దు చేసేదాన్ని. తను నాకంటే ఏడేళ్లు చిన్నవాడు. నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు పుట్టాడు. బొద్దుగా, క్యూట్‌గా ఉండేవాడు. మొదట్నుంచీ చాలా కామ్‌గా కూడా ఉండేవాడు. మగపిల్లలు ఇల్లు పీకి పందిరేస్తారని అంటారు. కానీ సిద్ధూ అలా కాదు. నేను కాస్త తుంటరిదాన్ని కానీ తను చాలా బుద్ధిమంతుడు. సెలైంట్‌గా తన పని తాను చేసుకుపోతుంటాడు. సింపుల్‌గా ఉంటాడు. తనది ఎంత మంచి మనసంటే... తన ఎదురుగా ఎవరు బాధపడినా వాడి కళ్లు చెమరుస్తాయి. వెంటనే వాళ్లని ఓదార్చడానికో, సాయం చేయడానికో రెడీ అయిపోతాడు. అది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అయితే వాడిలో నాకు నచ్చని లక్షణం ఒకటుంది. మరీ ఎమోషనల్‌గా ఉంటాడు. ఎవరైనా చిన్న మాట అన్నా హర్ట్ అయిపోతాడు. తను నమ్మినవాళ్లు ఎవరైనా అబద్ధం చెప్పినా, కాస్త మోసగించినా ఎంతగానో ఫీలైపోతాడు. అది మంచి పద్ధతి కాదని ఎంత చెప్పినా వినడు. మనల్ని బాధపెట్టేవాళ్ల గురించి పట్టించుకోవడం అనవసరం, మనల్ని ప్రేమించేవాళ్లను గుర్తు తెచ్చుకుని సంతోషపడటం ఉత్తమం అన్నది నా పాలసీ. అది వాడికి అర్థమవదు. చెప్పినప్పుడు సరే అంటాడు కానీ మళ్లీ మామూలే. సినిమాల్లోకి వచ్చాక వాడితో గడిపే సమయం తగ్గిపోయింది. దానికి తోడు తను చదువుకోవడానికి విదేశాలకు వెళ్లిపోవడంతో కాస్త దూరం పెరిగింది. అయితే ఏ మాత్రం చాన్స్ దొరికినా కలిసేవాళ్లం. తన గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌కి నేను స్విట్జర్లాండ్ వెళ్లాను కూడా. నన్ను అక్కడ చూడగానే ఎంత సంతోష పడిపోయాడో! ఇక రాఖీ పండుగ వచ్చిందంటే సందడే సందడి. నేను పొద్దునే లేచి, వాడినీ లేపి రాఖీ కట్టేస్తాను. నిజానికి నాకు ఇరవైమంది వరకూ కజిన్స్ ఉన్నారు. చిన్నప్పట్నుంచీ వాళ్లందరికీ రాఖీలు కట్టేదాన్ని. తర్వాత బిజీ అయిపోయి పోస్ట్‌లో పంపించడం మొదలుపెట్టాను. అయితే ఎంతమందికి కట్టినా... మా తమ్ముడి దారి వేరు, తనకు రాఖీ కట్టడంలో ఉండే ఆనందం వేరు. సిద్ధూకి మొదట్నుంచీ వంట చేయడం చాలా ఇష్టం. అందుకే చెఫ్ అయ్యాడు. అద్భుతంగా వండుతాడు. నాకు థాయ్ ఫుడ్ పేరు చెబితేనే నోట్లో నీళ్లూరతాయి. అందుకే నాకోసం తను థాయ్ స్పెషల్ కర్రీ చేసి పెడుతుంటాడు. భలే ఉంటుంది రుచి! ఇంకా రక రకాల వంటకాలు చేసి రుచి చూపిస్తుంటాడు. నేను ఫుల్‌గా లాగించేస్తాను. ఏ అక్కకి ఆ అదృష్టం దొరకుతుంది చెప్పండి! సిద్ధూకి పోయినేడు ఎంగేజ్మెంట్ అయ్యింది. తను కర్ణికను ప్రేమించాడు. తన ప్రేమను మేమందరం అంగీక రించాం. మా తమ్ముడు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. నన్ను కంటికి రెప్పలా చూసుకునే నాన్న మమ్మల్నందరినీ వదిలి వెళ్లిపోయారు (ప్రియాంక తండ్రి డాక్టర్ అశోక్‌చోప్రా, పోయినేడు జూన్‌లో క్యాన్సర్‌తో మరణించారు). ఇక అమ్మకి, నాకు ఉన్న తోడు, ధైర్యం సిద్ధూనే. నాకు తెలుసు... నాకోసం ఎప్పుడు ఏం చేయడానికైనా తను సిద్ధంగా ఉంటాడని! సిద్ధార్థ చోప్రా స్విట్జర్లాండ్‌లో హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. ప్రస్తుతం ఓ ప్రముఖ హోటల్లో చీఫ్ షెఫ్‌గా పని చేస్తున్నాడు. స్వతహాగా కాస్త సిగ్గరి అయిన సిద్ధార్థ... ఎప్పుడైనా అక్కతో పాటు పార్టీలకు వస్తాడు తప్ప ఇండస్ట్రీకి, సినీ జనానికి కాస్త దూరంగానే ఉంటాడు!