![Priyanka Chopra's Bhabhi Neelam Faces Skin Allergy After Pre-Wedding Haldi Ceremony](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/Neelam%20Upadhyaya-haldielergy.jpg.webp?itok=Ipbegz-N)
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా తన ప్రేయసి, నటి నీలమ్ ఉపాధ్యాయను ( ఫిబ్రవరి 7న) పెళ్లి చేసుకున్నాడు. ఎంతో ఘనంగా జరిగిన ఈ వివాహ మహోత్సవానికి భార్యాభర్తలు ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ వచ్చి సందడి చేశారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, మరీ ముఖ్యంగా ఆడపడుచు హోదాలో ప్రియాంక స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 'సిడ్నీ కి షాదీ' తన సోదరుడి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ను హల్దీ వేడుకతో ప్రారంభిస్తున్నట్లు ఫ్యాన్స్‌తో పంచుకుంది. హల్దీ, బారాత్, వెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేసి అందర్నిఫిదా చేసింది. భర్త నిక్, కుమార్తెతో కలిసి కొత్త జంట సిద్ధార్థ్ చోప్రా, నీలం ఉపాధ్యాయతో పాటు, నిక్ జోనాస్ తల్లిదండ్రులుతో కలిసి స్పెషల్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. అయితే తాజాగా మరో విషయం నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రియాంక చోప్రా 'భాభి', నీలం ప్రీవెడ్డింగ్ వేడుకల అయిన హల్దీ వేడుక (ఫిబ్రవరి 5న)లో స్కిన్ ఎలర్జీతో బాధపడిందట. 'హల్దీ' మూలంగా తనకు అలర్జీ వచ్చిందని నీలం వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీని ప్రకారం మెడ , కాలర్‌బోన్ ప్రాంతం చుట్టూ భయంకరమైన చర్మ అలెర్జీ స్పష్టంగా కనిపిస్తోంది. బహుశా సేంద్రీయ పసుపుకాకపోవడంతో ఆమెకు ఎలర్జీ వచ్చినట్టుంది. ముందుగా టెస్ట్ చేసినప్పిటికీ, ఎలర్జీ వచ్చిందని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వాపోయింది. ఈ ఫోటోలు నీలం నల్లపూసలతో కూడా మంగళసూత్రాన్ని కూడా చూపించింది. ఎండలో ఉండటం వల్ల ఇలా వచ్చిందా; అప్లయ్ చేయడానికి కొన్ని రోజుల ముందు ప్యాచ్ టెస్ట్ కూడా చేసా, అన్నీ బాగానే ఉన్నాయి. దీనికేంటి పరిష్కారం, అసలు ఎందుకిలా అయింది.. దయచేసి ఎవరైనా సలహా చెప్పండి అంటూ అభ్యర్థించింది.
ఇదీ చదవండి :బిలియనీర్‌తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి!
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/Neelam%20Upadhyaya-haldielergy-1.jpg)
పసుపుతో అలెర్జీ వస్తుందా?
పసుపు సాధారణంగా చాలా మందికి సురక్షితమైనది . ప్రయోజనకరమైనది. కానీ కొందరిలో దుష్ప్రభావాలను కలిగిస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారిలో ఇది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అత్యంత ముఖ్యమైన దుష్ప్రభావం అలెర్జీ. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, వాపు మచ్చలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని చర్మంపై పూసినప్పుడు కాంటాక్ట్ డెర్మటైటిస్ లాంటి అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది. ఒక్కోసారి శ్వాస ఆడకపోవడంలాంటి కనిపించవచ్చు. ఇంకా లోపలికి తీసుకుంటే విరేచనాలు, వికారం,కడుపు నొప్పి వంటి తేలికపాటి జీర్ణ సమస్యల నుండి ఇనుము లోపం, పిత్తాశయ సమస్యలు, తక్కువ రక్తంలో చక్కెర స్థాయిలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.
ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
పిత్తాశయ వ్యాధి ఉన్నవారు పసుపును నివారించాలి. ఎందుకంటే ఇది పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. ఆస్ప్రిన్, వార్ఫరిన్ వంటి రక్తాన్ని పలుచబరిచే మందులు వాడేవారు పసుపు రక్తస్రావం పెంచే అవకాశం ఉన్నందున దానిని నివారించాలి. గర్భిణీలు , పాలిచ్చే స్త్రీలు కూడా పసుపును జాగ్రత్తగా వాడాలి.
పసుపులో ఉండే పదార్ధం కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇవి అలెర్జీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే, ఇది వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది.
దురదలు, దద్దుర్లు తగ్గించే యాంటిహిస్టామైన్ లాంటి మందులను వాడాలి. సమస్య బాగా తీవ్రంగా ఉంటే కార్టికోస్టెరాయిడ్, అనాఫిలాక్సిస్ లాంటి మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. ఇంకా సమస్య తీవ్రతను బట్టి సబ్లింగ్యువల్ ఇమ్యునోథెరపీ అవసరం అవుతుంది. ఏదిఏమైనా సమస్యను వైద్యుడి దృష్టికి తీసుకెళ్లి, తగిన పరీక్షల అనంతరం నిపుణుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి.
కాగా సిద్ధార్థ్ చోప్రా పెళ్లి చేసుకున్న నీలం ఉపాధ్యాయ తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. 2012లో నక్షత్ర అనే మూవీతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తరువాత 2013లో హీరో అల్లరి నరేష్‌కు జోడీగా యాక్షన్ 3డి మూవీలో హీరోయిన్‌గా నటించింది నీలం. ఆ తరువాత తమిళ మూవీల్లో కూడా నటించింది.
Comments
Please login to add a commentAdd a comment