రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ రాధికల పెళ్లి ఎంతలా అంగరంగ వైభవంగా జరిగిందో తెలిసిందే. ఆ వేడుకకు సంబంధించిన ప్రతి ఫోటో, వీడియోలు నెట్టింట సందడి చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అంబానీలు ధరించే కాస్ట్యూమ్స్, నగలు, తదితరాలు చాలా హాట్‌టాపిక్‌గా నిలిచాయి కూడా. అయితే ఆ వేడుకకు సంబంధించి ఓ వీడియోని మాత్రం అందరూ మిస్ అయ్యాం. సరదసరదాగా సాగే హల్దీ వేడుకకు సంబంధిచిన మరో వీడియో తాజగానెట్టింట తెగ వైరల్ అవుతోంది.
అంబానీలకు సన్నిహితుడైన అకా ఓర్హాన్ అవత్రమణి షేర్ చేసిన ఈ లేటెస్ట్ వీడియోలో అంబానీలంతా ఖుషీగా గడిపినట్లు కనిపించింది. అతిధులంతా పసుపునీళ్లు ఒకరిపై ఒకరూ వేసుకుంటూ సందడి చేశారు. ఆ వీడియోలో నీతా అంబానీ పసుపు నీళ్లు పడకుండా తప్పించుకోవడంలో విఫల ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వేడుకకు హోస్ట్‌గా ఉన్న నీతా అంబానీ సైతం అంరిలానే హల్దీ దాడిని ఎదుర్కోవడం ఫన్నీగా ఉంటుంది. ఇ
క అనంత్ అంబానీ బావమరిది ఆనంద్ పిరమల్ ఒకరిపై ఒకరు పసుపు నీళ్లు, పూలతో దాడి చేయడం, మరోపక్క అతిథులంతా నవ్వుతూ ఉన్నట్లు వీడియోలో కనిపించింది. ఈ హల్దీ ఫంక్షన్ ముంబైలోని అంబానీ కుటుంబానికి చెందిన ఆంటిలియాలో జరిగింది.
ఈ వేడుకలో జాన్వీ కపూర్, అర్జున్ కపూర్, రణ్‌వీర్ సింగ్ తదితర తారలు పాల్గొన్నారు. అంతేగాదు ఈ లెటెస్ట్ ఓర్రీ వీడియోలో ధోల్ బీట్‌లు, డ్యాన్స్‌లతో ఇతర అతిథులు ఎంత సరదాగా గడిపారో కూడా కనిపిస్తోంది. కాగా, అనంత్ రాధిక మర్చంట్‌ల వివాహం ఈ ఏడాది జూలై 12న అత్యంత లగ్జరియస్‌గా జరిగింది.
(చదవండి: అందమైన శరీరాకృతికి బీబీఎల్ సర్జరీ: అంటే ఏంటీ..? ఎదురయ్యే దుష్ర్పభావాలు..)
Comments
Please login to add a commentAdd a comment