పెళ్లికి ముందు అంబానీ ఫ్యామిలీ మరో గ్రాండ్‌ ఈవెంట్‌ | mass wedding as part of Anant Radhika pre wedding celebrations | Sakshi
Sakshi News home page

పెళ్లికి ముందు అంబానీ ఫ్యామిలీ మరో గ్రాండ్‌ ఈవెంట్‌

Published Sat, Jun 29 2024 10:44 AM | Last Updated on Sat, Jun 29 2024 11:24 AM

mass wedding as part of Anant Radhika pre wedding celebrations

ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌ అతి త్వరలో మూడు ముళ్లతో ఒక్కటవుతున్నారు. వీరి వివాహం జూలై 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత ఘనంగా జరగనుంది. ఇప్పటికే రెండు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇప్పుడు పెళ్లికి ముందు మరో భారీ వేడుకను అంబానీ ఫ్యామిలీ నిర్వహించబోతోంది.

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో నిరుపేద యువతీయువకులకు సామూహిక వివాహాలను జరిపించబోతోంది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వార్తా సంస్థ ఏఎన్‌ఐ ప్రచురించింది. దీని ప్రకారం.. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా జూలై 2న సాయంత్రం 4.30 గంటలకు పాల్ఘర్ లోని స్వామి వివేకానంద విద్యామందిర్ లో నిరుపేదల సామూహిక వివాహాన్ని ఏర్పాటు చేశారు.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ అత్యంత ఆడంబరంగా జరిగాయి. జామ్ నగర్ లో జరిగిన తొలి కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకాగా, రిహన్నా వంటి గ్లోబల్ ఐకాన్‌ల ప్రదర్శనలు ఇచ్చారు. మధ్యధరా సముద్రంపై క్రూయిజ్‌లో విశిష్టంగా జరిగిన రెండో వేడుక అయితే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement