Mass Wedding
-
అంబానీ ఇంట పెళ్లి సందడి : 50 జంటలకు సామూహిక వివాహాలు (ఫొటోలు)
-
అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్ : మరో విశేష కార్యక్రమం, వైరల్ వీడియో
రిలయన్స్ అధినేత, కుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు తమ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా మరో విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన జంటల సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు అంబానీ దంపతులు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విశేషంగా నిలిచింది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దగ్గరుండి మరీ ఈ కార్యక్రమాన్నినిర్వహించారు. ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్ఘర్కు చెందిన 50 మంది నిరుపేద జంటకు సామూహిక వివాహాలను నిర్వహించారు. అలాగే అంబానీ పెద్దకుమారుడు ఆకాశ్ అంబానీ, ఆయన భార్య శ్లోకా, ఇషా అంబానీ, భర్త ఆనంద్ పిరామిల్ కూడా పాల్గొన్నారు. శ్లోకా అంబానీ నూతన వధూవరులకు ఖరీదైన బహుమతులను అందించారు. కాగా జూలై 12న ముంబైలోని బాంద్రాలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్, రాధిక మర్చంట్ వివాహం వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యినట్టు తెలుస్తోంది. వీరి పెళ్లికి సంబంధించిన తొలి వివాహ ఆహ్వాన పత్రికను ఇటీవలే నీతా అంబానీ వారణాసిలోని కాశీ విశ్వనాథుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యే అవకాశముందని అంచనా.#WATCH | Navi Mumbai: Reliance Industries Chairman Mukesh Ambani and Nita Ambani present at the mass wedding of the underprivileged being organised as part of the pre-wedding celebrations of Anant Ambani and Radhika Merchant. pic.twitter.com/IoMvMsPq7s— ANI (@ANI) July 2, 2024 -
పెళ్లికి ముందు అంబానీ ఫ్యామిలీ మరో గ్రాండ్ ఈవెంట్
ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ అతి త్వరలో మూడు ముళ్లతో ఒక్కటవుతున్నారు. వీరి వివాహం జూలై 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత ఘనంగా జరగనుంది. ఇప్పటికే రెండు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇప్పుడు పెళ్లికి ముందు మరో భారీ వేడుకను అంబానీ ఫ్యామిలీ నిర్వహించబోతోంది.మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో నిరుపేద యువతీయువకులకు సామూహిక వివాహాలను జరిపించబోతోంది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వార్తా సంస్థ ఏఎన్ఐ ప్రచురించింది. దీని ప్రకారం.. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా జూలై 2న సాయంత్రం 4.30 గంటలకు పాల్ఘర్ లోని స్వామి వివేకానంద విద్యామందిర్ లో నిరుపేదల సామూహిక వివాహాన్ని ఏర్పాటు చేశారు.అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ అత్యంత ఆడంబరంగా జరిగాయి. జామ్ నగర్ లో జరిగిన తొలి కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకాగా, రిహన్నా వంటి గ్లోబల్ ఐకాన్ల ప్రదర్శనలు ఇచ్చారు. మధ్యధరా సముద్రంపై క్రూయిజ్‌లో విశిష్టంగా జరిగిన రెండో వేడుక అయితే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.As part of the pre-wedding celebrations of Anant Ambani and Radhika Merchant, a mass wedding of the underprivileged has been organised at 4:30 pm on 2nd July, at Swami Vivekanand Vidyamandir in Palghar. pic.twitter.com/tRu1h5Em6g— ANI (@ANI) June 29, 2024 -
Shocking: వధువులకు ఇచ్చిన మేకప్ కిట్లలో కండోమ్స్, గర్భ నిరోధక మాత్రలు..
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల కోసం మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం చేపట్టిన సామూహిక వివాహ పథకం మరోసారి వివాదంలో చిక్కుకుంది. గతంలో వివాహానికి ముందు కొంతమంది వధువులకు ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు చేసినట్లు ఆరోపణలు రావడంతో ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పెళ్లిలో వధువులకు అందించే మేకప్ కిట్‌లో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు అందజేయడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి కన్య వివాహ/ నిఖా యోజన పథకం కింద సోమవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. ఈ పథకం ద్వారా 296 జంటలు ఒకటయ్యాయి. కాగా కొత్తగా పెళ్లైన వధువులకు ఈ పథకం కింద అందించిన మేకప్ కిట్ బాక్స్‌లో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు పంపిణీ చేశారు. మేకప్ కిట్ తెరిచి చూసిన వధువులు వాటిలో కండోమ్స్, బర్త్ కంట్రోల్ పిల్స్ ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. దీంతో సీఎం చౌహాన్నపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే దీనిపై జిల్లా అధికారి భుర్సింగ్ రావత్ స్పందించారు. కుటుంబ నియంత్రణకు సంబంధించి అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య అధికారులు కండోమ్‌లు, గర్భనిరోధక మందులను పంపిణీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలను పంపిణీ చేసే బాధ్యత తమది కాదని. కుటుంబ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ వీటిని అందజేసే అవకాశం ఉందన్నారు. తాము కేవలం ముఖ్యమంత్రి కన్యా వివాహ/నిఖా యోజన కింద లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలోకి రూ.49,000ని ట్రాన్స్ఫర్ చేస్తామని, పెళ్లి సమయంలో ఆహారం, వాటర్, టెంట్, వాటికి సంబంధించిరూ. 6000 వేలు అందిస్తామని తెలిపారు. అయితే పంపిణీ చేసిన ప్యాకెట్లలో ఏముంటుందో తమకు తెలీదని పేర్కొన్నారు. కాగా ముఖ్యమంత్రి కన్య వివాహ/ నిఖా యోజన పథకాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2006 ఏప్రిల్‌లో ప్రారంభించింది. ఆర్థికంగా వెనకబడిన వర్గాల మహిళలకు పెళ్లికి సాయం అందించాలనే నేపథ్యంలో దీనిని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా వధువు కుటుంబానికి ప్రభుత్వం రూ.55,000 వేల అందిస్తుంది. చదవండి: Protesting Wrestlers: పతకాలు విసిరేస్తాం! నిరహార దీక్షకు దిగుతాం! Shamelessness at its peak in @ChouhanShivraj’s Govt : The @BJP4India government of #MadhyaPradesh has distributed #condoms and #contraceptivepills in the make-up boxes given under the #KanyaVivahYojana. Do you have any shame left, #CM Ji❓ pic.twitter.com/Cz8WRIGgcl — MD Kareem (@MDKareemWadi) May 30, 2023 -
గర్భ నిర్ధారణ పరీక్షలు..వివాదాస్పదంగా సామూహిక వివాహ పథకం
మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సాముహిక వివాహ పథకం వివాదాస్పదంగా మారింది. ఆ పథకంలో భాగంలో మధ్యప్రదేశ్‌లోని గడ్సరాయ్ ప్రాంతంలో శనివారం 219 మందికి సాముహిక వివాహాలు నిర్వహించారు. ఐతే అందులో ఐదుగురు యువతులు గర్భవతులు అని తెలియడంతో వారిని సాముహిక వివాహాలకు అనుమతించలేదు. దీంతో ఈ వ్యవహారం కాస్త రాజకీయ వివాదానికి తెరలేపింది. అయినా పెళ్లి చేసుకోడానికి వచ్చిన యువతులకు గర్భ నిర్ధారణ పరీక్షలు చేయడం ఏమిటని కాంగ్రెస్ పశ్నించింది. ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అవమానించిందని ఆరోపణలు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి 200 మంది యువతులకు ప్రెగన్సీ టెస్ట్‌లు నిర్వహించారంటూ కథనాలు వస్తున్నాయి. ఈ వార్త నిజమా కాదా అనేది ముఖ్యమంత్రి నుంచే వినాలనుకుంటున్నాం. ఈ వార్త నిజమైతే సామాజికంగా వెనుకబడిని యువతులను ఘెరంగా అవమానించడమే అవుతుంది. ముఖ్యమంత్రి దృష్టిలో పేద, గిరిజన వర్గాల ఆడబిడ్డలకు పరువు లేదా అని నిలదీశారు. శివరాజ్ ప్రభుత్వంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంలో ఇప్పటికే మధ్యప్రదేశ్ అగ్రస్తానంలో ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. ఇది కేవలం గర్భ నిర్ధారణ పరీక్షకు సంబంధించింది కాదని ఇది మొత్తం స్త్రీ జాతి పట్ల దురుద్దేశంలో కూడిన వైఖరి అని మండిపడుతూ ట్వీట్ చేశారు. అయితే డిండోరి చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ ఆ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. సాధారణంగా వయస్సు ధృవీకరణ, సికిల్ సెల్ అనీమియా వంటి శారీరక దృఢత్వాన్ని నిర్థారించే పరీక్షలు నిర్వహించాలనే మార్గదర్శకాలు ఉన్నాయిని తెలిపారు. అందులో కొందరు యువతులకు పీరియడ్ సంబంధిత సమస్యలు ఉన్నాయి. దీంతోనే వారికి వైద్యులు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని తెలిపారు. తాము కేవలం పరీక్షలు నిర్వహించి నివేదికలు ఇస్తామని చెప్పారు. అయితే ఆరోగ్య శాఖ నివేదికల ఆధారంగా యువతలను పథకంలో మినహాయించే నిర్ణయం మాత్రం సామాజికి న్యాయ శాఖ తీసుకుంటుందని వివరించారు. కాగా, ముఖ్యమంత్రి వివాహ యోజన పథకం / నికా యోజన ఏప్రిల్ 2006లో ప్రారంభమైంది. ఈ పథకం కింద, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల వివాహానికి ఆర్థిక సహాయంగా రూ. 56,000/- నగదును అందిస్తోంది. (చదవండి: భార్య అరెస్టు అవుతుందనే భయంతో అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా?) -
ప్రధాని మోదీ సమక్షంలో ఒక్కటైన 551 జంటలు
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో 551 జంటలు ఒక్కటయ్యాయి. గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ.. సామూహిక వివాహ వేడుకకు హాజరయ్యారు. దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వారికి తన ఆశీస్సులు అందించారు మోదీ. ఈ సందర్భంగా బంధువుల ఒత్తిడితో ప్రత్యేకంగా ఇంటి వద్ద విందు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయొద్దని నూతన వధూవరులను కోరారు మోదీ. అందుకు ఖర్చు చేసే డబ్బులను తమ పిల్లల కోసం అట్టిపెట్టుకోవాలని సూచించారు. కొత్త జంటలతో కలిసి ఫోటోలు దిగారు మోదీ. వారితో కాసేపు ముచ్చటించారు. భవనగర్ సిటీలోని జవహార్ మైదానంలో ‘పాపా ని పారీ లగ్నోత్సవం 2022’ పేరుతో సామూహిక వివాహాలు జరిపించారు. ఈ మాస్ వెడ్డింగ్ వేడుకల్లో 551 జంటలు ఒక్కటయ్యాయి. తండ్రిని కోల్పోయిన 551 మంది యువతులకు ఈ సామూహిక వివాహ వేదికగా పెళ్లిళ్లు జరిపించారు నిర్వాహకులు. డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్వరాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆదివారం ఉదయం వల్షాద్ జిల్లాలో ర్యాలీ నిర్వహించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. తొలి దశలో డిసెంబర్ 1న 89, రెండో దశలో డిసెంబర్ 5న 93 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడించనున్నారు. Live: PM Shri @narendramodi attends mass wedding ceremony – 'Papa Ni Pari' Lagnotsav 2022, at Bhavnagar, Gujarat https://t.co/c0PJ3oQqM3 — BJP Gujarat (@BJP4Gujarat) November 6, 2022 Gujarat | Prime Minister Narendra Modi attends mass wedding ceremony – 'Papa Ni Pari' Lagnotsav 2022, in Bhavnagar https://t.co/Bwt1tD7FMw pic.twitter.com/4tjrf6Q9iy — ANI (@ANI) November 6, 2022 ఇదీ చదవండి: తగ్గేదేలే! భారత్‌కు చమురు సరఫరాలో రష్యానే టాప్ -
ట్రాన్స్జెండర్ల సామూహిక వివాహాలు..
-
ట్రాన్స్జెండర్ల సామూహిక వివాహాలు..
రాయ్‌పూర్: తమకు ఓ మనసు ఉంటుందని అంటున్నారు ట్రాన్స్జెండర్లు. అందుకే కొందరు ట్రాన్స్జెండర్లు తమకు నచ్చినవారితో కలిసి జీవితాన్ని ఆరంభించేందుకు సిద్దమయ్యారు. శనివారం రోజున ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో 15 ట్రాన్స్‌జెండర్ జంటలు వివాహ బంధంతో ఒకటయ్యాయి. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకలకు రాయ్‌పూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త విద్య రాజ్‌పుత్ ఏర్పాట్లు చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుక ముందు రోజున మెహందీ, సంగీత్ కార్యక్రమాలు నిర్వహించారు. వివాహ బంధంతో ఒకటైన 15 జంటల్లో ఛత్తీస్‌గఢ్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నారు. చాలా కాలంగా తమ బాధలను ఎవరు పట్టించుకోలేదని ఈ వేడుకల్లో పాల్గొన్న మధు కిన్నర్ తెలిపారు. కానీ ఈ రోజు తాము పెళ్లిలు చేసుకోవటానికి చక్కటి అవకాశం కల్పించిందని అన్నారు. తాము జీవిత భాగస్వామ్యులను పొందడం కంటే గొప్ప వార్త ఎముంటుందని వ్యాఖ్యానించారు. దేశంలో ఇలాంటి వేడుక జరగడం ఇదే తొలిసారి అని.. భవిష్యత్తులో ఇలాంటివి మరెన్నో జరగడానికి ఇది స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. 2014లో సుప్రీం కోర్టు ట్రాన్స్‌జెండర్స్‌ని థర్డ్ జెండర్‌గా పేర్కొంటూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వారికి రాజ్యాంగం కల్పించే అన్ని హక్కులూ వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఎల్జీబీటీ కమ్యూనిటీలో కొత్త ఆశలు చిగురించాయి. -
వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు
-
'ఈ వజ్రాల వ్యాపారి.. మనిషీ వజ్రమే'
సూరత్: సూరత్‌లో ఆదివారం 151 జంటలు మూడుముళ్ల బంధంలో ఒక్కటయ్యారు. వధూవరులు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. పెళ్లి కుమార్తెల కోసం ఖరీదైన బంగారు ఎంబ్రాయిడరీ చీరలు తెప్పించారు. మూడురోజుల పాటు జరిగిన వివాహ వేడుకకు దాదాపు లక్షమంది హాజరయ్యారు. వివాహ వేదికను అందంగా అలంకరించారు. రుచికరమైన వంటలు వండించారు. ఖర్చు 5 కోట్ల రూపాయలు. ఈ ఘనమైన ఏర్పాట్లను చూస్తే అందరూ ధనవంతుల పెళ్లిళ్లు అని అనుకుంటారు. అయితే పెళ్లి కుమార్తెలలో ఎవరికి తండ్రీ లేడు. వివాహం చేసుకోవడానికి ఆర్థిక స్థోమతలేనివారు. సూరత్ చెందిన వజ్రాల వ్యాపారి మహేశ్ శావని ఓ తండ్రిలా వచ్చి.. సొంతఖర్చుతో అంగరంగవైభవంగా పేద యువతులకు సామూహిక వివాహాలు జరిపించారు. తమ ఇంట్లో శుభకార్యాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసే కోటీశ్వరులు చాలా మంది ఉండొచ్చు కానీ ఇలాంటి దాతలు మాత్రం అరుదు. కొన్నేళ్లుగా మహేశ్ శావని తండ్రిలేని, నిరుపేద యువతులకు ఓ తండ్రిలా ఉచిత వివాహాలు జరిపిస్తున్నారు. 2008లో మహేశ్ దగ్గర పనిచేసే ఓ ఉద్యోగి తన ఇద్దరు కుమార్తెల పెళ్లికి కొన్ని రోజుల మందు మరణించాడు. మహేశ్ తన ఉద్యోగి బాధ్యతలను భుజాన వేసుకుని తండ్రిగా ఆ ఇద్దరు అమ్మాయిలకు వివాహం జరిపించాడు. అప్పట్నుంచి ప్రతి ఏటా తండ్రి లేని నిరుపేద యువతులకు సొంత ఖర్చుతో ఘనంగా వివాహాలు జరిపిస్తున్నారు. ప్రతి వధువుకూ బంగారు నగలు, దుస్తులు, కలశం, ఓ పళ్లెం అందజేస్తారు. పెళ్లి రోజున తండ్రి అవసరం ఎంతన్నది తండ్రిలేనివారికే తెలుస్తుందని విమలా కోరింగా అనే వధువు చెప్పింది. మరో వధువు మీటల్ గోండాలియా మాట్లాడుతూ.. 'రెండేళ్ల క్రితం మా నాన్న మరణించారు. నా పెళ్లికి డబ్బులు ఎలా సమకూర్చాలని అమ్మ ఆందోళన చెందేది. మహేశ్ శావని పప్పా దేవుడిలా వచ్చి ఆదుకున్నారు' అని సంతోషం వ్యక్తం చేసింది.