రిలయన్స్ అధినేత, కుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు తమ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా మరో విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన జంటల సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు అంబానీ దంపతులు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విశేషంగా నిలిచింది.
ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దగ్గరుండి మరీ ఈ కార్యక్రమాన్నినిర్వహించారు. ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్ఘర్‌కు చెందిన 50 మంది నిరుపేద జంటకు సామూహిక వివాహాలను నిర్వహించారు.
అలాగే అంబానీ పెద్దకుమారుడు ఆకాశ్ అంబానీ, ఆయన భార్య శ్లోకా, ఇషా అంబానీ, భర్త ఆనంద్ పిరామిల్ కూడా పాల్గొన్నారు. శ్లోకా అంబానీ నూతన వధూవరులకు ఖరీదైన బహుమతులను అందించారు.
కాగా జూలై 12న ముంబైలోని బాంద్రాలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్, రాధిక మర్చంట్ వివాహం వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యినట్టు తెలుస్తోంది. వీరి పెళ్లికి సంబంధించిన తొలి వివాహ ఆహ్వాన పత్రికను ఇటీవలే నీతా అంబానీ వారణాసిలోని కాశీ విశ్వనాథుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యే అవకాశముందని అంచనా.
#WATCH | Navi Mumbai: Reliance Industries Chairman Mukesh Ambani and Nita Ambani present at the mass wedding of the underprivileged being organised as part of the pre-wedding celebrations of Anant Ambani and Radhika Merchant. pic.twitter.com/IoMvMsPq7s
— ANI (@ANI) July 2, 2024
Comments
Please login to add a commentAdd a comment