
రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఆర్ఈఎల్) అనుబంధ సంస్థ అయిన కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు ఆదాయపు పన్ను శాఖ రూ.104.77 కోట్ల డిమాండ్ నోటీసులు పంపించింది. 2020-21, 2021-22 మదింపు సంవత్సరాలకు సంబంధించి ఈ నోటీసులు అందుకున్నట్లు సోమవారం సంస్థ తెలిపింది. ముంబైలోని సెంట్రల్ సర్కిల్ 6(2)లోని ఆదాయపు పన్ను అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం నుంచి ఈ నోటీసు పంపినట్లు ఆర్ఈఎల్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
ట్యాక్స్ కన్సల్టెంట్ల సలహా మేరకు కేర్ హెల్త్ నిర్ణీత గడువులోగా ఈ ఉత్తర్వులపై ఫోరమ్ ముందు అప్పీల్ దాఖలు చేస్తుందని ఆర్‌ఈఎల్ స్పష్టం చేసింది. ఈ డిమాండ్ నోటీసులకు దారితీసిన కచ్చితమైన లెక్కలు లేదా వివాదాల వెనుక ఉన్న వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ ఆర్డర్‌ను అంతిమంగా అంగీకరించే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది. నిర్ణీత గడువులోగా ఈ నోటీసుపై అప్పీల్ దాఖలు చేస్తామని కంపెనీ ప్రకటించడంతో ఇది నిర్ధారణ అవుతుంది.
ఇదీ చదవండి: ‘బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నా’
హెల్త్ ఇన్సూరెన్స్ డొమైన్‌లో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రముఖంగా సేవలందిస్తోంది. రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఇది కీలకంగా వ్యవహరిస్తోంది. పన్ను డిమాండ్‌ను సవాలు చేస్తూ తీసుకున్న నిర్ణయం దాని ఆర్థిక, చట్టపరమైన విధానాలపై విశ్వాసాన్ని సూచిస్తుంది. ఈ నోటీసుపై కంపెనీ ప్రతిస్పందనను పరిశ్రమ వాటాదారులు, రెగ్యులేటర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment