demand notice
-
బిగ్ రిలీఫ్ : పన్ను చెల్లింపు దారులకు కేంద్రం శుభవార్త!
పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ట్యాక్స్ పేయర్స్‌కు ఆదాయాపు పన్ను శాఖ అధికారులు జారీ చేసిన డిమాండ్ నోటీసులకు అప్పీల్ చేసుకునే సమయాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ట్యాక్స్ పేయర్స్ భారీ ఊరట లభించినట్లైంది. జీఎస్టీ కౌన్సిల్ ట్యాక్స్‌పేయర్స్ కోసం జీఎస్టీ అమ్నెస్టీ పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. స్కీమ్ వివరాల్ని రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్ర ప్రకటించారు. ఆ వివరాల ప్రకారం..పన్ను చెల్లింపు దారులు ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను (ఐటీఆర్‌ని) దాఖలు చేసిన తర్వాత ట్యాక్స్ అధికారులు సంబంధిత వివరాలు ఈ వివరాలన్నీ సరిపోలుతున్నాయో లేదో తెలుసుకోవడానికి డిక్లరేషన్లు, చెల్లించిన పన్నులను పరిశీలిస్తుంది. ఒకవేళ ట్యాక్స్ పేయర్స్ చెల్లించాల్సిన దానికంటే తక్కువ మొత్తం ట్యాక్స్ కడితే.. ఆదాయ పన్ను శాఖ డిమాండ్ నోటీసు జారీ చేస్తుంది. అప్పీల్ సమయం మరింత పొడిగింపు అయితే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ మండలి 52వ సమావేశంలో డిమాండ్ ఆర్డర్స్‌పై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ట్యాక్స్ అధికారులు జారీ చేసిన ఆదేశాలపై ఎవరైనా అసెసీ అప్పీలు చేయాలంటే మూడు నెలల సమయమే ఉంటుంది. దీనిని మరో నెల వరకు పొడిగించడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అదనంగా పన్ను డిమాండ్ డిపాజిట్ అయితే జీఎస్టీ మండలి సమావేశంలో జీఎస్టీ నమోదిత వ్యాపారాలకు అదనపు సమయాన్ని ఇచ్చింది. ఇందు కోసం ప్రస్తుతం జమ చేస్తున్న 10 శాతం పన్ను డిమాండ్ డిపాజిట్‌కు బదులు 12.5 శాతం జమ చేయాల్సి ఉంటుంది. భారీ ఉపశమనం దీంతో పాటు తాత్కాలికంగా అటాచ్ చేసిన ఆస్తులను ఏడాది పూర్తయిన తర్వాత విడుదల చేసేలా జీఎస్టీ నిబంధనలను సవరించింది. జీఎస్టీ చట్టం ప్రకారం, పన్ను చెల్లించని జీఎస్టీ రిజిస్టర్డ్ సంస్థల బ్యాంకు ఖాతాలు సహా ఇతర ఆస్తులను పన్ను అధికారులు తాత్కాలికంగా జప్తు చేయవచ్చు. అలాంటి అటాచ్ మెంట్ ఏడాది పాటు చెల్లుబాటు అవుతుందని కౌన్సిల్ నిర్ణయాన్ని సంజయ్ మల్హోత్ర తెలిపారు. -
యస్ బ్యాంక్ రాణా కపూర్‌కు సెబీ నోటీసు.. రూ. 2.22 కోట్లు కట్టాలి
న్యూఢిల్లీ: ఏటీ–1 బాండ్ల తప్పుడు విక్రయాల కేసుకు సంబంధించి రూ. 2.22 కోట్లు కట్టాలంటూ యస్ బ్యాంక్ మాజీ ఎండీ రాణా కపూర్‌కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ డిమాండ్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా చెల్లించని పక్షంలో అరెస్ట్ ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాగే అసెట్స్, బ్యాంక్ ఖాతాలను కూడా అటాచ్ చేస్తామని స్పష్టం చేసింది. ఏటీ–1 బాండ్లలో ఉండే రిస్క్‌ల గురించి చెప్పకుండా వాటిని అమాయక ఇన్వెస్టర్లకు యస్ బ్యాంక్ సిబ్బంది అంటగట్టారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి 2022 సెపె్టంబర్లో రాణా కపూర్‌కు సెబీ రూ. 2 కోట్ల జరిమానా విధించింది. -
‘చిత్రా రామకృష్ణ.. మీరు రూ.3.12 కోట్లు కట్టాల్సిందే.. లేదంటే..’
న్యూఢిల్లీ: ఎన్ఎస్ఈ మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షాక్ ఇచ్చింది. ఎన్ఎస్ఈలో పాలనా లోపాల కేసులో రూ.3.12 కోట్లు చెల్లించాలంటూ ఆమెకు డిమాండ్ నోటీస్ జారీ చేసింది. 15 రోజుల్లో ఈ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే అరెస్ట్ తప్పదని సెబీ హెచ్చరించింది. అలాగే ఆస్తులు, బ్యాంక్ ఖాతాల జప్తు తప్పదని స్పష్టం చేసింది. ఎన్ఎస్ఈ కో–లొకేషన్ అవినీతి కేసు, ఇతర పాలనా లోపాలతో ముడిపడి ఉన్న దర్యాప్తులో మార్చి 6న సీబీఐ అరెస్టు చేసిన తరువాత చిత్రా రామకృష్ణ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. చదవండి: Chitra Ramkrishna: కీలక ఆదేశాలు..చిత్రా అప్పీలుపై శాట్ విచారణ -
ఐటీ డిమాండు నోటీసు వచ్చిందా..
ప్రస్తుతం 2020 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అసెస్మెంట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి డిమాండు నోటీసులైనా రావచ్చు.. రిఫండైనా రావచ్చు. మీరు వేసిన రిటర్నులోని అన్ని అంశాలతో డిపార్ట్మెంటు ఏకీభవించవచ్చు.. ఏకీభవించకపోవచ్చు. ఈ నేపథ్యంలో డిమాండు నోటీసు గురించి ఈ వారం తెలుసుకుందాం. గత వారం చెప్పినట్లు మీరే స్వయంగా వారానికోసారి ఇన్‌కం ట్యాక్స్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. E– Fileలోకి వెళ్లండి. ‘డిమాండ్’ అన్న కాలంని క్లిక్ చేయండి. తర్వాత ‘ View’ని క్లిక్ చేయండి. మీ అసెస్మెంట్ వివరాలు కనిపిస్తాయి. ఏయే సందర్భాల్లో రావచ్చు.. మీరు డిక్లేర్ చేసిన ఆదాయంతో డిపార్టుమెంటు ఏకీభవించకుండా, ఎక్కువ అసెస్ చేస్తే.. వ్యాపారస్తుల విషయంలో కొన్ని ఖర్చులను ఒప్పుకోకపోతే.. మీరు క్లెయిమ్ చేసిన ‘డిడక్షన్’ తప్పయితే.. మీకు అర్హత లేని లేదా వర్తించని డిడక్షన్లను క్లెయిమ్ చేస్తే తప్పులు దొర్లితే చెల్లించిన పన్ను వివరాలు.. టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ మొదలైన వాటి విషయంలో అప్డేట్ అయిన వివరాలతో సరిపోలకపోతే రిటర్నుల్లో వివరాలు సరిగ్గా, సమగ్రంగా పొందుపర్చకపోతే ఆదాయం,పన్ను చెల్లింపులు, చెల్లించవలసిన మొత్తం వంటి వివరాల్లో హెచ్చుతగ్గులు ఉంటే నోటీసు రాగానే ఏం చేయాలి.. గాభరాపడనక్కర్లేదు. ఆ నోటీసులో ప్రతీ అంశాన్ని చదవండి. వాళ్లే ఒక కాలంలో మీరు డిక్లేర్ చేసింది, ఆ పక్కన ఇంకో కాలంలో వారు అసెస్ చేసినది చూపిస్తారు. ఈ రెండింటినీ సరిపోల్చి చూసుకోండి. వారి డిమాండ్ కరెక్ట్ అయితే ఆ విషయం ఒప్పుకుని డిమాండు మొత్తాన్ని చెల్లించండి. ఒకవేళ వారితో ఏకీభవించకపోతే ఒప్పుకోకండి. ‘disagree’ అని క్లిక్ చేయండి. సరయిన వివరణ, జరిగిన తప్పులను సరిదిద్దడం, పూర్తి వివరాలను పొందుపర్చటం వంటివి చేయండి. ఒక్కొక్కప్పుడు కొంత తప్పే మీది కావచ్చు..ఇంకొంత తప్పు వారిది కావచ్చు. డిమాండు కొంతవరకే నిజం కావచ్చు. అంటే పాక్షికంగా అన్నమాట. అలాగే బదులివ్వండి. పూర్తి వివరాలతో సరైన వివరణ ఇవ్వండి. కాగితాలు, రుజువులు, ఆధారాలు అడిగితే జతపర్చండి. ఇలా చేస్తే మీ ఆదాయపు పన్నుఅసెస్మెంటు పూర్తయినట్లే. నోటీసుకి బదులివ్వడం వలన మీ బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా మీ అసెస్మెంటు అంశానికి సంబంధించిన కథకు కూడా సుఖాంతం పలికినట్లవుతుంది. ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య -
ఆరు టెల్కోలకు షాక్!
♦ త్వరలో డాట్ రూ.12,500 కోట్ల డిమాండ్ నోటీస్! ♦ 2006-10 మధ్య ఆదాయాలు ♦ తక్కువగా చూపాయన్న కాగ్ నివేదిక న్యూఢిల్లీ: టెలికం శాఖ (డీఓటీ-డాట్) త్వరలో ఆరు టెలికం ఆపరేటర్స్‌కు రూ.12,500 కోట్ల డిమాండ్ నోటీస్ జారీ చేయనుంది. 2006-2010 మధ్య దాదాపు రూ.46,000 కోట్ల మేర తక్కువ ఆదాయం చూపించాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) పేర్కొన్న ఆరు కంపెనీలకు ఈ మేరకు నోటీసులు జరీ చేయనున్నట్లు టెలికం మంత్రిత్వశాఖలో ఒక అధికారి తెలిపారు. వీటిలో ఆర్‌కామ్, టాటా టెలీ, ఒడాఫోన్, ఎయిర్టెల్, ఐడియా, ఎయిర్‌సెల్‌లు ఉన్నాయి. మార్చిలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. ఆయా కంపెనీలు దాదాపు రూ.46,045.75 కోట్ల తమ ఆదాయాలను దాచిపెట్టినట్లు ఈ నివేదిక పేర్కొంది. కాగ్ పత్రాలు జూన్‌లో టెలికం శాఖకు అందడంతో కంపెనీలకు నోటీసుల జారీకి రంగం సిద్ధమవుతున్నట్లు ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఆదాయాన్ని వదులుకునే ప్రశ్నేలేదని కూడా ఆయన పేర్కొన్నారు. వడ్డీ, జరిమానాలు కూడా... తక్కువ చూపించిన ఆదాయం రూ.12,488.93 కోట్లుకాగా దీనికి టెలికం శాఖ వడ్డీ, జరిమానాలు కూడా జత చేయనున్నట్లు సమాచారం. అయితే కాగ్ నివేదికపై టెలికం ఆపరేటర్లు ఒక సంయుక్త ప్రకటనలో అభ్యంతరాలను వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఆదాయాల లెక్కింపు జరిగిందని వివరించాయి. నివేదిక వల్ల ఏదైనా అదనపు భారం పరిస్థితి ఎదురయితే... ఈ సమస్యను పరస్పర చర్చల ద్వారా కానీ లేక, కోర్టుల ద్వారా కానీ పరిష్కరించుకుంటామని కూడా పేర్కొన్నాయి. కాగ్ పేర్కొన్నట్లు అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ తక్కువ లెక్కలను కంపెనీల వారీగా చూసి నోటీసుల భారాన్ని పరిశీలిస్తే- రూ.3,728.54 కోట్లతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ వరుసలో మొదట ఉంది. తరువాత వరుసలో టాటా టెలిసర్వీసెస్ (రూ.3,215.39 కోట్లు), ఎయిర్టెల్ (రూ.2,651.89 కోట్లు), ఒడాఫోన్ (రూ.1,665.39 కోట్లు), ఐడియా (రూ.964.89 కోట్లు), ఎయిర్‌సెల్ (రూ.262.83 కోట్లు) ఉన్నాయి.