పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ట్యాక్స్ పేయర్స్‌కు ఆదాయాపు పన్ను శాఖ అధికారులు జారీ చేసిన డిమాండ్ నోటీసులకు అప్పీల్ చేసుకునే సమయాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ట్యాక్స్ పేయర్స్ భారీ ఊరట లభించినట్లైంది.
జీఎస్టీ కౌన్సిల్ ట్యాక్స్‌పేయర్స్ కోసం జీఎస్‌టీ అమ్నెస్టీ పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. స్కీమ్ వివరాల్ని రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్ర ప్రకటించారు. ఆ వివరాల ప్రకారం..పన్ను చెల్లింపు దారులు ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను (ఐటీఆర్‌ని) దాఖలు చేసిన తర్వాత ట్యాక్స్ అధికారులు సంబంధిత వివరాలు ఈ వివరాలన్నీ సరిపోలుతున్నాయో లేదో తెలుసుకోవడానికి డిక్లరేషన్‌లు, చెల్లించిన పన్నులను పరిశీలిస్తుంది. ఒకవేళ ట్యాక్స్ పేయర్స్ చెల్లించాల్సిన దానికంటే తక్కువ మొత్తం ట్యాక్స్ కడితే.. ఆదాయ పన్ను శాఖ డిమాండ్ నోటీసు జారీ చేస్తుంది.
అప్పీల్ సమయం మరింత పొడిగింపు
అయితే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్‌టీ మండలి 52వ సమావేశంలో డిమాండ్ ఆర్డర్స్‌పై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ట్యాక్స్ అధికారులు జారీ చేసిన ఆదేశాలపై ఎవరైనా అసెసీ అప్పీలు చేయాలంటే మూడు నెలల సమయమే ఉంటుంది. దీనిని మరో నెల వరకు పొడిగించడానికి మాత్రమే అవకాశం ఉంటుంది.
అదనంగా పన్ను డిమాండ్ డిపాజిట్
అయితే జీఎస్‌టీ మండలి సమావేశంలో జీఎస్‌టీ నమోదిత వ్యాపారాలకు అదనపు సమయాన్ని ఇచ్చింది. ఇందు కోసం ప్రస్తుతం జమ చేస్తున్న 10 శాతం పన్ను డిమాండ్ డిపాజిట్‌కు బదులు 12.5 శాతం జమ చేయాల్సి ఉంటుంది.
భారీ ఉపశమనం
దీంతో పాటు తాత్కాలికంగా అటాచ్ చేసిన ఆస్తులను ఏడాది పూర్తయిన తర్వాత విడుదల చేసేలా జీఎస్‌టీ నిబంధనలను సవరించింది. జీఎస్‌టీ చట్టం ప్రకారం, పన్ను చెల్లించని జీఎస్‌టీ రిజిస్టర్డ్ సంస్థల బ్యాంకు ఖాతాలు సహా ఇతర ఆస్తులను పన్ను అధికారులు తాత్కాలికంగా జప్తు చేయవచ్చు. అలాంటి అటాచ్ మెంట్ ఏడాది పాటు చెల్లుబాటు అవుతుందని కౌన్సిల్ నిర్ణయాన్ని సంజయ్ మల్హోత్ర తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment