ITIR
-
బిగ్ రిలీఫ్ : పన్ను చెల్లింపు దారులకు కేంద్రం శుభవార్త!
పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ట్యాక్స్ పేయర్స్‌కు ఆదాయాపు పన్ను శాఖ అధికారులు జారీ చేసిన డిమాండ్ నోటీసులకు అప్పీల్ చేసుకునే సమయాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ట్యాక్స్ పేయర్స్ భారీ ఊరట లభించినట్లైంది. జీఎస్టీ కౌన్సిల్ ట్యాక్స్‌పేయర్స్ కోసం జీఎస్టీ అమ్నెస్టీ పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. స్కీమ్ వివరాల్ని రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్ర ప్రకటించారు. ఆ వివరాల ప్రకారం..పన్ను చెల్లింపు దారులు ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను (ఐటీఆర్‌ని) దాఖలు చేసిన తర్వాత ట్యాక్స్ అధికారులు సంబంధిత వివరాలు ఈ వివరాలన్నీ సరిపోలుతున్నాయో లేదో తెలుసుకోవడానికి డిక్లరేషన్లు, చెల్లించిన పన్నులను పరిశీలిస్తుంది. ఒకవేళ ట్యాక్స్ పేయర్స్ చెల్లించాల్సిన దానికంటే తక్కువ మొత్తం ట్యాక్స్ కడితే.. ఆదాయ పన్ను శాఖ డిమాండ్ నోటీసు జారీ చేస్తుంది. అప్పీల్ సమయం మరింత పొడిగింపు అయితే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ మండలి 52వ సమావేశంలో డిమాండ్ ఆర్డర్స్‌పై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ట్యాక్స్ అధికారులు జారీ చేసిన ఆదేశాలపై ఎవరైనా అసెసీ అప్పీలు చేయాలంటే మూడు నెలల సమయమే ఉంటుంది. దీనిని మరో నెల వరకు పొడిగించడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అదనంగా పన్ను డిమాండ్ డిపాజిట్ అయితే జీఎస్టీ మండలి సమావేశంలో జీఎస్టీ నమోదిత వ్యాపారాలకు అదనపు సమయాన్ని ఇచ్చింది. ఇందు కోసం ప్రస్తుతం జమ చేస్తున్న 10 శాతం పన్ను డిమాండ్ డిపాజిట్‌కు బదులు 12.5 శాతం జమ చేయాల్సి ఉంటుంది. భారీ ఉపశమనం దీంతో పాటు తాత్కాలికంగా అటాచ్ చేసిన ఆస్తులను ఏడాది పూర్తయిన తర్వాత విడుదల చేసేలా జీఎస్టీ నిబంధనలను సవరించింది. జీఎస్టీ చట్టం ప్రకారం, పన్ను చెల్లించని జీఎస్టీ రిజిస్టర్డ్ సంస్థల బ్యాంకు ఖాతాలు సహా ఇతర ఆస్తులను పన్ను అధికారులు తాత్కాలికంగా జప్తు చేయవచ్చు. అలాంటి అటాచ్ మెంట్ ఏడాది పాటు చెల్లుబాటు అవుతుందని కౌన్సిల్ నిర్ణయాన్ని సంజయ్ మల్హోత్ర తెలిపారు. -
గడువు లోపు ‘ITR’ ఫైలింగ్ చేయకపోతే ఏమవుతుంది?
2023- 24 సంవత్సరానికి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) ఫైలింగ్ దాఖలు చేసేందుకు గడువు ఈ రోజుతో ముగియనుంది. పలు నివేదికల ప్రకారం.. నిన్న (జులై 30) సాయంత్రం 6 : 30 గంటల సమయానికి మొత్తం 6 కోట్ల మంది ట్యాక్స్ పేయర్లు ఐటీఆర్‌లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఐటీఆర్ ఫైలింగ్ చేసే సమయంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలపై పన్ను చెల్లింపు దారులు ఐటీ శాఖకు ఫిర్యాదు చేశారు. ఫైలింగ్ చేస్తున్నా కావడం లేదని, జులై 31, 2023 వరకు ఉన్న ఫైలింగ్ గడువు తేదీని పొడిగించాలని కోరారు. అందుకు ఐటీ శాఖ ఈ- ఫైలింగ్ పోర్టల్ పనితీరు బాగుంది. ఫైలింగ్ సమయంలో మీకు ఏమైనా సమస్యలు ఎదురైతే మమ్మల్ని సంప్రదించొచ్చు’ అని ట్వీట్ చేసింది. ఒక వేళ ఐటీ శాఖ ఇచ్చిన డెడ్‌లైన్ జులై 31లోపు ఐటీఆర్ ఫైలింగ్ చేయకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. లేట్ ఫీ పన్నులు చెల్లింపు దారులు ఐటీ శాఖ ఇచ్చిన గడువులోపు ట్యాక్స్ ఫైలింగ్ చేయకపోతే లేట్ ఫీ రూ.5,000 చెల్లించాలి. అనతరం డిసెంబర్ 31లో మరో సారి ఐటీఆర్‌లు దాఖలు చేసుకోవచ్చు. ఒకవేళ, పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయం రూ. 5,00,000 మించకపోతే రూ.1,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి (రూ.3లక్షల) కంటే తక్కువగా ఉంటే పన్ను చెల్లింపుదారులకు లేట్ ఫీ ఛార్జీలు వర్తించవు. . వడ్డీ ఒకవేళ, రిటర్న్ దాఖలు చేయడంలో జాప్యం జరిగితే ట్యాక్స్ పేయర్స్ చెల్లించే పన్నులో నెలకు 1 శాతం చొప్పున ఆదాయపు పన్ను శాఖ వడ్డీని వసూలు చేస్తుంది. ఒక కొనుగోలుదారుడికి ఏదైనా వస్తువును అమ్మేటప్పుడు అమ్మకందారు వసూలు చేసే ట్యాక్స్ టీసీఎస్, జీతాలు, కమీషన్, వడ్డీలు, డివిడెంట్లు ఇలా వివిధ రకాల ఆదాయ వనరులపై విధించే ట్యాక్స్ టీడీఎస్, ముందస్తు పన్ను, చట్టం క్రింద లభించే ఇతర ట్యాక్స్ రిలీఫ్/ట్యాక్స్ క్రెడిట్ల తగ్గింపు తర్వాత నికర ఆదాయంపై విధించే పన్నుపై వడ్డీ వర్తిస్తుంది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో ఒక రోజు ఆలస్యానికి కూడా ఒక నెల వడ్డీ వసూలు చేస్తారు. ట్యాక్స్ మినహాయింపు ఉండదు నిర్ణీత గడువులోగా పన్ను రిటర్న్‌ను దాఖలు చేయకపోవడం వల్ల భవిష్యత్ సంవత్సరాల్లో ట్యాక్స్ మినహాయింపు పొందే అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. వీటితో పాటు హౌస్ ప్రాపర్టీ, ఇతర విభాగాల్లో ట్యాక్స్‌ను ఆదా చేసుకోలేము. జరిమానా, జైలు శిక్ష జరిమానాలతో పాటు, పన్ను రిటర్నులను దాఖలు చేయడంలో విఫలమైతే జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. చెల్లించాల్సిన పన్ను లేదా, ఎగవేత రూ. 25,000 కంటే ఎక్కువ ఉన్న రిటర్న్‌లను ఆలస్యంగా దాఖలు చేస్తే , 6 నెలల నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. ట్యాక్స్ రిఫండ్ లేనట్లే టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ .. ఈ మూడింటిని కలిపితే మీరు చెల్లించిన మొత్తం పన్ను అవుతుంది. మదింపు చేసిన తర్వాత చెల్లించాల్సిన పన్ను భారం కన్నా మీరు కట్టిన పన్ను మొత్తం ఎక్కువగా ఉంటే రిఫండు ఇస్తారు. అదీ సకాలంలో ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడే. సమయానికి ఐటీఆర్ ఫైల్ చేయకపోవడం వల్ల ట్యాక్స్ రిఫండ్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదీ చదవండి ➤ ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంచండి.. ఐటీ శాఖ రెస్పాన్స్ ఇదే.. -
ఆదాయపు పన్ను రిటర్న్ ఫారమ్‌లను విడుదల చేసిన ఐటీ శాఖ!
మార్చి 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు కొత్త బడ్జెట్‌కు సంబంధించిన ఆలోచనలు, సమావేశాలు, సంప్రదింపులు, ప్లానింగ్ విషయాలు .. మొదలైన వాటిని పక్కన పెట్టండి. 2023 ఏప్రిల్ 1 నుంచి వాటి గురించి ఆలోచిద్దాం. ఈలోగా 2023 మార్చి 31లోపల మనం ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన ఆలోచనలు, సమాలోచనలు, ప్లానింగ్ ఆలోచిద్దాం. 2023 మార్చి 31తో పూర్తయ్యే ఆర్థిక సంవత్సరానికి కొంత మందికి గడువు తేదీ 31–07–2023; మరికొందరికి సెప్టెంబర్ నెలాఖరు. అందుకు గాను ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 10న కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లో మీరు మార్చి నెల తర్వాత డిపార్టుమెంటు వారికి దాఖలు చేయాల్సిన రిటర్నుల గురించి .. ఫారమ్‌లు, వాటిని దాఖలు చేసినప్పుడు మీకు వచ్చే అక్నాలెడ్జ్మెంట్ గురించి.. నోటిఫై చేశారు. ►ఈ ఫారాలు 01–04–2023 నుండి అమల్లోకి వస్తాయి. ►డిపార్టుమెంట్ వారి భాష ప్రకారం 2023–24 అసెస్మెంట్ సంవత్సరానికి వర్తించేవి అనాలి. ►ఈ ఫారాలు ఏమిటంటే..ఐటీఆర్ 1 సహజ్, ఐటీఆర్ 2, ఐటీఆర్ 4 సుగమ్, ఐటీఆర్ 5,ఐటీఆర్ 6 ►పైన పేర్కొన్న ఫారాలు దాఖలు చేస్తే మీకు వచ్చే ఐటీ అక్నాలెడ్జ్మెంటు ఐటీఆర్విని కూడా నోటిఫై చేశారు. ► అన్ని ఫారాల్లోనూ షెడ్యూళ్లు ఉన్నాయి. ►2022 అక్టోబర్‌లోనే రూల్స్ విడుదల చేశారు. ►ఉద్యోగస్తులకు సర్క్యులర్ డిసెంబర్లోనే విడుదల చేశారు. ►‘‘డౌన్లోడ్స్’’ కింద ఐటీఆర్ ఆఫ్‌లైన్ యుటిలిటీ ద్వారా ఆఫ్‌లైన్ సదుపాయం ఉంది. ►సాంకేతికంగా సులువుగా, త్వరగా వేసేలా తగిన చర్యలు తీసుకున్నారు. ►ప్రస్తుతం ఒకొక్కప్పుడు తప్పులు దొర్లుతున్నాయి. ‘డేటా’ .. అంటే సమాచారమనేది సిస్టంలోకి ప్రీ–ఫిల్ అవడం లేదు. పూర్తి సమాచారం లేదని చూపుతోంది. ►ఎక్సెల్ వెర్షన్లో ‘సబ్మిట్’కి ఎక్కువ వ్యవధి తీసుకుంటోంది. ►షెడ్యూల్స్ నింపేటప్పుడు కొన్ని తప్పులు దొర్లుతున్నాయి. షెడ్యూల్స్ ఎంపిక చేసేటప్పుడు గందరగోళం, గజిబిజి ఏర్పడుతోంది. స్పష్టత ఉండటం లేదు. ఒక్కొక్కప్పుడు మొరాయిస్తోంది. ► ఇలాంటివి ఉండవని ఆశిద్దాం. ► మీరు స్వయంగా వేసుకుంటే మీ స్వంత అనుభవాన్ని మించిన పాఠం లేదు. ► వృత్తి నిపుణులకి ఇస్తే సమగ్ర సమాచారాన్ని సకాలంలో ఇవ్వండి. -
పనితీరు బ్రహ్మాండం..ఐటీఆర్ ఫైలింగ్ పోర్టల్‌పై ఇన్ఫోసిస్!
బెంగళూరు: ఆదాయ పన్ను శాఖ ఈ–ఫైలింగ్ పోర్టల్, జీఎస్టీ నెట్వర్క్ వెబ్సైటు ‘చాలా బాగా’ పనిచేస్తున్నాయని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్ తెలిపారు. ఐటీ రిటర్నుల దాఖలు ప్రక్రియ సజావుగా జరిగిందని ఆయన చెప్పారు. జూలైలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదు కావడం, డెడ్‌లైన్ 31 నాటికి 5.8 కోట్ల పైచిలుకు ఐటీ రిటర్నులు దాఖలు కావడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ ఐటీ శాఖ ఈఫైలింగ్ పోర్టల్ ప్రాజెక్ట్‌ను 2019లో ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కు అప్పగిచ్చింది. ఈ నేపథ్యంలో గతేడాది జూన్‌లో ఈ-ఫైలింగ్ కొత్త పోర్టల్‌ను ఇన్ఫోసిస్ లాంచ్ చేసింది. నాటి నుంచి కొత్త పోర్టల్‌లో ఏదో ఒక్క సమస్య ఎదురవుతూనే ఉంది. సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తడం,ట్యాక్స్ రిటర్న్ గడువు తేదీలను మార్చడం పరిపాటిగా మారిందే తప్పా. ఆ పోర్టల్ పనితీరు మాత్రం మారిన దాఖలాలు లేవంటూ ట్యాక్స్ పేయర్స్, నిపుణులు ఇన్ఫోసిస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఈ తరుణంలో ఐటీఆర్ ఫైలింగ్ పోర్టల్ పనితీరుపై ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్ స్పందించారు. చదవండి👉 ష్..కథ మళ్లీ మొదటికొచ్చింది, ఇన్ఫోసిస్ ఇదేం బాగాలేదు! -
తెలంగాణా రాష్ట్రానికి ఐటీఐఆర్ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)’ విధానాన్ని పునః సమీక్షించాలని.. హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ఏర్పా టు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రూ.57 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఐటీ ఎగుమతులు ఏడున్నరేళ్లలో రూ.1.47 లక్షల కోట్లకు చేరాయని.. ఈ రంగంలో రాష్ట్రానికి మరింత ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో 24వ ఈ–గవర్నెన్స్ జాతీయ సదస్సును కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌తో కలసి కేటీఆర్ ప్రారంభించి మాట్లాడారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు ఎలక్ట్రానిక్క్లస్టర్లను అభివృద్ధి చేశామని.. మరో రెండు క్లస్టర్లను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. బెంగళూరు, అహ్మదాబాద్ తరహాలో అంతరిక్ష పరిశోధనలకు కేంద్రంగా, అనేక రక్షణ రంగ పరిశోధన సంస్థలకు నిలయంగా ఉన్న హైదరాబాద్‌లో.. ఇన్‌స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచీ పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన పౌరసేవలు అందించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 2017లో ‘మీసేవ’ను ఆధునీకరించామని.. రాష్ట్రంలోని 4,500 కేంద్రాల ద్వారా రోజూ లక్ష మందికి సేవలు అందించే వేదికగా తీర్చిదిద్దామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ‘ఈ–తాల్’ గణాంకాల ప్రకారం ‘మీసేవ’ దేశంలోనే తొలి స్థానంలో ఉందన్నారు. స్మార్ట్ గవర్నెన్స్ కోసం.. ఎమర్జింగ్ టెక్నాలజీ ఆధారిత స్మార్ట్ గవర్నెన్స్ కోసం ఎస్తోనియాతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. 2019 నుంచి ఈ టెక్నాలజీ ఆధారంగా పౌర సేవలు నిరంతరం అందిస్తున్నామని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సుల రెన్యూవల్ నుంచి రిటైర్డ్ ఉద్యోగుల లైఫ్ సర్టిఫికెట్లు, ఓటర్ల గుర్తింపు వంటి అనేక అంశాల్లో ఈ–గవర్నెన్స్‌కు పెద్దపీట వేస్తున్నామన్నారు. టీ–ఫైబర్ ద్వారా మొదటిదశలో రాష్ట్రంలోని 30వేల ప్రభుత్వ కార్యాలయాలను, రెండో దశలో 51 లక్షల గ్రామీణ, 32 లక్షల పట్టణ గృహాలను ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో 3 కేటగిరీల్లో 2021 ఈ–గవర్నెన్స్ జాతీయ అవార్డులను అందజేశారు. తెలంగాణ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన ‘మన ఇసుక వాహనం’కు అవార్డు లభించింది. తెలంగాణలో ఎంతో ‘స్పేస్’ దేశ అంతరిక్ష రంగంలో ప్రైవేటుకు ద్వారాలు తెరిచామని.. ఇప్పటికే అంతరిక్ష రంగ స్టార్టప్‌లకు వేదికగా ఉన్న తెలంగాణకు ఈ రంగంలో అద్భుత అవకాశాలు ఉన్నాయని జితేంద్రసింగ్ అన్నారు. అంతరిక్ష రంగ సాంకేతికతలో ప్రపంచ ప్రమాణాలను అందుకునే శక్తి రాష్ట్రానికి ఉందన్నారు. ఈ మేరకు అంతరిక్ష పరిశోధనలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు విషయంలో రాష్ట్రానికి అండగా ఉంటామన్నారు. కోవిడ్ సమయంలో డిజిటల్ గవర్నెన్స్ తో ప్రజలను చేరుకోగలిగామని చెప్పారు. ప్రధాని మోదీ కృషి వల్లే దేశంలో డిజిటల్ జీవితం సాధ్యమవుతోందన్నారు. పౌరసేవల్లో రాష్ట్రాలు అమలు చేస్తున్న ఈ–గవర్నెన్స్ విధానాల్లోని సారూప్య అంశాలను జోడిస్తూ కొత్త నమూనాకు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయం ప్రకటించండి
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఆరేళ్లుగా అద్భుత ప్రగతి సాధిస్తున్న హైదరాబాద్ నగరానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) లేదా దానికి ప్రత్యామ్నాయాన్ని ప్రకటించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కోరారు. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఆదివారం లేఖ రాశారు. కోవిడ్ సంక్షోభ సమయంలోనూ తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. జాతీయ సగటు 1.9 శాతంతో పోలిస్తే.. తెలం గాణ 7 శాతం వృద్ధి రేటుతో ఎగుమతులు రూ.1.4 లక్షల కోట్లకు చేరాయన్నారు. అ లాగే ఆఫీస్ స్పేస్ 8.7 మిలియన్ చదరపు అడుగులు పెరిగిందని, అమెజాన్ వెబ్ సర్వీసెస్, గోల్డ్‌మాన్ సాక్స్, ఫియట్ క్రిస్లార్ ఆటోమొబైల్స్ వంటి ప్రముఖ కంపెనీలు తెలంగాణకు పెట్టుబడులతో వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎమర్జింగ్ టెక్నాలజీతో పాటు పరిశోధన, అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కోసం అనేక పాలసీలు రూపొందించామని తెలిపారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో ఐటీ రంగం వృద్ధికి అనువైన వాతావరణం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఐటీలో హైదరాబాద్‌ను ప్రోత్సహించండి హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సం బంధించి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేం ద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కలిశారని, తాను కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి స్పందన లేదన్నా రు. ఐటీఐఆర్‌పై కేంద్రం చేస్తున్న తాత్సారంతో ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆందోళన వ్య క్తం చేశారు. దేశానికి ఆర్థిక ఇంజన్లుగా పనిచేస్తున్న హైదరాబాద్ లాంటి నగరాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాలన్నారు. ఐటీఐఆర్‌పై యువత ఆశలను అడియాశలు చేయొద్దని లేఖలో పేర్కొన్నారు. -
ఐటీఐఆర్‌కు పైసా ఇవ్వలేదు
సాక్షి, హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌కు (ఐటీఐఆర్) యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు ఒక్క పైసా ఇవ్వలేదని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వం తన పదవీ కాలం చివరి సమయంలో ఐటీఐఆర్‌ను తీసుకొచ్చినా ఒక్క రూపాయి ఇవ్వలేదని, కొత్త ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. కేంద్రాన్ని దాదాపు పది సార్లునేరుగా కలిసి అడిగినా, లేఖలు రాసినా స్పందించలేదని శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి వెల్లడించారు. నాటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వనందుకే ఐటీఐఆర్ ఇవ్వలేదని మాట్లాడారని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖలను ఆ మరుసటి రోజే దత్తాత్రేయకు చూపించామని తెలిపారు. దీనిపై అప్పటి సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సైతం ఐటీఐఆర్ మా పాలసీ కాదని, దాన్ని ముందుకు తీసుకెళ్లమని స్పష్టం చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి ఆగలే దన్నారు. గడిచిన ఏదేళ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపు అయ్యాయని తెలిపారు. ఐటీ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి సభ్యులు గాదరి కిషోర్ కుమార్, కేపీ వివేకానంద్, కాంగ్రెస్ సభ్యుడు డి.శ్రీధర్‌బాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ.. 2014–15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ రూ.52 వేల కోట్లు కాగా, 2018–19 నాటికి రూ.1.09 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలతో రాష్ట్ర ఐటీలో 17 శాతం వృద్ధిని సాధించామని చెప్పారు. హైదరాబాద్ నలువైపులా ఐటీ కంపెనీలను విస్తరిస్తామని, కరీంనగర్లో వచ్చే నెలలో ఐటీ టవర్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా బీపీవో సంస్థలు ప్రారంభం అయ్యాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మురుగు శుద్ధి లేకే జ్వరాలు: అక్బరుద్దీన్ హైదరాబాద్‌లో కేవలం 30% మాత్రమే మురుగు శుద్ధి జరుగుతోందని, కావాల్సినన్ని సీవరేజీ ట్రీట్‌మెంట్‌ప్లాంట్లు (ఎస్టీపీ) లేకపోవడంతో మురుగు పెరుగుతోందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మురుగు శుద్ధి జరగక నగరంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు ప్రబలుతున్నాయని, దోమలు విజృంభిస్తున్నాయన్నారు. ఆరోగ్య అత్యయిక పరిస్థితి నెలకొందని, మురుగు శుద్ధి లేకపోవడం, మూసీ నదిలో వదులుతున్న వ్యర్థాలే దీనంతటికీ కారణమన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ బదులిస్తూ.. నగరంలో 735 ఎంఎల్డీల మురుగును శుద్ధి చేసే ఎస్టీపీలు 21 ఉన్నాయని, అయితే ఇవి చాలినంతగా లేవన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే 2021 నాటికి మరో 700 ఎంఎల్డీల మురుగును శుద్ధి చేసేలా, 2036 నాటికి 3 వేల ఎంఎల్డీల మురుగు శుద్ధి జరిగేలా ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. దోమల నివారణకు 200 జెట్టీ యంత్రాలతో స్ప్రే చేయిస్తున్నామని, డెంగీ నివారణపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆరోగ్య మంత్రి దీనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మురుగు పారుదల వ్యవస్థ బలోపేతం చేసేందుకు మాస్టర్‌ప్లాన్ తయారు చేసే బాధ్యతను ముంబైకు చెందిన షా కన్సల్టెన్సీకి అప్పగించిందని, ఈ నివేదిక డిసెంబర్లో వస్తుందని తెలిపారు. -
‘ఫార్మా సీటీ వద్దు.. ఐటీఐఆర్ ముద్దు’
సాక్షి, హైదరాబాద్: యూపీఏ అధికారంలో ఉండగా మంజూరైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్టు ఏర్పాటు జాప్యానికి పూర్తి బాధ్యత టీఆర్ఎస్దేనని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ‘ఫార్మా సిటీ వద్దు.. ఐటీఐఆర్ ముద్దు’ అనే నినాదంతో గురువారం ఇందిరాభవన్‌లో రంగారెడ్డి డీసీసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. విషం చిమ్మే ఫార్మా కంపెనీలపై మోజు పెంచుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల మందికి ఉపాధినిచ్చే ఐటీఐఆర్‌పై నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. లక్షల మందికి ఉపాధే లక్ష్యంగా నాడు కాంగ్రెస్ ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేస్తే అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్లు పూర్తిగా విస్మరించాయని కాంగ్రెస్ సీఎల్పీ ఉప నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. నాలుగేళ్లలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏపాటిదో ఐటీఐఆర్ ప్రాజెక్టు విషయంలో తేటతెల్లమవుతోందని అన్నారు. లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టుపై మెతక వైఖరి అవలంభిస్తున్న సీఎం కేసీఆర్ తన ఇంట్లో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన సమయంలో రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు ఉంటే ఇప్పటివరకు కేవలం 18 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ప్రాజెక్టుగా వెలుగొందే అవకాశమున్న ఐటీఐఆర్‌ను నిర్లక్ష్యం చేయడం తగదని కేసీఆర్‌కు సూచించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ చేపడితే టీఆర్ఎస్ ప్రభుత్వం దాని డిజైన్ మార్చి రంగారెడ్డి జిల్లా ప్రజలకు అన్యాయం చేసిందని జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాగా, ఐటీఐఆర్ ఏర్పాటుపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని జీవన్ రెడ్డికి మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశం, కిసాన్ సెల్ ఛైర్మన్ కోదండ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం తాజా నిర్ణయంతో ఏపీకి మరో షాక్
-
విశాఖ ఐటీఐఆర్‌లో ముందడుగు లేదు
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలనుకున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్ రీజియన్(ఐటీఐఆర్) ప్రతిపాదన( ఆగస్టు 26, 2014)ను ఇంకా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి పంపించలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయమంత్రి ఆల్ఫోన్స్ కన్నాంతనమ్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం తరుపున లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. గతంలో భువనేశ్వర్‌లో కూడా ఐటీఐఆర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన కూడా వచ్చిందని అయితే దీని ఏర్పాటులో సమగ్రంగా పున: పరిశీలించాలని ఆదేశించామని, ఆ ఆదేశాల అనంతరం అందులో సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ సవరణ మేరకు కేబినెట్ కమిటీకి ఒక నోట్ కూడా సమర్పించామని, అది జరిగితే ఏపీ ప్రతిపాదనను పంపిస్తామన్నారు. అలాగే జీఎస్టీ తర్వాత రైల్వే కాంట్రాక్ట్ పనుల విషయంలో కోరిన వివరణకు కూడా కేంద్రం సమాధానం చెప్పింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత దక్షిణ మధ్య రైల్వేలోని ఓపెన్ లైన్, కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్‌లో కాంట్రాక్టర్లు తాత్కాలికంగా పనులు నిలిపేసిన విషయం వాస్తవమేనని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజేన్ గోహైన్ తెలిపారు. అయితే, శాఖ పరమైన వనరులను తరలించి ఎక్కడ అవసరం అయితే అక్కడ ట్రాక్ భద్రత పనులు కొనసాగేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. విజయసాయిరెడ్డి ప్రశ్నల వివరాల పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
అన్ని సిద్ధమయ్యాకే ఏపీకి ప్రత్యేక హైకోర్టు
న్యూఢిల్లీ: కోర్టు భవనాలు, న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బందికి క్వార్టర్లు తదితర అవసరమైన వసతులన్నీ సిద్ధమైన తర్వాతే ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు జరుగుతుందని న్యాయశాఖ సహాయమంత్రి పీపీ చౌదరి స్పష్టం చేశారు. శుక్రవారం రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. హైదరాబాద్‌లోని హైకోర్టు జ్యూడికేచర్తో సంప్రదించి ఈ వసతులన్నీ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కోసం అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం...హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఏపీ సీఎంని కోరినట్లు మంత్రి వెల్లడించారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం ప్రస్తుతం హైదరాబాద్‌లోని హైకోర్టు విచారణలో ఉన్నట్లు చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్ విజభన చట్టం ప్రకారం ఏపీలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏపీలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసిన పిమ్మట ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళ్లిపోతుంది. అప్పటివరకూ హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా పని చేస్తుంటుందని’ మంత్రి వివరించారు. కేంద్రం పరిశీలనలో విశాఖ ఐటీఐఆర్ విశాఖపట్నంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్ రీజియన్‌ను ఏర్పాటు చేయావలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 26, 2014లో తమకు ప్రతిపాదనలు పంపిందని రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి చౌదరి తెలిపారు. విశాఖలో ఐటీఐఆర్ ఏర్పాటు చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. -
ఇది కలయేనా?
* కదలికలేని ఐటీఐఆర్ * ప్రకటించి మూడేళ్లయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే * రూ. 3 వేల కోట్ల ఆర్థిక సాయంపై నోరు మెదపని కేంద్రం * ప్రాజెక్టులో మార్పుచేర్పులు చేయాలని యోచన! * మౌలిక వసతుల కల్పనకు ముందుకు రాని రాష్ట్ర సర్కారు * ప్రాజెక్టు సాకారమైతే హైదరాబాద్ మరో సిలికాన్ వ్యాలీ ప్రయోజనాలివి.. → హైదరాబాద్ మరో సిలికాన్ వ్యాలీగా అవతరిస్తుంది. → వందలాది హార్డ్‌వేర్ కంపెనీలు, చిప్స్ తయారీ యూనిట్లు, స్టార్టప్స్ కంపెనీల ఏర్పాటు. → 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో రహదారులు, మౌలిక వసతుల కల్పన. → ఔటర్ రింగ్‌రోడ్‌కు లోపలున్న సుమారు 165 గ్రామపంచాయతీల పరిధిలో అభివృద్ధి. → చైనా నుంచి కంప్యూటర్లలో వినియోగించే చిప్స్‌ను దిగుమతి చేసుకోకుండా దేశీయంగా ఇక్కడే తయారు చేసుకునే అవకాశం. సాక్షి, హైదరాబాద్ లక్షలాది కొలువులు.. రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రవాహం.. ఐటీలో మేటిగా నిలిచే అద్భుత అవకాశం.. స్థూలంగా ఇదీ ఐటీఐఆర్!! భాగ్యనగరం రూపురేఖలే మార్చేసే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మూడేళ్ల కిందట నాటి యూపీఏ సర్కారు ప్రకటించిన ఈ ప్రాజెక్టు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది. 2018 నాటికి ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా ఇప్పటిదాకా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఈ పథకానికి అందజేయాల్సిన రూ. 3 వేల కోట్ల ఆర్థిక సాయంపై కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అంతేకాదు.. ఈ ప్రాజెక్టులో పలు మార్పుచేర్పులు చేయాలని ఎన్డీఏ సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది. అందువల్లే రూ.3 వేల కోట్ల సాయం ఇంకా రాష్ట్ర సర్కారుకుఅందలేదు. కేంద్రం పైసా విదల్చకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిత ప్రాజెక్టు పరిధిలో వసతుల కల్పన అంశంపై చేతులెత్తేసింది. దీంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(ఐటీఐఆర్) ప్రాజెక్టు ‘కల’గానే మిగిలిపోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ ప్రాజెక్టు స్వరూపం: సుమారు 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో మూడు క్లస్టర్లుగా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఉప్పల్-పోచారం, సైబరాబాద్-శంషాబాద్ ఎయిర్పోర్ట్(గ్రోత్ కారిడార్-1), శంషాబాద్-ఉప్పల్(గ్రోత్ కారిడార్-2) పరిధిలో 2018 నాటికి ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేయాలని సంకల్పించారు. ఐటీఐఆర్‌తో నగరానికి రూ.2.18 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించవచ్చని ప్రతిష్టాత్మక అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ప్రైస్ వాటర్ కూపర్స్ అంచనా వేసింది. ఇది సాకారమైతే సుమారు 25 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితి ఇదీ.. ఐటీఐఆర్ పరిధిలో ఐటీ, హార్డ్‌వేర్ పరిశ్రమలు తరలిరావాలంటే రూ.13,093 కోట్ల అంచనా వ్యయంతో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని 2013లోనే ప్రైస్ వాటర్ కూపర్ సంస్థ అంచనా వేసింది. ఇందులో రూ.3 వేల కోట్లు భరిస్తామని కేంద్రం అప్పట్లో చెప్పింది. మిగతా రూ.10,093 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని నిర్దేశించింది. వసతుల కల్పనలో ప్రధానంగా మంచినీరు, మురుగు నీటి పారుదల, వాననీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రహదారుల విస్తరణ వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. అయితే నేటికీ కార్యాచరణ మొదలు కాలేదు. కేంద్రం నయా పైసా ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా చేపట్టాల్సిన పనులపై మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో ప్రాజెక్టుపై ముందడుగు పడడం లేదు. కంపెనీలు వస్తున్నాయి: జయేష్ రంజన్, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ మంత్రిత్వ శాఖ, టీఎస్ఐఐసీ తీసుకుంటున్న చర్యలతో ఐటీఐఆర్ రీజియన్ పరిధిలో సంస్థల ఏర్పాటుకు పలు ఐటీ, హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, మొబైల్ ఫోన్ కంపెనీలు తరలివస్తున్నాయి. ఇప్పటికే యాపిల్, మైక్రోమ్యాక్స్, గూగుల్, ఊబర్ వంటి కంపెనీలు ప్రత్యేక క్యాంపస్‌లు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ రీజియన్‌లో దశల వారీగా మౌలిక వసతులు కల్పిస్తాం. దశల వారీగా పనులు చేపట్టాలి: రమేశ్ లోకనాథన్, హైసియా అధ్యక్షులు ఐటీఐఆర్ పరిధిలో ఐటీ, హార్డ్‌వేర్ పరిశ్రమలు నెలకొల్పేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. ఈ పరిధిలో దశలవారీగా మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న ఐటీ పాలసీలో దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నాం. మణికొండ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల అభివృద్ధికి సుమారు 15 ఏళ్ల సమయం పట్టింది. ఐటీఐఆర్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు నిధుల అవసం ఇదీ...(రూ.కోట్లలో) మొదటి దశ: 2013-2018 పనులు కావాల్సిన నిధులు రోడ్లు (డ్రెయిన్లు, వంతెనలు) 2,320 మురుగునీటి వ్యవస్థ 1.084 ఘన వ్యర్థాల నిర్వహణ 105 నీటిసరఫరా 6,355 విద్యుద్దీకరణ 2,111 టెలికాం నెట్వర్క్ 145 వాననీటి సంరక్షణ, 156 భూముల అభివృద్ధి 817 మొత్తం 13,093 -
ఐటీఐఆర్‌కు మరిన్ని నిధులివ్వండి
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ఐటీఐఆర్‌కు ఈ ఏడాది కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని, మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. శనివారం సచివాలయంలో కేసీఆర్‌ను రవిశంకర్ ప్రసాద్ కలిశారు. ఈ సందర్భంగా.. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక తపాలా సర్కిల్‌ను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్ తెలిపారు. ప్రత్యేక సర్కిల్‌తోపాటు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ పోస్టుకు కూడా అనుమతినిచ్చినట్లు ఆయన వెల్లడించారు. కాగా.. కేంద్రం ప్రకటించిన ‘సాంకేతిక, సమాచార పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్)’ కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాంతాలను గుర్తించిందని.. విద్య, వైద్య సంబంధిత మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇక్కడున్న పలు సాఫ్ట్వేర్ కంపెనీలు కోరుతున్నాయని సీఎం కేసీఆర్ రవిశంకర్‌ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. ఐటీఐఆర్‌కు మొదటి దశ కింద ఈ ఏడాది కేంద్రం కేటాయించిన రూ. 165 కోట్లు ఏమాత్రం సరిపోవని... మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ ప్రపంచంలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపునిచ్చిందని కూడా కేంద్ర మంత్రికి వివరించారు. దీనిపై రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ... జాతీయంగా, అంతర్జాతీయంగా హైదరాబాద్ ఐటీ హబ్‌గా, మేధావుల కేంద్రంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ఐటీ ఐఆర్‌కు సంబంధించి కేంద్రం నుంచి నిధులు రావాలంటే.. అందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని ముఖ్యమంత్రికి సూచించారు. భారీ పెట్టుబడులు వస్తాయి.. ఐటీఐఆర్ ప్రాంతంలో సాంకేతిక సమాచారం, ఐటీ సంబంధిత సర్వీసులు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ వివరించారు. హైదరాబాద్ చుట్టూ 202 చదరపు కిలోమీటర్ల పరిధి (49,913 ఎకరాలు)లో దీనిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఐటీఐఆర్ పరిధిలో మొత్తం రూ. 2,19,440 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందులో ఒక్క ఐటీ, ఐటీ ఈఎస్ విభాగాల్లోనే రూ. 1,18,355 కోట్లు, ఈహెచ్ఎమ్ సెక్టార్లో రూ. 1,01,085 కోట్ల పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఐటీఐఆర్‌లో మౌలిక సదుపాయాల కోసం కేంద్రం మొత్తంగా రూ. 4,863 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించిందని... మొదటి దశలో రూ. 942 కోట్లు, రెండో దశలో రూ. 3,921 కోట్లు ఇస్తామని తెలిపిందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పారిశ్రామిక విధానం గురించి వివరించారు. పారిశ్రామిక విధాన ప్రతిని కేంద్ర మంత్రికి అందించారు. కాగా ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై కేంద్ర మంత్రి అభినందించారు. ఐటీకి సంబంధించి ఎలాంటి సాయం కావాలన్నా.. సహకరించడానికి సిద్ధమని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు భవిష్యత్‌లో ఐటీ, బయోటెక్నాలజీ కేంద్రాలుగా పేరు తెచ్చుకుంటాయని కేంద్ర టెలీకమ్యూనికేషన్స్,ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ వచ్చిన ఆయన ఏపీ, తెలంగాణ సీఎంలను కలసిన అనంతరం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్లో విభజన పనులు పూర్తిచేసినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదించిందన్నారు. అలాగే, చిత్తూరు, కాకినాడ, తెలంగాణలోని మహేశ్వరం, మెదక్‌లలో ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు తట్టుకోవడం లేదన్నారు. అందుకే ఎన్డీయే కూటమిని బలహీనపరిచేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యేలు బద్దం బాల్‌రెడ్డి, ప్రేమ్‌సింగ్ రాథోడ్, మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి, దళిత్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు. -
నగరం చుట్టూ 14 ఐటీ క్లస్టర్లు
-
సిటీకి ఐటీ హారం
నగరం చుట్టూ 14 ఐటీ క్లస్టర్లు ఐటీఐఆర్‌లో భాగంగా చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సైబరాబాద్, విమానాశ్రయం పరిధిలోనే 82 శాతం ప్రాజెక్టు ఏరియా ఫలక్‌నుమా నుంచి విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు హెచ్ఎండీఏకు బృహత్ ప్రణాళిక రూపకల్పన బాధ్యతలు ఆశిస్తున్న పెట్టుబడులు 2,19,440 కోట్లు ఐటీఐఆర్ మౌలిక స్వరూపం.. ప్రాజెక్టు ఏరియా :49,913 ఎకరాలు ఆశిస్తున్న పెట్టుబడులు :2,19,440 కోట్లు ఉద్యోగావకాశాలు :15.4 లక్షలు (ప్రత్యక్షంగా) : 50.4 లక్షలు (పరోక్షంగా) మౌలిక సదుపాయాల కోసం కేంద్రమిచ్చే సాయం :4,863 కోట్లు కేంద్రం మంజూరు చేసింది : 3,275 కోట్లు ప్రాజెక్టు కాల పరిమితి తొలి విడత : 2013 - 2018 రెండో విడత : 2018 -2038 ఐటీ క్లస్టర్ల ఏర్పాటుకు గుర్తించిన ప్రాంతాలు మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ/ఆర్థిక జిల్లా, రాయదుర్గం, కొండాపూర్, తెల్లాపూర్, బహదూర్‌పల్లి, జవహర్‌నగర్, ఉప్పల్, పోచారం, హార్డ్‌వేర్ పార్కు, ఏపీఐఐసీ వర్క్ సెంటర్, ఫ్యాబ్ సిటీ, మహేశ్వరం సాక్షి, హైదరాబాద్: ‘సమాచార సాంకేతిక పరిజ్ఞాన పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్)’ ప్రాజెక్టు కింద హైదరాబాద్ నగరం చుట్టూ 14 ఐటీ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు నగరం చుట్టూ అనువైన ప్రాంతాలను గుర్తించింది. మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ/ఆర్థిక జిల్లా, రాయదుర్గం, కొండాపూర్, తెల్లాపూర్, బహదూర్‌పల్లి, జవహర్‌నగర్, ఉప్పల్, పోచారం, హార్డ్‌వేర్ పార్కు, ఏపీఐఐసీ వర్క్ సెంటర్, ఫ్యాబ్ సిటీ, మహేశ్వరం ప్రాంతాలు అందులో ఉన్నాయి. 49,913 ఎకరాల (202 చదరపు కిలోమీటర్ల) విస్తీర్ణంలో తలపెట్టిన ఐటీఐఆర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే... సైబరాబాద్ పరిధితో పాటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో ఐటీ విప్లవం రానుంది. ఐటీఐఆర్ ప్రాజెక్టు అవసరాల కోసం ఈ రెండు ప్రాంతాల నుంచే 82 శాతం స్థలాన్ని ప్రభుత్వం సేకరించనుంది. ఐటీఐఆర్ ప్రాజెక్టుకోసం ప్రతిపాదించిన 202 చదరపు కిలోమీటర్లలోని 41 శాతం (82.4 చ.కి.మీ.) ప్రాంతాన్ని ప్రాసెసింగ్ ఏరియా కోసం కేటాయించనున్నారు. అంటే ఈ ప్రాంతాల్లోనే ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు, వాటి కార్యాలయాలు ఏర్పాటవుతాయి. ఇలా ప్రాసెసింగ్ ఏరియాలో... 5.5 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఇప్పటికే అభివృద్ధి చెందిన గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో ఉండగా... మిగతాది అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు పరిధిలో మిగతా 59 శాతం ప్రాంతాన్ని ఐటీఐఆర్ పరిశ్రమల ఉద్యోగుల వసతికి కేటాయించనున్నారు. దీనికి నాన్ ప్రాసెసింగ్ ఏరియాగా పేరుపెట్టారు. సంక్షిప్త కార్యాచరణ నివేదికలో ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం ప్రణాళికను హెచ్ఎండీఏ రూపొందించనుంది. ప్రాజెక్టు వెలుపల వసతులకు కేంద్ర సాయం ఐటీఐఆర్ ప్రాజెక్టు వెలుపల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందజేస్తుంది. తొలి విడతగా వచ్చే ఐదేళ్లలో రూ.942 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ మొత్తంతో 2015 చివరికి ఉమ్దానగర్ నుంచి విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ లైను ఏర్పాటు, ఫలక్‌నుమా నుంచి విమానాశ్రయం వరకు డబ్లింగ్. నానల్‌నగర్ కూడలి-హెచ్‌సీయూ డిపో, పంజాగుట్ట-ఎడులనాగులపల్లి, మూసాపేట-బీహెచ్ఈఎల్ కూడలి, హెచ్‌సీయూ డిపో-వట్టినాగులపల్లి వరకు ఔటర్ రింగు రోడ్డును విస్తరించనున్నారు. అలాగే, గోల్కొండ, రాయదుర్గం, మణికొండ, మహేశ్వరంలలో భారీ సబ్ స్టేషన్లు నిర్మించనున్నారు. అంతర్గత వసతుల బాధ్యత రాష్ట్రానిదే.. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు అంతర్గత మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వమే కల్పించనుంది. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులతో పాటు ప్రాజెక్టు ప్రాంతంలో వసూలు చేసిన ఆస్తి పన్నులు, భూ వినియోగ మార్పిడి, లే అవుట్ల క్రమబద్ధీకరణ, ప్రాసెసింగ్ ఏరియాలోని భూముల లీజులు, విక్రయాలు తదితర మార్గాల్లో నిధులను సమకూర్చనుంది. రానున్న 25 ఏళ్లలో ఐటీఐఆర్ కోసం రాష్ట్రం రూ. 13,093 కోట్లను వెచ్చించాల్సి ఉంటుంది. అంతర్గత వనరుల కల్పనకు కావాల్సిన నిధులు (రూ. కోట్లలో) రహదారుల నిర్మాణం 2,320 డ్రైనేజీలు 1,084 ఘన వ్యర్థాల నిర్వహణ 105 విద్యుదీకరణ 2,111 టెలికాం నెట్వర్క్ 145 వర్షపు నీటి సంరక్షణ 156 భూ అభివృద్ధి వ్యయం 817 మొత్తం 13,093 ప్రాజెక్టు కోసం గుర్తించిన ప్రాంతాలు స్థలం (చ. కి.మీ.ల్లో) సైబరాబాద్ 86.7 శంషాబాద్ విమానాశ్రయం 79.2 ఉప్పల్, పోచారం 10.3 ఔటర్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్-1 11.5 ఔటర్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్-2 14.3 మొత్తం 202 -
త్వరలో భారీగా ఐటీ ఉద్యోగాలు: కేసీఆర్
హైదరాబాద్‌కు వస్తున్న ఐటీఐఆర్ కోసం 6-10 వేల కోట్ల రూపాయల నిధులు ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం వెల్లడించారు. విప్రో నుంచి 5వేల ఉద్యోగాలు ఇస్తామని అజీమ్ ప్రేమ్‌జీ హామీ ఇచ్చారని తెలిపారు. ఆదిభట్లలో ఏర్పాటుచేసే టీసీఎస్ కంపెనీ నుంచి 27వేల ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిష్కరించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా కొన్ని ఆంధ్రప్రదేశ్ ఖాతాలో జమ అవుతున్నాయని, వచ్చే బడ్జెట్ నాటికల్లా అన్ని లెక్కలు సెటిల్ అవుతాయనే భావిస్తున్నామని ఆయన చెప్పారు. వాల్మీకి బోయ కులానికి రిజర్వేషన్ విషయంలో వేర్వేరు వాదనలు ఉన్నాయని, ఇలాంటి రిజర్వేషన్ వివాదాల పరిష్కారానికి ఓ కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. తమిళనాడు తరహాలో కమిషన్ సూచనల మేరకు పరిష్కారం కనుగొంటామన్నారు. ప్రభుత్వం నుంచి కనీసం లక్ష ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నామని, కమలనాథన్ కమిటీ ఇంకా తుది మార్పు చేర్పులు చేయలేదని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కార్పొరేషన్లలోనూ ఉద్యోగాలు ఉన్నాయని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న మిగులు విద్యుత్ కోసం ఆ రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్‌తో మాట్లాడినట్లు ఆయన వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య 9వేల మెగావాట్ల అల్ట్రా పవర్ లైన్లు రెండింటిని వేస్తున్నామని అన్నారు. -
40వేల కోట్లు పెట్టుబడిగా పెట్టండి
* టాటా గ్రూప్ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి రూ.40వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని, హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీగా తయారు చేసేందుకు సహకరించాలని సీఎం కేసీఆర్ టాటా గ్రూప్ ప్రతినిధులను కోరారు. టాటా పవర్ ఎండీ అనిల్ సర్ధనా, టాటామోటార్స్ గ్రూప్ ప్రతినిధులు రాహుల్ షా, దీపాంకర్ తివారీ, మధుకన్నన్ తదితరులు శుక్రవారం సచివాలయంలో సీఎంను కలిశారు. నగరాన్ని ప్రపంచ స్థాయి నగరాల మాదిరిగా తీర్చిదిద్దేందుకు ఇటీవల ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టు ఏరియా, టాటాగ్రూప్ వంటి సంస్థలు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీల పెట్టుబడులు అవసరమని కేసీఆర్ అన్నారు. టాటాగ్రూప్ సీఈవో మాట్లాడుతూ, వచ్చే రెండేళ్లలో తెలంగాణలో వెయ్యిమెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును నెలకొల్పుతామన్నారు. బొగ్గు ఆధారిత ప్రాజెక్టులతో పాటు సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల్లో సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా వికేంద్రీకృత ఉత్పత్తి, పంపిణీ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ తో టాటా గ్రూపు ప్రతినిధుల భేటీ
హైదరాబాద్: టాటా గ్రూపు ప్రతినిధులు శుక్రవారం తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. హైదరాబాద్ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా టాటా గ్రూపు ప్రతినిధులను కేసీఆర్ కోరారు. నగరానికి ఐటీఐఆర్ వస్తున్నందున భారీగా పెట్టుబడులు పెట్టాలని సూచించారు. తెలంగాణలో 1000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ నెలకొల్పేందుకు టాటా గూపు ఆసక్తి కనబరించింది. రెండేళ్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిచాలనుకుంటున్నట్టు టాటా గ్రూపు ప్రతినిధులు తెలిపారు. -
తెలంగాణకు ఆర్థిక మూలం ఐటీఐఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశాభావం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుకానున్న ఐటీఐఆర్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవనుందని తెలంగాణరాష్ట్ర సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన సచివాలయంలో ఐటీ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటీ హబ్‌ను గచ్చిబౌలితో పాటు మహేశ్వరం, పోచారం వరకూ విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించేందుకు అంతర్జాతీయస్థాయి సంస్థల సహకారం తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్‌ను వైఫై నగరంగా అభివృద్ధి చేసేందుకు పలు 4జీ కంపెనీలు ముందుకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయస్థాయి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు వీలుగా ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల క్లస్టర్లను నెలకొల్పేందుకు అనుగుణంగా ఐటీఐఆర్ ప్రాజెక్టులో ప్రత్యేకంగా అథారిటీని ఏర్పాటు చేయాలని ఐటీ శాఖ మంత్రి అధికారులకు సూచించారు. -
విశాఖలో ఐటీఐఆర్ ఏర్పాటు పై ప్రభుత్వం డ్రామాలు
-
ఐటీఐఆర్‌తో మారుతున్న ఆదిభట్ల
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఐటీ అంటే కేవలం గచ్చిబౌలి ప్రాంతమే. కానీ, ఐటీ టెక్నాలజీ పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలపడంతో ఆదిభట్ల, ఉప్పల్, పోచారం, మహేశ్వరంలోనూ పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు రానున్నాయి. మొత్తం 50 వేల ఎకరాల పరిధిలో మూడు క్లస్టర్లలో విస్తరించే ఐటీఐఆర్‌ను 25 ఏళ్లలో (2013 నుంచి 2038 వరకూ) రెండు దశల్లో అభివృద్ధి చేస్తారు. క్లస్టర్ -2లో భాగంగా 79.2 చ.కి.మీ. విస్తీర్ణంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అథారిటీ (మామిడిపల్లి, రావిర్యాల, ఆదిభట్ల, మహేశ్వరం) ప్రాంతాల్లో ఐటీఐఆర్ విస్తరించి ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో బడా బడా నిర్మాణ సంస్థలు కొత్త వెంచర్లు, ప్రాజెక్ట్‌లను ప్రారంభించాయి. వీటితో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఆదిభట్లలో తమ సంస్థలను స్థాపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎత్తై భవనాలు, ఐటీ సంస్థల కార్యాలయాలు, విశాలమైన రోడ్లు, లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు.. ఇలా హైటెక్ సొబగులద్దుకుంటున్న ఆదిభట్లపై ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనమిది.. ఐటీ కంపెనీలకు చిరునామా: ఇప్పటికే ఆదిభట్లలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లాకిడ్మార్టిన్, టాటా స్కిరోస్కి తదితర మల్టీ నేషనల్ కంపెనీలు వందల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. పలు కంపెనీలు ఇప్పటికే నిర్మాణ పనుల్ని ప్రారంభించాయి. త్వరలోనే ఆదిభట్ల చుట్టుపక్కల గ్రామాల్లో లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు రానున్నారు. దీంతో ఈ ప్రాంతం హైటెక్ హంగుల్ని సంతరించుకుంటుంది. 80 ఎకరాల్లో విస్తరించి ఉన్న టీసీఎస్‌లో సుమారు 50 ఐటీ సంస్థలు రానున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. టీసీఎస్‌లో దాదాపు 8 బ్లాకులు రెడీ అవుతున్నాయి. టీసీఎస్‌ను ఆనుకొని ఎకరం భూమి రూ. 3.30 కోట్లు పలుకుతోంది. హైవేకు దూరంగా ఉన్నా రూ. 2 కోట్లకు తక్కువ ధర పలకటం లేదంటే ఇక్కడి అభివృద్ధిని అర్థం చేసుకోవచ్చు. మరో ఆరేడు నెలల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు రియల్టర్లు చెబుతున్నారు. ఆదిభట్ల ప్రాంతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 10 కి.మీ., ఎల్బీనగర్కు 12 కి.మీ., ఔటర్ రింగ్ రోడ్డుకు 1.5 కి.మీ. దూరంలో ఉండటంతో ఈ ప్రాంతాల్లో కూడా రియల్ వ్యాపారం ఊపందుకుంది. అందరి చూపూ ఇక్కడే: ఐటీఐఆర్ రాకతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆదిభట్ల ప్రాంతంపై రియల్టర్లు, ఎన్నారైలు, ఐటీ ఉద్యోగులు అందరి చూపు పడింది. ప్రత్యేకించి ఐటీ కంపెనీల రాకతో స్థిరాస్తి సంస్థలు ఈ ప్రాంతంలో దృష్టి సారించాయి. పోటీలు పడుతూ రియల్ వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. ధరలు కూడా అందుబాటులో ఉండటం, మెరుగైన రవాణా, మౌలిక వసతులు పుష్కలంగా ఉండటంతో ఐటీ ఉద్యోగులు, మదుపుదారులు, ఎన్నారైలు ఈ ప్రాంతంలో స్థలాలు కొనేందుకు ఎగబడుతున్నారు. ఆదిభట్ల చుట్టుపక్కల ప్రాంతాలైన మంగల్‌పల్లి, కొంగర, రావిర్యాల, ఇంజాపూర్, గుర్రంగూడ వంటి ప్రాంతాల్లోనూ రియల్ వ్యాపారం ఊపందుకుంది. భారీ వెంచర్లు వెలుస్తున్నాయి. రెండు మూడేళ్ల క్రితం ఈ ప్రాంతంలో మెయిన్‌రోడ్డును ఆనుకుని ఉండే స్థలం సైతం గజం ధర రూ. 3 వేలకు అటుఇటుగా ఉండేది. కానీ, ప్రస్తుతం రూ. 8 వేల నుంచి రూ. 10 వేల మధ్య పలుకుతోంది. ధరలూ అందుబాటులోనే: ఆదిభట్లలో మెయిన్‌రోడ్డుకు కాస్త దూరంగా వేస్తున్న వెంచర్లలో ఇప్పటికీ ధరలు అందుబాటులోనే ఉన్నాయి. మెట్రోసిటీ డెవలపర్స్ ‘ఏరో ఎన్క్లేవ్’ పేరుతో ఓపెన్ ప్లాట్స్‌ను అభివృద్ధి చేస్తోంది. ఫేజ్-1లో 3 ఎకరాలు, ఫేజ్-2లో 12 ఎకరాలను ఇప్పటికే విక్రయించింది. ప్రస్తుతం ఫేజ్-3లో భాగంగా 15 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నారు. గజం స్థలం ధర రూ. 4 వేల నుంచి రూ. 4,500లుగా చెబుతున్నారు. ఆదిభట్లకు 3 కి.మీ. దూరంలో ఉన్న బొంగ్లూరులో ఇదే సంస్థ 48 ఎకరాల్లో ‘మెట్రోసిటీ మెగా ప్రాజెక్ట్’ పేరుతో 500 ఇండిపెండెంట్ హౌస్‌లను నిర్మిస్తోంది. ధర రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలు చెబుతున్నారు. ఆదిభట్లకు 6 కి.మీ. దూరంలోని బడంగ్‌పేటలో 14 ఎకరాల్లో ‘మెట్రోసిటీ మెగాహిల్స్’ పేరుతో 200 ఇండిపెండెంట్ హౌస్‌లను నిర్మిస్తోంది. ధర రూ. 22 లక్షలు. ఆదిభట్లలో శ్రీశ్రీ గృహ నిర్మాణ్ ఇండియా ప్రై.లి. 10 ఎకరాల్లో ‘ఏరో పార్క్’, 18 ఎకరాల విస్తీర్ణంలో ‘ఏరో లైట్స్’ హెచ్ఎండీఏ అనుమతి పొందిన లే అవుట్లను అభివృద్ధి చేస్తోంది. గజం ధర రూ. 6 వేల నుంచి రూ. 15 వేలుగా చెబుతున్నారు. ఇదే సంస్థ బొంగ్లూరులో ‘శ్రీశ్రీ అంతఃపురం’ పేరుతో భారీ నివాస సముదాయాన్ని నిర్మిస్తోంది. ధర రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షలుగా చెబుతున్నారు. -
ఐటీఐఆర్‌కు విద్యుత్తు.. 3,348 మెగావాట్లు: పొన్నాల లక్ష్మయ్య
రోజుకు 45.2 కోట్ల లీటర్ల నీరు అవసరం అందుకే 25 ఏళ్ల ప్రణాళిక: మంత్రి పొన్నాల లక్ష్మయ్య సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఐటీ పెట్టుబడుల ప్రాంతాని(ఐటీఐఆర్)కి 3,348 మెగావాట్ల విద్యుత్తు, రోజుకు 45.2 కోట్ల లీటర్ల నీరు అవసరమవుతుందని మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఎల్లంపల్లి, కంతనపల్లి ప్రాజెక్టుల ద్వారా గోదావరి నీటిని తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. అందుకే 25 ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించామని వివరించారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఐటీఐఆర్ వర్క్‌షాప్‌లో పొన్నాల ప్రసంగించారు. ఐటీఐఆర్‌లో మౌలిక వసతుల కోసం రెండు దశలలో కలిపి 25 ఏళ్లలో రూ. 13,093 కోట్లను వెచ్చించనున్నట్టు తెలిపారు. రూ. 85 కోట్లతో ఫలక్‌నుమా-ఉందానగర్-ఎయిర్‌పోర్టుకు ఎంఎంటీఎస్ రైలు మార్గ విస్తరణ, రూ. 440 కోట్లతో నాలుగు రేడియల్ రోడ్ల విస్తరణ, రూ. 417 కోట్లతో విద్యుత్తు ఉపకేంద్రాల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. రెండు విడతల్లో కలిపి రవాణా, ఇతర మౌలిక సదుపాయాలన్నీ అభివృద్ధి చేస్తామన్నారు. ఐటీఐఆర్ అమలును ఏపీఐఐసీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. కరీంనగర్, నె ల్లూరుకు ఐటీ ప్రస్తుతం టైర్-1 కింద హైదరాబాద్, విశాఖ.. టైర్-2 కింద విజయవాడ, కాకినాడ, తిరుపతి, వరంగల్లు నగరాల్లో ఐటీ రంగాన్ని అభివృద్ధిపరుస్తున్నామని, తదుపరి విడతలో టైర్-3 నగరాలైన కరీంనగర్, నెల్లూరులో ఐటీని విస్తరిస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఉద్యమాలు ఐటీ అభివృద్ధికి ఆటం కం కలిగించలేదన్నారు. గ్రామపంచాయతీలను మండలాలు, జిల్లాకేంద్రాలతో అనుసంధానించే జాతీయ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ 12 నెలల్లోగా పూర్తవుతుందని తెలిపారు. మొబైల్ ద్వారా తెలుగులో ఎస్ఎంఎస్ సౌకర్యం తొందర్లోనే అందుబాటులోకి తేనున్నామని చెప్పారు. సమావేశంలో ఐటీ కార్యదర్శి సంజయ్‌జాజు, ఏపీఐఐసీ ఎండీ జయేష్‌రంజన్, ఇట్స్‌ఏపీ కార్యదర్శి బిపిన్ చంద్ర, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ అధ్యక్షుడు శివరాంప్రసాద్ తదితరులు ప్రసంగించారు. ఐటీఐఆర్‌కు 10 కోట్ల గ్యాలన్ల గోదావరి జలాలు రాష్ట్రరాజధాని రూపురేఖలను సమూలంగా మార్చనున్న ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) ప్రాంతానికి రోజూ 10 కోట్ల గ్యాలన్ల గోదావరి జలాలను సరఫరా చేసేందుకు జలమండలి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకోసం గోదావరి రెండోదశ ప్రాజెక్టును 2020లో కాకుండా 2017 చివరినాటికి పూర్తిచేసి నీటిని సరఫరా చేస్తామని జలమండలి ఉన్నతాధికారులు వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర ఐటీ శాఖ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని తెలిపారు. కృష్ణా జలాల లభ్యత దృష్ట్యా కృష్ణా నాల్గవదశ ద్వారా ఐటీఐఆర్ ప్రాంతానికి నీటిని తరలించిన పక్షంలో జలవివాదాలు తలెత్తే ప్రమాదం ఉండడంతో ఈమేరకు నిర్ణయించామన్నారు. నీటిసరఫరా ప్రాజెక్టుపై త్వరలో కన్సల్టెం ట్ను నియమించుకొని సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) సిద్ధం చేస్తామని అధికారులు పేర్కొన్నారు. గోదావరి రెండోదశ ద్వారా నగరానికి 17.2 కోట్ల గ్యాలన్ల నీటిని తరలించినప్పటికీ ఐటీఐఆర్ పరిధిలోని కంపెనీలకు 10 కోట్ల గ్యాలన్ల కేటాయింపులే ఉంటాయని స్పష్టం చేశారు. మిగతా జలాలు నగర తాగునీటి అవసరాలకు మళ్లిస్తామని చెప్పారు. సుమారు 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఐదు క్లస్టర్లుగా ఏర్పడనున్న ఐటీఐఆర్ పరిధిలో సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఉప్పల్-పోచారం, సైబరాబాద్-ఎయిర్పోర్ట్ (గ్రోత్‌కారిడార్-1), ఎయిర్పోర్ట్-ఉప్పల్(గ్రోత్‌కారిడార్-2) ప్రాంతాలు ఉన్నాయి. ఐటీఐఆర్ మొదటి దశ ప్రాజెక్టు 2018 నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయి. -
విశాఖ, తిరుపతిలో ఐటీఐఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు ప్రాంతాల్లో ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(ఐటీఐఆర్)లు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్ తరహాలోనే విశాఖపట్నంలో ఒకటి.. తిరుపతి, అనంతపురం, నెల్లూరు ప్రాంతాలను కలుపుతూ ‘తిరుపతి ఐటీఐఆర్’ ప్రాజెక్టులను ప్రభుత్వం నెలకొల్పనుందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నిర్దిష్ట క్లస్టర్లను గుర్తించి తిరుపతి ఐటీఐఆర్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఒక్కొక్క ప్రాంతంలో 4 వేల ఎకరాల చొప్పున మూడు ప్రాంతాల్లోనూ కలిపి మొత్తం 12 వేల ఎకరాల పరిధిలో ఐటీఐఆర్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. సోమవారం సచివాలయంలో మంత్రి పొన్నాల మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం, రేణిగుంట విమానాశ్రయం, బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో ఉన్న అనంతపురం జిల్లాలోని ప్రాంతాల్లో ఐటీ, అనుబంధ సంస్థల స్థాపనకు వసతుల కల్పన, అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. ఈ ఐటీఐఆర్ ప్రాజెక్టుల ఏర్పాటుపై సర్వే నిర్వహించే బాధ్యతను ప్రైవేటు కన్సల్టెన్సీకి అప్పగించామని, ఈనెల 24, 25 తేదీల్లో సదరు సంస్థ ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తుందని చెప్పారు. 26వ తేదీన సంబంధిత జిల్లా అధికారులతో చర్చిస్తుందన్నారు. అనంతరం సమగ్ర పథక నివేదిక(డీపీఆర్)ను కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించనున్నట్టు వివరించారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు.. పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలకు వీలు కల్పించే ఐటీఐఆర్‌లో ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసుల సంస్థలు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ మాన్యు ఫాక్చరింగ్ సంస్థలు ఏర్పాటవుతాయి. తొలి ఐదేళ్లలో మౌలిక వసతులు కల్పిస్తారు. రెండో విడతలో 15 నుంచి 20 ఏళ్ల కాలంలో ఐటీఐఆర్‌ను అభివృద్ధి చేస్తారు. ఉత్పత్తి యూనిట్లు, ప్రజావసరాలు, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన యంత్రాంగం, నివాస ప్రాంతం, పరిపాలన సేవలు భాగంగా ఉంటాయి. స్పెషల్ ఎకనమిక్ జోన్(ఎస్ఈజడ్)లు, ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్రీ ట్రేడ్ జోన్లు, వేర్‌హౌసింగ్ జోన్లు, ఎగుమతులకు సంబంధించిన యూనిట్లు, అభివృద్ధి కేంద్రాలు కూడా ఉంటాయి. -
రాష్ట్రానికి మరో రెండు ఐటీఐఆర్‌లు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి ఈ మధ్యనే ఒక ఐటీఐఆర్ ప్రాజెక్టు వచ్చిందని, మరో రెండు ఐటీఐఆర్‌ల కోసం కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. విశాఖలో ఒక ఐటీఐఆర్‌ను ప్రతిపాదించి, పూర్తిస్థాయి నివేదికను ఇప్పటికే కేంద్రానికి పంపించామన్నారు. అలాగే, తిరుపతి, చిత్తూరు, అనంతపురం ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమ వ్యాప్తికి మరో ఐటీఐఆర్‌ను ప్రతిపాదించామని, దీన్ని కూడా త్వరలో కేంద్రానికి నివేదిస్తామని తెలిపారు. మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్న హైదరాబాద్‌లో ఒరాకిల్ కంపెనీ కార్యకలాపాలను విస్తరించాలని లక్ష్మయ్య విజ్ఞప్తి చేశారు. భారత పర్యటనలో ఉన్న ఒరాకిల్ సంస్థ ఆసియా-పసిఫిక్ జోన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆడ్రియన్ జోన్స్, ఒరాకిల్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ సందీప్ మాధుర్‌తో ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన ఉన్నతస్థాయి వాణిజ్య ప్రోత్సాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షా 25వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలను కల్పించిన ఒరాకిల్... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, వ్యాపారాన్ని విస్తరించుకునే ప్రణాళికలను రూపొందించుకుంటోందని మంత్రి అనంతరం మీడియాకు వివరించారు., ఈ దృష్ట్యానే ఆ సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమై హైదరాబాద్‌లోనూ విస్తరణను చేపట్టాలని కోరామని ఆయన తెలిపారు. రానున్న 30 ఏళ్లలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో రూ.18 వేల కోట్ల వ్యయంతో 50 వేల ఎకరాల్లో ఐటీ రంగాన్ని అభివృద్ధిపర్చనున్నట్టు ఒరాకిల్ ఉన్నతాధికారులకు నివేదించానన్నారు. ఇదిలా ఉండగా, లేపాక్షి నాలెడ్జి పార్క్ వ్యవహారం కోర్టులో ఉందని, సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ఐటీ రంగ విస్తృతికి కృషిచేస్తామన్నారు. -
విశాఖలోనూ ఐటీఐఆర్ తరహా ప్రాజెక్టు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో తీవ్ర సంక్షోభంలో ఉన్న ఐటీ రంగాన్ని ఆదుకునేందుకు హైదరాబాద్‌కు ప్రకటించిన ఐటీ ఇన్వెస్టిమెంట్ రీజియన్ తరహాలో తక్షణం ఇక్కడ కూడా ప్రత్యేక ప్రాజెక్టు ప్రకటించాలని విశాఖ అభివృద్ధి మండలి, రుషికొండ ఐటీ పార్క్స్‌అసోసియేషన్ డిమాండ్ చేసింది. అసోషియేషన్ ఉపాధ్యక్షుడు ఒ.నరేష్కుమార్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ విశాఖకు రెండో ఐటీ రాజధాని అనే పేరు మాత్రమే మిగిలిందన్నారు. తాజాగా హైదరాబాద్‌లో 2.19 లక్షల కోట్లతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)ను ప్రకటించడం విద్యార్థులను రెచ్చగొట్టడమేనని పేర్కొన్నారు. ఇప్పటికే రాజధానికి సమాంతరంగా సీమాంధ్రలో విశాఖ, కాకినాడ, తిరుపతి వంటి రెండో దశ నగరాల్లో ఈ రంగాన్ని అసలు ప్రోత్సహించకుండా మళ్లీ రాజధానినే భారీగా అభివృద్ధిచేసే ప్రయత్నాలు చేయడం ప్రాంతీయ అసమానతలను పెంచడమేనని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం విశాఖలో ఐటీ కుప్పకూలే దశలో ఉందని, ప్రభుత్వ నిర్వాకం వలన సెజ్‌ల్లో 70 శాతానికిపైగా సంస్థలు ఇప్పటికీ ప్రారంభం కాలేదని చెప్పారు. ఐటీ రంగాన్ని పట్టించుకోకుండా హైదరాబాద్ చుట్టూ కోట్లు ఖర్చుచేయడం అన్యాయమన్నారు. ‘ఐటీఐఆర్’ రెచ్చగొట్టేదిగా ఉంది: జేపీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేసిన అనంతరం.. ఇరుప్రాంత ప్రజల్ని సమన్వయం చేయకపోవడమేగాక ఒకే ప్రాంతానికి లక్షల కోట్లు వెచ్చిస్తూ.. మరో ప్రాంతానికి అన్యాయం చేయడం సరికాదని కూకట్పల్లి ఎమ్మెల్యే, లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ అన్నారు. ఒకవైపు సమైక్యాంధ్ర ఉద్యమం మిన్నంటుతున్న తరుణంలో హైదరాబాద్‌లో ఐటీఐఆర్)ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపట్టారు. ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఐటీఐఆర్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడానికిది సరైన సమయం కాదన్నారు. ఇది సమైక్యాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేలా ఉందని అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక.. ఇరుప్రాంత ప్రజల్ని సమన్వయం చేసిన తరువాతే ఐటీ పెట్టుబడులు ఇరుప్రాంత ప్రజలకు సమానంగా ఉండేలా చూస్తే బాగుండేదన్నారు. -
ఐటీ రాజధాని హైదరాబాద్
-
ఐటీ రాజధాని హైదరాబాద్
ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌కు కేంద్రం ఆమోదం హైదరాబాద్ చుట్టూ 50 వేల ఎకరాల్లో ఐటీఐఆర్ ఐటీ, ఐటీఈఎస్, ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్ సంస్థల సమ్మేళనం ఎస్ఈజెడ్లు, ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్రీట్రేడ్ జోన్లు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడులు సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్ర రాజధానికి తలమానికంగా మరో ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే దేశంలో ఐటీ రంగంలో అగ్రశ్రేణిలో ఉన్న హైదరాబాద్ తాజాగా ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) రూపంలో మరింత ప్రఖ్యాతిగాంచనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తం 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో, 50 వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఐటీఐఆర్‌లో దాదాపు రూ. 2,19,440 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. ఇందులో ఐటీ, ఐటీ ఆధారిత సేవల (ఐటీఈఎస్) సంస్థల ఏర్పాటుకు రూ. 1.18 లక్షల కోట్లు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ తయారీ సంస్థల ఏర్పాటుకు 1.01 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడులు ఉంటాయి. ప్రత్యక్షంగా 15 లక్షల మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 56 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అంచనా. ఐటీఐఆర్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు క్లస్టర్లలో 202 చదరపు కిలోమీటర్ల భూమిని కేటాయించింది. సైబరాబాద్ డెవలప్మెంట్ ఏరియా, దాని పరిసరాల్లో ఒక క్లస్టర్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఏరియా, మహేశ్వరంలో మరో క్లస్టర్, ఉప్పల్, పోచారం ఏరియాలో ఇంకో క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు తొలి దశను 2013 నుంచి 2018 వరకూ అమలు చేస్తారు. రెండో దశ అమలు 2018 నుంచి 2038 వరకూ ఉంటుంది. ఉత్పత్తి యూనిట్లు, ప్రజావసరాలు, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన యంత్రాంగం, నివాస ప్రాంతం, పరిపాలన సేవలు అన్నీ ఐటీఐఆర్‌లో భాగమై ఉంటాయి. స్పెషల్ ఎకానమిక్ జోన్ (ఎస్ఈజెడ్)లు, ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్రీ ట్రేడ్ జోన్లు, వేర్‌హౌసింగ్ జోన్లు, ఎగుమతులకు సంబంధించిన యూనిట్లు, అభివృద్ధి కేంద్రాలు ఇందులో భాగంగా ఉంటాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం సచివాలయంలో ఈ విషయం మీడియాకు వెల్లడించారు. ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ సంస్థల ఏర్పాటుకు అవసరమైన సమీకృత నాలెడ్జి క్లస్టర్లు ఏర్పాటుచేయాలని, ఇందుకు రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపాలని కేంద్ర ప్రభుత్వం 2008 మే 29న విధానపర నిర్ణయంలో భాగంగా గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపింది. దీనికి కేంద్ర కేబినెట్ కమిటీ తాజాగా ఆమోదం తెలిపిన నేపధ్యంలో.. కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ, పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే మంత్రిత్వశాఖలు ఈ ప్రాజెక్టు అమలుపై సవివరమైన అధ్యయనం, చర్యలు ప్రారంభించనున్నాయి. ఐటీఐఆర్ వల్ల లబ్ధి ఇలా... - ప్రత్యక్ష రెవెన్యూ: రూ. 3,10,849 కోట్లు - ఐటీ పెట్టుబడుల సామర్థ్యం: రూ. 2,19,440 కోట్లు - ఐటీ ఎగుమతులు: రూ. 2,35,000 కోట్లు - ప్రత్యక్షంగా ఉద్యోగాలు: 14.8 లక్షల మందికి - పరోక్షంగా ఉపాధి: 55.9 లక్షల మందికి - రాష్ట్రానికి అదనంగా లభించే పన్ను ఆదాయం: రూ. 30,170 కోట్లు స్వరూపం ఇదీ... - మొత్తం 202 చదరపు కిలోమీటర్ల (50 వేల ఎకరాలు) పరిధిలో ఏర్పాటు - 25 ఏళ్లలో (2013 నుంచి 2038 వరకూ) రెండు దశల్లో మూడు క్లస్టర్లుగా ఐటీఐఆర్ ఏర్పాటు - సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాల్లో) పరిధిలో - హైదరాబాద్ ఎయిర్‌పోర్టు డెవలప్మెంట్ అథారిటీ (మామిడిపల్లి, రావిర్యాల, ఆదిభట్ల, మహేశ్వరం) పరిధిలో - ఉప్పల్, పోచారం పరిధిలో మరొక క్లస్టర్ - ఈ మూడు క్లస్టర్లను అనుసంధానిస్తూ మొత్తం 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఐటీఐఆర్ విస్తరిస్తుంది మూడు క్లస్టర్ల విస్తీర్ణం... 1. హెచ్ఎండీఏ (సైబరాబాద్ ఏరియా పరిసరాలు): 86.7 చదరపు కిలోమీటర్లు 2. హెచ్ఎండీఏ (ఎయిర్‌పోర్టు ఏరియా): 79.2 చదరపు కిలోమీటర్లు 3. ఉప్పల్, పోచారం: 10.3 చదరపు కిలోమీటర్లు కనెక్టివిటీలో భాగంగా - ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) గ్రోత్ కారిడార్ 1: 11.5 చ.కి.మీ. - ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) గ్రోత్ కారిడార్ 2: 14.3 చ.కి.మీ -
హైదరాబాద్‌కు మరో భారీ ఐటి హబ్
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు మరో భారీ ఐటి హబ్ ను ఏర్పాటు చేసేందుకు సీసీఈఏ పచ్చజెండా ఊపింది. 2.19 లక్షల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ ఐటీ హబ్ ను ఏర్పాటు చేయడానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం ఐటీఐఆర్ గా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనపై ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) శుక్రవారం పరిశీలించింది. ఐటీఐఆర్‌లో ఉత్పాదక యూనిట్లు, లాజిస్టిక్స్, పబ్లిక్ యుటిలిటీస్, పర్యావరణ పరిరక్షణ, గృహ సముదాయాలు, పాలనా సంబంధ సర్వీసుల వంటివి ఏర్పాటవుతాయి. వీటిలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు(ఎస్ఈజెడ్), పారిశ్రామిక పార్క్‌లు, స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాలు, గిడ్డంగులు(వేర్‌హౌసింగ్), ఎగుమతి యూనిట్లు తదితరాలను కూడా నెలకొల్పే అవకాశముంది. 25 ఏళ్ల కాలంలో 50,000 ఎకరాలలో రెండు దశలలో ఐటీఐఆర్ ఏర్పాటవుతుంది. తద్వారా 15 లక్షల మంది యువకులకు ప్రత్యక్ష ఉపాధి లభించగలదు. దేశ ఐటీ ఎగుమతుల్లో రాష్ర్టం వాటా 12.4%కాగా, 4వ ర్యాంక్‌లో ఉంది. 2011-12లో రాష్ట్రం నుంచి ఐటీ సేవల ద్వారా రూ.53,246 కోట్ల టర్నోవర్ నమోదైంది. -
ఐటీ పెట్టుబడుల ప్రాంతంగా హైదరాబాద్!
న్యూఢిల్లీ: సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం(ఐటీఐఆర్)గా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనపై ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) శుక్రవారం పరిశీలించనున్నట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఐటీఐఆర్‌లో ఉత్పాదక యూనిట్లు, లాజిస్టిక్స్, పబ్లిక్ యుటిలిటీస్, పర్యావరణ పరిరక్షణ, గృహ సముదాయాలు, పాలనా సంబంధ సర్వీసుల వంటివి ఏర్పాటవుతాయి. వీటిలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు(ఎస్ఈజెడ్), పారిశ్రామిక పార్క్‌లు, స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాలు, గిడ్డంగులు(వేర్‌హౌసింగ్), ఎగుమతి యూనిట్లు తదితరాలను కూడా నెలకొల్పే అవకాశముంది. 25 ఏళ్ల కాలంలో 50,000 ఎకరాలలో రెండు దశలలో ఐటీఐఆర్ ఏర్పాటవుతుంది. ఐటీ, ఐటీ ఆధారిత రంగాలలో రూ. 2.19 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశముంది. తద్వారా 15 లక్షల మంది యువకులకు ప్రత్యక్ష ఉపాధి లభించగలదు. దేశ ఐటీ ఎగుమతుల్లో రాష్ర్టం వాటా 12.4%కాగా, 4వ ర్యాంక్‌లో ఉంది. 2011-12లో రాష్ట్రం నుంచి ఐటీ సేవల ద్వారా రూ.53,246 కోట్ల టర్నోవర్ నమోదైంది.