మార్చి 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు కొత్త బడ్జెట్‌కు సంబంధించిన ఆలోచనలు, సమావేశాలు, సంప్రదింపులు, ప్లానింగ్ విషయాలు .. మొదలైన వాటిని పక్కన పెట్టండి. 2023 ఏప్రిల్ 1 నుంచి వాటి గురించి ఆలోచిద్దాం. ఈలోగా 2023 మార్చి 31లోపల మనం ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన ఆలోచనలు, సమాలోచనలు, ప్లానింగ్ ఆలోచిద్దాం.
2023 మార్చి 31తో పూర్తయ్యే ఆర్థిక సంవత్సరానికి కొంత మందికి గడువు తేదీ 31–07–2023; మరికొందరికి సెప్టెంబర్ నెలాఖరు. అందుకు గాను ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 10న కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో మీరు మార్చి నెల తర్వాత డిపార్టుమెంటు వారికి దాఖలు చేయాల్సిన రిటర్నుల గురించి .. ఫారమ్‌లు, వాటిని దాఖలు చేసినప్పుడు మీకు వచ్చే అక్నాలెడ్జ్‌మెంట్ గురించి.. నోటిఫై చేశారు.
►ఈ ఫారాలు 01–04–2023 నుండి అమల్లోకి వస్తాయి.
►డిపార్టుమెంట్ వారి భాష ప్రకారం 2023–24 అసెస్‌మెంట్ సంవత్సరానికి వర్తించేవి అనాలి.
►ఈ ఫారాలు ఏమిటంటే..ఐటీఆర్ 1 సహజ్, ఐటీఆర్ 2, ఐటీఆర్ 4 సుగమ్, ఐటీఆర్ 5,ఐటీఆర్ 6
►పైన పేర్కొన్న ఫారాలు దాఖలు చేస్తే మీకు వచ్చే ఐటీ అక్నాలెడ్జ్‌మెంటు ఐటీఆర్‌విని కూడా నోటిఫై చేశారు.
► అన్ని ఫారాల్లోనూ షెడ్యూళ్లు ఉన్నాయి.
►2022 అక్టోబర్‌లోనే రూల్స్ విడుదల చేశారు.
►ఉద్యోగస్తులకు సర్క్యులర్ డిసెంబర్‌లోనే విడుదల చేశారు.
►‘‘డౌన్‌లోడ్స్’’ కింద ఐటీఆర్ ఆఫ్‌లైన్ యుటిలిటీ ద్వారా ఆఫ్‌లైన్ సదుపాయం ఉంది.
►సాంకేతికంగా సులువుగా, త్వరగా వేసేలా తగిన చర్యలు తీసుకున్నారు.
►ప్రస్తుతం ఒకొక్కప్పుడు తప్పులు దొర్లుతున్నాయి. ‘డేటా’ .. అంటే సమాచారమనేది సిస్టంలోకి ప్రీ–ఫిల్ అవడం లేదు. పూర్తి సమాచారం లేదని చూపుతోంది.
►ఎక్సెల్ వెర్షన్‌లో ‘సబ్మిట్’కి ఎక్కువ వ్యవధి తీసుకుంటోంది.
►షెడ్యూల్స్ నింపేటప్పుడు కొన్ని తప్పులు దొర్లుతున్నాయి. షెడ్యూల్స్ ఎంపిక చేసేటప్పుడు గందరగోళం, గజిబిజి ఏర్పడుతోంది. స్పష్టత ఉండటం లేదు. ఒక్కొక్కప్పుడు మొరాయిస్తోంది.
► ఇలాంటివి ఉండవని ఆశిద్దాం.
► మీరు స్వయంగా వేసుకుంటే మీ స్వంత అనుభవాన్ని మించిన పాఠం లేదు.
► వృత్తి నిపుణులకి ఇస్తే సమగ్ర సమాచారాన్ని సకాలంలో ఇవ్వండి.
Comments
Please login to add a commentAdd a comment