
కేసీఆర్ తో టాటా గ్రూపు ప్రతినిధుల భేటీ
టాటా గ్రూపు ప్రతినిధులు శుక్రవారం తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు.
హైదరాబాద్: టాటా గ్రూపు ప్రతినిధులు శుక్రవారం తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. హైదరాబాద్ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా టాటా గ్రూపు ప్రతినిధులను కేసీఆర్ కోరారు. నగరానికి ఐటీఐఆర్ వస్తున్నందున భారీగా పెట్టుబడులు పెట్టాలని సూచించారు.
తెలంగాణలో 1000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ నెలకొల్పేందుకు టాటా గూపు ఆసక్తి కనబరించింది. రెండేళ్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిచాలనుకుంటున్నట్టు టాటా గ్రూపు ప్రతినిధులు తెలిపారు.