Taxpayers
-
ఎక్కువ ట్యాక్స్ కడుతున్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
పన్ను నోటీసుల్లో సరళ పదాలు వాడండి
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు పంపే నోటీసులు లేదా లేఖలలో సరళమైన పదాలను ఉపయోగించాలని సంబంధిత అధికారులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఉన్న అధికారాన్ని వినియోగించడంలో న్యాయబద్దంగా వ్యవహరించాలని కూడా విజ్ఞప్తి చేశారు. 165వ ఆదాయపు పన్ను దినోత్సవ వేడుకలను ఉద్దేశించి సీతారామన్ మాట్లాడుతూ, వ్యక్తిగత హాజరు అవసరం లేని ప్రస్తుత డిజిటల్ యుగంలో అధికారులు పన్ను చెల్లింపుదారులతో మరింత ‘న్యాయంగా, స్నేహపూర్వకంగా‘ ఉండాలని అన్నారు. పన్ను నోటీసులు పన్ను చెల్లింపుదారులలో ‘భయ భావనను‘ సృష్టించకూడదని అన్నారు. ఇందుకు బదులుగా నోటీసులు సరళంగా, సూటిగా ఉండాలన్నారు. నోటీసు పంపిన కారణాన్ని మదింపుదారునికి ‘స్పష్టంగా’ తెలియజేయాలని మంత్రి సూచించారు. ‘‘మనం సరళమైన, సులభంగా అర్థమయ్యేలా నోటీసులు జారీ చేసే మార్గాలను అన్వేíÙంచలేమా? ఎందుకు చర్య తీసుకున్నారో, నోటీసు ఎందుకు పంపడం జరుగుతోందో స్పష్టంగా వివరించలేమా?’ అని ఆమె ఈ సందర్భంగా ప్రశి్నస్తూ, ఆయా అంశాలను పన్ను చెల్లింపుదారులకు స్పష్టంగా తెలియజేయాలని కోరారు. వేగవంతంగా రిఫండ్స్... రిఫండ్లను వేగంగా జారీ చేయడంలో మెరుగుదలకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆర్థికమంత్రి సూచించారు. సమస్యకు తగిన చర్యలను మాత్రమే తీసుకోవాలని పేర్కొన్నారు. పన్ను చెల్లింపులకు తగిన న్యాయపరమైన చర్యలను చివరి ప్రయత్నంగా మాత్రమే అమలు చేయాలని ఆమె కోరారు. పన్ను డిమాండ్‌కు స్వచ్ఛంద సమ్మతిని ప్రోత్సహించడం డిపార్ట్మెంట్ లక్ష్యంగా ఉండాలన్నారు. పన్నుల శాఖ మరింత స్నేహపూర్వకంగా, పారదర్శకంగా ఉండాలని తాను తరచూ పేర్కొంటున్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, పన్ను అధికారులు ఇన్నాళ్లూ అన్యాయంగా వ్యవహరించారని తాను పేర్కొంటున్నట్లు అర్థం చేసుకోరాదని స్పష్టం చేశారు. -
ట్యాక్స్ రీఫండ్.. పన్ను చెల్లింపుదారులూ జాగ్రత్త!
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు పూర్తయి పన్నుచెల్లింపుదారులు ట్యాక్స్ రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భాన్నే సొమ్ము చేసుకునేందుకు మోసగాళ్లు పొంచి ఉన్నారు. ఈ నేపథ్యంలో మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులను హెచ్చరించింది.మోసపూరిత కాల్స్, పాప్-అప్ నోటిఫికేషన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐటీ శాఖ సోషల్ మీడియా ద్వారా సూచించింది. ఒకవేళ అలాంటి సందేశం వచ్చినట్లయితే, అది ఐటీ శాఖ నుంచి వచ్చినదేనా అని అధికారిక మార్గాల ద్వారా నిర్ధారించుకోవాలని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.“క్రెడిట్ కార్డ్ నంబర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా ఏదైనా ఇతర సున్నితమైన సమాచారాన్ని అభ్యర్థించే ఈమెయిల్‌లకు ప్రత్యుత్తరం ఇవ్వవద్దు లేదా వెబ్సైట్లను సందర్శించవద్దు. పన్ను చెల్లింపుదారులను అందించిన ఈమెయిల్ చిరునామా ద్వారా మాత్రమే వారిని ఆదాయపు పన్ను శాఖ సంప్రదించవచ్చు” అని ఆదాయపు పన్ను శాఖ ‘ఎక్స్’(ట్విటర్)లో పేర్కొంది.pic.twitter.com/d5oVz6aiPW— Income Tax Mumbai (@IncomeTaxMum) August 15, 2024 -
ఐటీ పోర్టల్‌లో అప్డేట్.. ఆ మినహాయింపు దూరం!
ఆదాయపు పన్ను పోర్టల్‌లో ఇటీవలి అప్డేట్ కారణంగా కొత్త పన్ను విధానాన్ని ఉపయోగిస్తున్న పన్ను చెల్లింపుదారులు ముఖ్యమైన మినహాయింపును కోల్పోయే ప్రమాదం వచ్చింది.ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 87A కింద లభించే ఈ మినహాయింపు, తక్కువ-ఆదాయం ఉన్నవారికి (రూ. 7 లక్షల లోపు) రూ. 25,000 వరకు పన్ను మినహాయింపును అందిస్తుంది.ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో అప్డేట్ చేసిన ట్యాక్స్ ఫైలింగ్ యుటిలిటీని ఉపయోగించి కొత్త పన్ను విధానం కింద రిటర్న్స్ ఫైల్ చేస్తున్న ట్యాక్స్ పేయర్లు స్వల్పకాలిక మూలధన లాభాలను నమోదు చేసినట్లయితే రూ. 25,000 వరకు లభించే పన్ను మినహాయింపునకు దూరం కావాల్సి వస్తోంది.ఈ రిబేట్ అనేది ఆదాయపు పన్నుపై ఇచ్చే రాయితీ. ఇది తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు వారి పన్నును తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. కేంద్ర బడ్జెట్ 2023లో మార్పుల ప్రకారం, మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉంటే రూ. 25,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.అసలేమైంది? మినహాయింపు అర్హత కోసం పోర్టల్ 'మొత్తం పన్ను విధించదగిన ఆదాయాన్ని' గణించే విధానంలో వ్యత్యాసం కారణంగా సమస్య తలెత్తుతోంది. చార్టర్డ్ అకౌంటెంట్ల ప్రకారం, ప్రస్తుత వ్యవస్థ ఈ గణనలో స్వల్పకాలిక మూలధన లాభాలను (STCG) తప్పుగా చేర్చింది.ఇది స్వల్పకాలిక మూలధన లాభాలు కలిగినవారు ఆదాయం పరిమితి రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉన్నప్పటికీ పన్ను మినహాయింపును తొలగిస్తోంది.కాగా జూలై 5 లోపు రిటర్న్స్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులు స్వల్పకాలిక మూలధన లాభాలతో సంబంధం లేకుండా మినహాయింపును క్లెయిమ్ చేయగలిగారు. ఆ తర్వాత రిటర్న్స్ ఫైల్ చేస్తున్నవారికే ఈ సమస్య వస్తోంది. స్వల్పకాలిక మూలధన లాభాలు మినహా స్థూల మొత్తం ఆదాయం రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉంటే, సెక్షన్ 111A స్పష్టంగా మినహాయింపును అనుమతిస్తుంది. కానీ పోర్టల్‌లో లోపం కారణంగా ఇలాంటి వారు మినహాయింపునకు దూరం కావాల్సి వస్తోంది. -
బిగ్ రిలీఫ్ : పన్ను చెల్లింపు దారులకు కేంద్రం శుభవార్త!
పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ట్యాక్స్ పేయర్స్‌కు ఆదాయాపు పన్ను శాఖ అధికారులు జారీ చేసిన డిమాండ్ నోటీసులకు అప్పీల్ చేసుకునే సమయాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ట్యాక్స్ పేయర్స్ భారీ ఊరట లభించినట్లైంది. జీఎస్టీ కౌన్సిల్ ట్యాక్స్‌పేయర్స్ కోసం జీఎస్టీ అమ్నెస్టీ పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. స్కీమ్ వివరాల్ని రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్ర ప్రకటించారు. ఆ వివరాల ప్రకారం..పన్ను చెల్లింపు దారులు ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను (ఐటీఆర్‌ని) దాఖలు చేసిన తర్వాత ట్యాక్స్ అధికారులు సంబంధిత వివరాలు ఈ వివరాలన్నీ సరిపోలుతున్నాయో లేదో తెలుసుకోవడానికి డిక్లరేషన్లు, చెల్లించిన పన్నులను పరిశీలిస్తుంది. ఒకవేళ ట్యాక్స్ పేయర్స్ చెల్లించాల్సిన దానికంటే తక్కువ మొత్తం ట్యాక్స్ కడితే.. ఆదాయ పన్ను శాఖ డిమాండ్ నోటీసు జారీ చేస్తుంది. అప్పీల్ సమయం మరింత పొడిగింపు అయితే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ మండలి 52వ సమావేశంలో డిమాండ్ ఆర్డర్స్‌పై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ట్యాక్స్ అధికారులు జారీ చేసిన ఆదేశాలపై ఎవరైనా అసెసీ అప్పీలు చేయాలంటే మూడు నెలల సమయమే ఉంటుంది. దీనిని మరో నెల వరకు పొడిగించడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అదనంగా పన్ను డిమాండ్ డిపాజిట్ అయితే జీఎస్టీ మండలి సమావేశంలో జీఎస్టీ నమోదిత వ్యాపారాలకు అదనపు సమయాన్ని ఇచ్చింది. ఇందు కోసం ప్రస్తుతం జమ చేస్తున్న 10 శాతం పన్ను డిమాండ్ డిపాజిట్‌కు బదులు 12.5 శాతం జమ చేయాల్సి ఉంటుంది. భారీ ఉపశమనం దీంతో పాటు తాత్కాలికంగా అటాచ్ చేసిన ఆస్తులను ఏడాది పూర్తయిన తర్వాత విడుదల చేసేలా జీఎస్టీ నిబంధనలను సవరించింది. జీఎస్టీ చట్టం ప్రకారం, పన్ను చెల్లించని జీఎస్టీ రిజిస్టర్డ్ సంస్థల బ్యాంకు ఖాతాలు సహా ఇతర ఆస్తులను పన్ను అధికారులు తాత్కాలికంగా జప్తు చేయవచ్చు. అలాంటి అటాచ్ మెంట్ ఏడాది పాటు చెల్లుబాటు అవుతుందని కౌన్సిల్ నిర్ణయాన్ని సంజయ్ మల్హోత్ర తెలిపారు. -
Income Tax: బకాయిలుంటే ట్యాక్స్ రీఫండ్‌లో కటింగ్!
ఆదాయపు పన్ను బకాయిలను వసూలు చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ (Income Tax Department) సరికొత్త ప్రణాళిక రచించింది. బకాయిలున్న పన్ను చెల్లింపుదారులు తమకు రావాల్సిన ట్యాక్స్ రీఫండ్ (Tax refund) తో బకాయిలను సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని ఆదాయపు పన్ను శాఖ కల్పించింది. ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ITR) ప్రాసెసింగ్‌ను వేగవంతంగా పూర్తి చేసేందుకు, రీఫండ్ల జారీని త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఐటీ శాఖ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. (New Rules: అక్టోబర్ 1 నుంచి అమలయ్యే కొత్త మార్పులు, నిబంధనలు ఇవే..) పన్ను బకాయిలు కూడా అధిక మొత్తంలో ఉన్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పెండింగ్‌లో ఉన్న బకాయిలను సర్దుబాటు చేసి ట్యాక్స్ రీఫండ్లను సకాలంలో జారీ చేయడానికి సహకరించాలని కోరింది. బకాయిల సర్దుబాటుపై తమ సమ్మతిని తెలియజేయడానికి ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 245(1) ట్యాక్స్ పేయర్లకు అవకాశం కల్పిస్తుంది. దీని ప్రకారం.. బకాయిల సర్దుబాటుపై తమ అంగీకరిస్తున్నారో.. లేదో అని తెలియజేయాల్సి ఉంటుంది. (RBI Rules: వారికి 6 నెలలే సమయం.. ఆర్బీఐ కీలక నిబంధనలు) 2023-24 అసెస్మెంట్ ఇయర్ కోసం 7.09 కోట్ల రిటర్న్‌లు దాఖలుకాగా 6.96 కోట్ల ఐటీఆర్‌లను ఆదాయపు పన్ను శాఖ వెరిఫై చేసింది. ఇక ఇప్పటివరకు వీటిలో 2.75 కోట్ల రిటర్న్స్‌కు ట్యాక్స్ రీఫండ్‌ను చెల్లించగా 6.46 కోట్ల రిటర్న్‌లను ప్రాసెస్ చేసినట్లు ఐటీ శాఖ పేర్కొంది. -
లేటెస్ట్ టెక్నాలజీతో.. అందుబాటులోకి ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ తన ప్రధాన పోర్టల్‌ను పునరుద్ధరించింది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ పేస్, మెనూలు మార్పులు చేస్తూ తీర్చిదిద్దింది. తాజాగా, ఈ పోర్టల్‌ను సీబీడీటీ ఛైర్మన్ నితిన్ గుప్తా ప్రారంభించారు. ఇక, తాము కొత్తగా ప్రారంభించిన ఈ వెబ్సైట్ పన్ను చెల్లింపు దారులకు సౌకర్యవంతంగా ఉంటుందని నితిన్ గుప్తా తెలిపారు. పోర్టల్‌లో (https://incometaxindia.gov.in/) ట్యాక్స్‌కు సంబంధించిన చట్టాలు, నిబంధనల్ని సులభంగా తెలుసుకునేలా నావిగేషన్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు అలెర్ట్‌లు, ముఖ్యమైన తేదీలకు సంబంధించిన అలెర్ట్‌లు ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని పన్ను చెల్లింపు దారులకు సూచించారు. -
గడువు లోపు ‘ITR’ ఫైలింగ్ చేయకపోతే ఏమవుతుంది?
2023- 24 సంవత్సరానికి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) ఫైలింగ్ దాఖలు చేసేందుకు గడువు ఈ రోజుతో ముగియనుంది. పలు నివేదికల ప్రకారం.. నిన్న (జులై 30) సాయంత్రం 6 : 30 గంటల సమయానికి మొత్తం 6 కోట్ల మంది ట్యాక్స్ పేయర్లు ఐటీఆర్‌లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఐటీఆర్ ఫైలింగ్ చేసే సమయంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలపై పన్ను చెల్లింపు దారులు ఐటీ శాఖకు ఫిర్యాదు చేశారు. ఫైలింగ్ చేస్తున్నా కావడం లేదని, జులై 31, 2023 వరకు ఉన్న ఫైలింగ్ గడువు తేదీని పొడిగించాలని కోరారు. అందుకు ఐటీ శాఖ ఈ- ఫైలింగ్ పోర్టల్ పనితీరు బాగుంది. ఫైలింగ్ సమయంలో మీకు ఏమైనా సమస్యలు ఎదురైతే మమ్మల్ని సంప్రదించొచ్చు’ అని ట్వీట్ చేసింది. ఒక వేళ ఐటీ శాఖ ఇచ్చిన డెడ్‌లైన్ జులై 31లోపు ఐటీఆర్ ఫైలింగ్ చేయకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. లేట్ ఫీ పన్నులు చెల్లింపు దారులు ఐటీ శాఖ ఇచ్చిన గడువులోపు ట్యాక్స్ ఫైలింగ్ చేయకపోతే లేట్ ఫీ రూ.5,000 చెల్లించాలి. అనతరం డిసెంబర్ 31లో మరో సారి ఐటీఆర్‌లు దాఖలు చేసుకోవచ్చు. ఒకవేళ, పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయం రూ. 5,00,000 మించకపోతే రూ.1,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి (రూ.3లక్షల) కంటే తక్కువగా ఉంటే పన్ను చెల్లింపుదారులకు లేట్ ఫీ ఛార్జీలు వర్తించవు. . వడ్డీ ఒకవేళ, రిటర్న్ దాఖలు చేయడంలో జాప్యం జరిగితే ట్యాక్స్ పేయర్స్ చెల్లించే పన్నులో నెలకు 1 శాతం చొప్పున ఆదాయపు పన్ను శాఖ వడ్డీని వసూలు చేస్తుంది. ఒక కొనుగోలుదారుడికి ఏదైనా వస్తువును అమ్మేటప్పుడు అమ్మకందారు వసూలు చేసే ట్యాక్స్ టీసీఎస్, జీతాలు, కమీషన్, వడ్డీలు, డివిడెంట్లు ఇలా వివిధ రకాల ఆదాయ వనరులపై విధించే ట్యాక్స్ టీడీఎస్, ముందస్తు పన్ను, చట్టం క్రింద లభించే ఇతర ట్యాక్స్ రిలీఫ్/ట్యాక్స్ క్రెడిట్ల తగ్గింపు తర్వాత నికర ఆదాయంపై విధించే పన్నుపై వడ్డీ వర్తిస్తుంది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో ఒక రోజు ఆలస్యానికి కూడా ఒక నెల వడ్డీ వసూలు చేస్తారు. ట్యాక్స్ మినహాయింపు ఉండదు నిర్ణీత గడువులోగా పన్ను రిటర్న్‌ను దాఖలు చేయకపోవడం వల్ల భవిష్యత్ సంవత్సరాల్లో ట్యాక్స్ మినహాయింపు పొందే అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. వీటితో పాటు హౌస్ ప్రాపర్టీ, ఇతర విభాగాల్లో ట్యాక్స్‌ను ఆదా చేసుకోలేము. జరిమానా, జైలు శిక్ష జరిమానాలతో పాటు, పన్ను రిటర్నులను దాఖలు చేయడంలో విఫలమైతే జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. చెల్లించాల్సిన పన్ను లేదా, ఎగవేత రూ. 25,000 కంటే ఎక్కువ ఉన్న రిటర్న్‌లను ఆలస్యంగా దాఖలు చేస్తే , 6 నెలల నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. ట్యాక్స్ రిఫండ్ లేనట్లే టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ .. ఈ మూడింటిని కలిపితే మీరు చెల్లించిన మొత్తం పన్ను అవుతుంది. మదింపు చేసిన తర్వాత చెల్లించాల్సిన పన్ను భారం కన్నా మీరు కట్టిన పన్ను మొత్తం ఎక్కువగా ఉంటే రిఫండు ఇస్తారు. అదీ సకాలంలో ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడే. సమయానికి ఐటీఆర్ ఫైల్ చేయకపోవడం వల్ల ట్యాక్స్ రిఫండ్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదీ చదవండి ➤ ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంచండి.. ఐటీ శాఖ రెస్పాన్స్ ఇదే.. -
మార్చి 31 డెడ్‌లైన్: చేయాల్సిన కీలకమైన పనులు ఏంటో తెలుసా?
సాక్షి, ముంబై: అనేక కీలకమైన ఆర్థిక పనులకు మార్చి 31 తుది గడువు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజు మార్చి 31 చివరి రోజు లోపు ఈ పనులను పూర్తి చేయడంలో విఫలమైతే మన జేబుకు చిల్లు పడక తప్పదు. ఎలాంటి ఆర్థిక జరిమానాలు లేదా ఖాతాల డీయాక్టివేషన్ లాంటి ప్రమాదం లేకుండా, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు చేయాల్సిన పనుల్లో ముఖ్యంగా పాన్ ఆధార్ లింకింగ్, పన్ను ప్రణాళిక లాంటికొన్ని ముఖ్యమైన పనులను ఒకసారి చూద్దాం. 2023, మార్చి 31 లోపు పూర్తి చేయాల్సిన పైనాన్షియల్ టాస్క్స్ ► పాన్ -ఆధార్ కార్డ్ లింక్: మార్చి 31 లోపు పాన్ ఆధార్ కార్డ్‌లను లింకింగ్ పూర్తి చేయాలి. లేదంటే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్ చెల్లదు. దీంతో ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను ఫైల్ చేయలేరు. ► అలాగే రూ. 1,000 ఫైన్. అంతేకాదు తప్పుడు లేదా చెల్లని పాన్‌ను కోట్ చేస్తే రూ. 10,000 జరిమానా . ► అప్డేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్: 2019-2020, AY 2020-21కి సంబంధించిన అప్డేట్ చేయబడిన ఆదాయ-పన్ను రిటర్న్‌ను 31 మార్చి 2023 లోపు సమర్పించడం అవసరం. గడువు ముగిసాక ఫైల్ చేయలేరు. ► ముందస్తు పన్ను చెల్లింపు: రూ. 10,000 కంటే పన్ను చెల్లించాల్సి ఉన్న చెల్లింపుదారుడు ముందస్తు పన్ను చెల్లించాలి. జూన్ 15లోగా 15 శాతం, సెప్టెంబర్ 25లోగా 45 శాతం, డిసెంబర్ 15లోగా 75 శాతం, మార్చి 15 నాటికి 100 శాతం చొప్పున నాలుగు వాయిదాల్లో చెల్లిస్తారు. అయితే, మూలధన లాభాలు వంటి అదనపు ఆదాయం ఉన్నా, ఉద్యోగాన్ని మార్చుకున్నా మీరు ముందస్తు పన్నును లెక్కించి చెల్లించాల్సి ఉంటుంది. ► 2022-2023కి సంబంధించిన మొత్తం ముందస్తు పన్నును మార్చి 15లోపు ఇంకా చెల్లించనట్లయితే, మార్చి 31, 2023లోపు చెల్లించే అవకాశం ఉంది. మార్చి తర్వాత, నెక్ట్స్ ఐటీఆర్ వరకు బకాయిపై నెలకు 1 శాతం వడ్డీని చెల్లించాలి. ► ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నట్లయితే, అత్యధిక పరిమితి రూ. 1.5 లక్షలతో పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ► పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి పెట్టండి: పీపీఎఫ్ సుకన్య సమృద్ధి యోజన, ఫిక్స్డ్ డిపాజిట్ ,ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ వంటి పన్ను ఆదా పథకాలలో పెట్టుబడుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచచ్చు ► ఫారమ్ 12బీ: ఉద్యోగం మారినట్టయితే వారు ఫారమ్ 12B పూరించడాన్ని మర్చిపోవద్దు. ► మ్యూచువల్ ఫండ్ నామినేషన్: సెబీ సర్క్యులర్ ప్రకారం, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వారు మార్చి 31 లోపు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయకపోతే ఖాతా బంద్ అవుతుంది. ► మార్కెట్ రెగ్యులేటరీ ప్రకారం మార్చి 31లోపు NSE NMF ప్లాట్‌ఫారమ్‌లో మొబైల్ నంబర్ , ఇమెయిల్ ఐడీని ధృవీకరించుకోవడం అవసరం. ► క్యాపిటల్ గెయిన్: ఇంతకుముందు ఈక్విటీలపై దీర్ఘకాలిక పన్ను రహితంగా ఉండేది. ఈక్విటీ ఫండ్‌పై దీర్ఘకాలిక మూలధన లాభం 1 లక్ష కంటే ఎక్కువ మొత్తంలో ఇండెక్సేషన్ ప్రయోజనం లేకుండా పన్ను రేటు 10 శాతం. సో..పెట్టుబడులను రీడీమ్ చేయాలనుకుంటే పన్ను రహిత పరిమితి రూ. 1 లక్ష ప్రయోజనాన్ని పొందాలనుకుంటే మార్చి 31లోపు రిడీమ్ చేసుకోవచ్చు. స్వల్పకాలిక మూలధన లాభాలపై పన్ను 15 శాతం ► ప్రధానమంత్రి వయ వందన యోజన: సీనియర్ సిటిజన్లు, రిటైర్ మెంట్ ఫండ్ కోసం ప్రధానమంత్రి వయ వందన యోజన (PMVVY) వంటి పలు ఆప్షన్స్ ఉన్నాయి ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకునే 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు మార్చి 31, 2023 లోపు దీన్ని ప్రారంభిస్తే మంచింది. ► ఈ పాలసీలో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 10 సంవత్సరాల పథకంలో, పెట్టుబడిదారులు 7.4 శాతం చొప్పున పెన్షన్ పొందుతారు. ఈ పథకం కింద 10 సంవత్సరాల నిర్ణీత కాలానికి. రూ.9,250 నెలవారీ పెన్షన్ , రూ. 1.62 లక్షల కనీస పెట్టుబడిపై, నెలవారీ పెన్షన్ రూ. 1,000 వరకు వస్తుంది. -
ప్రభుత్వానికి ఆరు ప్రయోజనాలు.. ప్రజలకు అరవై నష్టాలు..!
ప్రభుత్వానికి ఆరు ప్రయోజనాలు.. ప్రజలకు అరవై నష్టాలు..! -
10ఎఫ్ దాఖలుకు మార్చి వరకు గడువు
న్యూఢిల్లీ: నాన్ రెసిడెంట్ (భారత్‌లో నివసించని) పన్ను చెల్లింపుదారులు 10ఎఫ్ పత్రాన్ని మాన్యువల్‌గా (భౌతికంగా) దాఖలు చేసేందుకు 2023 మార్చి 31 వరకు కేంద్ర సర్కారు గడువు ఇచ్చింది. దీనివల్ల నిబంధనల అమలు భారం తగ్గుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. తక్కువ టీడీఎస్ అమలు చేసేందుకు వీలుగా నాన్ రెసిడెంట్ పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్లో ఫామ్ 10ఎఫ్ దాఖలు చేయడం తప్పనిసరి అంటూ ఈ ఏడాది జూలైలో సీబీడీటీ ఆదేశాలు తీసుకొచ్చింది. పాన్ నంబర్లు లేని వారు ఫామ్ 10ఎఫ్ దాఖలు చేసేందుకు ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్ పోర్టల్ అనుమతించడం లేదు. దీంతో పన్ను చెల్లింపుదారులు ఫామ్10 ఎఫ్ దాఖలు విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. దీంతో భౌతికంగా దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. -
పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక
ట్యాక్స్ పేయర్స్‌కు అలెర్ట్. అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) సభ్యత్వం పొందేందుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ ఆగస్టు నెలలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం..అక్టోబర్1, 2022 నుండి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఏపీవై పథకంలో చేరేందుకు అనర్హులని పేర్కొంది. ఒకవేళ అక్టోబర్ 1, 2022 న లేదా ఆ తర్వాత ధరఖాస్తు చేసుకుంటే లబ్ధి దారుల ఖాతాను మూసివేయడంతో పాటు డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ఆ నోటిఫికేషన్లో తెలిపింది. అటల్ పెన్షన్ యోజన పథకంలో సభ్యత్వం ఎలా పొందాలి? ►18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు (తక్కువ, ఎగువ పరిమితులతో సహా) ఈ పథకంలో చేరేందుకు అర్హులు. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా చేయొచ్చు. అలాగే, ఏపీవై ఖాతాలో జీవిత భాగస్వామి వివరాలు, నామినేషన్‌ను అందించడం తప్పనిసరి. ► మీ సేవింగ్స్ ఖాతా ఉన్న బ్యాంక్ బ్రాంచ్‌లో అటల్ పెన్షన్ యోజన రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తి చేయండి. ► ఖాతా నంబర్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ మొదలైన వాటితో సహా అవసరమైన వివరాలను అందించండి. నమోదు కోసం, ఆధార్ ప్రాథమికంగా మీ కస్టమర్‌ను తెలుసుకోండి (కేవైసీ). ► ఏపీవై ఖాతా తెరిచిన తర్వాత..అందులో తగినంత సొమ్మును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ సేవింగ్ అకౌంట్లో అవసరమైన బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. -
సంసిద్ధంగా ఉన్నారా! పన్ను చెల్లింపు దారులకు ముఖ్యగమనిక!
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే రోజు రానే వచ్చింది. వెబ్సైట్లో ఫారం 1 అలాగే 4 దాఖలు చేయటాన్ని ఎనేబుల్ చేశారు. సంసిద్ధం కండి. ముందుగా ముఖ్యమైన విషయాలు. ►31–03–2022 తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గడువు తేదీ 31–07–2022. ►ఫారాలు 1, అలాగే 4లో చిన్న మార్పులు మినహా పెద్ద మార్పులు లేవు. ►మీ దగ్గర పూర్తి సమాచారం కాగితాల రూపంలో ఉంటే మీరు ఆన్లైన్లో ఫైల్ చేయవచ్చు. ►సమాచారం, కాగితాలు కావాలన్నా, రావాలన్నా కసరత్తు మొదలెట్టండి. ఐటీఆర్ 1 ఫారం గురించి.. ►దీన్నే ’సహజ్’ అని అంటారు. పేరుకు తగ్గట్లుగానే సరళంగానే ఉంటుంది. ►ఆన్లైన్లో వేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ వేసుకోవాలంటే ఫారం ‘‘వినియోగ స్థితి’’ ( Utility) ద్వారా డౌన్లోడ్ చేసుకుని వేసుకోవచ్చు. ►రెసిడెంట్ వ్యక్తి మాత్రమే వేయగలరు. ►31–03–2022 సంవత్సరానికి మొత్తం ఆదాయం అంటే ట్యాక్సబుల్ ఆదాయం రూ. 50,00,000 మించకూడదు. ►జీతం, పెన్షన్, ఒక ఇంటి మీద ఆదాయం, ఫ్యామిలీ పెన్షన్, వ్యవసాయ ఆదాయం రూ. 5,000 లోపలున్న వారు మరియు ఇతర ఆదాయం ఉన్న వారు మాత్రమే వేయగలరు. ►ఇతర ఆదాయం అంటే బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ, డిపాజిట్లు (బ్యాంకు, పోస్టాఫీసు, సహకార సంస్థలు) మీద వడ్డీ.. ఇతర వడ్డీల ఆదాయం ఉన్నవారు వేయొచ్చు. ఐటీఆర్ ఫారం 4 గురించి.. ►ఈ ఫారం వేతన జీవులకు వర్తించదు. ►వ్యాపారం, వృత్తి చేసే వారికి మాత్రమేవర్తిస్తుంది. ► రెసిడెంట్ వ్యక్తులు, హిందూ ఉమ్మడి ►కుటుంబాలు, భాగస్వామ్య సంస్థలు వేయవచ్చు. ►ట్యాక్సబుల్ ఇన్‌కం రూ. 50,00,000 దాటకూడదు. ►44ఏడీ, 44 ఏడీఏ, 44ఏఈల ప్రకారం వ్యాపారం,వృత్తుల మీద .. బుక్స్‌తో నిమిత్తం లేకుండా, లెక్కలతో నిమిత్తం లేకుండా ఊహాజనితంగా .. అంటే టర్నోవరుపై నిర్దేశిత శాతం లేదా ఎక్కువ శాతం లాభాన్ని లెక్కించే వేయాలి. ►మిగతా విషయాలన్నీ ఫారమ్ 1కి వర్తించేవే వర్తిస్తాయి. ఈ కింది పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోండి. ►అన్ని కాగితాలు, సమాచారం పెట్టుకుని ఒక స్టేట్మెంటు తయారు చేసుకోండి. ►ప్రీ–ఫిల్డ్ రిటర్న్ కాబట్టి సమాచారం ఎదురుగా కనిపిస్తూనే ఉంటుంది. ►అలాంటి సమాచారం తప్పని తోచినా, మీది సంబంధించినది కాకపోయినా విభేదించవచ్చు. మార్పులు చేయవచ్చు. ►ఫెలింగ్ ప్రాసెస్ మొదలెట్టండి. ►ఈ–వెరిఫై చేయండి. ఇంతటితో ప్రక్రియ పూర్తి అయినట్లే .. ఎప్పటికప్పుడు డిపార్ట్మెంటు వెబ్సైట్లో మార్గదర్శకాలు ఉంటాయి. అవసరం అయితే రిఫర్ చేయండి. -
సెప్టెంబర్ 30 వరకు ఐటీఆర్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం అందించేందుకు గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ఐటీఆర్) దాఖలు చివరి తేదీని జూలె 31 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అలాగే సాఫ్ట్వేర్ లోపం కారణంగా ఇప్పటికే పన్ను చెల్లింపుదారులు అదనపు వడ్డీ, ఆలస్య రుసుములను చెల్లించినట్లయితే వాటిని రీఫండ్ చేస్తామని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. జూలై 31 తర్వాతి నుంచి ఆలస్య రుసుములు, వడ్డీలు వసూలు చేస్తున్నారని కొంతమంది ట్యాక్స్‌పేయర్లు ఫిర్యాదులు చేశారని.. ఈనెల ఒకటో తేదీన సాఫ్ట్వేర్ లోపం సరిదిద్దామని ఐటీ శాఖ ట్వీట్లో పేర్కొంది. లేటెస్ట్ వెర్షన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలని ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు సూచించింది. ఇప్పటికే ఎవరైనా ట్యాక్స్‌పేయర్లు అదనపు వడ్డీ లేదా ఆలస్య రుసుములతో ఐటీఆర్‌లను సమర్పించినట్లయితే సీపీసీ–ఐటీఆర్ ప్రాసెస్‌లో సరిచేయబడుతుందని.. ఏదైనా అదనపు చెల్లింపులుంటే వాటిని సాధారణ కోర్స్‌లో రీఫండ్ చేస్తామని ఐటీ శాఖ వివరించింది. -
నిజాయితీగా పన్ను చెల్లించేవారికి గుర్తింపు
న్యూఢిల్లీ: జాతి నిర్మాణం కోసం బాధ్యతాయుతంగా తమ వంతు వాటా మేర పన్నులను చెల్లిస్తున్న నిజాయితీపరులకు కచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో సవాళ్లు, ఆటంకాలతో కూడిన పరిస్థితుల్లోనూ నిబంధనలను పాటిస్తున్నందుకు పన్ను చెల్లింపుదారులను ప్రశంసించారు. ఎన్నో సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తున్న ఆదాయపన్ను శాఖను ఆమె అభినందించారు. ఆదాయపన్ను శాఖ 161వ వార్షికోత్సవం సందర్భంగా మంత్రి సందేశం ఇచ్చారు. ఆదాయపన్ను శాఖ విధానాలు, ప్రక్రియలను సులభతరంగా మార్చడంలోను, పారదర్శకంగా, సౌకర్యవంతమైన అనుభవాన్ని పన్ను చెల్లింపుదారులకు కల్పించే విషయంలో ఆదాయపన్ను శాఖ చేస్తున్న కృషిని కొనియాడారు. ఆదాయపన్ను శాఖకు సంబంధించి చాలా వరకు ప్రక్రియలు, నిబంధనల అమలు ఆన్లైన్ వేదికలపైకి తీసుకురావడం వల్ల.. పన్ను చెల్లింపుదారులు ఆదాయపన్ను శాఖలకు ప్రత్య క్షంగా రావాల్సిన అవసరం లేకుండా పోయినట్టు లేదా చాలా వరకు పరిమితమైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. పన్ను ల వసూళ్లలో ఆరోగ్యకరమైన వృద్ధి నెలకొనడం పట్ల ఆదాయపన్ను శాఖ కృషిని రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్‌బజాజ్ కూడా అభినందించారు. -
పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ప్రీ-ఫిల్డ్ ఫారంలు వచ్చేశాయి
ఆదాయపు పన్ను శాఖ వారు సంస్కరణల పేరిట తీసుకొచ్చిన పెనుమార్పుల్లో కొత్త ఫారంలు కూడా ఉన్నాయి. వీటినే ప్రీ ఫిల్డ్ ఫారంలని కూడా అంటారు. కొత్త మార్పుల కారణంగా మనం సైటులోకి వెళ్లి ఫారంలోని ఒక్కొక్క అంశం టైప్ చేసి నింపాల్సిన అవసరం లేకుండా.. డౌన్లోడ్ చేసేసరికే ఫారంలో అంశాలు నింపేసి ఉంటాయి. అంటే డిపార్ట్మెంట్ సిబ్బందే మనకు సంబంధించిన వివరాలను ఫారంలో పొందుపర్చి ఉంచుతారు. మీరు వాటిని సరిచూసుకుని, సరిగ్గానే ఉన్నట్లయితే ఒక్క క్లిక్‌తో ఫారంను ఫైల్ చేయొచ్చు. ఒకవేళ సరిపోలకపోయిన పక్షంలో సదరు అంశాలను మీ లెక్కల ప్రకారం సవరించి, రిటర్నులు దాఖలు చేయొచ్చు. ఈ విధానాన్ని 2019 నుంచి పాక్షికంగా ప్రవేశపెట్టగా.. ఈ సంవత్సరం నుంచి సమగ్రమైన వివరాలతో పూర్తి స్థాయిలో అమలు కాగలదని విశ్లేషకుల అంచనా. డిపార్ట్మెంట్ దగ్గర మన ఆదాయాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది అనటంలో అతిశయోక్తి లేదు. డిపార్ట్మెంట్ ఏం చెబుతోందంటే.. ఈ ఫారంలు నింపటం చాలా సులువు. చాలా త్వరగా నింపవచ్చు. పారదర్శకత మెరుగుపడుతుంది. ఎక్కువ మందిని ఆకట్టుకుంటుంది. సమగ్రమైన సమాచారం కలిగి ఉంటుంది. చట్టాలకు అనుగుణంగా పని త్వరగా పూర్తవుతుంది. తప్పులకు ఆస్కారం ఉండదు. పన్నుల ఎగవేత తగ్గుతుంది. పైన పేర్కొన్న ప్రయోజనాలతో అంతా ఏకీభవించక తప్పదు. ఆదాయపు పన్ను శాఖ ఆలోచన అలాగే ఉంటుంది. ఎందుకంటే, ఎన్నో ఆర్థిక వ్యవహరాలు జరుగుతున్నా .. అసెసీలు వాటిని తమ తమ వార్షిక రిటర్నులలో చూపించడం లేదు. నిజాయితీగా ఆదాయం, ఆర్థిక వ్యవహారాలను చూపించని బడాబాబులు ఎందరో ఉంటారు. ఈ విషయం అలా ఉంచితే.. మీరు చేయవలసిందేమిటంటే.. మీ పేరు మీదనున్న అన్ని బ్యాంకు అకౌంట్లలో లావాదేవీలను పరిగణనలోకి తీసుకోండి. అన్ని ఆదాయాలు .. జీతం, ఇంటద్దె, లాభాలు, క్యాపిటల్ గెయిన్స్, వడ్డీ, డివిడెండ్లు మొదలైనవన్నీ లెక్కలోకి తీసుకోండి. ప్రతి లావాదేవీకి వివరణ, కాగితాలను సమకూర్చుకోండి. ఫారం నింపే ముందు ఫారం 16, 16ఎ, 26ఏఎస్ మొదలైనవన్నీ పరిశీలించి చూసుకోండి. అంశాల్లో అంకెలు సరిపోలకపోతే... అంటే మిస్ మ్యాచ్ అయితే.. సరిచేసుకోండి. ప్రతీ మార్పు, చేర్పునకు వివరణ ఉంచుకోండి. అవసరం అయితే వృత్తి నిపుణులను సంప్రదించండి. ఇక, ఈ ప్రీ-ఫిల్డ్ ఫారంలలో కొన్ని సమస్యలు కూడా ఉంటున్నాయి. అవేంటంటే.. అంకెలు సరిపోలకపోవడం.. మిస్ మ్యాచ్ కేవలం టీడీఎస్ వివరాలు ఉంటున్నాయి. ఆదాయ వివరాలు ఉండటం లేదు. క్లోజ్ చేసిన బ్యాంకు అకౌంట్ల వివరాలు కూడా పొందుపర్చి ఉంటున్నాయి. కాబట్టి .. ఇలాంటివన్నీ చూసుకుని, తగు జాగ్రత్తలు తీసుకుని రిటర్నులు దాఖలు చేయాలి. ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య -
పన్ను చెల్లింపుదారుల గుర్తింపునకు పోర్టల్
న్యూఢిల్లీ: దేశంలో నిజాయితీగా పన్నులు చెల్లించేవారిని గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో ‘‘పారదర్శక పన్ను విధానం–నిజాయితీపరులకు గౌరవం’’ పేరుతో ఏర్పాటైన ఓ ప్లాట్ఫార్మ్ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించనున్నారు. ఈ ప్లాట్ఫార్మ్ ద్వారా ప్రత్యక్ష పన్నుల విధానాల్లో సంస్కరణలను అమలు చేస్తామని బుధవారం వెలువడిన ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ప్రధాని ఆన్లైన్ పద్ధతిలో ప్లాట్ఫార్మ్ను ప్రారంభిస్తారని, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌లతోపాటు దేశంలోని వాణిజ్య సంస్థలు, చార్టర్డ్ అకౌంటెంట్లు, గణనీయమైన పన్ను చెల్లింపుదారుల అసోసియేషన్లు పాల్గొంటాయని ఆ ప్రకటన తెలిపింది. ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇటీవలి కాలంలో ప్రత్యక్ష పన్నుల విధానంలో పలు మార్పులు తీసుకొచ్చిందని, గత ఏడది కార్పొరేట్ ట్యాక్స్ రేట్లను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామని, కొత్త తయారీ సంస్థలకు దీన్ని పదిహేను శాతం చేశామని ఈ ప్రకటనలో వివరించారు. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నును కూడా రద్దు చేసినట్లు తెలిపింది. పన్నుల రేట్లు తగ్గింపు, నిబంధనల సరళీకరణలే లక్ష్యంగా ప్రత్యక్ష పన్నుల విధానంలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు తెలిపారు. -
‘పన్ను’ పరిష్కారాలకు ‘వివాద్ సే విశ్వాస్’
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు సాయపడేందుకే వివాదాల పరిష్కార పథకం ‘వివాద్ సే విశ్వాస్’ను బడ్జెట్లో ప్రకటించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘‘ఈ పథకం పన్ను వివాదాల్ని పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. పన్ను చెల్లింపుదారులు.. కేసుల పరిష్కారానికి ఎంతో సమయాన్ని, డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. ఈ పథకం వాటిని ఆదా చేస్తుంది’’ అని తెలియజేస్తూ.. ‘డైరెక్ట్ ట్యాక్సెస్ వివాద్ సే విశ్వాస్, 2020’ బిల్లును సోమవారం పార్లమెంట్లో మంత్రి ప్రవేశపెట్టారు. ఎందుకు ఈ పథకం..? ప్రత్యక్ష పన్నులకు సంబంధించి కమిషనర్, అప్పీల్స్, ఆదాయపన్ను శాఖ.. ఆదాయపన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్.. హైకోర్టు.. సుప్రీంకోర్టు వంటి పలు అప్పిలేట్ వేదికల వద్ద 4,83,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.9 లక్షల కోట్లు రావాల్సి ఉంది. వీటిలో అధిక భాగాన్ని ఈ ఏడాది మార్చి చివరికి పరిష్కరించి, పన్నుల ఆదాయం పెంచుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం కూడా ఈ లక్ష్యంలో భాగమే. ఈ పథకంలో కింద... వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించినట్లయితే వారికి ఎలాంటి జరిమానాలూ ఉండవు. పైపెచ్చు క్షమాభిక్ష కల్పిస్తారు. తద్వారా భవిష్యత్తులో ఆ వివాదానికి సంబంధించి చట్టపరమైన విచారణలు లేకుండా రక్షణ పొందొచ్చు. ఎవరికి వర్తిస్తుంది.. ఆదాయపన్ను శాఖ జారీ చేసిన డిమాండ్ నోటీసులను వ్యతిరేకిస్తూ అప్పీల్‌కు వెళ్లిన వారు.. 2020 మార్చి 31 నాటికి బకాయిలను చెల్లిస్తే చాలు. దానిపై వడ్డీ, పెనాల్టీని ప్రభుత్వం రద్దు చేస్తుంది. గడువు నాటికి చెల్లించలేకపోతే, మార్చి తర్వాత జూన్ 30 వరకు మరో విడత గడువు లభిస్తుంది. కానీ, మార్చి 31లోపు చెల్లించాల్సిన దానితో పోలిస్తే ఆ తర్వాత 10 శాతం అదనంగా చెల్లించాలి. 2020 జనవరి 31 నాటికి పలు అప్పిలేట్ ఫోరమ్‌ల వద్ద నమోదై, అపరిష్కృతంగా ఉన్న కేసులు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. పన్ను చెల్లింపులు రూ.5 కోట్లలోపు ఉన్న సోదా కేసులకే ఇది వర్తిస్తుంది. ఎంత మేర చెల్లించాలి..? సోదా కేసులు: ఆదాయ పన్ను, వడ్డీ, పెనాల్టీల రూపంలో చెల్లించాల్సిన మొత్తానికి మరో 25 శాతం కలిపి మొత్తం 125 శాతాన్ని మార్చి చివరి నాటికి చెల్లించడం ద్వారా వివాదాలను తొలగించుకోవచ్చు. మార్చిలోపు సాధ్యం కాకపోతే, తర్వాత జూన్ 31 నాటికి 135 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సోదా జరగని కేసులు: పన్ను, పెనాల్టీ, వడ్డీ రేటుపై వివాదం ఉంటే... ఆ మొత్తాన్ని (100 శాతాన్ని) మార్చి చివరిలోపు చెల్లించడం ద్వారా వివాదాన్ని మాఫీ చేసుకోవచ్చు. ఈ గడువు దాటితే జూన్ చివరికి 110 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఆదాయపన్ను కింద రూ.1,00,000 చెల్లించగా.. ఆదాయపన్ను శాఖ మాత్రం చెల్లించాల్సిన పన్ను ఆదాయం రూ.1,50,000గా తేల్చి, దీనికి రూ.20,000 వడ్డీ కింద, రూ.1,00,000 పెనాల్టీ కింద చెల్లించాలని డిమాండ్ చేసి ఉంటే.. అప్పుడు వివాదంలో ఉన్న మొత్తం రూ.1,70,000 అవుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ పన్ను చెల్లింపుదారు అప్పీల్ కోసం దాఖలు చేసి ఉంటే.. ఈ కేసులో కేవలం రూ.50,000ను మార్చి చివరికి చెల్లించడం ద్వారా మాఫీ చేసుకోవచ్చు. మార్చి తర్వాత అయితే 10% అదనంగా రూ.55,000 చెల్లించాల్సి ఉంటుంది. ♦ ఇక కేవలం పెనాల్టీ, వడ్డీ రేటుపైనే వివాదం ఉన్నట్టయితే, చెల్లించాల్సిన మొత్తంలో మార్చి ఆఖరు నాటికి కనీసం 25% చెల్లిస్తే చాలు. ఆ తర్వాత జూన్‌లోపు అయితే చెల్లించాల్సిన మొత్తం 30 శాతం అవుతుంది. ఇవన్నీ కూడా పన్ను చెల్లింపుదారులు అప్పీలు దాఖలు చేసిన కేసులకే వర్తిస్తాయి. ఒకవేళ ఆదాయపన్ను శాఖే అప్పీల్‌కు వెళ్లి ఉంటే, చెల్లించాల్సిన మొత్తం ఇంత కంటే తక్కువగా ఉంటుంది. అందరికీ ఈ పథకం వర్తించదండోయ్.. ఈ ప్రతిపాదిత పథకం కొన్ని వివాదాలకు వర్తించదు. పన్ను చెల్లింపుదారుడికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ ఆరంభమై ఉన్నా...సోదాలు జరిగి, రూ.5 కోట్లకు పైగా విలువైన స్వాధీనాలు చోటు చేసుకున్నా... బయటకు వెల్లడించని విదేశీ ఆదాయం, విదేశీ ఆస్తులు కలిగి ఉన్న కేసులైనా... భారతీయ శిక్షాస్మృతి, మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం కింద విచారణ ఎదుర్కొంటున్నా... అటువంటి వారు ఈ పథకం కింద వివాదాలు పరిష్కరించుకునే అవకాశం ఉండదు. -
కోటీశ్వరులు ఎంత శాతం పెరిగారో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో కోటీశ్వరులు సంఖ్య పెరుగుతోంది. ప్రత్యక్ష పన్నుల సెంట్రల్ బోర్డ్ (సిబిడిటి) విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నాలుగేళ్లలో కరోడ్ పతిల సంఖ్య భారీ పెరుగుదలను నమోదు చేసింది. ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తూ వ్యక్తిగత పన్నులు చెల్లిస్తున్నవారు గత నాలుగేళ్లలో 1.40లక్షల మంది పెరిగారని సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లెక్కల ప్రకారం కోటి పైగా సంపాదిస్తున్నవారి సంఖ్య సుమారు 60శాతం పెరుగుదలను నమోదు చేసిందని తెలిపింది. గత నాలుగేళ్లలో ఆదాయపు పన్ను, ప్రత్యక్ష పన్నులచెల్లింపుల గణాంకాలను సీబీడీటీ సోమవారం ప్రకటించింది. ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తూ వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పుంజుకుందని సీబీడీటీ ఛైర్మన్ సుశీల్ చంద్ర పేర్కొన్నారు. ఆదాయ పన్ను శాఖ తీసుకుంటున్న కఠిన చర్యల కారణంగా గత మూడేళ్లలో పన్ను చెల్లింపు దారుల నమోదు భారీగా పెరిందని తెలిపారు. కోటి రూపాయల ఆదాయాన్ని చూపిస్తూ (కార్పొరేట్లు, సంస్థలు, హిందూ డివైడెడ్ ఫ్యామిలీస్ తదితరులు) ఆదాయపన్ను చెల్లిస్తున్నవారి మొత్తం సంఖ్య ఏటా 68 శాతం పెరిగిందన్నారు. కార్పొరేట్ పన్ను చెల్లింపుదారుల సంఖ్య 55 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2014-15 లో రూ. 32.28 లక్షల తో పోలిస్తే ప్రస్తుత ఏడాదిలో సగటు పన్ను రూ .49.95 లక్షలకు పెరిగింది. సాలరీడ్ టాక్స్ పేయర్స్ సంఖ్య 37శాతం పెరిగింది. అలాగే నాన్ సాలరీడ్ టాక్స్ పేయర్స్ సంఖ్య 19శాతం వృద్ధిని నమోదు చేసింది. -
పాన్, ఆధార్ లింక్‌పై గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. పాన్ నెంబర్‌తో ఆధార్‌ను లింక్ చేసుకునే ప్రక్రియ గడువును మరో నాలుగు నెలల పాటు ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. దీంతో పాన్‌తో, ఆధార్‌ను లింక్ చేసుకునే తుది గడువుగా డిసెంబర్ 31ను నిర్దేశించింది. పాన్‌తో ఆధార్‌ను జతచేయాలని ఇటీవలే కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి తుది గడువు కూడా నేటితోనే ముగియబోతుంది. ఆఖరి రోజున ఈ గడువును పెంచుతున్నట్టు ఆదాయపు పన్ను శాఖ చెప్పింది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే, పన్ను రిటర్న్‌లు ఫైల్ చేసే ప్రక్రియ ముందుకు సాగదని ఆదాయపు పన్ను శాఖ అంతకముందు చెప్పింది. 2017 ఆగస్టు 5 వరకు ఆదాయపు పన్ను రిటర్న్‌లు ఫైల్ చేసిన వారికి ఇది అతిపెద్ద ఊరటగా కనిపిస్తోంది. ఐటీఆర్ ఫైల్ చేసే తుదిగడువును ఆగస్టు 5 వరకు పొడిగించిన కేంద్రప్రత్యక్ష పన్ను బోర్డు, అదనంగా ఆ పన్ను చెల్లింపుదారులకు పాన్‌ను ఆధార్‌తో ఆగస్టు 31 వరకు లింక్ చేసుకోవాలని ఆదేశించింది. చాలామంది పన్ను చెల్లింపుదారులు, పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోకపోవడం వల్లే ఐటీఆర్‌ను ఫైల్ చేయలేకపోయారని తెలిసింది. అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా ఆధార్ కార్డును అనుసంధానం చేసుకునే ప్రక్రియ గడువును డిసెంబర్ 31 వరకు పెంచాలని సుప్రీంకోర్టు నిన్ననే(బుధవారం) ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ కూడా మరో మూడు నెలలపాటు ఈ గడువును పొడిగించనున్నామని కోర్టుకు చెప్పారు. -
ట్యాక్స్ రిటర్న్స్‌పై సీబీడీటీ క్లారిటీ
ముంబై : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి 2016-17 ఆర్థిక సంవత్సరపు గడువు దగ్గరపడుతోంది. ఇంకో రెండో రోజుల్లో అంటే జూలై 31కు ఈ గడువు ముగియబోతుంది. ఇప్పటివరకు రిటర్న్ దాఖలు చేయని వారికి గుడ్న్యూస్గా ప్రభుత్వం గడువు తేదిని పెంచబోతుందని రిపోర్టులు వస్తున్నాయి. కానీ రిటర్నును ఫైల్ చేయడానికి గడువును పెంచబోమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) స్పష్టంచేసింది. పన్ను చెల్లింపుదారులందరూ గడువు లోపు రిటర్నులను దాఖలు చేయాల్సిందేనని తెలిపింది. ఏడాది పన్ను చెల్లింపుదారులు చాలా కొత్త సమస్యలను ఎదుర్కొన్నారని, ఈ నేపథ్యంలో సహేతుక కారణాలు చూపించే వారికి ప్రభుత్వం గడువును పొడిగిస్తుందని రిపోర్టులు పేర్కొన్నాయి. ఉదాహరణకు.. ఇటీవల దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ విధానంతో చార్టెడ్ అకౌంటెంట్లు తలకు మించిన పనిభారంతో సతమతమవుతున్నారు. దీంతో బిజినెస్ క్లయింట్ల జీఎస్టీ వైపు ఎక్కువగా దృష్టిసారించడంతో, వారు తమ వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి సమయం లేకుండా పోయిందని సంబంధిత వర్గాలు చెప్పాయి. అంతేకాక ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి కచ్చితంగా పాన్‌కార్డుతో ఆధార్ లింకు అయి ఉండాలని ఇటీవలే ప్రభుత్వం ఆదేశించింది. ఈ కారణాల నేపథ్యంలో రిటర్నులు ఫైల్ చేయడానికి గడువు పెంచుతారని అందరూ ఆశించారు. కానీ వీరు ఆశలకు భిన్నంగా ప్రభుత్వం జూలై 31 వరకు రిటర్న్‌లను దాఖలు చేయాల్సిందేనని సీబీడీటీ ఆదేశించింది. -
ఇక నిమిషాల్లో పాన్ కార్డు
న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను శాఖ జారీచేసే శాశ్వత ఖాతా సంఖ్య(పాన్ కార్డు) కావాలంటే వారాల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితికి ఇక చెల్లుచీటి కానుంది. నిమిషాల్లో పాన్ కార్డు ఇక మీ ముందుకు రానుంది. అంతేకాక ఇన్ కమ్ ట్యాక్స్ ను స్మార్ట్ ఫోన్ ద్వారానే చెల్లించేలా అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. పన్ను చెల్లింపుదారులకు సులువుగా ఆధార్ కార్డు ఈ-కేవైసీ ఫెసిలిటీ ద్వారా పాన్ కార్డును జారీచేసేలా కేంద్రప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. ఒకవేళ సిమ్ ను ఈ-కేవైసీ ద్వారా జారీచేస్తే, పాన్ కార్డు కూడా ఇవ్వడం కుదురుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రెండు, మూడు వారాలు పడుతున్న ఈ పని ఇక ఐదు లేదా ఆరు నిమిషాల్లో ముగించేయొచ్చని పేర్కొంటున్నారు. మొదట నెంబర్ జారీచేసి, తర్వాత కార్డు డెలివరీ చేసేలా చూస్తున్నారు. ఇప్పటికే జతకట్టిన సీబీడీటీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు కొత్త కంపెనీల స్థాపనకు పాన్ కార్డును నాలుగు గంటల్లో జారీచేసేలా పనిచేస్తున్నాయి. -
ఐటీ రిటర్న్స్ లేటు చేశారో ఇక అంతే!
న్యూఢిల్లీ : నిర్దేశించిన గడువు లోపు ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటీఆర్స్) దాఖలు చేయకుండా జాప్యం చేశారో ఇక పన్ను చెల్లింపుదారులు భారీ జరిమానానే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐటీఆర్స్ రిటర్న్స్‌ను ఫైల్ చేయడంలో జాప్యం చేస్తే రూ.10వేల వరకు జరిమానా విధించనున్నామని ఫైనాన్సియల్ బిల్లు 2017 మెమోరాండంలో పేర్కొన్నారు. కానీ ఈ జరిమానా అమలు 2018-19 ఆర్థికసంవత్సరం నుంచి ప్రారంభమవుతోంది. ఐటీ చట్టంలోని కొత్త సెక్షన్ 234ఎఫ్ కింద ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. 2018-19 ఆర్థికసంవత్సరం నుంచి గడువు లోపు రిటర్న్స్ దాఖలు చేయకుండా జాప్యం చేస్తే దానికి తగ్గ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఫైనాన్సియల్ బిల్లు 2017 మెమోరాండంలో పేర్కొన్నారు. రెండు స్థాయిల్లో ఈ జరిమానా విధించనున్నారు. నిర్దేశిత గడువు అనంతరం అంటే ఆర్థికసంవత్సరంలో డిసెంబర్ 31కు ముందు లేదా అదేరోజు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే రూ.5వేల చార్జీలను కట్టాల్సి ఉంటుంది. మరేదైనా సందర్భాల్లో అయితే రూ.10వేల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుందని ఈ మెమోరాండంలో పేర్కొన్నారు. అదేవిధంగా మొత్తం ఆదాయం రూ.5 లక్షల దాటని వారికి కేవలం 1000 రూపాయలే జరిమానా విధించనున్నారు. ఐటీ చట్టంలోని ఈ సవరణలన్నీ 2018 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఈ మెమోరాండం పేర్కొంది. -
పన్ను చెల్లింపుదారులకు ఐటీ హెచ్చరిక
పన్ను చెల్లింపుదారులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎవరితో పంచుకోవద్దని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. ఒకవేళ పాస్‌వర్డు, ఐడీ అనధికారిక వ్యక్తుల చేతులోకి వెళ్తే యూజర్ల కీలక సమాచారం దుర్వినియోగానికి పాల్పడే అవకాశముందని పేర్కొంది. టీడీఎస్ సెంట్రలైజడ్ ప్రాసెసింగ్ ఈ మేరకు హెచ్చరికలను పన్ను చెల్లింపుదారులకు జారీచేసింది. పన్ను చెల్లింపుదారులు యూజర్ ఐడీ, పాస్‌వర్డు ఎంతో కీలకమైన సమాచారం, వీటితో టీడీఎస్ సంబంధిత రహస్య సమాచారం, కీలకమైన డేటా దిద్దుబాటుకు గురయ్యే అవకాశముంటుందని పేర్కొంది. ఒకవేళ పాస్వర్డ్ హ్యాక్ అయిన లేదా దొంగతనానికి గురైనా, సమాచారం భద్రత ఉల్లంఘనకు గురయ్యే అవకాశముంటుందని వెల్లడించింది. దీనివల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయని తెలిపింది. కనీసం ఎనిమిది క్యారెక్టర్లు ఉండేలా యూజర్లు పాస్వర్డ్లు క్రియేట్ చేసుకోవాలని, దానిలో నెంబర్లు, స్పెషల్ క్యారెక్టర్లు కూడా ఉండేలా చూసుకోవాలని సూచించింది. అయితే ఈ పాస్‌వర్డ్‌ను తమ డెస్క్‌పై ఉన్న నోట్‌ప్యాడ్స్ లేదా వైట్బోర్డులపై రాయవద్దని తెలిపింది. ఈ-మెయిల్స్, ఫోల్డర్స్, ఫైల్స్ వంటి వాటి పాస్వర్డ్లు కూడా కంప్యూటర్లపై ఉంచుకోవడం ఇబ్బందులు కలుగజేయవచ్చని హెచ్చరించింది. ఒకవేళ యూజర్లు ఈ-మెయిల్ లేదా కంప్యూటర్ అకౌంట్ హ్యాక్ అయితే, పాస్‌వర్డ్‌లను దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంటుందని, మీ ఈ-మెయిల్ అకౌంట్ ద్వారా క్రెడిట్/డెబిట్ కార్డుల కీలక సమాచారం కూడా ఇతర వ్యక్తుల చేతిలోకి పోతుందని తెలిపింది. -
తీవ్ర మార్పులు చేశారో...సీబీడీటీ గట్టి వార్నింగ్!
న్యూఢిల్లీ: పన్నుచెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖకు చెందిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ మార్పుల్లో అక్రమాలకుపాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. పునశ్చరణ నియమాలను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తప్పవని బుధవారం హెచ్చరించింది. అక్రమాలను గుర్తిస్తే దర్యాప్తు చేస్తామని సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐటీఆర్ లోని నిబంధనను ఉపయోగించుకొని "విపరీత మార్పులు" చేస్తే జరిమానా, చట్టపరమైన శిక్షలు విధించనున్నట్టు తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ లో భారీ మార్పులు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ మార్పులు చేసుకునే అవకాశాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సీబీడీటీ భావిస్తోంది. ఐటిఆర్ లో అవకతవకలకు పాల్పడినవారిపై విచారణ చేపట్టి జరిమానా విధించనున్నట్టు హెచ్చరించింది. ఐటీ చట్టం 139)(5) నిబంధనను సెక్షన్ ప్రకారం ఐటీ రిటర్న్స్ లో మార్పులకు చేర్పులకు అవకాశం ఉంది. క్యాష్ ఇన్ హ్యాండ్, లాభాలు వగైరాల వివరాలను మార్చుకోవచ్చు. అయితే సరైన ఆదాయం నిర్ధారించేందుకు ఆయా కేసులను తప్పనిసరిగా పరిశీలిస్తామని చెప్పింది. అక్రమాలు చో్టు చేసుకున్నట్టు తేలితే ప్రాసిక్యూషన్, పెనాల్టీ అర్హులని సీబీడీటీ వెల్లడించింది.