ఈ-మెయిల్ ద్వారా పన్ను నోటీసులు, వివరణలు | By e-mail tax notices, explanations | Sakshi
Sakshi News home page

ఈ-మెయిల్ ద్వారా పన్ను నోటీసులు, వివరణలు

Published Mon, Sep 21 2015 3:44 AM | Last Updated on Sun, Sep 3 2017 9:41 AM

ఈ-మెయిల్ ద్వారా పన్ను నోటీసులు, వివరణలు

ఈ-మెయిల్ ద్వారా పన్ను నోటీసులు, వివరణలు

- కొత్త విధానంపై ఐటీ శాఖ కసరత్తు
న్యూఢిల్లీ:
పన్ను చెల్లింపుదారులకు నోటీసులు ఇవ్వడానికి ఈ మెయిల్ మార్గాన్ని  ఆదాయపు పన్ను శాఖ ఉపయోగించుకోనున్నది. పన్ను చెల్లింపుదారులు తమ వివరణను కూడా ఈ మెయిల్ ద్వారా తెలిపే అవకాశం ఈ విధానంలో అందుబాటులోకి రానున్నది. మధ్య, అధిక స్థాయి పన్ను బ్రాకెట్‌లో ఉన్న పన్ను చెల్లింపుదారులకు ఈ కొత్త విధానం మంచి ప్రయోజనకరమని నిపుణులంటున్నారు. అసెస్సీకి, అధికారులకు మధ్య భారం తగ్గించే  దీనికి సంబంధించిన విధి విధానాలపై కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) కసరత్తు చేస్తోంది.

పన్ను చెల్లింపుదారుల ఇక్కట్లను తగ్గించే క్రమంలో భాగంగా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని సీబీడీటీ చైర్‌పర్సన్ అనితా కపూర్ పేర్కొన్నారు.  తనిఖీ అవసరమైన సందర్భాల్లో  పన్ను చెల్లింపుదారుడు తన ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్)లో ఇచ్చిన ఈ మెయిల్ అడ్రస్‌కు  నోటీస్ ఇస్తామని తెలిపారు. ఇలాంటప్పుడు సదరు అసెస్సీ, అసెస్సింగ్ ఆఫీసర్‌ను (ఏఓ)ను కలిసి వివరణ ఇవ్వనసరం లేకుండా తన వివరణను ఈ మెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement