అధికారులకు ఆర్థికమంత్రి సూచన
165వ ఆదాయపు పన్ను దినోత్సవ వేడుకల్లో ప్రసంగం
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు పంపే నోటీసులు లేదా లేఖలలో సరళమైన పదాలను ఉపయోగించాలని సంబంధిత అధికారులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఉన్న అధికారాన్ని వినియోగించడంలో న్యాయబద్దంగా వ్యవహరించాలని కూడా విజ్ఞప్తి చేశారు. 165వ ఆదాయపు పన్ను దినోత్సవ వేడుకలను ఉద్దేశించి సీతారామన్ మాట్లాడుతూ, వ్యక్తిగత హాజరు అవసరం లేని ప్రస్తుత డిజిటల్ యుగంలో అధికారులు పన్ను చెల్లింపుదారులతో మరింత ‘న్యాయంగా, స్నేహపూర్వకంగా‘ ఉండాలని అన్నారు. పన్ను నోటీసులు పన్ను చెల్లింపుదారులలో ‘భయ భావనను‘ సృష్టించకూడదని అన్నారు.
ఇందుకు బదులుగా నోటీసులు సరళంగా, సూటిగా ఉండాలన్నారు. నోటీసు పంపిన కారణాన్ని మదింపుదారునికి ‘స్పష్టంగా’ తెలియజేయాలని మంత్రి సూచించారు. ‘‘మనం సరళమైన, సులభంగా అర్థమయ్యేలా నోటీసులు జారీ చేసే మార్గాలను అన్వేíÙంచలేమా? ఎందుకు చర్య తీసుకున్నారో, నోటీసు ఎందుకు పంపడం జరుగుతోందో స్పష్టంగా వివరించలేమా?’ అని ఆమె ఈ సందర్భంగా ప్రశి్నస్తూ, ఆయా అంశాలను పన్ను చెల్లింపుదారులకు స్పష్టంగా తెలియజేయాలని కోరారు.
వేగవంతంగా రిఫండ్స్...
రిఫండ్‌లను వేగంగా జారీ చేయడంలో మెరుగుదలకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆర్థికమంత్రి సూచించారు. సమస్యకు తగిన చర్యలను మాత్రమే తీసుకోవాలని పేర్కొన్నారు. పన్ను చెల్లింపులకు తగిన న్యాయపరమైన చర్యలను చివరి ప్రయత్నంగా మాత్రమే అమలు చేయాలని ఆమె కోరారు. పన్ను డిమాండ్‌కు స్వచ్ఛంద సమ్మతిని ప్రోత్సహించడం డిపార్ట్‌మెంట్ లక్ష్యంగా ఉండాలన్నారు. పన్నుల శాఖ మరింత స్నేహపూర్వకంగా, పారదర్శకంగా ఉండాలని తాను తరచూ పేర్కొంటున్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, పన్ను అధికారులు ఇన్నాళ్లూ అన్యాయంగా వ్యవహరించారని తాను పేర్కొంటున్నట్లు అర్థం చేసుకోరాదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment