ట్యాక్స్ రిటర్న్స్‌పై సీబీడీటీ క్లారిటీ
ట్యాక్స్ రిటర్న్స్‌పై సీబీడీటీ క్లారిటీ
Published Sat, Jul 29 2017 9:49 AM | Last Updated on Tue, Sep 5 2017 5:10 PM
ముంబై : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి 2016-17 ఆర్థిక సంవత్సరపు గడువు దగ్గరపడుతోంది. ఇంకో రెండో రోజుల్లో అంటే జూలై 31కు ఈ గడువు ముగియబోతుంది. ఇప్పటివరకు రిటర్న్ దాఖలు చేయని వారికి గుడ్‌న్యూస్‌గా ప్రభుత్వం గడువు తేదిని పెంచబోతుందని రిపోర్టులు వస్తున్నాయి. కానీ రిటర్నును ఫైల్ చేయడానికి గడువును పెంచబోమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) స్పష్టంచేసింది. పన్ను చెల్లింపుదారులందరూ గడువు లోపు రిటర్నులను దాఖలు చేయాల్సిందేనని తెలిపింది. ఏడాది పన్ను చెల్లింపుదారులు చాలా కొత్త సమస్యలను ఎదుర్కొన్నారని, ఈ నేపథ్యంలో సహేతుక కారణాలు చూపించే వారికి ప్రభుత్వం గడువును పొడిగిస్తుందని రిపోర్టులు పేర్కొన్నాయి.
ఉదాహరణకు.. ఇటీవల దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ విధానంతో చార్టెడ్ అకౌంటెంట్లు తలకు మించిన పనిభారంతో సతమతమవుతున్నారు. దీంతో బిజినెస్ క్లయింట్ల జీఎస్టీ వైపు ఎక్కువగా దృష్టిసారించడంతో, వారు తమ వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి సమయం లేకుండా పోయిందని సంబంధిత వర్గాలు చెప్పాయి. అంతేకాక ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి కచ్చితంగా పాన్‌కార్డుతో ఆధార్ లింకు అయి ఉండాలని ఇటీవలే ప్రభుత్వం ఆదేశించింది. ఈ కారణాల నేపథ్యంలో రిటర్నులు ఫైల్ చేయడానికి గడువు పెంచుతారని అందరూ ఆశించారు. కానీ వీరు ఆశలకు భిన్నంగా ప్రభుత్వం జూలై 31 వరకు రిటర్న్‌లను దాఖలు చేయాల్సిందేనని సీబీడీటీ ఆదేశించింది.
Advertisement
Advertisement