ఆదాయపు పన్ను పోర్టల్‌లో ఇటీవలి అప్‌డేట్ కారణంగా కొత్త పన్ను విధానాన్ని ఉపయోగిస్తున్న పన్ను చెల్లింపుదారులు ముఖ్యమైన మినహాయింపును కోల్పోయే ప్రమాదం వచ్చింది.
ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 87A కింద లభించే ఈ మినహాయింపు, తక్కువ-ఆదాయం ఉన్నవారికి (రూ. 7 లక్షల లోపు) రూ. 25,000 వరకు పన్ను మినహాయింపును అందిస్తుంది.
ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో అప్‌డేట్ చేసిన ట్యాక్స్ ఫైలింగ్ యుటిలిటీని ఉపయోగించి కొత్త పన్ను విధానం కింద రిటర్న్స్ ఫైల్ చేస్తున్న ట్యాక్స్ పేయర్లు స్వల్పకాలిక మూలధన లాభాలను నమోదు చేసినట్లయితే రూ. 25,000 వరకు లభించే పన్ను మినహాయింపునకు దూరం కావాల్సి వస్తోంది.
ఈ రిబేట్ అనేది ఆదాయపు పన్నుపై ఇచ్చే రాయితీ. ఇది తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు వారి పన్నును తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. కేంద్ర బడ్జెట్ 2023లో మార్పుల ప్రకారం, మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉంటే రూ. 25,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అసలేమైంది?
మినహాయింపు అర్హత కోసం పోర్టల్ 'మొత్తం పన్ను విధించదగిన ఆదాయాన్ని' గణించే విధానంలో వ్యత్యాసం కారణంగా సమస్య తలెత్తుతోంది. చార్టర్డ్ అకౌంటెంట్ల ప్రకారం, ప్రస్తుత వ్యవస్థ ఈ గణనలో స్వల్పకాలిక మూలధన లాభాలను (STCG) తప్పుగా చేర్చింది.
ఇది స్వల్పకాలిక మూలధన లాభాలు కలిగినవారు ఆదాయం పరిమితి రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉన్నప్పటికీ పన్ను మినహాయింపును తొలగిస్తోంది.
కాగా జూలై 5 లోపు రిటర్న్స్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులు స్వల్పకాలిక మూలధన లాభాలతో సంబంధం లేకుండా మినహాయింపును క్లెయిమ్ చేయగలిగారు. ఆ తర్వాత రిటర్న్స్ ఫైల్ చేస్తున్నవారికే ఈ సమస్య వస్తోంది. స్వల్పకాలిక మూలధన లాభాలు మినహా స్థూల మొత్తం ఆదాయం రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉంటే, సెక్షన్ 111A స్పష్టంగా మినహాయింపును అనుమతిస్తుంది. కానీ పోర్టల్‌లో లోపం కారణంగా ఇలాంటి వారు మినహాయింపునకు దూరం కావాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment