ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే రోజు రానే వచ్చింది. వెబ్‌సైట్‌లో ఫారం 1 అలాగే 4 దాఖలు చేయటాన్ని ఎనేబుల్ చేశారు. సంసిద్ధం కండి. ముందుగా ముఖ్యమైన విషయాలు.
►31–03–2022 తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గడువు తేదీ 31–07–2022.
►ఫారాలు 1, అలాగే 4లో చిన్న మార్పులు మినహా పెద్ద మార్పులు లేవు.
►మీ దగ్గర పూర్తి సమాచారం కాగితాల రూపంలో ఉంటే మీరు ఆన్‌లైన్‌లో ఫైల్ చేయవచ్చు.
►సమాచారం, కాగితాలు కావాలన్నా, రావాలన్నా కసరత్తు మొదలెట్టండి.
ఐటీఆర్ 1 ఫారం గురించి..
►దీన్నే ’సహజ్’ అని అంటారు. పేరుకు తగ్గట్లుగానే సరళంగానే ఉంటుంది.
►ఆన్‌లైన్‌లో వేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ వేసుకోవాలంటే ఫారం ‘‘వినియోగ స్థితి’’ ( Utility) ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని వేసుకోవచ్చు.
►రెసిడెంట్ వ్యక్తి మాత్రమే వేయగలరు.
►31–03–2022 సంవత్సరానికి మొత్తం ఆదాయం అంటే ట్యాక్సబుల్ ఆదాయం రూ. 50,00,000 మించకూడదు.
►జీతం, పెన్షన్, ఒక ఇంటి మీద ఆదాయం, ఫ్యామిలీ పెన్షన్, వ్యవసాయ ఆదాయం రూ. 5,000 లోపలున్న వారు మరియు ఇతర ఆదాయం ఉన్న వారు మాత్రమే వేయగలరు.
►ఇతర ఆదాయం అంటే బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ, డిపాజిట్లు (బ్యాంకు, పోస్టాఫీసు, సహకార సంస్థలు) మీద వడ్డీ.. ఇతర వడ్డీల ఆదాయం ఉన్నవారు వేయొచ్చు.
ఐటీఆర్ ఫారం 4 గురించి..
►ఈ ఫారం వేతన జీవులకు వర్తించదు.
►వ్యాపారం, వృత్తి చేసే వారికి మాత్రమేవర్తిస్తుంది.
► రెసిడెంట్ వ్యక్తులు, హిందూ ఉమ్మడి
►కుటుంబాలు, భాగస్వామ్య సంస్థలు వేయవచ్చు.
►ట్యాక్సబుల్ ఇన్‌కం రూ. 50,00,000 దాటకూడదు.
►44ఏడీ, 44 ఏడీఏ, 44ఏఈల ప్రకారం వ్యాపారం,వృత్తుల మీద .. బుక్స్‌తో నిమిత్తం లేకుండా, లెక్కలతో నిమిత్తం లేకుండా ఊహాజనితంగా .. అంటే టర్నోవరుపై నిర్దేశిత శాతం లేదా ఎక్కువ శాతం లాభాన్ని లెక్కించే వేయాలి.
►మిగతా విషయాలన్నీ ఫారమ్ 1కి వర్తించేవే వర్తిస్తాయి.
ఈ కింది పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోండి.
►అన్ని కాగితాలు, సమాచారం పెట్టుకుని ఒక స్టేట్‌మెంటు తయారు చేసుకోండి.
►ప్రీ–ఫిల్డ్ రిటర్న్ కాబట్టి సమాచారం ఎదురుగా కనిపిస్తూనే ఉంటుంది.
►అలాంటి సమాచారం తప్పని తోచినా, మీది సంబంధించినది కాకపోయినా విభేదించవచ్చు. మార్పులు చేయవచ్చు.
►ఫెలింగ్ ప్రాసెస్ మొదలెట్టండి.
►ఈ–వెరిఫై చేయండి.
ఇంతటితో ప్రక్రియ పూర్తి అయినట్లే .. ఎప్పటికప్పుడు డిపార్ట్‌మెంటు వెబ్‌సైట్‌లో మార్గదర్శకాలు ఉంటాయి. అవసరం అయితే రిఫర్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment