IT act
-
వివాద్ సే విశ్వాస్ పై సందేహాల నివృత్తి
ఆదాయపన్ను శాఖ ‘వివాద్ సే విశ్వాస్’ పథకానికి సంబంధించి సందేహాలను తొలగించే ప్రయత్నం చేసింది. తరచూ అడిగే ప్రశ్నలకు (ఎఫ్ఏక్యూలు) సమాధానాలు విడుదల చేసింది. 2024 జులై 22 నాటికి అపరిష్కృతంగా ఉన్న అన్ని రకాల అప్పీళ్లకు వివాద్ సే విశ్వాసం పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ పథకం కింద పన్ను వివాదాలను పరిష్కరించుకోవాలని భావించే వారు ఈ నెల 31లోపు ప్రత్యక్ష పన్నుల వివాద్ సే విశ్వాస్ కింద డిక్లరేషన్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించాలి.ఇదీ చదవండి: మళ్లీ అవకాశం రాదేమో! భారీగా తగ్గిన బంగారం ధరతాజా స్పష్టతతో పన్ను చెల్లింపుదారులు అందరికీ కేసుల పరిష్కారంలో సమాన అవకాశాలు లభిస్తాయని నాంజియా అండ్ కో ఎల్ఎల్పీ పార్ట్నర్ సచిన్ గార్గ్ తెలిపారు. జులై 22 నాటికి పెండింగ్‌లో ఉన్నవి, కొట్టేసిన వాటికి సైతం ఈ పథకం కింద పరిష్కారానికి అర్హత ఉంటుంది. వివాద్ సే విశ్వాస్ పథకాన్ని 2024–25 బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. అక్టోబర్ 1న దీన్ని నోటిఫై చేశారు. డిసెంబర్ 31లోపు డిక్లరేషన్ దాఖలు చేసిన వారు పరిష్కారానికి వీలుగా వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించాలి. 2025 జనవరి 1, ఆ తర్వాత డిక్లరేషన్ దాఖలు చేస్తే వివాదంలోని పన్ను మొత్తంలో 110 శాతాన్ని చెల్లించాలని ఆదాయపన్ను శాఖ తెలిపింది. -
IT Raid : దుల్హన్ హమ్ లేజాయేంగే..
ఐటీ టీమ్‌ల గ్రేట్ డ్రామాదుమ్మురేపిన బారాత్బడాబాబులు బేజారు రెండేళ్ల కిందట.. మహారాష్ట్ర, జాల్నా.. ప్రధాన రహదారంతా పెళ్లి బారాత్‌తో నిండిపోయింది. అవును మరి.. ఒకటా రెండా.. దాదాపు 120 కార్లలో బయలుదేరారు మగపెళ్లివారు. ‘దుల్హన్ హమ్ లేజాయేంగే’ అనే స్టికర్స్‌ని విండ్ షీల్డ్స్ మీద అతికించుకుని! పాటలు పాడుతూ, మధ్యమధ్యలో ఆ కార్లను స్లో చేసుకుంటూ.. బ్యాండ్ మేళం వాయించే బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేస్తూ.. పెళ్లి కొడుకు చేత డాన్స్ చేయిస్తూ.. లోకంలోని పెళ్లి కళ, సందడంతా వాళ్లతోనే అన్నట్లుంది ఆ సంబడం! ఆ దారి పొడవున ఉన్న జాల్నా వాసులంతా ఆశ్చర్యపోయారు ‘ఎవరింటికబ్బా.. ఇంత ఘనమైన బారాత్’ అనుకుంటూ! ఓ కూడలి దాకా వెళ్లగానే ఆ 120 కార్లు అయిదు టీమ్‌లుగా విడిపోయాయి. ఓ టీమ్ జాల్నాలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీని, ఇంకో టీమ్ టెక్స్టైల్ మిల్‌ను, మరో టీమ్ ఆ రెండు ఫ్యాక్టరీలకు చెందిన యజమానుల ఇళ్లను, వేరే టీమ్ ఫామ్హౌసెస్ను, ఒక టీమేమో అక్కడి కో ఆపరేటివ్ బ్యాంక్‌కి.. వెళ్లాయి. ఆయా చోట్లకు చేరుకోగానే ఆ బృందాల్లోని సభ్యులంతా ఒక్కసారిగా సీరియస్ అయిపోయారు. ‘ఫ్రమ్ నాసిక్ ఐటీ డిపార్ట్మెంట్’ అని ఐడీ చూపిస్తూ రెయిడ్స్‌కి దిగారు. సదరు యజమానులు హతాశులయ్యారు. బ్యాంక్ వాళ్లు .. ఐటీ ఉద్యోగులకు అవసరమైన సమాచారం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సోదాలు మొదలయ్యాయి. ఫ్యాక్టరీల్లో, ఇళ్లల్లో ఏమీ దొరకలేదు. ఫామ్హౌసెస్ను అంగుళం అంగుళం గాలించారు. అక్కడ సీక్రెట్ రూమ్స్ బయటపడ్డాయి. వాటిల్లోనే లెక్కతేలని డబ్బు కోట్లలో దొరికింది. డాక్యుమెంట్స్ కూడా కనిపించాయి. బినామీ పేర్లతో ఉన్న అకౌంట్ల వివరాలు తెలిశాయి. వెంటనే వీళ్లు కో ఆపరేటివ్ బ్యాంక్‌లో తనిఖీలో ఉన్న ఐటీ టీమ్‌కి సమాచారమిచ్చారు. దాంతో బ్యాంక్‌లోని టీమ్ పని సులువైపోయింది. ఆ వివరాల ప్రకారం అకౌంట్స్ చెక్ చేశారు. లాకర్స్‌లో ఉన్న నగలను తీశారు. అదే సమయంలో యజమానులకు సంబంధించి ఔరంగాబాద్, నాసిక్, ముంబైల్లో ఉన్న ఇళ్లు, ఆఫీస్‌లలోనూ సోదా జరిగింది. రూ. 56 కోట్ల డబ్బు, 32 కిలోల బంగారం, రూ.14 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాలను సీజ్ చేశారు. మొత్తం అన్ని చోట్లా దొరికిన ఆ ఆస్తుల విలువ రూ. 390 కోట్లు. లెక్కాపత్రాల్లేని ఆ డబ్బునంతా జాల్నా స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌కి తీసుకెళ్లి లెక్కించారట. దాన్ని లెక్కించడానికి ఐటీ టీమ్‌కి పదమూడు గంటల సమయం పట్టింది. స్టీల్, టెక్స్టైల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో పేరుమోసిన వ్యాపార సంస్థలు ఎస్సార్జే పీటీ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్, కలికా స్టీల్ మాన్యుఫాక్చర్స్కి సంబంధించిన యజమానులపై జరిగిన ఈ రెయిడ్ దాదాపు అయిదురోజుల పాటు సాగింది. ఇందులో నాసిక్, పుణే, ఠాణే, ముంబై ఐటీ డిపార్ట్మెంట్లోని సుమారు 260 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. జాల్నాకు చెందిన ఓ సోర్స్ ద్వారా సమాచారం అందుకున్న నాసిక్ ఐటీ డిపార్ట్మెంట్ ఈ రెయిడ్కి రూపకల్పన చేసింది. యజమానులకు ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తపడింది. డిపార్ట్మెంట్ వాహనాలు వాడితే యజమానులు అప్రమత్తమవుతారని భావించి 120 వాహనాలను అద్దెకు తీసుకున్నారు. అలాగే ఫార్మల్గా వెళితే వాళ్లకు ఉప్పందే ప్రమాదం ఉంటుందని అలా పెళ్లి బృందంలా తయారయ్యారు. ఆ ఆపరేషన్‌కి ‘దుల్హన్ హమ్ లేజాయేంగే’ అని పేరుపెట్టుకున్నారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ రెయిడ్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. -
విశాఖలో అమెరికా దిగ్గజ ఐటీ అనుబంధ సంస్థ
సాక్షి, విశాఖపట్నం : ఐటీ రంగంలో దూసుకుపోతున్న విశాఖ నగరంలో మరో దిగ్గజ సంస్థ కొలువుదీరనుంది. అమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీ ట్రినిటీ సంస్థ హెల్త్‌రైజ్ పేరుతో విశాఖలో ఐటీ అనుబంధ సంస్థ ఏర్పాటుకు ముందుకొచ్చి ంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ విషయాన్ని శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. ఎపిటా, ఏసీఎన్ ఇన్ఫోటెక్ అనే బీపీవో సంస్థ సహకారంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. ఇక్కడ 5 వేల మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. రుషికొండ ఐటీ హిల్స్‌లో మంత్రి అమర్నాద్తో హెల్త్‌రైజ్ సంస్థ సీఈవో డేవిడ్ ఫార్బ్మెన్, ఏసీఎన్ ఇన్ఫోటెక్ ఎండీ చమన్బైద్, ఎపిటా సీఈవో కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏపీ ఐటీ సలహాదారు శేషిరెడ్డి శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. సంస్థ అందించే సేవలు, కల్పించే ఉద్యోగావకాశాలపై చర్చించారు. ఏపీని అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేయడంతో అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి అమర్నాథ్ చెప్పారు. బీచ్ ఐటీ కారిడార్‌ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఏపీలో 300 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయని, ఏటా 1,20,000 మంది వివిధ కోర్సులు పూర్తి చేసుకుని బయటికి వస్తున్నారని తెలిపారు. ఇక్కడ ఇంజినీరింగ్ కాలేజీల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. అమెరికాలోని వివిధ టెక్ కంపెనీలలో పని చేస్తున్న ప్రతి నలుగురిలో ఒక తెలుగువాడు ఉంటాడని అమెరికా సంస్థ బృందానికి వివరించారు. స్టార్టప్స్‌లోనూ తెలుగు విద్యార్థులు బాగా రాణిస్తున్నారన్నారు. విశాఖలో మెడ్ టెక్ జోన్ మెడికల్ రీసెర్చ్‌కు, వైద్య రంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. హెల్త్‌రైజ్ సంస్థ సీఈవో డేవిడ్ మాట్లాడుతూ తమ సంస్థ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడిచేందుకు హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్‌కు సహకారం అందిస్తుందన్నారు. రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్, హెల్త్ కోడింగ్, వైద్య సంస్థలకు ఐటీ సర్విసులు సైతం అందించేలా విశాఖ నుంచి సంస్థ పనిచేస్తుందని తెలిపారు. -
చిట్ ఫండ్ ఫైనాన్స్ కంపెనీల కేంద్రంగా ఐటీ తనిఖీలు
-
కోవిడ్ తర్వాత కొత్త నగరాలకు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఒకప్పుడు ఇవే దేశంలో ప్రధాన ఐటీ హబ్‌లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఐటీ కంపెనీలు రూటు మారు స్తున్నాయి. చండీగఢ్, మంగళూరు, అహ్మదా బాద్, కాన్పూర్, తిరువనంతపురం, భోపా ల్, జైపూర్, వరంగల్, విశాఖపట్నం,విజయ వాడ లాంటి నగరాలు తెరపైకి వస్తున్నాయి. కోవిడ్‌కు దేశంలోని కేవలం ఏడు ప్రధాన నగరాలకే పరిమితమైన సమాచార సాంకేతిక రంగం.. కోవిడ్ తదనంతర పరిణా మాల నేపథ్యంలో దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బహుళజాతి సంస్థలు నిర్వహణ వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవాలని భావి స్తుండటమే ఇందుకు కారణమని ఐటీ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నగరాల్లోనే 11–15% నైపుణ్యం ఉన్న యువత ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే 11–15 శాతం సాంకేతిక నైపుణ్యం ఉన్న యువత ఉన్నట్లు ఐటీ కంపెనీలు గుర్తించాయి. దాదాపు 60 శాతం పట్టభద్రులు ఈ పట్టణాల నుంచే ఉత్తీర్ణులు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇలా ఉత్తీర్ణులయ్యే వారిలో 30 శాతం మేరకు ఉద్యోగాల కోసం ప్రథమ శ్రేణి నగరాలకు తరలి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు ద్వితీయ శ్రేణి నగరాల వైపు దృష్టి సారిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. స్టార్టప్‌లు ఎక్కువగా ఇక్కడే.. 2022లో దాదాపు 7 వేల (39%) స్టార్టప్‌లు ఈ కొత్త నగరాల నుంచే ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ ఏడాదిలో 13 శాతం స్టార్టప్ కంపె నీల ఫండింగ్ ఈ ద్వితీయ శ్రేణి నగరాలకే వెళ్లినట్లు తెలిపింది. పెట్టుబ డిదారులు కూడా ప్రథమ శ్రేణి నగరాల్లోని వాటికంటే ఈ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికే ముందుకు వస్తున్నట్లుగా అధ్యయనంలో తేలినట్లు నివేదిక పేర్కొంది. కొత్త హబ్‌లు ఎక్కడెక్కడ? దేశంలోని ద్వితీ య, తృతీయ శ్రేణి నగరాలైన టువంటి చండీగఢ్, నాగ్‌పూర్, అహ్మదా బాద్, మంగళూరు, కాన్పూర్, తిరువనంతపుర, లఖ్‌నవూ, గౌహతి, రాంచీ, భోపాల్, జైపూర్, ఇండోర్, నాసిక్, భువనేశ్వర్, రాయ్‌పూర్, వరంగల్, కరీంనగర్, విశాఖపట్నం, హుబ్బళి, విజయవాడ, తిరు పతి, మైసూరు, వెల్లూరు, మధురై, తిరుచిరా పల్లి, కొచ్చి నగరాలపై ఐటీ సంస్థలు దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. తెలంగాణలోని పలు నగరాల్లో హబ్‌లు ఐటీ రంగాన్ని తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు తీసుకెళ్లాలని 2015–16 నుంచే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో ఐటీ హబ్‌లు నిర్మించారు. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్‌లలో ఐటీ సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభు త్వం చర్యలు చేపడుతోంది. త్వరలోనే నల్లగొండ, రామగుండంలోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేయ బోతున్నారు. మొత్తం మీద 2026 నాటికి 20 వేల మందికి నేరుగా ఈ పట్టణాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వికేంద్రీకరణతో సానుకూల మార్పులు ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కేవలం ప్రధాన నగరాలు, పట్టణాలకు పరిమితం కాకుండా రెండో, మూడో శ్రేణి నగరాలు, ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమ వికేంద్రీకరణ వల్ల చాలా సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. కోవిడ్ తర్వాత చాలావరకు ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నా మంచి ఉత్పాదకత వస్తుండటంతో కంపెనీల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. నిర్వహణ వ్యయం మరింత తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి మరోవైపు వికేంద్రీకరణ కారణంగా ఉద్యోగులకు కూడా ఇళ్ల అద్దెలు, ప్రయాణ ఖర్చులు, ఇతరత్రా ఖర్చులు తగ్గుతాయి. రాబోయే రోజుల్లో వికేంద్రీకరణ మరింత జరిగి శాటిలైట్ సెంటర్ల ద్వారా చిన్న చిన్న హబ్‌లు కూడా ఏర్పడబోతున్నాయి. ఇంటర్నెట్ స్పీడ్, నిరంతర కరెంట్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించగలిగితే గ్రామస్థాయి వరకు కూడా తీసుకెళ్లే అవకాశాలుంటాయి. – వెంకారెడ్డి, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ హెచ్ఆర్ లీడర్, కో ఫోర్జ్ ప్రత్యామ్నాయ హబ్‌లు అత్యంత ఆవశ్యకం దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఏ విధంగా ఐటీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్న అంశంపై డెలాయిట్, నాస్కామ్ సంయుక్తంగా ఓ అధ్యయనం నిర్వహించి నివేదికను తయారు చేశాయి. ‘ఎమర్జింగ్ టెక్నాలజీ హబ్స్ ఇన్ ఇండియా’ పేరిట ఇది రూపొందింది. ఇప్పటివరకు ప్రధాన నగరాలకే పరిమితమైన ఐటీ రంగం ప్రస్తుతం మరో 26 నగరాలకు విస్తరించిందని ఆ నివేదిక వెల్లడించింది. ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు నాస్కామ్ అధిపతి సుకన్యరాయ్ తెలిపారు.కాగా ఆయా ప్రాంతాల్లో విస్తరించడానికి గల కారణాలను, అక్కడ ఉన్న అవకాశాలను, ఇతర అంశాలను వివరించింది. ఏడు ప్రధాన నగరాల్లో విస్తరించిన ఐటీ రంగంలో దాదాపు 54 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. అయితే నైపుణ్యం, నిర్వహణ వ్యయం, కొత్త నైపుణ్యం ఉన్న యువతను గుర్తించి వారు ఉన్నచోటే ఉపాధి కల్పించేలా ఆ ప్రాంతాల్లోనే కార్యకలాపాలను ప్రారంభించడం ద్వారా ఎక్కువ లాభం పొందవచ్చని ఐటీ సంస్థలు భావిస్తున్నాయని నివేదిక చెబుతోంది. కోవిడ్ తరువాత ఈ వికేంద్రీకరణ వేగం పుంజుకుందని తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలకు ప్రత్యామ్నాయంగా ఐటీ హబ్‌ల ఏర్పాటు అత్యంత ఆవశ్యకమని తమ అధ్యయనంలో వెల్లడైనట్లు నాస్కామ్, డెలాయిట్ స్పష్టం చేశాయి. 2030 నాటికి నైపుణ్యం మిగులు.. దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐటీ నిపుణుల కంటే డిమాండ్ ఎక్కువగా ఉందని అంచనా వేశారు. అయితే 2030 నాటికి ఈ పరిస్థితి మారుతుందని, డిమాండ్ కంటే అధికంగా ఐటీ నిపుణులు ఉంటారని సుకన్యరాయ్ చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్‌ల ఏర్పాటు వల్ల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఈ రంగం వైపు మళ్లే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక పలు రాష్ట్ర ప్రభుత్వాలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగం వేళ్లూనుకునేలా తగిన మౌలిక వసతుల కల్పనకు ముందుకు రావడం ఐటీ రంగానికి కలిసివచ్చే అంశమని ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. మౌలిక వసతుల కల్పనతో నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని, మరోవైపు భవనాల కోసం చెల్లించే అద్దె కానీ, సొంత భవనాల నిర్మాణ వ్యయం కానీ ప్రధాన నగరాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఎమర్జింగ్ సిటీస్ (కొత్త నగరాలు)లో 25 నుంచి 30 శాతం వరకు తక్కువ వేతనాలకే నిపుణులు లభిస్తుండటం, 50 శాతం వరకు తక్కువకు అద్దెకు భవనాలు లభించడం వంటి అనుకూల పరిణామాలు ఐటీ రంగం వికేంద్రీకరణకు దోహదపడుతున్నాయని నివేదిక వివరించింది. -
మౌలిక సదుపాయాల్లో హైదరాబాద్ మేటి
సాక్షి, హైదరాబాద్: ఏ నగరమైనా వృద్ధిలోకి రావాలంటే అక్కడి మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండాలని, ఈ విషయంలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నా రు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా శనివారం ఏర్పాటు చేసిన 2 రోజుల ‘టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్పో’ మూడవ ఎడిషన్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పల్లెలు సమగ్ర, సమీకృత, సమ తుల్య వృద్ధిలో కొనసాగుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌లోని మౌలిక సదుపాయాలు ఇక్కడి రియల్ రంగాన్ని ఉన్నతస్థాయిలో నిలుపుతూ, పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. అయితే విశ్వనగరంగా నిరూపించుకోవడానికి ఈ వృద్ధి సరిపోదని తెలిపారు. 31 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో పూర్తి చేయబోతున్నామని, రానున్న పదేళ్లలో ఓఆర్ఆర్ చుట్టూ దాదాపు 415 కిలో మీటర్ల మెట్రో కోసం ప్రణాళికలు చేపడుతు న్నామని వెల్లడించారు. ముంబై తరువాత అతిపెద్ద 2వ స్కై స్క్రీపర్ నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని, 57 అంతస్తులతో స్కై స్క్రీపర్స్ నిర్మించడానికి ఈ మధ్యనే హెచ్ఎండీఏ 12 అనుమతులను అందించిందని మంత్రి తెలిపారు. విశ్వనగరంగా మారాలంటే నగరం నలుమూలల్లో అభివృద్ధి జరగాలి. దీనికి రియల్ రంగం సహకరించాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 40 నుంచి 45 శాతం హైదరాబాద్ నగరం నుంచే ఉత్పత్తి ఉంటుంది. అందుకే నగరాల వృద్ధిపై దృష్టి సారించాలని మంత్రి ప్రత్యేకంగా కోరారు. టీఎస్, ఏపీ రెస్పాన్స్ హెడ్ కమల్ క్రిష్ణన్ మాట్లాడుతూ, టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పోకు విభిన్న వర్గాల నుంచి అనూహ్య స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. -
ఐటీ నోటీసులిస్తే మీకది వార్త కాదా?
సాక్షి, అమరావతి: ఎల్లో మీడియాగా గుర్తింపు పొందిన కొన్ని సంస్థలు జర్నలిజంపై గౌరవాన్ని పూర్తిగా దిగజారుస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఐటీ శాఖ నోటీసులిస్తే ఆ పత్రికల్లో కనీసం వార్త కూడా ప్రచురించకపోవటానికి మించి దుర్మార్గం మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. ఎల్లో మీడియాలో మీకు నచ్చిందే రాస్తారా? అని నిలదీశారు. మంగళవారం సచివాలయం వద్ద మంత్రి సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. ‘ఐటీ శాఖ నోటీసులపై చంద్రబాబు నోరు విప్పకపోవటాన్ని బట్టి ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటివరకు చాలాసార్లు తప్పించుకున్నారు. ఆయన అక్రమాల్లో ఐటీ శాఖ గుర్తించింది అవగింజంతే. ‘సీబీఐ, ఈడీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తక్షణం అదుపులోకి తీసుకోవాలి. చంద్రబాబు వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తారో అందరికీ తెలుసు. రాజధానిని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. రూ.ఐదు లక్షలు దాటిన పనులకు టెండర్లు నిర్వహించాల్సి ఉన్నా పోలవరంలో నామినేషన్‌పై రూ.వేల కోట్ల విలువైన పనులను కట్టబెట్టారు. సమాధానం చెప్పకుండా చంద్రబాబు ఎంతో కాలం తప్పించుకోలేరు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌లా జైలుకు వెళ్లక తప్పదు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టాననే పవన్‌కళ్యాణ్ దీనిపై ఎందుకు స్పందించరు?’ అని మంత్రి సత్య నారాయణ నిలదీశారు. -
తండ్రీకొడుకులు ఇద్దరూ స్కామ్‌స్టర్‌లే
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన స్కామ్.. సీమన్స్, అమరావతి భూకుంభకోణాల దారులన్నీ ఒకే చోటుకు చేరుతున్నాయని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. ఐటీ శాఖ చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న వ్యక్తులే.. సీమన్స్, అమరావతి అసైన్డ్ భూకుంభకోణాల్లో ప్రధానపాత్ర పోషించారని సీఐడీ తేల్చిందని గుర్తుచేశారు. ఈ కుంభకోణాల మూలాలు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ల వద్దే ఉన్నాయని చెప్పారు. తండ్రీకొడుకులు ఇద్దరూ స్కామ్‌స్టర్‌లేనన్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానిలో ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములు చేతులు మార్చే క్రమంలో పెద్ద స్కామ్ జరిగిందని గతంలోనే సీఐడీ తేల్చిందని గుర్తుచేశారు. అమరావతి పేరుతో జరిగిన స్కామ్‌లన్నింటిలో డొల్ల కంపెనీలు పెట్టి, వాటిద్వారా తండ్రీకొడుకులు ముడుపులు పుచ్చుకున్న విషయాలు ఇప్పటికే సీఐడీ విచారణలో రట్టయిందని ఎత్తిచూపారు. డొల్ల కంపెనీలతో డబ్బును జేబులో వేసుకోవడం.. హవాలా ద్వారా తండ్రీకొడుకులకు చేరవేయడంలో ఈ మధ్య కూడా మరో స్కామ్ బయటకొచ్చిందని చెప్పారు. అమరావతిలో రాజధాని కడతానని, ప్రతి ఇటుకకు డబ్బులివ్వండని.. మనల్ని అందర్నీ తాకట్టు పెట్టి బాండ్స్ ఇష్యూచేసి చంద్రబాబు తెచ్చిన డబ్బులు ఆయా కంపెనీలకు ఇచ్చారని తెలిపారు. ఆ కంపెనీల ద్వారా నిధులు డొల్ల కంపెనీలకు మళ్లించారని, ఐటీ శాఖ నోటీసులు చూస్తే.. చంద్రబాబు మొత్తం రూ.160 కోట్ల రూపాయలు కొట్టేశారని తేలిందని చెప్పారు. లోకేశ్ మిత్రుడు రాజేశ్, చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా అమరావతి పేరుతో జనం సొమ్మును కొట్టేశారన్నారు. ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొన్న తరహాలోనే.. ఇప్పటికే సీఐడీ విచారణలో తేలిన స్కిల్ స్కాం, అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణం, కాంట్రాక్ట్ పనుల్లో అక్రమాలు, ఫైబర్‌నెట్ స్కామ్‌లలోను ఈ వ్యక్తుల ద్వారా ఇదే విధమైన రూటింగ్ జరిగిందని చెప్పారు. ఎంవీపీ, పీఏ శ్రీనివాస్, రాజేశ్ తదితరులు ఆ కుంభకోణాల్లోను ప్రధానపాత్ర పోషించారన్నారు. ఐదేళ్లలో రకరకాల స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లు చేసిన చంద్రబాబు వేలకోట్ల రూపాయలు దోచుకుని హైదరాబాద్‌లో దాచుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయన్నారు. ప్రజాధనాన్ని దోచేసిన తండ్రీకొడుకులను వలేసి భలే పట్టుకున్నారని ఐటీ శాఖను ప్రశంసించాల్సింది పోయి విమర్శించడం సిగ్గుచేటని చెప్పారు. తండ్రీకొడుకులు ఏయే పాపాలు చేశారని నాలుగేళ్లుగా చెబుతున్నామో అవన్నీ ఒక్కొక్కటిగా ఆధారాలతో దొరుకుతున్నాయని తెలిపారు. కచ్చితంగా చంద్రబాబు పాపం పండే రోజు వచ్చింది.. అవినీతి బట్టబయలైంది.. పరిహారం చెల్లించాల్సిన రోజు వస్తుంది.. అని పేర్ని నాని చెప్పారు. -
నోటీసులపై నోరు విప్పు
సాక్షి, అమరావతి: ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులకు మాజీ సీఎం చంద్రబాబు తక్షణమే సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. విజనరీగా చెప్పుకునే ఆయన పొలిటికల్ స్కామ్‌స్టర్ అని ధ్వజమెత్తారు. కమీషన్లుగా దండుకున్న రూ.118.98 కోట్లపై నోరు మెదపకుండా నీతులు వల్లిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అక్రమార్జనలో ఇది చిన్న భాగం మాత్రమేనని, క్షుణ్నంగా విచారిస్తే భారీ కుంభకోణాలు బహిర్గతం కావడం ఖాయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కుంభకోణాలను అప్పట్లోనే తెహల్కా బయటపెట్టింది. అక్రమార్జనపై 17 కేసుల్లో చంద్రబాబు విచారణ ఎదుర్కోకుండా వ్యవస్థలను మేనేజ్ చేసి స్టేలు తెచ్చుకున్నారు. ఢిల్లీలో రూ.700–రూ.800 కోట్లతో అత్యద్భుతమైన పార్లమెంట్ భవనాన్ని కేంద్రం నిర్మిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రూ.500 – రూ.600 కోట్లతో సచివాలయ భవనాన్ని నిర్మించింది. ఏసీ, ఇంటీరియర్స్ సహా చదరపు అడుగు నిర్మాణానికి రూ.2 వేల నుంచి రూ.మూడు వేలు వ్యయం అవుతుంది. చంద్రబాబు మాత్రం చదరపు అడుగుకు రూ.13 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు పెట్టి రేకుల షెడ్డు లాంటి తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించారు. దీన్ని బట్టి చూస్తే షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థల నుంచి చదరపు అడుగుకు రూ.పది వేలకుపైగా ముడుపులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి చేరాయి. పోలవరంలో వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను నిర్మించకుండానే ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను చంద్రబాబు చేపట్టారు. దీంతో 2019–20లో గోదావరికి వచ్చిన భారీ వరదలు ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో డయాఫ్రమ్ వాల్ కోతకు గురైంది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగాధాలు ఏర్పడ్డాయి. వాటిని యధాస్థితికి తేవడం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఇంత నష్టానికి కారకుడు చంద్రబాబే. ఈ పాపానికి చంద్రబాబు పాల్పడకుంటే పోలవరం ఈ పాటికి ఎప్పుడో పూర్తయ్యేది. చంద్రబాబు పాపాలను సీఎం వైఎస్ జగన్ ప్రక్షాళన చేస్తూ ప్రణాళికాబద్ధంగా పోలవరాన్ని పూర్తి చేస్తున్నారు. తొలి దశ పూర్తికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్టంలో 2014–19 మధ్య పేదరికం 11.66 శాతం ఉండగా, సీఎం జగన్ సంక్షేమ పథకాల వల్ల 6 శాతానికి తగ్గింది. -
కస్టడీలోకి తీసుకుని విచారించాలి
సాక్షి, అమరావతి: ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ నిలదీశారు. చంద్రబాబు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉందని, దీని నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబుకు ఐటీ శాఖ షోకాజ్ నోటీసు ఇచ్చి సమాధానం అడిగింది. సమాధానం చెప్పడంలో ఆలస్యం అయితే చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాలి. నోటీసులు ఎవరు ఇవ్వాలో కూడా ఆయనే చెబుతారా? కేంద్రంలో అనేక ప్రభుత్వాలను నడిపించానని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పరు? తన చేతికి కనీసం ఒక రింగు కూడా లేదని పదేపదే చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఏమంటారు? విక్కీ జైన్, మనోజ్ పార్థసాని ఎవరో చంద్రబాబుకు తెలీదా? విక్కీ జైన్ ద్వారా చంద్రబాబుకు డబ్బు చేరవేశారని ఐటీ శాఖ చెబుతోంది. విక్కీ జైన్ ఎవరో తెలియదని చంద్రబాబును చెప్పమనండి. వాళ్ల వాట్సాప్ చాట్స్‌లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. ఐటీ శాఖ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే మరిన్ని డబ్బుల వివరాలు బయటపడతాయి. తక్షణం విక్కీ జైన్, మనోజ్ పార్థసానిని కస్టడీలోకి తీసుకుని ప్రజాధనాన్ని ట్రెజరీకి అప్పజెప్పాలి. అమరావతిలో చంద్రబాబు అవినీతిలో దొరికింది కొంతే. అనేక లావాదేవీల్లో ఐటీ శాఖ కేవలం రూ.118 కోట్లను మనోజ్ పార్థసాని ద్వారా పట్టుకుంది. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎల్లో మీడియా ఒక్క ముక్క కూడా రాయదు. ఆ చానళ్లలో ఒక్కరూ చర్చించరు. ఆ పత్రికలు చాలా విషయాలు రాస్తాయి. మరి బాబు అవినీతిపై ఎందుకు దాస్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే రాస్తారా? ప్రజాధనం దుర్వినియోగంపై వార్తలను ప్రజలకు అందివ్వరా?’ అని మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. -
ఇసుకపై పదేపదే వక్రీకరణలు
సాక్షి, అమరావతి : ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే దాన్నే నిజమని ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఈనాడు రామోజీరావు ప్రతిరోజూ పని గట్టుకుని రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌పై బురద జల్లుతున్నారు. ఇసుక కొరత లేకపోయినా ఉన్నట్లు.., స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన ఇసుకను అక్రమ నిల్వలుగా పేర్కొంటూ ఇష్టానుసారం అవాస్తవాలు ప్రచురిస్తున్నారు. రాజధాని లావాదేవీల్లో చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దాని గురించి ఒక్క ముక్క రాయని ఈనాడు.. దాన్ని కప్పిపుచ్చేందుకు ఇసుక, ఇతర వ్యవహారాలపై కట్టు కథలు రాస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. చంద్రబాబును రక్షించేందుకు, ఆయన అవినీతిని కప్పిపుచ్చేలా ఈనాడు ఇలా ప్రతిసారీ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకొంది. ఇదే విధంగా ఇసుక పైనా ఓ అసత్య కథనాన్ని ప్రచురించింది. ‘ఇది ఇసుక దోపిడీ కాదా‘ అనే శీర్షికతో శనివారం ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. డ్రెడ్జింగ్ రీచ్‌లు, స్టాక్ యార్డుల్లోనే ఇసుక విక్రయాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. దాన్ని వక్రీకరిస్తూ అక్రమ మైనింగ్గా చిత్రీకరించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. దీనిపై వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా పనిగట్టుకుని మళ్లీ అవాస్తవాలు రాయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుందని తెలిపారు. దీనివల్లే వర్షాలు ప్రారంభం కాకుండానే పలు చోట్ల స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలు ఉంచామన్నారు. వర్షాలు పడుతున్నా ఇసుక లభించేలా ఏర్పాట్లు చేశామని, ఇసుక కొరత అనేది రాష్ట్రంలో లేదన్నారు. రాష్ట్రంలో ఇసుక పరిస్థితిపై ఆయన చెప్పిన వివరాలు.. అక్రమ మైనింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? రాష్ట్రవ్యాప్తంగా 136 ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయి. వాటిలో 64 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి. వినియోగదారులు స్టాక్ పాయింట్లలోని ఇసుక కొని, తీసుకెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇసుక స్టాక్ యార్డ్ ఫోటోలు తీసి అక్రమ ఇసుక తవ్వకాలు అంటూ ఈనాడు పత్రిక వక్రీకరణలతో తప్పుడు కథనాలు రాయడం దారుణం. రాష్ట్రంలో పర్యావరణ అనుమతులు ఉన్న 110 రీచ్‌లలో 77 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంది.అలాగే 42 డీసిల్టింగ్ పాయింట్ల ద్వారా 90 లక్షల ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి. ఇసుక కొరత లేకుండా డీసిల్టింగ్ పాయింట్ల నుంచి కూడా తవ్వుతున్నాం. అన్ని చోట్లా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక లభిస్తోంది. అటువంటప్పుడు అక్రమ మైనింగ్ ఎవరు చేస్తారు? ఎక్కువ రేటుకు ఎవరైనా ఎందుకు కొంటారు? రాష్ట్రంలో జేపీ సంస్థ ద్వారానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కొన్ని రీచ్‌లలో సమీపంలోనే స్టాక్ యార్డులు ఉన్నాయి. నదీ తీరంలో ఏర్పాటు చేసిన యార్డ్‌లో నిల్వ చేసిన ఇసుకను కూడా రీచ్ అని చిత్రీకరిస్తారా? పారదర్శక ఇసుక విధానంపై చాలా స్పష్టంగా వివరించినప్పటికీ ఇటువంటి వార్తలు రాయడం తగదు. గతంలో ఉచిత ఇసుక ఎవరికి ఇచ్చారు! గత ప్రభుత్వ హయాంలో ఏ నియోజకవర్గంలో ఇసుక ఉచితంగా ప్రజలకు అందింది? ఉచిత ఇసుక పేరుతో ప్రజలు ఎక్కువ రేటుకు కొనుక్కోవాల్సిన దుస్థితి తెచ్చారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని అయోమయ స్థితి ప్రజలకు కల్పించారు. తప్పులు చేసిన వారిని దండించలేదు. జరిమానాలు విధించలేదు. మెరుగైన ఇసుక విధానంతో మా ప్రభుత్వం ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోసింది. ప్రజలకు నియోజకవర్గాల్లో డిపోల వద్ద ఎంత ధరకు ఇసుక విక్రయిస్తున్నారో అత్యంత పారదర్శకంగా పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలియచేస్తోంది. అంతకంటే ఎక్కవ రేటుకు ఎవరైనా ఆమ్మితే తక్షణం ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్‌ను తెచ్చింది.ఎవరైనా అక్రమాలకు పాల్పడితే రెండు లక్షల రూపాయల జరిమానా, రెండేళ్ళ వరకు జైలు శిక్ష విధించేలా చట్టాల్లో మార్పులు తెచ్చింది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. దాదాపు 18 వేల కేసులు ఈ బ్యూరో నమోదు చేసింది. 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసింది. ఈ కేసుల్లో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. కట్టుదిట్టంగా నిబంధనలను అమలు చేస్తున్నాం. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేశాం. ఓపెన్ రీచ్‌ల ద్వారా నాణ్యమైన ఇసుకను అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటి తీవ్రంగా స్పందించింది. ఏకంగా రూ.100 కోట్లు జరిమానా విధించింది. ఇది కూడా సీఎంగా చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపైనే. ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి సంతృప్తి చెందిన ఎన్జీటీ ఆ జరిమానాను రద్దు చేసింది. రీచ్‌లకు ఎవరైనా వెళ్లవచ్చు ఓపెన్ రీచ్‌లు, ఇసుక శాండ్ డిపోలకు ఎవరైనా స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. అవసరమైనంత ఇసుక కొనుక్కోవచ్చు. ఇలాంటి చోట ఎవరైనా ఆంక్షలు పెడతారా? ఎవరూ రాకుండా కాపలా పెడతారా? ఈనాడు ప్రతినిధులను అడ్డుకున్నారని వార్తలు రాయడం కేవలం అభాండాలు వేయడం తప్ప మరొకటి కాదు. పారదర్శకంగా జరుగుతున్న చోట ఏదో జరిగిపోతోందనే భ్రమలు కల్పించడమే ఈనాడు లక్ష్యం. దీనిని మినీ కేజిఎఫ్ అంటూ చిత్రీకరించడం ఈనాడు పత్రిక దివాళాకోరుతనానికి నిదర్శనం. కాంట్రాక్ట్ వ్యాల్యూ పైన కాంట్రాక్టింగ్ ఏజెన్సీ జీఎస్టీ చెల్లిస్తోంది. ఏటా రెండు కోట్ల టన్నుల ఇసుక విక్రయాలకు నిబంధనల ప్రకారం ఎంత జీఎస్టీ చెల్లించాలో అంతా చెల్లిస్తోంది. దీనిపైనా అసత్య ప్రచారం చేస్తున్నారు. వర్షాకాలంలో ఓపెన్ రీచ్‌ల నుంచి తవ్వకాలు జరగడంలేదు. అయితే స్టాక్ చేసిన యార్డ్‌లోని ఇసుకను విక్రయిస్తున్నాం. చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం అరణియార్‌లో ఇసుక తవ్వకాలు గతంలోనే నిలిపివేశారు. పాత ఫోటోలతో అక్కడ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ తప్పుడు కథనాలను ప్రచురించారు. ఇసుక మాఫియాకు చెక్ పెట్టాం ఈ ప్రభుత్వం గతంలో జరిగిన ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ పెట్టింది. నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక లభించేలా చర్యలు తీసుకుంటోంది. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, నూతన ఇసుక పాలసీని ప్రకటించింది. దానిలో భాగంగా 2019 ఏప్రిల్ 9న రాష్ట్ర ప్రభుత్వం జీవో 70, 71 జారీ చేసింది. అనంతరం ఇసుక విధానంలోని లోటుపాట్లను సవరించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రజల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై 2020 నవంబరు 12న జీవో 78 జారీ చేసింది. అలాగే ఈ విధానంలోని కొన్ని నిబంధనల్లో మార్పు చేస్తూ 2021 ఏప్రల్ 16న జీవో 25ని జారీ చేసింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. పారదర్శకంగా ఇసుక తవ్వకాలు జరగాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎఎస్టీసీ ద్వారా, వారి పర్యవేక్షణలో టెండర్లు నిర్వహించాం. జేపీ పవర్ వెంచర్స్ ఈ టెండర్లు దక్కించుకుంది. వారి ద్వారానే ఇప్పటివరకు ఇసుక ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇంత పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తే తప్పుడు ఆరోపణలా? టెండర్ దక్కించుకున్నది జేపీ పవర్ వెంచర్స్ కంపెనీ ఒక్కటే. అన్ని అనుమతులతోనే ఎక్కడైనా ఆ సంస్థే తవ్వకాలు చేస్తుంది. అలాంటప్పుడు ఆ సంస్థ అక్కడ తవ్వుతోంది, ఇక్కడ తవ్వుతోందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వారు టెండర్ నిబంధనల ప్రకారం వారికి అనుకూలమైన సంస్థను సబ్ కాంట్రాక్టర్ గా తీసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆ సంస్థ సొంత వ్యవహారం. కాంట్రాక్టు సంస్థ టన్నుకు రూ.375 చొప్పున ప్రభుత్వానికి చెల్లిస్తోంది. దీనిపై మరో వంద రూపాయలు వేసుకుని టన్ను రూ.475 కు అమ్ముకుంటోంది. ఆ వంద రూపాయల్లోనే కంపెనీ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి. ఇసుక టెండర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు ఆదాయం లభిస్తోంది. అంటే అయిదేళ్ళలో రూ.3,825 కోట్ల ఆదాయం వస్తుంది. గత ప్రభుత్వ పాలనలో ఇన్ని వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎక్కడైనా ఇసుక కొనుక్కోవచ్చు. నాణ్యతను పరిశీలించుకోవచ్చు. అలాంటప్పుడు బ్లాక్ లో ఎక్కువ రేటుకు ఇసుకను కొనాల్సిన అవసరం ఎలా ఉంటుంది? -
మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా విశాఖపట్నం మారుతోంది. మాన్యుఫాక్చరింగ్, ఫార్మా, ఐటీ, కార్గో... ఇలా భిన్నమైన రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా విశాఖకు విస్తరిస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం స్పెషల్ ఎకనమిక్ జోన్ (వీసెజ్)లో మరో మూడు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. రూ.500 కోట్లకు పైగా పెట్టుబడులతో రెండు బయో డీజిల్ కంపెనీలు, ఒక ఫార్మా కంపెనీ ఏడాదిలోపు ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 1,200 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు తొలి త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే ఉత్పత్తుల ఎగుమతుల్లో 34 శాతం వృద్ధి కనబరిచిన వీసెజ్... అర్ధ సంవత్సరానికి 50 శాతం వృద్ధి నమోదు దిశగా ముందుకు సాగుతోంది. యూఎస్, కెనడాకు ఎగుమతులే లక్ష్యంగా... ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన మూడు యూనిట్లు విశాఖ సెజ్‌లోనే ఏర్పాటు కానున్నాయి. ఇందులో బయోడీజిల్ తయారీ సంస్థ అద్వైత్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్, బయోకాన్ లిమిటెడ్, ఫార్మాసూ్యటికల్ ఉత్పత్తుల తయారీ సంస్థ గ్రాన్యూల్స్ సీజెడ్‌ఆర్‌వో సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలు ఏడాదిలోపు తమ కార్యకలాపాలు ప్రారంభించాలని వీసెజ్ నిబంధన విధించింది. అయితే... ఈ సంస్థలన్నీ ఆరు నుంచి పది నెలల్లోపే ఉత్పత్తుల తయారీని మొదలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని వీసెజ్ అధికారులు చెబుతున్నారు. ఈ మూడు కంపెనీలు ప్రధానంగా కెనడా, యూఎస్‌కు ఎగుమతులే లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. రికార్డు స్థాయిలో ఎగుమతులు ఏపీ, తెలంగాణకు వస్తున్న పరిశ్రమలు వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాం. దువ్వాడ వీసెజ్ పరిధిలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెజ్‌లు, యూనిట్ల ద్వారా రికార్డు స్థాయి ఎగుమతులు సాధించాం. 2023–24 మొదటి త్రైమాసికంలో రూ.50,195 కోట్ల విలువైన వస్తువులు, సేవలను ఎగుమతి చేశాం. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం వృద్ధి రేటు సాధించాం. వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా రూ.35,992 కోట్లు, సేవారంగం ఎగుమతుల్లోనూ 36 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు గణాంకాలను పరిశీలిస్తే రూ.1,04,961 కోట్ల పెట్టుబడులు వీసెజ్ ద్వారా రాగా... మొత్తం 6,61,579 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. – ఎం.శ్రీనివాస్, వీసెజ్‌జోనల్ డెవలప్మెంట్ కమిషనర్ -
వచ్చే ఫిబ్రవరిలో 21వ బయో ఏసియా సదస్సు
సాక్షి, హైదరాబాద్: బయో ఏసియా 21వ వార్షిక సదస్సు తేదీలను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రకటించారు. హైదరాబాద్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ఈ సదస్సు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో జరుగుతుందన్నారు. ‘డేటా అండ్ ఏఐ–రీడిఫైనింగ్ పాజిబిలిటీస్’అనే నినాదంతో ఈ సదస్సు జరుగుతుందని కేటీఆర్ వెల్లడించారు. హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్, బయో టెక్నాలజీ రంగాల్లో భవిష్యత్‌లో డేటా ఆధారిత సాంకేతికత, కృత్రిమ మేధస్సు పోషించే పాత్రపై 2024 బయో ఏసియా సదస్సులో చర్చిస్తారన్నారు. అన్ని రంగాల్లో డిజిటల్ ఆవిష్కరణల ఫలితాల ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో టెక్నాలజీ, లైఫ్‌సైన్సెస్ సంగమం ద్వారా అద్భుత ఫలితాలు సాధించే అవకాశముందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆరోగ్యరక్షణ రంగంలో ఆవిష్కరణ శకం నడుస్తున్న ప్రస్తుత సమయంలో బయో ఏసియా సదస్సుకు అత్యంత ప్రాధాన్యం ఉందని కేటీఆర్ వెల్లడించారు. ప్రగతిభవన్‌లో బయో ఏసియా తేదీల ప్రకటన కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే వివేకానంద, బీఆర్ఎస్ సోషల్ మీడియా కనీ్వనర్లు మన్నె క్రిషాంక్, పాటిమీది జగన్మోహన్రావు, వై.సతీశ్‌రెడ్డి, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. -
రూ. 15 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన బంగారం సీజ్
కర్ణాటక: రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ఆరంభం కాగా, బెంగళూరులో ఐటీ అధికారులు ముమ్మరంగా దాడులు చేశారు. శనివారం బెంగళూరులో శాంతినగర, కాక్స్‌టౌన్, శివాజీనగర, ఆర్‌ఎంవీ ఎక్స్‌టెన్సన్, కన్నింగ్‌హ్యామ్ రోడ్డు, సదాశివనగర, కుమారపార్కు వెస్ట్, ఫేర్‌ఫీల్డ్ లేఔట్లో ఫైనాన్షియర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇందులో రూ.15 కోట్లు నగదు, రూ.5 కోట్లు విలువచేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఏ అభ్యర్థులతో సంబంధాలు ఉన్నాయి అనే దానిపై విచారణ చేపట్టారు. మైసూరులో కూడా ఐటీ దాడులు జరిగాయి. -
ఐటీ రూల్స్‌లో సవరణలు ఉపసంహరించండి
న్యూఢిల్లీ: ఐటీ నిబంధనల్లో తీసుకొచ్చిన సవరణలను ఉపసంహరించుకోవాలని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) అధ్యక్షుడు కేఆర్పీ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భాగస్వామ్యపక్షాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే సవరణలను ఈ నెల 6న నోటిఫై చేశారని పేర్కొన్నారు. ఏది నిజమో, ఏది నకిలీనో గుర్తించే అధికారాన్ని ఈ సవరణలు ప్రభావితం చేస్తాయని వెల్లడించారు. ఇప్పటిదాకా ఇలాంటి సంపూర్ణ అధికారం ప్రభుత్వానికి, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏజెన్సీ ఐఎన్ఎస్కు ఉందని గుర్తుచేశారు. మీడియా వృత్తి, విశ్వసనీయతతో ముడిపడి ఉన్న ఏ అంశంపై అయినా నోటిఫికేషన్ జారీ చేసేముందు మీడియా సంస్థలు, విలేకరుల సంఘాలతో విస్తృత, అర్థవంతమైన సంప్రదింపులు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజ నిర్ధారణ కోసం ఎలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు? న్యాయ సహాయం కోరవచ్చా? అప్పీల్ చేసే హక్కు ఉంటుందా? తదితర కీలక అంశాలను నోటిఫైడ్ రూల్స్‌లో ప్రస్తావించలేదని కేఆర్పీ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది జనవరిలో బహిర్గతం చేసిన ముసాయిదా సవరణల కంటే ఈ నెల 6న నోటిఫై చేసిన కొత్త ఐటీ రూల్స్ ఏమాత్రం భిన్నంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. భాగస్వామ్య పక్షాలతో చర్చించకుండా ఐటీ రూల్స్‌లో సవరణలు చేయడం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమే అవుతుందని ఐఎన్ఎస్ సెక్రెటరీ జనరల్ మేరీ పాల్ స్పష్టం చేశారు. సవరణలు నోటిఫై చేసే ముందు మీడియా సంస్థలతో చర్చల కోసం కేంద్ర సమాచార, ప్రసార శాఖ కనీసం ప్రయత్నం కూడా చేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు. -
పన్ను భారం తగ్గించుకోవాలంటే..
వేతన జీవులకు ఆదాయపన్ను చట్టంలోని పలు సెక్షన్లు గణనీయంగా పన్ను మినహాయింపులు ఇస్తున్నాయి. పాత పన్ను విధానంలో రూ.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేకపోగా, అందుబాటులోని అన్ని మినహాయింపులు, తగ్గింపు ప్రయోజనాలను వినియోగించుకుంటే మరో రూ.5 లక్షల ఆదాయంపైనా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే తమ ఆదాయం, పన్ను బాధ్యతలకు అనుగుణంగా ప్రణాళిక వేసుకుని, పెట్టుబడులు చేసుకోవడం మెరుగైన మార్గం. కానీ, చాలా మందికి ఇది ఆచరణలో అసాధ్యంగా ఉంటుంది. ఆర్థిక సంవత్సరం చివరిలోనే పన్ను ఆదా బాధ్యతలపై ఎక్కువ మంది దృష్టి సారిస్తుంటారు. ఈ సమయంలో పన్ను భారం తగ్గించుకునేందుకు అందుబాటులో ఉన్న సాధనాలపై కథనం ఇది. ఏడాది చివర్లో వ్యవధి తక్కువగా ఉన్నప్పుడు, హడావిడిగా చేసే పెట్టుబడుల్లో తప్పులకు చోటు ఇవ్వకూడదు. అదే సమయంలో పన్ను ఆదా ఒక్కటే ప్రామాణిక అంశం కూడా కాకూడదు. ఒకవైపు పన్ను ఆదా ప్రయోజనాన్ని ఇస్తూనే, మరోవైపు చేసిన పెట్టుబడి మంచి ప్రతిఫలాన్ని కూడా అందించేలా ఉండాలి. పైగా మనలో కొందరు చిన్న వయసులో ఉంటారు. మరికొందరు మధ్య వయసులో, కొందరు రిటైర్మెంట్కు దగ్గర్లో ఉండొచ్చు. కొందరి ఆర్జన మెరుగ్గా, కొందరి ఆర్జన మధ్యస్థంగా, తక్కువగాను ఉండొచ్చు. ఆదాయానికి అనుగుణంగా తీసుకునే రిస్క్ సామర్థ్యం మారిపోతుంటుంది. ఉదాహరణకు ఈఎల్ఎస్ఎస్ అన్నది సెక్షన్ 80సీ కింద అర్హత కలిగిన పన్ను సాధనాల్లో ఒకటి. అచ్చం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ఈ సాధనంలో పెట్టుబడులపై రాబడి దీర్ఘకాలంలో ఏటా 12 శాతానికి పైనే లభిస్తుంది. ఇందులో వ్యయాలు చాలా తక్కువ. మూడేళ్ల లాకిన్ పీరియడ్ ముగిసిన తర్వాత లిక్విడిటీ సమస్యే ఉండదు. కానీ, కొందరికి ఈక్విటీలు నచ్చకపోవచ్చు. కొందరికి పెట్టుబడులు అన్నింటినీ ఈక్విటీలకు కేటాయించడం ఇష్టం లేకపోవచ్చు. అందుకనే అందుబాటులో సాధనా లు, వాటి మంచి చెడులను అర్థం చేసుకుంటే, ఇన్వెస్టర్లు తమకు నచ్చినవి ఎంపిక చేసుకోవచ్చు. ఎన్పీఎస్– మూడు ప్రయోజనాలు ఇందులో రాబడులు గడిచిన ఐదేళ్ల కాలంలో వార్షికంగా 8–11 శాతం మధ్య ఉన్నాయి. ఇందులో చేసే పెట్టుబడులు రిటైర్మెంట్ వరకు లాకిన్లోనే ఉంటాయి. డెట్ నుంచి ఈక్విటీ, ఈక్విటీ నుంచి డెట్‌కు అలోకేషన్‌ను మార్చుకునే సౌలభ్యం ఉంది. ఎన్పీఎస్కు సంబంధించి మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలను ఇందులో ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 మొత్తంపై అదనపు పన్ను మినహాయింపు కూడా అందుబాటులో ఉంది. ఉద్యోగి మూలవేతనం, డీఏలో 10 శాతాన్ని ఎన్పీఎస్కు కంపెనీలు జమ చేస్తే, ఆ మొత్తంపైనా పన్ను ఉండదు. సెక్షన్ 80సీసీడీ (2) కింద ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. కనుక ఎన్పీఎస్ ఇచ్చే ప్రయోజనాలతను వేరొక సాధనంతో పోల్చడం సరికాదు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ, కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ (గిల్ట్ ఫండ్స్) అనే మూడు కేటగిరీలు ఉంటాయి. ఇన్వెస్టర్లు ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతం మించకుండా కేటాయింపులు చేసుకోవచ్చు. మిగిలిన రెండింటిలో నూరు శాతం కేటాయింపులకు అనుమతి ఉంది. మూడింటి మధ్య తమ రిస్క్‌స్థాయిని బట్టి కేటాయింపుల్లో మార్పులు చేసుకోవచ్చు. ఏడాదిలో నాలుగు సార్లు ఇలా చేసుకునేందుకు అనుమతి ఉంది. పనితీరు నచ్చకపోతే ఫండ్ మేనేజర్లను కూడా మార్చుకోవచ్చు. మార్కెట్ల పట్ల అవగాహన ఉన్న వారికి ఇది అనుకూలమైన టూల్. వీటికి అదనంగా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ విభాగం కూడా ఉంది. జీవిత బీమా పథకాలు జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి దీర్ఘకాలానికి 5 శాతంగా ఉంటుంది. పన్ను ఆదా కోసం ఇది మెరుగైన ఎంపిక కాదు. దీనికంటే కూడా యులిప్‌లు మెరుగైనవి. లేదంటే ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. బీమా ఎండోమెంట్ ప్లాన్లలో జీవిత బీమా కవరేజీ కూడా చెల్లించే ప్రీమియానికి నామమాత్రంగానే ఉంటుంది. రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ రూ.12,0000 ప్రీమియానికి వస్తుంది. కానీ, ఎండోమెంట్ ప్లాన్‌లో రూ.50 లక్షల కవరేజీ కావాలంటే ఏటా రూ.4–5 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. జీవితానికి రక్షణ కోణంలోనే బీమా ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. ఎన్ఎస్సీ, పన్ను ఆదా ఎఫ్డీలు ఎన్ఎస్సీలను పోస్టాఫీసు నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. పన్ను ఆదా ఎఫ్డీని బ్యాంకుల్లో తీసుకోవచ్చు. రెండింటిలోనూ లాకిన్ పీరియడ్ ఐదేళ్లు. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీపై డీసీబీ బ్యాంక్ అత్యధికంగా 8.10 శాతం రేటును ఆఫర్ చేస్తుంటే, యాక్సిస్ బ్యాంక్ రూ.7.75 శాతం ఇస్తోంది. మిగిలిన బ్యాంకుల్లో 6.70 శాతం నుంచి 7.50 శాతం మధ్య రేట్లు ఉన్నాయి. పన్ను ఆదా ఎఫ్డీ అంటే పెట్టుబడిపైనే. వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఎన్ఎస్సీ కేవలం పోస్టాఫీసులోనే కొనుగోలు చేసుకోగలరు. దీంతో పోలిస్తే ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీని బ్యాంకుల్లో ప్రారంభించడం, క్లోజ్ చేసుకోవడం సులభం. కొన్ని బ్యాంక్‌లు ఆన్‌లైన్‌లోనూ ఆఫర్ చేస్తున్నాయి. ఎన్ఎస్సీలో ప్రస్తుతం 7 శాతం రేటు అమల్లో ఉంది. ఎన్ఎస్సీలో పెట్టుబడిని సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. యులిప్‌లు యులిప్‌లలో గడిచిన ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడి 8–9 శాతం మధ్య ఉంది. యులిప్ అన్నది ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే బీమా సాధనం. బీమా సంస్థలు ఒకవైపు పాలసీదారులకు బీమా రక్షణ ఇస్తూ.. మరోవైపు ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టి, వచ్చిన రాబడిని పంచుతాయి. యులిప్లోనూ ఎన్‌పీఎస్‌లో మాదిరే ఈక్విటీ, డెట్ మధ్య కేటాయింపులను మార్చుకునే సౌలభ్యం ఉంది. ఇలా మార్చుకుంటే పన్ను కట్టక్కర్లేదు. ఈక్విటీల విలువలు గరిష్టాలకు చేరినప్పుడు డెట్‌కు మారి, మార్కెట్లు దిద్దుబాటుకు గురైనప్పుడు తిరిగి ఈక్విటీల్లోకి పెట్టుబడులను మళ్లించుకోవచ్చు. రాబడులపై పన్ను లేకపోవడం మరో ఆకర్షణీయ అంశం. యులిప్‌లో పెట్టుబడులపై ఐదేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. ఆ తర్వాత కోరుకున్నప్పుడు పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో మాదిరి ఇందులో ఫండ్ మేనేజర్‌ను మార్చుకోవడానికి అవకాశం లేదు. యులిప్‌ను జీవితంలో ముఖ్యమైన లక్ష్యాల కోసం పెట్టుబడి సాధనంగా ఉపయోగించుకోవచ్చు. వార్షిక పెట్టుబడితో పోలిస్తే జీవిత బీమా కవరేజీ కనీసం 10 రెట్లు ఉంటే సెక్షన్ 10(10డీ) కింద మెచ్యూరిటీ సమయంలో తీసుకునే మొత్తంపైనా పన్ను ఉండదు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఇది ఐదేళ్ల పథకం. తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఇందులో వడ్డీ రేటు ప్రస్తుతం 8 శాతంగా ఉంది. 60 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి (త్రైమాసికం ఆరంభంలో) ఆదాయం అందుకునేందుకు ఇది అనుకూలం. ఇందులో పెట్టుబడులను సెక్షన్ 80సీ కింద చూపించి మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. కాకపోతే 60 ఏళ్లు నిండిన వారికి ఏటా రూ.50 వేల వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు అమల్లో ఉంది. అంటే ఈ పథకంలో రూ.6.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక ఏడాదిలో రూ.50,000 పన్ను లేని ఆదాయం అందుకోవచ్చు. వార్షికాదాయం రూ.50వేలు మించితే టీడీఎస్ అమలు చేస్తారు. పీపీఎఫ్ ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు 7.1 శాతం. పెట్టుబడులు 15 ఏళ్ల పాటు లాకిన్‌లో ఉంటాయి. పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. పెట్టుబడి, రాబడి, ఉపసంహరణ ఇలా ఏ దశలోనూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేని సాధనం ఇది. కనుక స్థిరాదాయ పథకాలతో పోలిస్తే మెరుగైనది. బ్యాంక్ ఎఫ్‌డీలపైనా ఇంతే వడ్డీ రేటు లభిస్తున్నప్పటికీ, అది పన్ను పరిధిలోకి వస్తుంది. పీపీఎఫ్‌ను అన్ని ప్రభుత్వరంగ, ప్రైవేటు వాణిజ్య బ్యాంకుల్లో ప్రారంభించొచ్చు. పోస్టాఫీసులోనూ దీన్ని తెరవొచ్చు. బ్యాంకుల్లో మరింత సౌకర్యంగా ఉంటుంది. సొంత ఖాతా నుంచే పీపీఎఫ్ కంట్రిబ్యూషన్ బదిలీ చేసుకోవచ్చు. కోరుకున్నప్పుడు ఈ–స్టేట్మెంట్ తీసుకోవచ్చు. ఆరో ఏట తర్వాత పాక్షిక ఉపంసహరణకు అనుమతి ఉంటుంది. నాలుగో ఏడాది చివరి నాటికి ఉన్న బ్యాలన్స్నుంచి సగం తీసుకోవచ్చు. 15 ఏళ్ల కాల వ్యవధి తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. మూడో ఏట నుంచి ఆరో ఏట వరకు బ్యాలన్స్‌పై రుణం తీసుకునే సదుపాయం కూడా ఉంది. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తుత వడ్డీ 7.6%. కుమార్తెల పేరిట ప్రారంభించి, పెట్టుబడులు పెట్టుకునే పథకం ఇది. వారికి 18 ఏళ్లు వచ్చే వరకు దీన్ని కొనసాగించుకోవచ్చు. పదేళ్లలోపు ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రులు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఏటా రూ.1.50 లక్షల పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. గడువు ముగిసిన తర్వాత తీసుకునే మొత్తంపైనా పన్ను ఉండదు. ఈ పథకంలో వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంటుంది. బ్యాంకు శాఖలు, తపాలా కార్యాలయాల్లో ప్రారంభించుకోవచ్చు. కనీస పెట్టుబడి రూ.1,000. గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట దీన్ని తెరుచుకునేందుకు అనుమతి ఉంది. ఇద్దరి పేరిట ఖాతాలు తెరిచినా సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలకే పన్ను మినహాయింపు కోరగలరు. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ వీటిల్లో గత మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక రాబడులు 7–13 శాతం మధ్య ఉన్నాయి. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను సైతం సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు పెట్టుబడుల్లో 40 శాతాన్ని ఈక్విటీలకు, 55–60 శాతాన్ని డెట్ సాధనాలకు కేటాయిస్తుంటాయి. ఫ్రాంక్లిన్ పెన్షన్ ఫండ్, యూటీఐ రిటర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ఫండ్ ఇందుకు ఉదాహరణలు. వీటిల్లో రిస్క్ తక్కువ. తక్కువ రిస్క్ ఉండాలని కోరుకునే ఇన్వెస్టర్లు రిటైర్మెంట్ కోసం వీటిల్లో ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వీటిల్లో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. రాబడి మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది. డెట్‌కు ఎక్కువ కేటాయింపులు చేస్తే, డెట్ ఫండ్స్ మాదిరిగా లాభంపై 20 శాతం పన్ను చెల్లించాలి. లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించొచ్చు. -
ఐటీ పరిధిలో ఆట
ఆన్లైన్ గేమింగ్‌లో అతి పెద్ద మార్కెట్ అయిన మనం ఎట్టకేలకు కళ్ళు తెరిచి, కష్టనష్టాలను నియంత్రించే పనిలో పడ్డాం. ఆన్లైన్ గేమింగ్‌ను ఐటీ నిబంధనల కిందకు తెస్తూ, కొన్ని ముసాయిదా సవరణలను కేంద్ర ఐటీ శాఖ సోమవారం విడుదల చేసింది. ఆన్లైన్ గేమ్స్ అన్నీ భారత చట్టాలకు అనుగుణంగా ఉండేలా, వాడకందార్లకు హాని కలగకుండా కాపాడేందుకే ఈ చర్యలని సర్కారు మాట. ముసాయిదాలో స్వీయ నియంత్రణ వ్యవస్థను ప్రతిపాదించిన మంత్రి, భవిష్యత్తులో గేమింగ్ కంటెంట్‌ను సైతం నియంత్రించే అవకాశం ఉందని చెప్పడం గమనార్హం. సాధారణంగా ఆన్లైన్ గేమింగ్ 3 రకాలు. ఒకటి – 1990లలో వీడియో పార్లర్లలోని ఆటల్లాగా ఇప్పుడు ఆన్లైన్లో వ్యవస్థీకృతంగా ఆడే ‘ఇ–స్పోర్ట్స్’. రెండోది – వేర్వేరు జట్లలోని నిజజీవిత ఆట గాళ్ళను ఒక జట్టుగా ఎంచుకొని, పాయింట్ల కోసం ఆన్లైన్లో ఆడే ‘ఫ్యాంటసీ గేమ్స్’. మూడోది – మానసిక, శారీరక నైపుణ్యంపై, లేదంటే పాచికలాట లాంటి సంభావ్యతపై ఆధారపడ్డ ఆన్లైన్ సరదా ఆటలు. సంభావ్యతపై ఆధారపడ్డ ఆటల్ని డబ్బులకు ఆడితే జూదం. ఇదీ స్థూలమైన లెక్క. తాజా ప్రతిపాదనల్లో ‘ఆన్లైన్ ఆట’ను నిర్వచించడమే కాక, ఆపరేటర్లు నియమ నిబంధనలన్నీ వాడకందారుకు ముందే చెప్పాలంటూ పారదర్శకతకు ప్రయత్నించడం బాగుంది. అలాగే çసమయం దాటి ఆడుతుంటే, అది ఓ వ్యసనంగా మారకుండా హెచ్చరిక సందేశాలు పంపాలనడమూ భేష్. కేంద్ర చట్టం పరిధిలోకి ఆన్లైన్ ఆటల్ని తీసుకొస్తున్న పాలకుల చొరవను స్వాగతిస్తూనే, లోపా లనూ నిపుణులు వేలెత్తి చూపుతున్నారు. గతంలో ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ ‘ఐటీ చట్టం–2000’ పరిధిలోది కాదు. తాజాగా ఐటీ శాఖను ఆన్లైన్ గేమింగ్ చూసే కేంద్ర మంత్రిత్వ శాఖగా నియమిం చారు. అది జరిగిన వారానికే ఈ కొత్త ముసాయిదా సవరణలు తెచ్చారు. నిజానికి, ఆన్లైన్ గేమింగ్ ఏ శాఖ కిందకు వస్తుందనే పాలనాపరమైన స్పష్టత ఇవ్వడం వరకు ఓకే కానీ, ఆ అధికారాన్ని సదరు శాఖ వినియోగించాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. ఆ పని చేయకుండానే ఐటీ చట్టం నియంత్రణ పరిధిలోకే ఆన్లైన్ గేమింగ్‌ను తెస్తూ, ఐటీ నిబంధనలు చెయ్యడం విడ్డూరం. అలాగే, ఈ సరికొత్త ముసాయిదా సవరణలపై ఈ నెల 17 లోగా ప్రజలు సలహాలు, సూచనలి వ్వాలని కోరారు. కానీ, ఈ సంప్రతింపుల ప్రక్రియలో వచ్చిన అభిప్రాయాలను ప్రజా క్షేత్రంలో ఉంచట్లేదు. ఇటీవల ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ –2022’లోనూ ఐటీ శాఖ ఇదే పని చేసింది. దీనివల్ల ఈ విధాన నిర్ణయంలో ప్రభుత్వ చర్యల పట్ల ప్రజల్లో ఏ మేరకు నమ్మకం ఉంటుం దంటే సందేహమే. ముందుగా ఎలాంటి చర్చ, శ్వేతపత్రం లేకుండానే, కనీసం ప్రభుత్వ ఆలోచన ఏమిటో చెప్పకుండానే కొత్త ముసాయిదా సవరణల్ని కేంద్రం తేవడం కొంత వివాదాస్పదమైంది. భౌతికంగా అన్ని రకాల జూదం, పందాలపై దేశంలో గోవా, సిక్కిమ్, కేంద్రపాలిత డామన్ మినహా మిగతా రాష్ట్రాల్లో నిషేధం ఉంది. బ్రిటీష్ కాలపు బహిరంగ జూద చట్టం 1867 సహా, వివిధ రాష్ట్రాల చట్టాలున్నాయి. కొన్నిచోట్ల నైపుణ్య ఆధారిత ఆటలకూ షరతులున్నాయి. పాపులర్ ఆన్లైన్ ఆట లూడోలోనూ జూదం సాగుతోందని వివాదమైంది. ఇప్పుడు ఆన్లైన్ ఆటల్ని సైతం ఒక కేంద్ర చట్టం కిందకు తేవడంతో విదేశాల నుంచి నడిచే చట్టవిరుద్ధ, దేశవిద్రోహ జూద వేదికల ముప్పును అరికట్టవచ్చు. అయితే, పరిమాణం, రిస్క్‌తో సంబంధం లేకుండా ఆన్లైన్ ఆటల్ని అందించే సైట్లు, మొబైల్ యాప్‌లు (ఇంటర్మీడియరీలు) అన్నిటినీ ఒకే గాట కట్టడంపై పునరాలోచించాలి. అంతర్జాతీయ సంస్థలు తమ సేవల్ని భారత్‌లో ఆరంభించడానికి ఇక్కడ ఆఫీసర్లను పెట్టుకోవడం ఎంత ఆచరణాత్మకమో చెప్పలేం. డబ్బుతో జూదంపై మరింత కఠిన నిబంధనలుండాలని తమిళనాడు కోరుతోంది. మరి రాష్ట్రాలు అదనపు షరతులు పెట్టవచ్చేమో స్పష్టత లేదు. నిజానికి, కరోనాలో మనం వినోదాన్ని ఆస్వాదించే విధానం మారిపోయింది. ఓటీటీ ఛానల్స్ విస్తరణతో పాటు ఆన్లైన్ గేమింగ్ బాగా పెరిగింది. ఆన్లైన్ ఆటలపై వెచ్చించే సగటు సమయం కోవిడ్ ముందుతో పోలిస్తే, 65 శాతం హెచ్చింది. ఏకంగా 43 కోట్ల మందికి పైగా ఈ వర్చ్యువల్ గేమింగ్‌పై సమయం వెచ్చిస్తున్నారని లెక్క. కరోనాతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టెక్నాలజీని వాడి, డిజిటల్ తెరను వీక్షించే వ్యవధి పెరగడం తిప్పలు తెచ్చింది. యువతరానికి ఆన్లైన్ ఆట ఓ వ్యసనమై, రోజూ 6 నుంచి 8 గంటలు వెచ్చిస్తున్నారు. చదువు, మానవ సంబంధాలు, చివరకు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నాయి. గతంలో పబ్జీ, బ్లూ వేల్ ఛాలెంజ్ లాంటి ఆన్లైన్ గేమ్స్ హింస, ఆత్మహత్యలను ప్రేరేపించేసరికి, వాటిని నిషేధించాల్సి వచ్చిన సంగతి మరిచిపోలేం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గేమింగ్ వ్యసనాన్ని ఆరోగ్య సమస్యగా గుర్తించడం గమనార్హం. చైనా ఇప్పటికే ఈ ఆటల్ని ‘మెదడుకు మత్తుమందు’ అంటూ, 18 ఏళ్ళ లోపు పిల్లలు వారానికి 3 గంటలు మించి ఆడే వీల్లేకుండా చేసింది. భారత్‌లోనూ క్యాసినో లాగే ఆన్లైన్ ఆటల్లోనూ పిల్లలకు కనీస వయఃపరిమితి విధించవచ్చు. ముఖ్యంగా వీటి దుష్ఫలితాలపై తల్లితండ్రులు, అధ్యాపకులు పిల్లల్లో చైతన్యం తేవాలి. వచ్చే 2025 కల్లా 65.7 కోట్ల యూజర్లతో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ రూ. 29 వేల కోట్లకు పైగా ఆదాయం తెస్తుంది. 15 వేల ఉద్యోగాలొస్తాయట. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దే క్రమంలో ఆర్థిక అవకాశాలెన్ని ఉన్నా, ఈ ఆటలపై అదుపు లేకుంటే సామాజిక నష్టమూ ఎక్కువే. కాబట్టి పట్టువిడుపులతో పాలకుల నియంత్రణ చర్యలే శరణ్యం. -
రెండో రోజూ ఐటీ వేట: మంత్రి మల్లారెడ్డి ఇళ్లలో కొనసాగిన దాడులు
సాక్షి, హైదరాబాద్/కుత్బుల్లాపూర్/రసూల్‌పుర/మేడ్చల్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బంధువులు, భాగస్వాముల ఇళ్లలో, విద్యా సంస్థల్లో ఐటీ అధికారుల దాడులు బుధవారం రెండోరోజు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. భారీగా నగదుతో పాటు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక సమాచారం లభించింది. వైద్య కళాశాలల్లో సీట్లకు నిర్దేశిత ఫీజు కంటే అధిక మొత్తాన్ని నగదు రూపంలో తీసుకుని రియల్ ఎస్టేట్‌కు, సూరారం ఆసుపత్రికి తరలించినట్లు బయటపడింది. మరోవైపు మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డికి ఛాతీలో నొప్పి రావడం, ఆస్పత్రిలో చేరడం, ఈ విషయం తెలిసి ఐటీ అధికారులను, సీఆర్పీఎఫ్ జవాన్లను నెట్టేసి మంత్రి ఆస్పత్రికి వెళ్లడం, కుమారుడిని చూడనీయలేదంటూ అక్కడ ధర్నాకు దిగడం, మహేందర్‌రెడ్డిని జవాన్లు చిత్రహింసలు పెట్టారని ఆరోపించడం, ఆయన కోడలు ప్రీతిరెడ్డిని ఐటీ అధికారులు మంత్రి ఇంటికి తీసుకురావడం.. తదితర పరిణామాలతో బుధవారం రోజంతా హైడ్రామా నడిచింది. బుధవారం రాత్రివరకు తనిఖీలు కొనసాగుతుండగా, గురువారం కూడా ఇవి కొనసాగే అవకాశం ఉందని తెలిసింది. ఐటీ అధికారులకు సహకరిస్తున్నామని, ఆస్తులు, కాలేజీల వివరాలన్నీ ఇచ్చామని మంత్రి వెల్లడించారు. సోదాలు గురువారం ముగిసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఆస్పత్రిలో చేరిన మహేందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి ఐటీ దాడులు కొనసాగుతుండగా.. మంత్రి కుమారుడు మహేందర్ రెడ్డికి ఛాతీలో నొప్పిరావడంతో బుధవారం సూరారంలోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చేరారు. మరో బంధువు ప్రవీణ్‌రెడ్డి కూడా ఆసుపత్రిలో చేరి సాయంత్రానికి డిశ్చార్జి అయ్యారు. మంత్రి ఇంట్లో పనిచేసే పనిమనిషి ఫిట్స్‌తో అనారోగ్యానికి గురయ్యారు. కుమారుడు ఆసుపత్రిలో చేరారని టీవీల ద్వారా తెలుసుకున్న మంత్రి తన నివాసం నుంచి.. సోదాలు చేస్తున్న ఐటీ అధికారులను, సీఆర్పీఎఫ్ జవాన్లను నెట్టేసుకుంటూ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన వెంట ఐటీ అధికారులు కూడా ఆసుపత్రికి వెళ్లారు. మహేందర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వద్దకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రావడం, పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమిగూడటం, సీఆర్పీఎఫ్ జవాన్లు..కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలను చెదరగొట్టేందుకు జవాన్లు లాఠీలు ఝళిపించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి ఐటీ అధికారులు, కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నన్నూ, సీఎంను బద్నాం చేయాలని చూస్తున్నారు.. ‘మేము దొంగలమా..దొంగ వ్యాపారం చేస్తున్నామా..? కేసినో నడిపిస్తున్నామా.? హవాలా దందా చేస్తున్నామా..? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామా.? తక్కువ మొత్తంతో పేద పిల్లలకు ఎంబీఏ, ఇంజనీరింగ్ విద్య అందిస్తున్నాం. మేము ఏమైనా అవినీతికి పాల్పడితే.. కేసులు పెట్టుకోండి. మా ఇళ్లు వేలం వేయండి.. స్వాధీనం చేసుకోండి..? కానీ మమ్మల్నెందుకు క్షోభకు గురి చేస్తున్నారు? కాలేజీలు, హాస్టళ్లకు సంబంధించిన ఫీజుల చెల్లింపులు మొత్తం ఆన్లైన్లోనే జరుగుతాయి. ఎవరి దగ్గరో డబ్బు దొరికితే దానిని నాతో ముడిపెట్టడం ఏమిటి? నన్ను, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారు. నేను టీఆర్ఎస్ మంత్రిని కావడం వల్లనే దాడులు చేస్తున్నారు. వందల మంది అధికారులతో దాడులు చేయడం ఏమిటి? నా కొడుకు ఛాతీపై కొట్టారు. వాడు తీవ్రంగా భయపడుతున్నాడు. వాడికి ఏమైతుందోనని భయంగా ఉంది. సోదాల్లో ఏమీ దొరకకపోయినా ప్రధాని నరేంద్రమోదీ మాపై కక్షతో వ్యవహరిస్తున్నారు..’ అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడినుంచి మల్లారెడ్డి బోయిన్‌పల్లిలోని ఇంటికి వచ్చిన తరువాత ఆయన కోడలు ప్రీతిరెడ్డిని కూడా ఐటీ అధికారులు తీసుకొచ్చారు. మెడికల్ కాలేజీల వ్యవహారం ఆమె చూస్తారని చెబుతున్నారు. ఇలావుండగా మల్లారెడ్డి ఆర్థిక వ్యవహారాలను చూసే సంతోష్‌రెడ్డి కొంపల్లి నివాసంలో ఐటీ అధికారులు దాదాపు రూ.4 కోట్లు స్వాధీనం చేసుకుని ఐటీ కార్యాలయానికి తరలించినట్లు తెలిసింది. సంతోష్‌రెడ్డి డిలీట్ చేసిన కంప్యూటర్ డేటాను రిట్రీవ్ చేసినట్లు సమాచారం. కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి కక్ష సాధింపులు మంచివి కాదని, వ్యవస్థలపై పూర్తి నమ్మకం ఉంది కాబట్టే ఓపికతో ఉన్నామని, కానీ ఐటీ అధికారుల తీరు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేలా ఉందని ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, ఎల్.రమణలు విమర్శించారు. సూరారం ఆస్పత్రి వద్ద మాట్లాడుతూ.. బహిరంగంగా వ్యాపారాలు చేస్తున్న మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేసి, ఇలా దాడులతో భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇకనైనా కక్ష పూరిత రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలను నిరసిస్తూ కంటోన్మెంట్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటి ముందు ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు పలు కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మల్లారెడ్డి నివాసం వద్ద నిరసన చేపట్టారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మర్రి రాజశేఖర్‌రెడ్డి లాకర్లపై దృష్టి.. మంత్రి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన లాకర్లపై ఐటీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆయనకు ఎనిమిది బ్యాంకుల్లో 12 లాకర్లు ఉన్నట్టు గుర్తించారు. రాజశేఖర్‌రెడ్డి ప్రస్తుతం టర్కీలో ఉండటంతో మంత్రి కూతురు శ్రేయారెడ్డిని తీసుకెళ్లి లాకర్లను తెరవడానికి ప్రయత్నించారు. అందులో నాలుగు లాకర్లను తెరిచినట్లు ఐటీ అధికార వర్గాల సమాచారం. కాగా లాకర్లలో పెద్దయెత్తున నోట్ల కట్టలు కనుగొన్నట్లు తెలిసింది. రూ.4 కోట్ల నగదు, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రాజశేఖర్‌రెడ్డి గురువారం నగరానికి చేరుకుంటారని తెలుస్తోంది. ఇదీ చదవండి: తెలంగాణలో సోదాలు, దాడుల కాలమిది! -
డిజిటల్ ఇండియా చట్టం వచ్చేస్తోంది
న్యూఢిల్లీ: ప్రతిపాదిత డిజిటల్ ఇండియా చట్టానికి సంబంధించి చాలా మటుకు ప్రక్రియ పూర్తయ్యిందని, 2023 తొలినాళ్లలో దీన్ని ప్రవేశపెట్టే అవకశం ఉందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ఇందులోని కీలక అంశాలపై మరింతగా సంప్రదింపులు జరగాలని కేంద్రం భావిస్తున్నట్లు ఆయన వివరించారు. ‘వినియోగదారులు, పరిశ్రమ, స్టార్టప్‌లు, లాయర్లు, న్యాయమూర్తులు, పౌరులు మొదలైన వర్గాలన్నింటి సంప్రదింపులతో రూపొందాలి. వారందరి అభిప్రాయాలకు ఆ చట్టాల్లో స్థానం లభించాలి. ప్రభుత్వం చేయబోతున్నది ఇదే‘ అని మంత్రి చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాల నాటి ఐటీ చట్టం 2000 స్థానంలో డిజిటల్ ఇండియా చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. -
దాదాపు 27 లక్షల ఖాతాలపై వేటువేసిన వాట్సాప్
సాక్షి,ముంబై: మెటాకు చెందిన ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ ఈ నెలలో కూడా పెద్ద ఎత్తున ఖాతాలపై వేటు వేసింది. సెప్టెంబర్ 30 వరకు ఏకంగా 26 లక్షల 85 వేల భారతీయుల వాట్సాప్ ఖాతాలను నిషేధించింది.సెప్టెంబర్ నివేదిలో సంబంధిత వివరాలను సంస్థ వెల్లడించింది. ఇందులో 8 లక్షలకుపైగా వాట్సాప్ అకౌంట్లనుఎలాంటి ఫిర్యాదలు రాకముందే తొలగించినట్లు వాట్సాప్ పేర్కొంది. ఫేక్ వార్తలు, తప్పుడు సమాచారాన్ని నిరోధించే క్రమంలో తప్పుడు, నకిలీ ఖాతాలను బ్యాన్ చేసింది. అలాగే భారత ఐటీ రూల్స్ 2021కి (IT Rules 2021) అనుగుణంగా లక్షలాదిగా వాట్సాప్ అకౌంట్లను నిలిపి వేస్తుంది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఏకంగా 26 లక్షల 85 వేల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్లు తన నెలవారీ నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు 2022 సెప్టెంబర్ యూజర్ సేఫ్టీ రిపోర్ట్‌ను భారత ఐటీ మంత్రిత్వ శాఖకు అందించింది. అలాగే సెప్టెంబర్‌లో 666 ఫిర్యాదులు అందగా, 23 మందిపై మాత్రమే చర్యలు తీసుకున్నట్టు ప్రకటించింది. గ్రీవెన్స్ ఛానెల్ ద్వారా వినియోగదారుల ఫిర్యాదులకు ప్రతిస్పందించడం, వాటిపై చర్యలు తీసుకోవడంతో పాటు, ప్లాట్‌ఫారమ్‌లో హానికరమైన కంటెంట్‌ను నివారిస్తున్నామని, ఎందుకంటే హాని జరిగిన తరువాత గుర్తించడం కంటే ముందునేగా నివారించడానికే తమ ప్రాధాన్యత వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. -
New IT Rules: కేంద్రం కొత్త రూల్స్.. డిజిటల్ మీడియాలో ఇకపై అలాంటివి కుదరవు!
డిజిటల్ మీడియాలో చోటుచేసుకుంటున్న ఆగడాలపై కేంద్రం కొరడా ఝళిపించబోతోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం(ఐటీ యాక్ట్) ద్వారా ఆంక్షల కత్తికి మరింత పదును పెట్టింది. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 28న జారీ చేసింది. ► ఐటీ యాక్ట్‌ను 2020లో ఆమోదించగా.. 2021 ఫిబ్రవరిలో రూల్స్(నిబంధనల)ను అమలులోకి తెచ్చారు. రానురాను డిజిటల్ మీడియాలో అనేక పోకడలు ఇబ్బందికరంగా మారడంతో తాజాగా మరోసారి ‘ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) సవరణ నియమాలు–2022 నోటిఫికేషన్‌ను కేంద్రం జారీ చేసింది. ► దీంతో సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్లు, ఆన్లైన్ ప్రచార మాధ్యమాలు తదితర డిజిటల్ పాల్ట్ఫామ్లపై మరిన్ని ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ► అసత్యాలు, అర్థసత్యాలు, అశ్లీలం, మోసాలు, హింసను ప్రేరేపించడం, కించపరిచే చర్యలతో అడ్డూ అదుపులేకుండా రెచ్చిపోయే కొందరు డిజిటల్ మీడియా నిర్వాహకులపై ఐటీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తప్పవు. ► ప్రధానంగా లోన్ యాప్స్ మోసాల నేపథ్యంలో లోన్ యాప్స్‌ను డిజిటల్ మీడియాలో ప్రోత్సహించినా, వాటికి అనుకూలంగా ప్రచారం చేసినా ఐటీ యాక్ట్ పరిధిలోకి తెచ్చి చర్యలు తీసుకుంటారు. ► డిజిటల్ మీడియా ఖాతా కోసం ఒక వ్యక్తి ఇచ్చే వ్యక్తిగత సమాచారంపై మరొక వ్యక్తికి ఎలాంటి హక్కు ఉండదు. దీన్ని ఉల్లంఘించి వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం కలిగించేలా వేరొకరు వ్యవహరించకూడదు. ► డిజిటల్ మీడియాలో తమ ఖాతాల ఏర్పాటుకు ప్రైవసీ పాలసీలో భాగంగా వినియోగదారులు ఇంగ్లిష్, తనకు నచ్చిన భాషలో ఇచ్చే వ్యక్తిగత సమాచారాన్ని నిర్వాహకులు, వేరొకరు ప్రచారం చేయడం, మార్పులు(మార్ఫింగ్) చేయడం, అప్లోడ్ చేయడం వంటివి నేరంగానే పరిగణిస్తారు. ► అశ్లీల పోస్టింగ్‌లు, అశ్లీల చిత్రాలు, శారీరక అవయవాల గోప్యతకు భంగం కలిగించడం, లింగ వివక్షతో కూడిన వేధింపులు, మహిళలు, చిన్నారులను కించపరచడం, వేధించడం, హాని కల్గించడం చేస్తే కఠిన చర్యలు తప్పవు. ► లోన్ యాప్‌లు, మనీ లాండరింగ్, ఆన్లైన్ జూదం వంటి వాటిని డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రోత్సహిస్తే ఐటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటారు. ► ఏదైనా పేటెంట్, ట్రేడ్‌మార్క్, కాపీరైట్ తదితర యాజమాన్య హక్కులను ఉల్లంఘించేలా డిజిటల్ మీడియాను వాడుకుంటే ఐటీ యాక్ట్ పరిధిలో చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ► కులం, మతం, జాతిపరంగా వివాదాలు సృష్టించడం, హింసను ప్రేరేపించడం నేరమే. ► తప్పుడు సమాచారం ఇవ్వడం, ఉద్దేశపూర్వకంగా వదంతులు, కట్టుకథలు, తప్పుడు సమాచారంతో సమాజాన్ని తప్పుదారి పట్టించడం, అసత్యాలను ప్రచారం చేయడం, మోసగించడం, ఒక వ్యక్తి మరొక వ్యక్తిలా మభ్యపెట్టేందుకు ప్రయత్నించడం నేరం. ► భారతదేశం ఐక్యత, సమగ్రత, రక్షణ, భద్రత, సార్వభౌమాధికారం, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసేలా డిజిటిల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవు. ► కంప్యూటర్ సాఫ్ట్వేర్, కోడ్, ఫైల్, ప్రోగ్రామ్ తదితర వాటిని నాశనం చేయడానికి, దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తే ఐటీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. చదవండి: వస్తున్నాయ్.. పెట్రోల్, డీజల్,గ్యాస్ కాదు ఇవి కొత్త తరం కార్లు! -
ఇన్ కం ట్యాక్స్ చెల్లింపులు: ‘పే లేటర్’ జోలికి వెళ్లకండి, ఎందుకంటే!
ప్ర. నేను 31–07–2022న రిటర్న్ దాఖలు చేశాను. ఆ రోజు నాటికి రూ. 1,00,000 ట్యాక్స్ చెల్లించాలి. నగదు లేకపోవటం వల్ల ‘పే లేటర్‘ అని ఆప్షన్ పెట్టి ఫైల్ చేశాను. నిన్ననే ఆర్డర్లు వచ్చాయి. రూ. 5,000 పెనాల్టీ కట్టమని. ఏం చేయాలి? – విశ్వనాధ లక్ష్మీ, హైదరాబాద్ జ. చట్టప్రకారం ట్యాక్స్ కట్టలేని పరిస్థితుల్లో గడువు తేదీ లోపల రిటర్ను వేసుకోవడానికి అవకాశం ఇది. సాధారణంగా పూర్తిగా పన్నులు చెల్లించి, రిటర్నులు వేయాలి. విధిలేని పరిస్థితుల్లో ‘పే లేటర్‘ ఆప్షన్‌ను ఉపయోగించి కూడా రిటర్ను వేయవచ్చు. నిజానికి చాలామంది మీలాగే రిటర్నులు వేశారు. కానీ పెనాల్టీ రూ. 5,000 పడకుండా బయటపడవచ్చు. అయితే, జరుగుతున్నది ఏమిటంటే.. ► సాధారణంగా ఇలాంటి రిటర్నుని డిఫెక్టివ్ రిటర్నుగా భావిస్తారు. ►డిఫెక్టివ్ రిటర్నుగా భావించినప్పుడు నోటీసు ఇచ్చి 15 రోజుల లోపు సర్దుబాటు చేస్తారు. ►అలా చేయకపోతే రిటర్ను వేసినట్లు కాదు. 31–07–2022 లోపల రిటర్ను వేసి, ఆ తేదీలోపల ‘వెరిఫికేషన్‘ పూర్తయితే, ఇటువంటి కేసుల్లో రూ. 5,000 చెల్లించమని ఆర్డర్లు రావటం లేదు. కానీ ఏదో ఒక కారణం వల్ల .. ఉదాహరణకు, సైటు మొరాయించడమో, రిజక్ట్ అవ్వటమో, ఇతర సాంకేతికలోపం వల్లో 31–07–2022 లోగా రిటర్ను వెరిఫికేషన్ పూర్తి కాకపోతే, రూ. 5,000 చెల్లించమని నోటీసులు వస్తున్నాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే.. ►మీ రిటర్ను ..డిఫెక్టివ్ రిటర్ను అయినట్లు ►మీరు పెనాల్టీ రూ. 5,000 చెల్లించాలి. ఎందుకంటే, రిటర్ను లేటుగా వేశారు కాబట్టి. ►ఆలస్యంగా వేసినందుకు 234 అ ప్రకారం వడ్డీ కూడా చెల్లించాలి. ►పన్నుభారం లేకపోతే 234 అ వడ్డీ పడదు. ►రిఫండు మీద వడ్డీ రాదు. ►నష్టాలుంటే రాబోయే సంవత్సరానికి సర్దుబాటు చేయరు. ►చెల్లించాల్సిన పన్నులు చెల్లించాలి. ►రివైజ్డ్ రిటర్న్ వేయనవసరం లేదు. రిటర్న్‌ని రివైజ్ చేయనక్కర్లేదు. ►నోటీసుకి జవాబు ఇవ్వాలి. జవాబు ఇవ్వటం అంటే కట్టిన చలాన్ల వివరాలు ఇవ్వడమే. చివరిగా చెప్పాలంటే ఈ ‘పే లేటర్‘ ఆప్షన్ కంటికి ఆకర్షణీయంగా కనబడేది. ‘దూరపు కొండలు నునుపు‘ అన్న సామెతలాంటిది. ఇదొక ‘చిక్కు‘ లాంటిది. పెనాల్టీ తప్పదు. వడ్డీ తప్పదు. వివరణ తప్పదు. సవరణ తప్పదు. జవాబు తప్పదు. చెల్లింపూ తప్పదు. అందుకే ‘పే లేటర్‘ జోలికి పోకండి. ఎలాగూ ట్యాక్స్ చెల్లించక తప్పదు, రిటర్ను వేయకాతప్పదు. ’ఆలస్యం అమృతం విషం’ అని గుర్తెరిగి ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్‌కు పంపించగలరు. -
రోజువారీ కూలీకి ఝలక్.. రూ. 37 లక్షలు ట్యాక్స్ కట్టాలంటూ నోటీసు!
పాట్నా: కూలీకి వెళ్తూ వచ్చే అరకొర డబ్బులతో బతుకు బండిని లాగుతోన్న వ్యక్తికి లక్షలు, కోట్లు అన్న మాట వినటమే గగనం. ఆదాయ పన్ను అంటే ఏంటో తెలిసే అవకాశం చాలా తక్కువ. అలాంటి వ్యక్తికి ఏకంగా రూ.37.5 లక్షలు ఆదాయ పన్ను చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు పంపించింది. ఈ సంఘటన బిహార్‌లోని ఖజారియా జిల్లాలో జరిగింది. జిల్లాలోని మఘౌనా గ్రామానికి చెందిన గిరిష్ యాదవ్ రోజువారీ కూలీ. రోజుకు రూ.500లు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే.. రూ.37.5 లక్షల పన్ను బకాయిలు ఉన్నాయని, వెంటనే చెల్లించాలంటూ ఇటీవలే ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు అందటంతో కంగుతిన్నాడు గిరిష్ యాదవ్. ఏం చేయాలో పాలుపోక.. పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. ‘గిరిష్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఇది మోసానికి సంబంధించిన కేసుగా అర్ధమవుతోంది. ’ అని అలౌలి పోలీస్ స్టేషన్ ఎస్సై పూరేంద్ర కుమార్ తెలిపారు. బాధితుడి పాన్ నెంబర్‌పై జారీ అయిన నోటీసులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గతంలో గిరిష్ ఢిల్లీలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించే వాడని, ఆ సమయంలో ఓ మధ్యవర్తి ద్వారా పాన్‌కార్డ్ కోసం ప్రయత్నించినట్లు చెప్పాడని వెల్లడించారు. ఆ తర్వాత ఆ మధ్యవర్తి కనిపించకుండా పోయినట్లు తెలిపాడన్నారు. గిరిష్‌కు వచ్చిన నోటీసులు రాజస్థాన్‌లోని ఓ కంపెనీకి సంబంధించినవిగా గుర్తించారు పోలీసులు. అయితే, తానెప్పుడూ రాజస్థాన్‌కు వెళ్లలేదని గిరిష్ వాపోయాడు. ఇదీ చదవండి: దళిత యువకుడిపై దాడి.. గ్రామ సర్పంచ్ అరెస్ట్.. వీడియో వైరల్! -
‘తోపుడు బండిపై ఆస్పత్రికి’.. వార్త రాసిన జర్నలిస్టులపై ఐటీ చట్టం కింద కేసు!
భోపాల్: అనారోగ్యానికి గురైన ఓ వృద్ధుడిని కుటుంబ సభ్యులు తోపుడు బండిపై ఆసుపత్రికి తరలించారు. ఆ కుటుంబం పడిన బాధను వివరిస్తూ వార్త ఇచ్చారు స్థానిక జర్నలిస్టులు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు.. ముగ్గురు స్థానిక జర్నలిస్టులపై చీటింగ్, వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టటం, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. వారు ఇచ్చిన వార్త పూర్తిగా తప్పు, ఎలాంటి ఆధారాలు లేవు. అయితే, వీడియోలోని కుటుంబం తాము పడిన ఇబ్బంది నిజమేనని, వార్తల్లో వచ్చిందంతా నిజమేనని పేర్కొనటం గమనార్హం. ఈ సంఘటన మధ్యప్రదేశ్, భింద్ జిల్లాలోని లహర్ ప్రాంతం మార్పురా గ్రామంలో జరిగింది. జిల్లా కలెక్టర్ సతీశ్ కుమార్ ఏర్పాటు చేసిన రెవెన్యూ, ఆరోగ్య విభాగాల దర్యాప్తు బృందాలు.. బాధిత కుటుంబం అంబులెన్స్ కోసం ఎలాంటి ఫోన్‌కాల్ చేయలేదని నివేదించాయి. వృద్ధుడు జ్ఞానప్రసాద్ విశ్వకర్మను ముందుగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారని, గవర్నమెంట్ ఆసుపత్రికి కాదని పేర్కొన్నాయి. ఈ నివేదిక ఆధారంగా.. డాక్టర్ రాజీవ్ కౌరవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వార్త రాసిన కుంజ్‌బిహారీ కౌరవ్, అనిల్ శర్మ, ఎన్కే భతేలేపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అంబులెన్స్ రాకపోవటంతో తోపుడు బండిపై 5 కిలోమీటర్లు తాము ఫోన్ చేసినా అంబులెన్స్ రాకపోవటంతో 5 కిలోమీటర్లు తోపుడు బండిపై తీసుకెళ్లినట్లు బాధితుడి కుమారుడు హరిక్రిష్ణ, కూతురు పుష్ప తెలిపారు. తమ కుటుంబం వివిధ ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందినట్లు దర్యాప్తు బృందాలు నివేదించటాన్ని తప్పుపట్టారు పుష్ప. తమకు పీఎం ఆవాస్ యోజన కింద ఒకే ఇన్స్టాల్మెంట్ వచ్చిందని, అధికారులు మా సోదరుడి ఇంటి ముందు నిలబెట్టి ఫోటోలు తీసుకెళ్లారని అధికారులపై విమర్శలు గుప్పించారు. ఇటీవల తమ గుడిసె వద్దకు వచ్చి తెల్లపేపర్‌పై సంతకాలు చేయించుకుని వెళ్లారన్నారు. అయితే, ఈ ఆరోపణలపై అధికారులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇదీ చదవండి: ‘ఈ జిమ్మిక్కులు ఏమిటి.. మోదీ జీ?’.. ట్రావెల్ బ్యాన్పై మనీశ్ సిసోడియా విమర్శలు -
ఇన్కమ్ టాక్స్ నుంచి 143 (1) నోటీసు వచ్చిందా?..అప్పుడేం చేయాలి ?
తగిన జాగ్రత్తలు తీసుకుని వేసినా.. యథాలాపంగా వేసినా.. మొక్కుబడిగా వేసినా.. మమ అనిపించినా 31–7–22 నాటికి రిటర్నులు వేయడం జరిగిపోయింది. ఏదేని కారణాన వేయకపోయినా.. ఒక అంచనా ప్రకారం గత సంవత్సరం వేసినంత మంది ఈసారి వేయలేదు. మరిచిపోయినా.. మానేద్దామనుకున్నా.. ఏదైనా సరే.. రిటర్నులు దాఖలు చేయండి. ఎప్పటికైనా రిటర్ను వేయటమే మంచిది. ప్రస్తుతం మీరు వేసే రిటర్నులను, వేయని వారితో వేయించి (దాఖలు), ఆ తర్వాత వేయించడం (మూకుడులో కాదు).. ఇలా అసెస్మెంట్ ప్రక్రియను సక్రమంగా, సత్వరంగా, సమగ్రంగా, సమిష్టిగా చేపట్టటానికి మొత్తం అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. సాధారణంగా మీరు ఆన్లైన్లో దాఖలు చేసిన వెంటనే చాలా త్వరగా అసెస్మెంట్ అవుతుంది. ముఖ్యంగా పాన్‌తో అనుసంధానమైన కేసులో 24 గంటల్లోనే రిఫండు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. చాలా మందికి రెండు మూడు రోజుల్లోనే వారి సెల్‌ఫోన్‌కి ఒక సందేశం వచ్చింది. ‘మీరు వేసిన రిటర్నుని ప్రాసెస్ చేశాం.. అంటే మీ ఇన్‌కం ట్యాక్స్ అసెస్మెంటు పూర్తి చేశాం. మీ రిజిస్టర్డ్ ఈ–మెయిల్‌కి సెక్షన్ 143 (1) సమాచారం పంపుతున్నాం. చెక్ చేసుకోండి. అందకపోతే మీ సిస్టంలో spam (సాధారణంగా పెద్ద సంఖ్యలో వినియోగదారులకు పంపే మెయిల్స్) వెళ్లి వెతకండి‘ అని సమాచారం వస్తోంది. కానీ ఈ సందేశం రాగానే, అది చదవగానే అందరూ భయపడుతున్నారు. ఏదో ‘శ్రీముఖం’ వచ్చిందని వాపోతున్నారు. దాఖలు చేసి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే నోటీసా అని నుదురు కొట్టుకుంటున్నారు. ఏమి కొంప మునిగిందిరా అని రామచంద్రుణ్ని తలుచుకుంటున్నారు. అప్పుడే ‘మొదలెట్టావా సీతమ్మ తల్లి’ అని ఆర్థిక మంత్రి సీతారామన్ గారి మీద శివమెత్తుతున్నారు. ఆగమేఘాల మీద ఆడిటర్గారి దగ్గరికి పరిగెడుతున్నారు. దయచేసి ఏమీ గాభరా పడక్కర్లేదు.ఎందుకంటే .. దీనర్థం ఏమిటంటే.. ►మీరు రిటర్ను వేసినట్లు (మీ బాధ్యత తీరింది) ►సదరు రిటర్ను అసెస్మెంట్ పూర్తయినట్లు (ఈ సంవత్సరం బెడద వదిలింది) ►ఆర్డరు మీ చేతిలో పడినట్లు (ఫైల్లో భద్రపర్చుకోండి) ►ఇది కేవలం సమాచారం మాత్రమే (ఉత్తర్వులు కాదు) ►రిఫండులు రావచ్చు (బ్యాంక్ అకౌంటు చెక్ చేసుకోండి) ►తప్పొప్పులు సరిదిద్దుతారు (సరిదిద్దుకోండి) ►మిమ్మల్ని చెల్లించమంటే, అది నిజమైతే చెల్లించండి ►అది తప్పయితే వివరణతో జవాబులివ్వండి ► ఏ తప్పు లేకపోతే ఆర్డరు ఇవ్వరు ► కొంత మంది కావాలని తప్పు చేసి, ఆర్డరు వచ్చాకా, డిమాండు చెల్లించి హమ్మయ్య అనుకుంటారు. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com ఈ–మెయిల్‌కు పంపించగలరు.