న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం, హ్యాకింగ్ సహా ఐటీ చట్టంలోని నేరాలకు సంబంధించిన దర్యాప్తుల్లో సీబీఐకి వీలైనంత త్వరగా అనుమతి ఇవ్వాల్సిందిగా సంబంధిత రాష్ట్రాలను సోమవారం కేంద్ర ప్రభుత్వం కోరింది. దీనిపై సిబ్బంది, శిక్షణ విభాగం మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం రాష్ట్రాల అనుమతి పొందిన తరువాతే ఆయా రాష్ట్రాల్లో సీబీఐ దర్యాప్తు ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే, బొగ్గు స్కాం, హ్యాకింగ్ తదితర కేసుల అనుమతిని ఇచ్చే విషయంలో రాష్ట్రాలు భిన్న విధాలుగా స్పందిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాగా, తమకు మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టులను ప్రారంభించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాలు కోరుతున్నాయి. విశాఖపట్నంలో సీబీఐ ప్రత్యేక కోర్టు మంజూరైంది.
సీబీఐ దర్యాప్తునకు అనుమతించండి!
Published Tue, Sep 9 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM
Advertisement