
సదస్సు తేదీలను ప్రకటిస్తున్న మంత్రి కేటీఆర్, జయేశ్ రంజన్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: బయో ఏసియా 21వ వార్షిక సదస్సు తేదీలను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రకటించారు. హైదరాబాద్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ఈ సదస్సు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో జరుగుతుందన్నారు. ‘డేటా అండ్ ఏఐ–రీడిఫైనింగ్ పాజిబిలిటీస్’అనే నినాదంతో ఈ సదస్సు జరుగుతుందని కేటీఆర్ వెల్లడించారు.
హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్, బయో టెక్నాలజీ రంగాల్లో భవిష్యత్‌లో డేటా ఆధారిత సాంకేతికత, కృత్రిమ మేధస్సు పోషించే పాత్రపై 2024 బయో ఏసియా సదస్సులో చర్చిస్తారన్నారు. అన్ని రంగాల్లో డిజిటల్ ఆవిష్కరణల ఫలితాల ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో టెక్నాలజీ, లైఫ్‌సైన్సెస్ సంగమం ద్వారా అద్భుత ఫలితాలు సాధించే అవకాశముందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆరోగ్యరక్షణ రంగంలో ఆవిష్కరణ శకం నడుస్తున్న ప్రస్తుత సమయంలో బయో ఏసియా సదస్సుకు అత్యంత ప్రాధాన్యం ఉందని కేటీఆర్ వెల్లడించారు. ప్రగతిభవన్‌లో బయో ఏసియా తేదీల ప్రకటన కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే వివేకానంద, బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కనీ్వనర్లు మన్నె క్రిషాంక్, పాటిమీది జగన్మోహన్‌రావు, వై.సతీశ్‌రెడ్డి, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.