ఆదాయపన్ను శాఖ ‘వివాద్ సే విశ్వాస్’ పథకానికి సంబంధించి సందేహాలను తొలగించే ప్రయత్నం చేసింది. తరచూ అడిగే ప్రశ్నలకు (ఎఫ్‌ఏక్యూలు) సమాధానాలు విడుదల చేసింది. 2024 జులై 22 నాటికి అపరిష్కృతంగా ఉన్న అన్ని రకాల అప్పీళ్లకు వివాద్ సే విశ్వాసం పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ పథకం కింద పన్ను వివాదాలను పరిష్కరించుకోవాలని భావించే వారు ఈ నెల 31లోపు ప్రత్యక్ష పన్నుల వివాద్ సే విశ్వాస్ కింద డిక్లరేషన్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించాలి.
ఇదీ చదవండి: మళ్లీ అవకాశం రాదేమో! భారీగా తగ్గిన బంగారం ధర
తాజా స్పష్టతతో పన్ను చెల్లింపుదారులు అందరికీ కేసుల పరిష్కారంలో సమాన అవకాశాలు లభిస్తాయని నాంజియా అండ్ కో ఎల్‌ఎల్‌పీ పార్ట్‌నర్ సచిన్ గార్గ్ తెలిపారు. జులై 22 నాటికి పెండింగ్‌లో ఉన్నవి, కొట్టేసిన వాటికి సైతం ఈ పథకం కింద పరిష్కారానికి అర్హత ఉంటుంది. వివాద్ సే విశ్వాస్ పథకాన్ని 2024–25 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. అక్టోబర్ 1న దీన్ని నోటిఫై చేశారు. డిసెంబర్ 31లోపు డిక్లరేషన్ దాఖలు చేసిన వారు పరిష్కారానికి వీలుగా వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించాలి. 2025 జనవరి 1, ఆ తర్వాత డిక్లరేషన్ దాఖలు చేస్తే వివాదంలోని పన్ను మొత్తంలో 110 శాతాన్ని చెల్లించాలని ఆదాయపన్ను శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment