tax
-
ఇలా కూడా ఆరా తీస్తారు.. పన్ను వేస్తారు!
ఆదాయపు పన్ను డిపార్టుమెంటు వారు, ఒక్కో అస్సెస్సీకి సంబంధించిన అసెస్మెంట్ పూర్తి చేసినప్పుడు సమాచారం అడగడానికి అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు అమల్లో ఉన్న చట్టం ప్రకారం 142 (1) సెక్షన్ కింద విస్తృత అధికారాలు ఉన్నాయి. ఈ మధ్యే ఒక అస్సెస్సీకి నోటీసులు వచ్చాయి. ‘‘మీరు మీ ఇంటి ఖర్చుల నిమిత్తం, సొంత వాడకాలు లేదా విత్‌డ్రాయల్స్ చాలా తక్కువగా చూపించారు. కాబట్టి మీ కుటుంబ సభ్యుల వివరాలు, వారి ప్రొఫైల్ వివరాలు, వారి పర్మనెంట్ అకౌంట్ నంబర్లు, వారి వార్షికాదాయం వివరాలు ఇవ్వండి’’ అనేది దాని సారాంశం. ఇవే కాకుండా ఈ కింది వివరాలు కూడా ఇవ్వాల్సి వచ్చింది.⬩నెలవారీ రేషన్ వివరాలు. ఎంత కొన్నారు, ఏ రేటుకు కొన్నారు.⬩గోధుమ పిండి ఎంత కొన్నారు.. ⬩బియ్యం ఎంత? ⬩పప్పు ధాన్యాలెంత కొన్నారు..ఎంతకి కొన్నారు? ⬩నూనె ఎంత వాడారు.. ఎంతకు కొన్నారు? ⬩వంట గ్యాస్ వినియోగం వివరాలు. ⬩కరెంటు బిల్లెంత ⬩కొన్న బట్టల వివరాలు ⬩షూస్, పాలిష్, జోళ్లు వివరాలు ⬩క్షవరానికి ఎంత ఖర్చుపెట్టారు ⬩కాస్మెటిక్స్, స్ప్రేలు ⬩ఏయే వేడుకలు చేసుకున్నారు. ఖర్చెంత? ⬩పిల్లల చదువులు, పుస్తకాలు, ⬩స్కూల్ ఫీజుల వివరాలు ⬩మీరు చెల్లించే అద్దె వివరాలు ⬩కారు నిర్వహణ ఖర్చులు, ఇన్సూరెన్స్ ఎంత? ⬩హెల్త్ ఇన్సూరెన్స్ వివరాలు ⬩బిల్డింగ్ నిర్వహణ, ఇన్సూరెన్స్ వివరాలు ⬩జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు ⬩చుట్టాలకు, స్నేహితులకు బహుమతులు ఏమిచ్చారు. వాటి విలువెంత? ⬩రెస్టారెంట్ల ఖర్చులెంత? ⬩గెట్టు గెదర్ లాంటి కార్యక్రమాల ఖర్చులు ⬩సంఘంలోని కార్యకలాపాలు, ఖర్చులు ⬩రోజువారీ ఖర్చులు➤ఇలా అన్నింటి వివరాలూ ఇవ్వాలి. ఇంట్లో ఎంత మంది కుటుంబ సభ్యులున్నారో, వారందరి ఆదాయపు వివరాలు, ఖర్చుల వివరాలు, రుజువులతో సహా ఇవ్వాలి.➤చివర్లో కొసమెరుపు.. కాదు కాదు.. బెదిరింపు ఏమిటంటే, ‘‘ఈ వివరాలు ఇవ్వకపోతే మీరు ప్రతి సంవత్సరం ఇంటి ఖర్చుల నిమిత్తం రూ. 10,00,000 విత్‌డ్రా చేసినట్లుగా భావిస్తాము’’ అని.➤అలా భావిస్తే.. భావించారు.. అక్కడితో ఊరుకోరు. ఆ మొత్తం మీద పన్ను కూడా వేస్తారు.అయితే, సాక్షి పాఠకలోకానికి ఈ అంశం కొత్త కాదు. మనం గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఏ ఖర్చుకైనా ‘‘సోర్స్’’ ఉండాలి. సోర్స్‌కు సరైన వివరణ లేకపోతే ఆ ఖర్చును ఆదాయంగా భావిస్తారు. -
ఆదాయపన్నులో మార్పులు.. తరచూ అడిగే ప్రశ్నలు
ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు సందేహాల నివృత్తి కోసం తరచుగా అడిగే ప్రశ్నలకు జవాబులు కూడా పొందుపర్చారు. ఇలా చేయటంతో డిపార్టుమెంటువారీ స్నేహభావం, సన్నద్ధంగా ఉండే విధానం రెండూ తెలుస్తున్నాయి. వ్యక్తుల ఆదాయపు పన్ను వరకు 21 ప్రశ్నలు ఉన్నాయి. వాటి సారాంశమే ఈ వారం కథనం.కొత్త విధానం అంటే ఏమిటి?కొత్త విధానంలో రాయితీ ఉండే పన్ను రేట్లు, ఉదారమైన శ్లాబులుంటాయి. స్టాండర్డ్ డిడక్షన్ మినహా ఎటువంటి మినహాయింపులు ఉండవు.రేట్లు, శ్లాబులుగతంలో ఈ శ్లాబులు, రేట్ల గురించి తెలియజేశాం. ఇక్కడ బేసిక్ లిమిట్ రూ.3,00,000 నుంచి రూ.4,00,000కు పెంచారు. రూ.4 లక్షల వరకు పన్ను ఉండదు. రూ.12 లక్షలు దాటిన వారికి మాత్రం రూ.4,00,000 నుంచి పన్ను శ్లాబుల ప్రకారం వడ్డిస్తారు. శ్లాబుల విషయంలో నాలుగో ఎక్కం.. రేట్ల విషయంలో ఐదో ఎక్కం గుర్తు పెట్టుకుంటే చాలు. ప్రతి రూ.ఒక లక్ష ఆదాయం పెరుగుదలకు ఎంత పన్ను భారం ఏర్పడుతుంది? ప్రస్తుతం ఎంత? ప్రతిపాదనల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది? అనే విషయాలను అంకెలతో ఉదాహరణగా పట్టిక పొందుపరిచారు.ఎంత వరకు పన్ను చెల్లించనక్కర్లేదు?కొత్త విధానంలో రూ.12,00,000 వరకు పన్ను భారం ఏర్పడదు.పన్ను భారం ‘నిల్‘గా ఉండాలంటే ఏం చేయాలి?రూ.12,00,000 వరకు ఆదాయంపై పన్ను భారం నిల్‌గా ఉండాలంటే కొత్త విధానాన్ని విధిగా ఎంచుకోవాలి. ఆ మేరకు రిటర్నులు దాఖలు చేయాలి. కొత్త విధానం ఎవరికి వర్తిస్తుంది?కొత్త విధానం వ్యక్తులకు, హిందూ ఉమ్మడి కుటుంబాలకు, వ్యక్తుల కలయిక లేదా సంస్థలకు వర్తిస్తుంది.పన్నెండు లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఏమిటి ప్రయోజనం?ఒకప్పుడు రూ.12,00,000 ఆదాయం ఉన్న వారు రూ.80,000 వరకు పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు వారు ఏమీ చెల్లించనక్కర్లేదు.ఆదాయ పరిమితిని పెంచినట్లా?అవుననే చెప్పాలి. నిల్‌గా పన్ను భారం రావాలంటే రూ.12,00,000 లోపల ఆదాయం ఉండాలి. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ట్యాక్సబుల్ పరిమితిని పెంచినట్లు. అంటే రిబేటును పూర్తిగా వాడుకున్నట్లు.గతంలో ‘నిల్’కి లిమిట్ ఎంత ఉంది?ఒకప్పుడు ఇటువంటి లిమిట్ రూ.7,00,000గా ఉండేది. ఇప్పుడు ఈ పరిమితిని రూ.12,00,000కు పెంచారు.కొత్త విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ తగ్గిస్తారా?కొత్త విధానంలో ఉద్యోగస్తులకు రూ.75,000 తగ్గిస్తారు. ఈ తగ్గింపును పరిగణనలోకి తీసుకుంటే ఉద్యోగస్తులకు రూ.12,75,000 వరకు పన్ను ఉండదు.పాత విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ఎంత?పాత విధానంలో రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ మాత్రమే. ఎటువంటి పెంపుదల లేదు. మార్జినల్ రిలీఫ్‌ను ఎలా లెక్కించాలి?రూ.12,00,000 దాటితే రూ.4,00,000 నుంచి పన్ను భారం లెక్కించాలి. మీ ఆదాయం రూ.12,10,000 అనుకోండి, సాధారణంగానైతే పన్ను భారం రూ.61,500. ఇటువంటి వారికి ఇచ్చే ఉపశమనాన్నే మార్జినల్ రిలీఫ్ అంటారు. ఈ రిలీఫ్ వల్ల స్వల్పంగా అదనపు ఆదాయం ఉన్నా అధిక పన్ను చెల్లించనక్కర్లేదు. ఇలాంటప్పుడు పన్నుభారం రూ.10,000 మాత్రమే. ఇలా రూ.12,75,000 వరకు రిలీఫ్ కల్పించారు. ఈ మేరకు చక్కటి, సంపూర్ణమైన ఉదాహరణ ఇచ్చారు.ఎంత మొత్తం రిబేటు ఉంటుంది?రిబేటు రూ.60,000 దాటి ఇవ్వరు.రిబేటుకి మార్జినల్ రిలీఫ్‌కి తేడా ఏమిటి?రూ.12,00,000 లోపు ఆదాయం ఉన్నప్పుడు ఇచ్చేది రిబేటు. రూ.12,00,000 దాటిన తర్వాత (రూ.12,75,000 వరకు) వచ్చేది మార్జినల్ రిలీఫ్.ఇదీ చదవండి: ఫండ్ పనితీరు మదింపు ఇలా..ఇతర ఆదాయాలకు రిబేటు వర్తిస్తుందా?మూలధన లాభాలు, లాటరీ మొదలైన వాటి వల్ల ఏర్పడ్డ ఆదాయాలకు ఈ రిబేటు వర్తించదు. ఏ ఆదాయం మీద స్పెషల్ రేటు ఉందో, దాని మీద రిబేటు రాదు.ఎంత మంది లబ్ధిదార్లు ఉన్నారు?గత సంవత్సరం 8.75 కోట్ల మంది కొత్త విధానంలో రిటర్నులు వేశారు. వారందరికీ ఇప్పుడు లాభం చేకూరుతుంది.ఎంత ఆదా అవుతుంది?ఈ మార్పుల వల్ల సుమారుగా రూ.లక్ష కోట్లు ట్యాక్స్‌పేయర్స్ చేతిలో మిగులుతుంది. అదే వినియోగం పెరిగేందుకు నాంది.-కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
అప్పుడు చెత్త పన్ను అంటూ ఏడ్చాడు ఇప్పుడు పిఠాపురంలో అదే చేస్తున్నాడు
-
మాకూ ట్యాక్స్ ఆడిట్ అవకాశం కల్పించాలి: కాస్ట్ అకౌంటెంట్స్
న్యూఢిల్లీ: ప్రస్తుతం సీఏలకు మాత్రమే ఉన్న ట్యాక్స్ ఆడిటింగ్ అవకాశాన్ని తమకు కూడా కల్పించాలని కాస్ట్ అకౌంటెంట్లు కోరుతున్నారు. జీఎస్టీ చట్టంలో, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్‌గాను, సోషల్ ఆడిటర్లుగాను ఇద్దరికీ సమాన హోదాలనిచ్చినప్పటికీ ట్యాక్స్ ఆడిటింగ్ మాత్రం సీఏలకే పరిమితం చేయడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు.కొత్త ఆదాయ పన్ను చట్టం బిల్లులో అకౌంటెంట్ నిర్వచనంలో కాస్ట్ అకౌంటెంట్‌ను చేర్చకపోవడమనేది గతంలో అకౌంటింగ్ వృత్తి నిపుణులందరికీ సమాన హోదా కల్పిస్తామన్న హామీకి విరుద్ధమని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎంఏఐ) సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు కేసీహెచ్ఏవీఎస్ఎన్ మూర్తి తెలిపారు.ఈ అంశంపై విధాన నిర్ణేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయని మూర్తి వివరించారు. అటు అకౌంటెంట్ల నిర్వచనం పరిధిలో తమను చేర్చకపోవడంపై కంపెనీ సెక్రటరీలు ఆందోళన వ్యక్తం చేశారు.పరోక్ష, ప్రత్యక్ష పన్ను చట్టాలపై కంపెనీ సెక్రటరీలకు కూడా పట్టు ఉంటుందని, ట్యాక్సేషన్ వ్యవస్థలో వారు కీలకంగా వ్యవహరిస్తారని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ప్రెసిడెంట్ ధనంజయ్ శుక్లా పేర్కొన్నారు. మరోవైపు, ఆడిట్ అనేది సీఏల పరిధిలోకి మాత్రమే వస్తుందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ చరణ్‌జోత్ సింగ్ నందా స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. -
అంకెలు మారాయి కానీ.. ప్రశ్న మారలేదు..
మూడు బడ్జెట్ల నుంచి ఇదే ప్రశ్న.. పాత పన్ను విధానమా? కొత్త పన్ను విధానమా? ఏది మంచిది. ఏది ఎక్కువ ఉపయోగకరం. ఏది ఎవరికి ఎక్కువ ప్రయోజనకరం. ఏది మంచిదని ప్రశ్నించే బదులు ఏది ఉపయోగం అనేది సరైన ప్రశ్న. మళ్లీ పాత ప్రశ్నే. ఇరవై ఏళ్లు లేదా అంతకన్నా ముందు నుంచి అస్సెస్సీలతో సేవింగ్స్ చేయించి, అలా చేసినందుకు ఆ మేరకు మినహాయింపును ఇస్తూ వచ్చేవారు. ఏయే సెక్షన్ల ప్రకారం సేవ్ చేస్తే మినహాయింపు వస్తుంది.. అని ఆలోచించి అడుగేసేవాళ్లు.ఉద్యోగస్తులకు కంపల్సరీగా పీఎఫ్ తప్పదు. అంతేకాకుండా, ట్యాక్స్ విధానంలో ‘మినహాయింపు’ను అతిగా వాడారు. డిపాజిట్ చేస్తే మినహాయింపు, విత్‌డ్రా చేస్తే మినహాయింపు, దాని మీద వడ్డీకి కూడా మినహాయింపు. సంక్షేమం అనుకోండి, పొదుపు అనుకోండి, అలవాటు అనుకోండి, ఆకర్షణీయం అనుకోండి.. పీఎఫ్‌ను అతిగా ఆశ్రయించారు. ఇలాగే ఎన్నో పథకాలు. 80సీని ప్రోత్సహిస్తూ ఇరవై పైచిలుకు పథకాలను ప్రవేశపెట్టారు. లిమిట్‌ని పెంచుతూ, 10 సంవత్సరాల పాటు రూ.1,50,000 గరిష్ట పరిమితిగా ఉంచారు. ప్రతి సంవత్సరం ఆ రూ.1,50,000 పరిమితి పెరుగుతుందని అందరూ ఎదురుచూస్తూ వచ్చారు. కానీ నిరాశే. ఎటువంటి మార్పూ లేదు. కనీసం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కూడా మార్పులు తేలేదు. ఇది. అన్యాయమే. అలాగే ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా ఇచ్చే వెసులుబాటైన స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపులో పెంపుదల.. రద్దు.. పునరుద్ధరణ .. పెంపుదల ఇలా మార్పులు తెచ్చారు. ఈ మినహాయింపుని అలాగే కొనసాగిస్తూ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మారిస్తే బాగుండేది. ఇలాంటివి ఎన్నో మినహాయింపులు ఉన్నాయి.ఇదీ చదవండి: ఆర్బిట్రేజ్ ఫండ్స్‌తో మెరుగైన రాబడులుపాతకాలం నాటి అంకెలు.. ఆంక్షలు.. వీటిని ఏమీ మార్చకపోవడాన్ని ‘పాలసీ’ అని సరిపెట్టుకోలేము. ప్రభుత్వపు అనిశ్చితి వైఖరి ఇది అనే చెప్పాలి. గత నెలలో ట్రంప్ గెలుపు, తీసుకురాబోయే విప్లవాత్మక మార్పులు, వాటి తీవ్ర ప్రభావం మన ప్రజల మీద ఉంటుంది అని తెలిసినా స్పష్టత లేదు. అలాంటి పరిస్థితుల్లో వచ్చింది మన సీతమ్మగారి పద్దు. ఒక ప్రశ్న మాత్రం మారలేదు. అదేమిటంటే.. ఏది బెటర్? పాత విధానమా లేక కొత్త విధానమా? అయితే, నిస్సందేహంగా ప్రభుత్వ జోరు, హోరు, వైఖరి, ధోరణి అంతా కొత్త విధానం వైపే మొగ్గు చూపుతోంది. ‘పొమ్మనలేక పొగబెట్టినట్లు’ పాత విధానాన్ని ప్రోత్సహించలేదు. అది ఉంటుందా అని అడిగితే కొనసాగిస్తున్నాం అని అన్నారు ఆర్థిక మంత్రి. అయితే, కొన్ని తేడాలు, సలహాలు, సూచనలను తెలుసుకోవాలి. అవేమిటంటే..భారీగా మినహాయింపు పొందాలనుకునే వారికి పాతది మంచిది. వినియోగం వైపు మొగ్గు చూపించే వారికి కొత్త విధానం ఆకర్షణీయంగా ఉంటుంది. నిలకడగా, నిర్దిష్టంగా, నిశ్చింతగా ఆలోచించే వారికి పాతదే బెటరేమో? స్వతంత్రంగా వ్యవహరించాలి. సులువుగా ఉండాలి. అనువుగా ఉండాలి. కమిట్మెంట్ వద్దనే వారికి కొత్త విధానం బెటరు. మీ ఆదాయాన్ని లెక్కించండి. కంపల్సరీ సేవింగ్స్‌ని పరిగణనలోకి తీసుకుని ఆలోచించండి. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రెడీమేడ్ కాల్క్యులేటర్స్ ఉన్నాయి. అప్పుడు సరైన విధానాన్ని ఎంచుకోండి. కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
బంగారం లాభాలపై పన్ను ఎంత?
గోల్డ్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లలో పెట్టుబడులపై ఏ మేరకు పన్ను ఎలా విధిస్తారు? – గిరిరాజ్మీరు ఏ తరహా బంగారం సాధనంలో ఇన్వెస్ట్ చేశారన్న అంశంపైనే పన్ను ఆధారపడి ఉంటుంది. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్)లో పెట్టుబడులు పెట్టినట్టయితే.. వాటిని రెండేళ్ల పాటు కొనసాగించిన తర్వాత విక్రయిస్తే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి. రెండేళ్లలోపు విక్రయిస్తే వాటిని స్వల్పకాల మూలధన లాభాల పన్ను కింద పరిగణిస్తారు. ఈ మొత్తం వార్షిక ఆదాయానికి కలిపి, నిబంధనల మేరకు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అన్నవి గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెడుతుంటాయి. ఇవి మ్యూచువల్ ఫండ్స్ కనుక స్వల్ప మొత్తం నుంచి సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే గోల్డ్ ఈటీఎఫ్‌లు అయితే ఇవి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ అవుతుంటాయి. ఏడాది తర్వాత పెట్టుబడులు విక్రయిస్తే వచ్చే లాభంపై 12.5 శాతం పన్ను పడుతుంది. ఏడాదిలోపు విక్రయించగా వచ్చిన లాభం ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఎక్స్పెన్స్ రేషియో (ఫండ్స్ సంస్థ వసూలు చేసే చార్జీ) తక్కువగా ఉంటుంది. వ్యయాల పరంగా చౌక. కాకపోతే వీటిల్లో ఇన్వెస్ట్ చేసేందుకు డీమ్యాట్, డ్రేడింగ్ అకౌంట్ అవసరం అవుతాయి. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్‌లో అయితే డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు అవసరం లేకుండానే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులపై ఆర్బీఐ వడ్డీ రేట్ల ప్రభావం ఉంటుందా? – ఇస్మాయిల్ ఆర్బీఐ రెపో రేటును 0.25 శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గించడంతో 6.25 శాతానికి దిగొచ్చింది. దీనికి డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా స్పందిస్తాయో అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని బాండ్లు (అధిక కూపన్ రేటుతో ఉన్నవి) మరింత విలువను సంతరించుకుంటాయి. ఎందుకంటే కొత్తగా జారీ చేసే బాండ్లతో పోల్చినప్పుడు అంతకుముందు కొనుగోలు చేసినవి ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తాయి. ఫలితంగా ఆయా బాండ్ల ధరలు పెరుగుతాయి. దీంతో సంబంధిత డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవీ కూడా ఆ మేరకు లాభపడుతుంది. వడ్డీ రేట్ల క్షీణత ప్రభావం లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌పై ఎక్కువగా ఉంటుంది. ఇదీ చదవండి: ఇవి రీచార్జ్ చేసుకుంటే ఫ్రీగా జియో హాట్స్టార్అధిక రేటు బాండ్లలో చేసిన పెట్టుబడులతో లాంగ్ టర్మ్ డెట్ ఫండ్స్ ఎక్కువ లాభపడతాయి. దీనికి వ్యతిరేకంగా వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌పై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొత్తగా జారీ చేసే బాండ్లు అధిక రేటును ఆఫర్ చేస్తుంటాయి. దీంతో అప్పటికే ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న బాండ్లపై రేటు తక్కువగా ఉండడంతో అవి ఆకర్షణీయత కోల్పోతాయి. దీంతో ఆయా బాండ్ల ధరలు పడిపోతాయి. దీని ఫలితంగా వాటి ఎన్ఏవీ కూడా క్షీణిస్తుంది. ఈ ధరల ఆధారిత ప్రయోజనానికి అదనంగా.. డెట్ ఫండ్స్‌కు వాటి నిర్వహణలోని బాండ్ల రూపంలో వడ్డీ ఆదాయం కూడా వస్తుంటుంది. వడ్డీ రేట్లలో మార్పులు చోటుచేసుకున్నప్పుడు డెట్ ఫండ్స్ తిరిగి చేసే పెట్టుబడులపై ఆ మేరకు ప్రభావం ఉంటుంది. ఇవన్నీ ఆయా ఫండ్స్‌లో పెట్టుబడులపై రాబడులను ప్రభావితం చేస్తుంటాయి. డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ఈ అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.- ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
అన్నదొకటి... అయ్యిందొకటి!
కాలక్రమంలో వాడుకలో ఉన్న కొన్ని పదాలు అర్థం కోల్పోతాయని, పైగా వాటికి పూర్తి విరుద్ధమైన అర్థాలు పుట్టుకొస్తాయని ప్రముఖ రచయిత జార్జ్ ఆర్వెల్ అంటారు. 8 ఏళ్ల క్రితం ‘ఒకే దేశం ఒకే పన్ను’ అన్నది లక్ష్యంగా, చక్కని సరళతరమైన పన్ను (గుడ్ అండ్ సింపుల్ టాక్స్– జీఎస్టీ)గా చెప్ప బడిన ‘జీఎస్టీ’ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) క్రమంగా తన అర్థాన్ని మార్చుకొంది. 2017 జూలై 1న ఎన్డీఏ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన జీఎస్టీ చిన్న, సన్నకారు వ్యాపారుల సమస్యలను తీర్చకపోగా వారికి అనేక చిక్కుముళ్లను తెచ్చి పెడుతోంది.జీఎస్టీ అమలులోకి వచ్చాక దేశంలో పన్ను వసూళ్లు గణ నీయంగా పెరిగిన మాట వాస్తవం. ఏటా దాదాపు 8 నుంచి 11 శాతం పైబడి జీఎస్టీ వసూళ్లలో వృద్ధిరేటు కనబడుతోంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే వస్తు సేవల వినియోగం పెరుగుతుంది. దాంతో సహజంగానే పన్ను వసూళ్ల మొత్తం పెరుగుతుంది. ఇపుడు జరుగుతున్నది అదే! ఒక దశాబ్ద కాలంలో దేశస్థూల ఉత్పత్తి గణనీ యంగా పెరిగింది. ప్రజల తలసరి ఆదాయమూ హెచ్చింది. కనుక కేవలం జీఎస్టీ అమలు కారణంగానే పన్ను ఎగవేతలు తగ్గాయని, కేంద్రం చెబుతున్నట్లు జీఎస్టీ వల్ల దేశంలో ‘పన్ను ఉగ్రవాదం’ సమసిపోయిందని చెప్పడం అర్ధసత్యమే. దేశంలో 8 ఏళ్ళుగా అమలవుతున్న జీఎస్టీ వల్ల అనేక సమ స్యలు వస్తున్నాయని పలు వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ, వాటిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదు. సరళతరమైన పన్నుగా జీఎస్టీని చెప్పుకోవడం వరకు బాగానే ఉంది గానీ, ఆ పన్ను రేట్లు, వివిధ శ్లాబులలోకి వచ్చే వస్తువులు, సేవల విషయంలో కేంద్రం, రాష్ట్రాల నడుమ ఇంకా ఏకాభిప్రాయం కుద రకపోవడం గమనార్హం. ముఖ్యంగా, రాష్ట్రాలకు అతి పెద్ద ఆదాయ వనరులుగా ఉన్న పెట్రోల్, డీజిల్, మద్యం వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడానికి మెజార్టీ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికి 50కి పైగా సమావేశాలు జరిపినప్పటికీ పలు అంశాలపై కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. చిక్కుముళ్లుజీఎస్టీ అమలులో అనేక చిక్కుముళ్లు ఉన్నాయి. ఇందులో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ ప్రధానమైనది. జీఎస్టీలో 5, 12, 18, 28 శాతాలుగా పన్ను రేట్లు ఉన్నాయి. 1400 పైబడిన వస్తువులు; 500 రకాల సేవలను ఈ 4 శ్లాబులలో సర్దుబాటు చేశారు. భారీ కసరత్తు అనంతరం రేట్లను ఖరారు చేశామని చెప్పారుగానీ అందులో హేతు బద్ధత, మానవత్వం కనుమరుగయ్యాయన్న విమర్శల్ని సాక్షాత్తూ బీజేపీ నేతలే చేస్తున్నారు. ఉదాహరణకు జీవిత బీమా (లైఫ్ ఇన్సూ రెన్స్), ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) ప్రీమియంలపై 18% జీఎస్టీ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తన సహచర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బహిరంగ లేఖ సంధించడం కలకలం రేపింది. సామాన్యులకు అవసరమైన జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై 18% జీఎస్టీ వేయడం వల్ల... వారందరూ జీవితం, ఆరోగ్య రక్షణకు దూరం అవుతారని గడ్కరీ తన లేఖలో పేర్కొన్నారు. ఇక, శ్లాబుల విషయంలో స్పష్టత లోపించడం వల్ల చెల్లింపుదారులకు, వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య వివాదాలు తలెత్తి చివరకు అవి న్యాయస్థానాలకు చేరుతున్నాయి. అలాగే, కోవిడ్ ప్రబలిన 2020, 2021 సంవత్సరాలలో రాష్ట్రాలకు కేంద్రం అందించిన ఆర్థిక సహకారాన్ని తిరిగి రాబట్టుకొనేందుకు ‘సెస్సు’ విధించి ప్రజలపై అదనపు భారాన్ని మోపింది. ఈ సెస్సును ఉపసంహరించు కోవాలన్న అభ్యర్థనను సైతం కేంద్రం పెడచెవిన పెట్టింది.జీఎస్టీ పరిధిని క్రమంగా విస్తరిస్తూ పోతున్నారు. శ్లాబ్‌లను మారుస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులపైన, ప్రాణాలు నిలబెట్టే ఔషధాలపైన కనిష్ఠంగా 5% జీఎస్టీని మాత్రమే వేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తు న్నారు. వెన్న, నెయ్యి, పాలు వంటి పాల ఉత్పత్తుల పైన, ప్యాకింగ్ చేసిన కొబ్బరి నీళ్లు, పండ్ల రసాల పైన 18% జీఎస్టీ విధించడం ఏవిధంగానూ సమర్థనీయం కాదు. చివరకు పెన్నులపైన కూడా జీఎస్టీ విధిస్తున్నారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన 55వ జీఎస్టీ మండలి సమావేశంలో... పిల్లలు ఎక్కువగా ఇష్టపడే పాప్ కార్న్‌పై 3 రకాల జీఎస్టీని విధించడాన్ని ప్రజలు తప్పుబట్టారు. ఎంఎస్ఎంఈలకు శరాఘాతంజీఎస్టీ అమలులో స్పష్టత, హేతుబద్ధత లోపించడం వల్ల దెబ్బ తిన్న ప్రధాన రంగాలలో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల రంగం ఒకటి. దేశీయ తయారీరంగంలో దాదాపు 70% మేర ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తున్న ఎంఎస్ఎంఈ రంగం జీఎస్టీ కారణంగా కుదేలైందన్నది ఓ చేదు వాస్తవం. చిన్న చిన్న వ్యాపారాలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చాక... అవి చాలా వరకు మూతపడ్డాయి. ముడి సరుకులపై పన్ను విధించడం, మళ్లీ అంతిమ ఉత్పత్తులపై పన్ను వేయడం వల్ల... దేశంలో దాదాపు 20 కోట్ల మంది ఆధారపడిన సూక్ష్మ–మధ్య తరహా పరిశ్రమలకు తీరని నష్టం కలిగింది. వాటి సప్లయ్ చెయిన్ తెగిపోయిందని ఆ రంగంపై అనేక ఏళ్లుగా జీవనం సాగిస్తున్నవారు మొత్తుకొంటున్నారు. ఒకవైపు వస్తుసేవలను అంతి మంగా వినియోగించుకొనే వారే పన్ను చెల్లించాలని చెబుతూ... మరో వైపు బహుళ పన్నులు వేస్తున్న పరిస్థితి కొన్ని రంగాల్లో ఉంది. వివాదాలు ఏర్పడితే వాటిని పరిష్కరించుకోవడానికి జీఎస్టీ అప్పీ లేట్ ట్రిబ్యునల్‌ను అందుబాటులోకి తెచ్చిన మాట నిజమే గానీ... చిన్న వ్యాపారులు ఎంతమంది దానిని ఆశ్రయించగలరు? ఇక, స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఆ యా ఉత్ప త్తులపై పన్నులు విధించే హక్కు గతంలో రాష్ట్రాలకు ఉండేది.ప్రజలకు జవాబుదారీతనం ఎక్కువగా వహించేది రాష్ట్రాలే. కానీ, రాష్ట్రాలకు తమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే అవ కాశం జీఎస్టీ వచ్చాక తగ్గిపోయింది. రాష్ట్రాల వినతులకు జీఎస్టీ కౌన్సిల్లో పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదన్న వాదన ఉంది. జీఎస్టీకి సంబంధించి ఏ యే రాష్ట్రాలు ఎన్నెన్ని అభ్యర్థనలు అంది స్తోంది? అందులో వేటికి ఆమోదం తెలుపుతున్నారు? ఎన్నింటిని బుట్టదాఖలా చేస్తున్నారన్న సమాచారాన్ని వెల్లడించడం లేదు. నిజానికి, తగిన సన్నద్ధత లేకుండా జీఎస్టీని అమలులోకి తేవడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. జీఎస్టీ అమలు లోకి వచ్చి 8 ఏళ్లు గడిచాయి. జీఎస్టీ మండలి 55 పర్యాయాలు సమావేశమైంది. అయినా అనేక అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. జీఎస్టీ వసూళ్లల్లో కనబడుతున్న వృద్ధిని చూసి మురిసి పోవడమే తప్ప... ఎదురవుతున్న ఇబ్బందుల్ని సాధ్యమైనంత తొంద రగా పరిష్కరించలేకపోవడం వైఫల్యంగానే పరిగణించాలి. పుట్టుక తోనే లోపాలు ఉన్న బిడ్డగా జీఎస్టీని కొందరు అభివర్ణించారు. మరి కొందరు జీఎస్టీ వల్ల దేశానికి అసలైన ఆర్థిక స్వాతంత్య్రం లభించిందంటున్నారు. ఈ రెండూ నిజమే కావొచ్చు. కానీ, అంతిమంగా ప్రజ లకు మేలు జరుగుతున్నదా లేదా అన్నదే కొలమానం. రచయిత జార్జ్ ఆర్వెల్ చెప్పినట్లు కొన్ని పదాలు అర్థం కోల్పోవడమే కాక వాటికి పూర్తి భిన్నమైన అర్థాలు పుట్టుకొస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ ‘సంస్కరణ’ అనే పదం. ప్రపంచీకరణ తర్వాత ఈ పదా నికి అర్థం మారిపోయింది. సంస్కరణ అంటే ఆర్థిక భారంగా ప్రజలు భావిస్తు న్నారు. జీఎస్టీ అంశంలో కూడా సరళతరమైన పన్ను అనే భావన పోయి జీఎస్టీ అంటేనే మోయలేని భారం అని ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది.» జీఎస్టీ అమలులోకి వచ్చాక దేశంలో పన్ను వసూళ్లు గణనీ యంగా పెరిగిన మాట వాస్తవం. ఏటా దాదాపు 8 నుంచి 11 శాతం పైబడి జీఎస్టీ వసూళ్లలో వృద్ధిరేటు కనబడుతోంది.» పుట్టుకతోనే లోపాలున్న బిడ్డగా జీఎస్టీని కొందరు అభివ ర్ణించారు. మరికొందరు జీఎస్టీ వల్ల దేశానికి అసలైన ఆర్థిక స్వాతంత్య్రం లభించిందంటున్నారు. కానీ, అంతిమంగా ప్రజ లకు మేలు జరుగుతున్నదా లేదా అన్నదే కొలమానం.» చిన్న వ్యాపారాలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చాక... చాలా వరకు మూతపడ్డాయి. ముడి సరుకులపై పన్ను విధించడం, మళ్లీ అంతిమ ఉత్పత్తులపై పన్నువల్ల... దాదాపు 20 కోట్ల మంది ఆధా రపడ్డ సూక్ష్మ–మధ్య తరహా పరిశ్రమలకు తీరని నష్టం కలిగింది.- వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, మాజీ కేంద్రమంత్రి- డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు -
కొత్త పన్ను చట్టం.. ఎంతో సులభతరం!
న్యూఢిల్లీ: అర్థం చేసుకునేందుకు, ఆచరణకు సులభతరంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న కొత్త ఆదాయపన్ను బిల్లును (ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు, 2025) ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభకు సమర్పించనున్నట్టు సమాచారం. ఇందులో ఎలాంటి కొత్త పన్నుల్లేవు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), ఇతరులకు సంబంధించిన ఆదాయపన్ను ముసాయిదా చట్టం ఇది. చిన్న వ్యాక్యాలతో, చదివేందుకు వీలుగా, టేబుళ్లు, ఫార్ములాలతో ఉంటుంది. ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో తీసుకువస్తున్న ఈ నూతన బిల్లు స్టాండింగ్ కమిటీ పరిశీలన, పార్లమెంట్ ఆమోదం అనంతరం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ‘‘1961 నాటి ఆదాయపన్ను చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఎన్నో సవరణలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రాథమిక నిర్మాణమే మారిపోయింది. భాష సంక్లిష్టంగా ఉండడంతో, నిబంధనల అమలు విషయంలో పన్ను చెల్లింపుదారులపై వ్యయ భారం పెరిగింది. ఇది పన్ను యంత్రాంగం సమర్థతపైనా ప్రభావం చూపిస్తోంది’’అని కొత్త బిల్లు తీసుకురావడానికి గల కారణాలను ప్రభుత్వం వివరించింది. బిల్లులోని అంశాలు.. ట్యాక్స్ ఇయర్: గడిచిన ఆర్థిక సంవత్సరానికి (పీవై) రిటర్నులు దాఖలు చేసే సంవత్సరాన్ని అసెస్మెంట్ సంవత్సరంగా (ఏవై) ప్రస్తుతం పిలుస్తున్నారు. ఇకపై పీవై, ఏవై పదాలు ఉండవు. వీటి స్థానంలో ఏప్రిల్ 1 నుంచి 12 నెలల కాలాన్ని (ఆర్థిక సంవత్సరాన్ని) ‘ట్యాక్స్ ఇయర్’గా సంభాషిస్తారు. ప్రస్తుత చట్టం ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి 2024–25 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. సైజు కుదింపు: 1961 నాటి చట్టం 880 పేజీలు, 298 సెక్షన్లు, 23 చాప్టర్లు, 14 షెడ్యూళ్లతో ఉంది. కొత్త బిల్లును 622 పేజీలకు కుదించారు. అదే సమయంలో సెక్షన్లను 526కు, షెడ్యూళ్లను 16కు పెంచారు. చాప్టర్లు 23గానే ఉన్నాయి. టేబుళ్ల రూపంలో: టీడీఎస్, ప్రిజంప్టివ్ ట్యాక్స్, వేతనాలు, మినహాయింపులకు సులభంగా అర్థం చేసుకునేందుకు టేబుళ్లను ఇచ్చారు. టీడీఎస్ సెక్షన్లు అన్నింటికీ ఒకే క్లాజు కిందకు తీసుకొస్తూ అర్థం చేసుకునేందుకు సులభమైన టేబుళ్ల రూపంలో ఇచ్చినట్టు నాంజియా ఆండర్సన్ ఎల్ఎల్పీ ఎంఅండ్ఏ ట్యాక్స్ పార్ట్నర్ సందీప్ ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. → వేతనాల నుంచి స్టాండర్డ్ డిడక్షన్, గ్రాట్యుటీ, ఎల్టీసీ తదితర తగ్గింపులన్నింటినీ వేర్వేరు సెక్షన్ల కింద కాకుండా ఒకే చోట ఇచ్చారు. → ‘నాత్ విత్ స్టాండింగ్’ (అయినప్పటికీ) అన్న పదం ప్రస్తుత చట్టంలో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. దీని స్థానంలో ఇర్రెస్పెక్టివ్ (సంబంధంలేకుండా)ప్రవేశపెట్టారు. ఇలా అనవసర పదాలు తొలగించారు. → ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్లకు (ఈసాప్) సంబంధించి పన్నులో స్పష్టత తీసుకొచ్చారు. → పన్ను చెల్లింపుదారుల చాప్టర్లో.. పన్ను చెల్లింపుదారుల హక్కులు, బాధ్యతలను వివరంగా పేర్కొన్నారు. -
కొత్త ఆదాయ పన్ను బిల్లులో ‘ట్యాక్స్ ఇయర్’?
పార్లమెంటులో త్వరలో ప్రవేశపెట్టనున్న కొత్త ఆదాయపు పన్ను బిల్లు(New Income Tax Bill) సామాన్యులకు ప్రత్యక్ష పన్ను చట్టాలను సులభతరం చేయడమే లక్ష్యంగా రూపొందించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. బిల్లులో ప్రతిపాదించిన కీలక మార్పుల్లో ‘ట్యాక్స్ ఇయర్’ ఒకటని సమాచారం. ఈ మార్పువల్ల వ్యాపారుల పన్ను చెల్లింపులను సులభతరం చేసేందుకు వీలవుతుందని భావిస్తున్నారు.టాక్స్ ఇయర్(Tax Year) అంటే ఏమిటి?టాక్స్ ఇయర్ అనేది నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ప్రయోజనాల కోసం ఉపయోగించే 12 నెలల వ్యవధి. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రకారం ట్యాక్స్ ఇయర్ ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. 1961 ఆదాయపు పన్ను చట్టంలో ఉపయోగించిన ‘ప్రివియస్ ఇయర్’, ‘అసెస్మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం)’ స్థానంలో ఈ ట్యాక్స్ ఇయర్‌ను వాడనున్నారు.ఇదీ చదవండి: ఎల్ అండ్ టీ చైర్మన్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలుపన్ను చట్టాలను ఎలా సులభతరం చేస్తుంది?స్థిరమైన ట్యాక్స్ ఇయర్‌ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని నివేదించడానికి, పన్నులు చెల్లించడానికి నిర్దిష్ట వ్యవధిని కలిగి ఉంటారు. ఇది విభిన్న ఆర్థిక సంవత్సరాలకు వేర్వేరు అసెస్మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం-వచ్చే ఆర్థిక సంవత్సరం)లను కలిగి ఉండటం వల్ల తలెత్తే గందరగోళాన్ని తొలగిస్తుంది.పన్ను చెల్లింపుదారులు తమ బాధ్యతలను అర్థం చేసుకోవడానికి సులభమైన, స్పష్టమైన భాషను ఉపయోగించాలని కొత్త బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన కాలం చెల్లిన నిబంధనలు, వివరణలను తొలగించాలని నిర్ణయించారు.పన్ను విధానాలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాలు, క్రమబద్ధమైన విధానాతతో కొత్త పన్ను చట్టాలు వివాదాలు, లిటిగేషన్లను తగ్గిస్తాయని భావిస్తున్నారు. దీనివల్ల మరింత పన్ను వసూలుకు వీలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్నుకు సంబంధించి వివాదాలు తగ్గడం వల్ల న్యాయవ్యవస్థపై భారం తగ్గుతుందని చెబుతున్నారు.తరచూ శాసన పరమైన సవరణలు అవసరం లేకుండా పన్ను పథకాలను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కి ఎక్కువ అధికారాన్ని ఈ బిల్లు కల్పిస్తుంది. -
పాత vs కొత్త పన్ను విధానం: ఎప్పుడు ఏది ఎంచుకోవాలంటే..
యూనియన్ బడ్జెట్ 2025లో కేంద్రమంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించే విధంగా కొత్త ఆదాయపు పన్ను విధానంలో కొన్ని ప్రధాన మార్పులను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.4 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. సెక్షన్ 87A కింద రాయితీ కోసం ఆదాయ పరిమితిని రూ.12 లక్షలకు పెంచారు.నూతన విధానంలో కొత్త శ్లాబుల ప్రకారం మొదటి రూ.4 లక్షల్లోపు ఆదాయం ఉంటే పన్ను పరిధిలోకి రారు. స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి చూసుకుంటే రూ.12.75 లక్షల ఆదాయం దాటని వేతన జీవులు, పెన్షనర్లు పన్ను చెల్లించక్కర్లేదు. రూ.4–12లక్షల ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రిబేట్ అమల్లో ఉంది. దీనికి రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ అదనం. అంటే మొత్తంగా రూ.12,75,000 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించక్కర్లేదు.వార్షిక ఆదాయం రూ. 12.75 లక్షల కంటే ఎక్కువ ఉంటే.. పాత పన్ను విధానం ఎందుకోవాలా? కొత్త పన్ను విధానం ఎంచుకోవాలా అని కొంత తికమకపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఏ పన్ను విధానం ఎందుకోవాలో పరిశీలిద్దాం..కొత్త పన్ను విధానం ఎప్పుడు ఎందుకోవాలంటే..➤సెక్షన్ 87A కింద పూర్తి రాయితీకి అర్హత ఉన్నందున, రూ. 12 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగి ఉండాలి.➤సెక్షన్ 80C (ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్, జీవిత బీమా, లేదా హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ తిరిగి చెల్లింపు వంటివి) లేదా సెక్షన్ 80డీ (మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం) కింద మినహాయింపులు ఉండవు.➤మీరు భారీ తగ్గింపులను క్లెయిమ్ చేయకపోతే.. కొత్త పన్ను విధానం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వివరణాత్మక డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది.మీరు పాత పన్ను విధానం ఎప్పుడు ఎంపిక చేసుకోవాలంటే..అధిక తగ్గింపులను క్లెయిమ్ చేయగల వ్యక్తులకు పాత పన్ను విధానం మరింత అనుకూలంగా ఉంటుంది. ఇందులో.. సెక్షన్ 80సీ కింద పీఎఫ్, పీపీఎఫ్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హోమ్ లోన్ చెల్లింపు మొదలైనవి మాత్రమే కాకుండా.. సెక్షన్ 80డీ కింద వ్యక్తిగత & కుటుంబ సభ్యులకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హోమ్ రెంట్ అలవెన్స్ (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA) వంటివి కూడా ఉన్నాయి. పన్ను చెల్లింపుదారులు ఈ తగ్గింపులను గరిష్టంగా పెంచుకుంటే, వారి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.కొత్త పన్ను విధానంలో శ్లాబులురూ.0-4 లక్షలు - సున్నారూ.4-8 లక్షలు - 5 శాతంరూ.8-12 లక్షలు - 10 శాతంరూ.12-16 లక్షలు - 15 శాతంరూ.16-20 లక్షలు - 20 శాతంరూ.20-24 లక్షలు - 25 శాతంరూ.24 లక్షల పైన 30 శాతంపాత పన్ను విధానంలో పన్ను శ్లాబులురూ.2,50,001 - రూ.5,00,000 - 5 శాతంరూ.5,00,000 నుంచి రూ. 10,00,000 - 20 శాతంరూ.10,00,000 ఆపైన - 30 శాతంఇదీ చదవండి: ఎప్పుడు, ఎలా చనిపోతారో చెప్పే డెత్ క్లాక్: దీని గురించి తెలుసా? -
గణనీయంగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల రూపంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు (2024 ఏప్రిల్ 1 నుంచి 2025 ఫిబ్రవరి 10 నాటికి) రూ.17.78 లక్షల కోట్ల నికర పత్య్రక్ష పన్ను వసూలైంది. అంతక్రితం ఆర్థిక సంత్సరం ఇదే కాలంలో ఆదాయంతో పోల్చి చూస్తే 14.69 శాతం వృద్ధి కనిపిస్తోంది.పత్య్రక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలించినప్పుడు.. నాన్ కార్పొరేట్ పన్నుల ఆదాయం (వ్యక్తిగత ఆదాయపన్ను రూపంలో) ఫిబ్రవరి 10 నాటికి 21 శాతం ఎగసి రూ.9.48 లక్షల కోట్లకు చేరింది. ఇక కార్పొరేట్ పన్నుల ఆదాయం సైతం 6 శాతం అధికమై రూ.7.78 లక్షల కోట్లుగా నమోదైంది.సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్టీటీ) ఇదే కాలంలో 65 శాతం పెరిగి రూ.49,201 కోట్లుగా ఉంది. పన్ను చెల్లింపుదారులకు ఆదాయపన్ను శాఖ ఈ కాలంలో మొత్తం రూ.4.10 లక్షల కోట్లను రిఫండ్ (తిరిగి చెల్లింపు) చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే రిఫండ్లు 42 శాతం పెరిగాయి.ఇక ఫిబ్రవరి 10 నాటికి స్థూల ప్రత్యక్ష పన్నుల ఆదాయం 19 శాతం పెరిగి రూ.21.88 లక్షల కోట్లకు చేరింది. 2024–25 సంవత్సరంలో ఆదాయపన్ను వసూళ్లు రూ.12.57 లక్షల కోట్లుగా ఉండొచ్చని ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్లో సవరించిన అంచనాలు పేర్కొనడం గమనార్హం. -
పన్ను ఆదా.. భవిష్యత్తుకు పెట్టుబడి!
మనది పొదుపు సమాజం. మన తల్లిదండ్రులు, తాతలు ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేసేవారు. భవిష్యత్ కోసం వీలైన ప్రతి రూపాయినీ ఆదా చేసేవారు. కానీ, నేటి తరం ఖర్చు చేయడాన్ని ఇష్టపడుతోంది. సౌకర్యాలు, సుఖాలు, ఆడంబరాలు, ఆనందం కోసం ఖర్చుకు వెనుకాడని ధోరణి పెరిగిపోతోంది. ‘ధనవంతుడు కావాలంటే పేదవారిగా బతకాలి’ అన్నది ఆర్థిక నిపుణులు చెప్పే సూక్తి. పేదవారిగా జీవించాలని చెప్పడం కాదు ఇందులోని అసలు అర్థం. ఆడంబరాలకు, అనవసర ఖర్చులకు పోకూడదన్న సూచన ఇందులో కనిపిస్తుంది. తాజా కేంద్ర బడ్జెట్లో ఆదాయపన్ను రాయితీలను గణనీయంగా పెంచేశారు విత్త మంత్రి. రూ.12.75 లక్షల వరకు కొత్త విధానంలో పన్ను లేకుండా వరాలు కురిపించారు. దీంతో వివిధ తరగతుల వారికి గరిష్టంగా రూ.లక్ష, అంతకుమించి పన్ను రూపంలో ఆదా కానుంది.ఇలా ఆదా అయ్యే మొత్తాన్ని ఖర్చు బకెట్లో వేసేసుకుని సంబరపడిపోకుండా.. పెట్టుబడులకూ కొంత కేటాయించుకోవాలన్నది నిపుణుల సూచన. తద్వారా భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలకు మరింత బలం చేకూరుతుంది. త్వరగా ఆర్థిక స్వేచ్ఛను సొంతం చేసుకోగలరు. పన్ను భారం తప్పించుకునేందుకు కొత్త విధానంలోకి మారిపోయి.. ఇప్పటి వరకు పాత విధానంలో చేస్తున్న పన్ను ఆదా పెట్టుబడులకు మంగళం పాడే తప్పు అస్సలు చేయొద్దని సూచిస్తున్నారు. ఆదాయ స్థాయిలకు అనుగుణంగా కొత్త పన్ను విధానంలో ఆదా అయ్యే మొత్తం వేర్వేరుగా ఉంటుంది. ఏడాదికి రూ.12 లక్షలు సంపాదించే వారికి రూ.83,200, రూ.15 లక్షలు సంపాదించే వారికి రూ.32,500 వరకు తాజా ప్రతిపాదనలతో పన్ను ఆదా కానుంది. అలాగే, రూ.24 లక్షల సంపాదనాపరులకు రూ.1.14 లక్షలు, రూ.కోటి ఆదాయ వర్గాలకు రూ.1,25,840, రూ.5 కోట్ల ఆదాయం కలిగిన వారికి రూ.1.43 లక్షల వరకు పన్ను మిగులు లభించనుంది. ఈ కొత్త ప్రతిపాదనలు 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు కానున్నాయి. అంటే 2026–27 అసెస్మెంట్ సంవత్సరానికి ఇవి వర్తిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు అమల్లో ఉన్న రేట్లే వర్తిస్తాయి. పాత విధానంలో వివిధ సెక్షన్ల కింద పలు రకాల పెట్టుబడులతోపాటు, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలతో కలుపుకుని రూ.8.50 లక్షల ఆదాయంపై పన్ను ఆదాకు అవకాశం ఉంది. పెట్టుబడులు ఆపొద్దు.. ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రణాళిక ఉండాలి. జీవితంలో అన్ని ముఖ్య అవసరాలను సాధించే మార్గసూచీగా ఇది ఉంటుంది. ఈ లక్ష్యాలకు పెట్టుబడులే ఆధారం. ఆదాయంలో కనీసం 30 శాతం అయినా పెట్టుబడులకు మళ్లించుకోవాలి. అయితే, జీవిత లక్ష్యాల దృష్టితో కాకుండా పన్ను ఆదా కోసమే పెట్టుబడులను ఆశ్రయించే వేతన జీవులు కూడా ఉన్నారు. ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్), ఐదేళ్ల పన్ను ఆదా ఎఫ్‌డీల్లో పెట్టుబడులు, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై సెక్షన్ 80సీ పరిధిలో (పాత పన్ను వ్యవస్థ) రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. దీనికి అదనంగా హెల్త్ ఇన్సూరెన్స్‌కు సెక్షన్ 80డీ పరిధిలో పన్ను మినహాయింపులు ఉన్నాయి. గృహ రుణం తీసుకుని అసలు చెల్లింపులను సెక్షన్ 80సీ పరిధిలో, వడ్డీ చెల్లింపులను సెక్షన్ 24 పరిధిలో చూపించుకోవచ్చు. కొత్త పన్ను వ్యవస్థ ఆకర్షణీయంగా ఉండడంతో, ఇంతకాలం పన్ను ఆదా దృష్టితో కొనసాగించిన ఈ పెట్టుబడులను నిలిపివేసే ప్రమాదం లేకపోలేదు. ఈ తప్పు అస్సలు చేయొద్దు. కొత్త పన్ను విధానం సూటిగా, సరళంగా ఉంటుంది. పన్నుల గందరగోళం వద్దనుకునే వారు కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటే తప్పేమీ కాదు. కానీ, అదే సమయంలో పాత పన్ను విధానం ప్రోత్సహిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు, మదుపులను విస్మరించకుండా, వాటిని కొనసాగించడం ద్వారానే గరిష్ట ప్రయోజాన్ని పొందగలరు. పన్ను ఆదా కోసం ఉద్దేశించినవి కాకపోయినా, మెరుగైన ఇతర సాధనాల్లో అయి నా పెట్టుబడులు కొనసాగించుకో వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈక్విటీ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్‌లో ఈఎల్ఎస్ఎస్ ఒక విభాగం. ఇందులో పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. దీంతో ఇతర ఈక్విటీ ఫండ్స్ అంత అమ్మకాల ఒత్తిడి వీటిల్లో ఉండదు. కనుక స్థిరత్వం ఎక్కువ. మల్టీక్యాప్ (ఏ విభాగంలో అయినా ఇన్వెస్ట్ చేయగలదు) విధానంతో పెట్టుబడులు పెడుతుంటుంది. పదేళ్ల కాలంలో 12–18 శాతం మధ్య, ఐదేళ్లలో 13–27 శాతం మధ్య రాబడులు ఈ పథకాల్లో గమనించొచ్చు. కొత్త పన్ను విధానంలోకి మళ్లిన వారు ఈఎల్ఎస్ఎస్లోనే ఇన్వెస్ట్ చేయాలని లేదు. వీటికి ప్రత్యామ్నాయంగా లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఫ్లెక్సీక్యాప్, ఇండెక్స్ ఫండ్స్‌లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, బీమా పథకాలకు పన్ను ఆదాకు మించి ప్రయోజనాలను ఇచ్చే సామర్థ్యం ఉన్నట్టు సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్ట్నర్ కునాల్ సవాని పేర్కొన్నారు. కొత్త విధానంలోకి వెళ్లినా కానీ, భవిష్యత్ కోసం ఉద్దేశించిన ఈ పెట్టుబడులను నిలిపివేయొద్దని సూచించారు. లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ జీవిత బీమా (టర్మ్, ఎండోమెంట్) పాలసీల ప్రీమియం చెల్లింపులపై సెక్షన్ 80సీ కింద పాత వ్యవస్థలో పన్ను మిననహాయింపు ఉంది. వార్షిక ప్రీమియం మొత్తం కవరేజీలో (సమ్ అష్యూర్డ్/రక్షణ) 10 శాతం మించకపోతే, మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను లేదు. ఈ పన్ను ప్రయోజనం కోసం ఎండోమెంట్, టర్మ్ పాలసీలను కొందరు తీసుకుంటున్నారు. ఏ పన్ను విధానంలో ఉన్నారనే అంశంతో సంబంధం లేకుండా, కుటుంబానికి ఆర్థికంగా ఆధారమైన ప్రతి వ్యక్తీ తన పేరిట తగినంత బీమా కవరేజీతో అచ్చమైన టర్మ్ పాలసీ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. తన వార్షిక ఆదాయానికి సుమారుగా 20 రెట్ల మేర సమ్ అష్యూర్డ్ ఉండేలా చూసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఆర్జించే వ్యక్తి ప్రాణానికి ప్రమాదం వాటిల్లితే, వచ్చే బీమా పరిహారంతో అతనిపై ఆధారపడిన కుటుంబం సాఫీగా జీవించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. నేడు జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. కనుక ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. ఇది కేవలం పన్ను ఆదా కోసం ఉద్దేశించిన సాధనం కానే కాదు. పెద్ద ప్రమాదం లేదా కరోనా వంటి విపత్తు పరిస్థితుల్లో ఆస్పత్రి పాలైతే, హెల్త్ కవరేజీ లేని పరిస్థితుల్లో అప్పటి వరకు కూడబెట్టినదంతా కరిగిపోయే ప్రమాదం ఎదురవుతుంది. అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కావడం వల్ల ఆర్థికంగా సమస్యల్లోకి వెళ్లకూడదని కోరుకుంటే, హెల్త్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవాలి. ఒక కుటుంబానికి ఎంత లేదన్నా రూ.10లక్షలు ఉండేలా చూసుకోవాలి. దీనిపై అదనపు కవరేజీని సూపర్ టాపప్ ప్లాన్ రూపంలో తీసుకోవచ్చు. ఉద్యోగం చేసే సంస్థ తరఫున గ్రూప్ హెల్త్ కవరేజీ ఉన్న వారు సైతం విడిగా తమ కుటుంబానికి ఒక హెల్త్ ప్లాన్ తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా కారణంతో కంపెనీని వీడినా, ఉద్యోగం మానేసినా కవరేజీ కొనసాగుతుంది.ఖర్చు కంటే పెట్టుబడి ముఖ్యం చాలా మంది తమ ఆదాయంలో ఖర్చులుపోను మిగులుంటే అప్పుడు పెట్టుబడులకు మళ్లిస్తుంటారు. కానీ, ముందు పెట్టుబడులకు కేటాయింపులు చేసిన తర్వాతే ఖర్చులకు వెళ్లాలన్నది నిపుణుల సూచన. కొత్త పన్ను వ్యవస్థలో మిగిలే నిధులను ఎన్పీఎస్ తదితర పెన్షన్ ప్లాన్లకు కేటాయించుకోవాలని సింఘానియా అండ్ కో పార్ట్నర్ బన్సాల్ సూచించారు. దీనివల్ల గణనీయమైన రిటైర్మెంట్ ఫండ్ ఏర్పడుతుందన్నారు. చాలా మంది రిటైర్మెంట్ లక్ష్యాన్ని పెద్దగా పట్టించుకోరు. 60 ఏళ్ల తర్వాత సంగతి కదా అని తేలికగా తీసుకుంటారు. కానీ, ఉద్యోగంలో చేరిన నాటి నుంచే రిటైర్మెంట్ తర్వాతి జీవితం కోసం పెట్టుబడి చేసుకుంటూ వెళ్లడం ద్వారా స్వల్ప మొత్తమే పెద్ద నిధిగా మారుతుందన్నది తెలుసుకోవాలి.కొత్త–పాత పన్ను వ్యవస్థలు ఏ విధానంలో కొనసాగాలన్నది తమ ఆదాయం ఆధారంగానే నిర్ణయించుకోవాలి. హెచ్ఆర్ఏ, గృహ రుణ ప్రయోజనాలు, ఎల్టీసీ, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ పెట్టుబడులతో రూ.8 లక్షలు, స్టాండర్డ్ డిడక్షన్‌తో రూ.50 వేలు మొత్తంగా రూ.8.50 లక్షల వరకు పాత పన్ను వ్యవస్థలో మినహాయింపులున్నాయి. వీటిని పూర్తిగా వినియోగించుకుంటే రూ.24 లక్షల నుంచి రూ.5 కోట్ల మధ్య ఆదాయం ఉన్న వారికి పాత వ్యవస్థ అనుకూలమని నిమిత్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు నితేష్ బుద్దదేవ్ తెలిపారు. ఒకవేళ తమ పెట్టుబడులు ఈ స్థాయిలో లేకపోతే కొత్త విధానాన్ని పరిశీలించొచ్చు. రూ.24 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి కొత్త విధానమే అనుకూలం. ఎన్పీఎస్ రిటైర్మెంట్ ఫండ్ ఏర్పాటుకు అందుబాటులో ఉన్న మెరుగైన సాధనాల్లో ఎన్పీఎస్ ఒకటి. అతి తక్కువ నిర్వహణ చార్జీలతోపాటు, పెట్టుబడిపైనా, రాబడి ఉపసంహరణపైనా పన్ను ప్రయోజనాలున్నాయి. ఇందులో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తంపై సెక్షన్ 80సీసీఈ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80సీ గరిష్ట ప్రయోజనం కిందకే ఇది కూడా వర్తిస్తుంది. దీనికి అదనంగా సెక్షన్ 80సీసీడీ (1బి) కింద ఎన్పీఎస్ టైర్–1 ఖాతాలో మరో రూ.50,000 పెట్టుబడికి సైతం పన్ను మినహాయింపు ఉంది. ఈ సెక్షన్ కిందే ఎన్పీఎస్ వాత్సల్య పథకంలో పెట్టుబడికీ పన్ను ఆదా ప్రయోజనాన్ని 2025–26లో బడ్జెట్లో కల్పించారు. తమ పేరు మీద లేదా తమ కుమార్తె లేదా కుమారుల పేరిట ఎన్పీఎస్ వాత్సల్యలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ (1బి) కింద గరిష్ట ప్రయోజనం రూ.50వేలకు పరిమితం. 60 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ పథకంలో సమకూరిన మొత్తం నిధి నుంచి 60 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. దీనిపై ఎలాంటి పన్ను ఉండదు. మరో 40 శాతం మొత్తానికి పింఛను ఆదాయాన్నిచ్చే యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కార్పొరేట్ కంపెనీ ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాలో చేసే జమలపైనా పాత విధానంలో పన్ను ప్రయోజనాలున్నాయి. సెక్షన్ 80సీసీడీ (2) కింద మూలవేతనం, డీఏ మొత్తంలో 10 శాతాన్ని ఉద్యోగి తరఫున యాజమాన్యం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ మొత్తంపై మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగి తరఫున ప్రభుత్వమే జమ చేస్తుంటే అప్పుడు 14 శాతంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. కొత్త పన్ను విధానంలోనూ సెక్షన్ 80సీసీడీ (2) కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కల్పించారు. కొత్త విధానంలో ఉద్యోగి తరఫున యాజమాన్యం ఎన్పీఎస్ టైర్–1లో జమ చేస్తే (మూలవేతనం, డీఏలో 10 శాతం / వచ్చే ఏప్రిల్ నుంచి 14 శాతం) ఆ మేరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు.పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజనప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన ప్రభుత్వ హామీతో కూడిన డెట్ పెట్టుబడి సాధనాలు. వీటిల్లో రిస్క్ సున్నా. ఈ రెండు సాధనాల్లో ఏటా చేసే పెట్టుబడులను పాత పన్ను వ్యవస్థలోని సెక్షన్ 80సీ పరిధిలో చూపించుకుని రూ.1.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల గడువు ముగిసిన తర్వాత చేతికి అందే మొత్తంపై పాత, కొత్త పన్ను వ్యవస్థల్లో పన్ను లేదు. పన్ను ప్రయోజనాలున్న ఈ మెరుగైన పథకాలు ప్రతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో ఉండాల్సిందే. తమ మొత్తం పెట్టుబడుల్లో 30–40 శాతం ఈ సాధనాలకు కేటాయించుకుని, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌కు మళ్లించుకోవచ్చు. దీనివల్ల పెట్టుబడికి కొంత రక్షణతోపాటు దీర్ఘకాలంలో అధిక రాబడిని సొంతం చేసుకోగలరు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల్లో పెట్టుబడులకు వర్తించే వడ్డీ రేటు స్థిరంగా ఉండదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ఆర్థిక శాఖ వీటి రేట్లను ప్రకటిస్తుంటుంది. పీపీఎఫ్‌లో ప్రస్తుతం 7.10 శాతం రేటు అమల్లో ఉంది. దీని కాల వ్యవధి 15 ఏళ్లు. అనంతరం మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడులపై ప్రస్తుతం 8.2 శాతం రేటు అమల్లో ఉంది. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట దీన్ని ప్రారంభించుకోవచ్చు. బాలికల వయసు 10 ఏళ్లు మించకూడదు. ఆలోపు వయసున్న వారి పేరుతో ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కుమార్తెలకు 21 ఏళ్లు నిండగానే పథకం ముగిసిపోతుంది. లేదా 18 ఏళ్లు నిండిన తర్వాత, 21 ఏళ్లు రాక ముందే వారికి వివాహం నిశ్చయమైతే అప్పుడు ఈ పథకం నుంచి వైదొలగొచ్చు. కొత్త పన్ను విధానంలో ఉన్న వారికీ పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాలు అనుకూలమేనని వేద్ జైన్ అండ్ అసోసియేట్స్ పార్ట్నర్ అంకిత్ జైన్ సూచించారు. ఎందుకంటే ఈ రెండు పథకాల్లో పెట్టుబడులపై పన్ను ప్రయోజనం కొత్త వ్యవస్థ కింద లేకపోయినా కానీ, వడ్డీ రాబడికి పన్ను మినహాయింపు ప్రయోజనం ఉన్నట్టు తెలిపారు. కుమార్తెల వివాహం, ఉన్నత విద్య కోసం సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ పెట్టుబడులు ఎంతో ఉపయోగపడతాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
జూన్ 1 నుంచి మలయాళ చిత్రాల షూటింగ్ బంద్
‘‘మలయాళ చిత్రపరిశ్రమ(Malayalam film industry) తీవ్ర సంక్షోభంలో ఉంది... ఇలానే కొనసాగితే పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది’’ అంటూ మాలీవుడ్ చిత్రసీమకు చెందిన పలు శాఖలు ఆందోళన చెందుతున్నాయి. ఈ మేరకు కొన్ని మార్పులు చేయకపోతే... జూన్ 1 నుంచి సంపూర్ణంగా షూటింగ్స్, అలానే సినిమాలకు సంబంధించిన ఇతర కార్యకలాపాలను నిలిపివేయాలని, చివరికి సినిమాల ప్రదర్శనలను కూడా ఆపాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు ప్రచారంలోకొచ్చాయి.కేరళ చిత్ర నిర్మాతల మండలి, కేరళ చిత్ర పంపిణీదారుల సంఘం, కేరళ చలన చిత్ర కార్మికుల సమాఖ్య, కేరళ సినిమా ఎగ్జిబిటర్ల సంఘం... ఇవన్నీ కలిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందరూ కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మలయాళ అగ్రనిర్మాత, కథానాయిక కీర్తీ సురేష్ తండ్రి సురేష్‌కుమార్(Suresh Kumar) ప్రకటించారు.60 శాతం పారితోషికాలకే... ‘‘సినిమా పరిశ్రమ 30 శాతం పన్ను కడుతోంది. ఇలా 30 శాతం పన్ను విధింపబడుతున్న ఇండస్ట్రీ ఏదీ లేదు. ఈ 30 శాతంలో జీఎస్టీ కాకుండా అదనంగా వినోదపు పన్ను కూడా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని పన్ను రద్దు చేయాలి. అలాగే ఇండస్ట్రీపరంగా నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికాలు బాగా పెరిగిపోయాయి.వాటిని తగ్గించాలి. సినిమాకి అవుతున్న బడ్జెట్లో 60 శాతం యాక్టర్ల పారితోషికాలకే కేటాయిస్తున్న పరిస్థితుల్లో నిర్మాతలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇది మాత్రమే కాకుండా కొత్తగా వస్తున్న యాక్టర్లు, డైరెక్టర్లు కూడా ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి కారణాల వల్ల సినిమా నిర్మాణం అనేది లాభదాయకంగా లేదు’’ అని సురేష్‌కుమార్ పేర్కొన్నారు.50 రోజుల్లో పూర్తి చేయకుండా... ఇంకా సినిమా నిర్మాణానికి అవుతున్న సమయం గురించి పేర్కొంటూ... ‘‘50 రోజుల్లోనే పూర్తి చేయడానికి వీలున్న సినిమాలకు కూడా 150 రోజులు చేస్తున్నారు. దీనివల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపో తోంది. ఇలా తక్కువ రోజుల్లో పూర్తి చేయలేకపోవడంతో నిర్మాతలు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను తీవ్రతరం చేస్తోంది’’ అన్నారు. 176 చిత్రాలు... అపజయంపాలు... బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ సినిమా పరిశ్రమని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నాయని చెబుతూ – ‘‘2024లో విడుదలైన చిత్రాల్లో 176 చిత్రాలు వసూళ్లపరంగా నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది ఒక్క జనవరిలోనే రూ. 101 కోట్లు నష్టం వాటిల్లింది. ఈ నష్టం సినిమా కోసం తెరవెనుక పని చేస్తున్న నిపుణుల ఉపాధిపై ప్రభావం చూపుతోంది’’ అని పేర్కొన్నారు సురేష్‌కుమార్. ఇక తాజాగా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో పన్ను తగ్గింపు లేదా ఎత్తివేతను కోరుతూ మలయాళ చిత్రసీమకు చెందిన కీలక శాఖల అధ్యక్షులు త్వరలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ని, ఇతర సంబంధిత మంత్రులను కలిసి ఓ వినతి పత్రాన్ని సమర్పించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. నటీనటుల పారితోషికం తగ్గింపు, తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేయడం... వంటి విషయాల్లో సరైన పరిష్కారం లభించకపోతే జూన్ 1 నుంచి షూటింగ్స్, సినిమాకి సంబంధించిన ఇతర కార్యకలాపాలు నిలిపివేయడం ఖాయం అని బలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మరి... మలయాళ చిత్రాల షూటింగ్స్ ఆగుతాయా? చర్చలు సజావుగా జరిగి, పరిష్కార మార్గం వెతుక్కుని షూటింగ్స్ చేస్తారా? అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. -
నూతన ఐటీ చట్టంలో కొత్త పన్నులుండవ్
న్యూఢిల్లీ: కొత్త ప్రత్యక్ష పన్నుల కోడ్(ఐటీ చట్టం) లో ఎలాంటి కొత్త పన్నులు ఉండబోవని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే(Tuhin Kanta Pandey) స్పష్టం చేశారు. అలాగే బడ్జెట్ 2025 ద్రవ్యోల్బణానికి ఆ జ్యం పోసేది కాదన్నారు. ద్రవ్యలోటు తగ్గింపుతో, ద్రవ్యోల్బణాన్ని పెంచని బడ్జెట్‌ను అందించినట్టు చెప్పారు. వృద్ధికి మద్దతునిచ్చే ద్రవ్య విధానానికి అనుగుణంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కూడా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా వడ్డీ రేట్లలో మార్పు ఉండొచ్చన్న సంకేతాన్నిచ్చినట్టయింది.మీడియాతో మాట్లాడిన సందర్భంగా పలు అంశాలపై గందరగోళం, అయోమయాన్ని తొలగించే ప్రయత్నం చేశారు పాండే. మూలధన లాభాల పన్ను లేదా సెక్యూరిటీల లావాదేవీల పన్ను పెంపు రూపంలో ఊహించనిది ఏదైనా ఉంటుందా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని తోసిపుచ్చారు. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే వారం వ్యవధిలో కొత్త ఆదాయపన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ఇది పూర్తిగా కొత్త బిల్లు, తిరగ రాసిందంటూ దీన్ని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉందన్నారు పాండే.‘‘ఇది పన్ను రేట్లను మార్చదు. నిర్మాణాత్మకంగా పూర్తి మార్పునకు గురికానుంది. హేతుబద్దీకరణతోపాటు ప్రక్రియలను సులభంగా మార్చడం ఇందులో కనిపిస్తుంది. ఇందులో ఎన్నో సంస్కరణలు ఉంటాయి. వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది’’అని పాండే వివరించారు. ప్రస్తుత పన్ను చట్టంతో పోల్చితే సగమే ఉంటుందన్న ఆర్థిక మంత్రి ప్రకటనను గుర్తు చేశారు. వృద్ధి నిలకడగా కొనసాగాలంటే ద్రవ్యోల్బణంపై మంచి నియంత్రణ అవసరమని, రెండింటి మధ్య సమతుల్యం అవసరమన్నారు. ఆర్బీఐ ఎంపీసీ సమావేశం ఈ నెల 5న ప్రారంభం కానుంది. 7వ తేదీన నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈ సమావేశంలో రేట్ల కోత నిర్ణయం ఉంటుందా? అన్న ప్రశ్నకు.. పరిస్థితిని వారు తెలుసుకున్నారని, దీనిపై వారే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పాండే బదులిచ్చారు. -
అందరికీ అర్థమయ్యేలా.. ఆదాయ పన్ను చట్టం
వచ్చే వారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో.. ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ తెలిపారు. కొత్త బిల్లు పన్ను చెల్లింపుదారులకు అర్ధమయ్యే విధంగా ఉంటుందని అన్నారు.నిజానికి కేంద్ర ప్రభుత్వం జూలై 2024లో ఆదాయపు పన్ను చట్టానికి సంబందించిన సమగ్ర సమీక్షను చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ చట్టాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా, చదవడానికి, అర్థం చేసుకోవడానికి సులభతరం చేయడమే దీని లక్ష్యం అని అప్పుడే వెల్లడించింది. పన్ను చెల్లింపులకు సంబంధించిన విషయాలు స్పష్టంగా ఉన్నప్పుడే.. చెల్లింపుదారులకు పన్ను ఖచ్చితత్వం లభిస్తుంది. కాబట్టి దీనిని త్వరగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.పన్ను చెల్లింపులకు సంబంధించిన విషయాల సరళీకృతం జరుగుతున్నప్పుడు.. కేపీఎంజీ జనవరి 2025లో పరిశ్రమ అభిప్రాయాలను మరియు అంచనాలను సంగ్రహించడానికి ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 200 కంటే ఎక్కువ మంది అభిప్రాయాలను పొందుపరిచారు. ఇందులో పారిశ్రామిక తయారీ, ఆటోమోటివ్, ఆర్థిక సేవలు, వినియోగదారుల మార్కెట్లు, మౌలిక సదుపాయాలు, ఎనర్జీ అండ్ నేచురల్ రీసోర్సెస్, సాంకేతికత, లైఫ్ సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ, ఫార్మా మొదలైన ఇతర రంగాలకు సంబంధించిన కార్యనిర్వాహకులు ఉన్నారు.సర్వేలో తేల్చిన విషయాలు➤సుమారు 84 శాతం మంది సరళీకరణ చాలా అవసరమని చెప్పారు. ఇందులో 30 శాతం కంటే ఎక్కువమంది లావాదేవీ వర్గాలను కవర్ చేసే టీడీఎస్ నిబంధనలను సరళీకృతం చేయాలని అన్నారు. మూలధన లాభాల పన్ను, వ్యాపార ఆదాయ గణన వంటి ఇతర అంశాలు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.➤96 శాతం మంది ప్రభుత్వం ప్రచురించిన ఆదాయపు పన్ను వ్యాఖ్యానాన్ని రూపొందించడానికి మద్దతు ఇస్తున్నారు. ఇది చాలా స్పష్టంగా ఉందని అంటున్నారు. పన్ను సర్క్యులర్లు లేదా నోటిఫికేషన్ల నుంచి ఇప్పటికే తీసుకున్న ప్రయోజనకరమైన స్పష్టీకరణలను ఆదాయపు పన్ను చట్టంలో నేరుగా చేర్చాలని కోరుకుంటున్నారు.➤87 శాతం మంది తప్పనిసరి TDS సర్టిఫికేట్ జారీని తొలగించాలని అంటున్నారు. 61 శాతం మంది ఫేస్‌లెస్ ఇంటరాక్షన్లకు మద్దతు ఇస్తున్నారు. డివిడెండ్ పన్నులతో సహా అధిక ప్రభావవంతమైన పన్ను రేట్లను పేర్కొంటూ 58% మంది కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించాలని చెబుతున్నారు. 34 శాతం మంది ప్రస్తుత రేట్లు బాగానే ఉన్నాయని చెబుతున్నారు. 7 శాతం మంది నాన్ రెసిడెంట్ కంపెనీలకు మాత్రమే తగ్గింపులను కోరుకుంటున్నారని తెలుస్తోంది. -
టూర్‌కీ ఉంది ఓ ట్యాక్స్!
ఏపీ సెంట్రల్ డెస్క్: ఒత్తిడితో కూడుకున్న జీవితం నుంచి కాస్తంత సేద తీరడానికి ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరూ వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. కొత్త ప్రదేశాలను చూడాలని.. చిల్ కావాలని కోరుకోనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎవరి ఆర్థిక స్థోమతలను బట్టి వారు దేశీయ, విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా విదేశాలకు అత్యధిక సంఖ్యలో వెళ్తున్నవారిలో భారతీయులు కూడా ఉంటున్నారు. ప్రపంచ పర్యాటకులు అత్యధికంగా సందర్శిస్తున్న వాటిలో బాలి (ఇండోనేషియా), బ్యాంకాక్ (థాయ్‌లాండ్), వెనిస్ (ఇటలీ), బార్సిలోనా (స్పెయిన్), యునైటెడ్ కింగ్డమ్ (యూకే) తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నవారిని పర్యాటక పన్నులు (టూరిస్టు ట్యాక్సెస్) కలవరపెడుతున్నాయి. విదేశాల్లోనే కాకుండా మనదేశంలోని ప్రముఖ వేసవి విడిది కేంద్రం.. కొడైకెనాల్‌లోనూ పర్యాటకులపై గ్రీన్ ట్యాక్స్ విధిస్తుండటం గమనార్హం.పర్యాటక పన్ను ఎందుకంటే.. పర్యాటక పన్నులనేవి కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ కాదు. గత కొన్నేళ్లుగా, ఆమ్స్టర్డామ్, వెనిస్, బాలి తదితర నగరాలు పర్యాటక పన్నును వసూలు చేస్తున్నాయి. అక్కడ పర్యాటకుల తాకిడికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను కల్పించడానికి, ఆయా నగరాల్లో ఇతర వసతుల కల్పనకు, పరిశుభ్రంగా ఉంచడానికి పర్యాటక పన్ను విధిస్తున్నాయి. అలాగే పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఆయా కార్యక్రమాలను నిర్వహించడానికి నిధులు అవసరం కాబట్టే తాము పర్యాటక పన్నును వసూలు చేస్తున్నామని ఆయా నగరాలు చెబుతున్నాయి. ఓవర్ టూరిజంతో వచ్చే ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికే తాము టూరిస్టు ట్యాక్స్ వసూలు చేస్తున్నామని పేర్కొంటున్నాయి. ఇప్పటికే యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఎడిన్బర్గ్ నగరం వచ్చే ఏడాది జూలై నుంచి పర్యాటక పన్నును వసూలు చేస్తామని ప్రకటించింది. ఎడిన్బర్గ్ బాటలోనే మరికొన్ని నగరాలు కూడా నడవడానికి సిద్ధమవుతున్నాయి. కలవరపెడుతున్న ఓవర్ టూరిజం.. కొన్ని దేశాలు పర్యాటకుల రాకపై ఆందోళన చెందుతుంటే మరికొన్ని దేశాలు ఓవర్ టూరిజం సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆయా పర్యాటక ప్రాంతాల్లో ఉన్న మొత్తం జనాభా కంటే కొన్ని రెట్ల సంఖ్యలో పర్యాటకులు ఆయా ప్రాంతాలకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా బాలి (ఇండోనేషియా), బ్యాంకాక్ (థాయ్‌లాండ్), వెనిస్ (ఇటలీ), బార్సిలోనా (స్పెయిన్), ఆమ్స్టర్డామ్ (నెదర్లాండ్స్) వంటివి ఓవర్ టూరిజం సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆ నగరాల్లో ఉన్న జనాభాను మించి సంవత్సరం పొడవునా పర్యాటకులు ఈ నగరాలకు పోటెత్తుతుండటంతో వారికి మౌలిక సదుపాయాలు కల్పించడం పెద్ద సమస్యగా మారింది. డిమాండ్‌కు తగ్గట్టు నివాస, ఆహార సదుపాయాలు కల్పించడానికి, హోటళ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున స్థలాలు అవసరం పడుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో స్థానికులకు ఇళ్ల స్థలాలు దొరకడం లేదు. ఒకవేళ దొరికినా అత్యధికంగా ధర చెల్లించాల్సి వస్తోంది.అదేవిధంగా నిత్యం పర్యాటకులతో ట్రాఫిక్ సమస్యలు సైతం తలెత్తుతున్నాయి. దీంతో స్థానికులు తమ దైనందిన పనులు చేసుకోవడానికి, ఆఫీసులకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరప్ దేశం స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఇటీవల ఓవర్ టూరిజం సమస్యను అరికట్టాలని స్థానికులు నిరసనలకు దిగడం ఇందుకు నిదర్శనం. ఇళ్ల స్థలాల కొరత, ట్రాఫిక్ సమస్యలే కాకుండా తమ ప్రాంతాలకు భారీ ఎత్తున తరలివస్తున్న పర్యాటకులతో పర్యావరణ కాలుష్యం కూడా పెరుగుతోందని స్థానికులు వాపోతున్నారు. ఆయా దేశాల పర్యాటకులు పర్యాటక ప్రాంతాలను ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర అపరిశుభ్రమైన చర్యలతో చెత్తకుప్పల్లా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల వల్ల తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. ఓవర్ టూరిజం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. పర్యాటకులకు మరింత భారమేనా? అయితే ఆయా దేశాల్లోని పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టు ట్యాక్స్ విధించడం పర్యాటకులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కొందరు ట్రావెల్ ఆపరేటర్లు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల పర్యాటకులపై మరింత అదనపు ఖర్చు పడుతుందంటున్నారు. పర్యాటకులపై పన్ను విధించడం వల్ల వారు పన్ను లేని వేరే కొత్త గమ్యస్థానాలపై దృష్టి సారిస్తారని అంటున్నారు. దీనివల్ల పన్ను విధిస్తున్న దేశాలకు పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోతుందని పేర్కొంటున్నారు. మరికొందరు ట్రావెల్ ఆపరేటర్లు మాత్రం పర్యాటక పన్ను విధించడం మంచి విషయమేనని చెబుతున్నారు. పర్యాటకులకు వసతులు కల్పించడానికి, ఓవర్ టూరిజం సమస్యను ఎదుర్కోవడానికి టూరిస్టు ట్యాక్స్ ఉండాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని పర్యాటక పన్నులు... ⇒ ఇటలీలోని వెనిస్ పర్యాటకుల తాకిడిని నియంత్రించడానికి ‘డే–ట్రిప్పర్ ట్యాక్స్’ పేరుతో ఒక్కో పర్యాటకుడి నుంచి రోజుకు 5 యూరోలు వసూలు చేస్తోంది. ⇒ నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో పర్యాటకులు తమ హోటల్ బిల్లుపై 7% అదనంగా చెల్లించాల్సిందే. అంతేకాకుండా రాత్రి అక్కడే ఉంటే సిటీ ట్యాక్స్ కింద మరో 3 యూరోలు సమరి్పంచుకోవాల్సిందే. ⇒ భారత్ పొరుగు దేశం భూటాన్ సైతం పర్యాటకుల నుంచి రోజువారీ రుసుమును వసూలు చేస్తోంది. వసతి, భోజనం, సాంస్కృతిక పర్యటనలను కవర్ చేయడానికి రోజుకు 200 నుంచి 250 డాలర్లను రోజువారీ సందర్శకుల రుసుము కింద తీసుకుంటోంది. ⇒ ఓడ లేదా విమానం ద్వారా వెళ్లే అంతర్జాతీయ పర్యాటకుల నుంచి ’సయోనారా ట్యాక్స్’ కింద జపాన్ 1,000 యెన్లు వసూలు చేస్తోంది. ⇒ యూకేలోని మాంచెస్టర్‌లోని హోటళ్లలో ఒక రాత్రి నివాసం ఉంటే ప్రతి పర్యాటకుడు ఒక పౌండ్.. నైట్ ట్యాక్స్ కింద చెల్లించాల్సిందే. ⇒ స్పెయిన్‌లోని బార్సిలోనాలో వసతి రకాన్ని, ప్రదేశాన్ని బట్టి ఒక్కో రాత్రికి 4 యూరోల వరకు టూరిస్టు ట్యాక్స్ చెల్లించాలి. ⇒ గతేడాది అక్టోబర్ 1 నుంచి న్యూజిలాండ్ టూరిస్టు ట్యాక్స్‌ను ఏకంగా మూడురెట్లు పెంచింది. అంతర్జాతీయ పర్యాటకులు ఆ దేశంలో అడుగుపెడితే 135 న్యూజిలాండ్ డాలర్లను చెల్లించాల్సిందే. ⇒ భారతీయ పర్యాటకులు అత్యధికంగా వెళ్లే దేశాల జాబితాలో ఉన్న మలేషియా, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, గ్రీస్, క్రొయేషియా, ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, చెక్ రిపబ్లిక్, పోర్చుగల్ తదితర దేశాల్లోనూ టూరిస్టు ట్యాక్స్‌లు అమల్లో ఉన్నాయి. ⇒ గతేడాది యూకే.. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈటీఏ)ను ప్రవేశపెట్టింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, కొన్ని యూరప్ దేశాల నుంచి యూకేకు రావాలనుకునేవారు ముందుగా ఈటీఏకి దరఖాస్తు చేసుకోవాలి.. అలాగే నిర్దేశిత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అన్ని దేశాలకు యూకే వర్తింపజేయనుంది. ⇒ ఈ ఏడాది జనవరి 1 నుంచి రష్యా పర్యాటక పన్నును ప్రవేశపెట్టింది. ⇒ ఈ ఏడాది మధ్య నుంచి థాయ్‌లాండ్ పర్యాటక పన్నును విధించడానికి సిద్ధమవుతోంది. విమానం ద్వారా తమ దేశంలో ప్రవేశించే పర్యాటకులు 300 బాత్‌లు చెల్లించాల్సి ఉంటుంది. అదే భూ లేదా సముద్ర మార్గం ద్వారా థాయ్‌లాండ్‌లో ప్రవేశిస్తే టూరిస్టు ట్యాక్స్ కొంత తక్కువ ఉంటుంది. ⇒ మనదేశంలో ప్రముఖ వేసవి విడిది కేంద్రం.. కొడైకెనాల్లో ప్లాస్టిక్ బాటిళ్లను నియంత్రించడానికి పర్యాటకుల నుంచి రూ.20 గ్రీన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.పర్యాటకులు ఏం చేయాలి? విదేశాల్లో ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లాలనుకుంటే, ముందు ఆయా దేశాల్లో పర్యాటకులపై ఎలాంటి పన్నులు ఉన్నాయో తెలుసుకోవడం ఉత్తమమని ట్రావెల్ ఆపరేటర్లు చెబుతున్నారు. కొన్ని దేశాలు పర్యాటకులు విమానాశ్రయంలో దిగినప్పటి నుంచే పర్యాటక పన్నును వసూలు చేస్తున్నాయి. ఆ దేశంలో ఎన్ని రోజులు ఉంటారనేదాని ఆధారంగా ఈ రుసుములు ఉంటున్నాయి. మరికొన్ని దేశాలు పర్యాటకులు టూర్‌ని ముగించుకుని వెళ్లిపోతున్నప్పుడు పన్నును (డిపార్చర్ ట్యాక్స్) వసూలు చేస్తున్నాయి. కాబట్టి పర్యాటకులు తమ పర్యటనలకు ముందే ఈ ట్యాక్సుల గురించి తెలుసుకోవాలని ట్రావెల్ ఆపరేటర్లు చెబుతున్నారు. -
కొత్త పన్ను విధానంలోకి ఇక భారీగా..!
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లో తెరతీసిన ఆదాయ పన్ను భారీ రిబేట్లు కారణంగా కొత్త విధానంలోకి మరింత మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు చేరతారని ప్రభుత్వం భావిస్తోంది. 90 శాతానికిపైగా పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్ని ఎంపిక చేసుకోనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 75 శాతంమంది కొత్త విధానంలో ఉన్నారు. ఆర్థిక మంత్రి సీతారామన్ రూ. 12 లక్షల వరకూ ఆదాయంపై పన్ను లేకుండా ప్రతిపాదించడంతో పలువురు కొత్త విధానంలోని మారనున్నట్లు తెలియజేశారు. పన్ను శ్లాబుల పునర్వ్యవస్థీకరణ సైతం ఇందుకు సహకరించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగాన్ని మరింత పెంచడం ద్వారా మానవ జోక్యం లేని పన్నుల నిర్వహణకు ప్రభుత్వం, ఆదాయ పన్ను శాఖలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఆదాయాన్ని ప్రకటించడంలో సాధారణ పన్ను చెల్లింపుదారులకు సులభమైన పద్ధతులను అందుబాటులోకి తీసుకువచి్చనట్లు తెలియజేశారు. ఇందుకు ప్రవేశపెట్టిన సరళతర ఐటీఆర్–1, ముందస్తుగా నమోదయ్యే ఐటీ రిటర్నులు, మూలంవద్ద పన్ను(టీడీఎస్)లో ఆటోమాటిక్ మదింపు తదితరాలను ప్రస్తావించారు. మినహాయింపులు, తగ్గింపులవంటివి లేని నూతన పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు మదింపు మరింత సులభమవుతుందని పేర్కొన్నారు. వెరసి ఐటీ నిపుణుల అవసరంలేకుండానే ఐటీఆర్‌ను దాఖలు చేయవచ్చని తెలియజేశారు. -
ఇది ప్రజల బడ్జెట్!!
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. అమెరికా దివంగత అధ్యక్షుడు అబ్రహాం లింకన్ వ్యాఖ్యను ఉటంకిస్తూ.. ‘ఇది ప్రజాభిప్రాయంతో, ప్రజల కోసం, ప్రజలు రూపొందించుకున్న బడ్జెట్‘గా అభివర్ణించారు. పన్నులపరంగా కొత్త రేట్లతో మధ్యతరగతికి గణనీయంగా ఊరట లభిస్తుందని ఆమె చెప్పారు. ‘వారి చేతిలో మరింతగా డబ్బు మిగులుతుంది. దీంతో వినియోగం, పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయి‘ అని వివరించారు. రేట్ల కోత ఆలోచనకు ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా మద్దతునిచ్చినప్పటికీ, బ్యూరోక్రాట్లను ఒప్పించేందుకే సమయం పట్టిందని మంత్రి వివరించారు. ద్రవ్యోల్బణంపరంగా ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నిజాయితీగా పన్నులు చెల్లించే మధ్యతరగతి వర్గాలు కోరుకుంటున్న నేపథ్యంలో ఆ బాథ్యతను ప్రధాని తనకు అప్పగించారని ఆమె పేర్కొన్నారు. పన్నుపరంగా ఉపశమనం కల్పించేందుకు ప్రధాని సత్వరం అంగీకరించినప్పటికీ ఆర్థిక శాఖ, కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అధికారులను ఒప్పించడానికి సమయం పట్టిందని చెప్పారు. సంక్షేమ పథకాలు, ఇతర స్కీములకు అవసరమైన ఆదాయాన్ని వసూలు చేసే బాధ్యత వారిపై ఉండటమే ఇందుకు కారణమని తెలిపారు. డాలరుతో పోలిస్తే తప్ప రూపాయి పటిష్టంగానే ఉంది.. బలోపేతమవుతున్న అమెరికా డాలరుతో పోలిస్తే మాత్రమే రూపాయి మారకం విలువ క్షీణించిందని, మిగతా కరెన్సీలతో పోలిస్తే స్థిరంగానే ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. స్థూల ఆర్థికమూలాలు పటిష్టంగా ఉండటమే ఇందుకు కారణమని ఆమె చెప్పారు. స్వల్ప వ్యవధిలో డాలరుతో పోలిస్తే రూపాయి 3 శాతం పడిపోవడం వల్ల దిగుమతులకు మరింతగా చెల్లించాల్సి రానుండటం ఆందోళన కలిగించే విషయమే అయినా, దేశీ కరెన్సీ అన్ని రకాలుగా బలహీనపడిందనే విమర్శలు ఆమోదయోగ్యం కావని తెలిపారు. మరోవైపు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలను రూ. 10.18 లక్షల కోట్ల నుంచి రూ. 11.21 లక్షల కోట్లకు నామమాత్రంగా పెంచడంపై స్పందిస్తూ.. కేవలం అంకెలను కాకుండా ఎంత సమర్థ్ధవంతంగా ఖర్చు చేస్తున్నారనేది చూడాలని మంత్రి చెప్పారు. ఏడాదిగా కసరత్తు.. గతేడాది జూలైలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచే పన్ను కోతల అంశంపై కసరత్తు జరుగుతోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. తాము నిజాయితీగా పన్నులు కడుతున్నప్పటికీ, దానికి తగ్గట్లుగా తమ సమస్యల పరిష్కారానికి చర్యలు ఉండటం లేదని మధ్యతరగతి ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె చెప్పారు. ‘మీరేం చేయగలరో చూడండి అని ప్రధాని నాకు సూచించారు. ప్రజల కోసం ఏదైనా చేయాలనే విషయంలో ఆయన స్పష్టంగానే ఉన్నారు. కాకపోతే ఆర్థిక శాఖ, సీబీడీటీ అధికారులను ఒప్పించడానికి సమయం పట్టింది. ఇలా చేయడం వల్ల తలెత్తే ప్రభావాల గురించి వారు నాకు తరచుగా గుర్తు చేసేవారు. వారిని తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే ఆదాయాన్ని సమకూర్చాల్సిన బాధ్యత వారిపై ఉంది. అయితే, అంతిమంగా అందరూ ఒక అభిప్రాయానికి రావడంతో ఇది సాధ్యపడింది‘ అని మంత్రి వివరించారు. ప్రస్తు తం దేశంలో 8.65 కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేస్తున్నారని, టీడీఎస్ వర్తిస్తున్నా రిటర్నులను ఫైలింగ్ చేయని వారి సంఖ్యను కూడా కలిపితే ఇది 10 కోట్లు దాటుతుందని వివరించారు. -
పన్ను శ్లాబుల సవరణకు కారణాలు..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025లో మధ్యతరగతికి ఉపశమనం కలిగించడానికి, ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యంతో ఆదాయపు పన్ను శ్లాబ్‌ల్లో మార్పులు చేశారు. ఆదాయపు పన్ను శ్లాబులను తగ్గించాలని ప్రభుత్వం ఎందుకు నిర్ణయించిందో.. ఇది పన్ను చెల్లింపుదారులను ఎలా ప్రభావితం చేస్తుందో కింద తెలుసుకుందాం.డిస్పోజబుల్ ఆదాయాన్ని పెంచడంఆదాయపు పన్ను శ్లాబులను తగ్గించడానికి ప్రధాన కారణాలలో ఒకటి మధ్య తరగతి వారికి డిస్పోజబుల్ ఆదాయాన్ని(ఖర్చులు అన్ని పోను మిగిలే ఆదాయం) పెంచడం. పన్ను రేట్లను తగ్గించడం ద్వారా, వ్యక్తులు, కుటుంబాలు ఖర్చు చేయడానికి, పొదుపు చేయడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ డబ్బును కలిగి ఉంటారు. ఇది ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి దారితీస్తుంది.పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించడంపొదుపును, పెట్టుబడులను ప్రోత్సహించేలా కొత్త పన్ను విధానాన్ని రూపొందించారు. అధిక డిస్పోజబుల్ ఆదాయంతో, వ్యక్తులు దీర్ఘకాలిక వృద్ధికి దోహదపడే ఆర్థిక సాధనాలు, స్థిరాస్తి లేదా వ్యాపారాల్లో పొదుపు చేయడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది.పన్ను వ్యవస్థను సరళతరం చేయడంపన్ను వ్యవస్థను సరళతరం చేయడమే లక్ష్యంగా పన్ను శ్లాబులను సవరించారు. పన్ను చెల్లింపుదారులు వారి పన్ను విధానాలను అర్థం చేసుకోవడం, వాటిని పాటించడం సులభతరం అవుతుంది. ఈ సరళీకరణ పన్ను చెల్లింపుదారులు, పన్ను అధికారులపై పరిపాలనా భారాన్ని తగ్గిస్తుంది. ఇది మరింత సమర్థవంతమైన పన్ను సేకరణకు దారితీస్తుంది.మధ్యతరగతికి మద్దతుమధ్యతరగతి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంటోంది. వారికి పన్ను ఉపశమనం కల్పించడం, వారి కొనుగోలు శక్తిని పెంచడానికి ఈ నిర్ణయం సాయపడుతుంది. మధ్య తరగతివారిపై పన్ను భారాన్ని తగ్గించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు, మొత్తం ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.పాత పన్ను విధానం రద్దు చేసేలా..?2020లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం ద్వారా క్రమంగా పాత పన్ను విధానాన్ని పలుచన చేస్తున్నారు. తాజా మార్పులు పాత వ్యవస్థను పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులను కొత్త విధానానికి మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్గృహ వినియోగాన్ని ప్రేరేపించడంపెరిగిన డిస్పోజబుల్ ఆదాయం అధిక గృహ వినియోగానికి దారితీస్తుంది. ఇది ఆర్థిక వృద్ధికి కీలక శక్తిగా మారుతుంది. వినియోగదారుల చేతుల్లో ఎక్కువ డబ్బును ఉంచడం ద్వారా వస్తువులు, సేవలకు డిమాండ్ పెరుగుతుంది. తద్వారా వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.ద్రవ్యోల్బణంపెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయంతో ఆదాయపు పన్ను శ్లాబులను తగ్గించడం కుటుంబాలపై కొంత ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. -
రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్ చరిత్రాత్మకం: కిషన్‌రెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ: పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి బాటలు వేస్తూనే అన్ని వర్గాలకు సమన్యాయం చేసే ‘డ్రీమ్ బడ్జెట్’ ఇదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025-26పై కిషన్‌రెడ్డి స్పందించారు. ‘వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేలా రూపొందించిన బడ్జెట్ ఇది. వ్యక్తిగత ఇన్‌కమ్‌ట్యాక్స్ మినహాయింపు పరిమితిని 12 లక్షలకు పెంచడం చాలా పెద్ద నిర్ణయం. ఎంఎస్ఎంఈలు, చిన్న పరిశ్రమలు ఆపన్నహస్తాన్ని అందించిన బడ్జెట్. రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సహకార సమాఖ్య స్ఫూర్తిని గౌరవించిన బడ్జెట్ ఇది. బడ్జెట్లో అన్ని సంక్షేమ పథకాలకు నిధులు పెంచడం అభినందనీయం’అని ప్రధాని మోదీ అన్నారు.దేశ గతినే మార్చే అద్బుతమైన బడ్జెట్: బండి సంజయ్పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్ ఇదిరూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు విప్లవాత్మకంతెలంగాణ సహా దేశంలోని ఒక్కో ఉద్యోగికి ఏడాదికి రూ.80 వేల వరకు ఆదాగత 75 ఏళ్లలో మునుపెన్నడూ లేనివిధంగా మధ్యతరగతికి అనుకూలమైన బడ్జెట్ ఇదితెలంగాణలో 50 లక్షల మందికిపైగా రైతులకు రూ.5 లక్షదాకా రుణం పొందే అవకాశంకిసాన్ క్రెడిట్ కార్డుల కోసం రైతులంతా దరఖాస్తు చేసుకోవాలి -
తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వెహికల్స్!
యూనియన్ బడ్జెట్ 2025-26 లిథియం బ్యాటరీలు.. సంబంధిత రంగాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి గణనీయమైన పన్ను మినహాయింపులను ప్రకటించింది. స్థానిక తయారీని మెరుగుపరచడం మాత్రమే కాకుండా.. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పన్నులు తగ్గించింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ ధరలు తగ్గుముఖం పడతాయి.కోబాల్ట్, లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్, సీసం, జింక్, 12 ఇతర కీలకమైన ఖనిజాల వంటి అవసరమైన పదార్థాలపై కూడా కేంద్రం ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని (BCD) తొలగించింది. బ్యాటరీలు, సెమీకండక్టర్లు, పునరుత్పాదక శక్తి పరికరాల తయారీకి ఈ పదార్థాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాలకు, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ తయారీలో ఈ పదార్థాలపై ఆధారపడే పరిశ్రమలకు ఖర్చులను తగ్గిస్తుంది.ఈవీ బ్యాటరీ ఉత్పత్తిలో ఉపయోగించే 35 అదనపు వస్తువులు, మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీకి 28 వస్తువులపై ట్యాక్స్ తగ్గించడం వల్ల.. కంపెనీలు అదనపు పన్నులు లేకుండా బ్యాటరీ ఉత్పత్తికి అవసరమైన యంత్రాలను, సాధనాలను దిగుమతి చేసుకోవచ్చు. టాటా, ఓలా ఎలక్ట్రిక్, రిలయన్స్ వంటి కంపెనీలను భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రోత్సహించడం లక్ష్యంగా దీనిని ప్రవేశపెట్టడం జరిగింది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్కేంద్రప్రభుత్వ చర్య వల్ల.. ఈవీ బ్యాటరీలు కొంత తక్కువ ధరకే లభిస్తాయి. ఇది ఉత్పత్తి ఖర్చులను తగ్గించి.. దేశీయ తయారీని పెంచుతుంది. ఇది చైనా, ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఇవన్నీ క్లీన్ ఎనర్జీ వృద్ధికి.. భారతదేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు సహాయపడుతుంది. -
రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు
కొత్త పన్ను విధానం కింద రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. పన్ను వ్యవస్థను సరళతరం చేయడానికి, పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు. కొత్త పన్ను విధానం ఆకర్షణీయమైన పన్ను రేట్లను అందిస్తుంది. వివిధ మినహాయింపులు, మినహాయింపుల అవసరాన్ని తొలగిస్తుందని చెప్పారు. ఇందులోని కీలక ఫీచర్లు ఇవే..కొత్త పన్ను విధానం ప్రకారం.. వార్షికంగా రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పాత విధానంతో పోలిస్తే కొత్త విధానంలో తక్కువ పన్ను రేట్లు విధిస్తారు. ఉదాహరణకు, రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయంపై 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం పన్ను ఉంది. కొత్త విధానం ప్రకారం రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రూపంలో రూ.80 వేలు ఆదా అవుతుంది. ఇతర శ్లాబుల్లో కూడా మార్పులు ఉంటాయని నిర్మలమ్మ ప్రకటించారు. రూ.25 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.1.10 లక్షలు ఆదా అవుతుందని చెప్పారు.కొత్త పన్ను విధానంలో శ్లాబుల సవరణరూ.0-4 లక్షలు - సున్నారూ.4-8 లక్షలు - 5%రూ.8-12 లక్షలు - 10%రూ.12-16 లక్షలు - 15%రూ.16-20 లక్షలు - 20%రూ.20-24 లక్షలు - 25%రూ.24 లక్షల పైన 30 శాతంఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్ఈ కొత్త విధానం పన్ను సౌలభ్యాన్ని సులభతరం చేయడం, వాటిని మరింత క్రమబద్దీకరించడానికి తోడ్పడుతుందని కేంద్రమంత్రి సీతారామన్ చెప్పారు. ఇది దేశవ్యాప్తంగా లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. పన్ను భారాన్ని తగ్గించడం, పన్ను ఫైలింగ్ ప్రక్రియను సరళతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. డిస్పోజబుల్ ఆదాయాన్ని పెంచుతుందని, ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుందని భావిస్తున్నారు. ఎలా లెక్కిస్తారంటే..నూతన విధానంలో కొత్త శ్లాబుల ప్రకారం మొదటి రూ.4లక్షల్లోపు ఆదాయం ఉంటే పన్ను పరిధిలోకి రారు. స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి చూసుకుంటే రూ.12.75 లక్షల ఆదాయం దాటని వేతన జీవులు, పెన్షనర్లు రూపాయి పన్ను చెల్లించక్కర్లేదు. రూ.4–12లక్షల ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రిబేట్ అమల్లో ఉంది. దీనికి రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ అదనం. అంటే మొత్తంగా రూ.12,75,000 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించక్కర్లేదు. తాజా బడ్జెట్లో రిబేట్‌ను రూ.60 వేలుగా నిర్ణయించారు. ఇది ఇప్పటివరకు రూ.25,000గా ఉండేది. కాబట్టి రూ.12.75 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే స్థూల ఆదాయం రూ.12.75 లక్షలకు ఒక్క రూపాయి దాటినా రిబేటు వర్తించదు. అలాంటి వారు పైన పేర్కొన్న శ్లాబుల ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.ఇప్పటి వరకు కొత్త పన్ను విధానం ప్రకారం పన్ను వర్తించని ఆదాయం రూ.7 లక్షలుగా ఉంది. స్టాండర్డ్ డిడక్షన్స్ రూ.75 వేలు కలుపుకొని రూ.7.75 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. దీన్ని తాజాగా రూ.12.75 (ప్రామాణిక తగ్గింపు రూ.75వేలు, రిబేట్ కలిపి)కు సవరించారు. -
బడ్జెట్: ఆదాయపు పన్నుల్లో అనూహ్య మార్పులు?
"మనం వికసిత్ భారత్ దిశగా అడుగులేస్తున్నాం. ఈ బడ్జెట్ సమావేశాలు దేశానికి కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ అందించాలి. అలాగే అందరికి సిరిసంపదలు సమకూర్చే ఆ మహాలక్ష్మి దేవికి వినమ్రంగా చేతులెత్తి మొక్కుతున్నా.. మధ్య తరగతి వర్గాలు, పేదలకు ఆ మాత ప్రత్యేక ఆశీర్వాదాలు అందించాలి".నిన్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విలేకర్లతో అన్న మాటలివి. ఈ మాటల్ని తేలిగ్గా తీసిపారేయకూడదు. వాటిని విశ్లేషిస్తే ఎన్నో పరమార్ధాలు ధ్వనిస్తాయి.ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లో పేద, మధ్య తరగతి వర్గాలకు ఏదో కచ్చితమైన మేలు జరగబోతోందనే విషయం ప్రధాని మాటల్లో పరోక్షంగా ధ్వనించిందనే చెప్పొచ్చు.మోదీ 3.O సర్కారు కొలువు తీరిన తర్వాత వస్తున్న తొట్టతొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. దీంతో ఈ బడ్జెట్‌కు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. అంతే కాదు.. ఈసారి విస్తృత స్థాయిలో పన్ను సంస్కరణలు చోటుచేసుకోవచ్చని, ఆదాయపు పన్నుల్లో అనూహ్య మార్పులకు ఆస్కారం ఉందనే మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి.బడ్జెట్ అనేసరికి ఆశలు సహజం.ముఖ్యంగా మధ్య తరగతి, ఉద్యోగ వర్గాలు తమకు మేలు చేసే నిర్ణయాల కోసం ఎప్పటికప్పుడు ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆదాయపు పన్నుల విషయంలో వీరి అంచనాలు కోటలు దాటుతాయి. వాస్తవానికి నిజాయతీగా పన్ను చెల్లించే వర్గం ఏదైనా ఉందా? అంటే అది ఉద్యోగులే. వీరికి జీతభత్యాలు చెల్లించేటప్పుడే టీడీఎస్ రూపంలో పన్ను వసూళ్లు జరిగిపోతాయి. కానీ ట్యాక్స్‌ల విషయానికొస్తే మాత్రం ఏళ్ల తరబడి స్వల్ప మార్పులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఫలితంగా అధిక పన్నులు చెల్లిస్తూ, అక్కరకు రాని ఆదాయాలతో మధ్య తరగతి, ఉద్యోగ వర్గాలు అల్లాడుతూనే ఉంటున్నాయి. కాబట్టి పన్ను రేట్లు తగ్గించడం, ట్యాక్స్ స్లాబుల్లో మార్పులు చేయడం ద్వారా గట్టి ప్రయోజనమే దక్కాలని ఈ వర్గాలు కోరుకోవడంలో తప్పు లేదు. పన్నుల విషయానికొస్తే..* కొత్త స్లాబ్ ప్రకారం ప్రస్తుతం రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించనక్కర్లేదు. ఆదాయాలు పెరిగినప్పటికీ, రేట్లు పెరిగి, ఖర్చులూ విస్తృతమైన నేపథ్యంలో ఈ పన్ను మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇదే కనుక జరిగితే పన్ను చెల్లింపుదారులకు మరింత వెసులుబాటు కలుగుతుంది. తద్వారా వారికి ఖర్చు పెట్టే సామర్ధ్యం పెరిగి, ఆర్ధిక వ్యవస్థ పురోగమించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.* పాత, కొత్త పన్ను విధానాలు రెంటిలోనూ స్టాండర్డ్ డిడక్షన్ ను పెంచాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం... పాత పన్ను విధానం ప్రకారం రూ.50,000 వరకు, కొత్త ట్యాక్స్ స్లాబుల ప్రకారం రూ.75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తోంది.* రూ. 10 లక్షలవరకు పన్నులు ఉండకూడదని, రూ.15 లక్షలు పైబడి రూ.20 లక్షల లోపు ఆదాయాలకు 25% రేటుతో ఓ కొత్త స్లాబ్ ప్రవేశపెట్టాలని మరికొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.* రూ. 15 లక్షలు పైబడిన అధికాదాయ వర్గాల వారి నుంచి ప్రస్తుతం 30% పన్ను వసూలు చేస్తూండగా... దీన్ని రూ.18 లక్షలకు, ఇంకా వీలైతే రూ. 20 లక్షలకు పెంచాలనే డిమాండ్లు వినవస్తున్నాయి. అంటే కొత్త ట్యాక్స్ విధానంలో మరిన్ని మినహాయింపులు, డిడక్షన్లు ఇవ్వాలని కూడా కోరుతున్నారు.* మధ్య తరగతి, ఉద్యోగ వర్గాల ప్రధాన కల సొంత ఇంటిని సమకూర్చుకోవడం. ఇందుకోసం వాళ్ళు రుణాలపైనే ఆధారపడతారు. కొత్త విధానం ప్రకారం.. తొలిసారి ఇల్లు కొనుక్కునేవాళ్లకు ఈ రుణాల తిరిగి చెల్లింపులో అసలు మొత్తంపై ప్రస్తుతం సెక్షన్ 80 సీ కింద లభిస్తున్న డిడక్షన్ ను రూ. 1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచాలని వీరు కోరుతున్నారు. అలాగే సెక్షన్ 24 బీ కింద వడ్డీ తగ్గింపు పరిమితిని కూడా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలనే డిమాండ్లూ వినిపిస్తున్నాయి.ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రస్తుతం క్రెడిట్-లింక్డ్ సబ్సిడీ విధానం అందుబాటులో ఉంది. దీన్ని తమకూ వర్తింప చేయాలని ఆశిస్తున్నారు.పాత విధానంలో ప్రస్తుత స్లాబ్ రేట్లురూ. 2,50,000 వరకు 0రూ. 2,50,001 - రూ. 5,00,000: 5% రూ. 5,00,001 - రూ. 10,00,000: 20%రూ.10,00,000 పైన: 30 %కొత్త విధానంలో ప్రస్తుత స్లాబు రేట్లురూ .3,00,000 వరకు: 0%, రూ. 3,00,001 - 7,00,000: 5%, రూ. 7,00,001 - 10,00,000: 10%, రూ. 10,00,001 - 12,00,000: 15%, రూ. 12,00,001 - 15,00,000 : 20% రూ. 15,00,001 ఆపైన: 30%.ఆదాయం రూ. 7 లక్షలు మించకపోతే... అదనంగా రూ. 25,000 వరకు ట్యాక్స్ రిబేటు కూడా లభిస్తుంది. * వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు వారి ఆదాయం రూ. లక్షల లోపు ఉంటే 87A సెక్షన్ కింద రిబేటు పొందవచ్చు. అంటే వారు ఎలాంటి పన్నూ చెల్లించనక్కర్లేదు. మోదీ నిన్న చెప్పినట్లు.. ఆ లక్ష్మీ కటాక్షం సీతారామన్ చేతుల్లోంచి పేద, మధ్యతరగతి.. ఉద్యోగ వర్గాలకు ఎంతవరకు సిద్ధిస్తుందో చూద్దాం.-బెహరా శ్రీనివాస రావు, ఆర్ధిక నిపుణులు. -
Budget-2025: బడ్జెట్లో మాకేంటి?
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థికమంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) చదివే పద్దుపై అందరిలోనూ అంచనాలున్నాయి. ఆదాయ పన్ను విషయంలో ఊరట ఉంటుందా? ధరలు తగ్గిస్తారా?. ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? ఇలా రకరకాల ప్రశ్నలకు ఆరోజున సమాధానం దొరకనుంది. అయితే సాధారణంగా బడ్జెట్‌తో మాకేంటి? అని జనం అనుకుంటారనే భావన ఒకటి ఉంది. కానీ, అది తప్పని సాక్షి.కామ్ ప్రయత్నం నిరూపించింది. బడ్జెట్లో మాకేంటి అంటున్న ‘సామాన్యుడి’ మనోగతం వాళ్ల మాటల్లోనే తెలుసుకుందాం.. 👉సాధారణ ప్రజలకు మాదిరిగా కాకుండా.. సూపర్ రిచ్ వారికి కొంత ట్యాక్స్ పెంచాలి. ఎందుకంటే సాధారణ ప్రజలు, కోటీశ్వరులు ఇద్దరూ కూడా సమానంగా ట్యాక్స్ కడుతున్నారు. ఇది ధనవంతులపై ప్రభావం చూపకపోయినా, సామాన్యులకు భారంగా ఉంటుందని కార్పొరేట్ ఉద్యోగి అన్నారు. టోల్ గేట్ చార్జీలను కూడా కొంత తగ్గిస్తే బాగుంటుందని కూడా పేర్కొన్నారు.👉భారత్ వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి వ్యవసాయ రంగానికి కొంత ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి. రైతుకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ఉంటే బాగుంటుందని.. చిత్తూరు జిల్లాకు చెందిన యువకుడు పేర్కొన్నారు.👉మధ్యతరగతి వేతన జీవులు.. ప్రతీసారి బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ చివరకు నిరాశే మిగులుతూ వస్తోంది. ఈసారైనా మాలాంటి వాళ్ళను దృష్టిలో ఉంచుకుని ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల, కొంత ఉపశమనం లభిస్తుంది. అత్యధిక జనాభా ఉన్న భారత్‌లో ఆరోగ్య రంగానికి బడ్జెట్లో ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంటోంది. కాబట్టి ఈసారి బడ్జెట్లో మరీ ముఖ్యంగా ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ::ఏపీకి చెందిన ఓ వైద్యుడి అభిప్రాయం👉ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాలని.. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే, అందరికి ఉపయోగకరంగా ఉంటుందని, మదనపల్లెకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2025పై తన ఆశాభావం వ్యక్తం చేశారు.👉2025-26 బడ్జెట్లో నిత్యావసరాల ధరలపై ట్యాక్స్ తగ్గించాలని, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని మెదక్ జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్ధి చెప్పారు.👉బడ్జెట్ వచ్చినప్పుడల్లా.. ఏదేదో అంచనాలు వేసుకుంటూనే ఉంటాను. కానీ అంచనాలను తగ్గట్టుగా ఎప్పుడూ బడ్జెట్ ఉండటం లేదు. ఈ సారైనా నిత్యావసర వస్తువులపై ట్యాక్స్ తగ్గించాలని జర్నలిస్ట్ పేర్కొన్నారు.👉నిత్యావసరాల ధరలతో పాటు ఎలక్ట్రానిక్స్ & ఆటోమొబైల్ మీద కూడా ట్యాక్స్ తగ్గించాలని ఆశిస్తున్నట్లు.. హైదరాబాద్‌లో కెమెరామెన్‌గా పని చేసే వ్యక్తి చెప్పారు.👉సీనియర్ సిటిజన్, హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి, ఈ బడ్జెట్ 2025పై స్పందిస్తూ.. వ్యవసాయదారులకు అవసరమైన పథకాలను మరిన్ని ప్రవేశపెట్టాలని, వ్యవసాయ పనిముట్ల మీద కూడా ట్యాక్స్ తగ్గించాలని పేర్కొన్నారు.:: సిరికుమార్, సాక్షి వెబ్ బిజినెస్ డెస్క్ -
ఆదాయపన్ను కట్టని ఏకైక భారత రాష్ట్రం
ఏటా బడ్జెట్ వస్తుందంటే చాలు.. తమకు ఏమైనా ఊరట లభిస్తుందేమోననే ఆశ వేతన జీవుల్లో కనిపిస్తుంది. ఆదాయపన్నులో ఏమైనా రాయితీలు కల్పించారా అనే లెక్కల్లో మునిగిపోతారు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే మనదేశంలో పన్ను చెల్లించే ఉద్యోగుల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు బడ్జెట్ రోజున ఐటీ శ్లాబ్(IT Slabs)ల గురించి ఆరా తీస్తారు. అయితే, దేశం మొత్తం ఈ లెక్కలతో బిజీగా ఉన్నా.. ఒక్క రాష్ట్రంలోని ప్రజలు మాత్రం తమకేం సంబంధం లేనట్టుగా ఉంటారు. ఎందుకంటే వారు ఆదాయపన్ను అనేదే కట్టరు. అదేంటి పన్ను కట్టకుంటే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా అనే డౌట్ వస్తుందా? అవును ఆ వెసులుబాటు ఇచ్చిందే కేంద్రం. ఇంతకీ ఆ రాష్ట్రం ఏంటో తెలుసా?.. సిక్కిం. 330 ఏళ్లకుపైగా రాచరిక రాజ్యంగా స్వతంత్రంగా ఉన్న సిక్కిం(Sikkim).. 1975లో 22వ రాష్ట్రంగా భారత్‌లో విలీనమైంది. అయితే ఆ సమయంలో సిక్కిం ఓ షరతు పెట్టింది. తాము భారత్‌లో విలీనమైనా.. తాము అంతకుముందు తమ పాలనలో ప్రజలకు పన్నులు విధించలేదని, ఇప్పుడు కూడా ఆ విధానాన్నే అనుసరిస్తామని స్పష్టం చేసింది. దీనికి భారత ప్రభుత్వం అంగీకరించడంతో సిక్కిం ప్రజలకు ఆదాయ పన్ను కట్టే భారం తప్పింది. ఈమేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371ఎఫ్ ప్రకారం సిక్కింకు ప్రత్యేక హోదా ఉంటుంది.తలసరి ఆదాయంలో నంబర్‌వన్..దేశంలో సేంద్రియ రాష్ట్రంగా గుర్తింపు పొందిన సిక్కిం తలసరి ఆదాయం కూడా అదుర్స్. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.5,88,000 తలసరి ఆదాయంతో దేశంలోనే సిక్కిం టాప్‌లో నిలిచింది. 2023–24 ఆర్థిక సంవత్సరం జాతీయ సగటులో సిక్కిం తలసరి ఆదాయం 320 శాతంగా ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. ఇక సిక్కిం తలసరి స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) దేశ తలసరి జీడీపీ కంటే మూడు రెట్లు ఎక్కువ.ఇదీ చదవండి: ఏఐను అందిపుచ్చుకుంటున్న ప్రభుత్వ విభాగాలుఎవరికి మినహాయింపు ఉంటుంది?ఇదంతా విన్న తర్వాత అర్జెంటుగా సిక్కిం వెళ్లిపోతే ఈ ఐటీ బాధలేమీ ఉండవు అనుకుంటున్నారా? అలాంటి పప్పులేమీ ఉడకవు.. 1975 కంటే ముందు నుంచి అక్కడ ఉన్న సిక్కిం నివాసితులకు మాత్రమే ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుంది. వేరే ప్రాంతాల నుంచి అక్కడికి వలస వెళ్లినవారికి ఇది వర్తించదు. ఈ మేరకు 2008లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపన్ను(Income Tax) చట్టంలో సెక్షన్ 10 (26 ఏఏఏ)ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఒక వ్యక్తి సిక్కింకి చెందిన వారు అయి ఉండి ఏ రకంగానైనా ఆదాయం సంపాదిస్తున్నట్లయితే పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కంపెనీ వేరే రాష్ట్రంలో ఉండి డివిడెండ్లు, సెక్యూరిటీల ద్వారా ఆదాయం వస్తే కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. -
అంతా ఈయనే చేశారు...
జేమ్స్ విల్సన్.. మనం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు ఈయనే తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1857 సిపాయిల తిరుగుబాటు, తదనంతర పరిణామాల ఫలితంగా ఈస్టిండియా కంపెనీకి ఆర్థి కంగా చాలా నష్టం జరిగింది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే బాధ్యతను క్వీన్ విక్టోరియా స్కాట్లాండ్కు చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు జేమ్స్ విల్సన్‌కు అప్పగించారు. అలా ఆమె ఆదేశం మేరకు విల్సన్ 1859లో భారత్‌కు వచ్చారు. 1860 ఏప్రిల్ 7న తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఆయన మూడు రకాల పన్నులను ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను, లైసెన్స్ పన్ను, పొగాకు సుంకం.. ఇందులో ఆదాయపు పన్నును మాత్రమే అమల్లోకి తెచ్చారు. మిగిలినవాటిని పక్కనపెట్టారు. అయితే, భారత్‌లోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జమీందారులు, వ్యాపారవేత్తలు ఈ నిర్ణయంపై కినుక వహించారు. 1793లో అప్పటి గవర్నర్ జనరల్ కారన్ వాలీస్ అమల్లోకి తెచ్చిన శాశ్వత భూమి శిస్తు విధానం స్ఫూర్తికి ఇది వ్యతిరేకమని అన్నారు. అప్పట్లో భూమి శిస్తును శాశ్వతంగా నిర్ణయించారు. అదనంగా ఆదాయపు పన్నును విధించడాన్ని విమర్శించారు. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. జేమ్స్ విల్సన్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. దేశంలో భారతీయులు వ్యాపారం చేసుకునేందుకు బ్రిటిషర్లు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించినందున ఆదాయంపై పన్ను విధించడం సబబే అని ఆయన వాదించారు. అయితే, బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కొన్ని నెలలకే ఆగస్టులో రక్త విరోచనాలతో బాధపడుతూ జేమ్స్ విల్సన్ కోల్‌కతాలో మరణించారు. దేశంలో సివిల్ పోలీసు విభాగం ఏర్పాటు, తొలిసారిగా పేపర్ కరెన్సీ తేవడం, ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు, ఆడిటింగ్, పబ్లిక్ వర్క్స్, రహదారుల నిర్మాణం కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు, మిలటరీ ఫైనాన్స్ కమిషన్, సివిల్ ఫైనాన్స్ కమిషన్ల ఏర్పాటు.. ఇలా అన్ని ఆయన కృషి ఫలితమే అని చెబుతారు. ప్రస్తుత స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ పూర్వ సంస్థ చార్టర్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు కూడా ఈయనే.. ఎలాగూ ఐటీ విషయం వచ్చింది కాబట్టి.. ఓ తాజా వార్త.. అమెరికాలో ఆదాయపు పన్ను రద్దు చేయాలని ట్రంప్ అనుకుంటున్నారట.. మేడమ్ వింటున్నారా? -
కొత్త కారు కొంటున్నారా?: ఇలా చేస్తే.. ట్యాక్స్‌లో 50 శాతం తగ్గింపు
వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించాలంటే.. కాలుష్య కారకాలను తగ్గించాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఓ కీలక ప్రకటన చేసింది. పాత వాహనాలను స్క్రాప్ చేసి, కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే ట్యాక్స్‌లో గరిష్టంగా 50 శాతం తగ్గింపు లభించనున్నట్లు వెల్లడించింది.ప్రస్తుతం పాత వాహనాలను రద్దు (స్క్రాపేజ్) చేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే.. వాహన పన్నులో 25 శాతం తగ్గింపు, వాణిజ్య వాహనాల విషయంలో 15 శాతం తగ్గింపు ఉంది. కానీ దీనిని 50 శాతానికి పెంచుతూ.. జనవరి 24న విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్లో మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.బిఎస్ 4 వాహనాల విక్రయాలు ఎప్పుడో ఆగిపోయాయి. ప్రస్తుతం బిఎస్ 6 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే 2000లో వాహనాలకు బిఎస్ 1 ఉద్గార ప్రమాణాలు తప్పనిసరి. ఆ తరువాత బిఎస్ 2 ప్రమాణాలు 2002లో అమలులోకి వచ్చాయి.దేశంలో పాత వాహనాల సంఖ్య ఎక్కువ కావడం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రవాణా మంత్రిత్వ శాఖ వాలంటరీ వెహికల్ మోడరనైజేషన్ ప్రోగ్రామ్ లేదా వెహికల్ స్క్రాపింగ్ పాలసీని ప్రారంభించింది. అంతే కాకుండా వెహికల్స్ స్క్రాపేజ్ కోసం వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీలను, ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లకు అనుమతిచ్చింది.ఇదీ చదవండి: అదే జరిగితే.. బంగారం రేటు మరింత పైకి!ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో స్కాపేజ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటి ద్వారా మీ వాహనాన్ని స్కాపేజ్ చేసి, సర్టిఫికెట్ తీసుకుంటే.. కొత్త కారు కొనుగోలుపై పలు రాయితీలను పొందవచ్చు. ఇది కొత్త కారు కొనుగోలు చేయడానికి కొంత ఆర్థికంగా కూడా ఉపయోగపడుతుంది. -
ఇంటి అద్దె క్లెయిమ్ విధానంలో ఈ పొరపాట్లు వద్దు..
సాధారణంగా పన్ను క్లెయిమ్ చేసే విధానంలో ఎక్కువ మంది చేసే పొరపాట్లు కొన్ని కావాలని.. కొన్ని తెలియక చేసేవి ఉంటాయి. తప్పుడు క్లెయిమ్ చేసే వారికి ఆదాయపు పన్ను శాఖవారు నోటీసులు ఇస్తున్నారు. వివరాలు అడుగుతున్నారు. ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టం’ అని సీబీడీటీ వారు అంటున్నప్పటికీ మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఈ కింద ఉదహరించిన కేసులన్నీ మీకు ఇబ్బంది కలిగించేవే. క్లెయిం రిజెక్షన్‌కు గురై పన్ను భారాన్ని పెంచేవి.. పెంచినవి కింద ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్త వహించండి. ఈ పొరపాట్లు చేయకపోవడమే మీ ప్లానింగ్‌కి కీలకంగా ఉంటుంది.కామేశ్వర్రావుగారు ఠంచనుగా ప్రతి నెలా రెంట్ పే చేస్తారు. బ్యాంకు అకౌంటులో ఖర్చు కనిపిస్తుంది. అయితే, ఓనర్ గారు ఇండియాలో లేరు. అమెరికాలో స్థిరనివాసం. ఆయన గారికి ఈ ఇంటికి వచ్చి చూసేటంత టైం లేదు.. ఓపికా లేదు. ఇద్దరు మంచివారే. ‘అవసరం లేదు’ అనుకున్నారు అగ్రిమెంటు గురించి. ఏ కాగితాలు లేవు. అగ్రిమెంటు లేదు. సంతకాలూ లేవు. దీంతో ఇంటద్దె అలవెన్సు క్లెయిమ్ చేయడానికి వీల్లేని పరిస్థితి.వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మోతుబరి రైతు వామనరావుకు హైదరాబాద్‌లో లంకంత ఇల్లు ఉంది. దాన్ని అద్దెకిచ్చాడు. కానీ అగ్రిమెంటు రాయలేదు. బ్యాంకు చెల్లింపులు తీసుకోడు. అంతా నగదే. పిల్లల చదువుకని ఆ ఇంట్లోనే ఉంటున్నాడు విద్యాధర రావు. ఆయనకీ ఇంటద్దె అలవెన్స్ క్లెయమ్ చేయడానికి కాగితాలు లేవు.ముందు జాగ్రత్తగా అగ్రిమెంటు రాసుకున్నాడు వాసుదేవరావు. కానీ ఆస్తేమో ఓనరు పేరు మీద.. అగ్రిమెంటేమో భార్య వసుంధర పేరు మీద.. మ్యుటేషన్ జరగలేదు. దీంతో ఈ అగ్రిమెంటును కంపెనీవారు ఒప్పుకోలేదు.మావగారింట్లో బంటులా చేరి ఒంటెలా తయారయ్యాడు తాయార్రావు. మామగారు జరిగిపోయారు. అయినా అగ్రిమెంటు మీద తానే రెండు సంతకాలు పెట్టి, రశీదులు రాసి, పాన్ కార్డు వాడుతున్నాడు సదరు మంచి అల్లుడు.తప్పుడు సమాచారంతో అగ్రిమెంటు బనాయించాడు బాబూరావు. అసలు ఆ ఇల్లు లేదు. అద్దె లేదు.. ఓనరు లేడు .. వ్యవహారం లేదు. అద్దె మాత్రం ఏడాది మొత్తం మీద రూ.1,00,000 దాటకుండా మేనేజ్ చేస్తున్నాడు.అద్దె ఇంటి అగ్రిమెంట్లలో తప్పులు.. సమాచారం తప్పు.. తేదీలు తప్పు.. అమౌంటు తప్పు.. రెన్యువల్ జరగదు. బ్యాంకులో జమకి, వ్యవహారంలో మొత్తానికి పొంతనే లేదు. అన్నీ తేడానే. ఏ సమాచారంలో నిజమెంతో సరిపోలదు. పేమెంట్ చేసినట్లు ప్రూఫ్‌లు చూపించడం లేదు. ఇలా చేయడమూ తప్పే.కొడుకు ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటున్నారు. తండ్రి కొడుక్కి అద్దె ఇస్తున్నట్లు కాగితాలు సృష్టించారు. నిజానికి ఏ వ్యవహారం లేదు.ఇలాగే విదేశాల్లోని పిల్లల పేరు మీద ఆస్తులుంటాయి. అగ్రిమెంట్లు, తల్లిదండ్రుల పేరు మీద ఎడాపెడా ఎంటర్ అవుతున్నాయి. ప్రతి నెలా నిర్దిష్ట మొత్తం వారి అకౌంట్లలో పడుతోంది. అయినా వారు అకౌంట్లలో చూపించడం లేదు .. పోనీ పిల్లల అకౌంట్లలోనూ చూపించడం లేదు. ‘అక్కడ ఏమీ వద్దని’ ఆ పిల్లలు చెప్పడం.. వారి మాటను పెద్దలు జవదాటని వైనం. ఎంత రిస్కో చూడండి.హైదరాబాదులో సొంతిల్లు. అందులో ఉండటం.. అద్దె ఇచ్చినట్లు దొంగ రశీదులు ఇవ్వడం.. అమ్మ పేరు మీదో .. ఆలి పేరు మీదో దొంగ రశీదు.చిన్న చిన్న ఊళ్లలో ఎక్కువ అద్దె ఇస్తున్నట్లు దొంగ రశీదులు.సగం బ్యాంకు ద్వారా ఇవ్వడం, సగం నగదు ఇవ్వడం వల్ల బ్యాంకు వ్యవహారానికి మాత్రమే క్లెయిం చేసుకోగలరు.తనకెన్ని ఇళ్లు ఉన్నాయో తనకే తెలియదు ఒక ఓనరుకు. అంతా నగదు వసూళ్లే. ఎవరికీ రసీదు ఇవ్వరు. తన పాన్ కార్డు కాపీ ఇవ్వరు.ఇదీ చదవండి: మహిళకూ ఉండాలి టర్మ్ ఇన్సూరెన్స్ఇలా ఎందరో ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు. ఏ పొరపాటు చేయకపోవడమే ప్లానింగ్‌లో ముఖ్యమైనది. భయపెట్టడమని కాదు. కానీ ఒక చేదు నిజం ఏమిటంటే దాదాపు 90,000 మంది అసెస్సీలతో రూ.వెయ్యి కోట్ల మినహాయింపును విత్‌డ్రా చేయించి మరీ వారితో పన్ను కట్టించారు. యజమానులు, సంస్థలు జాగ్రత్తగా ఉండాలని హితవు చెబుతూ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది డిపార్టుమెంటు. మనమూ జాగ్రత్తపడదాం.- కే.సీ.హెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తికె.వి.ఎన్.లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
మీకు ఆ అలవాట్లు ఉంటే జేబుకు చిల్లే.. నిర్మలమ్మ చేతిలో ట్యాక్స్ అస్త్రం
-
పాత పన్ను విధానం తొలగింపు..?
కేంద్ర ప్రభుత్వం 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పాత వ్యక్తిగత ఆదాయపు పన్ను(Income Tax) విధానంపై కీలక నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం. క్రమంగా ఈ పాత పన్ను(Old Tax) విధానాన్ని తొలగించే ప్రకటనలు చేయాలని ప్రభుత్వ యోచిస్తోంది. కొత్త పన్ను(New Tax) విధానాన్నే పన్నుదారుల ఎంపికగా మార్చే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రోడ్ మ్యాప్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటివరకు పన్నుదారులు పాత, కొత్త విధానాల్లో ఏదైనా ఎంచుకునే వీలుంది. ప్రభుత్వం ఒకవేళ దీనిపై నిర్ణయం తీసుకుంటే ఇకపై ఈ వెసులుబాటు ఉండదని నిపుణులు చెబుతున్నారు.2021 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది. కానీ పాత పన్ను విధానంలో ఉన్నన్ని మినహాయింపులు మాత్రం కొత్త విధానంలో లేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే 72% పైగా పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన తక్కువ రేట్లకు పన్నుదారులు ఆకర్షితులయ్యారు. వీరిని మరింత ప్రోత్సహించడానికి కొత్త శ్లాబ్‌లను తీసుకురావాలని ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలున్నాయి.ఇదీ చదవండి: మీకు వచ్చే పెన్షన్ తెలుసుకోండిలా..ప్రస్తుతం కొత్త విధానంలో ఏడాదికి రూ.3 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంది. ఈ పరిమితిని రూ.4 లక్షలకు పెంచే అవకాశం ఉంది. మొదటి శ్లాబుగా ఉన్న రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల పరిధిని రూ.4 లక్షల నుంచి రూ.7 లక్షలకు సర్దుబాటు చేయవచ్చు. కొత్త విధానం చాలా మందికి అనుకూలంగా ఉన్నప్పటికీ, ఇంటి అద్దె భత్యం, పెట్టుబడులు, గృహ రుణ వడ్డీ వంటి వివిధ మినహాయింపులు, వాటి వల్ల కలిగే ప్రయోజనం పొందే అవకాశం పాత విధానంలో మెరుగ్గా ఉండేదనే వాదనలున్నాయి. -
పెళ్లి ఖర్చులు - పన్ను భారం
ఈ రోజుల్లో అబ్బాయి పెళ్లైనా, అమ్మాయి పెళ్లైనా.. ఖర్చులకు అంతు లేకుండా పోతోంది. వాడుక అని, వేడుక అని ఒకర్ని చూసి ఒకరు ఎక్కువ ఖర్చుపెడ్తున్నారు. ఆటలు, పాటలు, హల్దీ, మెహందీ, బ్యాచిలర్ పార్టీలు, సంగీత్, ప్రీ-వెడ్డింగ్ షూట్.. పెళ్ళిలో వందలాది వంటకాలు, బట్టలు, రిటర్న్ గిఫ్ట్‌లు, అలంకరణ, బ్యాండు, కచేరీలు, బంగారం.. ఆ తర్వాత కార్యక్రమాలకు హోటళ్లు.. అటు మీదట హనీమూన్. ఇవన్నీ పెళ్లి ఖర్చులు కిందే వస్తాయి. ఖర్చు పెడితే ఆదాయం రాదుగా.. ఇక పన్ను భారం ఏమిటండీ అంటారేమో.. ఓపిగ్గా చదవండి. పూర్తిగా చదవండి.చట్టప్రకారం వరకట్నం నిషేధం. దాని జోలికి పోకండి. ఇవ్వకండి. ఏదైనా కారణాలవల్ల ఇవ్వాల్సి వస్తే ‘నగదు’ రూపంలో లావాదేవీలు నిర్వహించకండి. బ్యాంకుల ద్వారానే చేయండి. గిఫ్ట్ రూపంలో చేయండి. ఆ మేరకు డాక్యుమెంట్లు తయారు చేసుకోండి. మీ అమ్మాయి తరఫున ఇవ్వదలచినట్లయితే.. ‘స్త్రీధనం’ పేరున అమ్మాయి పేరుతోనే వ్య వహారం చేయండి.స్త్రీధనం విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. ఎంతైనా ఇవ్వొచ్చు. అయితే, ఇచ్చిన బ్యాంకు బ్యాలెన్సుకి, ఇంటికి, స్థిరాస్తికి, పొలానికి, తోటకి, బంగారానికి, ఆభరణాలకు డాక్యుమెంట్లు ముఖ్యం. ఇవన్నీ మీకు ఎలా వచ్చాయో మీరు చెప్పాల్సి రావచ్చు. ఎవరికి? పెళ్లివారికి కాదు.. ఆదాయపు పన్ను డిపార్టుమెంటు వారికి. అడిగినప్పుడు వివరణ ఇవ్వాలి. ‘సోర్స్’ చెప్పాలి.ఇక పెళ్లి ఖర్చులపై ఎటువంటి ఆంక్షలు లేవు. ముకేశ్ అంబానీ కొడుకు పెళ్లి ఖర్చులు విన్నాం. అలా ఎన్నో పెళ్ళిళ్లు. మన కంటికి ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. ఆ జోరు, హోరు, హుషారు, షికారు చూసి బంధువులు మెచ్చుకోవచ్చు. పెళ్లివారు సంతోషపడొచ్చు. కానీ ఆదాయపు పన్ను శాఖ వారి కంట్లో పడితే.. వారి దృష్టికి వెళితే, ఎవరైనా వారికి మీ ఖర్చుల మీద కంప్లైంట్ ఇస్తే.. ఖర్చుల విషయం ఆరా తీయడం చాలా తేలిక పని. అధికారుల వద్ద ఎన్నో పరికరాలు, పద్ధతులు ఉంటాయి. మిమ్మల్ని వాచ్ చేస్తారు. పెళ్లి పందిళ్లలో మమేకం అయిపోతూ, ఒక గెస్టులాగా మీతో మాట్లాడుతూ భోగట్టా చేస్తారు. కూపీ లాగుతారు. ఎంక్వైరీ చేస్తారు. మనం కూడా ఎంతో సంతోషంగా, సంబరంగా, గర్వంగా, గొప్పగా చెప్పేస్తాం. షేర్ చేసుకుంటాం.ఇది కాకుండా పందిళ్లలో ఆ నోటా.. ఈ నోటా .. కొన్ని మాటలు వింటాం. వెండర్లు.. అంటే సర్వీస్ ప్రొవైడర్లు.. కొటేషన్లు ఇస్తున్నారు. అందులో జీఎస్టీ వసూలు చేస్తున్నారు. విజిటింగ్ కార్డులు పంచుతున్నారు. సోషల్ మీడియాలో టామ్‌టామ్ చేసుకుంటున్నారు. గూగుల్, పేటీఎంకు చెల్లింపులు చెయ్యమంటున్నారు. కాగితాలు, రుజువులు.. ఫొటోల సాక్షిగా దొరుకుతున్నాయి. ఒక విధంగా అంతా బట్టబయలే. పారదర్శకమైనదిగా కంటికి కనిపించేదిగానే ఉంటోంది. ఊహకు అందని విషయమేమీ కాదు. శ్రేయోభిలాషి ‘శభాష్’ అన్నా.. అధికారులు మనల్ని ‘బేహోష్’ చేయొచ్చు.హాల్ బుకింగ్‌కి అడ్వాన్స్ ఇస్తే నోటీసులు వచ్చాయి. వెండార్స్ నుండి సమాచారం సంగ్రహించి, నోటీసులు ఇచ్చారు. మొత్తం ఖర్చు ఎంత అని అడిగితే.. మీరు ఏదో ఒక జవాబు ఇవ్వచ్చు. కానీ వాళ్ల దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. కాస్సేపు ఇద్దరి లెక్కలు ఒకటే అనుకోండి. అయినప్పటికీ ఆ ఖర్చులకు ‘సోర్స్’ చెప్పాలి. సరైన, సంతృప్తికరమైన జవాబులు రాకపోతే, ఖర్చు మొత్తాన్నీ ‘ఆదాయం’గా భావించి పన్నులను చెల్లించమంటారు.‘సోర్స్’ మీ సేవింగ్స్ కావచ్చు, మీరు అప్పు చేసి ఉండవచ్చు, మీ అబ్బాయి అమెరికా నుంచి పంపి ఉండవచ్చు.. ఎల్ఐసీ మెచ్యూరిటీ అయి ఉండవచ్చు.. ఎన్ఎస్సీలను ఎన్‌క్యాష్ చేసి ఉండొచ్చు.. ఏదైనా సరే.. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ‘సోర్స్’ ఉన్నంతవరకే ఖర్చు పెట్టండి. -
ఇదే జరిగితే.. రూ.10 లక్షల వరకు నో ట్యాక్స్?
ప్రతి సంవత్సరం బడ్జెట్ సమయంలో.. ట్యాక్స్ మినహాయింపుపై ప్రభుత్వం ఏమైనా కొత్త ప్రకటనలు చేస్తుందా? అని పన్ను చెల్లింపుదారులు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పరిమిత ఆదాయ వనరులతో.. సీనియర్ సిటిజన్లు పెన్షన్లపై ఆధారపడతారు. కాబట్టి ట్యాక్స్ మినహాయింపు వారికి కీలకమైన ఆర్థిక భద్రతగా పనిచేస్తుంది.2020 - 21 బడ్జెట్ సమయంలో కొత్త పన్ను విధానం ప్రకటించిన తరువాత.. పన్ను విధానంలో ఎలాంటి మార్పులు జరగలేదు. కాబట్టి త్వరలోనే జరగనున్న బడ్జెట్లో ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) ఎట్టకేలకు పాత పన్ను విధానంలో పన్ను స్లాబ్‌లను సవరించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.2023-24 బడ్జెట్లో, ప్రభుత్వం ప్రాథమిక ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ) రూ.3 లక్షలకు, సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్లు & అంతకంటే ఎక్కువ) రూ.5 లక్షలకు పెంచింది. అయితే రాబోయే బడ్జెట్లో ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని సీనియర్ సిటిజన్లకు రూ.5 లక్షలు, సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.7 లక్షలకు పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభిస్తుంది.పాత పన్ను విధానంప్రస్తుతం పాత పన్ను విధానం ప్రకారం.. 60 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న సీనియర్ సిటిజన్లకు రూ. 3 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు. అయితే రూ. 3,00,001 నుంచి రూ. 5,00,000 మధ్య 5 శాతం, రూ. 5,00,001 నుంచి రూ. 10,00,000 మధ్య 20 శాతం, రూ. 10 లక్షలు దాటితే 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది.80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారికి రూ. 5 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. అయితే రూ. 5,00,001 నుంచి రూ. 10,00,000 మధ్య 20 శాతం, రూ. 10 లక్షలకు పైన 30 శాతం ట్యాక్స్ ఉండేది. సీనియర్ సిటిజన్లు సాధారణంగా కొన్ని సేవింగ్స్ స్కీముల్లో సేవింగ్స్ చేసుకుంటారు. వీరికి పాత పన్ను విధానంలోనే సెక్షన్ 80సీ మినహాయింపులు లభిస్తాయి. కొత్త పన్ను విధానంలో పరిమితిని పెంచితే.. ట్యాక్స్ నుంచి వారికి కొంత ఉపసమయం లభిస్తుంది.కొత్త శ్లాబులుఫిబ్రవరి 1న జరగనున్న బడ్జెట్లో పన్ను మినహాయింపు పరిమితిని పెంచితే.. 60 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న వారు రూ. 5 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే రూ. 5,00,001 నుంచి రూ. 10,00,000 మధ్య 20 శాతం, రూ. 10 లక్షల పైన 30 శాతం ట్యాక్స్ చెల్లింపు ఉంటుంది.సూపర్ సీనియర్ సిటిజన్ల కోసం లేదా 80 సంవత్సరాలు & అంతకంటే ఎక్కువ వయసున్న వారు రూ. 7,00,000 వరకు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 7,00,001 నుంచి రూ. 10,00,000 వరకు.. 20 శాతం, రూ. 10 లక్షల పైన 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: 'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు': ఆనంద్ మహీంద్రాపన్ను మినహాయింపు పరిమితి పెరిగితే 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్నవారు.. తమ ఆదాయం 10 లక్షలయినా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఎలా అంటే.. వారి ఆదాయం రూ. 10 లక్షలు అనుకుంటే.. అందులో రూ. 5 లక్షలు ప్రాథమిక మినహాయింపు పరిమితి. సెక్షన్ 80సీ ద్వారా రూ. 1.50 లక్షలు, సెక్షన్ 80సీసీడీ (1బీ) ద్వారా రూ. 50,000, సెక్షన్ 80డీ ద్వారా రూ. 50వేలు, స్టాండర్డ్ డిడక్షన్ మరో రూ. 50,000, సెక్షన్ 80TTB ద్వారా రూ. 50,000.. ఫ్యామిలీ పెన్షన్ స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా రూ. 15,000.. సెక్షన్ 80DDB ద్వారా రూ. 1 లక్ష తగ్గింపు లభిస్తాయి. ఇలా మొత్తం మీద తగ్గింపు రూ. 5,65,000. కాబట్టి దీని ప్రకారం ఆదాయం 10 లక్షల రూపాయలైనా ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. -
తాళి కట్టు శుభవేళ..బహుమతులపై పన్ను భారం ఉండదా?
అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ఈ వారం విషయంలోకి వెళ్తే.. తాళి కట్టు శుభవేళ.. అంతా మంచే జరగాలని కోరుకుంటాం. వధూవరులను ఆశీర్వదిస్తాం. అంతా మంగళప్రదంగా జరగాలని.. కలకాలం కొత్త జంట చల్లగా ఉండాలని కోరుకుంటాం. పెళ్లి సందర్భంలో వధూవరులకు వచ్చే బహుమతులపై పన్ను భారం లేదు. అటువంటి వాటిని ఆదాయంగా పరిగణించరు. ఇప్పుడు ముందు రిసెప్షన్.. తర్వాత పెళ్లి... కాబోయే జంట పందిరిలో నిలబడటం.. మిగతా అందరూ లైన్లో వెళ్లి, వారికి బహుమతులివ్వడం.. తాళి కట్టిన తర్వాత కూడా కొందరు ఇస్తారు. ఏది ఏమైనా సందర్భం ‘పెళ్లి’ ఒక రోజు అటూ ఇటూ.. పెళ్లి పేరు చెప్పి ఎప్పుడు ఇచ్చినా ఏ ఇబ్బందీ లేదు.ఎటువంటి బహుమతులు ఇవ్వొచ్చు..నగదు ఇవ్వొచ్చు. దగ్గరి బంధువైతే ఎటువంటి ఆంక్షలు లేవు. బీరకాయ .. బెండకాయ సంబంధం కాదండి. బాదరాయణ సంబంధమూ కాదు. చట్టంలో పొందుపర్చిన నిర్వచనాన్ని గుర్తు పెట్టుకోండి. అలా అని రూ.2,00,000 దాటకండి. పేటీఎంలు, గూగుల్ పేమెంట్లు, చెక్కులు, డీడీలు, ఆర్టీజీఎస్, బదిలీలు, నగ, నట్రా, వెండి, బంగారం, ఆభరణాలు, కుక్కర్లు, వంట సామగ్రి, టీవీలు, ఫ్రిజ్జులు, భూములు, ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, స్థిరాస్తి, షేర్లు, బాండ్లు.. ఎలాగైనా మీ ప్రేమ, అభిమానాన్ని ప్రకటించుకోండి. పుచ్చుకున్న వారికి ఆదాయంగా పరిగణించరు. పన్నుభారం పడదు. పన్ను చెల్లించనక్కర్లేదు. అయితే, కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి.వధూవరులకు వచ్చే వాటిని ఆదాయంగా పరిగణించరు.అత్తగారి లాంఛనం, ఆడపడుచు కట్నం మొదలైన వాటి మీద ఎటువంటి మినహాయింపు లేదు. కొన్ని పెళ్లిళ్లలో ఈ లాంఛనాలు భారీగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త.పూర్వకాలంలో పురోహితుడు నలుగురికి వినపడేలా అరిచేవారు. ఫలానా వారింత కట్నం అని.. కొంత మంది తమ పేరు నలుగురికి వినబడేలా చదివించుకునే వారు.ఇప్పుడు బాహాటంగా చదివింపులు లేవు. కవర్లో ఎంతో కొంత పెట్టి.. అది వారి చేతిలో పెట్టి, ఫొటోగ్రాఫర్ వైపు మొగం చూపెట్టి.. భోజనం దిశగా అడుగెట్టి.. ఇంటి దారి పట్టి.. వెళ్లిపోతున్నారు.ఇవి చిన్న మొత్తాలయితేనేం.. అధిక విలువగలవైతేనేం.. పంతులు గారికి ఒక వెయ్యి నూటపదహార్లు ఇచ్చి ఒక పుస్తకం.. పెళ్లి పుస్తకం తెరిపించండి.ఆ పుస్తకానికి పసుపు, కుంకుమ బాగా దట్టించండి. తారీఖు, టైం వేసి.. అందరి పేర్లూ రాయండి. పింకీ, సుబ్బు, పక్కింటి ఆంటీ అని కాకుండా వీలైతే పూర్తి పేరు రాయండి. అలాగే ఫోన్ పేమెంట్లు, గూగుల్ పేమెంట్లు, బ్యాంకులో జమలు, ప్రత్యేక జాబితా రాయండి. బ్యాంకు స్టేట్మెంట్లో ఈ ‘జవాబు’ను హైలైట్ చేయండి. మీరు మీ పెళ్లి పుస్తకంలో వారి పేరు, వీలైతే, సెల్ నంబరు రాయండి. బ్యాంకు స్టేట్మెంట్లు భద్రపరచండి.ఇదీ చదవండి: ‘ఐదు శాతం’తో రూ.1.8 కోట్లు సంపాదననగదు చదివింపులను వీలైతే బ్యాంకులో జమ చేయండి. ఆ పేయింగ్ స్లిప్‌ను మీ పుస్తకంలో అతికించండి.ఇలా రాయటం వల్ల రెండు ప్రయోజనాలు. ఒకటి మున్ముందు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్ వారికి ‘సోర్స్’ వివరణ రెడీగా ఉంటుంది. రెండోది మీరు అటువంటి వారికి కట్నం ఇచ్చేటప్పుడు ఇదొక కొలబద్దగా ఉంటుంది.నగదు ఖర్చుపెట్టే అవసరం అయితే.. దేని నిమిత్తం ఖర్చు పెట్టారో రాయండి.భారీ కంచాలు, ప్లేట్లు, సీనరీలు, దేవుడి బొమ్మలు మొదలైనవి రాయకపోయినా ‘విలువైనవి’ అనిపించిన వస్తువుల జాబితా రాయండి.స్థిరాస్తులు మొదలైన అన్ని కాగితాలు తీసుకోండి. బదిలీ పత్రాలు తీసుకోండి. మరీ చాదస్తం అని కొట్టిపడేయకండి. దేనికైనా దస్త్రం కావాలి. అదీ మనమే సమకూర్చుకోవాలి. సకాలంలో సర్దుకోండి.-కే.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి-కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
మీకూ అందుతాయి ఐటీ నోటీసులు.. ఎప్పుడంటే..
డిజిటల్ ఇండియా(Digital India) యుగంలో చాలామంది ఆన్లైన్ నగదు లావాదేవీలు జరుపుతున్నారు. చిన్నమొత్తంలో జరిపే లావాదేవీల సంగతి అటుంచితే, పెద్దమొత్తంలో చేసే నగదు బదిలీలపై ప్రభుత్వం నిఘా వేస్తోంది. ఈ నగదు బదిలీల విషయంలో ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు ప్రభుత్వ పన్నుల యంత్రాంగం గుర్తిస్తే వారికి ఆదాయ పన్నుశాఖ నోటీసులు(IT Notices) తప్పవు. అయితే ఎలాంటి సందర్భాల్లో నోటీసులు అందుతాయో కొన్నింటి గురించి తెలుసుకుందాం.బ్యాంకు ఖాతాలో నగదు జమసెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నిబంధనల ప్రకారం, ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే, దానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. ఈ డబ్బు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో జమ చేసినా కొన్నిసార్లు నోటీసులు అందుకునే అవకాశం ఉంది. నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను శాఖకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.ఫిక్స్డ్ డిపాజిట్లో జమ చేయడంఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసినప్పుడు నోటీసులు అందుతున్నట్లే, ఫిక్స్డ్ డిపాజిట్(Fixed Deposite)ల విషయంలోనూ అదే జరుగుతుంది. ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎఫ్డీలలో రూ.10 లక్షల కంటే అధికంగా డిపాజిట్ చేస్తే కొన్నిసార్లు ఆదాయపు పన్ను శాఖ నోటీసు అందవచ్చు.ఆస్తి లావాదేవీలుస్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపినట్లయితే రిజిస్ట్రార్ ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తారు. అటువంటి పరిస్థితిలో భారీ లావాదేవీలు జరిపారు కాబట్టి, ఆ డబ్బు మీకు ఎలా సమకూరిందనే వివరాలు అడుగుతూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపవచ్చు.క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులుక్రెడిట్ కార్డ్ బిల్లు(Credit card Bill) రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని నగదు రూపంలో చెల్లిస్తే ఆ డబ్బు ఎలా సమకూరిందో ప్రభుత్వం అడగొచ్చు. మరోవైపు, ఏ ఆర్థిక సంవత్సరంలో అయినా మొత్తం కలిపి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పేమెంట్ చెల్లించినట్లయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమాషేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్ల కొనుగోలుషేర్లు, మ్యూచువల్ ఫండ్లు, డిబెంచర్లు లేదా బాండ్లను కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో నగదు ఉపయోగించినట్లయితే ఇది ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. ఒక వ్యక్తి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే దానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద నమోదు అవుతుంది. ఆ సందర్భంలోనూ నోటీసులు అందవచ్చు. -
‘వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలి’
వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించడం ద్వారా ప్రజల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయాన్ని పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని వాణిజ్య సంఘాలు కోరాయి. అలాగే, ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాలకు ప్రేరణనివ్వాలని, ఇంధనం(Fuel)పై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని, చైనా నుంచి చౌకగా వచ్చి పడుతున్న దిగుమతులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్(Budget 2025) ముందస్తు సమావేశంలో భాగంగా ఈమేరకు ప్రతిపాదనలు చేశాయి.ఈ కార్యక్రమంలో వాణిజ్య మండళ్ల ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో దీపమ్ కార్యదర్శితోపాటు ఆర్థిక శాఖ పరిధిలోని వివిధ విభాగాల కార్యదర్శులు, ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు పాల్గొన్నారు. 2025 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో 2025–26 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. సమావేశం అనంతరం సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ పురి మీడియాతో మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ చక్కని పనితీరు చూపిస్తున్నప్పటికీ, అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నట్టు చెప్పారు.‘భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉత్పత్తులు చైనా ద్వారా దిగుమతి అవుతుండడం చూస్తున్నాం. వాతావరణానికి సంబంధించి సమస్యలు, ఇతర అంశాలు ఆహార భద్రత, ద్రవ్యోల్బణం(Inflation)పై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ దిశగా మేము పలు సూచనలు చేశాం. అధిక ఉపాధికి అవకాశం ఉన్న వ్రస్తాలు, పాదరక్షలు, పర్యాటకం, ఫర్నీచర్ తదితర రంగాలకు ప్రేరణ కల్పించే చర్యలు తీసుకోవాలని కోరాం. ఎంఎస్ఎంఈ(MSME)లకు సంబంధించి చర్యలతోపాటు, అంతర్జాతీయ వాల్యూ చైన్‌తో భారత్‌ను అనుసంధానించాలని కోరాం. పెట్రోల్‌పై కొంత ఎక్సైజ్ సుంకం తగ్గించడం ద్వారా ఖర్చు పెట్టే ఆదాయాన్ని పెంచొచ్చని సూచించాం’ అని పురి వివరించారు.ఇదీ చదవండి: కార్పొరేట్ వలంటీర్లు.. సేవా కార్యక్రమాలుచైనా దిగుమతులతో ఇబ్బందులు..చైనా సొంత ఆర్థిక వ్యవస్థ నిదానించడంతో చౌకగా ఉత్పత్తులను భారత్‌లోకి పంపిస్తోందంటూ, దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ తాత్కాలిక మందగమనాన్ని ఎదుర్కొంటున్నట్టు తాము తెలియజేశామని ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్ విజయ్ శంకర్ తెలిపారు. ఆదాయపన్ను తగ్గించడం వల్ల ప్రజల చేతుల్లో ఆదాయం మిగులుతుందని, వినియోగాన్ని పెంచుతుందని సూచించినట్టు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ హేమంత్ జైన్ వెల్లడించారు. జీఎస్టీని సులభంగా మార్చాలని కూడా కోరినట్టు తెలిపారు. సరఫరా వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఎంఎస్ఎంఈలకు కావాల్సిన వాటిపై (రుణాల లభ్యత, టీడీఎస్ సులభతరం) దృష్టి పెట్టాలని కోరినట్టు అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నాయర్ పేర్కొన్నారు. -
కస్టమ్స్‌కు విదేశీ ప్రయాణికుల డేటా షేరింగ్
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు ఇకపై అంతర్జాతీయ ప్రయాణికుల డేటాను కస్టమ్స్ విభాగానికి కూడా తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందుకోసం విమాన రవాణా సేవల సంస్థలు జనవరి 10 నాటికి నేషనల్ కస్టమ్స్ టార్గెటింగ్ సెంటర్–ప్యాసింజర్ (ఎన్సీటీసీ–ప్యాక్స్)లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) జారీ చేసిన ఆదేశాల ప్రకారం .. అంతర్జాతీయ ఫ్లయిట్ బయలుదేరడానికి 24 గంటల ముందుగానే విదేశీ ప్రయణికుల మొబైల్ నంబరు మొదలుకుని టికెట్ కోసం చెల్లింపులు జరిపిన మాధ్యమం, ట్రావెల్ షెడ్యూల్ వరకు పలు వివరాలను కస్టమ్స్ అధికారులకు ఎయిర్‌లైన్స్ అందించాలి. ఒకవేళ విమానయాన సంస్థ గానీ డేటాను షేర్ చేసుకోవడంలో విఫలమైన పక్షంలో, అలా చేసిన ప్రతిసారి రూ. 25,000–50,000 వరకు కస్టమ్స్ విభాగం జరిమానా విధించవచ్చు. ఆదాయపన్ను శాఖ ఖండన పన్ను ఎగవేతదారులను పట్టుకునేందుకు తాము డిజీయాత్ర యాప్ డేటాను చూడడం లేదని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు వస్తున్న వార్తలను ఖండిస్తూ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై పోస్ట్ పెట్టింది. ‘‘ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు అలాంటి చర్య ఏమీ లేదని స్పష్టం చేస్తున్నాం’’అని అందులో పేర్కొంది. ముఖ గుర్తింపు విధానంలో (ఎఫ్‌ఆర్‌టీ) పనిచేసే డిజీ యాత్ర విమానాశ్రయాల్లో పలు చెక్ పాయింట్ల వద్ద ఎలాంటి అవాంతరాల్లేకుండా ముందుకెళ్లేందుకు వీలు కల్పిస్తుంది. డిజీ యాత్ర యాప్ కోసం ప్రయాణికులు ఇచ్చే సమాచారం ఎన్‌క్రిపె్టడ్ విధానంలో నిల్వ ఉంటుంది. ఆధార్ ఆధారిత ధ్రువీకరణ ద్వారా ప్రయాణికులు డిజీయాత్ర సేవలను పొందొచ్చు. -
సీనియర్ సిటిజన్లు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదా?
‘దేశంలో 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు’ ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న ఓ వార్త. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇలాంటి చాలా వార్తలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు లేదా సందేహాస్పదమైన న్యూస్ పోర్టల్లలో ఇటీవల ఎక్కువయ్యాయి. వీటిలో చాలా మటుకు ఫేక్ న్యూస్ లేదా తప్పుడు సమాచారమే ఉంటోంది.తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇకపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆ వార్త సారాంశం. "కేంద్ర ప్రభుత్వం భారీ ప్రకటన - వీళ్లు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు" అని సోషల్ మీడియా సందేశం పేర్కొంది.“భారతదేశంలోని సీనియర్ సిటిజన్లు పెన్షన్, ఇతర పథకాల ద్వారా వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు. అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, సీనియర్ సిటిజన్లు ఇకపై వారి ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వారు ఎలాంటి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు’’ అని అందులో రాసుకొచ్చారు.అయితే ఇది ఫేక్ వార్త అని, అందులో పేర్కొన్న దాంట్లో నిజం లేదని ప్రభుత్వానికి చెందిన వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం (PIBFactCheck) తేల్చింది. 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు కేవలం పెన్షన్, వడ్డీ ఆదాయానికి సంబంధించి మాత్రమే ఐటీఆర్ (ITR) (సెక్షన్ 194P ప్రకారం) ఫైల్ చేయడం నుండి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఇతర పన్ను వర్తించే అన్ని ఆదాయాలపైనా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. A message circulating on social media claims that as India commemorates 75 years of its Independence, senior citizens above 75 years of age will no longer have to pay taxes.#PIBFactCheck✔️This message is #fake pic.twitter.com/kFVbGje5FB— PIB Fact Check (@PIBFactCheck) December 29, 2024 -
మధ్య తరగతికి పన్ను మినహాయింపు..?
అధిక పన్నులతో అల్లాడుతున్న మధ్య తరగతి ప్రజలకు రానున్న బడ్జెట్(Budget)లో ఊరట లభించనుందా? మందగించిన వినియోగానికి ప్రేరణగా ప్రభుత్వం పన్ను రేటు(Tax Rate)ను తగ్గించనుందా? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ అంశాన్ని ప్రభుత్వం సునిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.ఆర్థిక వ్యవస్థ మందగించిన తరుణంలో జీవన వ్యయాలు పెరిగిపోయి, మధ్య తరగతి ప్రజలు(middle class people) ఇబ్బంది పడుతున్నారని, వినియోగం పడిపోతుందన్న ఆందోళనలు వినిపిస్తుండడం తెలిసిందే. వీటికి పరిష్కారంగా పన్ను రేట్ల తగ్గింపుతో వినియోగానికి ఊతమివ్వాలన్నది ఈ ప్రతిపాదన లక్ష్యమని ఆ వర్గాలు వెల్లడించాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను 2025 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఇందులో ఈ మేరకు ప్రతిపాదన ఉంటే అది లక్షలాది మందికి ఊరట కల్పించనుంది. అయితే, కొత్త పన్ను వ్యవస్థలోనే ఈ మేరకు ఉపశమనం ఉండొచ్చన్నది సమాచారం. తద్వారా మరింత మందిని కొత్త పన్ను విధానం వైపు తీసుకురావడం కూడా ఈ ప్రతిపాదనలోని ఉద్దేశ్యంగా తెలుస్తోంది.కొత్త, పాత పన్ను విధానం..2020లో కేంద్రం అప్పటి వరకు ఉన్న పన్ను విధానానికి అదనంగా, మరో కొత్త విధానాన్ని సైతం ప్రవేశపెట్టింది. పాత విధానంలో ఆదాయం రూ.6లక్షలు మించితే 20 శాతం పన్ను పరిధిలోకి వస్తారు. అదే కొత్త పన్ను విధానంలో అయితే ప్రస్తుతం రూ.12 లక్షల వరకు ఆదాయంపై 15 శాతమే పన్ను అమల్లో ఉంది. కాకపోతే పాత పన్ను వ్యవస్థలో గృహ రుణం, బీమా ప్రీమియంలు, పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలున్నాయి. కొత్త విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ మినహా ఇతర మినహాయింపుల్లేవు. ఈ రెండింటిలో ఏ విధానం ఎంచుకోవాలన్నది పన్నుదారుల ఐచ్ఛికమే.ఇదీ చదవండి: ప్రాపర్టీ ఎంపికలో పిల్లలూ కీలకమే..సర్కారుపై పెరుగుతున్న ఒత్తిళ్లు ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిల నుంచి దిగిరావడం లేదు. వేతనాల్లో వృద్ధి సైతం మందగించింది. దీంతో ఖర్చు చేసేందుకు మిగులు లేక, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. ఫలితంగా పట్టణ, గ్రామీణ వినియోగం క్షీణించి, అది దేశ ఆర్థిక వృద్ధిపైనా ప్రభావం చూపిస్తోంది. జీడీపీ ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయి అయిన 5.4 శాతానికి సెప్టెంబర్ త్రైమాసికంలో పడిపోవడం తెలిసిందే. దీంతో ఆదాయపన్ను రేట్లను తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. బడ్జెట్ ముందస్తు సమావేశాలు, వినతుల సందర్భంగా పలు రంగాల నిపుణులు, ఆర్థిక వేత్తలు సైతం పన్ను రేట్లు, కస్టమ్స్ టారిఫ్‌లు తగ్గించాలంటూ ప్రభుత్వానికి సూచించడం గమనార్హం. సహజంగా పన్ను తగ్గింపు డిమాండ్లు ఏటా బడ్జెట్ ముందు వినిపిస్తూనే ఉంటాయి. ఆర్థిక వృద్ధి క్షీణించిన తరుణంలో ఈ విడత ప్రభుత్వం ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి నెలకొంది. -
వచ్చే బడ్జెట్లో భారీ శుభవార్త! ట్యాక్స్ తగ్గుతుందా?
రాబోయే 2025-26 బడ్జెట్లో ( 2025-26 Budget ) కేంద్ర ప్రభుత్వం ( Govt ) భారీ శుభవార్త చెప్పబోతోంది. మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రూ. 15 లక్షల వరకు వార్షిక సంపాదనపై ఆదాయపు పన్నును ( Income Tax ) తగ్గించే అవకాశం ఉందని రెండు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదిక పేర్కొంది. వృద్ధి మందగమనం మధ్య ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకోనున్నట్లు వివరించింది.పౌరులపై భారాన్ని తగ్గించేందుకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని ప్రముఖ ఆర్థికవేత్తలు కూడా ప్రధాని నరేంద్ర మోదీని ( Narendra Modi ) కోరారు. రాబోయే బడ్జెట్‌పై వారి అభిప్రాయాలు సూచనలను వినడానికి నీతి ఆయోగ్‌లో ( NITI Aayog ) ప్రఖ్యాత ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ప్రధాని మోదీ ఇటీవల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆదాయపు పన్నును తగ్గించాలని, కస్టమ్స్ టారిఫ్‌లను హేతుబద్ధీకరించాలని, రాబోయే బడ్జెట్లో ఎగుమతులకు మద్దతు ఇచ్చే చర్యలను ప్రవేశపెట్టాలని ఆర్థికవేత్తలు, నిపుణులు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman ) 2025-26 సంవత్సరానికి బడ్జెట్‌ను 2025 ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా గత జులైలో 2024-25 బడ్జెట్ సందర్భంగా ఆదాయపు పన్ను చట్టంపై సమగ్ర సమీక్షను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ వీకే గుప్తా నేతృత్వంలో సమీక్ష కమిటీని ఏర్పాటు చేశారు. 2025-26 బడ్జెట్‌కు ముందు ప్యానెల్ తన నివేదికను సమర్పించాల్సి ఉంది.అయితే కొత్త ఐటీ చట్టం రాబోయే బడ్జెట్ సెషన్లో ఉండదని, ఇది అమలులోకి రావడానికి ఏడాదికిపైగా సమయం పడుతుందని మనీ కంట్రోల్ రిపోర్ట్ పేర్కొంది. ‘మార్పులకు అనుగుణంగా వ్యవస్థలు మారాలి. ఇది పూర్తిగా కొత్త చట్టం కాబట్టి, చాలా క్లిష్టంగా ఉంటుంది. అన్ని నియమాలు కొత్త ఫారమ్‌లను ప్రారంభించాలి. పరీక్షించాలి.. సిస్టమ్-ఇంటిగ్రేట్ చేయాలి దీనికి సమయం కావాలి’ అని సీనియర్ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ నివేదించింది. -
టీడీఎస్ వ్యవస్థ రద్దుకు సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: ట్యాక్స్ డిడక్షన్ యట్ సోర్స్ (TDS) వ్యవస్థను ‘ఏకపక్షం, అసంబద్ధమైనది’గా పేర్కొంటూ సుప్రీంకోర్టు(Supreme Court)లో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(PIL) దాఖలైంది. సమానత్వంసహా వివిధ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేదిగా పేర్కొంటూ టీడీఎస్‌ను రద్దు చేయాలని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.మూలం వద్దే పన్నును మినహాయించడం, ఆదాయపు పన్ను శాఖలో డిపాజిట్ చేయడం తగిన విధానం కాదని పిటిషన్ వివరించింది. అశ్విని ఉపాధ్యాయ్ అనే లాయర్, అడ్వొకేట్ అశ్వనీ దూబే ద్వారా దాఖలు చేసిన ఈ పిటిషన్లో కేంద్రం, న్యాయ మంత్రిత్వ శాఖ, లా కమిషన్, నీతి ఆయోగ్‌లు ప్రతివాదులుగా ఉన్నారు. రాజ్యాంగంలోని 14 (సమానత్వపు హక్కు), 19 (వృత్తి చేసే హక్కు), 21 (జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ) ఆర్టికల్స్‌కు వ్యతిరేకంగా టీడీఎస్ ఉందని, ఈ వ్యవస్థ ఏకపక్షంగా, అసంబద్ధంగా ఉందని ప్రకటించాలని పిల్ ద్వారా సుప్రీంకోర్టును కోరారు.ఇదీ చదవండి: ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడుటీడీఎస్ అంటే ఏమిటి?టీడీఎస్ అనేది ఆదాయ వనరు వద్దే పన్ను వసూలు చేసే పద్ధతి.. పేమెంట్ సమయంలోనే పన్నును మినహాయించి పన్ను చెల్లింపుదారు తరఫున ప్రభుత్వానికి పంపుతారు. జీతభత్యాలు, బ్యాంకుల ద్వారా వడ్డీ చెల్లింపులు, అద్దె చెల్లింపులు, ప్రొఫెషనల్ ఫీజులు, కమీషన్ వంటి విభిన్న చెల్లింపులు చేసేప్పుడు టీడీఎస్ కట్ అవుతుంది. -
పాప్‌కార్న్‌పై జీఎస్టీ.. నెట్టింట చర్చ
పాప్‌కార్న్‌లోని చక్కెర, మసాలా స్థాయుల ఆధారంగా విభిన్న పన్ను స్లాబ్‌లను అమలు చేయడంపట్ల నెట్టింట తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇటీవల రాజస్థాన్‌లోని జసల్మేర్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్(GST Council) సమావేశంలో జీఎస్టీను హేతుబద్దీకరించేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా పాప్‌కార్న్(Popcorn)లోని చక్కెర, మసాలా స్థాయులను అనుసరించి విభిన్న రేట్లను నిర్దేశించారు.సాల్ట్, మసాలాలతో కూడిన నాన్ బ్రాండెడ్ పాప్‌కార్న్‌పై 5 శాతం జీఎస్టీ, ప్రీ ప్యాకేజ్డ్, బ్రాండెడ్ పాప్‌కార్న్‌పై 12 శాతం, కారామెల్ పాప్‌కార్న్, చక్కెర కంటెంట్ ఉన్న పాప్‌కార్న్‌పై 18 శాతం జీఎస్టీను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రేట్లు వెంటనే అమలు చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఆదివారం పాప్‌కార్న్ కొనుగోలు చేసివారు వాటిపై జీఎస్టీ(GST) విధించడాన్ని చూసి ఆశ్చర్యపోయారు.Complexity is a bureaucrat’s delight and citizens’ nightmare. https://t.co/rQCj9w6UPw— Prof. Krishnamurthy V Subramanian (@SubramanianKri) December 22, 2024ఇదీ చదవండి: ‘గూగులీనెస్’ అంటే తెలుసా? సుందర్ పిచాయ్ వివరణఅదనపు చక్కెర, మసాలాలతో కూడిన ఉత్పత్తులపై వేర్వేరుగా పన్ను విధిస్తున్నట్లు కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి తెలిపారు. ఏదేమైనా ఈ నిర్ణయం వల్ల ప్రతిపక్ష రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు, ప్రభుత్వ మద్దతుదారుల నుంచి కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. నెట్టింట ఈ వ్యవహారంపై తీవ్రంగానే చర్చ జరుగుతోంది. జీఎస్టీ హేతుబద్దీకరణ పేరుతో సాధారణ పౌరులపై పన్నుల రూపంలో భారీగా ఆర్థిక భారం మోపుతున్నట్లు విమర్శకులు వాదిస్తున్నారు. -
ఆలుమగలిద్దరూ ఉద్యోగస్తులైతే.. పన్నుభారం తగ్గించుకోవడం ఎలా?
గతవారం ఉద్యోగస్తులకు సంబంధించి వారి ఆదాయం విషయంలో కొత్త విధానమా.. పాత పద్ధతా.. ఏది మంచిది.. ఏ విధంగా అయితే పన్నుభారం తక్కువ అవుతుందనేది ఉదాహరణపూర్వకంగా తెలుసుకున్నాం. ఈవారం ఒకే కుటుంబంలో భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగస్తులైతే ఎలా ఆలోచించాలో ఎలా ప్లాన్ చేయాలో తెలుసుకుందాం. ఇద్దరూ ఉద్యోగస్తులైనా.. ఇద్దరూ రిటైర్ అయినా.. ఒకరు రిటైర్ అయి ఒకరు ఉద్యోగంలో ఉన్నా ఈ ఆలోచనలను అమలుపరచవచ్చు.ఇద్దరూ గవర్నమెంటుకు సంబంధించిన వారయితే..గవర్నమెంటు నుండి జీతం/పెన్షన్ పుచ్చుకున్న వారైతే వారి వారి జీతభత్యాల విధానం వల్ల ఎటువంటి వెసులుబాటు ఉండదు. పే స్కేల్, వేతన ప్రమాణాలు, పే స్ట్రక్చర్.. అన్నీ నిర్దిష్టంగా ఉంటాయి. ఉద్యోగి తనకు అనుకూలంగా మార్చుకునే వెసులాటు ఉండదు. అన్నీ ప్రీ ఫిక్సిడ్. కాలానుగుణంగా పే రివిజన్ ప్రకారం మారతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆదాయం వచ్చినదంతా లెక్కించాల్సిందే. ఇద్దరి జీతభత్యాలను, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోండి. ఇద్దరికి ఇంచు మించు సమానమైన జీతభత్యాలు ఉంటే పెద్దగా ఆలోచించే పని లేదు. అంటే ఇద్దరూ ఒకే శ్లాబులో ఉంటే పన్నుభారం మారదు. ఎవరూ కట్టినా ఒకటే! పెద్దగా వెసులుబాటు ఉండదు. ఆస్కారం ఉండదు.కానీ జీతభత్యాల్లో తేడాలుండి.. ఆ తేడాల వల్ల శ్లాబులు మారే అవకాశం ఉంటే ఏదైనా ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. ➤ఒకరు జీరో.. ఒకరు 10 శాతం➤ఒకరు 10 శాతం.. ఒకరు 20 శాతం➤ఒకరు 20 శాతం.. ఒకరు 30 శాతంఎక్కువ శ్లాబులో ఉన్నవారైతే కంపల్సరీగా సేవింగ్స్ ఉంటాయి. పీఎఫ్ మొదలైనవి నిర్దిష్టంగా.. అంటే మీ ప్లానింగ్‌తో నిమిత్తం లేకుండా ఉంటాయి. అవి విధిగా చెల్లించవలసిందే. ఎక్కువ శ్లాబులో ఉన్నా వీలున్నంత వరకు సేవ్ చేసి మినహాయింపులు పొందండి. తక్కువ/చిన్న శ్లాబులో కంపల్సరీ సేవింగ్స్‌ని దాటి వెళ్లొద్దు.సొంత ఇల్లు ఉండి.. దాని మీద రుణం.. వడ్డీ ఉంటే.. ఎక్కువ శ్లాబున్న వారి అకౌంట్లో పేమెంట్లు జరగాలి. క్లెయిమ్ చేసే వారి బ్యాంకు అకౌంట్లోనే డెబిట్లు ఉండాలి. దస్తావేజుల్లో ఇద్దరి పేర్లు ఉంటే సమానంగా క్లెయిమ్ చేయండి. ఒక్కరి పేరే ఉంటే ఆ ఒక్కరే క్లెయిమ్ చేయండి.ఈ మేరకు, కాగితాలు, ప్లాన్లు సబ్మిట్ చేసినప్పటి నుంచి అప్రూవల్, బ్యాంకు పేమెంట్లు, బిల్లులు, ఒప్పందాలు, రశీదులు, రిజిస్ట్రేషన్ అన్నింటి వరకు అలాగే ఉండేలా జాగ్రత్తపడండి. అలాగే రుణ సౌకర్యంతో కట్టించిన ఇంటి మీద ఆదాయం, వచ్చిన అద్దె సమానంగా అకౌంటు చేయండి. ఒకవేళ అద్దె ఇంట్లో ఉంటే ఎవరో ఒకరు, ఎక్కువ శ్లాబులో ఉన్నవారు, ఇంటద్దె అలవెన్స్ మినహాయింపు పొందండి. ఇద్దరూ విడివిడిగా ఒకే ఊరిలో ఉద్యోగం ఉంటే క్లెయిమ్ చేయకండి. వేరు వేరు ప్రాంతాల్లో ఉంటే ఎటువంటి తప్పు లేదు. ప్లానింగ్ వల్ల నాలుగు రూపాయలు మిగులుతాయి అని అనుకోకుండా మీకు మనశ్శాంతి ఉండేలా ఉండండి. -
స్టాపేజ్ రిపోర్ట్ ఇవ్వకుంటే వాహన పన్ను కట్టాల్సిందే
సాక్షి, అమరావతి: మోటారు వాహన చట్టంలో నిర్దేశించిన మోటారు వాహనం లేదా వాణిజ్య వాహనాలను వాటి యజమానులు రోడ్లపై తిప్పకూడదనుకున్నప్పుడు ఆ విషయాన్ని రాతపూర్వకంగా రవాణా శాఖ అధికారులకు తెలియచేసి తీరాలని హైకోర్టు తేల్చి చెప్పింది. అప్పుడు మాత్రమే ఆ వాహనానికి పన్ను మినహాయింపు కోరడానికి వీలవుతుందని స్పష్టం చేసింది. తమ వాహనం లేదా వాహనాలు రోడ్డుపై తిరగడం లేదని, పన్ను చెల్లింపు త్రైమాసిక గడువు ముగిసిన తరువాత ఆ వాహనాలను రోడ్లపై తిప్పబోమంటూ వాహన యజమానులు ‘స్టాపేజ్ రిపోర్ట్ లేదా నాన్ యూజ్ రిపోర్ట్’ ఇవ్వకుంటే.. వాహనాలు రోడ్లపై తిరుగుతున్నట్టుగానే భావించి పన్ను విధించే అధికారం రవాణా అధికారులకు ఉందని పేర్కొంది. ఒకవేళ రవాణాయేతర వాహన యజమాని స్టాపేజ్ రిపోర్ట్ సమర్పించడంలో విఫలమైనప్పటికీ, ఆ తరువాత వాహనాన్ని తిప్పడం లేదని అధికారులకు అన్ని ఆధారాలను ఇస్తే, ఆ వాహనం తిరగడం లేదనే భావించాల్సి ఉంటుందని తెలిపింది. తమ వాహనాలు విశాఖ స్టీల్‌ప్లాంట్ లోపల సెంట్రల్ డిస్పాచ్ యార్డ్ (సీడీవై)లో తిరుగుతున్నాయని, సీడీవై ‘బహిరంగ ప్రదేశం’ కిందకు రాదని, అందువల్ల తమ వాహనాలకు మోటారు వాహన పన్ను మినహాయింపు వర్తిస్తుందన్న తారాచంద్ లాసిజ్టిక్ సొల్యూషన్స్ లిమిటెడ్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వాదన ఏపీ మోటారు వాహన పన్నుల చట్టంలోని సెక్షన్ 12ఏకి విరుద్ధమని తేల్చిచెప్పింది. సీడీవై బహిరంగ ప్రదేశం కిందకు రాదు కాబట్టి, తారాచంద్ కంపెనీ చెల్లించిన రూ.22.71 లక్షల పన్నును తిరిగి వారికి వెనక్కి ఇవ్వాలని రవాణా అధికారులను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. సెక్షన్ 12ఏ ప్రకారం స్టాపేజ్ రిపోర్ట్‌కు బహిరంగ ప్రదేశం, ప్రైవేటు ప్రదేశం అన్న తేడా ఏమీ ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించింది. రూ.22.71 లక్షలు వెనక్కి ఇవ్వాలన్న సింగిల్ జడ్జితారాచంద్ లాసిజ్టిక్ సొల్యూషన్స్ కంపెనీ విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఐరన్ స్టోరేజీ, హ్యాండ్లింగ్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ పనులకు 36 వాహనాలను వినియోగిస్తోంది. ఈ వాహనాలు అప్పటివరకు రోడ్లపై తిరిగినందుకు కాంట్రాక్ట్ పొందడానికి ముందే సదరు కంపెనీ ఆ వాహనాలకు మోటారు వాహన పన్ను చెల్లించింది. పన్ను చెల్లించిన కాల పరిమితి ముగియడంతో అధికారులు ఆ వాహనాలకు రూ.22.71 లక్షల మేర పన్ను చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై తారాచంద్ కంపెనీ తమ వాహనాలు రోడ్లపై తిరగడం లేదని, సీడీవైలోనే తిరుగుతున్నందున పన్ను మినహాయింపు ఇవ్వాలంటూనే రూ.22.71 లక్షల పన్ను చెల్లించింది. ఆ తరువాత తమ వాహనాలకు పన్ను విధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో 2022లో పిటిషన్ దాఖలు చేసింది.దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి తారాచంద్ కంపెనీ తన వాహనాలను రోడ్లపై తిప్పలేదని, స్టీల్ ప్లాంట్ లోపల ఉన్న సీడీవైలోనే తిప్పిందని, అందువల్ల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చారు. ఆ కంపెనీ చెల్లించిన రూ.22.71 లక్షల పన్ను మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని రవాణా అధికారులను ఆదేశిస్తూ తీర్పునిచ్చారు.ప్రభుత్వం అప్పీల్ చేయడంతో..ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం వాహనదారు పన్ను మినహాయింపు కావాలంటే.. పన్ను చెల్లించాల్సిన త్రైమాసికం మొదలు కావడానికి ముందే సదరు వాహనం తిరగడం లేదంటూ స్టాపేజ్ రిపోర్ట్‌ను రాతపూర్వకంగా రవాణా శాఖ అధికారులకు తెలియజేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.వాస్తవానికి మోటారు వాహన పన్ను అనేది పరిహార స్వభావంతో కూడుకున్నదని, పన్నుల ద్వారా వచ్చే మొత్తాలతోనే అన్ని వాహన రాకపోకలు సజావుగా సాగేందుకు వీలుగా రోడ్లను నిర్వహించడమన్నది ప్రభుత్వ బాధ్యత అని తెలిపింది. తారాచంద్ కంపెనీకి రూ.22.71 లక్షలు వెనక్కి ఇవ్వాలంటూ సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. -
వివాద్ సే విశ్వాస్ పై సందేహాల నివృత్తి
ఆదాయపన్ను శాఖ ‘వివాద్ సే విశ్వాస్’ పథకానికి సంబంధించి సందేహాలను తొలగించే ప్రయత్నం చేసింది. తరచూ అడిగే ప్రశ్నలకు (ఎఫ్ఏక్యూలు) సమాధానాలు విడుదల చేసింది. 2024 జులై 22 నాటికి అపరిష్కృతంగా ఉన్న అన్ని రకాల అప్పీళ్లకు వివాద్ సే విశ్వాసం పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ పథకం కింద పన్ను వివాదాలను పరిష్కరించుకోవాలని భావించే వారు ఈ నెల 31లోపు ప్రత్యక్ష పన్నుల వివాద్ సే విశ్వాస్ కింద డిక్లరేషన్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించాలి.ఇదీ చదవండి: మళ్లీ అవకాశం రాదేమో! భారీగా తగ్గిన బంగారం ధరతాజా స్పష్టతతో పన్ను చెల్లింపుదారులు అందరికీ కేసుల పరిష్కారంలో సమాన అవకాశాలు లభిస్తాయని నాంజియా అండ్ కో ఎల్ఎల్పీ పార్ట్నర్ సచిన్ గార్గ్ తెలిపారు. జులై 22 నాటికి పెండింగ్‌లో ఉన్నవి, కొట్టేసిన వాటికి సైతం ఈ పథకం కింద పరిష్కారానికి అర్హత ఉంటుంది. వివాద్ సే విశ్వాస్ పథకాన్ని 2024–25 బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. అక్టోబర్ 1న దీన్ని నోటిఫై చేశారు. డిసెంబర్ 31లోపు డిక్లరేషన్ దాఖలు చేసిన వారు పరిష్కారానికి వీలుగా వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించాలి. 2025 జనవరి 1, ఆ తర్వాత డిక్లరేషన్ దాఖలు చేస్తే వివాదంలోని పన్ను మొత్తంలో 110 శాతాన్ని చెల్లించాలని ఆదాయపన్ను శాఖ తెలిపింది. -
భారత్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తుందని ఆరోపించారు. ఇది ఇలాగే కొనసాగితే మేం కూడా భారత్ ఉత్పత్తులపై 100శాతం సుంకం విధిస్తామని స్పష్టం చేశారు.డొనాల్డ్ ట్రంప్ కామర్స్ సెక్రటరీగా హోవార్డ్ లుట్నిక్‌ను ఎంపిక చేయడంపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా-చైనా దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు, అమెరికా ఉత్పత్తులపై విదేశాలు విధిస్తున్న ట్యాక్స్ సంబంధిత అంశాలపై చర్చించారు. ట్రంప్ మాట్లాడుతూ.. పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై ట్యాక్స్‌లు విధిస్తున్నాయి. కానీ మేం ఆయా దేశాల వస్తువులపై ట్యాక్స్ విధించడం లేదు. ఇకపై అలా కుదరదు. వాళ్లు మా దేశ ఉత్పత్తులపై ట్యాక్స్ విధిస్తే మేం కూడా వారి దేశానికి చెందిన వస్తువులపై పన్ను విధిస్తాం. అధిక మొత్తంలో పన్నులు విధించే జాబితాలో బ్రెజిల్, భారత్‌లు ఉన్నాయి. భారత్,బ్రెజిల్ తమ ఉత్పత్తులపై 100శాతం సుంకం విధిస్తే, ప్రతిఫలంగా అమెరికా కూడా అదే చేస్తుంది. అమెరికాకు చెందిన ఏదైనా ఓ ఉత్పత్తిపై రూ.100 నుంచి రూ.200 వరకు భారత్,బ్రెజిల్‌లు వసూలు చేస్తున్నాయి. మేం కూడా అదే స్థాయిలో వసూలు చేయబోతున్నామని డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు.ట్రంప్‌కు కెనడా హెచ్చరికలు ఇప్పటికే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ వస్తువులపై టారిఫ్ విధిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో తమ నుంచి దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపై ట్రంప్ టారీఫ్‌లు విధిస్తే.. చివరకు వారు కొనే ప్రతి వస్తువు ధరను పెంచుతుందని అమెరికా ప్రజలే అర్థం చేసుకొంటున్నారని కెనడా ప్రధాని ట్రూడో హెచ్చరించారు. హాలీఫాక్స్ ఛాంబరాఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.కెనడాపై ట్రంప్ అదనపు సుంకాలు విధిస్తే.. తాము ప్రతిచర్యలకు దిగుతామని ట్రూడో హెచ్చరించారు. అమెరికాలో ట్రంప్ గత కార్యవర్గంతో పోలిస్తే.. కొత్త బృందంతో డీల్ చేయడం కొంచెం సవాళ్లతో కూడిన పనిగా ఆయన అభివర్ణించారు. 2016లో స్పష్టమైన ఆలోచనలతో వారు చర్చలకొచ్చారన్నారు. -
సెకెండ్ హ్యాండ్ వాహనాలపై భారీ పన్ను?
పాత, వాడిన ఎలక్ట్రిక్ వాహనాలు (EV), తేలికపాటి పెట్రోల్, డీజిల్ వాహనాలపై వస్తు సేవల పన్ను (GST) పెరిగే అవకాశం ఉంది. జీఎస్టీ కౌన్సిల్ ఫిట్మెంట్ కమిటీ సిఫార్సు ఆధారంగా పన్ను రేటు 12 శాతం నుండి 18 శాతానికి పెంచవచ్చని సీఎన్‌బీసీ టీవీ 18 రిపోర్ట్ పేర్కొంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో డిసెంబర్ 20-21 తేదీలలో జరగనున్న కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనను చర్చించనున్నట్లు తెలుస్తోంది.ఈ ప్రతిపాదన అమలు చేస్తే.. సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారి సంఖ్య తగ్గే అవకాశం ఉంది. గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడానికి ప్రస్తుతం ప్రభుత్వం కొత్త ఈవీలకు రాయితీపై 5 శాతం జీఎస్టీ మాత్రమే విధిస్తోంది. అలాగే పాత, వాడిన విద్యుత్ వాహనాలపై 12 శాతం పన్ను అమలవుతోంది. దీన్ని 18 శాతానికి తీసుకెళ్లాలని తద్వారా రీసేల్ మార్కెట్ సౌలభ్యాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. పాత, సెకెండ్ హ్యాండ్ వాహనాలపై విధించే జీఎస్టీ సరఫరాదారు మార్జిన్‌కు మాత్రమే వర్తిస్తుంది.ప్రస్తుత విధానంలో 1200 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం, 4000 ఎంఎం కంటే ఎక్కువ పొడవు కలిగిన పెట్రోల్ వాహనాలపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. అదేవిధంగా 1500 సీసీ పైగా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం, 4000 ఎంఎం కంటే ఎక్కువ పొడవు కలిగిన డీజిల్ వాహనాలు, అలాగే 1500 సీసీ కంటే ఎక్కువ ఇంజన్లు కలిగిన ఎస్‌యూవీలపై కూడా 18 శాతం పన్ను విధిస్తున్నారు.ఇదీ చదవండి: ఈ-టూవీలర్స్లోనూ పెద్ద కంపెనీలే..ఇక ఈవీలు, చిన్న కార్లతో సహా అన్ని ఇతర వాహనాలు ప్రస్తుతం 12 శాతం పన్ను పరిధిలోకి వస్తాయి. ఈవీలతో సహా 12 శాతం కేటగిరీలోని అన్ని వాహనాలకూ 18 శాతం పన్ను విధించాలని ఫిట్మెంట్ కమిటీ సిఫార్సు చేసింది. జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఇది ఆమోదం పొందితే అన్ని పాత, సెకెండ్ హ్యాండ్ వాహనాలపై ఏకరీతిలో 18 శాతం పన్ను అమలవుతుంది. -
డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారా? ఇది మీకోసమే..
ఈరోజుల్లో జేబులో కరెన్సీ లేకున్నా.. ధైర్యంగా అడుగు బయటపెట్టొచ్చు!. బ్యాంక్ బ్యాలెన్స్, ఓ స్మార్ట్‌ఫోన్.. దానికి ఇంటర్నెట్ ఉంటే చాలూ!. మార్కెట్లో ఎక్కడికి వెళ్లినా సెకన్లలో పేమెంట్లు చకచకా చేసేయొచ్చు. రూపాయి దగ్గరి నుంచి మొదలుపెడితే.. పెద్ద పెద్ద అమౌంట్ల చెల్లింపులకు రకరకాల యాప్స్‌ను ఉపయోగిస్తున్నాం. అంతగా డిజిటల్ చెల్లింపులు మన జీవనంలో భాగమయ్యాయి. అయితే ఈ చెల్లింపులపై ట్యాక్స్ విధింపు సబబేనా?.. ప్రస్తుతం దేశంలో చాలావరకు జనం డిజిటల్ పేమెంట్లకు అలవాటు పడ్డారు. పల్లె నుంచి పట్నం దాకా అందరికీ ఇది అలవాటైంది. మార్కెట్లలోనే కాదు, గ్యాస్, కరెంట్.. అన్ని రకాల బిల్లుల చెల్లింపులకు వీటినే ఉపయోగిస్తున్నారు. కానీ, కేంద్రం ఇప్పుడు వీటిపై ట్యాక్స్ విధించబోతోందట. ప్రత్యేకించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) యాప్‌ల ద్వారా చెల్లింపులపైనే ఈ పన్ను విధింపు ఉండనుందట!. ఇక నుంచి ఫోన్ పే, గూగుల్‌పే, మరేయిత యూపీఐ యాప్ ద్వారాగానీ పేమెంట్ చేశారనుకోండి.. దానిపై ఎక్స్ట్రా ఛార్జీ వసూలు చేస్తారు. 2025 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమలు కాబోతోంది. మీరూ వాటితోనే చెల్లింపులు చేస్తున్నారా? అయితే ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి.. ఏ యూపీఐ యాప్ ద్వారా అయినా 2 వేల రూపాయలకు పైన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే 1.1 శాతం టాక్స్ పడుతుందట. ఎవరికైనా 10 వేల రూపాయలు పంపిస్తే, ట్యాక్స్ రూపంలో 110 రూపాయలు కట్ అవుతుందని.. కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కానీ,ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వార్త మాత్రమే. ముఖ్యంగా వాట్సాప్ యూనివర్సిటీ నుంచి ఈ వార్త ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది. వీటిని అదనంగా.. కొందరు వీడియోలను యాడ్ చేస్తున్నారు. అయితే ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ ప్రచారంపై మీకు స్పష్టత ఇవ్వబోతున్నాం.అదొక ఫేక్ వార్త. పైగా ఇలాంటి వార్తే 2023-24 బడ్జెట్ టైంలోనూ వైరల్ అయ్యింది. ఆ టైంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) కూడా ఓ క్లారిటీ ఇచ్చింది. డిజిటల్ వాలెట్లు, ఇతర ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్.. PPIని ఉపయోగించి చేసే లావాదేవీలకు మాత్రమే ఈ టాక్స్ వర్తిస్తుంది. ‘కొత్త ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు PPI లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయి. ఇతర సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు’ అని స్పష్టం చేసింది. .@IndiaToday claims that UPI transactions over Rs 2000 will be charged at 1.1%#PIBFactCheck➡️There is no charge on normal UPI transactions. ➡️@NPCI_NPCI circular is about transactions using Prepaid Payment Instruments(PPI) like digital wallets. 99.9% transactions are not PPI pic.twitter.com/QeOgfwWJuj— PIB Fact Check (@PIBFactCheck) March 29, 2023సాధారణ UPI పేమెంట్లకు, PPI పేమెంట్లకు మధ్య తేడాను అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ గందరగోళం నెలకొంటోంది. పైగా కొన్ని ప్రముఖ ఛానెల్స్, వెబ్సైట్లు ఎలాంటి ధృవీకరణ లేకుండా గుడ్డిగా.. డిజిటల్ పేమెంట్లపై బాదుడే బాదుడు అంటూ కథనాలు ఇచ్చేయడం గమనార్హం. -
గుకేశ్ ప్రైజ్‌మనీలో చెల్లించాల్సిన ట్యాక్స్ ఎంతంటే?
అతి చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన డీ గుకేశ్‌కు దేశ ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్, టెక్ సీఈఓ సుందర్ పిచాయ్ శుభాకాంక్షలు తెలిపారు. 58 ఎత్తుల్లోప్రత్యర్థి ఆటకు చెక్ పెట్టిన గుకేశ్ ప్రైజ్ మనీ కింద సుమారు రూ.11 కోట్లు పొందనున్నారు. అయితే ఇందులో ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది? చివరగా చేతికి వచ్చేది ఎంత అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.వరల్డ్ చెస్ పెడరెషన్ (ఫిడే) ప్రకారం.. చెస్ ఛాంపియన్షిప్ మొత్తం ప్రైజ్ మనీ రూ.20.75 కోట్లు. ఒక గేమ్ గెలిచిన వారికి రూ.1.68 కోట్లు ఇస్తారు. ఇలా గుకేష్ మూడు గేమ్స్ గెలిచాడు. ఈ లెక్కన మొత్తం రూ.5.04 కోట్లు గుకేష్ సొంతమయ్యాయి. రెండు గేమ్స్ గెలిచిన డింగ్‌కు రూ. 3.36 కోట్లు దక్కాయి. అంటే మొత్తం ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీతో ఇద్దరు ఆటగాళ్లు రూ.8.40 కోట్లు కైవసం చేసుకోగా.. మిగిలిన రూ.12.35 కోట్లను ఇద్దరికీ సమానంగా పంచుతారు. ఇలా గుకేశ్‌కు రూ.11 కోట్ల కంటే ఎక్కువ ప్రైజ్ మనీ అందుతుంది.గుకేశ్‌కు వచ్చిన ప్రైజ్ మనీతో 30 శాతం లేదా రూ.4.67 కోట్లు ట్యాక్స్ కింద కట్ చేస్తారు. ఈ లెక్కన మొత్తం పన్నులు చెల్లించిన తరువాత గుకేష్ చేతికి అంతేది రూ.6.33 కోట్లు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గెలిచింది గుకేష్ కాదు, ఆర్ధిక శాఖ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.ఇది టీడీఎస్.. అంటే ట్యాక్స్ డిటెక్టెడ్ బై సీతారామన్ అని మరికొందరు చెబుతున్నారు. ఆట ఆడకుండానే.. ఆదాయపన్ను శాఖ గెలిచిందని ఇంకొకరు అన్నారు. ఆటగాళ్లపై విధించే ట్యాక్స్‌లను తగ్గించాలని చాలామంది నెటిజన్లు చెబుతున్నారు.ఐపీఎల్ వేలంలో కూడా..ఇటీవల జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా క్రికెటర్ 'రిషబ్ పంత్' ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్.. 27 కోట్ల రూపాయలకు పలికినప్పటికీ, పన్నులు వంటివి పోగా అతని చేతికి వచ్చే డబ్బు చాలా తగ్గుతుంది. పంత్ ఐపీఎల్ వేతనంలో కొంత శాతం ట్యాక్స్ రూపంలో పోతుంది. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.8.1 కోట్లు చేరుతుంది. అంటే పంత్ చేతికి వచ్చే డబ్బు రూ. 18.9 కోట్లన్నమాట. -
ఆదాయాన్ని నిర్ధారించేవి.. ఈ మూడే..
మీ ట్యాక్సబుల్ ఆదాయాన్ని నిర్ధారించేవి ముఖ్యంగా మూడు అంశాలు. అవేంటంటే.. 1. రెసిడెన్షియల్ స్టేటస్ 2. ఆదాయం వచ్చే సమయం 3. ఆదాయానికి మూలం (సోర్స్) ఇక వివరాల్లోకి వెళ్దాం.1. రెసిడెన్షియల్ స్టేటస్ .. ఆదాయపు పన్ను చట్టంలో పన్ను భారాన్ని నిర్ధారించేది మీ రెసిడెన్షియల్ స్టేటస్ .. అంటే మీరు భారత్‌లో ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఎన్ని రోజులు ఉన్నారనే విషయం. పౌరసత్వానికి, పన్ను భారానికి ఎటువంటి సంబంధం లేదు. పౌరుడైనా, పౌరుడు కాకపోయినా ఆ వ్యక్తి స్టేటస్ .. అంటే ఇండియాలో ఎన్ని రోజులున్నాడనే అంశంపై ఆధారపడి ఉంటుంది.ఆదాయానికి మూలం కింద .. జీతం, ఇంటి మీద అద్దె, వ్యాపారం మీద ఆదాయం .. మొదలైనవి ఉంటాయి. ఈ స్టేటస్ ప్రతి సంవత్సరం మారొచ్చు. మారకపోవచ్చు. అందుకని ప్రతి సంవత్సరం ఈ షరతుని లేదా పరిస్థితిని లేదా కొలబద్దని కొలవాలి. లెక్కించాలి. వ్యక్తి విషయానికొస్తే.. 182 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ రోజులుంటే, అటువంటి వ్యక్తిని రెసిడెంట్ అంటారు. సాధారణంగా మనందరం రెసిడెంట్లమే.మరో ప్రాతిపదిక ఏమిటంటే, గడిచిన నాలుగు సంవత్సరాల్లో 365 రోజులు లేదా పైగా ఉంటూ, ఆ ఆర్థిక సంవత్సరంలో 60 రోజులు ఉండాలి. ఇలాంటి వ్యక్తిని రెసిడెంట్ అంటారు. ఈ లెక్కింపులకు మీ పాస్‌పోర్ట్‌లలో ఎంట్రీలు ముఖ్యం. రెసిడెంటుకు, నాన్–రెసిడెంటుకు ఎన్నో విషయాల్లో భేదాలు ఉన్నాయి. మిగతా వారి విషయంలో ఇండియాలో ఉంటూ ‘‘నిర్వహణ, నియంత్రణ’’ చేసే వ్యవధి మీద స్టేటస్ ఆధారపడి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి.2. ఆదాయం ఏర్పడే సమయం సాధారణంగా ఆ ఆర్థిక సంవత్సరంలో మీ చేతికి వచ్చినది, మీరు పుచ్చుకున్నది, మీ ఖాతాలో జమ అయినదాన్ని మీ ఆదాయం అంటారు. దీన్నే రావడం ... అంటే ARISE అంటారు. కానీ చట్టంలో ఒక చిన్న ఇంగ్లీష్ పదం ‘ACCRUE’ మరో అర్థాన్ని సూచిస్తుంది. ‘‘ఆదాయాన్ని’’ నిర్వచించే విధానం చూస్తే, వాడే భాష చూస్తే, ఆదాయ పరిధిని ‘‘వామన అవతారం’’లో ‘‘మూడు అడుగుల’’ను స్ఫురింపచేస్తుంది. ఎన్నో వివరణలు, తీర్పులు, పరిధులు ఉంటాయి. ‘‘ఇందుగలడందు కలడు’’ అనే నరసింహావతారం గుర్తుకు రాక తప్పదు.స్థూలంగా చెప్పడం అంటే మేము ‘సాహసం’ చేయడమే! పాతాళభైరవిలో నేపాల మాంత్రికుడి మాటల్ని స్ఫూర్తిగా తీసుకుంటూ, చేతికొచ్చింది .. చేతికి రావాల్సినది, హక్కు ఏర్పడి రానిది, హక్కు ఉండి అందనిది, ఆదాయంలా భావించేది, భావించతగ్గది, భావించినది, ఆదాయం కాకపోయినా తీసుకోక తప్పనిది (Deemed), కొన్ని సందర్భాల్లో మీకు కలిపేది (Included) అని చెప్పొచ్చు.3. ముచ్చటగా మూడోది..మూలం. అంటే Source. చట్టప్రకారం మనకు ఏర్పడే ఆదాయాల్ని ఐదు రకాలుగా, 5 శీర్షికల కింద వర్గీకరించారు. a) జీతాలు, వేతనాలు b) ఇంటి మీద ఆదాయం c) వ్యాపారం/వృత్తి మీద లాభనష్టాలు d) క్యాపిటల్ గెయిన్స్ e) పై నాలుగింటిలోకి విభజించలేక మిగిలినవి .. ఏ మూలమైనా, ఏ మూల నుంచి వచ్చినా ఈ శీర్షిక కింద పరిగణనలోకి తీసుకుంటారు. అవశేష ఆదాయం అని అనొచ్చు. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని ట్యాక్స్ ప్లానింగ్‌కి శ్రీకారం చుడదాం.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
బ్యాంకులో డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా?.. అయితే ఇది మీ కోసమే
బ్యాంకులో డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా?. అయితే తస్మాత్ జాగ్రత్త. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మంచిది. కానీ చేసే ముందుకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల లాభ నష్టాల్ని ఒక్కసారి బేరీజు వేసుకోండి. లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకు చేశానురా భగవంతుడా అనుకుంటూ తలలు పట్టుకోవాల్సి వస్తుంది. ఇంతకి ఏం జరిగింది.గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం వస్త్రపూర్కు చెందిన జైమన్ రావల్ తనని ఆపత్కాలంలో ఆదుకుంటాయనే నమ్మకంతో యూనియన్ బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్ టెన్యూర్ పూర్తి కావడంతో తన తల్లితో పాటు బ్యాంక్‌కు వచ్చారు. అనంతరం, బ్యాంక్ మేనేజర్ సంప్రదించి తన ఫిక్స్డ్ డిపాజిట్ టెన్యూర్ పూర్తియ్యింది. డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్నాను. సంబంధింత ప్రాసెస్ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.దీంతో సదరు బ్యాంక్ మేనేజర్.. కస్టమర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుని డబ్బులు విత్ డ్రా ప్రాసెస్ ప్రారంభించారు. ఈ క్రమంలో తన ఎఫ్డీపై ట్యాక్స్ ఎక్కువ మొత్తంలో డిడక్ట్ అవ్వడాన్ని గమనించారు.ఇదే విషయాన్ని బ్యాంక్ మేనేజర్‌తో ప్రస్తావించారు. బ్యాంక్ మేనేజర్ నుంచి వచ్చిన సమాధానంతో కస్టమర్ జైమన్ రావెల్ సహనం కోల్పోయారు. ఎదురుగా ఉన్న బ్యాంక్ మేనేజర్ కాలర్ పట్టుకుని ప్రశ్నించారు. బ్యాంక్ మేనేజర్ సైతం కస్టమర్ చొక్కా కాలర్ పట్టుకున్నారు. అంరతరం ఇరువురి మధ్య మాట మాట పెరిగి దాడికి దారి తీసింది. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.'Customer' turned 'Crocodile' after TDS Deduction in Bank FD. FM sud instruct Bank staffs to learn 'taekwondo' for self defense. pic.twitter.com/CEDarfxcqi— Newton Bank Kumar (@idesibanda) December 6, 2024 కుమారుడు, బ్యాంక్ మేనేజర్ల మధ్య జరుగుతున్న గొడవని ఆపేందుకు కస్టమర్ తల్లి ప్రయత్నాలు చేసింది. బ్యాంక్‌లో పనిచేస్తున్న ఉద్యోగి శుభమన్‌ను కోరింది. ఇరువురి మధ్య కోట్లాట తారాస్థాయికి చేరడంతో చేసేది లేక ఆ తల్లి తన కుమారుడిని కొట్టింది. దీంతో తల్లి కొట్టడంతో కుమారుడు వెనక్కి తగ్గడంతో గొడవ సర్ధుమణిగింది. బ్యాంక్‌లో జరిగిన దాడిపై సమాచారం అందుకున్న వస్త్రపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.మరోవైపు, ఫిక్స్డ్ డిపాజిట్లే కాదు, ఇతర బ్యాంక్ లావాదేవీలపై జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బులు సేవింగ్స్ విషయంలో లాభనష్టాల గురించి ముందే జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. బ్యాంక్‌లో దాచుకునే డబ్బులుపై ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అలా ట్యాక్స్ కట్టే పని లేకుండా నిబంధనలు పాటిస్తూ డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు. అందుకే డబ్బులు దాచుకునే విషయంలో కస్టమర్లకు సరైన అవగాహన ఉండాలని సూచిస్తున్నారు. -
ఈ వస్తువులపై భారీగా పెరగనున్న జీఎస్టీ!
గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST) అమలులోకి వచ్చిన ఏడు సంవత్సరాల తర్వాత.. మొదటిసారి పన్ను రేట్లలలో భారీ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపైన తుది నిర్ణయం ఈనెల 21న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వెలువడుతుంది.పన్ను రేటు హేతుబద్దీకరణలో భాగంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల మీద మాత్రమే కాకుండా శీతలపానీయాల మీద జీఎస్టీని 28 శాతం నుంచి 35 శాతానికి పెంచే అవకాశం ఉంది. రెడీమేడ్ వస్త్రాలపై కూడా జీఎస్టీ రేటు పెరుగుతుందని.. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ అధ్యక్షతన జరిగిన జీవోఎం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు 5, 12, 18, 28 శాతం అనే నాలుగు అంచెల పన్ను శ్లాబులు మాత్రమే ఉండేవి. త్వరలో 35 శాతం కొత్త రేటు కూడా శ్లాబులో చేరనున్నట్లు సమాచారం.రూ.1,500 విలువైన రెడీమేడ్ దుస్తులపై 5 శాతం, రూ.1,500 నుంచి రూ.10,000 మధ్య ధర ఉన్న దుస్తులపై 18 శాతం, రూ. 10వేలు కంటే ఎక్కువ ధర ఉన్న వస్త్రాల మీద 28 శాతం జీఎస్టీ విధించనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు కొత్తగా 148 ఉత్పత్తులపై ట్యాక్స్ విధించనున్నట్లు జీవోఎం సూచించింది. సౌందర్య సాధనాలు, గడియారాలు, బూట్లు వంటి వాటిపై కూడా ట్యాక్స్ పెంచే అవకాశం ఉందని జీవోఎం ప్రతిపాదించింది.ఇదీ చదవండి: రూ.2000 నోట్లపై ఆర్బీఐ అప్డేట్..జిఎస్టి కౌన్సిల్ డిసెంబర్ 21న జైసల్మేర్‌లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై కూడా కీలక ప్రతిపాదనలు వెల్లడించే అవకాశం ఉంది. కార్లు, వాషింగ్ మెషిన్స్ వంటివి 28 శాతం జీఎస్టీ కింద ఉన్నాయి. వీటిని 35 శాతం శ్లాబులోకి చేరుస్తారా? లేదా.. 28 శాతం వద్దనే ఉంచుతారా అనే విషయాలు 21వ తేదీ తెలుస్తుంది. -
కొత్త పన్ను కోడ్ అవసరం
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన దేశం) లక్ష్య సాధనకు తక్కువ పన్ను రేట్లతో కూడిన సమగ్రమైన పన్నుల కోడ్‌ను తీసుకురావాల్సిన అవసరాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. మరింత మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడం, వసూళ్లు మెరుగుపరుచుకోవడం, నిబంధనల అమలును ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. ఇందుకు ‘ఎఫ్‌ఎల్‌ఏటీ’ నమూనాను ప్రస్తావిస్తున్నారు. కేవలం కొన్ని శ్లాబులు, తక్కువ రేట్లతో, వివాదాలను తగ్గించే విధంగా, పన్ను చెల్లింపుదారులను విస్తృతం చేసే విధంగా ఉండాలంటున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు సమర్పించనున్న నేపథ్యంలో నిపుణుల సూచనలకు ప్రాధాన్యం నెలకొంది. ‘‘జీఎస్టీ కింద ఎన్నో రకాల రేట్లు ఉండడం ఎంత మాత్రం మంచిది కాదు. జీఎస్టీ అన్నది ఒక్కటే రేటుగా ఉండాలి. కానీ, మన దేశంలో ఒకటే రేటు అన్నది సాధ్యం కాదు’’అని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) మాజీ చైర్మన్ పీసీ ఝా అభిప్రాయపడ్డారు. కాకపోతే 5 శాతం, 16 శాతం, 28 శాతం చొప్పున మూడు పన్ను శ్లాబులను పరిశీలించాలని సూచించారు. థింక్ చేంజ్ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా ఈ అంశంపై మాట్లాడారు. ప్రస్తుత పన్ను వ్యవస్థలోని నిబంధనలను సులభతరం చేయాల్సిన అవసరాన్ని ఎర్నెస్ట్ అండ్ యంగ్ పార్ట్నర్ రాజీవ్ ఛుగ్ సైతం సమరి్థంచారు. ‘‘పన్ను రేట్లు తగ్గించడం వల్ల పౌరులు, కంపెనీలకు ఖర్చు పెట్టేందుకు వీలుగా నిధుల మిగులు పెరుగుతుంది. రేట్లను క్రమబద్దీకరిస్తే అది ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తుంది’’అని ఛుగ్ వివరించారు. -
Ambati Rambabu: లోకల్ ఎమ్మెల్యే టాక్స్.. క్యాష్ కొట్టందే పని కాదు
-
ట్యాక్స్ కోడ్‌ను సరళీకరించాలి: మస్క్
అమెరికాలో ట్యాక్స్ విధానాలను మరింత సరళతరం చేయాలనేలా యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సారథిగా నియమితులైన ఇలాన్‌మస్క్ తెలిపారు. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాక తన కార్యవర్గంలో మస్క్, వివేక్రామస్వామిని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా నియమించిన విషయం తెలిసిందే. రానున్న ట్రంప్ పాలన కాలంలో అమెరికాలోని పన్ను విధానాలను సరళీకృతం చేయాలని మస్క్ యోచిస్తున్నారు.ప్రపంచంలోని వివిధ దేశాల్లో సంక్లిష్టంగా ఉన్న పన్ను విధానాలను ప్రస్తావిస్తూ ఎక్స్‌లో వెలసిన పోస్ట్‌కు ఇలాన్‌మస్క్ స్పందించారు. పాశ్చాత్య దేశాల్లో యూకే తర్వాత పన్ను అమలుకు సంబంధించిన విధానాలను గరిష్ఠంగా అమెరికా అనుసరిస్తుందని, దాన్ని మరింత హేతుబద్ధీకరించి సరళంగా మార్చాలని యోచిస్తున్నట్లు మస్క్ తెలిపారు. వెస్టర్న్ దేశాల్లో ట్యాక్స్ కోడ్‌కు సంబంధించిన విధానాలు యూకేలో 17,000+ పేజీలున్నాయి. తర్వాతి స్థానంలో యూఎస్ 6,800 పేజీలు కలిగి ఉంది. ట్యాక్స్ విధానాలపై చెల్లింపుదారుల్లో గందరగోళం నెలకొనకుండా చాలా దేశాలు వాటిని సరళీకరిస్తున్నాయి. స్వీడన్ కనిష్టంగా కేవలం 100 పేజీల పన్ను విధానాలను అమలు చేస్తోంది.ఇదీ చదవండి: పన్ను లేకుండా ‘దోసె’స్తున్నారు!వెస్టర్న్ దేశాల్లో తక్కువ పేజీలతో ట్యాక్స్కోడ్ అమలు చేస్తున్న ప్రాంతాలుయునైటెడ్ కింగ్డమ్: 17,000+ పేజీలుయునైటెడ్ స్టేట్స్: 6,800 పేజీలుఆస్ట్రేలియా: 5,000 పేజీలుకెనడా: 3,000 పేజీలుజర్మనీ: 1,700 పేజీలుఫ్రాన్స్: 1,500 పేజీలుస్పెయిన్: 1,000 పేజీలుఇటలీ: 800 పేజీలునెదర్లాండ్స్: 400 పేజీలుస్వీడన్: 100 పేజీలు -
కొత్త ట్యాక్స్ కోడ్: రేపటి భారతదేశ నిర్మాణం కోసం..
2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనికోసం కొత్త ట్యాక్స్ కోడ్ అవసరమని నిపుణులు బడ్జెట్‌కు ముందే చెప్పారు. ఆర్ధిక వ్యవస్థను శక్తివంతం చేస్తూ.. నికర రాబడిని పెంచడం వంటివి అవసరం. 2025-26 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించనున్నారు.''ది న్యూ టాక్స్ కోడ్: రేపటి భారతదేశాన్ని నిర్మించడానికి ఆలోచనలు" అనే సెమినార్‌ను థింక్ చేంజ్ ఫోరమ్ (TCF) నిర్వహించింది. ఈ సెమినార్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ మాజీ చైర్మన్ పీసీ ఝా, పాలసీ అడ్వైజరీ & స్పెషాలిటీ సర్వీసెస్ పార్టనర్ అండ్ లీడర్ రాజీవ్ చుగ్, మేనేజింగ్ పార్టనర్ సూరజ్ మాలిక్, సీనియర్ పార్టనర్ రజత్ మోహన్ మొదలైనవారు పాల్గొన్నారు.జీఎస్టీ కింద చాలా పన్ను రేట్లు ఉండటం మంచి పరిస్థితి కాదు. జీఎస్టీ అనేది ఒక పన్ను రేటుగా మాత్రమే ఉండాలి. కానీ.. మన దేశంలో ఒక పన్ను రేటును కలిగి ఉండటం సాధ్యం కాదు. కాబట్టి మూడు పన్ను రేట్లను పరిశీలించే అవకాశం ఉంది. అవి 5 శాతం, 16 శాతం & 28 శాతం. 16 శాతం అనేది.. 12 శాతం, 18 శాతానికి బదులుగా రానుందని పీసీ ఝా చెప్పారు.పన్నుల వ్యవస్థలో ప్రస్తుత నిబంధనలను సరళీకృతం చేయాల్సిన అవసరాన్ని సమర్ధిస్తూ.. పన్ను రేట్ల తగ్గింపు పౌరులు.. కంపెనీల చేతుల్లో ఆదాయం పెరగడానికి దారి తీస్తుందని, తద్వారా ఆర్ధిక వృద్ధి పెరుగుతుందని రాజీవ్ చుగ్ పేర్కొన్నారు. సెమినార్లో పాల్గొన్న ప్రముఖులందరూ కూడా పన్ను చట్టాలలో మార్పుల అవసరని తమ అభిప్రాయాలను వెల్లడించారు. -
ఒకటో తరగతి ఫీజు.. రూ.4.27 లక్షలు!
అక్షరాల రూ.4.27 లక్షలు. ఇదేదో వార్షికవేతనం అనుకుంటే పొరపడినట్లే. ఇది ఎడ్యుకేషన్ ఫీజు. ‘అందులో ఏముంది ఎంబీబీఎస్ చదువుకో. ఇంజినీరింగ్ చదువుకో అంత అవుతుంది కదా’ అంటారా. ఇది కేవలం ఒకటో తరగతిలో చేరడానికి కావాల్సిన ఫీజు. అవును.. మీరు విన్నది నిజమే. వచ్చే కొత్త విద్యా సంవత్సరంలో తన కూతురు ఒకటో తరగతి స్కూల్ ఫీజును రాషబ్ జైన్ అనే వ్యక్తి ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దాంతో ఇదికాస్తా వైరల్‌గా మారింది.‘నా కుమార్తె వచ్చే ఏడాది గ్రేడ్ 1లో చేరుతుంది. అందుకోసం మా నగరంలో ప్రముఖ స్కూల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నించాం. ఆ స్కూల్ ఫీజు చూసి షాకయ్యాను. ఇతర స్కూళ్లలోనూ సుమారు ఇదే తరహా ఫీజు ఉంది. ఈ స్కూల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు: రూ.2,000, అడ్మిషన్ ఫీజు: రూ.40,000, కాషన్ మనీ (వాపసు): రూ.5,000, వార్షిక పాఠశాల ఫీజు: రూ.2,52,000, బస్ ఛార్జీలు: రూ.1,08,000, పుస్తకాలు, యూనిఫాం: రూ.20,000, మొత్తం రూ.4,27,000! ఇది భారతదేశంలో నాణ్యమైన విద్య ధర. మీరు ఏటా రూ.20 లక్షలు సంపాదించినా దీన్ని భరించలేరేమో’‘మీరు నెలకు 2000 డాలర్లు(రూ.1.68 లక్షలు) సంపాదిస్తే అందులో ఆదాయపు పన్ను, జీఎస్టీ, పెట్రోల్‌పై వ్యాట్, రోడ్డు పన్ను, టోల్ ట్యాక్స్, ఫ్రొఫెషనల్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్, ల్యాండ్ రిజిస్ట్రీ ఛార్జీలు మొదలైన వాటి రూపంలో ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. దానికితోడు టర్మ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా ప్రీమియంలు, వృద్ధాప్య పెన్షన్ కోసం పీఎఫ్, ఎన్పీఎస్ చెల్లించాలి. రూ.20 లక్షల ఆదాయం ఉంటే 30 శాతం ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ పథకాలకు అర్హత పొందలేరు. ఎలాంటి ఉచితాలు లేదా రుణ మాఫీలు పొందలేరు. అన్ని ఖర్చులు పోను మిగిలిన డబ్బుతో ఫుడ్, బట్టలు, అద్దె, ఈఎంఐలు, స్కూల్ ఫీజులు.. దేనిపై ఖర్చు చేయాలో నిర్ణయించుకోండి’ అంటూ పోస్ట్ చేశారు.Good education is a luxury - which middle class can not affordMy daughter will start Grade 1 next year, and this is the fee structure of one of the schools we are considering in our city. Note that other good schools also have similar fees.- Registration Charges: ₹2,000-… pic.twitter.com/TvLql7mhOZ— RJ - Rishabh Jain (@rishsamjain) November 17, 2024ఇదీ చదవండి: వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..ఈ పోస్ట్‌కు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఈ ఫీజు ఇలాగే కొనసాగితే 12 సంవత్సరాలలో దాదాపు రూ.కోటి-1.2 కోట్లు ఖర్చు చేయాల్సి ఉటుంది. మధ్యతరగతి వారు ఇంత అధిక ఫీజులను భరించలేరు. ఇది తీవ్రమైన సమస్య. దీనిపై ప్రభుత్వ నియంత్రణ అవసరం’ అని రిప్లై ఇస్తున్నారు. -
లక్ష్యాన్ని మించేలా పన్ను వసూళ్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు.. నిర్దేశిత రూ.22.07 లక్షల కోట్ల లక్ష్యాన్ని దాటేస్తాయని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. కార్పొరేట్, నాన్–కార్పొరేట్ పన్నుల వసూళ్లు గణనీయంగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్)లో ట్యాక్స్‌పేయర్స్ లాంజ్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. సీబీడీటీ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 మధ్య కాలంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా 15.41 శాతం పెరిగి రూ.12.11 లక్షల కోట్లకు చేరాయి.ఇదీ చదవండి: గోల్డ్ ఈటీఎఫ్‌లు కళకళమరోవైపు, 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను విదేశీ ఆదాయం, అసెట్స్‌ను తమ ఐటీఆర్‌లలో వెల్లడించని వారు సవరించిన రిటర్న్‌లను దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువుందని అగర్వాల్ పేర్కొన్నారు. ఇతర దేశాలతో ఒప్పందాల ద్వారా విదేశీ అసెట్స్ వివరాలన్నీ ఆటోమేటిక్‌గా ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అందుతాయని, ఐటీఆర్‌లలో పొందుపర్చిన వివరాలతో వాటిని సరిపోల్చి చూస్తుందని తెలిపారు. అధిక విలువ అసెట్స్‌ను వెల్లడించనివారికి ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ పంపే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఆదాయ పన్ను చట్టంలో భాషను సరళంగా, అందరికీ అర్థమయ్యే విధంగా మార్చడంపై 6,000 పైచిలుకు సలహాలు తమకు వచ్చినట్లు అగర్వాల్ పేర్కొన్నారు. -
‘సామాన్యుడిపై భారం తగ్గించండి’
బడ్జెట్ రూపకల్పనకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 2025లో ప్రకటించే కేంద్ర బడ్జెట్లో మార్పులు చేయాలంటూ కొన్ని ఆర్థిక సంస్థలు, ప్రజల నుంచి కేంద్రానికి వినతులు వస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవల కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఎక్స్ పేజ్‌ను ట్యాగ్ చేస్తూ ఓ వ్యక్తి ప్రభుత్వానికి తన అభ్యర్థనను తెలిపారు.ఎక్స్ వేదికగా తుషార్ శర్మ అనే వ్యక్తి సామాన్యుడిపై పన్ను భారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. ‘@nsitharaman దేశాభివృద్ధికి మీరు చేస్తున్న సహకారం, ప్రయత్నాలను ఎంతో అభినందిస్తున్నాను. ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీరు ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా నేను అర్థం చేసుకున్నాను. కానీ ఇది నా హృదయపూర్వక అభ్యర్థన మాత్రమే’ అని తుషార్ శర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఈ పోస్ట్‌కు స్పందిస్తూ ‘మీ మాటలు, అవగాహనకు ధన్యవాదాలు. నేను మీ అభ్యర్థనను అభినందిస్తున్నాను. నరేంద్రమోదీ ప్రభుత్వం సమస్యలపై స్పందించి చర్య తీసుకునే ప్రభుత్వం. ప్రజల అభిప్రాయాలను వింటోంది. వాటికి తగినట్లు ప్రతిస్పందిస్తోంది. మీ అభ్యర్థన చాలా విలువైంది’ అని రిప్లై ఇచ్చారు. కేంద్ర బడ్జెట్ 2025 ద్వారా మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జులైలో ఆర్థిక మంత్రి తెలిపారు.Thank you for your kind words and your understanding. I recognise and appreciate your concern.PM @narendramodi ‘s government is a responsive government. Listens and attends to people’s voices. Thanks once again for your understanding. Your input is valuable. https://t.co/0C2wzaQtYx— Nirmala Sitharaman (@nsitharaman) November 17, 2024ఇదీ చదవండి: మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!గతంలో మంత్రి స్పందిస్తూ ‘నేను మధ్యతరగతి వారికి విభిన్న రూపాల్లో మేలు చేయాలని ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. నేను పన్ను రేటును తగ్గించి వారికి ఉపశమనం ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంచాం. అదనంగా అధిక ఆదాయ వర్గాలకు పన్ను రేటు పెంచాం. సామాన్యులపై పన్ను రేట్లను తగ్గించాలనే ఉద్దేశంతోనే కొత్త పన్ను విధానం ప్రవేశపెట్టాం’ అని చెప్పారు. -
ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు కొన్నా రాయితీ
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి కొనుగోలు చేసే ప్రతీ ఎలక్ట్రిక్ వాహనానికి రాయితీ వర్తించనుంది. రిజిస్ట్రేషన్ చార్జీలు, లైఫ్ ట్యాక్స్ సహా అన్ని రకాల పన్నులు చెల్లించాల్సిన పని ఉండదు. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహన పాలసీని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించింది. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని అమలులోకి తెచ్చింది. తక్కువ వాహనాలే ఉంటాయన్న ఉద్దేశంతో.. కొనుగోలు చేసే తొలి 5 వేల కార్లకు, ద్విచక్ర వాహనాల్లో తొలి 2 లక్షల వాహనాలకు.. ఇలా అన్ని కేటగిరీలు కలిపి దాదాపు 2.25 లక్షల వాహనాలకు ఆ రాయితీలను పరిమితం చేశారు. వాటిల్లో దాదాపు 1.60 లక్షల వాహనాలు భర్తీ అయ్యాయి. కార్లలో 5 వేల పరిమితి దాటి పోయింది. కొత్తగా కార్లు కొనేవారికి రాయితీలు అందే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆ విధానాన్ని సమూలంగా మార్చాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాహనాల సంఖ్యతో ప్రమేయం లేకుండా.. ఎన్ని వాహనాలు కొన్నా, రాయితీ వర్తించేలా కొత్త విధానాన్ని ప్రకటిస్తూ జీఓ నెం.41 జారీ చేసింది. అపరిమిత రాయితీ.. గతంలో ఉన్న రాయితీ విధానాన్ని య«థావిధిగా కొనసాగిస్తూనే, రాయితీ పొందే వాహనాల సంఖ్యపై సీలింగ్ ఎత్తేసింది. ఇక నుంచి ఎంతమంది, ఎన్ని వాహనాలు కొన్నా పూర్తి రాయితీ వర్తించేలా పాలసీలో మార్పులు చేసింది. అయితే బస్సుల వరకు వచ్చే సరికి కొన్ని పరిమితులు విధించింది. ఆర్టీసీ బస్సులు, ఉద్యోగులను ఉచితంగా తరలించేందుకు వినియోగించే ప్రైవేట్ కంపెనీల బస్సులకు మాత్రం పూర్తి రాయితీలు వర్తిస్తాయి. పర్మిట్లతో నడిచే టూరిస్టు, ట్రావెల్స్ బస్సులు, విద్యార్థులను తరలించే విద్యా సంస్థల బస్సులకు ఈ రాయితీలు వర్తించవని స్పష్టం చేసింది. 2026 డిసెంబరు 31 వరకు వర్తింపు గత ప్రభుత్వం వాహనాల సంఖ్యపై సీలింగ్ విధిస్తే, ప్రస్తుత ప్రభుత్వం కాలపరిమితిని ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త విధానం ఈ సంవత్సరం నవంబరు 18 నుంచి 2026 డిసెంబరు 31 వరకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. గడువు తీరిన తర్వాత మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించింది. అప్పుడు రూ.473 కోట్లు.. ఇప్పుడు ఎంతో? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని అందుబాటులోకి తెచ్చే నాటికి రాష్ట్రంలో కేవలం పది వేల ఎలక్ట్రిక్ వాహనాలే ఉన్నాయి. ఇప్పటి వరకు 1.61 లక్షల కొత్త వాహనాలు రోడ్డెక్కాయి. కొత్తగా కొన్న వాహనాలకు (సీలింగ్ లోపు ఉన్న వాహనాలు) వర్తించిన రాయితీ మొత్తం రూ.473 కోట్లు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు భారీగా పెరిగింది. అన్ని కేటగిరీ వాహనాలు కలిపి నిత్యం 15 వరకు అమ్ముడవుతున్నాయి. వీటిల్లో ఐదారు కార్లు ఉంటున్నాయి. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో రాయితీ రూపంలో వాహన దారులకు కలిగే లబ్ధి విలువ భారీగానే ఉండనుంది. ఈ లెక్కన గతంతో పోలిస్తే రాయితీల మొత్తం మూడురెట్లు పెరుగుతుందని అంచనా. ప్రతి ఎలక్ట్రిక్ వాహనం వినియోగంతో సంవత్సరానికి రూ. లక్ష వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది (కేటగిరీ ఆధారంగా కాస్త అటూ ఇటుగా). ఆ వాహనదారుల సంగతేంటి..? గత ప్రభుత్వ విధానం ప్రకారం కొన్ని కేటగిరీల వాహనాలకు సంబంధించి సంఖ్యాపరంగా ఉన్న పరిమితి దాటిపోయింది. ఆ తర్వాత కొన్న వాహనాలకు రాయితీ రావటం లేదు. అన్నింటికి రాయితీ వర్తించేలా కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రకటించినందున, తమను వాటిల్లో భాగంగా పరిగణించాలంటూ యజమానులు కోరుతూ రవాణాశాఖ కార్యాలయాలకు ఫోన్లు చేస్తున్నారు. కానీ, కొత్త విధానం సోమవారం నుంచి అమలులోకి వస్తున్నందున, రాయితీ ఇవ్వలేమంటూ అధికారులు చెబుతున్నారు. దీంతో వారు ప్రభుత్వాన్ని అభ్యర్థించి, రాయితీ తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టారు.ఎలక్ట్రిక్ వాహనాలు కొనేలా చైతన్యం తెస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలని, ఈ దిశలో ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహన విధానంలో చేసిన మార్పులను ఆయన ఆదివారం సచివాలయంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యపై సీలింగ్ విధించటంతో కొత్తగా ఆ వాహనాలు కొనేవారికి రాయితీలు రావటం లేదని, అందుకే తాము వాటి సంఖ్యపై ఉన్న పరిమితిని తొలగించామ న్నారు. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే సంస్థలు సామాజిక బా ధ్యతగా భావించి, ప్రైవేట్‌గా చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. విద్యా సంస్థల బస్సులకు రాయితీ వర్తింపు విషయంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. -
పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల నుంచి రావాల్సిన పన్ను బకాయిలపై వడ్డీని మాఫీ చేయడం లేదంటే తగ్గించి తీసుకోవచ్చంటూ అధికారులకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) సూచించింది. నోటీసులో పేర్కొన్న మేరకు పన్ను చెల్లించడంలో జాప్యం చేస్తే నిబంధనల ప్రకారం ప్రతి నెలా 1 శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్, చీఫ్ కమిషనర్, ప్రన్సిపల్ కమిషనర్ లేదా కమిషనర్ ర్యాంక్ అధికారి ఎవరికి అయినా సరే వడ్డీని మినహాయించడం లేదంటే తగ్గించేందుకు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 220 (2ఏ) కింద అధికారులున్నట్టు సీబీడీటీ స్పష్టం చేసింది.వడ్డీ మాఫీ చేసే లేదా తగ్గించే అధికారాలపైనా స్పష్టత ఇచి్చంది. ‘‘రూ.1.5 కోట్లకుపైన వడ్డీ మాఫీ చేయడమా లేదంటే తగ్గించడమా అన్నది ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ పరిధిలో ఉంటుంది. రూ.50 వేల నుంచి 1.5 లక్షల మధ్య ఉంటే చీఫ్ కమిషనర్‌కు అధికారం ఉంటుంది. రూ.50 లక్షల వరకు వడ్డీ ప్రిన్సిపల్ కమిషనర్ లేదా ఇన్‌కమ్‌ట్యాక్స్ కమిషనర్ పరిధిలోకి వస్తుంది’’అని సబీడీడీ పేర్కొంది. ఈ నిర్ణయం పన్ను చెల్లింపుదారుల దరఖాస్తుల సత్వర పరిష్కారానికి వీలు కల్పిస్తుందని నాంజియా అండ్ కో ఎల్ఎల్పీ పార్ట్నర్ సచిన్గార్గ్ అభిప్రాయపడ్డారు.మోసం కేసులకు ఏడాదిలో పరిష్కారం ఎగుమతులు/దిగుమతుల మోసాల కేసుల విచారణలో క్షేత్రస్థాయి కస్టమ్స్ అధికారులు తటస్థంగా వ్యవహరించాలని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) కోరింది. విచారణకు ముందే సమాచారం మొత్తాన్ని విశ్లేషించి, క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించింది. కమర్షియల్ ఇంటెలిజెన్స్ ఫ్రాడ్ కేసుల్లో విచారణను ఏడాది దాటకుండా ముగించాలని కూడా కోరింది. -
పన్నుల ప్రణాళిక.. ఎగవేత మధ్య తేడా!
పన్నుల ఎగవేతకు, ప్రణాళికబద్ధంగా పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి గల తేడాలకు సంబంధించి నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇంగ్లీషులో Tax Evasion అంటే ఎగవేత.. ఇంగ్లీషులో Tax Planning అంటే ప్లాన్ చేయడం. ప్లాన్ చేయడం వల్ల Tax Avoidance చేయవచ్చు. ఎగవేత నేరపూరితం. ప్లానింగ్ చట్టబద్ధమైనది. వివరాల్లోకి వెళితే..పన్నుల ప్రణాళిక లక్ష్యాలుచట్టంలో ఉన్న అంశాలకు లోబడి ప్లాన్ చేయడం.అన్ని వ్యవహారాలు, బాధ్యతలు చట్టప్రకారం ఉంటాయి.చట్టప్రకారం అవకాశం ఉన్నంతవరకు పన్ను భారాన్ని తగ్గించుకోవడం.ఇదొక హక్కులాంటిది .. శాస్త్ర సమ్మతమైనది.పన్ను ఎగవేత: ఉద్దేశాలుచట్టంలో అంశాలను ఉల్లంఘించడం.జరిగే వ్యవహారాలు చట్టానికి వ్యతిరేకంగా ఉంటాయి.ఉద్దేశపూర్వకంగా పన్ను తప్పించుకునే మార్గాల అమలు.ఇది నేరం. చట్టవిరుద్ధం.పన్నుల ఎగవేతలో కావాలని పన్నులు కట్టకుండా ఎగవేయడం ఉంటుంది. అది చట్టవిరుద్ధం. అనైతికం. అబద్ధాలు చెప్పి, తప్పులు చేసి, ఎన్నో కుతంత్రాల ద్వారా ఆదాయాన్ని దాచి, దోచి.. పన్నులను కట్టకపోవడం కిందకు వస్తుంది. ఎన్నో మార్గాలను వెతుక్కుని, అమలుపర్చి తద్వారా పన్నులు ఎగవేస్తారు. మోసపూరితమైన వ్యవహారాలు, మోసపూరితమైన సమాచారం, లెక్కలు.. ఇవన్నీ అభ్యంతరకరం. చట్టరీత్యా నేరం. ఎండమావుల్లాగా ప్రయోజనం అనిపిస్తుంది. కానీ ప్రయోజనం ఉండదు. ఎన్నెన్నో ఉదాహరణలు. ఎన్నో మార్గాలు. అడ్డదార్లు. ఎందరో మనకు తారసపడతారు. మెరిసిపోతుంటారు. మురిసిపోతుంటారు. వెలిగిపోతుంటారు. కానీ ఇవన్నీ తాత్కాలికం. ఇలాంటి వారిపై చట్టపరంగా శిక్షలు తీవ్రంగానే ఉంటాయి. వడ్డీలు వడ్డిస్తారు. పెనాల్టీలు వేస్తారు. కటకటాల పాలు కావచ్చు. ఎన్నో చట్టాలు వారిని పట్టుకుంటాయి.ఇదీ చదవండి: అత్యవసర నిధికి నిజంగా ‘బంగారం’ అనుకూలమా?పన్నుల ప్లానింగ్ఇక పన్నుల ప్లానింగ్‌లో ఓ పద్ధతి ఉంటుంది. ఇది చట్టానికి లోబడి ఉంది. నైతికంగా ఉంటుంది. అబద్ధం ఉండదు. తప్పు ఉండదు. కుతంత్రం ఉండదు. ఆదాయాన్ని దోచడం ఉండదు. దాచడం ఉండదు. పన్నులు పడకుండా జాగ్రత్త పడటం.. పన్నుల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం మోసపూరితం కాదు. లెక్కలు గానీ, సమాచారం గానీ మోసపూరితమైనదిగా ఉండదు. అతిక్రమణ ఉండదు. ప్రయోజనం ఉంటుంది. పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్నెన్నో సక్రమమైన మార్గాలు ఉన్నాయి. 2024 సంవత్సరం 10 కోట్ల 41 లక్షల మంది రిటర్నులు వేశారు. లక్ష మంది వారి ఆదాయం కోటి రూపాయలు ఉన్నట్లు చెబుతున్నారు. వీరే మనకు ఆదర్శవంతులు. మనకు కట్టాల్సిన పన్నుల వివరాలు వెల్లడించడం ద్వారా చట్టప్రకారం అన్ని ప్రయోజనాలు దొరుకుతాయి. ఎటువంటి శిక్షలు ఉండదు. మనం ఈ మార్గాన్నే అనుసరిద్దాం.-కె.సీ.హెచ్ ఏ.వీ.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
నవంబర్ నుంచి కొత్త రూల్స్ ఇవే
-
మద్యంపై కూటమి సర్కారు పన్నుల మోత
-
‘చెత్త’ పన్ను..చంద్రన్న ఘనతే
సాక్షి, అమరావతి: నిజం చెబితే తల వెయ్యి ముక్కలైపోతుందని చంద్రబాబుకు ముని శాపం ఉందంటారు! అందుకే ఆయన ఎప్పుడూ నిజం చెప్పరు. పైగా తాను చేసిన తప్పులను ఇతరులపై నెట్టేసి మంచిని మాత్రం తన ఖాతాలో వేసుకుంటారు. గత ప్రభుత్వం పురపాలక సంఘాల్లో చెత్త పన్ను విధించి ప్రజలను ఇబ్బంది పెట్టిందని డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీసిన సీఎం చంద్రబాబు అసలు విషయాన్ని దాచిపెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అసలు ఇళ్ల నుంచి చెత్త సేకరణకు యూజర్ చార్జీల పేరుతో డబ్బులు వసూలు ప్రారంభించిందే తానేననే విషయాన్ని కప్పిపుచ్చి మభ్యపెడుతున్నారు.⇒ 2014లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సమాజాన్ని సమూలంగా మార్చేస్తామని, వీధుల్లో చెత్త అనేది లేకుండా చేస్తానని గొప్పగా ప్రకటించారు. తీరా కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టి వీధుల్లో చెత్తను తీసుకెళ్లి నగరం నడి»ొడ్డున గుట్టలుగా వేశారు. దాంతో అవి కొండల్లా పెరిగిపోయి ప్రజలకు రోగాలను తెచ్చిపెట్టాయి. ఈ పని చేసినందుకు ప్రతి ఇంటి నుంచి చెత్త పన్ను వసూలును ఆయన ఆనాడే ప్రారంభించారు. మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు ప్రజల నుంచి చార్జీల వసూలుకు ఆయా పాలక మండళ్లలో తీర్మానాలు చేయించారు. మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి నిధులు రావాలంటే చెత్త సేకరణ చార్జీలు చెల్లించాలని నాడు చంద్రబాబే ప్రచారం చేశారు. 2016లో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోను చెత్త సేకరణకు ఫీజు (చెత్త పన్ను) విధించి అమలు చేశారు. ⇒ గుంటూరులో దుకాణాలు, థియేటర్లు, ప్రైవేట్ హాస్టళ్లు, ఫంక్షన్ హాళ్లు, సూపర్ మార్కెట్లు, టీస్టాళ్ల నుంచి చెత్త తరలించేందుకు యూజర్ చార్జీలు వసూలు చేయాలని నాటి టీడీపీ సర్కారు ఉత్తర్వుల మేరకు నగరపాలక సంస్థ 2015 ఏప్రిల్‌లో తీర్మానించింది. విస్తీర్ణం, జనాభాను బట్టి గరిష్టంగా రూ.6 వేలు, కనిష్టంగా రూ.200 వసూలు చేయాలని నిర్ణయించారు. అదే ఏడాది మే నెలలో చెత్తను రోడ్లపై వేసినా, తగులబెట్టినా భారీగా జరిమానా విధిస్తూ నిర్ణయించారు. ఈమేరకు 2016 జూన్ 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్టు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.⇒ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ)లో 2018 డిసెంబర్ నుంచి మున్సిపల్ సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ రూల్స్–2016 ప్రకారం స్వచ్ఛ భారత్ మిషన్‌కు అనుబంధంగా ఘన వ్యర్థాల నిర్వహణను పటిష్టంగా అమలు చేసేందుకు యూజర్ చార్జీలు వసూలు చేయాలని చట్టం చేశారు. ప్రతి ఇంటికీ నెలకు రూ.50 చొప్పున, వాణిజ్య సముదాయాలైన సినిమాహాళ్లు, హోటళ్ల నుంచి రూ.5 వేలు, ఇతర సంస్థల నుంచి రూ.1,500 వసూలు చేశారు. ‘క్లాప్’తో మార్పు తెచ్చిన జగన్ ప్రభుత్వం పట్టణాలు, గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు స్వచ్ఛ భారత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ను స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు 2021 అక్టోబర్ 2న వైఎస్ జగన్ ప్రభుత్వం ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని సుమారు 43 లక్షల గృహాల్లో ప్రతి ఇంటికీ రెండు చొప్పున 1.20 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీ చేసింది.చెత్తను ఇంటివద్దే సేకరించి గార్బేజ్ స్టేషన్లకు తరలించేందుకు పీపీపీ విధానంలో 3,097 డీజిల్ ఆటో టిప్పర్లను, మరో 1,123 ఎలక్ట్రిక్ ఆటోలను రూ.60 కోట్లకు కొనుగోలు చేశారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను శుద్ధి చేసేందుకు మున్సిపాలిటీల్లో 243 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను(జీటీఎస్) రూ.227.89 కోట్లతో నిర్మాణం చేపట్టింది. మురుగు శుద్ధికి ఎస్టీపీల నిర్మాణం, ఎప్పటి నుంచో పట్టణాల్లో పేరుకుపోయిన చెత్త డంపింగ్ యార్డ్ల్లోని లెగస్సీని తరలించే ప్రక్రియను సైతం చేపట్టింది. ఏడాది కాలంలోనే సుమారు రూ.2 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చి పట్టణాలు, నగరాలకు కొత్త రూపు తీసుకొచ్చింది. బాబు తప్పును సరిదిద్దిన జగన్⇒ టీడీపీ హయాంలో పన్ను విధించి మరీ వసూలు చేసిన చెత్తను జనావాసాల మధ్యే డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి పారేయడంతో 123 మున్సిపాలిటీల్లో దాదాపు 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. దుర్వాసనతో పాటు ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించడంతో గత ప్రభుత్వ హయాంలో తరలింపునకు చర్యలు చేపట్టడంతో పాటు 243 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను(జీటీఎస్) ఏర్పాటు చేసింది. వివిధ రకాల చెత్తను వేరుచేసి ఎరువు, విద్యుత్ కోసం వినియోగించారు. గుంటూరు, విశాఖపట్నం వద్ద చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. ⇒ జగన్ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి. గతంలో కొండల్లా పేరుకుపోయిన చెత్తలో దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నులను వివిధ రూపాల్లో కరిగించారు. పట్టణాల్లో మధ్యలో ఉన్న డంపింగ్ యార్డులను పూర్తిగా తొలగించారు. 2021లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విజయవాడ తిరుపతి, విశాఖపట్నంతో పాటు పుంగనూరు, నెల్లూరు బెస్ట్ అవార్డులు అందుకున్నాయి. 2022లో కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో టాప్–10 నగరాల్లో ఆరు రాష్ట్రానికే దక్కాయి. 2023లోనూ రాష్ట్రంలోని పలు నగరాలు అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన ఎన్జీటీ బృందం ఉత్తమ పారిశుధ్య విధానాలు, చెత్త నిర్వహణను అభినందించింది. ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించని రాష్ట్రాలకు భారీస్థాయిలో జరిమానా విధించింది. -
చెత్త పన్ను కొత్త రూపంలో..
సాక్షి, అమరావతి: చెత్త పన్ను రద్దుపై చంద్రబాబు సర్కారుది కపట నాటకమని స్పష్టమవుతోంది. గత ప్రభుత్వం పట్టణాల్లోని ప్రజలపై చెత్త పన్ను వేసిందని, ఆ పన్నును రద్దు చేస్తున్నట్టు బహిరంగంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు అదే పన్నును మరో రూపంలో వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. పైగా, గత ప్రభుత్వం చెత్త సేకరణ వాహనాలు సమకూర్చిన 40 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనే చెత్త పన్ను వసూలు చేయగా, ఇప్పుడ చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని 123 పట్టణాలు, కార్పొరేషన్లలో వసూలుకు రంగం సిద్ధం చేసింది. ఈమేరకు అన్ని పట్టణ స్థానిక సంస్థలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. చెత్త పన్ను అని చెప్పకుండా, సరీ్వస్ ఛార్జీల రూపంలోనో, మరో రూపంలోనో ఈ మొత్తాన్ని వసూలు చేసుకోవాలని సూచించింది. దీంతోపాటు రూ. 32 కోట్ల పాత బకాయిలు కూడా ప్రజల నుంచే వసూలు చేయాలని చెప్పినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. నాడు స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా..మున్సిపాలిటీల్లో ప్రజలకు అందిస్తున్న సేవలకు, ముఖ్యంగా స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ఇంటి నుంచి చెత్త సేకరించినందుకు స్థానిక సంస్థలు సేవా రుసుం వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ 2021 అక్టోబర్ 2న నాటి ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) పేరుతో మున్సిపాలిటీల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు ప్రారంభించింది. ప్రతి ఇంటికీ 3 చెత్త డబ్బాలు అందించి, వాటిలో వేసిన చెత్తను సేకరించేవారు. ఇందుకోసం 40 మున్సిపాలిటీల్లో 4 వేల చెత్త సేకరణ వాహనాలను సమకూర్చింది. ఇంటి నుంచి చెత్త సేకరణ, వాహనాల నిర్వహణకు అవి తిరిగే వార్డుల్లో నెలకు ఇంటికి రూ.30, వాణిజ్య సముదాయాలకు రూ.150 చొప్పున సేవా రుసుముగా నిర్ణయించారు. రద్దు చేసినట్లే చేసి.. కొత్త పన్నా?కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను బలవంతంగా విధిస్తోందని, ఎవరూ చెల్లించొద్దని పదేపదే చెప్పారు. అంతేగాక తాము అధికారంలోకి వచ్చాక ఆ పన్నును రద్దు చేస్తామని ప్రకటించారు. ఇటీవల సీఎం చంద్రబాబు కూడా చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు బయటకు ప్రకటించారు. కానీ, చెత్త సేకరించినందుకు కొంత మొత్తాన్ని మున్సిపాలిటీలే సర్వీస్ చార్జీలు వసూలు చేసుకోవాలని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు పురపాలక శాఖలోని ముఖ్యులు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అంతేగాక చెత్త సేకరణ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేటు ఆపరేటర్లు, వాహనాలకు 2023 సెప్టెంబర్ నుంచి చెల్లించాల్సిన రూ.32 కోట్లను మున్సిపాలిటీలే చెల్లించాలని, ఆ సొమ్మును కూడా ప్రజల నుంచే తీసుకోవాలని చెప్పడం గమనార్హం. చెత్త పన్ను రద్దు చేస్తామని ప్రకటించినందున, ఆ పేరుతో కాకుండా మరో రూపంలో వసూలు చేయాలని మున్సిపాలిటీలను ఆదేశించినట్టు సమాచారం. అంటే ప్రస్తుతం మున్సిపాలిటీలకు చెల్లిస్తున్న ఏదో ఒక పన్నులో ఈ మొత్తాన్ని కలిపి వసూలు చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
రూ.100 గెలిస్తే ఇచ్చేది మాత్రం రూ.68!
నిత్యం దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట ఫలానా వ్యక్తి లాటరీ గెలుచుకున్నారని వింటూంటాం. ఒకవేళ ఆ వ్యక్తి రూ.100 లాటరీ ద్వారా గెలుపొందితే ట్యాక్స్‌లు పోను తనకు చివరకు అందేది దాదాపు రూ.68 మాత్రమే. మిగతా రూ.32లు వివిధ ట్యాక్స్‌ల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అసలు లాటరీ పొందిన వారికి ఎలాంటి ట్యాక్స్‌లు విధిస్తున్నారు. అది ఎంత మొత్తంలో కట్టాల్సి ఉంటుందో తెలుసుకుందాం.కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్ పాషా అనే స్కూటర్ మెకానిక్ ఇటీవల ఏకంగా రూ.25 కోట్ల లాటరీ గెలుపొందారు. కేరళ ప్రభుత్వం నిర్వహించే తిరుఓనమ్ లాటరీలో పాల్గొనేందుకు రూ.500 పెట్టి టికెట్ కొన్నారు. ఈ నెల 9న తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డ్రా తీశారు. అందులో అల్తాఫ్ ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నట్లు ప్రకటించారు. అయితే ప్రభుత్వ ట్యాక్స్‌లో పోను చివరకు తనకు అందేది మాత్రం సుమారు రూ.17.25 కోట్లు కావడం గమనార్హం. అంటే రూ.7.8 కోట్లమేర ట్యాక్స్ కట్ అవుతుంది.ఇదీ చదవండి: ఎప్పటికీ మారనిది ఏంటో చెప్పిన టాటాట్యాక్స్లు ఇలా..ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194బీ కింద లాటరీలో గెలుపొందిన డబ్బుపై 30 శాతం పన్ను చెల్లించాలి. ఈ 30 శాతం పన్నుపై అదనంగా మరో నాలుగు శాతం వరకు సర్‌ఛార్జీ, సెస్ రూపంలో ట్యాక్స్ కట్టాలి. దాంతో మొత్తం సమకూరిన సొమ్ముపై 31.2 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సర్‌ఛార్జీ, సెస్‌ను ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, విద్యకు వెచ్చించాల్సి ఉంటుంది. ముందుగానే సదరు లాటరీ సంస్థలు టీడీఎస్(మూలం వద్ద పన్ను కోత) రూపంలో పన్ను కట్ చేసుకుని మిగతా డబ్బు విజేతలకు ఇస్తారు. లాటరీ ద్వారా గెలుపొందిన డబ్బు రెగ్యులర్ ఇన్కమ్ కిందకు రాదు. అది ‘ఇతర ఆదాయం’ విభాగంలోకి వస్తుంది. కాబట్టి బీమాకు సంబంధించిన 80డీ కింద ప్రభుత్వం గరిష్టంగా ఇచ్చే రూ.50 వేలు, 80సీ కింద ఇచ్చే రూ.1.5 లక్షలు పన్ను వెసులుబాటుకు అనర్హులుగా పరిగణిస్తారు. -
ఇదే జరిగితే.. భారత్‌కు భలే ఛాన్స్!
చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలపై 45 శాతం వరకు సుంకాలను విధించేందుకు ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, పోలాండ్ వంటి యూరప్ దేశాలు ఓటు వేయగా.. జర్మనీతో పాటు మరో నాలుగు దేశాలు వ్యతిరేకంగా ఓటువేశాయి. యూరోపియన్ యూనియన్ ట్యాక్స్ పెరుగుదల వాణిజ్యం మీద గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలపై 45 శాతం అమలు చేయడం ప్రారంభమైతే.. ఐదేళ్లపాటు కొనసాగుతుందని చెబుతున్నారు. ఇదే జరిగితే భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్ ఉత్పత్తులు మరిన్ని దేశాలకు ఎగుమతవుతాయి. తద్వారా ఉత్పత్తి శాతం కూడా భారీగా పెరుగుతుంది.అమెరికా కూడా ఇప్పటికే చైనా ఉత్పత్తుల మీద సుంకాలను భారీగా పెంచింది. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలోనే యూఎస్ ప్రకటించింది. ఇప్పటికే యూరప్ దేశాల్లో చైనీస్ దిగుమతుల మీద టారిఫ్ రేట్లు 35 శాతం వరకు ఉంటాయి. కొత్త విధానంలో మరో 10 శాతం పెరుగుతుంది.ఇదీ చదవండి: 'ఐఫోన్ 16 ప్రో'పై అసంతృప్తి: సెట్ చేసుకోవడానికి 24గంటలుచైనా ఎలక్ట్రిక్ వెహికల్ తయారీదారులు ఈ టారిఫ్‌లను స్వీకరిస్తారా? స్వీకరిస్తే.. వాహనాల ధరలను పెంచుతారా? అనేది తెలియాల్సి ఉంది. అదనపు సుంకాల కారణంగా ఐరోపాలో ఇప్పటికే చైనీస్ కార్ల అమ్మకాలను గణనీయంగా తగ్గాయి. ఇప్పుడు 45 శాతం సుంకం అమలులోకి వస్తే.. అమ్మకాల పరిస్థితి ఎలా ఉంటుందో త్వరలోనే తెలుస్తుంది. -
పన్ను ఆదాయం 35 శాతమే
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రాష్ట్ర పన్ను ఆదాయం ఆపసో పాలు పడుతోంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 5నెలల తర్వాత కూడా బడ్జెట్ అంచనాల్లో కేవలం 35.11% మాత్రమే పన్ను రాబడులు వచ్చాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.64 లక్షల కోట్లు పన్ను ఆదా యం కింద వస్తుందని రాష్ట్ర ప్రభు త్వం అంచనా వేయగా, ఆగస్టు 31 నాటికి కేవలం రూ.57వేల కోట్లు మాత్రమే వచ్చింది. గత ఏడాది ఐదు నెలల పన్ను ఆదాయంతో పోలిస్తే ఇది ఒక శాతం తక్కువ కావడం గమనార్హం. ఇందులో వస్తు సేవల పన్ను (జీఎస్టీ), అమ్మకపు పన్ను ద్వారానే రూ.33,987 కోట్లు వచ్చాయి. ఎక్సైజ్ ఆదాయం ఆశించిన మేర రాకపోవడం, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ల రూపంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు మోక్షం కలగకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ పట్టిక ఇబ్బందులు పడుతోందని ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించిన గణాంకాలు చెబుతు న్నాయి. పన్ను ఆదాయం రాని కారణంగా అప్పులు కూడా భారీగానే చేయాల్సి వచ్చిందని ఈ లెక్కలు చూస్తే అర్థమవుతుంది. తొలి అర్థ సంవత్సరంలో ఐదు నెలలు ముగిసేసరికి సుమారు రూ.30వేల కోట్ల అప్పు చేయాల్సి వచ్చింది. బహిరంగ మార్కెట్ ద్వారా ఈ రుణాలను సేకరించగా, అందులో రూ.10వేల కోట్లకు పైనే గతంలో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే కట్టాల్సి వచ్చింది. ఇక, ఈ ఏడాది మూల ధనవ్యయం కింద రూ.32 వేల కోట్లు ఖర్చు పెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఐదు నెలల్లో కేవలం రూ. 8,327కోట్లు మాత్రమే వెచ్చించడం గమనార్హం. ఇక, ప్రధాన ఖర్చుల్లో రెవెన్యూ పద్దు కింద రూ.35వేల కోట్లకు పైగా ఖర్చయింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు రూ.18,152 కోట్లు, పింఛన్లకు రూ.7,165 కోట్లు, వివిధ రకాల ప్రభుత్వ సబ్సిడీల కింద రూ.5,396 కోట్లు ఖర్చయ్యాయని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. -
విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దు
కేంద్ర ప్రభుత్వం ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పన్ను తొలగింపు నిర్ణయిం ఈరోజు నుంచే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం టన్ను ముడి చమురుపై రూ.1,850 వరకు విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను వసూలు చేస్తున్నారు.కేంద్రం జులై 19, 2022 నుంచి విండ్‌ఫాల్ పన్నును విధించింది. ఈ ట్యాక్స్ అమల్లోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా తొలగించడం ఇది రెండోసారి. చివరిసారి ఏప్రిల్ 4, 2023న ఈ ట్యాక్స్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రైవేట్ రిఫైనర్లు స్థానికంగా చమురు ఉత్పత్తులను విక్రయించడానికి బదులు అధిక మార్జిన్ల కోసం విదేశాల్లోని రిఫైనరీలకు అమ్ముతుంటారు. దాన్ని అరికట్టడానికి ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్ విధిస్తుంది. 2022 నుంచి గ్యాసోలిన్, డీజిల్, విమాన ఇంధనాల ఎగుమతులపై పన్నును పొడిగిస్తూ వచ్చారు. ప్రస్తుతం దాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.ఇదీ చదవండి: నాలుగేళ్లుగా ఉన్న ఆంక్షలు ఎత్తివేత!కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31న దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ.2,100గా ఉండే విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను రూ.1,850కి తగ్గించింది. పెట్రోలియం ఉత్పత్తులపై రూ.2,400గా ఉన్న లెవీని రూ.2,100కి చేర్చింది. ప్రభుత్వం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ పన్నుకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తోంది. గ్లోబల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర ఏప్రిల్‌లో బ్యారెల్‌కు 92 యూఎస్ డాలర్లుగా ఉండేది. ప్రస్తుతం అది 75 డాలర్లకు పడిపోయింది. -
వంట నూనెల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
-
ట్యాక్స్ తక్కువ, నిరుద్యోగ నిధి.. చిన్న దేశంలో బెంగళూరు జంట
చాలా మంది ఉద్యోగం చేసి డబ్బు సంపాదించడానికి లేదా కొత్త పద్ధతులు, విధానాలకు ఆకర్షితులై ఇండియా వదిలి విదేశాల్లో నివాసముండిపోతున్నారు. అయితే ఇటీవల బెంగళూరుకు చెందిన 'ప్రతీక గుప్తా, నేహా మహేశ్వరి' దంపతులు జంట ట్యాక్స్ తగ్గుతుందని, ఎక్కువ పొదుపు చేయొచ్చని, ఇతరత్రా ప్రయోజనాల దృష్ట్యా యూరోపియన్ దేశమైన లక్సెంబర్గ్‌లో స్థిరపడ్డారు. అక్కడ స్థిరపడటం వల్ల లాభాలు ఏంటనే విషయాలను కూడా వారు వెల్లడించారు.ప్రతీక గుప్తా అమెజాన్ కంపెనీలో సీనియర్ అనలిస్ట్‌గా, నేహా శర్మ రియర్ ఎస్టేట్ కంపెనీలో ఫైనాన్స్ మేనేజర్ ఉద్యోగాలు చేశారు. ఇండియాలో పనిచేయడం వల్ల ఇంక్రిమెంట్స్ వచ్చేవి. అయితే దుబాయ్ లేదా అమెరికాలలో ఉద్యోగాలు చేసే చాలా డబ్బు సంపాదించవచ్చని పేర్కొన్నారు.దుబాయ్, అమెరికాల కంటే యూరప్ దేశాలలో జీవన నైపుణ్యం బాగుందని వారు వెల్లడించారు. డబ్బు సంపాదించాలనుకునే వారు యూరప్ దేశాలకు రావడం తక్కువే. అయితే ట్యాక్స్ విషయానికి వచ్చేసరికి ఇండియా కంటే కూడా యూరప్‌లో తక్కువ. ఇది మాత్రమే కాకుండా అక్కడ కొన్ని సర్వీసులు కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయని ప్రతీక, నేహా చెప్పుకొచ్చారు. ఇక్కడ మన సంపాదనలో మూడు శాతం తప్పనిసరిగా ఆరోగ్యభీమాకు అందించాలి.ఇదీ చదవండి: వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించిన టీచర్లక్సెంబర్గ్లో ప్రతీక్, నేహలకు ఇష్టమైన మరో అంశం నిరుద్యోగ నిధి. దీనికి వారిరువురు.. తమ ఆదాయంలో రెండు శాతం విరాళంగా ఇవ్వాలి. ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఎవరైనా ఉద్యోగం కోల్పోతే.. రెండు సంవత్సరాలు లేదా ఉద్యోగం దొరికే వరకు చివరగా తీసుకున్న జీతంలో 80 శాతం ప్రభుత్వమే అందిస్తుందని వారు వివరించారు.లక్సెంబర్గ్‌లో నివసించడం వల్ల లభించే మరో ప్రయోజనం ఏమిటంటే.. ఇక్క లగ్జరీ కార్ల ధరలు కూడా చాలా తక్కువ. నేహా, ప్రతీక్ దంపతులకు అక్కడ మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ కారు ఉంది. ఈ కారు ధర మన దేశంలో రూ. 50 లక్షల కంటే ఎక్కువ. కానీ లక్సెంబర్గ్‌లో దీని ధర కొంత తక్కువే. -
ప్రజలపై ట్యాక్స్ పిడుగు.. భారీగా పెరిగిన వెహికల్స్ ధరలు
కార్లు, బైకుల ధరలను అప్పుడప్పుడు తయారీ సంస్థలే పెంచుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వమే వెహికల్ ట్యాక్స్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడి వాహనాల ధరలు మరింత పెరుగుతాయి.పంజాబ్ ప్రభుత్వం ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్స్ మీద మోటార్ వెహికల్ ట్యాక్స్‌ను 05 నుంచి 1 శాతానికి పెంచింది. త్వరలో పండుగ సీజన్.. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వాహన అమ్మకాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది.పంజాబ్ రవాణాశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రూ. 15 లక్షల విలువైన ప్యాసింజర్ వాహనాలపైన ట్యాక్స్ 9 నుంచి 9.5 శాతానికి పెంచింది. దీంతో వాహనాలపై చెల్లించాల్సిన పన్ను రూ. 7000 నుంచి రూ. 20వేలకు పెరిగింది. అదే సమయంలో రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల విలువైన వాహనాలపైన ట్యాక్స్ 11 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది. రూ. 25 లక్షల కంటే ఎక్కువ విలువైన వాహనాలపైన ట్యాక్స్ 13 శాతంగా ఉంది.ఇదీ చదవండి: రూ.30 లక్షల జీతం.. ట్రైన్లోనే ప్రయాణం: ఓ టెకీ సమాధానం ఇదేఇక ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే.. రూ. 1 లక్ష కంటే తక్కువ ఖరీదైన ద్విచక్ర వాహనాల మీద ట్యాక్స్ 7 శాతం నుంచి రూ. 7.5 శాతానికి పెరిగింది. అలాగే రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల ఖరీదైన వాహనాలపైన ట్యాక్స్ 10 శాతంగా ఉంది. రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన టూ వీలర్స్ మీద ప్రభుత్వం ట్యాక్స్‌ను 11 శాతానికి చేర్చింది.పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వాహనాలపైన పెంచిన ట్యాక్స్.. తక్షణమే అమలులోకి వస్తుంది. దీంతో కార్లు, బైకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ట్యాక్స్ పెరుగుదల అమ్మకాలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం త్వరలోనే తెలుస్తుంది. -
Supreme Court: ఆ బకాయిలను రాష్ట్రాలకు చెల్లించాల్సిందే
న్యూఢిల్లీ: ఖనిజ సంపన్న రాష్ట్రాలకు శుభవార్త. గనులకు సంబంధించిన రాయల్టీ, పన్నుల తాలూకు బకాయిలను కేంద్రం నుంచి వసూలు చేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. 2005 ఏప్రిల్ 1 నుంచీ బకాయిలను వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది. బకాయిలను 12 ఏళ్లలోపు చెల్లించాలని కేంద్రాన్ని, వాటిపై పెనాలీ్టల వంటివేమీ విధించొద్దని రాష్ట్రాలను ఆదేశించింది.ధర్మాసనం తరఫున సీజేఐ తీర్పు రాశారు. ఖనిజాలు, నిక్షేపాలున్న భూములపై రాయల్టీ వసూలు అధికారం కేంద్రానిదేనన్న 1989 నాటి సుప్రీంకోర్టు తీర్పును పలు రాష్ట్రాలు సవాలు చేశాయి. గనులు, ఖనిజాలపై రాయల్టీ విధించే అధికారం రాష్ట్రాలకే ఉంటుందంటూ 8:1 మెజారిటీతో జూలై 25న ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీన్ని 1989 నుంచీ వర్తింపయాలని పలు రాష్ట్రాలు కోరాయి. దీన్ని కేంద్రం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇందుకు ఒప్పుకుంటే సంబంధిత ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్రాలకు రూ.70 వేల కోట్ల మేరకు చెల్లించాల్సి రావచ్చని తెలిపింది. కనుక తీర్పును జూలై 25 నుంచే వర్తింపజేయాలని అభ్యర్థించింది. దీన్ని ధర్మాసనం తాజాగా తోసిపుచి్చంది. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు అప్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు ఆగస్టు 11వ తేదీ వరకూ 22.48 శాతం పెరిగి (గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం వరకూ పోల్చి) 6.93 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో వ్యక్తిగత పన్ను వసూళ్లు రూ.4.47 లక్షల కోట్లు. కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.2.22 లక్షల కోట్లు. సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) వసూళ్లు రూ.21,599 కోట్లు. ఇతర పన్నులు (లెవీ అండ్ గిఫ్ట్ ట్యాక్స్ రూ.1,617 కోట్లు. స్థూలంగా చూస్తే.. ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 11 మధ్య రిఫండ్స్ రూ.1.20 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో పోలి్చతే రిఫండ్స్ 33.49 శాతం పెరిగాయి. వీటిని కూడా కలుపుకుంటే స్థూలంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 24 శాతం పెరిగి రూ.8.13 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.4.82 లక్షల కోట్లుకాగా, కార్పొరేట్ పన్ను రూ.3.08 లక్షల కోట్లు ఉన్నాయి. కొన్ని ముఖ్యాంశాలు... → ఏప్రిల్‌తో ప్రారంభమైన 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.22.07 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లను బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది. 2023 –24కన్నా ఈ మొత్తాలు 13 శాతం అధికం. → 2023–24లో ఆర్జించిన ఆదాయానికి సంబంధించిన దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌ల పెరుగుదల నేపథ్యంలో అధిక పన్ను వసూళ్లు జరిగాయి. తమ ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం లేని వ్యక్తులు, సంస్థలు ఐటీఆర్‌లను ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. ఈ గడువు నాటికి రికార్డు స్థాయిలో 7.28 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. -
రూ.341 కోట్ల జీఎస్టీ ఎగవేత!.. బజాజ్ ఫైనాన్స్‌కు నోటీసు
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (DGGI) బజాజ్ ఫైనాన్స్‌కి షోకాజ్ నోటీసు జారీ చేసింది. సుమారు రూ.341 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించిన ఆగస్టు 3 డీజీజీఐ ఈ నోటీసు పంపింది.కేంద్ర పన్ను నిబంధనల ప్రకారం.. మినహాయింపు ప్రయోజనాలను పొందేందుకు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ సర్వీస్/ప్రాసెసింగ్ ఛార్జీలను వడ్డీగా పరిగణించడం ద్వారా జీఎస్టీని ఎగవేస్తోందని ఇంటెలిజెన్స్ వెల్లడించింది. అయితే ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మొత్తం రూ. 850 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంది.రూ. 341 కోట్ల పన్ను ఎగవేత, రూ. 150 కోట్ల వడ్డీ మాత్రమే కాకుండా.. జూన్ 2022 నుంచి మార్చి 2024 వరకు రోజుకు రూ. 16 లక్షల జరిమానా విధించింది. మొత్తం మీద బజాజ్ ఫైనాన్స్ రూ.850 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉందని సమాచారం. దీంతో కంపెనీకి మొత్తం 160 పేజీల నోటీసు పంపింది.వస్తువులను కొనుగోలు చేయడానికి లోన్ పొందిన వారి నుంచి బజాజ్ ఫైనాన్స్ ముందస్తు వడ్డీ వసూలు చేస్తోంది. డీజీజీఐ దీనికి కూడా టాక్స్ చెల్లించాలని పేర్కొంది. కానీ బజాజ్ ఫైనాన్స్ దీనిని నాన్-టాక్సబుల్ 'వడ్డీ ఛార్జీ'గా వర్గీకరించింది. దీంతో అధికార యంత్రాంగం సమస్యను లేవనెత్తింది. -
ఎన్ఫోర్స్మెంట్.. సెటిల్మెంట్స్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పట్టుకొమ్మ లాంటి పన్నుల శాఖ.. కొన్నిరోజులుగా ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులతో కునారిల్లుతోంది. ముఖ్యంగా ఆ శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేస్తున్న అధికారులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ విభాగంలో పనిచేస్తున్న వారిపై ఏకంగా ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేసేవరకు వ్యవహారం వెళ్లిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. పన్నుల శాఖలో పాలన గాడి తప్పడం, ఎవరు ఏం చేస్తున్నారన్న దానిపై పర్యవేక్షణ కొరవడటంతో.. ప్రభుత్వానికి రావాల్సిన వేల కోట్ల రూపాయలు అధికారులు, వ్యాపారుల జేబుల్లోకి వెళుతున్నాయని అంటున్నాయి. మరోవైపు శాఖలోని అంతర్గత లావాదేవీల్లో కూడా అవినీతి గుప్పుమంటోందని, ఇటీవల జరిగిన ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే పన్నుల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వీ.. ఈ ఆరోపణలు, విమర్శలపై ఫోకస్ చేశారు. మూడు రోజులుగా అన్నిస్థాయిల్లోని అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విభాగమే కీలకం పన్నుల శాఖ అదనపు కమిషనర్ నేతృత్వంలో డిప్యూటీ కమిషనర్లు, సీటీవోలు, డీసీటీవోలు, ఏసీటీవోలు కలిపి 20 మంది వరకు ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేస్తుంటారు. రాష్ట్రంలో పన్ను కట్టాల్సిన వ్యాపారాలన్నింటిపై ఈ విభాగం నిఘా పెట్టాల్సి ఉంటుంది. తప్పుడు వేబిల్లులు చూపించి లేదా బిల్లులు లేకుండా జీరో వ్యాపారం చేస్తున్నవారు, వ్యాపార లావాదేవీలను తక్కువగా చూపించే డీలర్లు, తప్పుడు బిల్లులతో ఐటీసీ క్లెయిమ్ చేసుకునేవారు, కోట్ల టర్నోవర్ చేసి అకస్మాత్తుగా మాయమయ్యే వ్యాపారులపై నిఘా పెట్టి.. వారి నుంచి పన్నులు వసూలు చేసే బాధ్యత ఎన్ఫోర్స్మెంట్ అధికారులదే. అయితే గత పదేళ్లలో ఈ విభాగంలో పనిచేసిన వారిలో చాలా మంది అధికారులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నిజానికి ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అవినీతి మరకలు కొత్తేమీ కాదు. కానీ ఈ విభాగంలో పనిచేస్తూ రిటైరైన ఏడేళ్ల తర్వాత కూడా ఓ అధికారి పింఛన్ ఇంతవరకు సెటిల్ కాలేదంటే.. ఏ స్థాయిలో ఆరోపణలు వచ్చాయో, ఎన్ని కేసులు అయ్యాయో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు దెబ్బకొడుతూ.. పెద్ద పెద్ద వ్యాపారులపై ఫోకస్ చేసి, వారి పన్ను చెల్లింపుల్లో తప్పులను పట్టుకుని, విచారణ పేరిట బెదిరించడం.. నామమాత్రంగా పన్ను కట్టించి, మిగతా మొత్తంలో కొంత కమీషన్‌గా జేబులో వేసుకోవడం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిబ్బందికి పరిపాటిగా మారిందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో వారు ఎక్కడా దొరక్కుండా మ్యాన్యువల్ నోటీసులు ఇవ్వడం.. షోకాజ్ నోటీసు, డిమాండ్ నోటీసు వంటి వాటికి కూడా ఆన్లైన్ ఆథరైజేషన్ లేకుండా చేయడం ద్వారా తమ తతంగాన్ని పూర్తి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన క్షేత్రస్థాయి పరిశీలనలు, దాడులు, వాహనాల తనిఖీలు వంటివి పన్నుల శాఖలో మచ్చుకైనా కనిపించవు. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ విభాగంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న ఇద్దరు అధికారుల అవినీతి లీలలను వివరిస్తూ, చర్యలు తీసుకోవాలంటూ పన్నుల శాఖలోని వారే ప్రధాని కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. గతంలో పన్నుల శాఖ కమిషనర్‌గా పనిచేసిన టీకే శ్రీదేవి అవకతవకలకు అడ్డుకట్ట వేసేలా చిన్న ప్రయత్నం చేస్తేనే నెలకు రూ.200 కోట్ల వరకు పన్ను రాబడి పెరిగిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. అదే ఎన్ఫోర్స్మెంట్ పనితీరు సరిగ్గా ఉంటే ఏటా ఏడెనిమిది వేల కోట్ల మేర ప్రభుత్వానికి అదనపు ఆదాయం రావొచ్చని అంటున్నాయి. అందరూ హైదరాబాద్ చుట్టూనే.. పన్నుల శాఖ పరిధిలో సర్కిల్ స్థాయిలో కీలకంగా వ్యవహరించే సీటీవోల వ్యవహారం మరింత విస్తుగొలుపుతోంది. పదోన్నతులు పొంది శిక్షణలో ఉన్న వారు కాకుండా ప్రస్తుతం 85 మంది వరకు పన్నుల శాఖలో సీటీవోలుగా ఉన్నారు. వీరిలో 80 మందికిపైగా హైదరాబాద్‌లోనే పనిచేస్తుండటం గమనార్హం. కేవలం నలుగురైదుగురు సీటీవోలు మాత్రమే జిల్లాల్లో పనిచేస్తున్నారని.. హైదరాబాద్ తర్వాత పన్ను రాబడికి ప్రధాన కేంద్రాలైన వరంగల్, కరీంనగర్‌లలోనూ రెగ్యులర్ సీటీవోలు లేరని సమాచారం. హైదరాబాద్‌లో ఉంటే అటు ఆదాయం పెరగడంతో ఇటు శాఖాపరమైన ఒత్తిడి తగ్గుతుందనే ఆలోచనతో ఎక్కువ మంది ఇక్కడే పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారనే చర్చ పన్నుల శాఖలో జరుగుతోంది. కొనుగోళ్లలోనూ అవకతవకలు! పన్నుల శాఖలోని అంతర్గత లావాదేవీల్లోనూ భారీగా అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల కొనుగోలు చేసిన 200 ల్యాప్‌టాప్‌ల విషయంలోనూ అక్రమాలు జరిగాయని, దీనిపై కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రిజ్వీ ప్రత్యేక దృష్టి సారించారని తెలిసింది. ‘శాఖ ఆడిట్‌లోని లోపాలతోపాటు, ఆదాయం తక్కువ వచ్చేందుకు కారణాలు, ఏ అధికారి ఎక్కడ పనిచేస్తున్నారు? ప్రభుత్వానికి ఏ మేరకు ఆదాయం తీసుకువచ్చారు?’అనే అంశాలపై ఆయన మూడు రోజులుగా వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందినకాడికి దండుకుంటున్న అధికారుల వివరాలు సేకరిస్తున్న ఆయన.. త్వరలోనే ప్రక్షాళనకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయని పన్నులశాఖ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఆడిట్లను పునఃసమీక్షించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని అంటున్నాయి. -
డ్వాక్రా మహిళలపై ‘అమరావతి ట్యాక్స్’
సాక్షి, అమరావతి: ‘రాజధాని అమరావతి కడతాం.. సంపద సృష్టిస్తాం’ అంటూ గొప్పలు చెప్పుకొంటున్న బాబు కూటమి ప్రభుత్వం.. కేంద్రం నుంచి నిధులు రాబట్టలేకపోయింది. గతంలో ఇటుకలమ్మి సేకరించిన విరాళాలు మరుగున పడ్డాయి. ఇప్పుడు రాజధాని భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేస్తోంది. వివిధ వర్గాల ప్రజల నుంచి బలవంతపు వసూళ్లకు తెగబడుతోంది. చివరికి రూపాయి రూపాయి పొదుపు చేసుకొని, కుటుంబానికి అండగా నిలుస్తున్న స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) అక్కచెల్లెమ్మలనూ వదలడంలేదు. ప్రతి మహిళా వందేసి రూపాయలు అమరావతి కోసం ఇవ్వాల్సిందేనంటూ కొందరు అధికారుల ద్వారా హుకుం జారీ చేయిస్తోంది.ఇదే విధంగా ఓ మధ్యస్థాయి అధికారి డ్వాక్రా మహిళలను ఆదేశిస్తున్న వీడియో టేప్ ఒకటి బయటపడింది. ఈ టేపు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘అమరావతి రాజధాని కోసం ఒక్కొక్క సభ్యురాలు రూ. వంద చొప్పున కలెక్షన్ చేయాలి. ప్రతి ఒక్కరూ.. గ్రూపు లీడర్ కూడా సంఘ సభ్యురాలు దగ్గర... సంఘంలో ఎంత మంది ఉన్నారో, అంతమంది మనిషికి వంద రూపాయల చొప్పున కలెక్టన్ చేయండి. నేను చాలా వరకు గ్రూపు లీడర్లకు ఫోన్లు చేశాను. ప్రతి గ్రూపు లీడరు ఫాలోఅప్ చేయండి.రేపు సాయంత్రంకల్లా కలెక్షన్ చేసి మాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ని సంఘాలు ఇచ్చారన్నది మేం సీవో (మెప్మా విభాగంలో పట్టణ ప్రాంతాల్లో పనిచేసే కమ్యూనిటీ ఆర్గనైజర్)కు అప్పజెప్పాలి. ప్రతి సభ్యురాలు ఎందుకు.. ఏమిటి అని అడగొద్దు. ప్రతి సంఘ సభ్యురాలు వంద రూపాయలు ఇవ్వాలి’ అంటూ ఓ పట్టణ ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాల కార్యకలాపాలను పర్యవేక్షించే ఓ మధ్య స్థాయి అధికారి ఆయన పరిధిలోని సంఘాల సభ్యులకు జారీ చేసిన ఆదేశాలు ఆ ఆడియో టేపులో ఉన్నాయి. ఈ ఆడియో టేపులో మాట్లాడిన మాటల ప్రకారం.. ఇప్పటికే తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పొదుపు సంఘాల సభ్యుల నుంచి రూ. వంద చొప్పున వసూళ్లు పూర్తయ్యాయి. సెర్ప్, మెప్మా ఉద్యోగుల చర్చల్లోనూ ఈ విషయం బయటపడింది.బహిరంగంగానే చెప్పిన చిత్తూరు ‘మెప్మా’ ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం చంద్రబాబు తొలిసారిగా సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లినప్పుడు చిత్తూరు జిల్లాలో మెప్మా అధికారులు ఆ ప్రాంత పొదుపు సంఘాల తరపున అమరావతి నిర్మాణానికి రూ.4.50 కోట్ల విరాళం ప్రకటించారు. ఆ డబ్బు సేకరణ కోసమే అధికారులు, సంఘాల లీడర్లు డ్వాక్రా మహిళలపై ఒత్తిడి తెచ్చి ఒక్కొక్కరి నుంచి రూ.100 చొప్పున ఇప్పటికే వసూళ్లు చేసినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇది చిత్తూరు, తిరుపతి జిల్లాలకే పరిమితమవలేదని, మిగతా జిల్లాల్లోనూ వసూళ్లు జరుగుతున్నాయని సమాచారం. -
కట్టాల్సిందే ‘ఎస్’ ట్యాక్స్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న సర్వేపల్లి నియోజకవర్గానికి ‘ఎస్’ ట్యాక్స్ గుదిబండగా మారింది. దినసరి కూలీల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కప్పం కట్టాల్సిందే. లేదంటే భౌతిక దాడులతో ఆయన దారిలోకి తెచ్చుకుంటున్నారు. ఇక ఆయన తనయుడు (షాడో ఎమ్మెల్యే).. కాదేదీ కమీషన్లకు అనర్హం అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. ఆయన కప్పాలు కట్టలేక పారిశ్రామికుల నుంచి లేబర్ ఏజెన్సీల వరకు తలలు పట్టుకుంటున్నారు. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్రాజెక్టులో విడుదలయ్యే బూడిదను కూడా అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆ ప్లాంట్‌లో విడుదలయ్యే ఫ్లయాష్లో 20 శాతం ఉచితంగా సిమెంట్ కంపెనీలకు ఇవ్వాలి. మరో 80 శాతం విక్రయించవచ్చు. దీన్ని అవకాశంగా తీసుకున్న షాడో ఎమ్మెల్యే ఉచితంగా ఇచ్చే 20 శాతం బూడిదను తనకే ఇవ్వాలని పట్టుబట్టి చేజిక్కించుకున్నాడు. దానిని సిమెంట్ కంపెనీలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రతి నెలా రూ. 32 లక్షల ఆర్జించే ప్లాన్ ఇది అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.తోటపల్లి గూడూరు మండలం అనంతపురంలో రొయ్యల ఫీడ్‌తో పాటు మేత తయారు చేసే వాటర్‌బేస్ లిమిటెడ్ కంపెనీలో 150 మంది వరకు రోజువారీ లేబర్‌గా పనిచేస్తున్నారు. ఆ కంపెనీ లేబర్ కాంట్రాక్టుపై టీడీపీ నేతల కన్నుపడింది. తమకే ఆ కాంట్రాక్టు ఇవ్వాలని ఆ కంపెనీ ఉద్యోగులపై భౌతిక దాడులకు దిగారు. దీనితో భయపడ్డ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా జంకింది. లేబర్ కాంట్రాక్ట్‌ను వెంటనే టీడీపీ నేతలకు అప్పగించింది. వెంకటాచలం మండలం కాకర్లవారిపాళెం ప్రాంతంలోని బేవరేజస్ పరిశ్రమలో పనిచేసే కార్మికులను తొలగించి టీడీపీ కార్యకర్తల్ని పెట్టుకోమని డిమాండ్ పెట్టారు. అలాగే ఆ పరిశ్రమల్లో మెస్ నిర్వహణ కూడా తన అనుచరుడికే ఇవ్వాలని పట్టుబట్టి యాజమాన్యాన్ని వేధిస్తున్నారు.కృష్ణపట్నం పోర్టుకు అనుబంధంగా ఏర్పాటయిన ఫ్యాక్టరీలలో తయారయ్యే పామాయిల్‌ను తరలించే ట్యాంకర్ల నుంచి ‘ఎస్’ ట్యాక్స్ వసూళ్లకు తెరలేపారు. గత కొన్నేళ్లుగా పామాయిల్ ట్యాంకర్ల యజమానులు అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ అసోసియేషన్ నిర్వహణ కోసం ప్రతి లోడ్ ట్యాంకర్ నుంచి రూ. 300 వంతున వసూళ్లు చేసుకొనేవారు. షాడో ఎమ్మెల్యే కన్ను ఆయిల్ ట్యాంకర్లపై పడింది. ఆ అసోసియేషన్ పాలకవర్గాన్ని మార్చేసి వెంటనే తన అధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రతి ఆయిల్ ట్యాంకర్ నుంచి అదనంగా రూ. 800 వంతున వసూళ్లు చేసుకునేలా ప్లానింగ్ చేసుకున్నాడు. దీంతో ప్రతిరోజు దాదాపు 150 వరకు ట్యాంకర్లు రూ. 1.2 లక్షలు వరకు ట్యాక్స్ రూపంలో చెల్లించాలి. బయట రాష్ట్రాల నుంచి వచ్చే ట్యాంకర్ల వద్ద అదనంగా రూ.4 వేలు వంతున వసూళ్లు చేస్తున్నారు. -
ఆదాయపన్ను.. ఆదా ఎలా!
ఆదాయపన్ను పాత, కొత్త విధానాల్లో ఏది అనుకూలం? ఎక్కువ మందిని వేధిస్తున్న సందేహం ఇది. 2024–25 కేంద్ర బడ్జెట్లో కొన్ని సవరణలు ప్రతిపాదించడం ద్వారా ఎక్కువ మందిని నూతన పన్ను విధానం వైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు విత్త మంత్రి. శ్లాబుల పరిమితుల్లో మార్పులతోపాటు.. స్టాండర్డ్ డిడక్షన్‌ను కూడా పెంచారు. దీనివల్ల కొత్త విధానంలో రూ.17,500 వరకు ఆదా చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమయంలో ప్రకటించారు. కానీ, పాత పన్ను వ్యవస్థలో వివిధ సెక్షన్ల కింద పన్ను ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకుంటే ఇంతకంటే ఎక్కువే ఆదా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. తక్కువ, అధిక ఆదాయం పరిధిలోని వారికి నూతన పన్ను విధానమే అనుకూలమన్నది విశ్లేషకుల నిర్వచనం. మధ్యాదాయ వర్గాలకు, మినహాయింపు ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకుంటే పాత విధానం అనుకూలం. తమ ఆదాయం, పెట్టుబడులు తదితర వివరాల ఆధారంగానే తమకు ఏది అనుకూలమన్నది నిర్ణయించుకోగలరు. ఇందుకు సంబంధించిన వివరాలను అందించే ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది. కొత్త విధానంలో తాజా మార్పులు నూతన విధానంలో 5 శాతం పన్ను, 10 శాతం పన్ను శ్లాబుల్లో రూ.లక్ష చొప్పున అదనంగా పరిమితి పెంచారు. అలాగే నూతన విధానంలో వేతన జీవులు, పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచారు. → నూతన విధానంలో మొదటి రూ.3లక్షల్లోపు ఆదాయం ఉంటే పన్ను పరిధిలోకి రారు. → స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి చూసుకుంటే రూ.7.75 లక్షల ఆదాయం దాటని వేతన జీవులు, పెన్షనర్లు రూపాయి పన్ను చెల్లించక్కర్లేదు. రూ.3–7లక్షల ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రిబేట్ అమల్లో ఉంది. దీనికి రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ అదనం. ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న వారికి స్టాండర్డ్ డిడక్షన్ రూ.15,000 ఉంటే రూ.25,000 చేశారు. అంటే ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే వారు రూ.7,25,000 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించక్కర్లేదు. మినహాయింపులు → నూతన పన్ను విధానంలో కేవలం కొన్ని మినహాయింపులే ఉన్నాయి. సెక్షన్ 80సీసీడీ(2) కింద ఎన్పీఎస్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఉద్యోగితోపాటు, ఉద్యోగి తరఫున సంస్థలు ఈపీఎఫ్ చందాలను జమ చేస్తుండడం తెలిసిందే. అదే విధంగా ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాకు సైతం సంస్థలు జమ చేయవచ్చు. ఉద్యోగి మూలవేతనం, కరువు భత్యంలో 10 శాతం గరిష్ట పరిమితి ఇప్పటి వరకు ఉంటే, దీన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 14 శాతం చేశారు. కనుక ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతా తెరిచి, సంస్థ ద్వారా అందులో జమ చేయించుకోవడం ద్వారా అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. → సెక్షన్ 24 కింద నూతన పన్ను విధానంలోనూ ఇంటి రుణంపై పన్ను ప్రయోజనం ఉంది. కాకపోతే ఆ ఇంటిని అద్దెకు ఇవ్వాలి. అప్పుడు ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించే వడ్డీ మొత్తంపైనా పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. → కన్వేయన్స్ అలవెన్స్, సెక్షన్ 10(10సీ) కింద స్వచ్ఛంద పదవీ విరమణ ప్రయోజనం గరిష్టంగా రూ.5లక్షలు, సెక్షన్ 10(10) కింద గ్రాట్యుటీ రూ.20లక్షలపైనా పన్ను లేదు. → ఉద్యోగి రాజీనామా లేదా పదవీ విరమణ సమయంలో సెలవులను నగదుగా మార్చుకోవడం వల్ల వచ్చే మొత్తం రూ.25 లక్షలపైనా సెక్షన్ 10(10 ) పన్ను లేదు. పాత పన్ను విధానం → రూ.5 లక్షల వరకు ఆదాయంపై 87ఏ కింద రిబేట్ ఉంది. దీంతో 60 ఏళ్ల వయసులోని వారికి రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ.5.50 లక్షల వరకు పన్ను చెల్లించక్కర్లేదు. → 60–80 ఏళ్ల వయసులోని వారికి రూ.3 లక్షల వరకు, 80 ఏళ్లు నిండిన వారికి రూ.5 లక్షల వరకు ఆదాయం ఉంటే కనీస పన్ను మినహాయింపు పరిధిలోనే ఉంటారు. మినహాయింపులు →గృహ రుణం తీసుకుని దాని అసలుకు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా చెల్లించే రూ.1.5 లక్షలపై సెక్షన్ 80సీ కింద పన్ను లేదు. →సెక్షన్ 24(బి) కింద గృహరుణం వడ్డీకి చెల్లించే మొత్తం రూ.2లక్షల వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ రుణంపై కొనుగోలు చేసిన ఇంటిని వేరొకరికి అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయం నుంచి.. రుణానికి చెల్లించే వడ్డీ మొత్తాన్ని మినహాయించుకోవచ్చు. →సెక్షన్ 80ఈఈ కింద మొదటిసారి ఇంటిని రుణంపై సమకూర్చుకున్న వారు ఏటా రూ.50,000 అదనపు మొత్తాన్ని వడ్డీ చెల్లింపుల నుంచి మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ కొనుగోలు చేసిన ఇంటి ధర రూ.45 లక్షల్లోపు ఉంటే ఈ పరిమితి సెక్షన్ 80ఈఈఏ కింద రూ.1.50లక్షలుగా ఉంది. → సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.5 లక్షల ఆదాయపన్ను మినహాయింపు కోసం.. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులతోపాటు, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, ఎన్పీఎస్, ఈపీఎఫ్, పీపీఎఫ్, ఐదేళ్ల ట్యాక్స్‌ఫ్రీ బ్యాంక్ ఎఫ్డీ, ఈఎల్ఎస్ఎస్, యులిప్ ప్లాన్‌లో పెట్టుబడులు, పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులను చూపించుకోవచ్చు. → పెన్షన్ ప్లాన్‌లో (ఎన్పీఎస్)లో పెట్టుబడికి సైతం గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు సెక్షన్ 80సీసీడీ(1) కింద మినహాయింపు పొందొచ్చు. కాకపోతే సెక్షన్ 80సీలో భాగంగానే ఇదీ ఉంటుంది. సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 వరకు అదనంగా ఎన్పీఎస్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనం ఉంది. అంటే మొత్తం రూ.2లక్షలు. → సెక్షన్ 80డీ కింద హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెల్లించే ప్రీమియం గరిష్టంగా రూ.25,000 మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ60 ఏళ్లలోపు తల్లిదండ్రులకు ప్రీమియం చెల్లిస్తుంటే, మరో రూ.25,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లు నిండిన వారికి హెల్త్ ప్రీమియం రూ.50,000 వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వ్యాధి నివారణ పరీక్షల కోసం చేసే వ్యయాలు రూ.5,000పైనా అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ లేని తల్లిదండ్రుల వైద్య చికిత్సల కోసం చేసే వ్యయం రూ.50,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు కోరొచ్చు. → సెక్షన్ 80డీడీబీ కింద కేన్సర్, డిమెన్షియా తదితర తీవ్ర వ్యాధుల్లో చికిత్సలకు చేసే వ్యయాలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లలోపు వారికి రూ.40వేలు కాగా, అంతకుమించిన వయసు వారి చికిత్స కోసం ఈ పరిమితి రూ.లక్షగా ఉంది. → బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80 టీటీఏ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80టీటీబీ కింద 60 ఏళ్లు నిండిన వారికి బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ పరిమితి రూ.50,000గా ఉంది. → సెక్షన్ 80ఈ కింద ఉన్నత విద్య కోసం తీసుకున్న రుణానికి చేసే వడ్డీ చెల్లింపులపై పూర్తి పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. 8 ఏళ్లపాటు ఈ ప్రయోజనం ఉంటుంది. → అద్దె ఇంట్లో ఉంటూ, పనిచేస్తున్న సంస్థ నుంచి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పొందే వారు, ఆ మొత్తంపై సెక్షన్ 10(13ఏ) కింద పన్ను ప్రయోజనం క్లెయిమ్ చేసుకోవచ్చు. 1. పనిచేస్తున్న సంస్థ నుంచి ఒక ఏడాదిలో పొందిన వాస్తవ హెచ్ఆర్ఏ మొత్తం. 2. వాస్తవంగా చెల్లించిన అద్దె నుంచి తమ వార్షిక వేతనంలో 10 శాతాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం. 3. మెట్రోల్లో నివసించే వారి మూల వేతనంలో 50 శాతం/ పల్లెల్లో నివసించే వారు అయితే మూల వేతనంలో 40 శాతం. ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే అంత మేర తమ ఆదాయంపై పన్ను చెల్లించక్కర్లేదు. ఉదాహరణకు హైదరాబాద్‌లో నివసించే శ్రీరామ్ నెలవారీ స్థూల వేతనం రూ.50,000 (సంవత్సరానికి రూ.6లక్షలు). అతడి మూలవేతనం, డీఏ కలిపి రూ.30,000. హెచ్ఆర్ఏ కింద సంస్థ ప్రతినెలా రూ.10,000 ఇస్తోంది. కానీ శ్రీరామ్ రూ.12,000 కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. ఈ ఉదాహరణలో శ్రీరామ్ రూ.84,000ను హెచ్ఆర్ఏ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. → ఇంకా సెక్షన్ 80సీ కింద గుర్తింపు పొందిన సంస్థలకు విరాళాలతోపాటు మరికొన్ని మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నిపుణులు ఏమంటున్నారు? ఎంత మేర పన్ను తగ్గింపులు, మినహాయింపులు క్లెయిమ్ చేసుకుంటారన్న అంశం ఆధారంగానే పాత, కొత్త పన్ను విధానంలో ఏది ఎంపిక చేసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది. ఒక పేపర్‌పై తమ ఆదాయం, పెట్టుబడులు, బీమా ప్రీమియం వివరాలను నమోదు చేసుకుని, హెచ్ఆర్ఏ లెక్క తేలి్చన అనంతరం ఏ విధానం అనుకూలమో నిర్ణయించుకోవాలి. మొత్తం ఆదాయంలో ఎంత మేర పన్ను తగ్గింపులను క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఏ విధానం అనుకూలమో స్పష్టత తెచ్చుకున్న తర్వాతే రిటర్నుల దాఖలుకు ముందుకు వెళ్లాలి. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల మేర ఇన్వెస్ట్ చేస్తూ.. ఇంటి రుణం, విద్యా రుణం తీసుకుని చెల్లింపులు చేస్తూ.. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంతోపాటు, హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకునేట్టు అయితే అధిక ఆదాయ శ్లాబుల్లో ఉన్న వారికి సైతం పాత విధానమే మెరుగని షేర్ డాట్ మార్కెట్ బిజినెస్ హెడ్ వైభవ్ జైన్ తెలిపారు. ఈ క్లెయిమ్‌లు చేసుకోని వారికి కొత్త విధానాన్ని సూచించారు. నూతన విధానంలో పెద్దగా పన్ను ప్రయోజనాలు లేకపోయినా సరే.. కొత్తగా ఉద్యోగంలో చేరి, రూ.7 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి ఎంతో ప్రయోజనమని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లోహిత్భాటియా తెలిపారు. ఎంపికలో స్వేచ్ఛ..ఆదాయపన్ను రిటర్నులు వేసే సమయంలో కొంత శ్రద్ధ వహించక తప్పదు. ఎందుకంటే కొత్త పన్ను విధానమే డిఫాల్ట్‌గా ఎంపికై ఉంటుంది. నూతన విధానంలోనే రిటర్నులు వేసే వారు అన్ని వివరాలు నమోదు చేసి సమరి్పంచొచ్చు. పాత విధానంలో కొనసాగాలనుకుంటే కచి్చతంగా ‘నో ఫర్ ఆప్టింగ్ అండర్ సెక్షన్ 115బీఏసీ’’ అని సెలక్ట్ చేసుకోవాలి. వేతన జీవులు ఏటా రిటర్నులు వేసే సమయంలో రెండు పన్ను విధానాల్లో తమకు అనుకూలమైనది ఎంపిక చేసుకోవచ్చు. వ్యాపార ఆదాయం ఉంటే మాత్రం ఇలా ఏదో ఒకటి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేదు. వీరు పాత విధానంలోనే కొనసాగదలిస్తే ఫారమ్ 10–ఐఈఏ సమరి్పంచాలి. కాకపోతే జీవితంలో ఒక్కసారి మాత్రం నూతన పన్ను విధానానికి మారిపోయే ఆప్షన్ ఉంటుంది. ఒక్కసారి ఈ అవకాశం వినియోగించుకుని నూతన విధానంలోకి మారితే, తిరిగి పాత విధానంలోకి వెళ్లే అవకాశం ఉండదు. ఇప్పటికే 66 శాతం మేర నూతన పన్ను విధానంలో రిటర్నులు వేస్తున్నట్టు సీబీడీటీ చెబుతోంది. ఏది ప్రయోజనం..? → కేవలం స్టాండర్డ్ డిడక్షన్ వరకే క్లెయిమ్ చేసుకునేట్లయితే రూ.7,75,000 లక్షల్లోపు ఆదాయం ఉన్న వేతన జీవులు, పెన్షనర్లకు నిస్సందేహంగా నూతన విధానమే మెరుగని ఇక్కడి టేబుల్ చూస్తే అర్థమవుతుంది. స్వ యం ఉపాధి, ఇతరులకు రూ.7లక్షల వరకు నూతన విధానంలో పన్ను లేదు. పాత విధానంలో అయితే స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని రూ.5.50లక్షల మొత్తంపై వేతన జీవులు, పెన్షనర్లకు పన్ను వర్తించదు. ఆ తర్వాత ఆదాయంపై 20% పన్ను పడుతోంది. → రూ.7,75,000 ఆదాయం కలిగి.. పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేలతోపాటు, సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు కలిపి మొత్తం రూ.7 లక్షల వరకే పన్ను ఆదాయంపై మినహాయింపులను క్లెయిమ్ చేసు కునే వారికీ నూతన పన్ను విధానం లాభం. → రూ.7 లక్షలకు మించకుండా ఆదాయం కలిగిన వారు పాత విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ సహా రూ.2లక్షలకు పైన పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకునేట్టు అయితే అందులో కొనసాగొచ్చు. క్లెయిమ్ చేసుకోలేని వారికి కొత్త విధానం నయం. → అలాగే, రూ.11 లక్షల ఆదాయం కలిగిన వారు రూ.3,93,700కు మించి పన్ను మినహాయింపులు (స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని) క్లెయిమ్ చేసుకున్నప్పుడే పాత విధానం ప్రయోజనకరం. → రూ.16 లక్షల పన్ను ఆదాయం కలిగిన వారు రూ.4,83,333కు మించి పన్ను మినహాయింపులు (స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని) క్లెయిమ్ చేసుకున్నప్పుడే పాత విధానం ప్రయోజనకరం. → రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు, 24(బీ) కింద గృహ రుణ వడ్డీ రూ.2 లక్షలు, హెచ్ఆర్ఏ ప్రయోజనం రూ.80వేలు (రూ.50వేల వేతనంపై సుమారు), హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.25వేలు, ఎన్పీఎస్ పెట్టుబడి రూ.50వేలను క్లెయిమ్ చేసుకుంటే పాత విధానంలో నికరంగా రూ.10.55 లక్షల ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉండదు. నోట్: మూడు టేబుళ్లలో ఉన్న గణాంకాలు 60ఏళ్లలోపువారికి ఉద్దేశించినవి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రూ.1,000 కోట్ల ట్యాక్స్ స్కాం
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐజీఎస్టీ, సెస్‌ల చెల్లింపు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగినట్లు బయటపడింది. వివిధ సంస్థలు దాదాపు రూ. 1,000 కోట్ల మేర ప్రభుత్వానికి పన్ను ఎగవేసినట్లు నిగ్గుతేలింది. ఆయా సంస్థల అక్రమాలకు కొందరు ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులే సహకరించినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది.అక్రమంగా లబ్ధి పొందిన సంస్థల్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సైతం నిలవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ ఫిర్యాదుతో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్ బాబు తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. సోమేశ్ మౌఖిక ఆదేశాలతో.. వాణిజ్య పన్నుల శాఖ సాఫ్ట్‌వేర్‌ను ఐఐటీ హైదరాబాద్ నిర్వహిస్తోంది. స్రూ్కటినీ మాడ్యూల్లో పనిచేస్తూ వివిధ సంస్థలు దాఖలు చేసే ట్యాక్స్ రిటర్న్‌లలో లోపాలను గుర్తించి వాణిజ్య పన్నుల శాఖను అప్రమత్తం చేస్తోంది. ఈ సంస్థ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంశాన్నీ పర్యవేక్షించాలి. కానీ సోమేశ్ కుమార్ ఆదేశాల మేరకు ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు స్రూటినీ మాడ్యూల్లో మార్పుచేర్పులు చేశారు.ఈ కార్యకలాపాల కోసం సోమేశ్ కుమార్, శోభన్బాబులతోపాటు వాణిజ్య పన్నుల శాఖలో అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరాంప్రసాద్ తదితరులతో వాట్సాప్‌లో ‘స్పెషల్ ఇనీíÙయేటివ్స్’ పేరుతో వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశారు. దీని ద్వారానే సోమేశ్ అటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు, ఇటు ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్‌కు మౌఖికంగా ఆదేశాలు జారీ చేస్తూ పోయారు. ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా (రెవెన్యూ) ఉన్నప్పుడు మొదలైన ఈ వ్యవహారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసినప్పుడూ కొనసాగింది.వాట్సాప్ గ్రూప్ ద్వారా శోభన్ బాబుకు ఆదేశాలు ఇచి్చన సోమేశ్ తాము చెప్పిన సంస్థలకు సంబంధించిన రిటర్న్‌లలో ఐజీఎస్టీ, సెస్‌లో ఉన్న లోపాలు బయటపడకుండా చేయాలని స్పష్టం చేశారు. స్రూ్కటినీ మాడ్యూల్లో మార్పులు చేసిన శోభన్‌బాబు కొన్ని సంస్థలు చేసిన స్కామ్‌లు బయటపడకుండా చేశారు. తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సహా అనేక సంస్థలు రూ.1000 కోట్ల వరకు స్కామ్‌కు పాల్పడ్డా బయటపెట్టలేదు. ఎట్టకేలకు బట్టబయలు.. ఇటీవల బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంశంలో భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆ సంస్థ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో రూ. 25.51 కోట్లు స్వాహా చేసినట్లు తేల్చారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ.. సెంటర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ–డాక్) సహకారం కోరింది. డేటాను ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన సీ–డాక్... జరిగిన గోల్మాల్ను గుర్తించింది.దీని ఆధారంగా అధికారులు సైతం అంతర్గత విచారణ చేపట్టారు. ఐఐటీ–హైదరాబాద్ సహా వివిధ సంస్థల నుంచి వివరాలు కోరారు. సోమేశ్ కుమార్‌తోపాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల అభ్యర్థన మేరకే తాము స్రూ్కటినీ మాడ్యూ ల్లో మార్పులు చేశామన్న ఐఐటీ–హైదరా బాద్.. ఆ మేరకు వివరాలను సమరి్పంచింది. బయటి సిబ్బందితోనే ఐఐటీ–హైదరాబాద్ పర్యవేక్షణ సీ–డాక్ నివేదిక ప్రకారం దాదాపు 75 సంస్థలకు సంబం«ధించిన రిటర్న్‌లు పూర్తిస్థాయిలో స్క్రూటినీ కాకుండా సాఫ్ట్‌వేర్‌లో మార్పుచేర్పులు జరిగినట్లు వెలుగులోకి వచి్చంది. వాణిజ్య పన్నుల శాఖ డేటాబేస్‌లో మార్పులు చేసేందుకు వాడిన ఐపీ అడ్రస్‌లలో ఒకటి ఏపీలోని హిందూపూర్ నుంచి పనిచేసిందని, ఈ డేటాను యాక్సెస్ చేసిన వ్యక్తులు.. వారి పాస్‌వర్డ్‌గా పిలాంటో అనే పేరును వినియోగించినట్లు కూడా సీ–డాక్ బయటపెట్టింది. వాణిజ్య పన్నుల శాఖ డేటాబేస్‌ను నిర్వహించే బాధ్యతలు చేపట్టిన ఐఐటీ–హైదరాబాద్ దీనికోసం కనీసం ఒక్క ఉద్యోగిని కూడా నియమించుకోలేదని బయటపడింది.సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఐఐటీ–హైదరాబాద్ చిరునామాతోనే రిజిస్టరై ఉన్న పిలాంటో టెక్నాలజీస్‌లో పనిచేసే వారినే ఈ పని కోసం వినియోగించుకుంది. సీ–డాక్ నివేదికతోపాటు అంతర్గత విచారణ నేపథ్యంలో కేవలం 11 సంస్థలు చేసిన స్కామ్ విలువే రూ. 400 కోట్ల వరకు ఉన్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తేల్చారు. మొత్తమ్మీద దాదాపు 75 సంస్థలు రూ. 1,000 కో ట్ల గోల్‌మాల్‌కు పాల్పడినట్లు ఆధారాలు సేకరించారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీని ఆధారంగా కేసు నమోదు చేసిన అధి కారులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో సోమేశ్ కుమార్‌తోపాటు వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్రసాద్, ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, పి లాంటో టెక్నాలజీస్ తదితరులను నిందితులుగా చేర్చారు.