చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలపై 45 శాతం వరకు సుంకాలను విధించేందుకు ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, పోలాండ్ వంటి యూరప్ దేశాలు ఓటు వేయగా.. జర్మనీతో పాటు మరో నాలుగు దేశాలు వ్యతిరేకంగా ఓటువేశాయి. యూరోపియన్ యూనియన్ ట్యాక్స్ పెరుగుదల వాణిజ్యం మీద గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలపై 45 శాతం అమలు చేయడం ప్రారంభమైతే.. ఐదేళ్లపాటు కొనసాగుతుందని చెబుతున్నారు. ఇదే జరిగితే భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్ ఉత్పత్తులు మరిన్ని దేశాలకు ఎగుమతవుతాయి. తద్వారా ఉత్పత్తి శాతం కూడా భారీగా పెరుగుతుంది.
అమెరికా కూడా ఇప్పటికే చైనా ఉత్పత్తుల మీద సుంకాలను భారీగా పెంచింది. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలోనే యూఎస్ ప్రకటించింది. ఇప్పటికే యూరప్ దేశాల్లో చైనీస్ దిగుమతుల మీద టారిఫ్ రేట్లు 35 శాతం వరకు ఉంటాయి. కొత్త విధానంలో మరో 10 శాతం పెరుగుతుంది.
ఇదీ చదవండి: 'ఐఫోన్ 16 ప్రో'పై అసంతృప్తి: సెట్ చేసుకోవడానికి 24గంటలు
చైనా ఎలక్ట్రిక్ వెహికల్ తయారీదారులు ఈ టారిఫ్‌లను స్వీకరిస్తారా? స్వీకరిస్తే.. వాహనాల ధరలను పెంచుతారా? అనేది తెలియాల్సి ఉంది. అదనపు సుంకాల కారణంగా ఐరోపాలో ఇప్పటికే చైనీస్ కార్ల అమ్మకాలను గణనీయంగా తగ్గాయి. ఇప్పుడు 45 శాతం సుంకం అమలులోకి వస్తే.. అమ్మకాల పరిస్థితి ఎలా ఉంటుందో త్వరలోనే తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment