ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్ కోసం చాలామంది జనం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే.. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న భారతీయ సంతతికి చెందిన టెక్ ఎగ్జిక్యూటివ్ ఆదిత్య అగర్వాల్ కొత్త ఐఫోన్ కొనుగోలు చేయడం సమయం వృధా అంటూ ట్వీట్ చేశారు.
చాలామంది తమ వద్ద పాత ఐఫోన్స్ స్థానంలో కొత్త ఐఫోన్స్ భర్తీ చేస్తున్నారు. పాత ఐఫోన్ నుంచి కొత్త ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వడం సమయం వృధా అంటూ తన ఎక్స్ వేదికగా యాపిల్ ఐఫోన్ 16 ప్రో పట్ల తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈయన ఐఫోన్ 14 ప్రో నుంచి ఐఫోన్ 16 ప్రోకు మారినట్లు వెల్లడించారు. కొత్త ఫోన్ తనను చాలా నిరాశపరిచింది అన్నారు.
ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 16 ప్రో మధ్య ఉన్న వ్యత్యాసం చెప్పలేను, అయితే ఏఐ సామర్థ్యాల పరంగా ఐఫోన్ 15, 16 మధ్య ఎక్కడ తేడా ఉందో అర్థం కావడం లేదని అన్నారు. కొత్త ఫోన్ సరిగ్గా సెట్ చేయడానికి తనకు 24 గంటల సమయం పట్టిందని అన్నారు. టెక్ ఎగ్జిక్యూటివ్ చేసిన వ్యాఖ్యలతో కొందరు ఏకీభవించారు. ఇందులో ఒకరు కేవలం యూఎస్‌బీ-సీ ప్లగ్ కోసం మాత్రమే మారానని చెప్పుకొచ్చారు. మరొకరు కూడా కొత్త ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వడం సమయం వృధానే అంటూ పేర్కొన్నారు.
I "upgraded" from the iPhone 14 Pro to the iPhone 16 Pro.
I literally cannot tell the difference.
It took me 24 hours to set up the new phone properly etc. It just feels like a waste of time.
And I do not understand where this "Apple Intelligence" is????— Aditya Agarwal (@adityaag) October 3, 2024
ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్
ఈ నెలాఖరు నాటికి మరికొన్ని ఫీచర్స్
యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లలో కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత కల్పించింది. డిజిటల్ జీవితాలను సులభతరం చేయడానికి సంస్థ లేటెస్ట్ ఫీచర్స్ అందిస్తోంది. ఈ ఫోన్‌లో కొన్ని ఫీచర్స్ ఈ నెలాఖరు నాటికి వస్తాయని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment