యాపిల్ కంపెనీ తన ఐఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను మెరుగుపరచడానికి కొత్త భాగస్వామ్యాన్ని ప్రకటించనుంది. గూగుల్ జెమినీ ఏఐని ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ లైనప్‌తో సహా దాని తర్వాతి తరం ప్లాట్‌ఫారమ్‌లలోకి అనుసంధానం చేయడం కోసం యూఎస్ బేస్డ్ టెక్ దిగ్గజం గూగుల్‌తో ఒక ఒప్పందాన్ని ఖరారు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో ఏఐ కోసం యాపిల్ కంపెనీ మెటాతో చర్చలు జరిపింది. ఈ చర్చలు విఫలం కావడంతో.. సంస్థ గూగుల్ జెమిని కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే.. ఐఫోన్ 16లో గూగుల్ జెమినీ అందుబాటులో రానుంది. ఆ తరువాత యాపిల్ ఫోన్‌లు అన్నీ కూడా గూగుల్ జెమినీ ఏఐ పొందే అవకాశం ఉందని సమాచారం.
యాపిల్ గూగుల్ జెమినినీ ఆన్‌బోర్డ్ చేసినట్లయితే.. ఐఓఎస్, మ్యాక్ఓఎస్ వినియోగదారులు ఇద్దరూ కూడా ఈ మూడు చాట్‌బాట్‌లను ఉపయోగించుకోవచ్చు. అయితే యాపిల్ యూజర్ ఏది ఉపయోగించుకోవాలో అనే విషయాన్ని ముందుగానే నిర్దారించుకోవచ్చు. కాబట్టి యూజర్ ఇష్టానుసారంగానే ఏ ఇంటెలిజెన్స్ అయినా ఉపయోగించుకోవచ్చు.
జూన్‌లో యాపిల్ యాన్యువల్ డెవలపర్ ఫోకస్డ్ ఈవెంట్.. వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)లో తన సొంత ఏఐ ఫీచర్ల సూట్‌ను ఆవిష్కరించింది. దీనిని సమిష్టిగా యాపిల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు. ఇది ప్రస్తుతానికి ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ కోసం మాత్రమే అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment