new features
-
వాట్సప్ కొత్త ఫీచర్: దీని గురించి తెలిస్తే..
స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత దాదాపు అందరూ వాట్సప్ వినియోగిస్తున్నారు. కంపెనీ కూడా యూజర్ల సౌకర్యార్థం.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా 'వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్' అనే ఫీచర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.వాట్సప్ పరిచయం చేసిన కొత్త వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్ రూపంలోకి మారుస్తుంది. ఇది చాలా ఉపయోగకరమైన ఫీచర్ అని పలువురు చెబుతున్నారు.నిజానికి వాయిస్ మెసేజ్ అనేది నలుగురిలో వినడానికి బహుశా చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటి వారు వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్.. ఉపయోగించి టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవచ్చు. అయితే ఇది ట్రాన్స్‌లేటర్ కాదు, వాయిస్ మెసేజ్ ఏ రూపంలో ఉంటుందో.. ఆ భాషకు టెక్స్ట్ రూపం ఇస్తుంది.మెసేజ్ అందుకున్న వ్యక్తి మాత్రమే.. దీనిని వాయిస్ నుంచి టెక్స్ట్ రూపంలో మార్చుకోగలడు. కానీ పంపిన వ్యక్తికి ఆ అవకాశం లేదు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లు ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, పోర్చుగీస్ వంటి భాషలకు సపోర్ట్ చేస్తాయి. ఐఓఎస్ ఫోన్లు ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, పోర్చుగీస్ భాషలకు మాత్రమే కాకుండా.. అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్ వంటి వాటికి సపోర్ట్ చేస్తాయి. రాబోయే రోజుల్లో.. మరిన్ని భాషలకు కూడా ఇవి సపోర్ట్ చేస్తాయి.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే కంటే ఎక్కువ ఉద్యోగాలు!.. జెప్టో ఫౌండర్వాట్సప్ వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవాలంటే.. సెట్టింగ్స్‌లో చాట్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ ఈ కొత్త ఫీచర్ కనిపిస్తుంది. దానిని ఆన్ లేదా ఆఫ్ చేసుకోవడం ద్వారా.. భాషను సెలక్ట్ చేసుకోవచ్చు. అయితే సపోర్ట్ చేయని భాషలను ఎంచుకుంటే.. ఎర్రర్ వస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంది, రాబోయే రోజుల్లో ఇది యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుంది. -
సన్‌రూఫ్.. సూపర్ క్రేజ్!
బీచ్ రోడ్డులోనో... ఫారెస్ట్ దారిలోనో కారులో అలా ఓ లాంగ్ డ్రైవ్కెళ్లాలని ఎవరికుండదు చెప్పండి? దీంతో పాటు కారులో సన్‌రూఫ్ కూడా ఉంటే... మజామజాగా ఉంటుంది కదూ! దేశంలో కారు ప్రియుల మది దోచేస్తున్న క్రేజీ ఫీచర్ ఇది. ఒకప్పుడు లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ అదిరిపోయే ఫీచర్ ఇప్పుడు చిన్న కార్లలోనూ వచ్చి చేరుతుండటం దానికున్న క్రేజ్‌కు నిదర్శనం!దేశీ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు సన్/మూన్ రూఫ్ మాంచి ట్రెండింగ్‌లో ఉంది. యువ కస్టమర్ల జోరుతో ఈ ఫీచర్ ‘టాప్’లేపుతోంది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు ఎస్‌యూవీలు, సెడాన్లతో పాటు హ్యాచ్బ్యాక్స్లోనూ దీన్ని చేర్చేందుకు సై అంటున్నాయి. డిమాండ్ ‘రూఫ్’ను తాకుతుండటంతో ప్రపంచస్థాయి తయారీ సంస్థలు దీన్ని సొమ్ము చేసుకోవడానికి తహతహలాడుతున్నాయి. మార్కెట్లో అధిక వాటా కోసం భారీ పెట్టుబడులతో ఉత్పత్తి పెంచే పనిలో ఉన్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన ఇనాల్ఫా రూఫ్ సిస్టమ్స్ దాని భాగస్వామ్య సంస్థ గాబ్రియెల్ ఇండియాతో కలిసి తయారీని పరుగులు పెట్టిస్తోంది. వచ్చే ఏడాది కాలంలో సన్‌రూఫ్‌ల ఉత్పత్తిని రెట్టింపు చేయాలనేది ఈ జాయింట్ వెంచర్ (ఐజీఎస్ఎస్) లక్ష్యం. ఈ ఏడాది ఆరంభంలో చెన్నైలో తొలి ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ఐజీఎస్ఎస్కు ఏటా 2 లక్షల సన్‌రూఫ్‌ల తయారీ సామర్థ్యం ఉంది. హ్యుందాయ్, కియా కంపెనీలకు ఇది సన్‌రూఫ్‌లను సరఫరా చేస్తోంది. ఇక జర్మనీకి చెందిన గ్లోబల్ సన్‌రూఫ్ తయారీ దిగ్గజం వెబాస్టో కూడా తయారీ గేరు మార్చింది. ప్రస్తుతం ఏటా 5 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తుండగా... 2027 నాటికి రెట్టింపు స్థాయిలో 9.5 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.1,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేస్తోంది. ట్రెండ్ రయ్ రయ్... దేశీ వాహన రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యువ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లుగా కొంగొత్త ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు కార్ల కంపెనీలు పోటీ పడుతున్నాయి. అత్యధికంగా కారు ప్రియులు కోరుకుంటున్న ఫీచర్లలో సన్‌రూఫ్ శరవేగంగా దూసుకుపోతోందని యూనో మిండా చైర్మన్, ఎండీ ఎన్కే మిండా చెబుతున్నారు. దేశంలోని దిగ్గజ వాహన విడిభాగాల సంస్థల్లో ఇది ఒకటి. సన్‌రూఫ్‌ల తయారీ కోసం తాజాగా జపాన్‌కు చెందిన ఐసిన్ కార్ప్‌తో సాంకేతిక లైసెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రపంచంలోని టాప్–10 వాహన విడిభాగాల ఉత్పత్తి కంపెనీల్లో ఐసిన్ కార్ప్ కూడా ఒకటి. కాగా, యూనో మిండా 80,000 యూనిట్ల వార్షిక సామర్థ్యంతో హరియాణాలో కొత్త ప్లాంట్ నెలకొల్పుతోంది. ‘ఈ మధ్య కాలంలో సన్‌రూఫ్‌ల వాడకం ఓ రేంజ్లో పెరుగుతోంది. గతంలో బడా ఎస్‌యూవీలు, లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ ట్రెండ్ మరింత జోరందుకోనుంది. ఇప్పుడు హ్యాచ్‌బ్యాక్ (చిన్న కార్లు) కస్టమర్లు సైతం ఈ ఫీచర్ కోసం ఎగబడుతుండటమే దీనికి కారణం’ అని మిండా వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరే ఇక్కడా వినూత్న ఫీచర్లు, కస్టమైజేషన్లకు ప్రాధాన్యమిచ్చే ట్రెండ్ కనిపిస్తోందన్నారు.స్టేటస్ సింబల్... ఇప్పుడు కారే కాదు అందులోని ప్రీమియం ఫీచర్లు కూడా స్టేటస్ సింబల్‌గా మారుతున్నాయి. ఇందులో సన్‌రూఫ్ కూడా ఒకటి. క్రూయిజ్ కంట్రోల్, కళ్లు చెదిరే డిస్ప్లేలు, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ లాంటి ఫీచర్లకు ఉండే క్రేజ్ వేరే లెవెల్. వీటి వాడకం అరుదుగానే ఉన్నప్పటికీ, భారతీయ రోడ్డు పరిస్థితులకు పెద్దగా ఉపయోగకరం కానప్పటికీ.. కస్టమర్లు మరిన్ని ప్రీమియం ఫీచర్లు కోరుకుంటుండటంతో కార్ల కంపెనీలు వాటిని తప్పనిసరిగా అందించాల్సిన పరిస్థితి నెలకొందని జాటో డైనమిక్స్ ప్రెసిడెంట్ రవి భాటియా పేర్కొన్నారు.ప్రతి నాలుగు కార్లలో ఒకటి... జాటో డైనమిక్స్ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న ప్రతి నాలుగు కార్లలో ఒక కారుకు (27.5%) ఈ లగ్జరీ ఫీచర్ ఉంది. ఐదేళ్ల క్రితం 12.7%తో పోలిస్తే కస్టమర్లు దీనికి ఎలా ఫిదా అవుతున్నారనేది ఈ జోరు చాటిచెబుతోంది. కాగా వచ్చే ఐదేళ్లలో (2029 నాటికి) ఈ విభాగంలో 17.6 శాతం వార్షిక వృద్ధి (సీఏజీఆర్) నమోదవుతుందనేది వాహన పరిశ్రమ అంచనా. ముఖ్యంగా ఎస్‌యూవీల్లో సన్‌రూఫ్ ఫీచర్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ ఏడాది జనవరి–ఆగస్ట్ మధ్య ఏకంగా 44.7% వృద్ధి ఈ విభాగంలో నమోదైంది. మరోపక్క, భారతీయ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తయారీ సంస్థలు అధునాతన గ్లాస్ టెక్నాలజీతో సన్‌రూఫ్‌లను ప్రవేశపెడుతున్నాయి. వేడిని బాగా తట్టుకోవడం, యూవీ కిరణాల నుంచి రక్షణతో పాటు సన్‌రూఫ్‌లను ‘స్మార్ట్రూఫ్’లుగా మార్చేస్తున్నాయి. పానోరమిక్ సన్‌రూఫ్‌లు కారు లోపల మరింత విశాలమైన స్పేస్ ఫీలింగ్‌ను కూడా అందిస్తాయని భాటియా చెబుతున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కొత్త ఆండ్రాయిడ్15లో అబ్బురపరిచే ఫీచర్లు
సరికొత్త గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 15 అందుబాటులోకి వచ్చేసింది. స్మార్ట్ఫోన్లను మరింత మెరుగ్గా చేసేందుకు ఇందులో అనేక కొత్త ఫీచర్లను జోడించారు. వీటిలో అబ్బురపరిచే కొన్ని ఫీచర్లను ఇక్కడ తెలుసుకుందాం..ప్రైవేట్ స్పేస్ప్రైవేట్ స్పేస్ అనేది వర్చువల్ లాకర్. వ్యక్తిగతమైన, గోప్యమైన యాప్‌లను ఇక్కడ ఉంచవచ్చు. ఈ యాప్‌లను మీరు మాత్రమే యాక్సెస్ చేయగలిగేలా భద్రతను ఇస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఫోన్ ఇచ్చే పేరెంట్స్‌కు ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్యాంకింగ్, షాపింగ్ వంటి యాప్‌లు ఇక్కడ సురక్షితంగా ఉంటాయి.చార్జింగ్ లిమిట్ ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ జీవిత కాలం తగ్గిపోతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఆండ్రాయిడ్ 15లో 80% లిమిట్ ఆప్షన్ తీసుకొచ్చారు. దీని ద్వారా బ్యాటరీ తొందరగా దెబ్బతినకుండా నివారించుకోవచ్చు.థెఫ్ట్ ప్రొటెక్షన్ఆండ్రాయిడ్ 15లో తీసుకొచ్చిన థెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్ అసాధారణ చర్యలతో మీ ఫోన్‌ను ఎవరైనా చోరీ చేయడానికి ప్రయత్నించి ఉంటే తెలియజేస్తుంది. ఒక వేళ మీ ఫోన్ చోరీకి గురైతే మీ డేటాను రక్షించడానికి, ఫ్యాక్టరీ రీసెట్ చేయకుండా ఇది ఆటోమేటిక్‌గా లాక్ చేస్తుంది. మీ ఫోన్ నంబర్ని ఉపయోగించి వేరొక ఫోన్ నుంచి మీ ఫోన్‌ను లాక్ చేయవచ్చు.అడాప్టివ్ వైబ్రేషన్కొందరికి రింగ్ టోన్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఫోన్‌ను వైబ్రేషన్ లేదా సైలెంట్ మోడ్‌లో పెట్టుకుంటారు. మీటింగ్స్‌లో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేస్తుంటారు. అయితే దీని వల్ల కొన్నిసార్లు కాల్స్ వచ్చినప్పుడు గుర్తించలేం. దీని పరిష్కారం కోసమే ఆండ్రాయిడ్ 15లో అడాప్టివ్ వైబ్రేషన్ ఫీచర్ ఇచ్చారు. సందర్భానికి అనుగుణంగా దానంతట అదే వైబ్రేషన్‌ను అడ్జెస్ట్ చేస్తుంది.యాప్ పెయిర్స్తరచూ స్ప్లిట్ స్క్రీన్ ఉపయోగించేవారి కోసమే ఈ ఫీచర్. ఏవైనా రెండు యాప్‌లను జతగా వినియోగించేవారు వాటిని సేవ్ చేసుకునే అవకాశం ఇందులో ఉంది. వీటిని హెమ్ స్క్రీన్‌పై షార్ట్‌కట్స్‌గా సేవ్ చేసుకోవచ్చు.యాప్ ఆర్కైవింగ్ఫోన్లో స్టోరేజ్ అయిపోయినప్పుడు పాత యాప్‌లను వదిలించుకోవాలి. అయితే యాప్‌ను అన్ఇన్స్టాల్ చేయడం వలన దాని డేటా మొత్తం పోతుంది. మళ్లీ ఇన్స్టాల్ చేస్తే మొదటి నుండి సెటప్ చేయాలి. దీన్ని పరిష్కరించడానికి గూగుల్ గతంలో ప్లేస్టోర్‌కి యాప్ ఆర్కైవింగ్ని జోడించింది. ఇప్పుడిదే ఫీచర్‌ను ఆండ్రాయిడ్ 15తో ఇన్‌బిల్ట్‌గా తీసుకొచ్చింది. తొలగించిన యాప్‌ను మళ్లీ ఇన్స్టాల్ చేసినప్పడు పాత డేటా అలాగే ఉంటుంది.శాటిలైట్ ద్వారా ఎస్ఎంస్శాటిలైట్ ద్వారా ఎస్ఎంస్లు పంపించే ఈ సరికొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్ 15లో ప్రకటించినప్పటికీ ప్రస్తుతానికి దీన్ని ఉపయోగించలేం. క్యారియర్లు ఈ సర్వీస్‌కు ధర నిర్ణయించే పనిలో ఉన్నాయి. దీని కోసం కొంత కాలం వేచి ఉండవలసి ఉంటుంది. -
జియోఫైనాన్స్ కొత్త యాప్.. ఇక మరిన్ని ఫీచర్లు
న్యూఢిల్లీ: జియోఫైనాన్స్ యాప్‌ను మరింత మెరుగ్గా ప్రారంభించినట్టు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రకటించింది. రుణాలు, పొదుపు ఖాతాలు, యూపీఐ బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లు, డిజిటల్ ఇన్సూరెన్స్‌తో సహా అనేక రకాల సేవలను ఈ యాప్ అందిస్తోంది.జియోఫైనాన్స్ యాప్ బీటా వెర్షన్ 2024 మే 30న ప్రారంభమైంది. 60 లక్షలకు పైగా వినియోగదారులు ఉన్నారు. బీటా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి అనేక రకాల ఆర్థిక ఉత్పత్తులు సేవలు జోడించామని, మ్యూచువల్ ఫండ్లపై రుణాలు, గృహ రుణాలు (బ్యాలెన్స్ బదిలీతో) సహా ఆస్తిపై రుణాలు వీటిలో ఉన్నాయని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. -
ఏకకాలంలో మూడు యాప్‌లు: గూగుల్ ప్లే స్టోర్‌లో కొత్త ఫీచర్
సాధారణంగా గూగుల్ ప్లే స్టోర్‌లో ఒకసారికి ఒక యాప్‌ను మాత్రమే ఇన్స్టాల్ చేయొచ్చు లేదా అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు యాప్ మేనేజ్మెంట్ మరింత వృద్ధి చెందింది. కాబట్టి ఏకకాలంలో మూడు యాప్‌లు లేదా గేమ్‌లను ఇన్స్టాల్ లేదా అప్డేట్ చేసుకోవచ్చు.ఈ కొత్త ఫీచర్ భారతదేశంతో సహా ఎంపిక చేసిన ప్రాంతాలలో అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్లే స్టోర్‌లోని ఈ అప్డేట్ మునుపటి సిస్టమ్ కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. ఇది సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం: ఎందుకో తెలుసా? గూగుల్ ఏప్రిల్‌లో మొదటిసారి రెండు యాప్‌లను ఏకకాలంలో ఇన్స్టాల్ లేదా అప్డేట్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఇప్పుడు ఆ సంఖ్య మూడుకు చేరింది. యూజర్ ఒకేసారి మూడు యాప్స్ ఇన్స్టాల్/అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు 'అప్డేట్ ఆల్' అనే ఫీచర్ ఎంచుకోవాలి ఉంటుంది. ఇలా సెలక్ట్ చేసుకున్న తరువాత యాప్స్ అప్డేట్లు ప్రాసెస్ అవుతాయి. అయితే ఈ ఫీచర్ కొన్ని పరికరాల్లోనూ అందుబాటులో లేదు. కానీ రాబోయే రోజుల్లో అన్ని పరికరాల్లోనూ అందుబాటులో వస్తుందని సమాచారం. -
యూట్యూబ్‌లో కొత్త ఫీచర్స్.. ఇవెలా పనిచేస్తాయంటే?
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో సంస్థలు కూడా యూజర్లకు అనుగుణంగా తమ యాప్‌లను అప్డేట్ చేయడం లేదా కొత్త ఫీచర్స్ తీసుకురావడం చేయాలి. ఇందులో భాగంగానే గూగుల్ యాజమాన్యంలోని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మూడు కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇవన్నీ యూట్యూబ్ ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.స్లీప్ టైమర్ ఫీచర్పేరుకు తగ్గట్టుగానే.. యూజర్ ఏదైనా కంటెంట్‌ను చూస్తున్నప్పుడు లేదా వింటున్నప్పుడు టైమర్‌ను సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న టైమ్ తరువాత వీడియోని ఆటోమేటిక్‌గా పాజ్ చేయవచ్చు. వీడియో చూస్తూ నిద్రపోయే వ్యక్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. యూజర్లు మొబైల్, డెస్క్‌టాప్‌లోని సెట్టింగ్‌ల మెను నుంచి స్లీప్ టైమర్ ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు.డ్రీమ్ స్క్రీన్ ఫీచర్ఇది క్రియేటర్లకు ఉపయోగపడే ఫీచర్. ఇది మొబైల్ యాప్‌లో పనిచేస్తుంది. 'ఏఐ'ను ఉపయోగించి గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్లను క్రియేట్ చేసుకోవడానికి యూజర్లను అనుమతిస్తుంది. షార్ట్ కెమెరా ఓపెన్ చేయడానికి వినియోగదారులు ప్లస్ (+) చిహ్నం మీద క్లిక్ చేసి.. గ్రీన్ స్క్రీన్ ఎంచుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలో మాత్రమే కనిపిస్తాయి.ఆన్సర్ బాట్ ఫీచర్ప్రత్యేకించి ఈ ఫీచర్‌ను మొబైల్ యూజర్ల కోసం పరిచయం చేశారు. వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతున్నప్పుడు వీడియోకు సంబంధించి అనుమానాలు వస్తే.. వాటిని పరిష్కరించుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇది కూడా ఏఐ బేస్డ్ ఫీచర్. యూట్యూబ్‌లోని అన్ని వీడియోలు ఈ కొత్త ఫీచర్‌ను కలిగి ఉండవు. ఇది వీడియో కింద ఉన్న ఆస్క్ ట్యాబ్ రూపంలో అర్హులైనవారికి మాత్రమే వీడియోలలో కనిపిస్తుంది. యూజర్లు ముందుగా సెట్ చేసిన ప్రశ్నలను ఎంచుకోవడం మాత్రమే కాకుండా.. సొంత ప్రశ్నలను టైప్ చేసుకునే వెసులుబాటు ఇందులో ఉంటుంది.యూట్యూబ్ కొత్త ఫీచర్స్ కొన్ని రోజులు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. స్లీప్ టైమర్ ఫీచర్ సెప్టెంబర్ 2 వరకు, డ్రీమ్ స్క్రీన్ ఫీచర్ ఆగస్ట్ 20 వరకు, ఆన్సర్ బాట్ ఫీచర్ ఆగస్ట్ 21 వరకు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. టెస్టింగ్ పూర్తయిన తరువాత భవిష్యత్తులో ఇవి వినియోగంలోకి వస్తాయి. కానీ ఇప్పుడునా వస్తాయి అనేది తెలియాల్సి ఉంది. -
గూగుల్ ‘మ్యాప్’ వార్!
న్యూఢిల్లీ: దేశీయంగా ఓలా మ్యాప్స్ నుంచి పోటీ తీవ్రతరం కావడంతో గూగుల్ జోరు పెంచింది. భారత్‌లో యూజర్లను ఆకట్టుకోవడం కోసం గురువారం పలు సరికొత్త ఫీచర్లను ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ స్టేషన్లు, ఫ్లైఓవర్లతో పాటు కారు డ్రైవర్లు ఇరుకు సందుల్లో చిక్కుకోకుండా ఏఐ ఆధారిత రూటింగ్ సమాచారం వంటివి ఇందులో ఉన్నాయి. ఓలా ఫౌండర్, సీఈఓ భవీశ్ అగర్వాల్ దేశీ డెవలపర్ల కోసం ఓలా మ్యాప్స్‌ను అందుబాటులోకి తీసుకొచి్చన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, గూగుల్ మ్యాప్స్‌ను వాడొద్దని కూడా ఆయన పిలుపునివ్వడంతో మ్యాప్స్ వార్‌కు తెరలేచింది. దేశీ డెవలపర్లకు గాలం వేయడానికి ఏడాది పాటు ఓలా మ్యాప్స్‌ను ఉచితంగా వాడుకునే సదుపాయాన్ని కూడా అగర్వాల్ ప్రకటించడం విశేషం. దీంతో గూగుల్ కూడా వెంటనే రంగంలోకి దిగింది. గూగుల్ మ్యాప్స్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే డెవలపర్లకు ఆగస్ట్ 1 నుంచి 70 శాతం వరకు ఫీజులను తగ్గిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. దేశీ యూజర్లకు మేలు చేసేందుకే... ఓలా పోటీ కారణంగానే ధరల కోత ప్రకటించాల్సి వచి్చందా అన్న ప్రశ్నకు గూగుల్ మ్యాప్స్ వైస్ ప్రెసిడెంట్, జీఎం మిరియమ్ డేనియల్ స్పందిస్తూ... వాస్తవానికి పోటీ సంస్థలపై మేము దృష్టి సారించమని, తమ యూజర్లు, డెవలపర్ల ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘మా పార్ట్నర్స్ చాన్నాళ్లుగా ధరలను తగ్గించాలని కోరుతున్నారు. మా యూజర్లతో పాటు డెవలపర్లకు మేలు చేయడంపై దృష్టి సారించాం. అందులో భాగంగానే రేట్ల కోతను ప్రకటించాం. వ్యాపార సంస్థలు, డెవలపర్లు, ప్రజలకు డిజిటల్ మ్యాపింగ్‌ను మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దడం కోసమే ఏఐ ఆధారిత రూటింగ్ తదితర కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టాం’ అని వివరించారు. భారత్‌లో ఇరుకు రోడ్లు అనేవి కారు డ్రైవర్ల సహనానికి పరీక్ష పెడుతుంటాయని, అందుకే వాటిని తప్పించుకునే విధంగా ఏఐ ఆధారిత రూటింగ్ ఆల్గారిథమ్ వ్యవస్థను తీర్చిదిద్దామని చెప్పారు. శాటిలైట్ చిత్రాలు, స్ట్రీట్ వ్యూతో పాటు భవనాల మధ్య దూరం, రోడ్ల రకాల వంటి సమాచారంతో రోడ్ల కచి్చతమైన వెడల్పును మ్యాప్స్‌లో చూడొచ్చని, తద్వారా సాధ్యమైనంత వరకు ఇరుకు సందుల్లో చిక్కుకోకుండా తప్పించుకునేందుకు వీలవుతుందని బ్లాగ్ పోస్ట్‌లో వివరించారు. మరోపక్క, బైకర్లు, పాదచారులు, ఇతర ప్రయాణికులు ఇప్పుడు ఈ ఇరుకు రోడ్లలో మరింత సురక్షితంగా, నమ్మకంగా వెళ్లొచ్చని చెప్పారు. అలాగే సంబంధిత రూట్లో ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు ఉన్నాయో కూడా ముందుగానే తెలియజేసే ఫీచర్ కూడా భారత్‌లో యూజర్లకు చాలా బాగా ఉపయోగపడుతుందన్నారు.ముందుగా ఎనిమిది నగరాల్లో... హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, ఇండోర్, భోపాల్, భువనేశ్వర్, గౌహతి మొత్తం 8 నగరాల్లో ఈ ఫీచర్లు ఆండ్రాయిడ్ పరికరాల్లో ఈ వారంలోనే అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని నగరాలతో పాటు ఐఓఎస్, కార్ప్లే సపోర్ట్‌ను కూడా త్వరలో తీసుకొస్తామని గూగుల్ పేర్కొంది. టూవీలర్ ఈవీ యూజర్లు చార్జింగ్ స్టేషన్ల సమాచారాన్ని అందించేందుకు ఎలక్ట్రిక్ పే, అథర్, కాజామ్, స్టాటిక్ వంటి దిగ్గజ చార్జింగ్ ప్రొవైడర్లతో గూగుల్ జట్టు కట్టింది. తద్వారా 8,000 చార్జింగ్ స్టేషన్ల సమాచారం దేశీయంగా గూగుల్ మ్యాప్స్‌తో పాటు గూగుల్ సెర్చ్‌లో కూడా లభిస్తుంది. కాగా, ఈ ఫీచర్‌ను తొలిసారిగా భారత్‌లోనే ప్రవేశపెట్టడం గమనార్హం. -
మెటా ఏఐలో కొత్త ఫీచర్.. ఇదెలా పనిచేస్తుందంటే?
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మెటా ఏఐ కొత్త ఫీచర్ ఆవిషక్రయించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.నచ్చిన స్టైల్లో ఫోటోలు క్రియేట్ చేసుకోవడానికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. దీనిని ఎలా ఉపయోగించాలో కూడా మెటా సీఈఓ వీడియోలో చూపిస్తారు. యూజర్ తన ముఖాన్ని స్కాన్ చేయి తనకు నచ్చిన విధంగా ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు.జుకర్‌బర్గ్ వీడియోలో మొదట తన ముఖాన్ని స్కాన్ చేసుకున్నారు. ఆ తరువాత సెర్చ్ బార్లో నచ్చిన విధంగా ఎలాంటి ఇమేజ్ కావాలో సెర్చ్ చేయాలి. అప్పుడు మెటా మీరు అడిగినట్లుగా ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. జుకర్‌బర్గ్ తనను గ్లాడియేటర్‌గా చూపించమని సెర్చ్ చేశారు. అప్పుడు మెటా అలాంటి ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఆ తరువాత బాయ్ బ్యాండ్, గోల్డ్ వేసుకున్నట్లు ఇలా ఫోటోలను క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ వీడియోలో చూడవచ్చు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
యూట్యూబ్ షార్ట్స్ చేస్తున్నారా? కొత్త ఫీచర్స్ చూశారా..
మారుతున్న కాలానికి అనుకూలంగా యూట్యూబ్ కూడా అప్డేట్ అవుతోంది. ఇందులో భాగంగానే కంటెంట్ క్రియేటర్స్ లేదా వినియోగదారుల కోసం తాజాగా నాలుగు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.టెక్స్ట్-టు-స్పీచ్షార్ట్లకు టెక్స్ట్-టు-స్పీచ్ వీడియో నేరేషన్ ఫీచర్ ఒకటి. ఇది ఆర్టిఫిషియల్ వాయిస్ఓవర్ను అందించడానికి ఉపయోగపడుతుంది. టిక్‌టాక్‌లో చూసిన అదే ఫీచర్ ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. మొదట టెక్స్ట్ రెడీ చేసుకున్న తరువాత.. స్క్రీన్ ఎగువన ఎడమవైపు మూలలో ఉండే యాడ్ వాయిస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ మీకు కావలసిన వాయిస్‌ని ఎంచుకోగలుగుతారు. అయితే ప్రస్తుతం యూట్యూబ్‌లో కేవలం నాలుగు వాయిస్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.ఆటో జనరేటెడ్ క్యాప్షన్క్యాప్కట్ వంటి థర్డ్-పార్టీ యాప్‌ని ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే మీరు మీ వీడియోలకు యాడ్ చేసుకోగలిగే ఆటోమేటిక్ క్యాప్షన్లను యూట్యూబ్ పరిచయం చేస్తోంది. యూట్యూబ్ షార్ట్‌లకు ఇప్పటికే ఉన్న మాన్యువల్ టెక్స్ట్ ఓవర్లే ఫీచర్ లాగానే, వినియోగదారులు వివిధ ఫాంట్లు, రంగులతో క్యాప్షన్ల స్టైల్ కస్టమైజ్ చేసుకోవచ్చు.మైన్ క్రాఫ్ట్ ఎఫెక్ట్స్యూట్యూబ్ తీసుకువచ్చిన మరో ఫీచర్ మైన్ క్రాఫ్ట్ ఎఫెక్ట్స్. ఇందులో గ్రీన్ స్క్రీన్ బ్యాక్‌గ్రౌండ్, మైన్ క్రాఫ్ట్ రష్ వంటి మినీ గేమ్ వంటివి ఉన్నాయి.వర్టికల్ వీడియో ఫార్మాట్మరింత మంది యూట్యూబ్ క్రియేటర్లను ఆకర్శించమే లక్ష్యంగా వర్టికల్ వీడియో ఫార్మాట్ ఫీచర్ కూడా తీసుకువచ్చింది. ఇది కూడా టిక్‌టాక్‌లో మాదిరిగా ఉంటుంది. మొత్తం మీద మరింత మందిని ఆకర్శించడమే ప్రధానంగా యూట్యూబ్ ఈ ఫీచర్స్ తీసుకువచ్చినట్లు స్పష్టమవుతోంది. -
యాపిల్ కీలక ప్రకటన.. ఐఫోన్ 16లో గూగుల్ జెమినీ!
యాపిల్ కంపెనీ తన ఐఫోన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను మెరుగుపరచడానికి కొత్త భాగస్వామ్యాన్ని ప్రకటించనుంది. గూగుల్ జెమినీ ఏఐని ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ లైనప్‌తో సహా దాని తర్వాతి తరం ప్లాట్‌ఫారమ్‌లలోకి అనుసంధానం చేయడం కోసం యూఎస్ బేస్డ్ టెక్ దిగ్గజం గూగుల్‌తో ఒక ఒప్పందాన్ని ఖరారు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.గతంలో ఏఐ కోసం యాపిల్ కంపెనీ మెటాతో చర్చలు జరిపింది. ఈ చర్చలు విఫలం కావడంతో.. సంస్థ గూగుల్ జెమిని కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే.. ఐఫోన్ 16లో గూగుల్ జెమినీ అందుబాటులో రానుంది. ఆ తరువాత యాపిల్ ఫోన్లు అన్నీ కూడా గూగుల్ జెమినీ ఏఐ పొందే అవకాశం ఉందని సమాచారం.యాపిల్ గూగుల్ జెమినినీ ఆన్‌బోర్డ్ చేసినట్లయితే.. ఐఓఎస్, మ్యాక్ఓఎస్ వినియోగదారులు ఇద్దరూ కూడా ఈ మూడు చాట్బాట్లను ఉపయోగించుకోవచ్చు. అయితే యాపిల్ యూజర్ ఏది ఉపయోగించుకోవాలో అనే విషయాన్ని ముందుగానే నిర్దారించుకోవచ్చు. కాబట్టి యూజర్ ఇష్టానుసారంగానే ఏ ఇంటెలిజెన్స్ అయినా ఉపయోగించుకోవచ్చు.జూన్‌లో యాపిల్ యాన్యువల్ డెవలపర్ ఫోకస్డ్ ఈవెంట్.. వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)లో తన సొంత ఏఐ ఫీచర్ల సూట్‌ను ఆవిష్కరించింది. దీనిని సమిష్టిగా యాపిల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు. ఇది ప్రస్తుతానికి ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ కోసం మాత్రమే అందుబాటులో ఉంది. -
క్రోమ్‌లో ఐదు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగపడతాయంటే?
కంప్యూటర్ లేదా మొబైల్లో ఏదైనా సెర్చ్ చేయాలంటే చాలామందికి క్రోమ్ గుర్తొస్తుంది. క్రోమ్ ఇప్పుడు యూజర్ల కోసం ఐదు కొత్త ఫీచర్స్ తీసుకువచ్చింది. ఇంతకీ క్రోమ్ తీసుకువచ్చిన ఈ కొత్త ఫీచర్స్ ఏంటి? అవి ఎలా పనిచేస్తాయని విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.👉సమీపంలో ఉండే ఏదైనా స్థలాలను సెర్చ్ చేయాలనుకున్నప్పుడు క్రోమ్ బార్లో ఎంటర్ చేయగానే మీ పనిని మరింత సులభతరం చేయడానికి మూడు ఆప్షన్స్ చూపిస్తుంది. ఉదాహరణకు మీరు ఓ రెస్టారెంట్ లేదా షాపింగ్ మాల్ వెళ్లాలనుకున్నప్పుడు.. క్రోమ్ బార్లో సెర్చ్ చేయగానే దానికి కింద కాల్, డైరెక్షన్, రివ్యూ అనేవి కనిపిస్తాయి. ఇవి షార్ట్‌కట్ బటన్స్ అన్నమాట. ఈ ఫీచర్ ఇప్పుడు కేవలం ఆండ్రాయిడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో యాపిల్ క్రోమ్‌లో కూడా అందుబాటులోకి వస్తాయి.👉ఐప్యాడ్లు, ఆండ్రాయిడ్ టాబ్లెట్లు వాటి పెద్ద స్క్రీన్ పరిమాణాలను సద్వినియోగం చేసుకోవడానికి.. క్రోమ్ అడ్రస్ బార్‌ను రిఫ్రెష్ చేసింది. ఒకసారి అడ్రస్ బార్ ఉపయోగించిన తరువాత.. మళ్ళీ తిరిగి వెళ్తే అప్పటికే హిస్టరీ లేదా వెబ్సైట్ డ్రాప్ డౌన్ క్రింద ట్రెండింగ్ అంశాలను చూపిస్తుంది.👉ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలో షార్ట్‌కట్స్ అందిస్తోంది. ఉదాహరణకు సిటీ మెట్రో కోసం సమయాలను చూడడానికి మీరు సాధారణంగా షెడ్యూల్స్ అని టైప్ చేసి ఉండవచ్చు. దాన్ని మళ్ళీ మీరు సెర్చ్ చేసినప్పుడల్లా వెంటనే కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మీ సమయాన్ని సేవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది.👉ఐఓఎస్‌లో ట్రేండింగ్ సెర్చ్.. అంటే మీరు క్రోమ్ సెర్చ్ బార్లో.. సెర్చ్ చేయడానికి ముందే.. ట్రెండింగ్‌లో ఉన్న విషయాలు కింద కనిపిస్తాయి.👉ఐఓఎస్‌లో గతంలో వెతికిన విషయాలకు సంబంధించిన వార్తలు, స్పోర్ట్స్ కార్డులు డిస్కవర్ ఫీడ్‌లో కనిపిస్తాయి. ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉంది. మీరు మూడు-చుక్కల మెనుని ఎంచుకోవడం ద్వారా క్రోమ్ మొబైల్ యాప్‌లో డిస్కవర్ ఫీడ్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు. -
ఇన్స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్.. ఇదెలా పనిచేస్తుందటే?
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ యూజర్ల కోసం 'క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్' అనే సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. ఇప్పటి వరకు లైవ్ స్ట్రీమ్ అనేది ఫాలోవర్స్ అందరికి కనిపించేది. తాజాగా అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్ క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తుంది.క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో కావలసిన వాళ్ళను యాడ్ చేసుకోవచ్చు, లేదా రిమూవ్ చేయవచ్చు. యూజర్ల భద్రతకు పెద్దపీట వేయడానికి ఇన్స్టాగ్రామ్ ఈ కొత్త ఫీచర్ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఇన్‌స్టా అకౌంట్ పబ్లిక్ అయితే ఎవ్వరైనా లైవ్ స్ట్రీమింగ్‌లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ ద్వారా.. యూజర్ లైవ్ స్ట్రీమింగ్‌లో ఎవరైతే ఉండాలనుకుంటారో వారిని మాత్రం క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో యాడ్ చేసుకోవచ్చు.ఇన్స్టాగ్రామ్.. క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్ అనే సరికొత్త ఫీచర్ యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా, మెటా ఇన్‌స్టాగ్రామ్‌ను మరింత ప్రైవేట్ ప్లేస్‌గా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గత ఏడాది నవంబర్‌లో.. గ్రిడ్‌లో పోస్ట్‌లను సన్నిహితులకు మాత్రమే కనిపించేలా చేయడానికి వినియోగదారులను అనుమతించే ఆప్షన్ ప్రవేశపెట్టింది.🚨 NEW 🚨Go Live with your Close Friends to ask for OOTD advice or just chat in real time 🎥✨ pic.twitter.com/wDYjqw1N4f— Instagram (@instagram) June 20, 2024 -
'ఏఐ-టెక్నాలజీ'తో కూడిన.. స్నాప్‌చాట్ లెన్స్ స్టూడియో!
ఆగ్యుమెంటెడ్ రియాలిటీ(ఏఆర్) ఫీల్డ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘స్నాప్‌చాట్’ లేటెస్ట్ జెనరేటివ్ ఏఐ టెక్నాలజీని లాంచ్ చేసింది. ఇప్పుడు ఏఐ డెవలపర్లు ఏఐ–పవర్డ్ లెన్సెస్ను క్రియేట్ చేయవచ్చు. స్నాప్‌చాట్ యూజర్లు వాటిని తమ కంటెంట్‌లో ఉపయోగించవచ్చు.డెవలపర్ప్రోగ్రామ్ ‘లెన్స్ స్టూడియో’కు సంబంధించిన అప్‌గ్రేడెడ్ వెర్షన్ గురించి ప్రకటించింది స్నాప్‌చాట్. దీనితో ఆర్టిస్ట్‌లు, డెవలపర్లు స్నాప్‌చాట్, వెబ్సైట్, యాప్స్ కోసం ఏఆర్ ఫీచర్లను క్రియేట్ చేయవచ్చు. ఏఆర్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడానికి పట్టే సమయాన్ని వారాల నుంచి గంటలకు తగ్గిస్తుంది లెన్స్ స్టూడియో.ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్..డిస్ప్లే: 6.78 అంగుళాలురిఫ్రెష్రేట్: 120 హెచ్జడ్రిజల్యూషన్: 1080*2436 పిక్సెల్స్కనెక్టివిటీ: 5జీమెమోరీ: 256జీబి 12జీబి ర్యామ్ఫ్రంట్ కెమెరా: 32 ఎంపీబ్యాటరీ: 4600 ఎంఏహెచ్బరువు: 190 గ్రా.స్క్రీన్ ఎక్స్పాండర్ అండ్ మాగ్నిఫైయర్..బ్రాండ్: పోట్రానిక్స్మోడల్: పీవోఈఆర్–1899ప్రాడక్ట్ డైమెన్షన్స్: 10*3*3 సీఎం 50గ్రా.కంపెటబుల్ డివైజెస్: మానిటర్, ట్యాబ్, స్మార్ట్ఫోన్ఆల్–ఇన్–వన్ స్క్రీన్ క్లీనర్..బ్రాండ్: సౌన్స్కలర్: బ్లాక్మోడల్ నెంబర్: ఎస్సీఎంజీబీకె–బీకె5బరువు: 200 గ్రాస్పెషల్ ఫీచర్స్: పోర్టబుల్, నాన్–స్లిప్, స్ట్రెచబుల్, ఫోల్డబుల్లెన్స్ మెటీరియల్: గ్లాస్ఇవి చదవండి: ‘మై గ్లామ్’లో మోడళ్లు.. -
వాట్సాప్‌లో మూడు అదిరిపోయే ఫీచర్లు
వాట్సాప్ ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం అప్డేటెడ్ ఫీచర్స్ పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ తరుణంలో తాజాగా ఆడియోతో స్క్రీన్ షేరింగ్, పార్టిసిపెంట్ కెపాసిటీ, స్పీకర్ స్పాట్లైట్ ఫీచర్ అనే మూడు కొత్త ఫీచర్స్ తీసుకువచ్చింది.ఆడియోతో స్క్రీన్ షేరింగ్: వాట్సాప్ ఇప్పుడు వినియోగదారులు ఆడియోతో స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ద్వారా తమ స్క్రీన్ & ఆడియోను ఏకకాలంలో పంచుకునేందుకు వీలుంటుంది. స్క్రీన్ షేరింగ్ అనేది గతంలోనే వాట్సాప్ పరిచయం చేసినప్పటికీ.. ఇప్పుడు మెరుగైన ఆడియో సఫోర్ట్ జోడించింది.వీడియో కాల్లలో పెరిగిన పార్టిసిపెంట్ కెపాసిటీ: ఇప్పటి వరకు ఒక మీటింగ్ అంటే జూమ్ లేదా గూగుల్ మీట్ వంటి యాప్స్ ఉపయోగించి ఉంటారు. వాట్సాప్ తీసుకువచ్చిన ఈ కొత్త ఫీచర్ ద్వారా ఒకేసారి 32 మంది వీడియో కాల్లో పాల్గొనవచ్చు.స్పీకర్ స్పాట్లైట్ ఫీచర్: కాల్లో ఎవరు మాట్లాడుతున్నారో ట్రాక్ చేయడం కోసం స్మార్ట్‌ఫోన్ యాప్‌లో కష్టంగా అనిపించినప్పటికీ, మాట్లాడే వ్యక్తిని ఆటోమేటిక్‌గా హైలైట్ చేయడానికి స్పాట్లైట్ ఫీచర్‌ను కూడా జోడించింది.వాట్సాప్ ఇప్పుడు ఆడియో, వీడియో నాణ్యతను మెరుగుపరచడం మీద ఎక్కువ ద్రుష్టి సారించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సరికొత్త ఫీచర్స్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్స్ అన్నీ త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ తప్పకుండా వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. -
వాట్సాప్ నుంచి వేరే యాప్‌లకూ మెసేజ్‌లు!
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ వినియోగదారులకు అనువుగా యాప్‌లో మార్పులు చేస్తున్న ‘వాట్సాప్’ త్వరలో మరో ఫీచర్‌ను జతచేయనుంది. ఇకపై వాట్సాప్ నుంచి సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఇతర యాప్‌లకూ మెసేజ్‌లను పంపుకోవచ్చు. దీనికి అనువుగా కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌లో త్వరలో తీసుకురానున్నారు. దీంతో ఇతర సామాజిక మాధ్యమాల వేదికలపైనా వాట్సాప్ నుంచి మెసేజ్‌లను షేర్ చేసుకోవచ్చు. ఇతర చాట్స్ కోసం ప్రత్యేకంగా, విడిగా ఒక చాట్ ఇన్ఫో స్క్రీన్ ఒకటి కనిపించేలా ఫీచర్‌ను వాట్సాప్ సిద్ధంచేస్తోంది. ఈ కొత్త ఫీచర్‌కు తుది మెరుగులు దిద్ది అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ నిపుణులు తలమునకలైనట్లు తెలుస్తోంది. వాట్సాప్‌తో మెసేజ్‌ల షేరింగ్‌లపై సిగ్నల్, టెలిగ్రామ్ యాప్‌లు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని వాబేటాఇన్ఫో అనే సంస్థ స్పష్టంచేసింది. ఏఏ యాప్‌లతో అనుసంధానం అవ్వాలనేది ఆయా వాట్సాప్ యూజర్ల స్వీయనిర్ణయం, స్వీయ నియంత్రణ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లదని వివరించింది. బీటీ వెర్షన్‌ను టెస్ట్చేస్తున్న కొన్ని సెలక్ట్ చేసిన గ్రూప్‌లకు మాత్రమే ఈ వాట్సాప్ ప్రొఫైల్ స్క్రీన్‌షాట్ అడ్డుకునే ఫీచర్ అందుబాటులో ఉంది. మరి కొద్ది వారాల్లో ఈ ఫీచర్‌ను యూజర్లు అందరికీ అందుబాటులోకి తేనున్నారు. -
వాట్సాప్‌లో కీలక మార్పు.. ఇక ఆ పని చేయడానికి నో ఛాన్స్
వినియోగదారుల వ్యక్తిగత భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫేమస్ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' (WhatsApp) ఓ కీలకమైన మార్పుకు సిద్ధమైంది. వినియోగదారు అనుమతి లేకుండా వ్యక్తిగత ఫోటోలను స్క్రీన్ షాట్ తీసుకోవడాన్ని నిరోధించడానికి వాట్సాప్ ప్రయత్నిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తుల కాల్ బ్లాకింగ్, చాట్‌లాక్ వంటి ఫీచర్స్ మాదిరిగానే డిస్ప్లే పిక్చర్ లాక్ అనే ఫీచర్ కూడా త్వరలోనే రానున్నట్లు సమాచారం. ఇది మనకు తెలియని వ్యక్తులు మన వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను స్క్రీన్ షాట్ తీసుకోకుండా నిరోధిస్తుంది. ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాలు వెల్లడి కాలేదు. ఇదీ చదవండి: రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా? రాబోయే రోజుల్లో మనకు నచ్చిన వాళ్లకు మాత్రమే ఫోటో కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వల్ల మనకు నచ్చని వారికి ఫోటో కూడా కనిపించకుండా చేయొచ్చని తెలుస్తోంది. కాబట్టి మనకు నచ్చని వారు మన ఫోటోను స్క్రీన్ షాట్ తీసుకోలేరు. డీప్ ఫేక్‌లు చెలరేగుతున్న సమయంలో కంపెనీ తీసుకువస్తున్న ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. -
రెనో కార్లలో కొత్త వేరియంట్లు వచ్చాయి.. చూశారా?
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనో తాజాగా మూడు మోడల్స్ కార్లలో అయిదు కొత్త వేరియంట్లను దేశీ మార్కెట్లో తాజాగా ప్రవేశపెట్టింది. క్విడ్, ట్రైబర్, కైగర్ మోడల్స్ వీటిలో ఉన్నాయి. వీటి ధర రూ. 4.69 లక్షల నుంచి రూ. 10.99 లక్షల వరకు (ఎక్స్ షోరూం) ఉంటుందని సంస్థ తెలిపింది. మూడు మోడల్స్‌లో కలిపి మొత్తం మీద పది కొత్త ఫీచర్లను జోడించినట్లు రెనో ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. మరోవైపు, రెనో, రెనోయేతర యూజ్డ్ కార్ల విక్రయాలు, కొనుగోళ్ల కోసం రెన్యూ పేరిట కొత్త బ్రాండ్‌ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. వచ్చే మూడేళ్లలో భారత మార్కెట్లో అయిదు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు వెంకట్రామ్ తెలిపారు. వీటిలో కొత్త మోడల్స్‌తో పాటు కైగర్, ట్రైబర్‌లో కొత్త వేరియంట్లు కూడా ఉంటాయని చెప్పారు. వివిధ సవాళ్ల కారణంగా గతేడాది అమ్మకాలు ఒక మోస్తరుగానే నమోదైనప్పటికీ కొత్త మోడల్స్ ఊతంతో ఈ ఏడాది రెండంకెల స్థాయి వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెనో గతేడాది దేశీయంగా 49,000 కార్లను విక్రయించగా, 28,000 వాహనాలను ఎగుమతి చేసింది. ఇక ఎంట్రీ లెవెల్ కార్ల అమ్మకాలు మందగిస్తున్న నేపథ్యంలో చిన్న కారు క్విడ్ విక్రయాలను కొనసాగిస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. నిబంధనలు అనుమతించే వరకు సదరు సెగ్మెంట్లో అమ్మకాలను కొనసాగిస్తామని వెంకట్రామ్ స్పష్టం చేశారు. -
టెస్టింగ్ దశలో కొత్త ఫీచర్.. నచ్చిన ధరకే ఉబర్ రైడ్!
చాలామంది తమ నిత్యజీవితంలో ఎక్కడ ఏం కొనాలన్నా కొంత బేరమాడుతూ ఉంటారు, ఇక ఆటోలో ప్రయాణించాలంటే మాత్రం డ్రైవర్‌తో కొంత బేరమాడకుండా ఉండలేరు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ 'ఉబర్' ఓ కొత్త ఫీచర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు క్యాబ్ బుక్ చేసుకోవాలంటే సంస్థ యాప్‌లో ఎంత రేటు చూపిస్తే అంత చెల్లించాల్సి వచ్చేది, దీంతో బేరమాడే అవకాశం లేకుండా పోయింది. ఉబర్ పరిచయం చేయనున్న కొత్త ఫీచర్ 'ఉబర్ ఫ్లెక్స్’లో మనకు నచ్చిన రేటుకే క్యాబ్ ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఉబర్ పరిచయం చేయనున్న కొత్త ఫీచర్ ఒక రేటును కాకుండా.. యూజర్ ప్రయాణించే దూరం, సమయం వంటి వాటిని ఆధారంగా తీసుకుని తొమ్మిది ధరలను చూపిస్తుంది. ఇందులో వింభియోగదారుడు తనకు నచ్చిన రేటుని ఎంచుకోవచ్చు, అయితే ఆ రేటు డ్రైవర్‌కి నచ్చితే యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా రిజెక్ట్ చేయొచ్చు. ఇదీ చదవండి: చైనాను దాటేసిన భారత్.. త్వరలో అమెరికా! - ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఒకే రేటు దగ్గర నిలిచిపోకుండా.. కస్టమర్ తనకు నచ్చిన రేటును ఎంచుకునే అవకాశాన్ని ఉబర్ కల్పిస్తోంది. ఇది వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అదే సమయంలో తక్కువ ధరకే ప్రయాణం చేసే వెసులుబాటుని పొందవచ్చు. ఈ ఫీచర్‌ను ఉబర్ కంపెనీ భారతదేశంలో ఔరంగాబాద్, ఆజ్మీర్, బరేలీ, చండీగఢ్, కోయంబత్తూర్, దేహ్రాదూన్, గ్వాలియర్, ఇందౌర్, జోధ్‌పుర్, సూరత్ ప్రాంతాల్లో టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. భారత్ మాత్రమే కాకుండా లాటిన్ అమెరికా, కెన్యా దేశాల్లో కూడా సంస్థ ఈ ఫీచర్‌ను అమలుచేసే అవకాశం ఉంది. -
మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ - కొత్త ఫీచర్స్‌తో సరికొత్త ఎక్స్పీరియన్స్..
Microsoft Outlook Lite: ప్రముఖ టెక్ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' (Microsoft) ఔట్లుక్ లైట్లో కొత్త ఫీచర్లను పరిచయం చేయడంతో పాటు, భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇమెయిల్ అండ్ ఎస్ఎమ్ఎస్ యాప్ పరిచయం చేసింది. వీటి గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ (Microsoft Outlook Lite) అనేది భారతదేశంలోని వినియోగదారుల కోసం కంపెనీ రూపొందించిన ఒక ప్రత్యేకమైన యాప్. ఇతరులతో కమ్యూనికేట్ అవ్వడానికి అనుకూలంగా ఇది స్థానిక భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది. ఇది 3G, 4G, 5G లాంటి ఏ నెట్‌వర్క్‌లో అయినా చాలా వేగంగా పనిచేస్తుంది. ప్రాంతీయ భాషల్లో.. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ భారతదేశంలో విభిన్న భాషా వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. దీని వల్ల కమ్యూనికేషన్ మరింత సులభమవుతుంది. ఇందులో వాయిస్ టైపింగ్, ట్రాన్స్లేషన్ వంటివి మాత్రమే కాకుండా ప్రాంతీయ భాషల్లో ఇమెయిల్ చదవడం వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులోని లేటెస్ట్ ఫీచర్స్ ద్వారా వినియోగదారుడు తమ మాతృభాష లేదా ప్రాధాన్య భాషలో ఇమెయిల్‌లను కంపోజ్ చేసుకోవచ్చు, తద్వారా సులభంగా చదువుకోవచ్చు. అంతే కాకుండా ఒక భాషలో ఈ కంటెంట్ టైప్ చేసి దాన్ని తమకు నచ్చిన భాషలో ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు.. హిందీలో ఇమెయిల్ టైప్ చేసి, దాన్ని ఆటోమాటిక్‌గా ఇంగ్లీష్‌లో లేదా ఇతర భాషల్లోకి మార్చుకోవాలనుకున్నప్పుడు ఔట్లుక్ లైట్ సహాయపడుతుంది. ప్రస్తుతం ఇది హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ వంటి ఐదు భాషలకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఇది మరిన్ని భాషలు, మాండలికాల్లో కూడా అందుబాటులో ఉంటుందని సమాచారం. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ ఎస్ఎమ్ఎస్.. ఇక ఎస్ఎమ్ఎస్ మెసేజింగ్ విషయానికి వస్తే, ఔట్లుక్ లైట్ కేవలం ఇమెయిల్స్‌కి మాత్రమే కాకుండా.. ఎస్ఎమ్ఎస్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ట్రాన్స్లేషన్, ప్రమోషనల్ ఇన్ఫర్మేషన్ వంటి వాటి కోసం సంస్థ 'స్మార్ట్ ఇన్‌బాక్స్' అందిస్తుంది. ఇది సమాచారాన్ని సులభతరం చేయడమే కాకుండా.. సంబంధిత సందేశాలను ఒకే చోట చూడటానికి అవకాశం కల్పిస్తుంది. అంతే కాకుండా ముఖ్యమైన అపాయింట్మెంట్లు, ట్రావెల్ బుకింగ్స్, బిల్ పేమెంట్స్, గ్యాస్ బుకింగ్ వంటి వాటిని గుర్తు చేయడానికి ఉపయోగపడుతుందని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి ఔట్లుక్ లైట్ భారతీయ ప్రాంతీయ భాషల్లో అందుబాటులో లేనట్లు తెలుస్తోంది, కంపెనీ త్వరలోనే ఈ ఫెసిలిటీని కూడా అందించే అవకాశం ఉంది. ఆ తరువాత వినియోగదారుడు తనకు నచ్చిన భాషల్లో మెసేజస్ చదువుకోవచ్చు. నచ్చిన భాషలో అనువాదం చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ ఫీచర్స్ పరిచయం చేసిన సందర్భంగా, మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ & మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ డివైజెస్, ఇండియా గ్రూప్ కార్పోరేట్ వైస్ ప్రెసిడెంట్ 'రాజీవ్ కుమార్' మాట్లాడుతూ.. భారతదేశం టెక్నాలజీలో దూసుకెళ్తున్న తరుణంలో డిజిటల్ అనుభవాలను పెంపొందించడంలో ఔట్లుక్ లైట్ ఫీచర్స్ ఉపయోగపడతాయని, వినియోగదారుల మధ్య బలమైన కమ్యూనికేషన్ పెంపొందించడం సహాయపడతాయని వెల్లడించారు. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం.. ప్రతి వ్యక్తి లేదా వినియోగదారుడు తన ప్రాధాన్య భాషతో సంబంధం లేకుండా ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి, రోజువారీ పరస్పర చర్యలను సులభతరం చేయడంలో ఇది సహకరిస్తుందని చెబుతూ.. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఫీచర్స్ తీసుకురావడంలో కంపెనీ కృషి చేస్తుందని వివరించారు. -
వొడాఫోన్-ఐడియా కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వీఐ మ్యాక్స్ ప్లాన్లలో కొత్త ఫీచర్లు
న్యూఢిల్లీ: టెలికం సేవల సంస్థ వీఐ (వొడాఫోన్–ఐడియా) కొత్తగా మ్యాక్స్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో రెండు కొత్త ఫీచర్లను జోడించింది. డేటా షేరింగ్, నైట్ టైమ్ అన్లిమిటెడ్ డేటా వీటిలో ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం కస్టమర్లు ఎంచుకున్న ప్లాన్ పరిమితికి మించి 10 జీబీ నుంచి 25 జీబీ వరకు డేటాను అదనంగా పొందవచ్చు. దీన్ని మిగతా కుటుంబ సభ్యులు కూడా షేర్ చేసుకోవచ్చు. ఇక రాత్రి 12 గం. నుంచి ఉదయం 6 గం. వరకు ఉండే నైట్ టైమ్ అన్లిమిటెడ్ డేటా ఫీచర్‌ని మ్యాక్స్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు కూడా వర్తింపచేస్తున్నట్లు సంస్థ తెలిపింది. మొత్తం మీద రూ. 601 మ్యాక్స్ ఫ్యామిలీ ప్లాన్‌లో 2 కనెక్షన్లతో 120 జీబీ డేటా పొందవచ్చు. అంతకు పైబడిన ప్లాన్లలో 325 జీబీ వరకు పొందవచ్చు. -
iPhone 15 series: ఇంతవరకూ ఏ ఫోన్లోనూ లేని 9 ఫీచర్లు! అవి ఏంటంటే..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న స్మార్ట్ఫోన్లు.. యాపిల్ ఐఫోన్లు. కొత్త సిరీస్ ఐఫోన్లు విడుదలైనప్పుడల్లా ఏవో కొత్త ఫీచర్లను యాపిల్ కంపెనీ ప్రవేశపెడుతుంటుంది. ఇదే క్రమంలో ఇటీవల ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సారి ఐఫోన్ 15 సిరీస్‌పై అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఈ అంచనాలకు అనుగుణంగా యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్‌లో సీ-టైప్ యూఎస్బీ చార్జింగ్‌తో పాటు ఇప్పటివరకూ ఏ ఫోన్లోనూ లేని తొమ్మిది సరికొత్త ఫీచర్లను ఐఫోన్ 15 సిరీస్‌లో పరిచయం చేసింది. టైటానియం బాడీ కొత్త ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro), ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max)లను తేలికైన, దృఢమైన టైటానియంతో తయారు చేశారు. ఈ టైటానియం లోహాన్ని వ్యోమనౌకల్లో ఉపయోగిస్తారు. దీంతో ఈ రెండు ఫోన్లు ఇంతకు ముందు ఫోన్ల కంటే 10 శాతం తేలిగ్గా ఉంటాయి. పర్యావరణహితం లైట్ వెయిట్ టైటానియం డిజైన్ 100 శాతం రీసైకిల్ అల్యూమినియంతో తయారు చేసిన కొత్త సబ్‌స్ట్రక్చర్‌ను కలిగి ఉంది. వీటిలో 100 శాతం రీసైకిల్ కోబాల్ట్ బ్యాటరీలు అమర్చారు. అలాగే లెదర్ బ్యాక్ కేస్లకు బదులుగా 68 శాతం పోస్ట్-కన్స్యూమర్ రీసైకిల్ కంటెంట్‌తో తయారు చేసిన వోవెన్ ఫాబ్రిక్ కేస్‌లను ఉపయోగించారు. యాక్షన్ బటన్ సాధారణంగా చాలా స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక కెమెరా కీని చూస్తుంటాం. అయితే యాపిల్ ఈ సారి iPhone 15 Pro వెర్షన్లలో మ్యూట్ స్విచ్‌కి బదులుగా యాక్షన్ బటన్‌ను తీసుకొచ్చింది. ఈ బటన్ రోజూ ఉపయోగించే ఫంక్షన్ల కోసం షార్ట్‌కట్‌గా ఉంటుంది. Qi2 వైర్లెస్ ఛార్జింగ్ కొత్త ఐఫోన్లు సరికొత్త Qi2 వైర్లెస్ ఛార్జింగ్ స్టాండర్డ్‌తో వచ్చాయి. ఛార్జింగ్ కాయిల్స్ సరిగ్గా అమరేలా అదనపు మ్యాగ్నెట్ రింగ్‌ను ఇందులో ఇచ్చారు. దీనివల్ల వేగవంతమైన వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. అయితే వీటికి అధికారికంగా Qi2-సర్టిఫికెట్ ఇంకా రాలేదు. A17 ప్రో చిప్ మొదటి 3-నానోమీటర్ చిప్‌గా పిలిచే A17 ప్రో చిప్‌ను యాపిల్ iPhone 15 Pro, Pro Max ఫోన్లలో ఉపయోగించింది. ఈ చిప్ డివైజ్ పర్ఫామెన్స్‌ను మరింత మెరుగ్గా చేస్తుంది. యాపిల్ చరిత్రలో ఇది అతిపెద్ద GPU రీడిజైన్. కన్సోల్ గేమింగ్ యాపిల్ కొత్త ప్రాసెసర్, హార్డ్‌వేర్-యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్ (సాఫ్ట్వేర్ ఆధారిత రే ట్రేసింగ్ కంటే 4 రెట్లు వేగవంతమైనది) సామర్థ్యాలను వండర్లస్ట్ ఈవెంట్లో ప్రదర్శించింది. iPhone 15 Pro, Pro Max ఫోన్లలో మొదటిసారిగా కన్సోల్ గేమింగ్ టైటిల్స్ కనిపించనున్నాయి. 4K 60 FPS వీడియో రికార్డింగ్ కెమెరా విషయంలో యాపిల్ iPhone 15 ఫోన్లలో చాలా మార్పులు చేసింది. 4K 60 FPS వీడియో రికార్డింగ్ కోసం Pro Max బేస్ స్టోరేజ్ వేరియంట్లో 256 జీబీ స్టోరేజ్ ఇచ్చింది. 24MP సూపర్-హై-రిజల్యూషన్ డిఫాల్ట్ ఇమేజ్ క్వాలిటీ, ప్రాక్టికల్ ఫైల్ సైజ్‌లను బ్యాలెన్స్ చేసేందుకు కొత్తగా 24MP సూపర్-హై-రిజల్యూషన్ డిఫాల్ట్ సైజ్ ఫీచర్‌ను యాపిల్ ఐఫోన్ 15 ఫోన్లలో తీసుకొచ్చింది. 48MP మెయిన్ కెమెరాతో హై రిజల్యూషన్‌లో అద్భుతమైన ఫొటోలను తీసుకోవచ్చు. పోట్రెయిట్ మోడ్‌కి మారకుండానే పోట్రెయిట్ ఫొటోలను తీసే కొత్త ఫీచర్‌ను ఇందులో ఉంది. టెట్రాప్రిజం డిజైన్ జూమ్ ఫోటోగ్రఫీ అన్నది ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లలో ప్రత్యేకంగా మారింది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్లోని 12MP టెలిఫోటో లెన్స్ 120 mm వద్ద 5x జూమ్‌ను కలిగి ఉంది. దీంతో దూరంతో నుంచే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ వంటివి చేసుకోవచ్చు. టెలిఫోటో కెమెరా OIS, ఆటోఫోకస్ 3D సెన్సార్-షిఫ్ట్ మాడ్యూల్తో కూడిన టెట్రాప్రిజం డిజైన్‌ను కలిగి ఉంటుంది. -
ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్: అదిరిపోయే సరికొత్త ఫీచర్లు
Apple Wonderlust Event iOS 17 టెక్ దిగ్గజం ‘వండర్ లస్ట్’ పేరుతో యాపిల్ నిర్వహించనున్న మెగా ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. యాపిల్ కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని యాపిల్ పార్క్‌లో సెప్టెంబర్ 12న జరగనున్న 'వండర్లస్ట్' ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రేపు(సెప్టెంబరు 12, మంగళవారం) 15 సిరీస్‌తోపాటు, ఐప్యాడ్లు, కొత్త వాచ్ సిరీస్‌ను అభిమానుల కోసం లాంచ్ చేయనుంది. దీంతోపాటు ఈ ఈవెంట్లో కార్యక్రమంలో ఐవోఎస్ 17ను యాపిల్ ఆవిష్కరించనుంది. ముఖ్యంగా భారత యూజర్ల కోసం ఐవోఎస్ (ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్) 17లో ప్రత్యేక ఫీచర్లను, watchOS 10 లాంచింగ్ తేదీలను అందించనుందని తెలుస్తోంది. దీంతోపాటు యాపిల్ ఐఫోన్ 15 లైనప్‌ను USB-C పోర్ట్‌లతో అందించనుండటం మరో విశేషం కానుంది. ఐవోఎస్17లో ఇండియన్ ఫీచర్లు ఐఫోన్లలో ప్రధానంగా మూడు కొత్త ఫీచర్లను భారతీయ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. స్మార్ట్ఫోన్లలో డ్యూయల్ సిమ్ కార్డ్‌లకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో డబుల్ సిమ్.ఐవోఎస్ 17 ప్రైమరీ, సెకండరీ సిమ్ ప్రతీ సిమ్ కు మెస్సేజ్ కు సంబంధించి వేర్వేరు రింగ్ టోన్ పెట్టుకోవచ్చు.మిస్డ్ కాల్ కనిపిస్తే , ఆ నంబర్ కాంటాక్ట్ లిస్ట్ లో సేవ్ చేయకపోయినా నేరుగా కాల్ బ్యాక్ చేసుకోవచ్చు. బైలింగ్విల్ సిరి అసిస్టెంట్ ద్వారా ఒకటికి మించిన భాషలను టింగ్లీష్, హింగ్లీషు లాగా.. ఇంగ్లిష్, హిందీ కలిపి.. లేదంటే ఆంగ్లంతో తెలుగు, పంజాబీ, కన్నడ, మరాఠి భాషలను కలిపి మాట్లాడొచ్చు. అలాగే కీబోర్డ్‌లోనే బిల్టిన్ ట్రాన్సలేషన్ సపోర్టుతో తమిళం, తెలుగు, కన్నడ మలయాళంతో సహా 10 భారతీయ భాషల్లోకి అనువాదానికి మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా, పంజాబీ డిక్షనరీకి iOS 17 బీటా సపోర్ట్ ఉంటుందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. సిరీ ప్లీజ్ సెట్ అలారమ్ మ్యూజిక్ ప్లే లాంటి ఆదేశాలను తెలుగులోనే ఇవ్వొచ్చు. IOS 17 ఎప్పుడు విడుదలవుతుంది? గత సంవత్సరం, Apple iPhone 14 ఈవెంట్ తర్వాత ఐదు రోజుల తర్వాత iOS 16 ను విడుదల చేసింది. ఈ సంవత్సరం, iOS 17 బీటా 8 , పబ్లిక్ బీటా 6 ఇప్పటికే ముగిసింది, కాబట్టి Apple అదే షెడ్యూల్‌ను అనుసరించవచ్చు. iOS 17ని ముందుగానే ప్రయత్నించాలనుకుంటే, బీటాలను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ ఫైనల్ పబ్లిక్ రిలీజ్ కోసం మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. -
వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్ - అదేంటో తెలుసా?
Whatsapp Caption Edit Feature: వాట్సాప్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఇప్పటికే మెసేజ్ ఎడిట్ ఫీచర్ పరిచయం చేయగా.. ఇప్పుడు మరో లేటెస్ట్ ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. వాట్సాప్‌లో ఇప్పుడు ఫొటోస్, వీడియోలు, గిఫ్ట్స్, డాక్యుమెంట్స్ క్యాప్షన్ కూడా ఎడిటింగ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఆ తరువాత ఈ ఫీచర్ అందరికి అందుబాటులోకి వస్తుంది. ఇది తప్పకుండా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాము. ఇదీ చదవండి: ఇషా అంబానీ కారు.. దూరం నుంచి అలా.. దగ్గర నుంచి ఇలా! ఇప్పటి వరకు ఇలాంటి ఎడిటింగ్ ఫీచర్ అందుబాటులో లేదు. అయితే ఇప్పుడు ఈ కొత్త ఫీచర్‌తో ఒకసారి పంపిన వీడియో, ఫోటో క్యాప్షన్ సులభంగా ఎడిట్ చేయవచ్చు. కావున మీరు పంపించి క్యాప్షన్‌లో ఏదైనా తప్పులుంటే కేవలం 15 నిమిషాలు లోపు మాత్రమే ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఎడిట్ చేసుకునే అవకాశం లేదు. దీనిని వినియోగాదారులు తప్పకుండా గమనించాలి. -
ఇలాంటి ఫీచర్ కదా కోరుకునేది.. పర్సనల్ డీటైల్స్ ఎక్కడున్నా..
Google New Feature: రోజురోజుకి టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న సమయంలో ఇంటర్నెట్ వినియోగం మరింత విస్తరిస్తోంది. ప్రస్తుతం మనదేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా అంతర్జాలం మరింత వేగం పుంజుకుంటోంది. ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్ లేని ఇల్లు లేదంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో.. మోసాలు కూడా అదే రీతిలో పుట్టుకొస్తున్నాయి. కొంతమంది సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత డేటాతో లెక్కలేనన్ని మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టడానికి ఒక కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త టెక్నాలజీలు వ్యక్తిగత భద్రతకు భంగం కలిగిస్తున్నట్లు, అలాంటి వాటికి నిర్మూలించి, వినియోగదారులను అప్రమత్తం చేయడానికి గూగుల్ ఓ కొత్త ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ ఫీచర్ ఇప్పుడు అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఇది మిగిలిన అన్ని దేశాల్లో విస్తరించనుంది. నివేదికల ప్రకారం, గత ఏడాది సెప్టెంబర్‌లో గూగుల్ 'రిజల్ట్ అబౌట్ యూ' లాంచ్ చేసింది. ఈ ఫీచర్ అనతి కాలంలోనే మొబైల్, వెబ్సైట్ వంటి వాటిలో ప్రత్యక్షమైంది. ఆ ఫీచర్ ఇప్పుడు మరింత ఆధునికంగా మారింది. ఒక వ్యక్తికి సంబంధించిన వివరాలు ఎక్కడైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆ తరువాత వాటిని తొలగించడానికి కూడా వీలుంటుంది. ఇదీ చదవండి: వ్యాపార సామ్రాజ్యంలో మహిళా సారధులు - ఏం చదువుకున్నారో తెలుసా? ఇప్పటి వరకు వినియోగదారులకు సంబంధించిన వివరాలను వెతుక్కోడానికి చాలా సమయం పట్టేది. కానీ త్వరలో రానున్న గూగుల్ కొత్త ఫీచర్ యూజర్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ వంటి వ్యక్తిగత వివరాలు కనిపించిన వెంటనే ఇస్తూ.. తొలగించుకోవడానికి సహకరిస్తుంది. ఇదీ చదవండి: భారత్‌లో టెస్లా ఫస్ట్ ఆఫీస్ అక్కడే? అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవుతారు! గూగుల్ కొత్త ఫీచర్ వల్ల వ్యక్తిగత వివరాలు సులభంగా తొలగించవచ్చు, కానీ అవసరమైన చోట కూడా ఈ వివరాలు తొలగిపోతాయేమో అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ వినియోగదారుడు తప్పకుండా కొన్ని ఆప్షన్స్ ఎంచుకోవడం వల్ల అలాంటి సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. -
వాట్సాప్ కొత్త ఫీచర్ - భద్రతకు పెద్దపీట!
WhatsApp Phone Number Privacy: ఆధునిక కాలంలో కొత్త యాప్స్ లాంచ్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే ఉన్న యాప్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' (WhatsApp) త్వరలో మరో అప్డేట్ అందుకోనుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, వాట్సాప్ త్వరలో 'ఫోన్ నెంబర్ ప్రైవసీ' అనే లేటెస్ట్ ఫీచర్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ప్రైవసీ విషయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు మాత్రమే కాకుండా ఐఫోన్ యూజర్లందరికి అందుబాటులో ఉంటుంది. అయితే వాట్సాప్ అప్డేటెడ్ బీటా యూజర్లకు మాత్రమే ఇది వర్తించే అవకాశం ఉందని సమాచారం. (ఇదీ చదవండి: షాకిచ్చిన ఇన్ఫోసిస్.. తీవ్ర నిరాశలో ఉద్యోగులు - కారణం ఇదే!) వాట్సాప్ లేటెస్ట్ ఫీచర్ కమ్యూనిటీ యూజర్లు మాత్రమే ఉపయోగించగలరు. ఒక యూజర్ తన ఫోన్ నెంబర్ తెలియనివారికి కనిపించకుండా ఉండాలనుకున్నప్పుడు వాట్సాప్ సెట్టింగ్స్‌లో ఫోన్ నెంబర్ ప్రైవసీ అనే ఫీచర్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ సెలక్ట్ చేసుకున్నప్పుడు యూజర్ మొబైల్లో సేవ్ అయిన కారికి మాత్రమే కనిపిస్తుంది. ఇతరులకు కనిపించే అవకాశం లేదు. ఇది యూజర్ భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టంగా తెలుస్తోంది.