వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా వచ్చే ఇమేజస్ అన్నీ ఇన్నీ కావు. అవన్నీ ఫోన్‌లోని గ్యాలరీకే వెళ్లిపోతాయి. కొంతమంది ఆ ఇమేజస్‌ను ప్రైవసీ దృష్టిలో పెట్టుకుని ఫోన్ గ్యాలరీలో కనిపించకూడదని అనుకుంటారు. వాటిని వెంటనే డిలీట్ చేయడం చేస్తుంటారు. కానీ కొందరికి డిలీట్ చేసే తీరిక ఉండదు. ఈ అవసరాన్ని గుర్తించి, వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే మీడియా విజిబిలిటీ. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ మీడియా కంటెంట్ గ్యాలరీలో కనిపించాలో, హైడ్ చేసుకోవాలో నిర్ణయించుకోవచ్చు.
దీని కోసం వాట్సాప్‌లోని సెట్టింగ్స్‌కు వెళ్లి, డేటా, స్టోరేజ్ యూసేజ్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ షో మీడియా ఇన్ గ్యాలరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది డిఫాల్ట్‌గా టిక్ చేసి ఉంటుంది. ఒకవేళ వాట్సాప్ ఇమేజస్ గ్యాలరీలో కనిపించకూడదంటే, దాన్ని అన్‌టిక్ చేసుకోవాలి. దాంతో గ్యాలరీలో వాట్సాప్ ఇమేజస్ కనిపించవు. అయితే ఆ ఇమేజస్‌ను ఫైల్ మేనేజర్‌కు వెళ్లి అక్కడ చూసుకోవచ్చు. వాట్సాప్ ఆండ్రాయిడ్‌లోని కొత్త బీటా వెర్షన్(2.18.159) యూజర్లకు ఈ మీడియా విజిబిలిటీ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ లాంటి పలు మెసేజింగ్ యాప్స్ అందిస్తున్నాయి.
దీంతో పాటు మరో ఫీచర్‌ను కూడా వాట్సాప్ తీసుకొచ్చింది. అది న్యూ కాంటాక్ట్ షార్ట్‌కట్. ఈ ఫీచర్ కూడా కొత్త బీటా వెర్షన్ వాళ్లకు అందుబాటులో ఉంది. చాట్ స్క్రీన్‌లో కింద కుడివైపున న్యూ మెసేజ్ బటన్‌ను ప్రెస్ చేస్తే, న్యూ కాంటాక్ట్ షార్ట్‌కట్ ఫీచర్ కనిపిస్తుంది. అక్కడి నుంచి కాంటాక్ట్‌లను జత చేర్చుకోవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫీచర్లను పొందడానికి వాట్సాప్ బీటా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని యూజర్లకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment