వాషింగ్టన్: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ మరో ఫీచర్‌ను తీసుకురానుంది. ‘పిక్చర్ టు పిక్చర్’ మోడ్‌ను అండ్రాయిడ్ ఫోన్లకూ అందుబాటులోకి తేనుంది. ఈ ఫీచర్ సాయంతో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చూస్తూనే వీడియో కాల్ మాట్లాడొచ్చు. వీడియో కాల్ మాట్లాడుతూనే సందేశాలు పంపవచ్చు. వీడియోలు చూసేటప్పుడు, మెసేజ్‌లు పంపేటప్పుడు వీడియో కాల్ స్క్రీన్ చిన్నదిగా మారి ఫోన్‌లో కుడివైపుకొస్తుంది. వీడియో కాల్ మాట్లాడుతూ యాప్‌లను చెక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌కు ప్రస్తుతం తుది పరీక్షలు నిర్వహిస్తున్నామనీ, త్వరలో మార్కెట్‌లోకి తెస్తామని వాట్సాప్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment