You tube
-
కంటెంట్ క్వీన్స్ మ్యాజిక్ : ‘యూట్యూబ్ విలేజ్’ వైరల్ స్టోరీ
ఛత్తీస్‌గఢ్‌లోని ఒక చిన్న గ్రామం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రాయ్‌పూర్‌కి సమాపంలో ఉన్న తులసి అనే గ్రామం యూ ట్యూబ్ (YouTube) వీడియోలతో ఆర్థిక ,సామాజిక విప్లవాన్ని సాధించింది. తమ కథలు, ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకు YouTubeను ఒక మార్గంగా ఎంచుకున్నారు గ్రామస్తులు. చిన్నాపెద్దా, తేడాఏమీలేదు. అక్కడందరూ కంటెంట్ కింగ్లే. అన్నట్టు ఇక్కడ యూట్యూబర్లలో మహిళలే ఎక్కువట.అందుకే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న తులసి గ్రామాన్ని యూట్యూబర్స్ గ్రామంగా పేరుపడింది. ఈ గ్రామంలో దాదాపు 432 కుటుంబాలుంటాయి. వారి జనాభా 3-4వేల మధ్య ఉంటుంది. వీరిలో 1000 మంది యూట్యూబ్ ద్వారా తమ ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ గ్రామంలో నివసించే 5 ఏళ్ల చిన్నారి నుంచి 85 ఏళ్ల అమ్మమ్మ వరకు యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉంటారంటే అతిశయోక్తి కాదు. తమ స్పెషల్ స్కిట్లకోసం గ్రామస్తులంతా ఏకమవుతారు. ప్రతి ఒక్కరూ తలొక పాత్ర పోషిస్తారు.సామాజిక మార్పుకు నాంది పలికేందుకు యూట్యూబ్ ఒక వేదికగా మారిందనీ, మరింత ఆర్థిక సాధికారితను యూట్యూబ్ తీసుకువచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. యూట్యూబర్లలో, మహిళలే ఎక్కువగా ఉన్నారు. గతంలో జీవనోపాధికి తక్కువ అవకాశాలు ఉన్న మహిళలు ఇప్పుడు స్వతంత్రంగా దీని ద్వారా ఆర్జిస్తున్నారు. అంతేకాదు చెడు అలవాట్లు, నేరాల నుండి పిల్లలను దూరంగా ఉంచుతోందంటున్నారు గ్రామస్తులు. ఇదీ చదవండి: చిన్న కోడలు రాధికపై నీతా అంబానీ ప్రశంసలుకాగా తులసి గ్రామంలో నివసిస్తున్న ఇద్దరు స్నేహితులు జైవర్మ, జ్ఞానేంద్ర 2016లో యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం ఉన్న జై వర్మ అంతకుముందు ఒక కోచింగ్ సెంటర్‌ను నడిపేవాడు. అందులో 11వ తరగతి నుండి పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. ఆ తర్వాత పొరుగున ఉండే జ్ఞానేంద్రతో కలిసి యూట్యూబ్, స్టడీ, కామెడీ వీడియోలను అప్లోడ్ చేయడం ప్రారంభించాడు. ప్రారంభంలో చాలా టెక్నికల్ సమస్యలు,కాపీ రైట్ సమస్యలు వచ్చేవి. కానీ వాటన్నింటినీ అధిగమించి సక్సెస్ అయ్యారు. అలా ఇది మంచి ఆదాయ వనరుగా మారడంతో అందరూ అటు వైపు మళ్లారు. మొదట్లో మొబైల్ ఫోన్లలో షూట్ చేసేవారు కాస్తా ఇప్పుడు కెమెరాలు, ఇతర షూటింగ్ పరికరాలను సమకూర్చుకున్నారు. హాస్యానికి అద్దం పట్టాలన్నా, విజ్ఞాన భాండాగారాన్ని అందించాలన్నా, చిన్న పిల్లలనుంచీ పెద్దల వరకు అంతా సిద్ధంగా ఉంటారు.ఇదీ చదవండి: భారీ ఊరట: ఆ మూడు కేన్సర్లకు త్వరలో వ్యాక్సీన్ -
HYD: యూట్యూబర్ ప్రణీత్ హన్మంతుపై గంజాయి కేసు
సాక్షి,హైదరాబాద్: యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్‌పై గoజాయి కేసు నమోదైంది. తండ్రి కూతురు బంధంపై అసభ్య కామెంట్స్ చేసినందుకుగాను ప్రణీత్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.ప్రణీత్ గంజాయి సేవించినట్టు తాజాగా మెడికల్ రిపోర్ట్‌లో తేలింది. దీంతో ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్లను పోలీసులు జోడించారు. ఇప్పటికే ప్రణీత్‌పై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రణీత్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. ఇతడిని మూడు రోజుల పాటు కష్టడీకి కోరుతూ సైబర్ సెక్యూరిటీ పోలీసులు పిటిషన్ దాఖలు చేయడంతో ప్రణీత్ న్యాయవాదికి కోర్టు నోటీసులు జారీ చేసింది. -
యూట్యూబ్ మాజీ సీఈవో ఇంట్లో విషాదం
కాలిఫోర్నియా: యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వుజిక్ కొడుకు మార్కో ట్రోపర్(19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాలిఫోర్నియాలోని బర్కేలి యూనివర్సిటీ కాలేజీలో ట్రోపర్ చదువుతున్నాడు. యూనివర్సిటీ క్యాంపస్‌లోని అతడి గదిలో ట్రోపర్ అచేతన స్థితిలో పడి ఉన్నాడు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా అతడు స్పందించలేదు. దీంతో ట్రోపర్ మృతి చెందినట్లు ప్రకటించారు. డ్రగ్ ఇంజెక్షన్ ఓవర్‌డోస్ అవడం వల్లే ట్రోపర్ చనిపోయినట్లు అతడి అమ్మమ్మ ఎస్తర్ తెలిపింది. ‘ట్రోపర్ ఒక గణిత మేధావి. అతడు ఇలా మృతి చెందడంతో గుండె పగిలిపోయింది. అతడు బతికి ఉంటే కచ్చితంగా ఏదైనా సాధించేవాడు’అని ట్రోపర్ అమ్మమ్మ కన్నీటి పర్యంతమైంది. ఇదీ చదవండి.. ట్రంప్‌ను తెగ తిట్టిన ఆత్మ.. ఏఐ వీడియో వైరల్ -
జస్ట్ ఫిట్ నెస్ చానెల్‌తో..ఏకంగా రూ. 700 కోట్లు..!
హెల్త్, డైట్, ఫిట్నెస్కి సంబంధించి ‘ఫిట్ ట్యూబర్’ పేరుతో యూట్యూబ్‌లో ఒక చానెల్ స్టార్ట్ చేసిండు. తక్కువ సమయంలోనే అతని వీడియోలు జనాలకు రీచ్ అవ్వడం, ఆదరణ లభించడం రెండూ ఒకేసారి జరిగాయి. దీంతో ఒక్కసారిగా మంచి పేరు వచ్చింది. అక్కడితో ఆగలేదు. ఇతని చానెల్‌కి దాదాపు 6 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారంటే అంతని వీడియోలకు మస్త్ క్రేజ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యూట్యూబ్ ఛానెల్‌తో అతను దగ్గర దగ్గర దాదాపు 750 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఇతని పేరు వివేక్ మిత్తల్. సొంతూరు పంజాబ్‌లోని బఠిండా. బీటెక్ పూర్తిచేసి ఇన్ఫోసిస్‌లో జాబ్ కూడా చేశాడు. తర్వాత 2016లో యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాడు. అయితే ఇతని యూట్యూబ్‌కి ఉన్న ఇన్ఫ్లయోన్స్ చూసి తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్రీయా గౌరవ్ అవార్డుతో సన్మానించింది. మీక్కూడా ఇలానే ఏమన్నా టాలంఎంటు ఉంంటే సీరియస్ తీసుకుని సక్కగా వీడియోలు తీసుకుని క్రేజ్ సంపాదించుకుండి. అటోమేటిగ్గా పేరుకి పేరు డబ్బులకు డబ్బులు సంపాదించుకోవచ్చు. (చదవండి: భారత్‌లో ఫస్ట్ క్రిస్మస్ కేక్ ఎక్కడ తయారయ్యిందో తెలుసా!) -
లేడీ యూట్యూబర్‌కు వేధింపులు.. వ్యక్తి అరెస్టు
పుణె: సౌత్ కొరియాకు చెందిన లేడీ యూట్యూబర్‌ను వేధించిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.నవంబర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్నారు. సౌత్ కొరియాకు చెందిన యూ ట్యూబర్ కెల్లీ పుణె పింప్రి చించ్వాడ్ ప్రాంతంలోని ఓ మార్కెట్లో వ్లాగ్ చేసుకుంటూ అక్కడి స్థానికులతో ముచ్చటిస్తోంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఆకతాయి కెల్లీని దగ్గరకు లాక్కొని ఆమె మెడపై చేయి వేసి అనుచితంగా ప్రవర్తించాడు. ఇదంతా వీడియోలో రికార్డైంది. ఈ ఘటన జరుగుతుండగానే వెంటనే మరోవ్యక్తి అక్కడికి వచ్చాడు. అతడిని కూడా దగ్గరకు రమ్మని మొదటి వ్యక్తి సూచించాడు. దీంతో కెల్లీ వారిని విడిపించుకోవడానికి ప్రయత్నించింది. ‘నేనిక్కడి నుంచి పారిపోవాలి. వాళ్లు నన్ను హగ్ చేసుకునేందెకు ప్రయత్నిస్తున్నారు’ అనికెల్లీ అనడం క్లిప్‌లో రికార్డైంది. గతంలో ముంబైలోనూ ఓ ఆకతాయి సౌత్‌కొరియాకు చెందిన లేడీ యూ ట్యూబర్‌ను వేధించిన కేసులో అరెస్టయ్యాడు. ఇదీచదవండి..అమెరికా అధ్యక్ష ఎన్నికలు..ట్రంప్ పోటీపై కోర్టు సంచలన తీర్పు -
క్రికెట్టూ కాదు..సినిమాలు కాదు..ఇదీ లెక్క: ఆనంద్ మహీంద్ర
చంద్రయాన్-3 సక్సెస్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. చంద్రుడి దక్షృణ ధృవంపై అడిగిడిన తొలి దేశంగా భారత్ ఘనతను దక్కించుకోవడంపై సర్వత్ర ప్రశంసలు దక్కాయి. ఇందంతా ఒక ఎత్తయితే యూ ట్యూబ్‌లో అత్యంత అధికమైన వ్యూయర్షిప్ను సాధించిన టాప్‌లో నిలచింది. దీనిపై బిలియనీర్, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఇదీ చదవండి: చంద్రయాన్-3 మరో ఘనత: యూట్యూబ్‌లో టాప్ రికార్డ్ క్రికెట్ కాదు. సినిమాలు కాదు. సైన్స్ & టెక్నాలజీ. చాలా గర్వంగా ఉంది. వ్యూస్ రేసులో పోడియం అగ్రస్థానంలో నిలిచింది. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. Not Cricket. Not Movies. It was Science & Technology—and pride—that took the top of the podium in the viewership race. The future is bright… https://t.co/8eZZOy55Up — anand mahindra (@anandmahindra) August 26, 2023 -
కెమెరా పట్టిన్నడే సీమ దసర సిన్నోడు.. రాత్రికి రాత్రే స్టార్ సింగర్
మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దజట్రం గ్రామానికి చెందిన మాడపోళ్ల ఆశప్ప, మాణిక్యమ్మ దంపతులకు ఉష, మంజుల ఇద్దరు కూతుళ్లు. ఉష గ్రామంలోని పాఠశాలలో 3వ తరగతి వరకు చదివి మానేసింది. చిన్నప్పటి నుంచే పొలం పనులకు వెళ్లేది. అయితే వీరి తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో బంధువులు చేరదీసి వరుసకు మామ అయిన వ్యక్తితో పెళ్లి చేశారు. బాబు, పాప పుట్టి అనారోగ్యంతో నెలలు నిండకుండానే మృతిచెందారు. భర్తకు సైతం మతిస్థిమితం లేకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో గ్రామంలో జీవనోపాధి కష్టంగా మారడంతో హైదరాబాద్‌కు వలస వెళ్లింది. అక్కడే భవన నిర్మాణ రంగంలో కూలీ పనులు చేస్తూ ఒంటరి మహిళగా జీవనం సాగిస్తుంది. పొట్ట చేతపట్టుకొని పట్నం వెళ్లిన ఓ ఒంటరి మహిళ జీవితాన్ని ఒక్కపాట సెన్సేషన్‌గా మార్చేసింది. చిన్నప్పటి నుంచి జానపద పాటలంటే ఉన్న విపరీతమై ఇష్టమే అదృష్టం వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. ‘కెమెరా పట్టిన్నడే సీమ దసర సిన్నోడు’ అనే పాటతో రాత్రికి రాత్రి స్టార్ సింగర్‌గా మారింది. పాట రాసి, స్వరం కలిపి ప్రాణం పోసి అచ్చం తెలంగాణ యాస, భాషతో పల్లె జానపదాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన ఆ కళాకారిణి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దజట్రం గ్రామానికి చెందిన మాడపోళ్ల ఉష. ఈమె ఈ ఏడాది జూన్ 29న పాట పాడగా ఇప్పటి వరకు యూట్యూబ్‌లో 26 మిలియన్ల వ్యూస్ అంటే 2.60 కోట్ల మంది చూశారంటే పాట క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు.. తాను వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో ఆడవాళ్లు పాడుకునే జానపద పాటలను శ్రద్ధగా గమనించి పాడుతూ ఉండేది. గత పదేళ్ల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లింది. అక్కడే కూలీ పనులు చేసుకుంటూ తీరిక సమయంలో జానపద పాటలు పాడుతూ ఉండేది. యూట్యూబ్‌లో జానపద పాటలకు ఆదరణ పెరగడం చూసి తాను సైతం పాటలు పాడాలనే కోరికతో కొన్ని పాటలు రాసి వీడియోలు చేసింది. సరైన ఆదరణ రాకపోయినా.. పట్టువిడవకుండా పాటలు రాస్తూ.. ట్యూన్లు కలుపుతూ అవకాశాల కోసం ఎదురుచూసింది. గతంలో జగిత్యాల జోగుల వెంకటేశ్‌తో రెండు పాటలు, గొల్లపల్లి శివన్న సిరిసిల్లతో ఒక పాట పాడింది. ఓ రోజు జానపద పాటల కవర్‌పై హరీశ్ పాటేల్ ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్ చేసి.. తాను జానపద పాటలు రాసి, పాడతానని అవకాశం ఇవ్వాలని కోరింది. ఆయన దగ్గరకు వెళ్లి మూడు పాటలు పాడి వినిపించింది. ఈ క్రమంలోనే కెమెరా పట్టిన్నడే సీమ దదర సిన్నోడు అనే పాట నచ్చడంతో గజ్వేల్‌లో అమూల్య స్టూడియోలో ఆమె దగ్గర పాడించి జూన్ 29న రిలీజ్ చేశారు. యూట్యూబ్‌లో వస్తున్న సెన్షేషన్ చూసి ఉష రాత్రికి రాత్రి జానపద స్టార్ సింగర్‌గా మారిపోయింది. చిన్నపిల్లలతో మొదలుకొని పెద్దల వరకు యూట్యూబ్‌లో పాట వింటూ మురిసిపోతున్నారు. చేయూత ఇవ్వండి..గ్రామంలో రేకుల షెడ్డు ఇల్లు మాత్రమే ఉంది. ప్రభుత్వం నా పరిస్థితిని గుర్తించి గృహలక్ష్మి ఇల్లుతోపాటు జీవనోపాధి కోసం దళితబంధు పథకాన్ని మంజూరు చేయాలి. నాకు జానపద పాటలంటే ఎంతో ఇష్టం. భవిష్యత్‌లో అవకాశం వస్తే సినిమా పాటలు పాడతా. పదేళ్లుగా కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నా. కళాభిమానులు నా జానపద పాటలను ఆదరించి చేయూతనివ్వండి. – ఉష, జానపద కళాకారిణి, పెద్దజట్రం -
యూట్యూబ్ క్రియేటర్స్ కి బిగ్ షాక్.. ఆ ఫ్యూచర్ తొలగింపు..!
-
రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్ మృతి.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో..
ఒక చోట అని కాదు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు డ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోడ్డు భదత్రకు ప్రమాదాలను నివారించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాహనదారుల్లో మార్పు రావడం లేదు. రోడ్డు భద్రతకు సంబంధించి నిత్యం అధికారులు జాగ్రత్తలు చెబుతూ వాహనదారుల్లో అవగాహన కల్పిన్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు ఏమాత్రం తగ్గడం లేదు. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల తమ జీవితాలనే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో నెట్టుతున్నారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యూట్యూబర్ అగస్త్య చౌహాన్ మరణించాడు. ఉత్తరాఖండ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన జడ్ఎక్స్10ఆర్ నింజా సూపర్‌బైక్‌పై గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నివాసి అయిన అగస్త్య చౌహాన్ ప్రొఫెషనల్ బైకర్. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే మోటార్‌బైక్ రేసింగులో పాల్గొనేందుకు బుధవారం జడ్ఎక్స్10ఆర్ నింజా సూపర్‌బైక్‌పై ఆగ్రా నుంచి బయలుదేరాడు. ఉత్తరప్రదేశ్‌లోని టప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యమునా ఎక్స్‌ప్రెస్ హైవేకు చేరుకోగానే.. గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని సాధించడానికి ప్రయత్నించాడు. బైక్ వేగంగా దూసుకుపోతున్న సమయంలో అతడు ఒక్క సారిగా తడబడ్డాడు. దీంతో అగస్త్య బైక్ అదుపుతప్పి యమునా ఎక్స్‌ప్రెస్‌వే డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అగస్త్య తలకు బలమైన గాయం తగలడంలో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ప్రమాదం దాటికి అతను ధరించి ఉన్న హెల్మెట్ ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. మొదటిసారిగా ఈ సాహసం చేసిన అగస్త్య దుర్మరణం చెందడంతో అతని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా అగస్త్యకు ‘PRO RIDER 1000’ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. దీనికి 1.2 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. వేగంగా బైక్ నడుపుతూ స్టంట్లు చేస్తున్న వీడియోలను తన ఛానెల్లో అప్లోడ్ చేసేవాడు. ప్రమాదం జరగడానికి 16 గంటల ముందు కూడా ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. వేగంగా వాహనాలు నడపడం ప్రమాదకరం అని తన ప్రతి వీడియోకు హెచ్చరికలు సైతం జారీ చేసేవాడు. చివరికి అదే వేగంతో తన ప్రాణాలు కోల్పోయాడు. -
Neal Mohan యూట్యూబ్ కొత్త సీఈవో: మరోసారి ఇండియన్స్ సత్తా
సాక్షి, ముంబై: గ్లోబల్ టెక్ కంపెనీలకు సారధులుగా భారతీయ సంతతికి చెందిన నిపుణులు సత్తా చాటుతున్నారు. తాజాగా వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్ సీఈవోగా ఇండో అమెరికన్ నీల్మోహన్ నియమితులయ్యారు. తొమ్మిదేళ్ల పాటు యూట్యూబ్ సీఈవోగా పనిచేసిన సుసాన్ వోజ్కికీ తప్పుకోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. భారతీయ-అమెరికన్ నీల్మోహన్ 2015 నుండి యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీచేసిన మోహన్ గతంలో మైక్రోసాఫ్ట్‌తో పాటు పలు టెక్ కంపెనీల్లో కూడా పనిచేశారు. మరోవైపు దాదాపు పాతికేళ్లపాటు గూగుల్‌కు పనిచేసిన తాను జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించ బోతున్నానని సుసాన్ చెప్పారు. తన వ్యక్తిగత ప్రాజెక్టులకు సంబంధించి కొత్త పని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తన కెరీర్లో 2007లో డబుల్‌క్లిక్ కొనుగోలుతో గూగుల్‌కు వచ్చినప్పటినుంచీ దాదాపు 15 సంవత్సరాలు మోహన్‌తో కలిసి పనిచేశాననీ ఆమె చెప్పారు. అయితే గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్పిచాయ్కు సలహాదారుగా మార నున్నారని సమాచారం. Thank you, @SusanWojcicki. It's been amazing to work with you over the years. You've built YouTube into an extraordinary home for creators and viewers. I'm excited to continue this awesome and important mission. Looking forward to what lies ahead... https://t.co/Rg5jXv1NGb — Neal Mohan (@nealmohan) February 16, 2023 సుసాన్ వోజ్కికీ కాగా ఇప్పటికే గ్లోబల్ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారతీయ సంతతికి చెందిన సీఈవోల జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ పెప్సికో ఇంద్రా నూయి, తమ ప్రత్యేకతను చాటుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో నీల్ మోహన్ చేరడం విశేషం. -
అలీ కూతురి పెళ్లి వీడియో వచ్చేసింది.. ఎంత గ్రాండ్‌గా జరిగిందో..
ప్రముఖ కమెడియన్, నటుడు అలీ కూతురు ఫాతిమా ఇటీవలె పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ వివాహానికి చిరంజీవీ, నాగార్జున సహా పలువురు ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పటికే ఫాతిమా పెళ్లికి సంబంధించన ఫోటోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అలీ సినిమాలు ,టీవీ షోల ద్వారా అలరిస్తుండా, ఆయన భార్య జుబేదా అలీ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈమె యూట్యూబ్ ఛానల్‌కు ఇప్పడు సుమారు 6లక్షల 91వేల సబ్స్రైబర్లు ఉన్నారు. కూతురి పెళ్లి షాపింగ్ దగ్గరి నుంచి హల్దీ, పెళ్లి కూతుర్ని చేయడం సహా ప్రతి వీడియోను ఆమె అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ఇక జుబేదా అలీ యూట్యూబ్ వీడియోలకు బాగానే ఫాలోయింగ్ ఉంది. ఆమె ఏ వీడియో పోస్ట్ చేసినా లక్షల్లో వ్యూస్ వస్తాయి. తాజాగా కూతురు ఫాతిమా పెళ్లి ఎలా జరిగింది? మండపం దగ్గరికి తీసుకొచ్చిన్నప్పటి నుంచి పెళ్లి తంతులో కూతురు ఎమోషనల్ అయిన క్షణాల వరకు.. వీడియో రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు. మరి టాలీవుడ్ ప్రముఖులు విచ్చేసిన అలీ కూతురి పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో వీడియోలో చూసేయండి. -
హరిప్రసాద్.. అబ్బా అనిపిస్తున్నావబ్బా
సాక్షి,అనంతపురం: డాక్టర్ హరిప్రసాద్ సొంతూరు నార్పల. వైద్య విద్యలో ఎంఎస్ (జనరల్ సర్జరీ), ఎంసీహెచ్ (పీడియాట్రిక్ సర్జరీ) చేశారు. కొంతకాలం పాటు అనంతపురం సర్వజనాస్పత్రిలో పనిచేశారు. ప్రస్తుతం నగరంలోని సాయినగర్‌లో సొంతంగా ఆస్పత్రి నిర్వహి స్తున్నారు. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ (హృదయపూర్వక ధ్యానం) ట్రైనర్‌గానూ సేవలందిస్తున్నారు. సర్జన్‌గా, మెడిటేషన్ ట్రైనర్‌గా బిజీగా ఉంటున్నప్పటికీ తన ప్రవృత్తి అయిన యాక్టింగ్‌ను విస్మరించలేదు. ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ ఉండాలని, అదే నిజమైన జీవితమని ఆయన బలంగా విశ్వసిస్తారు. మన ధోరణికి హృదయంలో ఉండే ఆనందం (హార్ట్ఫుల్నెస్ హ్యాíపీనెస్) ఆధారం కావాలని, అప్పుడే భౌతిక ప్రపంచం ఎన్ని ఎమోషన్స్ ఇచ్చినా తిరిగి ఆనందానికి చేరువవుతామని చెప్పే డాక్టర్ హరిప్రసాద్.. తన వద్దకు చికిత్సకు వచ్చే వారితోనూ సరదాగా మాట్లాడుతూ, చక్కని హాస్యాన్ని పంచుతుంటారు. తద్వారా వారిలోని ఒత్తిడిని పటాపంచలు చేసి, త్వరగా కోలుకునేందుకు తోడ్పడతారు. డాక్టర్ హరిప్రసాద్ ‘అబ్బా టీవీ’ ద్వారా సామాజిక మాధ్యమాల్లో బాగా పాపులర్ అయ్యారు. కామెడీ వీడియోలు చేస్తూ లక్షలాది మందికి చేరువయ్యారు. ఆయన కామెడీలో చక్కని టైమింగ్ ఉంటుంది. అంతర్లీనంగా సామాజిక సందేశమూ ఉంటుంది. డాక్టర్‌గా తనకు ఎదురయ్యే అనుభవాలు, నిత్య జీవితంలో జరిగే సంఘటనలు, పల్లె, పట్నం వాసుల జీవనవిధానం, సామాజిక సమస్యలు..ఇలా అనేక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని హాస్యభరితంగా వీడియోలు రూపొందిస్తున్నారు. కరోనా సమయంలో వ్యాధిపై అవగాహన కల్పిస్తూ, ప్రజల్లో మనోధైర్యాన్ని నింపుతూ, సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ రూపొందించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో హరిప్రసాద్ ఏ వీడియో పెట్టినా వేలు, లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఫేస్బుక్ పేజీకి లక్షా 20 వేల మంది ఫాలోయర్స్, యూట్యూబ్ చానల్‌కు లక్షా 89 వేల సబ్స్క్రైబర్లు ఉన్నారంటే ఆయన ఎంత ఫేమస్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. డాక్టర్ హరిప్రసాద్ రూపొందించే కామెడీ వీడియోల్లో తనతో పాటు తన వద్ద పనిచేసే సిబ్బంది, జిల్లాకు చెందిన పలువురు కళాకారులు నటిస్తున్నారు. సర్జన్‌గా వచ్చే సంపాదన కూడా కొంత వరకు వదులుకుని కామెడీ వీడియోల కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారు. మంచి పొజిషన్లోæ ఉండి ఇలా ఎందుకు చేస్తున్నావని మొదట్లో బంధువులు, సన్నిహితులు వారించినా.. తన ప్రవృత్తిని మాత్రం వదల్లేదు. ఇంటిల్లిపాదీ ఆనందంగా చూడదగిన వీడియోల ద్వారా అనతికాలంలోనే జనానికి చేరువయ్యారు. లక్షలాదిమంది అభిమానులను కూడగట్టుకున్నారు. అలాగే తన వీడియోల ద్వారా పలువురు కళాకారులకు, ఔత్సాహికులకు అవకాశం కల్పిస్తూ ప్రోత్సాహం అందిస్తున్నారు. తన ఆధ్వర్యంలోనే అనంతపురం యాక్టర్ల సంఘం (అయాసం) ఏర్పాటు చేసి..వారిని ఒక గొడుగు కిందకు తెచ్చారు. డాక్టర్ హరిప్రసాద్‌కు సామాన్యులే కాకుండా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతరత్రా ప్రముఖులు కూడా ఫ్యాన్స్ అయ్యారు. ఒకసారి సినీనటుడు మోహన్‌బాబు స్వయంగా∙ఆయన నటనను మెచ్చి ఫోన్ చేసి అభినందించారు. సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. ఐక్యూ, 2డీ సినిమాలు, ‘ఎవరికి వారే యమునా తీరే’ వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలు పోషించారు. అవి రిలీజ్ కావాల్సి ఉంది. -జిల్లా డెస్క్ ఆనందంతోనే అసలైన జీవితం పీజీ చదివేటప్పుడు తీవ్ర మానసిక సంఘర్షణకు లోనయ్యా. ఆ స్థితి నుంచి బయట పడేందుకు ధ్యానం దోహదపడింది. దీంతో నా దృక్పథం మారిపోయింది. ఆనందంగా ఉండడమే నిజమైన జీవితమని గ్రహించాను. మొదట్లో వాట్సాప్ ద్వారా జోకులు, మెడిటేషన్‌కు సంబంధించిన అంశాలను పరిచయస్తులకు పంపేవాణ్ని. తర్వాత చిన్నచిన్న వీడియోలు రూపొందించి పంపించాను. అవి అందరికీ నచ్చి బాగా వైరల్ అయ్యాయి. యూట్యూబ్‌లో ‘అబ్బా టీవీ’ ప్రారంభించి..రెగ్యులర్‌గా వీడియోలు చేస్తున్నా. డాక్టర్‌గా, యాక్టర్‌గా సక్సెస్ కావడం డబుల్ సంతోషాన్నిస్తోంది. – డాక్టర్ హరిప్రసాద్ -
Anusha Shetty: లక్షల జీతం వచ్చే ఐటీ ఉద్యోగాలు వదిలేసి.. భార్యాభర్తలిద్దరూ..
సాధారణంగా చాలామంది కెరీర్లో ఎదిగేందుకు చేస్తోన్న ఉద్యోగాన్ని వదిలేసి... స్టార్టప్ పెట్టడమో, ట్రెండ్‌కు తగ్గట్టుగా సేంద్రియ వ్యవసాయాన్ని ఎంచుకోవడం వంటిదో చేస్తుంటారు. అయితే కర్ణాటకకు చెందిన అనుషాశెట్టి మాత్రం వీటన్నింటికి భిన్నం. తనకు నచ్చిన డ్యాన్స్ కోసం బంగారంలాంటి ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తూ యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది. ఉడిపి జిల్లాలోని కుందాపూర్ అనే చిన్న గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది అనుషాశెట్టి. అనుష తల్లి ప్రభుత్వ ఉద్యోగి, తండ్రి వ్యాపార రీత్యా బెంగళూరులో ఉండేవారు. తల్లి ఉద్యోగం గ్రామంలో కావడంతో అనుష అమ్మ దగ్గర ఉంటూ చక్కగా చదువుకునేది. చిన్నప్పటినుంచి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లోనూ, క్రీడల్లోనూ చాలా చురుకుగా ఉండేది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహిస్తుండేవారు. ఇంటర్మీడియట్ అయ్యాక సెట్ ఎంట్రన్స్ పరీక్షలో మంచి ర్యాంక్ రావడంతో బెంగళూరులోనే టాప్–2 కాలేజీలో ఇంజినీరింగ్ సీటు వచ్చింది. దురదృష్టవశాత్తూ తండ్రికి వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆమెను చదివించలేక గ్రామానికి దగ్గరల్లోని కాలేజీలో చేరమన్నారు. అయినా అనుష ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ధైర్యంగా ముందుకు సాగింది. కష్టపడి చదివి ఇంజినీరింగ్ పూర్తి చేసి, క్యాంపస్ సెలక్షన్స్‌లో మంచి ఐటీ ఉద్యోగాన్ని సంపాదించింది. ఉద్యోగం వదిలేసి.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ తన ప్రతిభాపాటవాలతో ఐటీ ఉద్యోగిగా ఎదిగిన అనుషకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఎంతో మక్కువ. టీవీ, స్టేజిషోల మీద జరిగే డ్యాన్స్ కార్యక్రమాన్ని చూసి డ్యాన్స్ నేర్చుకునేది. డ్యాన్స్‌పై ఉన్న ఆసక్తి రోజురోజుకి పెరగడంతో డ్యాన్స్ సాధన మరింతగా చేయాలనుకున్నప్పటికీ, ఉద్యోగరీత్యా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే తీరిక ఉండేది కాదు. మరోపక్క కుటుంబ అవసరాలకు ఆర్థికంగా అండగా ఉండాల్సిన పరిస్థితి. దీంతో కొన్నిరోజులు డ్యాన్స్‌ను పక్కన పెట్టింది. 2015లో ఓ ప్రోగ్రామ్‌లో సౌరభ్ పరిచయమయ్యాడు. సౌరభ్ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తూనే డ్యాన్స్ టీచర్‌గా చేసేవాడు. అభిరుచులు ఒకటే కావడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, పెళ్లితో ఒకటయ్యారు. తర్వాత ఇద్దరూ కలిసి 2020లో ‘జోడీ అనురాభ్’ పేరుతో యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించారు. వారాంతాల్లో ఇద్దరూ వివిధ రకాల డ్యాన్స్ చేసి, వీడియోలను పోస్టు చేసేవారు. వీటికి వీక్షకుల నుంచి మంచి స్పందన లభించేది. ఇలా కొంతకాలంపాటు చేశాక ఇద్దరూ తమ తమ ఉద్యోగాలను వదిలేసి పూర్తి సమయాన్ని డ్యాన్స్‌కు కేటాయించారు. వీరి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అయినా వెనక్కి తగ్గలేదు. తమ నిర్ణయానికి కట్టుబడి డ్యాన్స్ వీడియోలు పోస్టు చేస్తూ నాలుగు లక్షలమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. రకరకాల డ్యాన్స్ స్టెప్పులతో లక్షల వ్యూస్, అభిమానులతో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా రాణిస్తున్నారు. లక్షల జీతం లేకపోయినప్పటికీ తమను అభిమానించే వారు లక్షల్లో ఉన్నారని ఈ జోడీ తెగ సంతోష పడిపోతోంది. చదవండి: Paranoia: రోజూ రాగానే ఇల్లంతా వెతకడం.. వాడిని ఎక్కడ దాచావ్ అంటూ భార్యను తిట్టడం! ఈ పెనుభూతం వల్ల.. View this post on Instagram A post shared by anoosha shetty (@chandukibiwi) -
గూగుల్ భాగస్వామ్యంతో ఇన్ఫినిటమ్ మీడియా "షి క్రియేట్స్’’
గూగుల్ భాగస్వామ్యంతో ఇన్ఫినిటమ్ మీడియా "షి క్రియేట్స్’’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆయా రంగాల్లో ఉన్న వారి టాలెంట్‌ను గుర్తించి ప్రతిభావంతులైన లేడీ కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించి క్రియేషన్ వైపు నడిపించడం, వారిలో ఉన్న టాలెంట్ గుర్తించి ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలదొక్కుకునేలా చేయడం షి క్రియేట్స్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. గూగుల్‌తో కలిసి ఇన్ఫినిటమ్ సుమారు 200 మంది లేడీ కంటెంట్ క్రియేటర్లను గుర్తించి వారికి ఫ్రీగా యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి ఇవ్వనుంది. ఛానల్‌ను ఎలా నడిపించాలి? ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి? కంటెంట్‌ను ఎలా మేనేజ్ చేసుకోవాలి? వీడియోలను మానిటైజ్ చేసుకోవడం ఎలా ? యూట్యూబ్ ద్వారా రెవెన్యూ రాబట్టడం ఎలా అనే విషయం మీద 2 వేల మంది మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు. విశాఖపట్నం ప్రోగ్రాం తర్వాత గూగుల్‌తో కలిసి ఇన్ఫినిటమ్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని టైర్ 2 సిటీలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించనుంది. ఆర్థికంగా తమ కాళ్ళ మీద తమ నిలబడేలా చేయడం అలాగే డిజిటల్ కంటెంట్ క్రియేటర్లుగా ఒక గుర్తింపు తెచ్చే ఉద్దేశంతోనే ఇన్ఫినిటమ్ ఈ అడుగు ముందుకు వేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పెట్టడమే కాక వారిని చూసి మరి కొంతమంది ఇన్స్పైర్ అయ్యేలా కార్యక్రమాన్ని నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లూన్సర్లు యూట్యూబ్ డెలిగేట్స్ ను కలిసి తమకు ఉన్న సందేహాలను కూడా తీర్చుకోనున్నారు. విశాఖ బీచ్ రోడ్ లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ సాయంత్రం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ఐటీ మరియు భారీ పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరు కానున్నారు. వైజాగ్ సిటీ, ఉత్తరాంధ్ర చుట్టుపక్కల నుంచి 2000 మంది యువత పాల్గొనేలా భారీ ఏర్పాట్లు ఏయూ ఆడిటోరియంలో చేశారు. -
ఆ యూట్యూబ్ ఛానెళ్లు బ్యాన్!
సాక్షి, న్యూఢిల్లీ: ఫేక్ న్యూస్, విద్వేషాలు రెచ్చగొట్టేలా వీడియోలు పోస్ట్ చేస్తున్న పలు యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఐటీ చట్టం 2021 నిబంధనల ప్రకారం.. 10 యూట్యూబ్ ఛానెల్స్‌కు సంబంధించిన 45 వీడియోలను బ్లాక్ చేసినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ ఛానెళ్లు మార్పింగ్ వీడియోలు, ఫోటోలను ఉపయోగించి భారత జాతీయ భద్రతకు, విదేశీ సంబంధాలు దెబ్బతినేలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అగ్నిపథ్, ఆర్మీ, కశ్మీర్ అంశాలపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ‘తప్పు వార్తల ద్వారా భారత్‌కు ఇతర దేశాలతో సంబంధాలను దెబ్బతీసేలా వీడియోలు చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లను ప్రసార, సమాచార శాఖ బ్యాన్ చేసింది. దేశ భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులోనూ ఇలాంటి చర్యలు తీసుకుంటాం. భారత సార్వభౌమత్వం, సమగ్రతను, జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, ప్రజా సంబంధాలను దెబ్బతీసేందుకు చేసే కుట్రను అణచివేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది.’ అని తెలిపారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్. ఇదీ చదవండి: రసవత్తరంగా రాజస్థాన్ రాజకీయ సంక్షోభం: గెహ్లాట్‌ను రేసు నుంచి తప్పించాలంటూ ఫిర్యాదు -
World Kitchen Garden Day: ఇంతింతైన ఇంటిపంటల సంస్కృతి..
‘ఆహారమే ప్రథమ ఔషధం’ అన్న పెద్దల మాటను కరోనా .. ప్రజలకు జ్ఞాపకం చేసింది. అంతేకాదు, సేంద్రియ ఇంటిపంటలు మిద్దెతోటల సాగు దిశగా పట్టణ ప్రజలను పురికొల్పింది. సీనియర్ కిచెన్ గార్డెనర్ల సలహాలు, సూచనలకు గిరాకీ పెంచింది. సాధారణ గృహిణులైనప్పటికీ సీనియర్లు ప్రత్యేక యూట్యూబ్ చానల్స్ ప్రారంభించారు. తరచూ వీడియోలు పోస్ట్ చేస్తూ మంచి వ్యూస్ పొందుతున్నారు. తమ సలహాలకు ఆర్థిక విలువ చేకూరటం కూడా వారికి సంతోషాన్నిస్తోంది. ఇంటిపట్టునే ఉండి ఉద్యోగాలు చేసుకునే సదుపాయం యువతకు అందుబాటులోకి రావటం వల్ల కూడా ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్ (అర్బన్ అగ్రికల్చర్, సిటీ ఫార్మింగ్) వ్యాపకం తెలుగునాట ఆరోగ్యదాయకంగా విస్తరిస్తోంది! ఆగస్ట్ 28న ‘వరల్డ్ కిచెన్ గార్డెన్ డే’ సందర్భంగా ఈ కవర్ స్టోరీ.. పల్లెల్లో నాగలి పట్టిన రైతులు, రైతు కూలీలు ప్రత్యక్షంగా వ్యవసాయం చేస్తూ ఉంటే.. వారు పండించే ఆహారోత్పత్తులను తింటూ పట్టణాలు, నగరాల్లో నివసించే వారు పరోక్షంగా వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారు. రైతులు ఉత్పత్తిదారులైతే, వినియోగదారులు సహ–ఉత్పత్తిదారులన్న మాట. ‘భోజనం చేయటం కూడా వ్యవసాయక చర్యే’ అని ప్రసిద్ధ పర్యావరణవేత్త వెండెల్ బెర్రీ అన్నది ఇందుకే! ప్రజలు తినగోరే వ్యవసాయోత్పత్తులకే మార్కెట్లో గిరాకీ ఉంటుంది. వాటినే గ్రామాల్లో రైతులు పండిస్తూ ఉంటారు. మనం గ్రహించినా, గ్రహించకపోయినా.. మనందరం వ్యవసాయంలో చురుకుగా పాల్గొంటున్న వాళ్లమే. నగరవాసుల్లో ఉంటూlతమ కోసం సేంద్రియ పద్ధతుల్లో ఆరోగ్యదాయకమైన ఇంటి పంటలు పండించుకొని తినే ‘అర్బన్ ఫార్మర్స్’ సంఖ్య మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. మన నగరాల్లో సేంద్రియ ఇంటిపంటలు, మిద్దె తోటల సాగు వేగంగా విస్తరిస్తోంది. పెరట్లో, బాల్కనీల్లో, భవనాలు, మిద్దెల మీద కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను రసాయనాలు వాడకుండా సాగు చేయటం బాగా పెరిగింది. అంతేకాదు, కరోనా నేపథ్యంలో నగర పరిసరాల్లో అంతకుముందు ఖాళీగా ఉన్న ఫామ్ హౌస్ భూములు, కమ్యూనిటీ ఖాళీ స్థలాల్లోనూ ప్రకృతి,సేంద్రియ సేద్యం ఊపందుకుంది. నగరాలతో పాటు చిన్న చిన్న పట్టణాల్లో నివసించే వారిలోనూ సేంద్రియ ఇంటిపంటలు, మిద్దెతోటలపై ఆసక్తి గత రెండేళ్లలో అనేక రెట్లు పెరిగింది. ప్రధానంగా సొంత భవనాల్లో నివాసం ఉండే మధ్య తరగతి లేదా ఉన్నత–మధ్య తరగతి సాగుదారులు ఎక్కువగా మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. బెంగళూరు, పుణే, త్రివేండ్రం, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కరీంనగర్, వరంగల్ వంటి అనేక భారతీయ నగరాల్లో ఈ ధోరణి మనకు ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ప్రజలకు, పర్యావరణానికీ ఆరోగ్యదాయకంగా నిలిచే సేంద్రియ ఇంటిపంటలు, మిద్దె తోటల సాగు సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లో తామర తంపరగా విస్తరిస్తోంది. ప్రచారోద్యమానికి శ్రీకారం సాక్షి మీడియా గ్రూప్ ‘రేపటికి ముందడుగు’ నినాదంతో దశాబ్దం క్రితమే సేంద్రియ ‘ఇంటిపంట’ల ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇంటిపంటల సాగులో కొత్త టెక్నిక్స్‌ను పరిచయం చేయటమే కాకుండా, సుసంపన్నమైన ప్రజల ఇంటిపంటల సాగు అనుభవాలతో కూడిన కథనాలను శ్రద్ధగా ప్రచురించటం గత పదకొండేళ్లుగా ‘సాక్షి’ చేస్తోంది. ఇంటిపంటల సాగుదారుల కథనాలతో పాటు వారి ఫోన్ నంబర్లు ప్రచురించడం ద్వారా ఈ అనుభవాలను ఇతరులు నేర్చుకోవడానికి వీలు కలిగింది. ఈ కృషి ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో లోగిళ్లు సేంద్రియ ఇంటిపంటలతో కళకళలాడుతున్నాయి. ‘సాక్షి’ ఇంటిపంటల కథనాల ప్రేరణతో ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యాన శాఖ హైదరాబాద్‌లో ఇంటిపంటల సాగు ప్రారంభానికి అవసరమైన సరంజామాను సబ్సిడీపై అందించటం ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఉద్యాన శాఖ అప్పట్లోనే అర్బన్ అగ్రికల్చర్ విభాగాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం సబ్సిడీ కిట్లు ఇవ్వటం లేదు కానీ, ఔత్సాహికులకు నెలకు రెండు రోజులు శిక్షణ ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు అడపా దడపా కిచెన్ గార్డెనింగ్పై శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఆన్లైన్లో సమృద్ధిగా సమాచారం అందుబాటులో ఉండటంతో చిన్నా చితకా పట్టణాలు, గ్రామాల్లో నివాసం ఉండే ఆరోగ్యాభిలాషులు చాలా మంది స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులతోనే సేంద్రియ ఇంటిపంటల సాగుకు ఉపక్రమిస్తున్న ట్రెండ్ కనిపిస్తోంది. సొంతూళ్లకు చేరిన ప్రైవేటు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కూడా ఇంటిపంటల వ్యాప్తికి దోహపడిందనే చెప్పాలి. రోజువారీ తినే కూరగాయలు, పండ్లల్లో చాలా వరకు తమ మిద్దె, ఇంటిపైనే పండించుకుంటున్న ప్రొఫెషనల్ కిచెన్ గార్డెనర్స్ తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది ఉన్నారు. తుమ్మేటి రఘోత్తమరెడ్డి వంటి వారైతే చాలా ఏళ్లుగా నూటికి నూరు శాతం తమ మిద్దెతోటపైనే ఆధారపడుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఇళ్లపైన కంటెయినర్లలో సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగు చేసే వంద మందిపై జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్) అధ్యయనం చేసింది. తాము రోజువారీగా తినే కూరగాయల్లో 81%, పండ్లలో 10% వరకు తమ ఇంటిపైనే పండించుకుంటున్నామని 50% కన్నా ఎక్కువ మంది చెప్పారు. కొంతమంది కూరగాయల కన్నా పండ్లపైనే దృష్టి పెడుతుండటం విశేషం. తింటున్న పండ్లలో 85%, కూరగాయల్లో 7% మేరకు తామే కుండీలు, మడుల్లో ఇంటి దగ్గర పండించుకుంటున్నామని 25% మంది చెప్పారు. ఏభయ్యేళ్లు దాటిన వారు 46% మంది ఇంటిపంటలు పండిస్తున్నారు. వీరిలో 35 ఏళ్లు దాటిన వారు 34%. పది కన్నా ఎక్కువ రకాల కూరగాయలు, పండ్లను 15% మంది సాగు చేస్తున్నారు. 5 రకాలను 45% మంది, 10 రకాలను 40% మంది సాగు చేస్తున్నారు. 91% మేరకు మట్టి కుండీలను వాడుతుండటం విశేషం. బెంగళూరు భళా వంటింటి వ్యర్థాలతో ఇంటి వద్దే కంపోస్టు తయారు చేయటం, ఇళ్లపై కంటెయినర్లలో సేంద్రియ కూరగాయలు, పండ్లు పెంచుకోవడంలో బెంగళూరు మన దేశంలోనే ముందంజలో ఉందని చెప్పొచ్చు. భారతీయ సిటీ ఫార్మింగ్ పితామహుడుగా పేరుగాంచిన డా. విశ్వనాథ్ బెంగళూరు వారే. వ్యవసాయ శాస్త్రవేత్తగా రిటైరైన తర్వాత, గత ఏడాది కరోనాతో చనిపోయేంత వరకు, 20 ఏళ్ల పాటు వేలాది మందికి టెర్రస్ ఫార్మింగ్‌లో శిక్షణ ఇచ్చిన ఘనత ఆయనది. అంతేకాదు, టెర్రస్ కిచెన్ గార్డెన్స్‌లో పెంచి తాము తినగా మిగిలిన కూరగాయలు, పండ్లు.. వాటితో తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 3 నెలలకోసారి ప్రత్యేక మేళాలు నిర్వహించుకునే ఉన్నత స్థాయికి సిటీ ఫార్మింగ్ చైతన్యం బెంగళూరులో వికసించింది. ఇంటిపంటలతో ప్రయోజనాలోన్నో పట్టణ వ్యవసాయం బహుళ ప్రయోజనాలను చేకూర్చగలదని బెంగళూరులోని భారతీయ మానవ ఆవాసాల సంస్థ (ఐఐహెచ్ఎస్) భావిస్తోంది. బెంగళూరు, పుణేలో సేంద్రియ ఇంటిపంటల సాగు తీరుతెన్నులపై ఈ సంస్థ ఇటీవల పరిశోధన చేపట్టింది. మరింత వైవిధ్యమైన – పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడం, వైద్య ఖర్చులు తగ్గించడం, తడి వ్యర్థాలను పునర్వినియోగించడం, వర్షపు నీటి సంరక్షణకు దోహదం చేస్తుంది. పట్టణ పౌరులు ప్రకృతితో తిరిగి కనెక్ట్ అవ్వడానికి, సుస్థిర జీవనంపై లోతైన అవగాహన కలిగించుకోవడానికి అర్బన్ అగ్రికల్చర్ సహాయపడుతుంది. ప్రజలకు చేకూరుతున్న ఈ ప్రయోజనాలు పైకి కొట్టొచ్చినట్టు కనిపించనివైనప్పటికీ భారతీయ నగరాల సుస్థిర భవిష్యత్తుSదృష్ట్యా విధానాల రూపకల్పనకు ఎంతగానో దోహదపడతాయని అంటున్నారు ఐఐహెచ్ఎస్ నిపుణులు స్వర్ణిక శర్మ. ఆరోగ్యవంతమైన నగరాల కోసం.. ప్రపంచవ్యాప్తంగా అర్బన్ అగ్రికల్చర్ ద్వారా ప్రజలకు సుమారు 15% ఆహారం అందుతోందని అంచనా. 70 కోట్ల మంది నగరవాసులకు ఈ ఫుడ్ అందుతోంది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఊపందుకున్న నగరీకరణ వల్ల 2030 నాటికి 60% మంది అర్బన్ ప్రాంతాల్లోనే నివాసం ఉంటారు. కాబట్టి, నగరాలు, పట్టణాల శివారు ప్రాంత భూముల్లోను, కాంక్రీటు జంగిల్‌గా మారిన నగరాలు, పట్టణాల్లోని భవనాలపైన, బాల్కనీల్లో, ఖాళీ స్థలాల్లో వీలైన చోటల్లా అలంకరణ మొక్కలకు బదులు ఆహార మొక్కలు, పండ్ల చెట్లు పెంచటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తాజాగా, స్థానికంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ‘అర్బన్ అగ్రికల్చర్’తో ఒనగూడే ప్రయోజనాలు పుష్కలం. ఆహార కొరత తీర్చటం, ఆరోగ్యాన్ని జీవన నాణ్యతను మెరుగుపరచడం, పర్యావరణంపై అవగాహనను పెంపొందించటం వంటి ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి అర్బన్ అగ్రికల్చర్ దోహదపడుతుంది. అందుకే ఐక్యరాజ్య సమితి ఆహార–వ్యవసాయ సంస్థ (యు.ఎన్. ఎఫ్.ఎ.ఓ.) అర్బన్–పెరీ అర్బన్ అగ్రికల్చర్ పాలసీపై పాలకులకు తాజాగా సరికొత్త సూచనలు చేసింది. అర్బన్ ప్లానింగ్‌లో ఈ స్పృహను మిళితం చేయాలని, ‘గ్రీన్ సిటీ’లకు బదులు ‘ఎడిబుల్ సిటీలు’గా తీర్చిదిద్దాలని ఎఫ్.ఎ.ఓ. సూచిస్తోంది. ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు సేంద్రియ ఇంటిపంటలు,మిద్దె తోటల ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనాలను పూర్తి స్థాయిలో గుర్తించి ప్రోత్సహించాలి. యూట్యూబర్ల హవా తెలుగు నాట రూఫ్‌టాప్ కిచెన్ గార్డెనర్లు అర్బన్ అగ్రికల్చర్‌ను స్థిరమైన దిగుబడులు పొందే రసాయన రహిత పద్ధతులు, సరికొత్త నమూనాలతో కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. సందేహాలు తీర్చటం, అనుభవాలను పరస్పరం పంచుకోవడానికి తొలి దశలో ఫేస్బుక్ గ్రూపులు కీలకపాత్ర పోషించాయి. తర్వాత లేక్కలేనన్ని వాట్సప్, టెలిగ్రామ్ గ్రూపులు ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో ఇంటిపట్టునే ఉండి పనులు చేసుకునే అవకాశం అందిరావటం వల్ల నగరాలు, పట్టణ వాసులు ఆరోగ్య పరిరక్షణోద్యమంగా సేంద్రియ ఇంటిపంటలు,మిద్దె తోటల సాగును చేపట్టారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో పాటు ప్రత్యేకించి ఔషధ మొక్కల సాగు సైతం తెలుగు నాట ఇప్పుడు ఉధృతమైంది. ఈ పూర్వరంగంలో యూట్యూబ్ చానళ్లు రంగంలోకి రావటంతో ఇది సరికొత్త ఉపాధి మార్గంగానూ మారింది. అంతకుముందు గత కొన్ని ఏళ్ల నుంచి అనుభవం గడించిన వారిలో కొందరు యూట్యూబ్ చానళ్లు ప్రారంభించి తమ అనుభాలను వీడియోల ద్వారా పంచుతూ ప్రాచుర్యం పొందుతున్నారు. ఓ తాజా సర్వే ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 168 యూట్యూబ్ చానల్స్ ఉన్నట్లు లెక్క తేలింది. సేంద్రియ ఇంటిపంటలు, మిద్దె తోటలపై సమగ్ర సమాచారాన్ని, అనుభవ జ్ఞానాన్ని ప్రజలకు అందిస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్, కొన్ని యాప్‌ల ద్వారానే వీడియోలను ప్రొడ్యూస్ చేసే సాంకేతికత అందుబాటులోకి రావటం కలసివచ్చింది. తరచూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. కిచెన్ గార్డెనింగ్‌లో ఏ సందేహం ఉన్నా నివృత్తి చేయటానికి ఇప్పుడు వీడియోలు యూట్యూబ్‌లో ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. రోజుకో వీడియో పెడుతున్న వారూ ఉన్నారు. సృజనాత్మకతో కూడిన నాణ్యమైన వీడియోలు లక్షలాది వ్యూస్ నమోదు చేసుకుంటున్నాయి. యూట్యూబర్లుగా మారిన సేంద్రియ ఇంటిపంటలు, మిద్దెతోటల సాగుదారులు తమ అనుభవాలను ఇతరులకు అందుబాటులోకి తేగలుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నారు. అంతేకాదు.. ఈ వీడియోల ద్వారా నెలవారీగా గణనీయమైన ఆదాయాన్ని సైతం పొందుతుండటం సంతోషదాయకం. వీరిలో హైదరాబాదీయులు, ముఖ్యంగా మహిళలే ఎక్కువ! టెర్రస్ మీద 9 ఏళ్లుగా వందల కుండీలు, మడుల్లో ఎంతో వైవిధ్యభరితమైన పండ్ల చెట్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను సాగు చేస్తూ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని కుటుంబానికి అందిస్తున్నారు హైదరాబాద్ బీరంగూడకు చెందిన గృహిణి లత. పత్రికలు, టీవీ చానళ్లలో ఆమె కృషి గురించి కథనాలు వచ్చాయి. సలహాలు, సూచనల కోసం కరోనా కాలంలో ఫోన్లు, వాట్సప్ మెసేజ్‌లు వెల్లువయ్యాయి. ప్రతిసారీ వివరించి చెప్పాల్సి రావటం కష్టంగా ఉండటంతో ‘లతాస్ టెర్రస్ గార్డెన్’ పేరిట యూట్యూబ్ చానల్ ప్రారంభించాను అంటారామె సంతృప్తిగా. ఆరోగ్యానికి ఆహారమే మూలం అని గ్రహిస్తున్న ప్రజలు ఆర్గానిక్ టెర్రస్ గార్డెనింగ్ విలువ తెలుసుకుంటున్నారని ఆమె అంటున్నారు. కిచెన్ వేస్ట్ బయటపడేయకుండా మట్టి కొంచెం, పేడ కొంచెం కలుపుకుంటే 20 రోజుల్లో కంపోస్టు తయారవుతుందని హైదరాబాద్‌కు చెందిన సీనియర్ కిచెన్ గార్డెనర్ నూర్జహాన్ అంటారు. నలుగురికీ మాట సాయం అందించే సాధనంగా ‘నూర్జహాన్ టెర్రస్ గార్డెన్’ పేరిట యూట్యూబ్ చానల్ ప్రారంభించారు. రోజు మార్చి రోజు వీడియోలు పెడుతున్నారు. ఇప్పటికి 754 వీడియోలున్నాయి. తన మేడపై దశాబ్దాలుగా గడించిన ఇంటిపంటల సాగు అనుభవ జ్ఞానాన్ని ప్రజలకు వివరంగా తెలియజెప్తున్నానన్న ఆనందం కలుగుతోందని నూర్జహాన్ సంతోషిస్తున్నారు. ∙పంతంగి రాంబాబు -
Kavitha Naga Vlogs: ఆమె మనసుకు రుచి తెలుసు
ఆమెకు చూపు సరిగా లేదు. కాని అద్భుతంగా వండుతుంది. ఇలా వండమని యూ ట్యూబ్‌లో వంటలు చేస్తూ అందరినీ అభిమానులుగా మార్చుకుంది. ఒకరు కాదు... ఇద్దరు కాదు రెండున్నర లక్షల మంది సబ్స్క్రయిబర్లతో స్టార్‌గా వెలుగుతున్న తెలుగు చెఫ్ బొడ్డు నాగలక్ష్మి. ఈమె వీడియోలు చూశారా మీరు? ‘అందరికీ నమస్తే. నేను నాగలక్ష్మి, ఈమె కవిత. మేమిద్దరం వదిన మరదళ్ళం’ అని మొదలవుతుంది నాగలక్ష్మి చేసే వీడియో. నిజానికి ఆమె చేసేది జంట వీడియో. ప్రతి వీడియోలోనూ వదిన కవిత ఉంటుంది. ఇద్దరి పేరు మీద ‘కవిత నాగ వ్లోగ్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ ఉంది. 2020 వ సంవత్సరం సెప్టెంబర్‌లో మొదలైన చానల్ రెండేళ్ల లోపే రెండున్నర లక్షల సబ్స్క్రయిబర్లను సాధించింది. నాగలక్ష్మికి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తోంది. ఇంతచేసి నాగలక్ష్మికి చూపు లేదు. కాని అది ఆమె విజయానికి అడ్డంకి కాలేదు. బతికిన పసిగుడ్డు నెల్లూరు జిల్లా వరికుంటపాడుకు చెందిన రైతు కృష్ణారెడ్డి ఆఖరు కూతురు నాగలక్ష్మి. పుట్టుకతోనే చూపు లేదు. పురిట్లో చూసిన బంధువులు ‘ఎందుకు కృష్ణారెడ్డి అవస్థ పడతావు. వడ్లగింజ వేసెయ్’ అని సలహా ఇచ్చారు. కాని నాగలక్ష్మి తల్లి బిడ్డను గుండెలకు హత్తుకుంది. ‘చూపులేకపోతే నా బిడ్డ కాకుండా పోతుందా’ అంది. వయసు పెరిగాక అర్థమైన విషయం ఏమిటంటే నాగలక్ష్మికి ఎడమ కన్ను పూర్తిగా కనిపించదు. కుడికన్ను ఏదైనా వస్తువు దగ్గరగా పెట్టుకుంటే 5 శాతం కనిపిస్తుంది. అంటే ఆమె కుడికన్ను చాలా కొద్దిగా అతి దగ్గరి వస్తువులు (రెండు అంగుళాల దూరంలో) ఉంటే చూస్తుంది. అయినా సరే నాగలక్ష్మి బెదరలేదు. ఐదు వరకు బడికి వెళ్లింది. ఆ తర్వాత ఇంట్లో తల్లికి చేదోడు వాదోడుగా ఉండిపోయింది. నీళ్లు మోయడం మామూలు పనులు చేయడం చూపు లేకపోయినా అడుగుల అంచనాను బట్టి అలవాటు చేసుకుంది. కాని సమస్యలు ఆమెను వదల్లేదు. తల్లి వియోగం 18 ఏళ్ల వయసులో తల్లి మరణించింది. అప్పటికి అక్కకు పెళ్లయి వెళ్లిపోవడంతో ఇంటిలో వంట పని నాగలక్ష్మి బాధ్యత అయ్యింది. తండ్రికి, అన్నయ్యకు ఆమే వండి పెట్టాల్సి వచ్చింది. కాని అన్నం వండటం తప్ప నాగలక్ష్మికి ఏమీ రాదు. అప్పుడు పక్కనే ఉండే ఒక అవ్వ ఆమెకు సాయం చేసింది. ‘నువ్వు వండుతూ ఉండు. నేను పక్కన ఉండి సలహా ఇస్తుంటాను’ అని పక్కన ఉండి వంట నేర్పించింది. ఆ అవ్వకు బాగా వండటం వచ్చు. అది నాగలక్ష్మికి కూడా వచ్చేసింది. అయినప్పటికీ ఇంట్లో ఆడతోడు లేకపోవడం వల్ల శారీరకంగా మానసికంగా వచ్చే ఇబ్బందులకు తోడు కోసం నాగలక్ష్మి బాధలు పడింది. అయితే ఆమె అన్న ఆదిరెడ్డి వివాహం చేసుకుని ప్రకాశం జిల్లాకు చెందిన బోండాల కవితను కోడలిగా తేవడంతో ఆమె జీవితానికి పెద్ద ఆసరా దొరికింది. యూట్యూబ్ ప్రయోగాలు 2018లో నాగలక్ష్మి అన్న ఆదిరెడ్డి యూట్యూబ్ చానల్ ప్రారంభించి ‘బిగ్‌బాస్’ షో మీద కామెంటరీ చెప్పేవాడు. ఆ వీడియోలు హిట్ అయ్యి అతనికి పేరు వచ్చింది. ఆ సందర్భంలో ఒకరోజు నాగలక్ష్మి చేత సరదాగా కామెంటరీ చెప్పిస్తే ఆ వీడియో అందరూ బాగుందన్నారు. అప్పటికి నాగలక్ష్మికి సీరియల్స్ పిచ్చి బాగా ఉండేది. టీవీలో సీరియల్స్‌ను చూసేది (వినేది). ఫోన్లో అయితే కంటికి దగ్గరగా పెట్టుకుంటే సీరియల్ బూజరగా కనిపిస్తుంది. అందువల్ల ఆదిరెడ్డి ఆమె చేత ‘సీరియల్ పిచ్చి’ అనే షో చేయించాడు. కాని దానికి పెద్ద స్పందన రాలేదు. కాని 2020లో లాక్డౌన్ సమయంలో నాగలక్ష్మి, కవిత కలిసి వంట వీడియోలు మొదలెట్టారు. ఇద్దరూ మంచి మాటకారులు కావడంతో రెండు రోజుల్లోనే 10 వేల మంది సబ్స్క్రయిబర్లు వచ్చారు. ‘కవిత నాగ వ్లోగ్స్’ అలా మొదలైంది. జామకాయ రోటి పచ్చడి నెల్లూరు పప్పుచారు తనకు చూపు లేదని ఈసురోమనడం నాగలక్ష్మి స్వభావంలో లేదు. ప్రతి వీడియోలో వదినతో కలిసి హుషారుగా కబుర్లు చేస్తుంది. చూపున్నట్టే వంటగదిలో కదలుతూ వంట చేస్తుంది. వదిన మరదలు కలిసి స్థానిక వంటలు రకరకాలుగా చేస్తూ భారీగా అభిమానులను కూడగట్టుకున్నారు. నాగలక్ష్మి చేసే పప్పుచారుకు పెద్ద గిరాకీ ఉంది. అలాగే చుక్కకూర పచ్చడి వీడియో పెద్ద హిట్ అయ్యింది. పచ్చి జామకాయ రోటి పచ్చడి కూడా ఈమె రుచి చూపించింది. చపాతీ లడ్డు మరో వెరైటీ. నెల్లూరు చేపల పులుసును అథెంటిక్‌గా చేసి చూపిస్తుంది. ‘నేను నూనె ఎక్కువ వేశానని ఒక్కరు కూడా అనరు. అంత సరిగ్గా వేస్తాను’ అంటుంది నాగలక్ష్మి. రకరకాల కామెంట్లు నాగలక్ష్మి వీడియోలకు 40 ఏళ్లు దాటిన అభిమానులు ఎక్కువ. అయితే ఈ వదిన మరదళ్ల మధ్య కూడా తంపులు పెట్టడానికి అన్నట్టు వీడియోల కింద కొందరు కామెంట్లు పెట్టారు. వీరు విడిపోయారని కూడా అన్నారు. కాని వదిన మరదళ్లు కలిసి వీడియోలు చేస్తూనే ఉన్నారు. తమ ఇంట్లో జరిగే ప్రతి విశేషాన్ని దాపరికం, శషభిషలు లేకుండా వ్యూయెర్స్తో పంచుకోవడమే వీరి వీడియోలలో విశేషం. ‘చిన్న చిన్న సమస్యలతో ఆత్మహత్యలు చేసుకునేవారి వార్తలు వింటుంటాను. ఎటువంటి సవాలునైనా ఎదుర్కోవాలనేదే నా సలహా’ అని నాగలక్ష్మి అంటుంది. తన సంపాదన నుంచి సోనూసూద్ ఫౌండేషన్‌కు, సిఎం రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేసింది నాగలక్ష్మి. అపజయం ఆమె కంట పడలేదు. ఆమె తన ప్రతి అడుగులోనూ వినేది గెలుపు పిలుపునే. -
మరో బంపర్ ఫీచర్‌ను లాంచ్ చేయనున్న యూట్యూబ్
ముంబై: ప్రముఖ వీడియోషేరింగ్ ప్లాట్‌ఫామ్, ఎంటర్టైన్మెంట్ కింగ్ యూట్యూబ్ మరో సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేయనుంది. ఎప్పటికపుడు కీలక అప్డేట్స్తో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న యూట్యూబ్ త్వరలోనే YouTube స్ట్రీమింగ్ వీడియో సర్వీస్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తోందట. దీనికి సంబంధించి పలు ఎంటర్టైన్మెంట్ కంపెనీలతో కంపెనీ చర్చలను మళ్లీ ప్రారంభించిందని సమాచారం. చదవండి: వీఎల్సీ మీడియా ప్లేయర్‌పై నిషేధం, వెబ్సైట్, డౌన్లోడ్ లింక్ బ్లాక్ స్ట్రీమింగ్ వీడియో సేవల కోసం ఆల్ఫాబెట్కుచెందిన యూట్యూబ్ ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించాలని యోచిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ శుక్రవారం నివేదించింది. గత 18 నెలలుగా పనిలో ఉన్న సంస్థ పలు సంస్థలతో చర్చలను పునరుద్ధరించిందని పేర్కొంది. "ఛానల్ స్టోర్" తో పేరుతో పిలుస్తున్న ఈ చర్చలు పూర్తైన తరువాత ఈ సర్వీసు అందుబాటులోకి రావచ్చని తెలిపింది. కాగా ఈ వారం ప్రారంభంలో, వాల్‌మార్ట్ తన సభ్యత్వ సేవలో స్ట్రీమింగ్ ఎంటర్టైన్మెంట్ను చేర్చడం గురించి మీడియా కంపెనీలతో చర్చలు జరిపిందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.కే బుల్, శాటిలైట్ టీవీ యూజర్లు సబ్స్క్రిప్షన్-ఆధారిత స్ట్రీమింగ్ సేవలకు మారుతున్న తరుణంలో యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు పావులు కదుపుతోంది. తద్వారా రోకు, ఆపిల్ లాంటి కంపెనీల సరసన చేరనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై యూట్యూబ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. చదవండి: వేధించకండి! రుణ రికవరీ ఏజెంట్లపై ఆర్బీఐ ఉక్కుపాదం! -
సూపర్ స్టార్ కృష్ణ ఇల్లు చూశారా? వీడియో వైరల్
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ హోంటూర్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పటికే మంచు లక్ష్మీ, కమెడియన్ అలీ,కృష్ణం రాజు వంటి ప్రముఖుల హోంటూర్స్ నెట్టింట ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మరో సెలబ్రిటీ హోంటూర్ కూడా వచ్చేసింది. ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ హోంటూర్ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తుంది. ఆయన కుమార్తె మంజుల ఘట్టమనేని స్వయంగా తన యూట్యూబ్ చానెల్లో హోంటూర్కు సంబంధించిన ప్రోమో వీడియోను రిలీజ్ చేసింది. సకల సైకర్యాలతో అందమైన హంగులతో ఇంద్రభవనాన్ని తలపిస్తున్నట్లు ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. విజయ నిర్మల విగ్రహం ఇందులో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. త్వరలోనే ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వీడియో రానుంది. -
ఈ ఫోన్లు కొంటే..షావోమీ బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయంగా మూడు నెలల యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తోంది. అయితే ఇందులో ఒక కండిషన్ ఉంది. అదేమిటంటే.. ఎంపిక చేసిన షావోమీ, రెడ్మి స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై మొదటి మూడు నెలలు ఈ అవకాశం అందుబాటులో ఉంది. ఈ మేరకు షావోమి ఇండియా ఒక ప్రకటన జారీ చేసింది. షావోమి ఇలాంటి ఆఫర్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు తన సబ్-బ్రాండ్లలో ఒకటైన పోకో కూడా ఇదే ఆఫర్‌ను వినియోగదారులకు అందిస్తోంది. సో..యూట్యూబ్ ప్రీమియం ఉచిత ఆఫర్‌ను ఇప్పటికే పొందినట్లయితే, షావోమీ ఫోన్ కొనుగోలుపై ఫ్రీ ఆఫర్‌ను పొందేందుకు అర్హుల కారు అనేది గమనించాలి. షావోమి 11, షావోమీ 12 ప్రో, షావోమీ 11టి,11 ఐ కొనుగోలుపై మూడు నెలలు, అలాగే రెడ్మి నోట్ 11, నోట్ 11 ఎస్ లాంటి కొన్ని స్మార్ట్ఫోన్లపై రెండు నెలల యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్ర్రిప్షన్ ఉచితం. ఈ ప్రమోషనల్ ఆఫర్ జనవరి 31, 2023 వరకు అందుబాటులో ఉంటుంది. కాగా యూట్యూబ్ ప్రీమియం నెలకు రూ.129. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఉన్న ఇతర ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కంటే ఇదే చౌకగా లభిస్తోంది. -
Annaatthe Mathew: అన్నేత్తే మాథ్యూ.. ఎవరీమె? వేల మంది సబ్స్క్రైబర్లు ఎందుకు?
వేసవి వస్తోంది. పరీక్షలు పూర్తయ్యేలోపు ఈ హాలిడేస్కి ఎక్కడికి వెళ్దాం? అనే ప్లాన్ మొదలవుతుంటుంది. అసలే రెండేళ్లుగా ఇంట్లోనే గడిచిపోయిన జీవితాలు ఇప్పుడు రెక్కలు విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే టూర్ ప్లాన్ వేయడం సులభమే, కానీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కల సంరక్షణ ఎలా? మొక్కల ప్రేమికుల మనసును కలచి వేసే ఆవేదన ఇది. ఇందుకోసం ‘గ్రీక్స్ ఆఫ్ గ్రీన్’ యూ ట్యూబ్ చానెల్ నిర్వహిస్తున్న అన్నేత్తే మాథ్యూ సూచనలను అనుసరిద్దాం. ఇంతకీ అన్నేత్తే మాథ్యూ ఎవరు? ఆ వివరాలూ తెలుసుకుందాం. ఊరెళ్లే రోజు మొక్కలన్నింటికీ సమృద్ధిగా నీరు పోయాలి. కుండీలకు నేరుగా ఎండ తగిలితే మట్టి త్వరగా ఎండిపోతుంది. కాబట్టి కుండీలను నీడలో ఉంచాలి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో నీటిని నింపి మూతకు సన్నని సూదితో రెండు రంధ్రాలు చేసి బాటిల్‌ని తిరగేసి చెట్టు మొదట్లో అమర్చాలి. లలా చేయడం వల్ల మొక్క పాదుకు కొద్ది కొద్దిగా నీరు అందుతూ ఉంటుంది. ఇంట్లో వెడల్పు తొట్టె ఉంటే ఆ తొట్టెలో నీటిని నింపి ఆ నీటిలో మొక్కల కుండీలను ఉంచాలి. ఇలా చేయడం వల్ల కుండీల్లో ఉన్న తేమ ఎక్కువ కాలం నిలుస్తుంది. పెద్ద తొట్టె లేనప్పుడు కుండీలను ఉంచగలిగిన సైజ్ ప్లాస్టిక్ టబ్‌లు తెచ్చి అందులో నీటిని నింపి మొక్కల కుండీలను ఉంచవచ్చు. నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల దోమల బెడద ఎదురవుతుంది. ఈ సమస్యను నివారించడానికి టబ్‌లోని నీటిలో మూడు చుక్కల హైడ్రోజెన్ పెరాక్సైడ్, మూడు చుక్కల డిష్ వాష్ లిక్విడ్ వేయాలి. ఇవన్నీ సాధ్యం కాకపోతే మరో సులువైన చిట్కా ఉంది. ఒక పాత్రలో నీటిని పోసి నూలు వస్త్రాన్ని తాడులా చేసి ఒక చివరను నీటి పాత్రలో, మరొక చివరను మొక్క మొదట్లో ఉండేటట్లు అమర్చాలి. నీటి పాత్ర నుంచి మొక్క పాదులోకి నూలు వస్త్రం తాడు సాయంతో తేమ అందుతూ ఉంటుంది. ఈ పద్ధతిలో ఒకే పాత్రలో ఎక్కువ నూలు తాళ్లను ఉంచి రెండో చివర్లను ఒక్కో పాదులో అమర్చడం ద్వారా ఎక్కువ మొక్కలకు నీటిని సరఫరా చేయవచ్చు. ఎనిమిదేళ్ల శ్రమకు దర్పణం మహారాష్ట్రకు చెందిన అన్నేత్తే మాథ్యూ తన ఇంటి ఆవరణలో మూడు వందల రకాల మొక్కలను పెంచుతోంది. ‘‘ముస్సోరీలోని బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు అక్కడి మొక్కలను చూస్తే ముచ్చటేసింది. వచ్చేటప్పుడు నాతోపాటు నలభై మొలకలను వెంట తెచ్చుకున్నాను. అప్పటి నుంచి నా జీవితం మొక్కలే లోకం గా మారిపోయింది. మొక్కలు చిగుళ్లు తొడగడం నుంచి మొగ్గ తొడగడం పువ్వు పూయడం ప్రతిదీ స్మార్ట్ ఫోన్లో రికార్డు చేసేదాన్ని. ఈ మొక్క ఫలానా, ఈ పువ్వు ఎన్ని రోజులు ఉంటుంది... వంటి వివరాలన్నీ ఎవరో ఒకరితో చెప్పాలనిపించేది. దాంతో నాలుగేళ్ల కిందట యూట్యూబ్ చానెల్ ప్రారంభించి నా మొక్కల వీడియోలను అప్లోడ్ చేయడం మొదలు పెట్టాను. దాదాపుగా ఎనిమిది నెలల వరకు నా చానెల్ గురించి ఎవరికీ తెలియదు. ఆ తర్వాత వ్యూయర్షిప్ చాలా వేగంగా పెరిగిపోయింది. మొక్కల పెంపకంలో నేను అనుసరిస్తున్న మెళకువలు, పరిరక్షణ పద్ధతులను కూడా వీక్షకులతో పంచుకుంటూ ఉండడంతో, అవన్నీ వారికి ఉపయుక్తంగా ఉంటున్నాయని మా వీక్షకుల నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి. చాలా మంది మొక్కలను పెంచడం ఇష్టంగానే ఉంటోంది కానీ, ఓ వారం రోజులపాటు ఊరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతోంది. తిరిగి వచ్చేటప్పటికి వాడిపోతాయనే భయంతో ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాం అంటుంటారు. వాళ్ల కోసం ఈ చిట్కాలు’’ అంటారు అన్నేత్తే మాథ్యూ. ఆమె చానెల్‌కి ఎనభై వేల మంది సబ్స్క్రైబర్లున్నారు. ఎనిమిదేళ్లపాటు మొక్కలే లోకంగా జీవించిన మాథ్యూ సాధించిన పచ్చటి ప్రగతి ఇది. -
7ఆర్ట్స్ సరయుపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు
-
7ఆర్ట్స్ సరయుపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు
Case Filed On 7 Arts,Bigbos Fame Sarayu: యూట్యూబూర్ 7ఆర్ట్స్ సరయు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన బోల్డ్నెస్తో నెట్టింట రచ్చ చేసే సరయు బిగ్‌బాస్ సీజన్-5లో పాల్గొని మరింత గుర్తింపు సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ వివాదంలో చిక్కుకుంది. హోటల్ ప్రమోషన్ కోసం తీసిన పాటలో అభ్యంతరకర విజువల్స్ ఉన్నాయంటూ సరయుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. 7ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ కోసం గతేడాది సరయు తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో సరయూ, ఆమె టీం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించి మధ్యం సేవించినట్లు వీడియో రూపొందించారు. ఇది హిందు సమాజాన్ని కించపరిచే విధంగా ఉందంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు అశోక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
నేను చాలా రొమాంటిక్ పర్సన్.. డిన్నర్ డేట్స్ ఇష్టం: హీరోయిన్
ఇప్పుడంతా యూట్యూబ్ ట్రెండ్ నడుస్తుంది. కామన్ పీపుల్ దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు ఇప్పుడు చాలామంది యూట్యూబ్‌లోకి వచ్చేస్తున్నారు. ఇప్పటికే మంచు లక్ష్మీ, కీర్తి సురేష్ వంటి స్టార్స్ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ రాశీ ఖన్నా సైతం యూట్యూబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాశీ ఓవైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా తాను యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరిన్ని విషయాలు పంచుకుంటానని వివరించింది. ఈ సందర్భంగా రాశీ మాట్లాడుతూ.. తాను చాలా రొమాంటిక్ పర్సన్ అని, తనకు డిన్నర్ డేటింగ్స్, లవ్ లెటర్స్ అంటే చాలా ఇష్టమని పేర్కొంది. ఇక తన జీవితంలో వారానికి 20ఫ్లయిట్ జర్నీలు చేస్తానని, త్వరలోనే షూటింగ్లో బిహైండ్ ది సీన్స్‌ని కూడా చూపిస్తానంది. స్కిన్ కేర్, జిమ్ సహా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంటానని అందుకోసం తన ఛానెల్‌ను లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దని వివరించింది. -
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'ఫుల్ కిక్కు' సాంగ్
Ravi Teja Full Kick Song Gets Huge Response: మాస్ మహారాజ రవితేజ రమేష్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడి. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్గా ఈ చిత్రం నుంచి విడుదలైన ఫుల్కిక్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఇప్పటి వరకూ 5.8 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌తో దూసుకెళ్తున్న ఈ పాటకు 1.78లక్షలకు పైగా లైకులు వచ్చాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ మాస్ బీట్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అలరిస్తున్నాయి. కాగా ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే అర్జున్, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి11న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. -
దాడి, వివాదంపై స్పందించిన సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని
Singer Sunitha Husband Ram Veerapaneni Reacts On Controversy: సింగర్ సునీత భర్త, వ్యాపారవేత్త రామ్ వీరపనేని గత కొన్ని రోజులుగా ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆయన సొంతంగా 'మ్యాంగో మాస్ మీడియా' పేరుతో డిజిటల్ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఇందులో కొన్ని సినిమాల డిజిటల్ రైట్స్ కొని వాటిని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రిలీజ్ చేస్తుంటారు. అయితే రీసెంట్గా అలా కొనుగోలు చేసి విడుదల చేసిన సినిమాలోని ఓ సన్నివేశంలో గౌడ కులానికి చెందిని మహిళలను కించపరిచే విధంగా, అభ్యంతరకర రీతిలో చూపించారంటూ ఆ కులానికి చెందిన కొందరు మ్యాంగో వీడియా ఆఫీస్‌కు వెళ్లి వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తాజాగా ఆ దాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై మ్యాంగో మీడియా స్పందించింది. 'ఈనెల24న గౌడ కులానికి చెందిన వాళ్లమంటూ కొందరు వచ్చారు. ఒక సినిమాలోని వీడియో క్లిప్పింగ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ కంటెంట్‌ను యూట్యూబ్ నుంచి తొలగించాలని కోరారు. కానీ సదరు సినిమా అప్పటికే సెన్సార్ సర్టిఫికేట్ ద్వారా థియేటర్స్‌లో విడుదలై, ఆ తర్వాత యూట్యూబ్‌లోకి అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ స్త్రీలను కించపరుస్తూ చూపించే ఉద్దేశం తమకు లేనందున వారు చెప్పిన రోజునే దాన్ని యూట్యూబ్ నుంచి తొలగించాం. అయితే ఆ వీడియో వల్ల ఎవరి మనోభావాలైనా పొరపాటున నొప్పించి ఉంటే భేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాము' అంటూ ప్రకటనలో పేర్కొన్నారు. -
యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన మహానటి
Keerthi Suresh Launched YouTube Channel: టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తెరకెక్కిన 'నేను శైలజ' సినిమాతో తెలుగులో తెరంగ్రేటం చేసిన ఈ బొద్దుగుమ్మ 'మహానటి' చిత్రంతో జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉంది కీర్తి. ప్రస్తుతం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న 'గుడ్ లక్ సఖి' చిత్రంలో నటించింది. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పలు మార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ నెల 28న థియేటర్లలో విడుదల కానుంది. అయితే తాజాగా కీర్తి సురేష్ తన యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 'ఈరోజు (జనవరి 26) నా అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. సబ్‌స్క్రైబ్ చేసి వీడియోలు చూడండి.' అని ట్విటర్లో ట్వీట్ చేసింది కీర్తి సురేష్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తన బ్యూటిఫుల్ ఫొటోస్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన షార్ట్ వీడియోస్, ఫిట్నెస్ తదితర వీడియోలను అభిమానులతో పంచుకోనున్నట్లు తెలుస్తోంది. Hello! Excited to be launching my official YouTube channel today! Do click on the link to subscribe and keep watching! 😊✨https://t.co/W3UqhVHvD8 @YouTubeIndia #youtubeshorts pic.twitter.com/uolMqnfdqP — Keerthy Suresh (@KeerthyOfficial) January 26, 2022 -
వదంతులు సృష్టించిన వ్యక్తిపై గూండా యాక్ట్
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): సోషల్ మీడియాలో వదంతులు సృష్టించిన నామ్‌తమిళర్ పార్టీ నేత, ప్రముఖ యూటూబ్ చానల్ నిర్వాహకుడు సాటైమురుగన్‌పై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ మేరకు అతడిపై గుండా చట్టాన్ని ప్రయోగిస్తూ కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీష్ సోమ వారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీపెరంబదూరులోని ఓ ప్రైవేటు కంపెనీ నిర్వాహకులు 2 వేల మంది యువతులను తిరువళ్లూరులో ఉంచి షిప్ట్ పద్ధతిలో పనిచేయిస్తున్నారు. మూడు వారాల క్రితం కార్మికులకు పెట్టిన భోజనం కలుషితం కావడంతో వందలాది మంది అస్వస్థతకు గురై ప్రైవేటు వైద్యశాలలో చేరా రు. ఈ సమయంలో సీమాన్ పార్టీ నేత, యూటూబ్ చానల్ నిర్వాహకుడు సాటై మురుగన్ వదంతులు సృష్టించాడు. ఈ నేపథ్యంలో సాటైమురుగన్‌పై గూండా చట్టా న్ని ప్రయోగించాలని కలెక్టర్ ఆదేశించారు. -
Saloni Gaur: కంగనాను అనుకరిస్తూ ‘రన్- అవుట్’.. 17 లక్షల మంది సబ్స్క్రైబర్స్!
Saloni Gaur Story In Telugu: ఆమెకు చిన్నప్పటినుంచి రోజూ న్యూస్ పేపర్లు చదవడం అలవాటు. వీటితోపాటు కథల పుస్తకాలు, నవలలు కూడా చదివేది. అలాగని పాఠ్యపుస్తకాలంటే పడదని కాదు...పాఠాలు కూడా శ్రద్ధగానే చదివేది. ఇలా బాల్యం నుంచి అనేక అంశాలపై పట్టుపెంచుకుని వాటి మీద కామెడీ చేసేది. అప్పట్లో సరదాగా చేసిన ఆ కామెడీనే ఇప్పుడామెని డిజిటల్ స్టార్‌ను చేసింది. ఆమే సలోని. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన సలోని గౌర్ అక్కడే స్కూలు చదువు పూర్తిచేసింది. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ లో పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసింది. చిన్నప్పటి నుంచి కరెంట్ ఈవెంట్స్‌ను ఫాలో అవుతూ అన్నింటిలోనూ చురుకుగా ఉండేది. దేశంలో జరిగే అనేక సమకాలీన అంశాలపై హాస్యాన్ని జోడించి తనదైన శైలిలో అందరినీ అనుకరించేది. ఆమె అనుకరణకు స్నేహితులు బాగా నవ్వుకునేవారు. దాంతో తను చేసే కామెడీని తన ఫోన్లో వీడియోలు తీసుకునేది. తర్వాత వాటిని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసేది. ఈ వీడియోలకు మంచి స్పందన లభించడంతో వీడియోలను మరింత మెరుగ్గా పోస్ట్ చేసేందుకు ప్రయత్నించేది. కాలుష్యంపై కామెడీ.. చిన్న చిన్న కామెడీ వీడియోలు పోస్టుచేస్తోన్న సలోనీ.. 2019 నవంబర్‌లో తన పేరు మీదనే ఓ యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. ఢిల్లీలోని కాలుష్యంపై ‘నజ్మా ఆపీ’ పేరిట వీడియో పోస్టు చేసింది. ఢిల్లీ కాలుష్యంపై చేసిన ఈ వీడియో సంచలనంగా మారింది. అతి తక్కువ కాలంలో దాదాపు పదిలక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. నజ్మా అంటే.. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మధ్యతరగతి ముస్లిం మహిళ. తన సాధక బాధలు, రాజకీయ, సామాజిక అంశాలను తోటివారితో ఎలా చర్చిస్తుందో తెలిపే ఫన్నీవీడియోలు నజ్మా ఆపీలో కనిపిస్తాయి. ఈ క్యారెక్టరేగాక దేశంలోని ట్రెండింగ్‌లో ఉన్న వార్షిక బడ్జెట్, ఉల్లిపాయ ధరలు, సీఏఏ, ఢిల్లీలో ఎముకలు కొరికే చలి, పాకిస్థాన్ రచయిత ఫైజ్ అహ్మద్ వివాదాస్పద రచనలు, కరోనా, లాక్డౌన్, నిరసన లు, ఇండియన్ మామ్స్, డే టు డే లైఫ్, దేశంలో నిరసనలు, హక్కుల పోరాట ఉద్యమాలు, బాలీవుడ్ నటీనటులపై కామెడీ, మిమిక్రీ వీడియోలను పోస్టు చేసేది. వీటికి మంచి స్పందన ఉండేది. రన్–అవుట్ టిక్‌టాక్, కరోనా వైరస్, ఢిల్లీ ఎన్నికలు, అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన వంటి సలోని కామెడీ వీడియోలకు మంచి ఆదరణ లభించింది. కామెడీతోపాటు.. అనుకరణ కూడా చేసేది. ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వరాన్ని బాగా అనుకరిస్తుంది. కంగనా మీడియా వేదికగా ఏది మాట్లాడినా, దానిని నవ్వించే విధంగా ‘రన్–అవుట్’ పేరిట వీడియోలు పోస్ట్ చేసేది. ఈ వీడియోలు నెటిజనులను బాగా ఆకట్టుకునేవి. ఆ మధ్యకాలంలో కమేడియన్ కునాల్ కమరా, న్యూస్ యాంకర్ అర్నాబ్ గోస్వామిపై కంగన స్పందనను అనుకరించిన వీడియోలకు యాభై లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. అంతేగాక నజ్మా ఆపీ క్యారెక్టర్‌తో వందకుపైగా వీడియోలు చేసింది. వీటన్నింటికీ లక్షల్లో వ్యూస్ వచ్చేవి. ఆదర్శ బహు, ట్యూమర్ భరద్వాజ్, సాసు మా వంటి క్యారెక్టర్లు కూడా మంచి పేరు తెచ్చాయి. ఇప్పుడు సలోనీ యూట్యూబ్ చానల్‌కు దాదాపు 17 లక్షలమంది సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు ఆరు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. -
ఇదెక్కడి మాస్ డ్యాన్స్ మామ.. ఊర 'నాటు' అంతే
RRR Naatu Naatu Song In Traffic Signal Video Goes Viral: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్'(రౌద్రం.. రణం.. రుధిరం). పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవలె విడుదలైన మాస్ సాంగ్ నాటు నాటుకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా ఈ పాటే మారుమోగుతుంది. నవంబర్ 10న రిలీజ్ అయిన ఈ సాంగ్ 27మిలియన్లకు పైగా వ్యూస్‌తో ఇప్పటికీ ట్రిండింగ్లోనే ఉంది. ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు మాస్ సెప్పులు నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఆ పాట స్పూఫ్ చేస్తూ పలువురు సోషల్ మీడియాలో వీడియోలు వదలుతున్నారు. తాజాగా నడిరోడ్డుపై ట్రాఫిక్‌లో ఓ వ్యక్తి నాటు నాటు సాంగ్‌కి ఊరమాస్ స్టెప్పులేశాడు. రెడ్ సిగ్నల్ పడగానే బైక్‌పై నుంచి దిగి.. 'నాటు నాటు' సాంగ్‌కి అదిరిపోయేలా డ్యాన్స్ చేశాడు. హెల్మెట్ కూడా తీయకుండా తన మాస్ బీట్స్‌తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. డ్యాన్స్‌పై అతనికున్న డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇదెక్కడి మాస్ డ్యాన్స్ మామ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. Meanwhile :- traffic police 😂😂😅... pic.twitter.com/BAPesslAhq — Asikhvijay (@asikhvijay) November 15, 2021 -
Yohani: నా మదిలో మంట రేపావురా
100 మిలియన్ వ్యూస్ సాంగ్/ మాణికె మగే హితే ఒక సింహళగీతం మొన్నటి మే నెలాఖరున విడుదలైంది. సెప్టెంబర్‌కు ప్రపంచమంతా కలిసి వంద మిలియన్ల వ్యూస్‌తో నెటిజన్లు చూశారు. కుర్రకారు పదే పదే ఆ పాట పాడుతున్నారు. ఔత్సాహికులు తమ భాషలో ఆ పాటను రికార్డు చేస్తున్నారు. ఒరిజినల్ సింహళమే అయినా అనేక భారతీయ భాషల్లో అది డబ్ అయ్యింది. 28 ఏళ్ల ర్యాప్ సింగర్ యోహనీ ఈ సెన్సేషన్‌కు కారణం. ఆమె గొంతులో ఏదో ఉంది. ఆ ఏదో ఏమిటనేదాని కోసం కోట్ల మంది ఆ పాటను వింటూనే ఉన్నారు. ఏమిటి ఆ పాట... ఎవ్వరు ఆ గాయని? మాణికె మగే హితే ముదువే నూరా హంగుమ్ యావీ.. అవిలేవీ... ఇదీ ఆ పాట పల్లవి. దీని అర్థం ‘నా మదిలో ఎప్పుడూ నీ తలంపే... మోహజ్వాలలా రగులుతూ ఉంటుంది’ అని అర్థం. యోహనీ ఆ పాటను పాడిన తీరు దానికి కో సింగర్ సతీషన్ గొంతు కలపడం... ఏదో మేజిక్ జరిగింది. అది ఇప్పుడు జగాన్ని ఊపుతోంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై తెగ వైరల్ అవుతున్న పాట ఇది. గతంలో ఒక సింగర్‌కు గుర్తింపు రావాలంటే ఎన్నో పాటలు పాడాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక్క సరైన పాట పాడితే రాత్రికి రాత్రి స్టార్‌ని చేసేస్తోంది. యోహని అలా ఇప్పుడు శ్రీలంకకు బయట స్టార్ అయ్యింది. చిన్నప్పటి నుంచి పాటలంటే ఇష్టపడే యోహనీ సింగింగ్నే కెరియర్‌గా ఎంచుకుని ఇప్పుడు ఈ పాటతో ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. శ్రీలంక కోయిల 1993 జూలై 30న కొలంబోలో మేజర్ జనరల్ ప్రసన్న డిసిల్వా, దినితి డిసిల్వాలకు పుట్టింది యోహని. ఈమెకు ఒక చెల్లెలు ఉంది. తండ్రి ఆర్మీ అధికారి, తల్లి ఎయిర్ హోస్టెస్ కావడంతో చిన్నతనంలో శ్రీలంకతోపాటు మలేసియా, బంగ్లాదేశ్‌లలో పెరిగింది. లాజిస్టిక్స్ మేనేజ్మెంట్లో డిగ్రీ అయ్యాక అక్లాడే కంపెనీలో మేనేజర్‌గా చేరింది. ఇక్కడ ఏడాది పనిచేశాక మెల్బోర్న్ వెళ్లి క్వీన్స్లాండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. యోహనీకి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఎనలేని అభిమానం. ఆ ఆసక్తిని గమనించిన తల్లి ఆ దిశగా ప్రోత్సహించడంతో ర్యాప్, పాప్, క్లాసికల్ సాంగ్స్‌ను పాడడం నేర్చుకుంది. పెట్టా ఎఫ్ట్కెట్ లేబుల్ రికార్డింగ్‌తో కలిసి ‘ఆయే’ పాటను పాడి సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ర్యాప్ ప్రిన్సెస్... 2016లో యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించి కవర్ సాంగ్స్ వీడియోలను అప్లోడ్ చేసేది. వాటికి మంచి స్పందన లభించడంతో తనే స్వయంగా పాడిన పాటలను విడుదల చేసింది. ‘దేవియాంజే బరే’ అనే ర్యాప్ పాటంతో యోహనీకి సింగర్‌గా మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి ఆమె తన యూట్యూబ్ చానల్లో అనేక పాటలను విడుదల చేసింది. వ్యూయర్స్ నుంచి మంచి స్పందన లభిస్తుండడంతో పాపులర్ బ్యాండ్స్‌తో కలసి మ్యూజిక్ షోలలో పాల్గొనేది. తరువాత తమిళ పాటలు పాడుతూ బాగా ఫేమస్ అయ్యింది. దీంతో ‘ర్యాప్ ప్రిన్సెస్ ఆఫ్ శ్రీలంక టైటిల్’ను గెలుచుకుంది. ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క తనకెంతో ఇష్టమైన పాటలు పాడుతూ తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుండేది. దీంతో యోహనీ పాటలు ఒక్క శ్రీలంకలోనేగాక ఇండియా, బంగ్లాదేశ్, మలేషియాల్లో కూడా బాగా వైరల్ అయ్యేవి. 20 లక్షల సబ్‌స్క్రయిబర్స్ ఉన్న ఏకైక శ్రీలంక గాయనిగా రికార్డు స్థాపించింది. సింగిల్‌గా పాడిన పాటలేగాక సితా దౌవున, హాల్ మాస్సా వియోలే, యావే, ఆయితే వారాక్ వంటి ఆల్బమ్స్ కూడా చేసింది. వివిధ వేదికలు, సెమినార్లలో లైవ్ పెర్ఫార్మ్స్ కూడా ఇచ్చింది. గాయనిగానే కాక పాటల రచయిత, మ్యూజిక్ ప్రొడ్యూసర్, వ్యాపారవేత్తగా రాణిస్తోంది. ‘ర్యాప్ ప్రిన్సెస్ ఆఫ్ శ్రీలంక’ అయ్యాక శ్రీలంకలోనే పాపులర్ సింగర్స్‌తో కలిసి పనిచేసింది. యోహని పాడిన పాటల్లో ఒక పాట ‘బెస్ట్ వీడియో రీమేక్’ అవార్డును గెలుచుకుంది. ఇవేగాక రెడ్‌బుల్ నిర్వహించే కన్సర్ట్లలో ఆమె పాల్గొనడం విశేషం. యోహనీ పాడిన పాటల్లో మాణికే మాగే హితే, యోహనీ మెర్రి క్రిస్టమస్ బేబీ, లా రోజ్ ఎట్లెపైన్ వాల్యూమ్–1, నలుమ్బనయా, హాల్ మస్సా వయోలే వయోలే, నషక్షాలే, బుల్మా పాటలు బాగా పాపులర్ అయ్యాయి. మాణికే మగే హితే.. యోహనీ, సతీషన్ కలిసి పాడిన ఈ పాటను సెప్టెంబర్‌లో మ్యూజిక్ ప్రొడ్యూసర్ యష్‌రాజ్ ముఖతే ఇన్‌స్టాలో పోస్టు చేసిన వెంటనే మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. తరువాత బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ సాంగ్ బీట్‌కు కాలు కదిపినట్లుగా స్పూఫ్ వీడియో చేశారు. అప్పటి నుంచి ఈ పాట బాగా వైరల్ అయ్యింది. ఇటీవల ఖాళీగా ఉన్న విమానంలో ఎయిర్ హోస్టెస్ ‘మాణికే మగే హితే’కు డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్టు చేయడంతో విపరీతంగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ‘మాణికే మగే హితే’ పాట వంద మిలియన్ల వ్యూస్‌ను దాటేసింది. యోహనీకి ఇన్‌స్ట్రాగామ్‌లో ఐదులక్షల మందికిపైగా ఫాలోవర్స్ ఉండడం విశేషం. మీరు ఇప్పటి వరకూ ఈ పాట వినకపోతే వినండి. మళ్లీ వింటారు. -
తగ్గని ‘ఇస్మార్ట్ శంకర్’ హవా.. రామ్ పోతినేని సరికొత్త రికార్డు
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన మాస్ మసాలా చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ హవా ఇంకా తగ్గట్లేదు. యూట్యూబ్‌లో ఈ మూవీ దూసుకెళ్తోంది. తాజాగా 200మిలియన్ల(20 కోట్లు) మార్క్‌ను దాటేసి సత్తా చాటింది. 2019లో విడుదలైన ఈ మూవీ హిందీ వెర్షన్‌ని గతేడాది ఫిబ్రవరిలో యూట్యూబ్‌లో పెట్టారు. టాలీవుడ్ ప్రేక్షకుల మాదిరే బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి కూడా ఇస్మార్ట్ శంకర్‌కి నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటివరకు 1.9మిలియన్ల లైకులలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆన్లైన్లో డబ్బింగ్ సినిమాల ద్వారా 20 కోట్ల పైగా వ్యూస్ తెచ్చుకోవడం హీరో రామ్‌కు ఇది నాలుగోసారి. సౌత్ ఇండియా నుంచి నాలుగు సినిమాలను 200 మిలియన్ల వ్యూస్‌కు చేర్చిన తొలి హీరోగా రామ్ ఘనతను దక్కించుకొన్నారు .మొత్తానికి ఇస్మార్ట్ హీరో రామ్ నటనకు ఇపుడు సౌత్ ప్రేక్షకులే కాదు.. నార్త్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారని యూట్యూబ్ రికార్డులే తెలియజేస్తున్నాయి. -
వైరల్‌గా మారిన 'మై విలేజ్ షో' అనిల్ లగ్నపత్రిక
నంగునూరు (సిద్దిపేట): సాధారణంగా ఏ పెళ్లి పత్రికలో చూసినా శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు అంటూ మొదలుపెడతారు. కానీ ఇది ఈ పెళ్లి పత్రికలో మాత్రం శానిటైజర్ ఫస్టు.. మాస్క్ మస్టు.. సోషల్ డిస్టెన్స్ బెస్ట్ అని ఉంది. అసలే కరోనా టైంలో పెళ్లి కదా..అందుకే ఇలా వినూత్నంగా వెడ్డింగ్ కార్డును రూపొందించారు. 'వధూవరులకు కరోనా నెగిటివ్, మరువకుండా మీ ఫోన్ల 1-జీబీ డాటా ఆగపట్టుకొని పిల్లా..జెల్లా..ఐసోల్లు..ముసలోల్లు అందరూ ఫోన్ల ముందు అంతర్జాలంలో పెండ్లిసూసి ఆన్లైన్లో ఆశీర్వదించగలరు. విందు..లైవ్‌లో తల్వాలు పడ్డంక ఎవ్వరింట్ల ఆళ్లు బువ్వు తినుర్రి. బరాత్ ఉంది కానీ ఎవరింట్ల వాళ్లు పాటలు పెట్టుకొని ఎగురుర్రి. మీరు ఎగిరిన15 సెకన్ల వీడియో మాకు పంపుర్రి..దాన్ని వ్లోగ్‌లో పెడతాం. ఇక కట్నాలు, కానుకలు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా క్యూఆర్ స్కాన్ చేసి పంపండి' అంటూ రూపొందించిన ఈ ఫన్నీ వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ పెళ్లి పత్రిక మరెవరిదో కాదండీ..ప్రముఖ యూట్యూబర్, మై విలేజ్ షో సభ్యుడు అనిల్‌ది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన యూట్యూబర్ జీల అనిల్..మే1న తన వివాహం ఉందని ఈ తంతును అందరూ ఆన్లైన్లో తప్పకుండా వీక్షించాలని కోరుతూ ‘కరోనా కాలంలో లగ్గం పత్రిక’ అంటూ క్రియేటివ్‌గా వెడ్డింగ్ కార్డును రూపొందించారు. అంతేకాకుండా పెళ్లికి సమర్పించే కట్న, కానుకలను కరోనా కాలంలో తిండి లేకుండా బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించబడుతుందని పేర్కొన్నారు. మై విలేజ్ షోతో పాపులర్ అయిన అనిల్ కరోనా కాలంలో తాము చేసుకునే పెళ్లి సమాజానికి ఆదర్శంగా నిలవాలని భావించి ఇలా క్రియేటివ్‌గా డిజైన్ చేయించారు. View this post on Instagram A post shared by ANIL GEELA (@myvillageshow_anil) -
మరో రికార్డు సొంతం చేసుకున్న సిద్ శ్రీరామ్
ప్రస్తుతం టాలీవుడ్లో సింగర్ సిద్ శ్రీరామ్ హవా కొనసాగుతోంది. ఆయన పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అవుతుండటంతో సిద్ శ్రీరామ్‌తో ఒక్క పాటైనా పాడించాలని సంగీత దర్శకులూ కోరుకుంటున్నారు. యూత్‌లోనూ ఈ యంగ్ సింగర్‌కు మంచి క్రేజ్ ఉంది. దీంతో సిద్ శ్రీరామ్ పాట లేనిదే ఈ మధ్య సినిమాలు రిలీజ్ కావట్లేదనడంలో అతిశయోక్తి లేదు. సినిమా ఫలితాల సంగతి ఎలా ఉన్నా సిద్ శ్రీరామ్‌తో పాడించిన పాటలు మాత్రం సూపర్ హిట్ అవుతున్నాయి. కొన్నిసార్లు అయితే సిద్ శ్రీరామ్ పాడిన పాటలతోనే సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది. అదే కోవలోకి వస్తుంది.. శశి చిత్రంలోని ఒకే ఒక లోకం నువ్వు పాట. ఆది సాయికుమార్, సురభి నటించిన ఈ చిత్రం బాక్స్‌ఫీస్ వద్ద బోల్తా కొట్టినా ఈ పాట మాత్రం సూపర్ హిట్ అయ్యింది. సిద్ శ్రీరామ్ పాడిన 'ఒకే ఒక లోకం నువ్వు' పాట సినిమా విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్‌ను సంపాదించుకొని మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించగా, అరుణ్ చివులూరు సంగీతం అందించారు. చదవండి : సిద్ శ్రీరామ్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా? -
ట్రంప్ యూట్యూబ్ చానెల్ నిలిపివేత
హాంకాంగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హింసను ప్రేరేపించేలా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ఉండడంతో యూ ట్యూబ్ కూడా ఆయన చానెల్ని వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. ట్రంప్ తాజాగా పోస్టు చేసిన వీడియో తమ నిబంధనలకి వ్యతిరేకంగా ఉందని యూ ట్యూబ్ బుధవారం ట్వీట్ చేసింది. అయితే ఆ వీడియో ఏమిటన్నది స్పష్టంగా వెల్లడించలేదు. ‘‘డొనాల్డ్ ట్రంప్ యూట్యూబ్ చానెల్లో హింసను ప్రేరేపించేలా వీడియోలు పోస్టు అవుతున్నాయని మాకు ఫిర్యాదులు అందాయి. ఆయన చానెల్లో కొన్ని వీడియోలను తొలగించాం. మొదటి హెచ్చరికగా వారం రోజులు నిషేధిస్తున్నాం’’అని ట్వీట్ చేసింది. యూట్యూబ్ నిబంధనల ప్రకారం మళ్లీ ఇలాంటి వీడియోలు పోస్టు చేస్తే రెండు వారాలు నిషేధం విధిస్తారు. మూడోసారి అదే తప్పు చేస్తే శాశ్వతంగా చానెల్ని తొలగిస్తారు. రాజ్యాంగాన్ని కాపాడదాం: మిలటరీ అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అనుచరులు హింసాత్మక ఘటనలకు పాల్పడతారని ఆందోళనలు నెలకొన్న వేళ మిలటరీ అప్రమత్తమైంది. అమెరికా రాజ్యాంగాన్ని కాపాడడమే తమ బాధ్యతంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. దేశ రక్షణలో ఉన్న ప్రతీ ఒక్కరిపైనా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ఉందంటూ మంగళవారం మిలటరీలో అత్యున్నత స్థాయి నాయకులు ఒక సంయుక్త ప్రకటన జారీ చేశారు. అమెరికా ఆర్మీ ఇలా పిలుపునివ్వడం అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది. అమెరికా మిలటరీ సీనియర్ జనరల్ మార్క్ మిల్లే, అన్ని బలగాల జాయింట్ ఛీప్స్ ఆఫ్ స్టాఫ్ ఈ ప్రకటనపై సంతకాలు చేశారు. ‘‘అమెరికా మిలటరీ ఎల్లప్పుడూ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలను, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుతుంది. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే ఆదేశాలను తప్పక పాటిస్తాం. ఇంటా, బయటా శత్రువుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడడానికి మేము కట్టుబడి ఉన్నాం’’అని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
సాయం చేసిన అతనిపైనే ఫిర్యాదు!
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్లో ఉంటున్న ఒక వృద్ధ జంట కరోనా టైంలో తమ ధాబా బిజినెస్ సరిగా జరగడం లేదంటూ కంటతడి పెట్టుకున్న వీడియో ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సెలబ్రెటీలు సైతం‘బాబా కా ధాబా కు వెళ్లి తినండి అంటూ ట్వీట్లు చేశారు. దీంతో ఆ ధాబా పేరు దేశమంతా మారుమ్రోగి పోయింది. చాలా మంది అక్కడి వెళ్లి రోటి, కూర్మ కూర రుచి చూసి వచ్చారు. దీంతో పాటు ఆ ధాబా నడుపుతున్న వృద్ధ జంట కాంతా ప్రసాద్, అతని భార్య బాదామి దేవి ఆవేదన చూసి చలించిపోయిన చాలా మంది నెటిజన్లు వారికి ఆర్ధిక సాయం కూడా చేశారు. ఈ వీడియోను ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతనే వీరి కోసం విరాళాలు సేకరించాడు. అయితే సాయం చేసిన అతనిపైనే ఇప్పుడు కాంతా ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు సాయం చేయడం కోసం చాలా మంది పంపిన డబ్బును వాసన్ తప్పుదోవ పట్టించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు కేవలం రూ. 2.3 లక్షలు మాత్రమే ఇచ్చాడని మిగిలిన డబ్బును అతనే తీసుకున్నాడని ఆరోపించాడు. వాసన్ విరాళాలు సేకరించడానికి తన బ్యాంక్ ఖాతాలతో పాటు వారి కుటుంబ సభ్యుల ఖాతాల వివరాలు కూడా ఇచ్చాడని కాంతా ప్రసాద్ తెలిపారు. వచ్చిన విరాళాలు మొత్తాన్ని తమకు అందించకుండానే.. ‘ఇచ్చాను అంటూ’ అబద్ధాలు చెబుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాసన్ మాత్రం తనకు వచ్చిన ఫండ్స్ అన్నింటిని కాంతా ప్రసాద్‌కు ఇచ్చానని బ్యాంక్ స్టేట్మెంట్లు చూపిస్తూ మరో వీడియో విడుదల చేశాడు. చదవండి: కొన్ని లైకులు... కాస్త వెలుతురు -
కోపంతో మెర్సిడెస్ కారునే కాల్చేశాడు..
ఎక్కడికైనా వెళ్తుంటే దారిలో కారు కానీ, బైక్ కానీ ఆగిపోతే అక్కడే పడేసి వేరే వాళ్లని లిఫ్ట్ అడికి వెళ్తుండటం సినిమాల్లో చూస్తుంటాం. కారు చిన్న ట్రబుల్ ఇస్తే.. పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు హాలివుడ్ సినిమాల్లో చూస్తుంటాం. అయితే అవి డమ్మీ కార్లు కాబట్టి ఎన్నింటిని తగలబెట్టినా పోయేదేమీ ఉండదు. కానీ ఓ యూట్యూబర్ మాత్రం కోపంతో ఏకంగా మెర్సిడెస్ కారునే తగులబెట్టాడు. అంతటితో ఆగకుండా ఆ తతంగాన్ని అంతా వీడియో తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన మైఖేల్ లిట్విన్ ఓ యూ ట్యూబర్. సాహసాలు, ప్రాంక్ వీడియోలు చేస్తూ, ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేస్తుంటాడు. ఆయన కొద్ది రోజుల క్రితం ఓ మెర్సిడెస్ కారును కొనుగోలు చేశాడు. అయితే.. ఆ కారు తరుచూ బ్రేక్‌డౌన్ అవుతూ ఇబ్బంది పెడుతోంది. ఆ సమస్య వచ్చినప్పుడల్లా కారును తనకు విక్రయించిన డీలర్ వద్దకు తీసుకెళ్తున్నాడు. ఇలా దాదపు ఐదుసార్లు తన కారును మెర్సిడెజ్ డీలర్ వద్దకు తీసుకెళ్లాడు. కానీ, సమస్యకు పరిష్కారం మాత్రం దొరలేదు. కంప్లైంట్ చేసిన ప్రతిసారి డీలర్ ఆ కారును రెండ్రోజుల పాటు సర్వీస్ సెంటర్లో ఉంచుకుంటున్నాడు. ఆ తర్వాత తిరిగి ఇచ్చేస్తున్నాడు. దానిని ఎన్నిసార్లు రిపేర్‌కు ఇచ్చినా.. సరిగా పనిచేయడం లేదు. దీంతో విసుగు చెందిన మైఖేల్.. రూ. 2.4 కోట్ల విలువైన తన కారును కాల్చేద్దామని డిసైడ్ అయ్యాడు. ఆ కారును వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకెళ్లి దానిపై పెట్రోల్ పోశాడు. ఆ తర్వాత నేరుగా కొంత దూరం వరకు పెట్రోలు పోసుకుంటూ వెళ్లాడు. అనంతరం తన జేబులో నుంచి లైటర్ తీసి నిప్పుల కొలిమిని వెలిగించాడు. దానికి స్నాక్స్‌ని వేడి చేసుకొని తింటూ హీరో లెవల్లో వెనక్కి తిరిగి నిప్పు అంటించాడు. ఆ మంట నేరుగా వెళ్లి కారును టచ్ చేసింది. దీంతో ఖరీదైన కారు కాలి బూడిదైంది. ఆ దృశ్యాలన్నింటినీ లిట్విన్ విడియో తీసి తన యూట్యూబ్ చాలెన్లో అప్లోడ్ చేశాడు. ప్రస్తుత ఆ వీడియో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలీలో కామెంట్లు చేస్తున్నారు. ‘ఖరీదైన కారును ఎలా కాల్చేయాలనిపించింది?, అమెరికన్లు ఐఫోన్లను పగులగొడితే.. రష్యన్లు మెర్సిడెస్ కార్లనే కాల్చేస్తున్నారు’, ‘ ఈ వీడియోకు వచ్చిన ఆదాయంతో మరో రెండు మెర్సిడెస్ కార్లను కొనుక్కొవచ్చేలే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
టిక్‌టాక్ : యూట్యూబ్ "షార్ట్స్" వచ్చేసింది
సాక్షి,న్యూఢిల్లీ : భారతదేశంలో టిక్‌టాక్ నిషేధంతో అలాంటి ప్లాట్‌ఫాంతో గ్యాప్ పూరించడానికి పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో యూట్యూబ్ ఒక అడుగు ముందుంది. షార్ట్స్ పేరుతో టిక్‌టాక్ లాంటి షార్ట్ వీడియో ఫీచర్‌ను లాంచ్ చేసింది. యూట్యూబ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ జాఫ్ఫ్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో ఈవిషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతానికి "షార్ట్స్" మొబైల్ యాప్‌గా మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు.15సెకన్ల నిడివిలో లఘు చిత్రాలు, ఆకర్షణీయమైన వీడియోలను షూట్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్టు తెలిపారు. అంతేకాదు త్వరలోనే మరిన్ని ఫీచర్లు జోడిస్తామని, ఇతర దేశాలకు కూడా విస్తరిస్తామని చెప్పారు. (టిక్‌టాక్ రేసు నుంచి మైక్రోసాఫ్ట్ అవుట్) తమ కొత్త ప్లాట్ఫామ్లో బహుళ వీడియో క్లిప్‌లను స్ట్రింగ్ చేయడానికి బహుళ-సెగ్మెంట్ కెమెరా, స్పీడ్ కంట్రోల్స్ హ్యాండ్స్-ఫ్రీ రికార్డ్ చేయడానికి టైమర్, కౌంట్‌డౌన్ ఫీచర్లుకూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ద్వారా అందుబాటులోకి తీసుకురాగా, త్వరలోనే ఐఓఎస్ లో కూడా లాంచ్ చేయనుంది. కాగా భారత్ చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరగడంతో జూన్‌లో టిక్‌టాక్ సహా 58 ఇతర చైనా యాప్‌లను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. టిక్‌టాక్ కు 120 మిలియన్లకు పైగా వినియోగదారులతో అతిపెద్ద విదేశీ మార్కెట్ ఇండియానే. అటు అమెరికాలో టిక్‌టాక్ కొనుగోలు డీల్ ఇంకా ఖరారు కాని నేపథ్యంలో అమెరికాలో షార్ట్స్ ను త్వరలోనే లాంచ్ చేయనుందని సమాచారం. (టిక్‌టాక్‌కు ఫైనల్ వార్నింగ్) -
అందుకే ఈ ఆడియో!
సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడి చవితి నేడు. ఈ సందర్భంగా భక్తులందరూ గణనాథుడి కథను చదివి, వినాయక వ్రత కల్పాన్ని పాటిస్తారు. గంభీరమైన స్వరం ఉన్న నటుడు మంచు మోహన్‌బాబు వినాయక చవితి పూజను తన గళంతో వినిపించారు. దాన్ని ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు శుక్రవారం యూట్యూబ్‌లో విడుదల చేశారు. ‘‘నేనిష్టపడే పండగలు ఎన్నో ఉన్నాయి. అందులో మొదటగా నేను ఇష్టపడే పండగ వినాయక చవితి. ప్రతి సంవత్సరం నా కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సన్నిహితుల్ని మా ఇంటికి పిలిచి నేనే స్వయంగా పుస్తకంలోని మంత్రాలు చదివి, కథను వినిపించడం నాకు అలవాటు. నా పెద్ద కుమారుడు విష్ణువర్థన్ బాబు ఈ వినాయక కథను అందరికీ వినిపించవలసిందిగా కోరాడు. ఆ సత్సంకల్పంలో భాగంగా నేను మీకు ఈ విఘ్నేశ్వరుడి కథను వినిపిస్తున్నాను’’ అన్నారు మోహన్ బాబు. వినాయకుని జననం, విఘ్నాలకు అధిపతి ఎవరు? చంద్రునికి పార్వతీదేవి శాపం, శమంతకోపాఖ్యానం: ద్వాపరయుగం, భాద్రపద శుద్ధ చవితి మహత్యం, వినాయక వ్రతకల్పం వంటివి చెబుతూ ఈ ఆడియోను విడుదల చేశారు. -
అయామ్ సారీ
కొన్ని లక్షణాలు ఉంటేనే పురుషుడు. కొన్ని లక్షణాలు లేకుంటేనే ఆమె స్త్రీ! పాతుకు పోయిన నిర్ధారణ విధానం. పురుషుడు పెట్టుకున్న.. డయాగ్నోస్టిక్ సెంటర్ ఈ సమాజం. గట్టిగా మాట్లాడుతోందా.. స్త్రీ కాదు. మనసారా నవ్వుతోందా... స్త్రీ కాదు. సలహా ఇవ్వబోయిందా.. స్త్రీ కాదు! రిపోర్ట్స్ చూశారు సృష్టీ అండ్ టీమ్. స్త్రీగా లేనందుకు... ‘సారీ’ చెప్పారు. సృష్టీ దీక్షిత్‌కు ఒక టీమ్ అంటూ లేదు! విడిగా యూట్యూబ్ కమెడియన్ ఆమె. నవ్వలేక చచ్చే సెటైర్లతో దవడల్ని చెక్కలు చేసేస్తారు. తాజాగా ఒక వీడియోను సృష్టించడం కోసం సహ కమెడియన్లతో టీమ్–అప్ అయ్యారు. ‘ఉమెన్ ఫైనల్లీ అపాలజైస్ ఫర్ ఎవ్రీథింగ్’ అనే వీడియో అది. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. 2 నిముషాల 39 సెకన్ల నిడివి. ఆ మాత్రంలోనే రెండున్నర గంటల సినిమా చూపించేశారు! స్త్రీలు ఎలా ఉండకూడదో, ఎలా ఉంటే బాగుండదో పురుషులకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. వాటికి తగ్గట్లు లేనందుకు వీళ్లు తమని తాము నిందించుకునే ధోరణిలో పురుషులకు ఈ వీడియోలో సారీ చెబుతుంటారు! అందరూ డిజిటల్ కమెడియన్లే కానీ, ఎవర్నీ నవ్వించడానికి చేసిన వీడియో కాదు ఇది. ‘మా రెక్కలు ఎందుకు కట్టేస్తారు?’ అని అడగడం. ‘మా నోటికి టేప్ ఎందుకు వేస్తారు?’ అని ప్రశ్నించడం. ఊరికే నిలబడి దారినపోయే వాళ్ల మీద ఇంకుచుక్కల్ని చల్లే స్టాండ్–అప్ కమెడియన్లు కాదు.. సృష్టీ దీక్షిత్, డాలీ సింగ్, కుషా కపిల, మల్లికా దువా, శ్రీజా చతుర్వేది, పవిత్రాశెట్టి, విపాసనా మల్హోత్రా, త్రినేత్రా హల్దార్, సురభీ బగ్గా, స్వాతీ సచ్దేవ, సోఫియా ఆష్రాఫ్, విదూసీ స్వరూప్! స్త్రీజాతి సమస్తాన్నీ ఒక ‘ఆదర్శ మహిళ’గా తీర్చిదిద్దే పనిలో నిరంతరం వీళ్లు మాటల్ని విడుదల చేస్తూ ఉంటారు. ‘మన మీదే ఈ విరుపులు’ పురుష పుంగవులకు అర్థమైపోతుంది. ఇప్పుడు వీళ్లంతా కలిసి చేసిన సింగిల్ లైన్ స్క్రిప్టు ‘ఉమెన్ ఫైనల్లీ అపాలజైస్ ఫర్ ఎవ్రీథింగ్’ కూడా పురుషుల కోసమే. అయామ్ సారీ.. నేను కూడా ఆలోచిస్తున్నందుకు! – మల్లికా దువా వారం కాలేదు సృష్టీ ఇన్‌స్టాకు ఈ వీడియో వచ్చి. 7 లక్షల 50 వేల వ్యూస్, రెండు వేల కామెంట్స్ వచ్చాయి! వీడియోలో ఒక్కొక్కరూ స్క్రీన్ పైకి వచ్చి ‘అలా లేనందుకు సారీ’, ‘ఇలా ఉన్నందుకు సారీ’ అని మగవాళ్లకు చెప్పి వెళ్లిపోతుంటారు. మహిళల నుంచి మంచి స్పందన వస్తోంది. ‘ఇలాంటి స్థితిలో జీవిస్తున్నందుకు సారీ’ అని ఒకరు కామెంట్ పెట్టారు. ‘హక్కుల సాధనకు సారీ చెప్పేపని లేదని నేర్పించిన స్త్రీవాదానికి మద్దతు ఇస్తున్నందుకు సారీ’ అని ఇంకొకరు అన్నారు. ‘మాటల్లో చెప్పలేకపోతున్నాను. కన్నీళ్లొస్తున్నాయి. అయామ్ సారీ.. నేను నవ్వుతూ ఉంటున్నందుకు! – శ్రీజా చతుర్వేది మీరంతా శక్తిమంతమైన, అందమైన, ఆత్మవిశ్వాసం గల అమ్మాయిలు. మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. నేనూ మీతో పాటు కలిసి నడుస్తాను’ అని ఒక అమ్మాయి ఉద్వేగపడింది. ‘మనసు చెదిరిపోయింది. గట్ రెంచింగ్ వీడియో’ అని ఒకరన్నారు. ‘గే’ స్పందన కూడా ఉంది. ‘స్త్రీలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారో.. ఒక భారతీయ పురుషుడిగా అర్థం చేసుకోగలుగుతున్నాను’ అని అతడి కామెంట్. ఇంకొక యూజర్ అయితే కాస్త కవితాత్మకంగా తిప్పి చెప్పారు. ‘‘ఈ వీడియోను వాచ్ చేసినందుకు, వాచ్ చేసి అభినందిస్తున్నందుకు నేను సారీ చెప్పడం లేదు’’ అన్నారు. అయామ్ సారీ.. నేను ఎవరి అనుమతి లేకుండా మాట్లాడుతున్నందుకు! – పవిత్రాశెట్టి ఏముంది ఇందులో.. స్త్రీల బలహీనత, వారి తిక్క తప్ప అని కామెంట్ చేసిన వాళ్లూ ఉన్నారు. ఎవరు ఏం అనుకున్నా ఇలాంటివి ఇంకా అనేకం రావలసిన పరిస్థితిలో ఉన్నాం. స్త్రీ తన అభిప్రాయాన్ని తెలిపితే ‘రేప్ థ్రెట్స్’ ఆమెకు డైరెక్టుగా మెజేస్ (డిఎం) అవుతున్న ఆధునిక అనాగరక కాలంలో ఉన్నాం. ‘స్త్రీగా పుట్టినందుకు సారీ చెబుతున్నా’ అని ఈ వీడియో చివర్లో ఒక యూట్యూబర్ అంటారు. స్త్రీ ఆవేదన అది. పురుషుడిలో ఆలోచన కలిగించేది. అయామ్ సారీ.. స్త్రీగా పుట్టినందుకు, స్త్రీగా శ్వాసిస్తున్నందుకు! – సోఫియా అష్రాఫ్ -
టార్గెట్ టిక్‌టాక్: యూట్యూబ్ టెస్టింగ్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా బ్యాన్, చైనా యాప్స్ తొలగింపు ప్రచారం ఊపందుకున్న సమయంలో యూట్యూబ్ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు కొత్త ఫీచర్‌తో యూట్యూబ్ రాబోతోంది. పాపులర్ వీడియో ప్లాట్‌ఫామ్, చైనాకు చెందిన టిక్‌టాక్ మాదిరిగానే సరికొత్త ఫీచర్‌ను యూట్యూబ్ త్వరలోనే లాంచ్ చేయనుంది. గూగుల్ యాజమాన్యంలోని వీడియో ప్లాట్‌ఫాం క్రొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండిండిలోనూ దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్టు యూట్యూబ్ వెల్లడించింది. అయితే ఇందులో 15 సెకన్ల వీడియో పోస్ట్ చేయడానికి మాత్రమే అనుమతి ఉంది. తమ వెబ్సైట్లో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. పరీక్షల అనంతరం దీన్ని భారీగా లాంచ్ చేయనున్నామని తెలిపింది. గరిష్టంగా 15 సెకన్ల వరకు వీడియోలను పోస్ట్ చేయవచ్చు. ఒకేసారి ఎక్కువ వీడియోలను అప్లోడ్ చేయాలనుకుంటే, ఫోన్ గ్యాలరీ నుండి నేరుగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే టిక్‌టాక్ మాదిరిగా ఫిల్టర్లు, మ్యూజిక్ సపోర్ట్ లభిస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. టిక్‌టాక్ లేదా ఇతర ఆధునిక చిన్న వీడియో యాప్ లలో కూడా వీడియో కంటెంట్ లిమిట్ ఎక్కువ ఉండటంతోపాటు, ఏఆర్ ఎడిటింగ్ ఎఫెక్టులతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూట్యూబ్ దీన్ని మరింత మెరుగుపర్చకపోతే, స్టోరీస్ ఫీచర్ లాగా మరచిపోవడం ఖాయమని టెక్ పండితులు భావిస్తున్నారు. కాగా షార్ట్స్ పేరుతో టిక్‌టాక్ లాంటి యాప్‌ను యూట్యూబ్ త్వరలో తీసుకురానుందని ఏప్రిల్ నెలలో పలు నివేదికలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ఫీచర్లను అనుకరించడం యూట్యూబ్‌కి ఇదే మొదటిసారి కాదు. గతంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, స్నాప్‌చాట్ తరహాలో స్టోరీస్ అప్డేట్ ఫీచర్ రీల్స్ ను ప్రవేశపెట్టింది. కానీ దీనికి పెద్దగా ఆదరణ లభించలేదు. అటు ఫేస్ బుక్ కూడా టిక్ టాక్ మాదిరిగానే లాస్సో అనే యాప్‌ను తీసుకురానుందని తెలుస్తోంది. చదవండి : గణేష్ విగ్రహాలు కూడా చైనా నుంచేనా: నిర్మలా సీతారామన్ చైనా ఉత్పత్తుల బహిష్కరణ సాధ్యమేనా? -
వారానికి ఏడుసార్లే. మరోసారి వార్తల్లో ట్విటర్ సీఈవో
సెలబ్రెటీల జీవన విధానాలు తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ట్విటర్ సీఈవో జాక్ డోర్సీ మరోసారి తన ఆరోగ్యం, ఆహారంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తను వారానికి ఏడుసార్లు మాత్రం భోజనం చేస్తానని వెల్లడించి వార్తల్లో నిలిచాడు. డార్సే బుధవారం యూట్యూబ్ యూజర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అలాగే ఆహార నియమాల గూర్చి మరోసారి ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. తాను వారంలో ఏడు సార్లు భోజనం చేస్తానని..అది కూడా రాత్రి డిన్నర్ మాత్రమే చేస్తానని తెలిపారు. దైనందిన జీవన శైలిలో యోగ విపాసనను పాటిస్తానని..అప్పుడప్పుడు ఉపవాసాలు కూడా ఉంటానని తెలిపాడు. తాను నిత్యం ఐస్ బాత్‌తో (మంచు) స్నానం చేసి రెండు గంటల పాటు ధ్యానం చేస్తానని అన్నాడు. ఈ సందర్భంగా చాలా ప్రశ్నలు ఎడిట్ బటన్, స్పెల్ చెక్ లాంటి సాంకేతిక అంశాలపై అడిగినప్పటికీ, వ్యక్తిగత ప్రశ్నలు, ఆయన జీవన శైలికి సంబంధించిన అంశాలు ఆసక్తికరంగా మారాయి. కొంత మంది నెటిజన్లు ఆయనపై సెటైర్లు కూడా పేల్చారు. గతంలోవారానికి అయిదుసార్లు అని ప్రకటించిన డోర్సీ, ఇపుడు ఆ కోటాను 7కు పెంచాడని చమత్కరించడం గమనార్హం. తన ఆహారంలో (డిన్నర్) చేపలు, చికెన్, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటానని గత మార్చిలో చెప్పిన విషయం తెలిసిందే. తాను ప్రతి రోజు ఉత్సాహంగా పని చేస్తానని..ఈ నేపథ్యంలోనే మంచంపై ఒరిగిన పది నిముషాల్లోనే నిద్ర తనను పలకిరస్తుందని చెప్పుకొచ్చారు. ప్రతి రోజు విటమిన్ ‘సీ’ ని తీసుకుంటానని అన్నారు. ఉదయం ఐస్‌బాత్ చేస్తానని దీంతో కేవలం పదిహేను నిముషాల్లోనే తన మెదడు ఉత్సాహవంతంగా పనిచేస్తుందని అన్నారు. సాయంత్రం మరోసారి మూడు నిమిషాల పాటు ఐస్ బాత్ చేసి సేద తీరుతానని డోర్సీ తెలిపారు. చదవండి: ట్విటర్ సీఈవో అకౌంట్ హ్యాక్ -
డేటా చోరీ: యూ ట్యూబ్‌కు భారీ జరిమానా
వాషింగ్టన్: చిన్నారుల వ్యక్తిగత డేటాను వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండా చోరి చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో గూగుల్ కుచెందిన వీడియో సైట్ యూ ట్యూబ్‌కు భారీ షాక్ తక్‌గిలింది. ప్రకటనల కోసం 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించారనే ఆరోపణతో గూగుల్ సంస్థ రూ.1200 కోట్లకు పైగా జరిమానా చెల్లించాలని యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ న్యూయార్క్ కోర్టులో కేసు వేసింది. ఈ ఆరోపణలపై న్యూయార్క్ స్టేట్ అటార్నీ జనరల్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ విచారణ అనంతరం వ్యాపార ప్రయోజనాల కోసం వీటిని వినియోగించిందనే వాదనపై సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు గూగుల్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌కు 136 మిలియన్ డాలర్లు, న్యూయార్క్ స్టేట్‌కు 34 మిలియన్ డాలర్లు మొత్తం 170 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఎఫ్‌టీసీ చైర్మన్ జో సైమన్స్ ప్రకటించారు. గోప్యత ఉల్లంఘనల ఆరోపణపై ఫేస్‌బుక్‌పై ఈ ఏడాది ఎఫ్‌టీసీ విధించిన 5 బిలియన్ డాలర్ల జరిమానాతో పోల్చితే ఇది అతిపెద్ద జరిమానా. అయితే యూట్యూబ్‌కు ఎఫ్‌టీసీ విధించిన జరిమానాను వాషింగ్టన్‌లోని ఫెడరల్ కోర్టు ఆమోదించాల్సివుంది. మరోవైపు గోప్యతా ఉల్లంఘనల ఆరోపణలతో గూగుల్‌ను జరిమానా విధించడం 2011 నుండి మూడవసారి అని, తాజా ఉల్లంఘన చాలా తీవ్రమైందని డెమొక్రాట్ కమిషనర్ రోహిత్ చోప్రా పేర్కొన్నారు. కాగా గూగుల్ సంస్థపై అనేక సందర్భాల్లో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అపహరించినట్టు ఆరోపణలున్నాయి. తాజాగా వ్యవహారంలో కూడా గోప్యతకు సంబంధించిన విషయంలో గూగుల్ సంస్థ విఫలమైందని యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఆరోపించింది. గతేడాది గూగుల్ సంస్థ డిజిటల్ ప్రకటనల ద్వారా రూ.8 లక్షల కోట్లకు పైగా అర్జించిందనే ఆరోపణలూ ఉన్న సంగతి తెలిసిందే. -
రెచ్చగొట్టే పాట : సింగర్ అరెస్టు
సాక్షి, లక్నో : దేశంలో అసహనం పెరిగిపోతోందని మూకదాడులను నిర్మూలంటూ పలువురు గాయకులు, నటులు, మేధావులతో కూడిన 49మంది దేశ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తోంటే..మరోవైపు గాయకుడు రెచ్చగొట్టే పాటను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి ఇరుక్కున్నాడు. ‘ జై శ్రీరామ్’ అని ఉచ్ఛరించేందుకు ఇష్టపడని వారిని కబరిస్తాన్(శ్మశానం) పంపాలనే ("జో నా బోలే జై శ్రీ రామ్, ఉస్కో భెజో కబ్రిస్తాన్") పాటను యూ ట్యూబ్‌లో షేర్ చేశాడు గాయకుడు వరుణ్ బహార్. అశ్లీల, అసభ్యకరమైన, రెచ్చగొట్టే పాటలతో తరచూ యూట్యూబ్ ఛానెల్లో హల్చల్ చేయడం వరుణ్‌కు అలవాటు. ఇప్పటికే వరుణ్‌పై పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మంకపూర్‌లోని బండారా గ్రామం లో బహర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే కోర్టుముందు హాజరుపరుస్తామన్నారు. కాగా దేశంలో అసహనం, మూకదాడులను నిర్మూలించాలని కోరుతూ ప్రధాని మోదీకి 49 మంది సెలబ్రిటీలు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రముఖ సింగర్ శుభా ముద్గల్, నటి కొంకణా సేన్ శర్మ, దర్శకుడు శ్యామ్ బెనగల్, మణిరత్నం, క్రీడాకారుడు అనురాగ్ కశ్యప్ తదితరులు వీరిలో ఉన్నారు. -
ఈ చిన్నోడి వయసు 8.. కానీ
సాక్షి, చెన్నై: ఈ చెన్నై చిన్నోడు గురించి ఆసక్తికరమైన విషయాలు వింటోంటే..పిట్టకొంచెం కూత ఘనం అనిపించకమానదు. ఎనిమిది సంవత్సరాల వయసులోనే బహుభాషా కోవిదుడుగా ఘనత కెక్కాడు. అదీ కేవలం ఒక్క ఏడాదిలో ఈ క్రెడిట్ దక్కించుకోవడం విశేషం. చెన్నైకి చెందిన ఈ అబ్బాయి పేరు నియాల్ తోగులువ. చిన్నప్పటినుంచీ తనకు తెలియకుండానే భాష మీద అభిమానం ఉన్నా..గత ఏడాది నుంచి అది మరింత పెరిగందంటాడు నియాల్. ఇంటర్నెట్ సహాయంతో ముఖ్యంగా యుట్యూబ్ ఆధారంగా ఈ ప్రావీణ్యం సంపాదించానని తెలిపాడు. అలా ఒక భాష తరువాత ఒక భాషపై ఆసక్తిని పెంచుకున్నాడట నియాల్. తన ప్రత్యేకమైన ప్రతిభతో ఏకంగా 106 భాషలను నేర్చుకున్నాడు. 10 భాషల్లో అనర్గళంగా మాట్లాడుతాడు. అంతేకాదు మరో అయిదు భాషల్లో ఈ ప్రావీణ్యం సంపాదించే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. అంతేకాదు ఇంటర్నెట్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్‌ను కూడా ఔపోసన పట్టేశాడు (యూనివర్సల్‌గా ఏ పదాన్ని ఎలా ఉచ్చరించాలో తెలుసుకోవడం). నియాల్ ప్రతిభపై తండ్రి శంకర్నారాయణన్ మాట్లాడుతూ ఒక్క ఏడాదిలో ఇదంతా నేర్చుకున్నాడని తెలిపారు. ఇది తమ కుటుంబానికి ఎంతో సంతోషాన్నిచ్చిందంటూ పుత్రోత్సాహంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. -
400 ఛానెళ్లపై నిషేధం
చైల్డ్ అబ్యూజ్ (చిన్నారులను హింసించటం)పై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో యూట్యూబ్ 400 పైగా ఛానళ్లను నిషేధించింది. ముఖ్యంగా యూ ట్యూబ్‌లో పెడోఫిలియా స్కాంపై వినియోగదారుల్లో ఆందోళనలు పెరుగుతున్న క్రమంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే పిల్లల దోపిడీని ప్రోత్సహించే కంటెంట్‌ను, వ్యాఖ్యలను కూడా నిషేధిస్తున్నట్టు యూ ట్యూబ్ ప్రకటించింది. నెస్లే, డిస్నీ,ఎపిక్, మెక్‌డొనాల్డ్ లాంటి టాప్ బ్రాండ్ల ప్రకటనలను తన ప్లాట్‌ఫాంపై నిలిపివేసిన అనంతరం నాలుగువందలకు పైగా ఛానెళ్లపై నిషేధాన్ని ప్రకటించింది యూట్యూబ్. చిన్నపిల్లలను దారుణంగా ప్రభావితం చేస్తున్న అశ్లీల వీడియోలు, వాటిపై చెత్త కమెంట్లకు అనుమతినిస్తున్న యూట్యూబ్‌లోని అల్గోరిథంపై గతవారం రెడిటర్ మాట్విల్సన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇది పోర్నోగ్రఫీకి, చిన్నపిల్లల్లో తీవ్రమైన మానసిక వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరించడంతో సంస్థ ఈ దిద్దుబాటు చర్యలకు దిగింది. -
మస్తానమ్మకు గుడ్ బై: వీడియో వైరల్
తన వంటకాలతో గ్లోబల్‌గా అభిమానులను సంపాదిస్తున్న ఇంటర్నెట్ సంచలనం కంట్రీ ఫుడ్స్ మస్తానమ్మ (107) ఇకలేరు. నిండు నూరేళ్ల జీవితాన్ని చలాకీగా, స్ఫూర్తిదాయకంగా కొనసాగించిన మస్తానమ్మ ఇక సెలవంటూ కన్నుమూశారు. పసందైన వంటకాలతో యూట్యూబ్ వీడియోల ద్వారా దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందారు మస్తానమ్మ. అయితే గత ఆరు నెలలుగా కంట్రీ ఫుడ్స్ వెబ్సైట్ బామ్మ వంటకాల వీడియోలు లేక వెల వెల బోయింది. దీంత ప్రపంచంలోని ఆమె అభిమానులంతా ఆకలితో మలమలలాడినంతగా విలవిల్లాడిపోయారు. చివరకు ఆమె ఇక లేరన్న వార్త వారిని బాధించింది. కంట్రీఫుడ్స్ వెబ్సైట్లో గతంలో పోస్ట్ చేసిన ‘ది స్టోరీ ఆఫ్ గ్రాండ్మా ’ వీడియో ఇపుడు వైరల్‌గా మారింది. మస్తానమ్మ జీవిత ప్రస్తానంలోని సాధక బాధకాలను ఈ వీడియోలో పొందుపర్చారు. (ఆ ఘుమఘుమలు ఇకలేవు) అయితే ఇలా అర్ధాంతరంగా అందనంత దూరం వెళ్ళిపోయిన మస్తానమ్మకు అభిమానులు నివాళులు ప్రకటించారు. తన బామ్మ మస్తానమ్మ చిన్నప్పటినుండి తమ కుటుంబానికి ఎంతో చేదుడువాదోడుగా ఉండేదని ఆమె మనుమడు లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు. కష్టించి పనిచేసి చివరి శ్వాసవరకూ కుటుంబాన్ని ఆదుకున్న తమ పెద్దదిక్కు ఇలా అకస్మాత్తుగా తమను వీడిపోవడం తీరని లోటని కన్నీరు మున్నీరయ్యారు. వెజ్, నాన్ వెజ్ ఇలా ఏదైనా.. ఆమె వంటకాల వీడియోలు లక్షల వ్యూస్‌ను సాధించడం విశేషమని ఆయన పేర్కొన్నారు. బామ్మ అండతో తాను ప్రారంభించిన యూ ట్యూబ్ ఛానల్‌కు విశేష ఆదరణకు నోచుకుందన్నారు. 106 ఏళ్ళ వయసులో కూడా ఎంతో శ్రమకోర్చి యూట్యూబ్ వంటల వీడియోల ద్వారా ఆర్థికంగా ఎంతో సాయపడిన బామ్మ ఇలా ఒక్కసారిగా తమను వదిలి వెళ్లిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. -
బ్రేకింగ్.. ఆగిపోయిన యూట్యూబ్
సాక్షి, హైదరాబాద్ : వీడియో స్ట్రీమింగ్ వెబ్సైట్ యూట్యూబ్ ఆకస్మత్తుగా నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ పనిచేయడం ఆగిపోయింది. అనేక మంది నెటిజన్లు యూట్యూబ్, యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ మ్యూజిక్‌లో తలెత్తిన సమస్యలను సంస్థ దృష్టికి తెలియజేస్తూ రిపోర్ట్ చేశారు. దీంతో ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలో ఈ సమస్యను పరిష్కరించి, అప్డేట్ చేస్తామని యూట్యూబ్ సంస్థ ట్విటర్లో పేర్కొంది. యూట్యూబ్ కంటెంట్ చూడాలని వెబ్సైట్లోకి వెళ్తే 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్, 503 నెట్వర్క్ ఎర్రర్ అని వస్తుందని నెటిజన్లు వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేస్తున్నారు. అలాగే యూజర్స్‌కు వెబ్సైట్ లాగిన్ కావడం లేదని పేర్కొన్నారు. గత నెలలో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ప్రదేశాల్లో ఇలాగే క్రాష్ అయిన విషయం తెలిసిందే. Thanks for your reports about YouTube, YouTube TV and YouTube Music access issues. We're working on resolving this and will let you know once fixed. We apologize for any inconvenience this may cause and will keep you updated. — Team YouTube (@TeamYouTube) October 17, 2018 Wow, I'm loving Youtube's new update! Minimalistic and Chic #YouTube pic.twitter.com/a0lHbpbQCN — ros (@Amuchanist) October 17, 2018 Mayday mayday SOS SOS#youtube what happened? pic.twitter.com/vIYTmyndP1 — HatiHunter (@ailinafuad) October 17, 2018 -
టాప్ సాంగ్!
గతేడాది డిసెంబర్లో రిలీజైన సల్మాన్‌ఖాన్ ‘టైగర్ జిందా హై’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కత్రినా కైఫ్ కథానాయికగా నటించారు. అంతేకాదు ‘ఏక్ తా టైగర్’ సినిమా తర్వాత ఐదేళ్లు గ్యాప్ ఇచ్చి సల్మాన్, కత్రినా కలిసి చేసిన చిత్రమిదే కావడం విశేషం. అలాగే ఈ సినిమాలోని ‘స్వాగ్ సే స్వాగత్’ సాంగ్‌కు యూ ట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్‌కు యూ ట్యూబ్‌లో 600 మిలియన్ (60 కోట్లు) వ్యూస్ వచ్చాయి. ఈ ఫీట్‌ను సాధించిన తొలి ఇండియన్ సాంగ్ ఇదేనని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలోని పాటలకు విశాల్–శేఖర్ ద్వయం సంగీతం అందించారు. ‘స్వాగ్ సే స్వాగత్’ పాటకు విశాల్, నేహా గాత్రం అందించారు. ఇర్షాద్ కామిల్ లిరిక్స్ అందించారు. వైభవి మర్చెంట్ కొరియోగ్రాఫర్. ఇప్పటికే 600 మిలియన్స్‌ను టచ్ చేసిన ఈ పాట ప్యూచర్లో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. అలాగే అలీ అబ్బాస్ జాఫర్–సల్మాన్ ఖాన్–కత్రినా కాంబినేషన్లోనే రూపొందుతున్న ‘భారత్’ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
రికార్డుల రంగమ్మ.. మంగమ్మ..
‘రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు.. పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు...’ పాట వినగానే మనకు టక్కున ‘రంగస్థలం’ సినిమా గుర్తుకు రాక మానదు. రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదలై ఘన విజయం సాధించింది. అంతేకాదు.. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలోని ‘రంగమ్మ మంగమ్మ’ పాట బాగా పాపులర్ అయింది. ఇప్పుడీ పాట యూ ట్యూబ్‌లో ఓ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ ఈ పాటను 100 మిలియన్లు (10 కోట్లు) మందికి పైగా వీక్షించారు. ఈ ఏడాది తక్కువ టైమ్‌లో 10 కోట్ల మార్క్‌ను దాటిన తొలి దక్షిణాది పాటగా ‘రంగమ్మ మంగమ్మ’ పాట రికార్డు సృష్టించడం విశేషం. చంద్రబోస్ రాసిన ఈ పాటను మానసి పాడగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. -
ఆండ్రాయిడ్ వాట్సాప్‌లో ‘పిక్చర్ టు పిక్చర్’
వాషింగ్టన్: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ మరో ఫీచర్‌ను తీసుకురానుంది. ‘పిక్చర్ టు పిక్చర్’ మోడ్‌ను అండ్రాయిడ్ ఫోన్లకూ అందుబాటులోకి తేనుంది. ఈ ఫీచర్ సాయంతో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూస్తూనే వీడియో కాల్ మాట్లాడొచ్చు. వీడియో కాల్ మాట్లాడుతూనే సందేశాలు పంపవచ్చు. వీడియోలు చూసేటప్పుడు, మెసేజ్‌లు పంపేటప్పుడు వీడియో కాల్ స్క్రీన్ చిన్నదిగా మారి ఫోన్లో కుడివైపుకొస్తుంది. వీడియో కాల్ మాట్లాడుతూ యాప్‌లను చెక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌కు ప్రస్తుతం తుది పరీక్షలు నిర్వహిస్తున్నామనీ, త్వరలో మార్కెట్లోకి తెస్తామని వాట్సాప్ తెలిపింది. -
యూ ట్యూబ్ ట్రెండ్‌లో ‘విజేత’ ట్రైలర్
-
అల్లుడు దుమ్ము లేపేస్తున్నాడు!
చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవీ సూపర్ హిట్ మూవీ ‘విజేత’ను టైటిల్‌గా పెట్టుకుని వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు పెరుగతూ ఉన్నాయి. ఆదివారం జరిగిన ఆడియో ఫంక్షన్లో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నారు విజేత టీమ్. నిన్న విడుదల చేసిన ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియా, యూ ట్యూబ్‌లో టాప్ ట్రెండ్‌లో నడుస్తోంది. సినిమాకు డైలాగ్‌లు, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ప్లస్ అయ్యేలా ఉన్నాయి. ఎలాగో మెగా అభిమానుల సపోర్ట్ ఉంది కాబట్టి, సినిమా విడుదలయ్యాక పాజిటివ్టాక్ వచ్చి మొదటి సినిమానే సూపర్ హిట్ అయితే ఇక కళ్యాణ్ దేవ్ కెరీర్‌కు ఏ అడ్డు ఉండదు. హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చగా, రాకేశ్ శశి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. వారాహి చలన చిత్రంపై నిర్మించిన ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
భగవంతుని కొడుకువంటూ రెచ్చగొట్టారు!
యశవంతపుర: కొందరు వ్యక్తులు యూ ట్యూబ్‌లో పాత్రికేయురాలు గౌరి లంకేశ్ ప్రసంగాలను చూపి తనను బ్రెయిన్ వాష్ చేయటం వల్లనే ఆమెను హత్య చేసినట్లు ఈ కేసులో కీలక నిందితుడు, షార్ప్ షూటర్ పరశురాం వాగ్మోరె సిట్ విచారణలో వెల్లడించాడు. గౌరిలంకేశ్ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రసంగాలను యూ ట్యూబ్‌లో చూపించి ఆమెను హత్య చేయాలని రెచ్చగొట్టిన్నట్లు అతడు చెప్పినట్లు సమాచారం. ఇదే కాకుండా నీవు శ్రీకృష్ణుని పుత్రుడవు, భగవంతుని కొడుకువు అని రెచ్చగొట్టడంతో ఆమెను అంతమొందించడానికి అంగీకరించినట్లు తెలిపారు. గౌరి ఇంటి చుట్టూ అనేకసార్లు రెక్కీ నిర్వహించినట్లు తెలిపాడు. ఆమెను మొదట తలకు గురిపెట్టి పిస్టల్‌తో కాల్చానని, గురి తప్పడంతో, విచ్చలవిడిగా కాల్పులు జరిపి హత్య చేసినట్లు పరశురాం హత్యాక్రమాన్ని వివరించాడు. -
యాక్షన్ హీరో కూతురికి ఇల్లు కూడా లేదట..
తండ్రేమో ప్రపంచ ప్రసిద్ధి చెందిన యాక్షన్ హీరో...మరి అలాంటప్పుడు ఆయన వారసులకు దేనికి కొరత ఉండదు అనే అభిప్రాయం సహజం. కానీ జాకీ చాన్(62) కూతురు పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నది. జాకీ చాన్ కుతూరు ఎట్టా ఎన్(18) ‘ప్రస్తుతం నాకు ఉండేందుకు ఇల్లు లేదు. నెల రోజుల నుంచి నేను నా గర్ల్‌ఫ్రెండ్ ఇద్దరమూ హంగ్‌కాంగ్‌లోని ఒక బ్రిడ్జి కింద తలదాచుకుంటున్నాము’ అంటూ ఒక వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేసింది. ఎట్టా పోస్టు చేసిన వీడియోలో ‘మేము ఒక నెల నుంచి ఈ బ్రిడ్జి కిందనే తలదాచుకుంటున్నాము. తినడం, పడుకోవడం అంతా ఇక్కడే. మాకు ఆశ్రయం కల్పించమని పోలీసులు, ఆస్పత్రి, ఆహార బ్యాంకు, ఎల్జీబీటీక్యూ(లెస్బియన్, గే, బైసెక్సువల్, లింగమార్పిడి) కమ్యూనిటిల దగ్గరకు కూడా వెళ్లాము. కానీ వారు మాకు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించారు. ఎవ్వరు మాకు సాయం చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే ఈ విషయాలన్నింటిని ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ’ అని తెలిపింది. ఈ వీడియోలో ఎట్టాతో పాటు ఆమె స్నేహితురాలు అండీ ఆటుమాన్ కూడా ఉన్నది. ఎట్టా మాజీ అందాల రాణి ఎలెన్ ఎన్, జాకీ చాన్ల కూతురు. ఈ యాక్షన్ హీరో ప్రస్తుత భార్య జోన్ లిన్ కంటే ముందు ఎలెన్‌తో జాకీ చాన్‌కు సంబంధం ఉంది. వీరి బంధం గురించి ఈ హీరో బహిరంగంగా ఒప్పుకున్నప్పటికీ కూతురు ఎట్టా విషయంలో మాత్రం మౌనంగానే ఉన్నాడు. అయితే ఎలెన్ కూతురు చేసిన ఆరోపణనలను ఖండిస్తూ ఇలాంటి పనులు చేసే బదులు ఏదైనా పని వెతుక్కుంటే మంచిదని హితవు పలికారు. ‘నీకు డబ్బులు కావాలంటే కష్టపడి పనిచేసి సంపాదించు, అంతేకానీ ఇలా ఒకరి పేరు ప్రతిష్టల మీద ఆధారపడటం మంచి పద్దతి కాద’ని తెలిపారు. ఎట్టా గతంలో తన తండ్రి జాకీ చాన్ గురించి ‘అతను నా జీవితంలో లేడు...నేను అతన్ని ఒక తండ్రిగా ఎప్పటికి పరిగణించను’ అని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
క్రేజీ పాటను హ్యాక్ చేసేశారు
ఈ మధ్య హ్యాకర్లు దేన్నీ వదలటం లేదు. పాప్ సింగర్స్ కమ్ కంపోజర్స్ లూయిస్ ఫోన్సీ, డాడీ యాంకీలు చేసిన ‘డెస్పాసిటో’ ఆల్బమ్ ప్రపంచాన్ని ఉర్రూత లూగించిన విషయం తెలిసిందే. చాలా మంది ఆ ఆల్బమ్‌ను కాపీ కొట్టేసి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను దాదాపు 500 కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన పాట ఇదే. అయితే ఈ వీడియోపై హ్యాకర్ల కన్నేశారు. వెవో యూట్యూబ్ అకౌంట్‌ను హ్యాక్ చేసి ఆ పాట ఒరిజినల్ థంబ్ నెయిల్(ఫోటో)ను.. సాంగ్ టైటిల్‌ను మార్చిపడేయటంతో డెస్పాసిటో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. కాసేపటికే ఆ ఒరిజినల్ ట్రాక్ యూట్యూబ్లోంచి మాయం కావటం గమనార్హం. అయితే డిలీట్ చేసింది ఎవరన్న దానిపై స్పష్టత లేదు. కాగా, సంచలనం సృష్టించిన గంగ్నమ్ స్టైల్ పాట తర్వాత మళ్లీ యూట్యూబ్‌లో ఆ స్థాయిలో ఉర్రూతలు ఊగించింది డెస్సాసిటోనే. ఒరిజినల్ సాంగ్ స్పానిష్, ఇంగ్లీష్ లిరిక్స్‌తో రూపుదిద్దుకుంది. తెలుగులో నటుడు నోయల్ ఈ పాటను రిమేక్ చేయగా.. ఆ ప్రయత్నం ఆకట్టుకుంది. -
సోషల్ మీడియాలో నటి వీడియో వైరల్!
హార్డ్ వర్క్ చేయడమంటే చాలా ఫన్నీగా ఉంటుందట. ఈ విషయాన్ని నటి శాన్వీ శ్రీవాత్సవ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె వర్కవుట్లు చేసిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూశాక ఎంతో మంది వర్కవుట్ చేయడం మొదలుపెడతారని ఆమె చెబుతోంది. వీడియో చూసినవాళ్లు తమ ఆరోగ్యం కోసం, ఫిట్‌గా ఉండేందుకు శారీరక శ్రమ చేస్తారని ట్వీట్లో రాసుకొచ్చింది నటి శాన్వీ. ఆమె పోస్ట్ చేసిన వీడియోకు విశేష స్పందన వస్తోంది. నటి శాన్వీ.. లవ్లీ, అడ్డా, రౌడీ, ప్యార్ మే పడిపోయానే వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్గా అలరించారు. తెలుగులో అవకాశాలు లేవు కానీ, కన్నడలో మాత్రం ఫుల్ బిజీ హీరోయిన్ ఈమె. డైరెక్టర్ అయ్యేందుకు రెండు కథలను శాన్వీ సిద్ధం చేసుకున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే సినిమాలో శాన్వీ డైరెక్టర్‌గా కనిపించనుందని నటిగానే కొనసాగనుందని మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. -
ఆ సినిమాను యూట్యూబ్ లో చూడలేరు!
ముంబై: మనోజ్ బాజపేయి, రాధిక ఆప్టే నటించిన షార్ట్ ఫిలిమ్ 'కృతి' యూట్యూబ్ నుంచి తొలగించారు. కాపీ రైట్ వివాదం తలెత్తడంతో ఈ సినిమాను యూట్యూబ్ తొలగించింది. ఈ విషయాన్ని దర్శకుడు శిరీష్ కుందర్ ధ్రువీకరించారు. యూట్యూబ్ నుంచి తమ సినిమాను తొలగించారని ట్వీట్ చేశారు. తమకు మద్దతుగా నిలిచినందుకు ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 'కృతి' షార్ట్ ఫిలిమ్ ను యూట్యూబ్ లో 25 లక్షల మంది వీక్షించారు. 18 నిమిషాల నిడివున్న ఈ సినిమాను యూట్యూబ్ లో జూన్ 22న విడుదల చేశారు. తన షార్ట్ ఫిలిమ్ 'బాబ్'ను కాపీ కొట్టి 'కృతి' తీశారని నేపాల్ దర్శకుడు అనీల్ న్యుపనె ఆరోపించడంతో వివాదం రేగింది. 'కృతి' కంటే ఏడు నెలల ముందే 'బాబ్' తీశానని వెల్లడించాడు. అనీల్ న్యుపనె ఆరోపణలను శిరీష్ తోసిపుచ్చాడు. తనపై ఆరోపణలు చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అతడికి లీగల్ నోటీసు పంపాడు. -
ప్రియురాలి నగ్నచిత్రాలు యూట్యూబ్‌లో పెట్టాడు
బంజారాహిల్స్ (హైదరాబాద్) : ప్రేమించిన సమయంలో ఆమెకు తెలియకుండా అసభ్య దృశ్యాలను వీడియోలు తీసిన ఒక వ్యక్తి తనతో సంబంధం తెంచుకుందన్న అక్కసుతో ఆ వీడియోలను యూట్యూబ్‌లో ఎక్కించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా హన్మకొండ హసన్పర్తికి చెందిన యువతి(23) 2012 నుంచి 2014 వరకు ఉద్యోగ శిక్షణా తరగతుల్లో భాగంగా బేగంపేటకు వెళ్లేది. అక్కడే పనిచేస్తున్న శీలబోయిన అనిల్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. 2014లో పెళ్లి చేసుకుంటానని నమ్మించి రహ్మత్‌నగర్ గురుద్వార్ సమీపంలోని తన గదికి ఆమెను తీసుకెళ్లిన అనిల్ శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆ దృశ్యాలను ఆమెకు తెలియకుండా వీడియో తీశాడు. ఇటీవల ఆమెకు మరొకరితో పెళ్లి అయింది. ఇది జీర్ణించుకోలేని అనిల్ ఆమెతో కలిసి నగ్నంగా ఉన్న ఫొటోలను యూట్యూబ్‌లో పెట్టాడు. గత నెల 2వ తేదీన యూట్యూబ్‌లో ఈ దృశ్యాలు చూసిన బాధితురాలి స్నేహితులు విషయాన్ని ఆమెకు తెలియజేశారు. అంతేకాకుండా అత్తవారింట్లో కూడా విషయం తెలియడంతో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆ నగ్న దృశ్యాలను అనిల్ యూట్యూబ్‌లో పెట్టాడని నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు అనిల్‌పై ఐపీసీ సెక్షన్ 354(బి), 506, 509, 417, 420ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఈ వారం యు ట్యూబ్ హిట్స్
ది కన్జ్యూరింగ్ 2 : ట్రైలర్ నిడివి : 2 ని 32 సె. హిట్స్ : 28,90,913 అతీంద్రియ శక్తుల హారర్ ఫిల్మ్ ‘ది కన్జ్యూరింగ్’ విడుదలైన మూడేళ్ల తర్వాత దాని సీక్వెల్‌గా వస్తున్న ‘ది కన్జ్యూరింగ్ 2’ చిత్రం ట్రైలర్ ఇది. మూవీ 2016 జూన్ 10న విడుదలవుతోంది. లండన్‌లోని ఎన్ఫీల్డ్ అనే ప్రాంతంలో ఉన్న ఒక ఇంట్లో దెయ్యాల జాడను కనిపెట్టేందుకు బయల్దేరిన హీరో హీరోయిన్‌కీ, మరో ఇద్దరు అధ్యయనవేత్తలకు ఎదురైన అనుభవాలు ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటాయో శాంపిల్‌గా ఈ వీడియోలో చూడొచ్చు. అన్వాంటెడ్ గెస్ట్ నిడివి : 36 సె. హిట్స్ : 12,86,179 వేదికల మీద అప్పుడప్పుడు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటిదే ఇది. లాస్ ఏంజెలెస్‌లోని మైక్రోసాఫ్ట్ థియేటర్లో ‘ది టాక్’ షో లేడీస్ టీమ్.. ‘ది పీపుల్ చాయిస్ అవార్డ్స్ 2016’ తీసుకునే సందర్భంలో ప్రసంగం ఇస్తుండగా హఠాత్తుగా ఒక యువకుడు వేదికపైకి చొరబడి, టాక్ షో హోస్ట్ చేతిలోంచి మైక్ లాగేసుకుని తను మాట్లాడ్డం మొదలు పెట్టాడు. కో హోస్ట్ షారన్ వెంటనే అప్రమత్తమై అతడిని అక్కడినుంచి పంపేశారు. -
‘బీప్’ తొలగించడానికి యూట్యూబ్ నిరాకరణ
తమిళసినిమా: తమిళనాడునే ఊపేస్తున్న శింబు బీప్ పాటను యూ ట్యూబ్ నుంచి తొలగించడానికి ఆ సంస్థ నిర్వాహకులు నిరాకరించడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. బీప్ సాంగ్ గత 11వ తేదీ నుంచి వాట్సాప్,ఫేస్బుక్, ఇంటర్నెట్,యూట్యూబ్ అంటూ హల్చల్ చేస్తోంది. ఇప్పటికే 10 లక్షల మంది ఈ పాటను లైక్ చేశారు. దీంతో శింబు బీప్ పాటకు సంబంధించిన వివాదానికి త్వరగా పుల్‌స్టాప్ పెట్టాలని భావించిన నగర నేరపరిశోధన శాఖ అధికారులు ఆ సాంగ్‌ను యూట్యూబ్ నుంచి తొలగించే చర్యలు చేపట్టాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు ఆగమేఘాలపై యూట్యూబ్ అధికారులను కలిసి శింబు సాంగ్‌ను నిలిపివేయాల్సిందిగా కోరారు.అయితే ఆ సాంగ్ అర్థం ఏమిటో ఆంగ్లంలో తర్జుమా చేసి తమకు వివరించాల్సిందిగా యూట్యూబ్ నిర్వాహకులు పోలీసులకు చెప్పారు. దీంతో అతి కష్టం మీద అరకొర అర్థాలతో బీప్ సాంగ్‌ను పోలీసులు ఆంగ్లంలోకి అనువదించి చెప్పగా అందులో పెద్దగా తప్పు పట్టాల్సిన విషయం ఏమీ లేదని యూట్యూబ్ నిర్వాహకులు తేల్సి చెప్పడంతో పోలీసులు కంగు తిన్నారు. దీంతో అసలు ఇంతగా కలకలం సృష్టిస్తున్న ఆ పాట యూట్యూబ్‌లోకి ఎలా వచ్చింది? దీనికి కారకులెవరు?అన్న విషయాలపై పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. -
పది కోట్ల మంది మెచ్చారు!
బట్లర్ ఇంగ్లిష్‌లో పాట పాడితే వినడానికి విసుగ్గా ఉంటుందని చాలామంది అనుకుంటారు. ఇది ‘కొలవెరి..’ పాట రాకముందు సంగతి. కానీ, ‘వై దిస్ కొలవెరి...’ అంటూ ఇంగ్లిష్, తమిళ్ మిక్స్ చేసి, వచ్చిన పాట నిజానికి శ్రోతలను వెర్రెక్కించింది. ధనుష్, శ్రుతీహాసన్ జంటగా రూపొందిన ‘3’ చిత్రంలోని ఈ పాట పాడుకోనివాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ పాటను ధనుష్ చాలా బాగా పాడారు. స్వరాలందించింది టీనేజ్ కుర్రాడు అనిరుధ్. ఆ ఒక్క పాట అనిరుధ్‌ని కోలీవుడ్‌కే కాదు.. టాలీ, మాలీ, బాలీవుడ్స్లో పాపులర్ అయ్యేలా చేసింది. మొన్నీ మధ్యే టర్కీ భాషలోని ఓ యాడ్ కోసం ఈ ట్యూన్‌ను వాడుకున్నారు. నాలుగేళ్ల క్రితం వచ్చిన ఈ పాట గురించి ఇప్పుడు ప్రస్తావించడానికి కారణం ఉంది. 2011 సంవత్సరానికి ఆల్‌టైమ్ హిట్‌గా నిలిచిన ఈ పాట విదేశీయులకు తెగ నచ్చేసింది. ఇప్పటి వరకూ ఈ పాటను యూ ట్యూబ్‌లో పది కోట్ల మంది వీక్షించారు. ఈ పాట విడుదలై అయిదేళ్లు కావస్తున్నా ఇంకా క్రేజ్ తగ్గలేదనడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఏముంటుంది! -
యూట్యూబ్ ను ఏలుతున్న 'ఎడ్వర్డా' బీట్స్...
లయబద్ధమైన బీట్.. ముఖంలో తొణకని విశ్వాసం.. ఆ చిన్నారి డ్రమ్స్ వాయించిందంటే సంగీత ప్రియులే కాదు...చూసినవారంతా అడుగులు కదపాల్సిదే... అప్పుడప్పుడే పాఠశాల మెట్లు ఎక్కాల్సిన ఐదేళ్ళ వయసులోనే ... ఆమె చేయి తిరిగిన ప్రజ్ఞను ప్రదర్శించింది. ఎటువంటి లోపాలు లేకుండా డ్రమ్స్ వాయిస్తూ, స్టేజ్ షోలు, టీవీ షోలతో దూసుకుపోతోంది. ఆణిముత్యంలా ఆకట్టుకుంటున్న ఆ బాల కళాకారిణి ఎడ్వర్డా హెన్ క్లెయిన్ బటెరిస్టా ప్లే చేసిన వీడియోలు... ఇప్పుడు యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి. బ్రెజిల్.. జాయిన్విల్లే నగరంలో నివసించే ఆరేళ్ళ ఎడ్వర్డా తన బీట్స్ తో సంగీత ప్రపంచాన్ని ఓలలాడిస్తోంది. ఇంతకు ముందే ఎన్నో లోకల్ టీవీ ప్రోగ్రామ్స్ లో ప్రతిభను చాటిన బాలిక.. తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఓ సంవత్సరం క్రితం ఐదేళ్ళ అతి చిన్న వయసులో వాయిద్యాన్నిమొదలుపెట్టిన చిన్నారి... చేయి తిరిగిన విద్వాంసురాలిలా డ్రమ్స్ వాయించడం చూపరులను విస్మయ పరుస్తోంది. అతి సుతారంగా కర్రలు తిప్పుతూ చాకచక్యంగా బీట్స్ వేసే ఆమె... వాద్య పరికరాల వెనుక నవ్వుతూ నిలబడినట్లే కనిపిస్తుంది. ట్రాక్ తో పాటు గొంతెత్తి పాడుతూ శక్తివంతంగా తన పరాక్రమాన్ని చాటుతోంది. ప్రదర్శన ముగించే మూడు నిమిషాలకు ముందు ఈలలు, చప్పట్లతో ఆమెకు వచ్చే రెస్సాన్స్ ఓ ప్రముఖ విద్యాంసుడికి కూడా రాదేమో అనిపిస్తుంది. యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఆ బాల మేధావి వీడియోను ఇప్పటివరకూ ఐదు లక్షల మందికి పైగా చూడటమే కాదు, ఎందరో ఆమెను అభినందిస్తూ కామెంట్లు పోస్ట్ చేశారు. ''నిజానికి ఓ ఐదేళ్ళ చిన్నారి ఇంత అద్భుతంగా డ్రమ్స్ వాయించడం ఆశ్చర్యపరుస్తోంది.", "డ్రమ్స్ వాయిస్తూ పాటను కూడ పాటడం నిజంగా ఆశ్చర్యం" అంటూ వచ్చిన కామెంట్లు ఇప్పుడు ఆమె ప్రతిభకు పట్టం కడుతున్నాయి. -
ఈ వారం యూట్యూట్ హిట్స్
లెర్న్ టు ఫ్లై నిడివి : 7 ని. 28 సె. హిట్స్ : 2,12,12,736 వివిధ దేశాల నుంచి ఇటలీలోని చెసానా పట్టణానికి చేరుకున్న 350 మంది గిటారిస్టులు, 250 మంది సింగర్లు, 250 మంది డ్రమ్మర్లు, 150 బైసిస్టులు (బేస్ గిటారిస్టులు) కలిసి అమెరికన్ రాక్ బ్యాండ్ ‘ఫూ ఫైటర్స్’ కోసం ‘లెర్న్ టు ఫ్లై’ అనే ఈ థౌజండ్ వాలా కచేరీని ప్రదర్శించారు. ఆ వీడియో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. హిట్లు రెండు కోట్లు దాటాయి! దాదా పు రెండు దశాబ్దాలుగా ఇటలీ ముఖం చూడని ఫూ ఫైటర్స్ బ్యాండ్‌ను ఇటలీకి తెప్పించడం కోసం ఫాబియో జఫాగ్నినీ అనే దేశభక్త మ్యూజిక్ లవర్ ఈ స్థాయిలో కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశాడు!! డెడ్‌పూల్ ట్రైలర్ నిడివి : 2 ని 54 సె. హిట్స్ : 1,62,30,832 ఈ వీడియోను తిలకించాలంటే ముందు మీ వయసును కన్ఫామ్ చెయ్యాల్సి ఉంటుంది. అరె! ఇందులో అంతగా ఏముంది? ‘జిలియన్’ థ్రిల్స్ ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్న డెడ్‌పూల్ హాలీవుడ్ మూవీ ట్రైలర్ ఇది. ఇందులో కిరాయి సైనికుడైన ర్యాన్ రెనాల్డ్పై క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రయోగం జరుగుతుంది. దాంతో అతడికి అతీంద్రియ శక్తులు లభిస్తాయి. ఆ శక్తులను ఉపయోగించి తనపై ప్రయోగం చేసిన వ్యక్తిని కనుక్కుని అతడిపై ప్రతీకారం తీర్చుకోడానికి బయల్దేరతాడు ర్యాన్. మార్వెల్ కామిక్స్‌లోని వేడ్ విల్సన్ పాత్ర ఆధారంగా తయారైన సూపర్‌హీరో చిత్రం డెడ్‌పూల్. ఆల్ ఐస్ ఆన్ యు నిడివి : 3 ని. 54 సె. హిట్స్ : 1,52,88,202 అమెరికన్ హిప్హాప్ రికార్డింగ్ ఆర్టిస్ట్ మీక్ మిల్ తన రెండో ఆల్బమ్ ‘డ్రీమ్స్ వర్త్ మోర్ దేన్ మనీ’ లోని సింగిల్ ట్రాక్ ‘ఆల్ ఐస్ ఆన్ యు’. ఇందులో మిల్ సరసన ట్రినిడాడ్‌లో పుట్టిన అమెరికా అమ్మాయి నిక్కీ మినాజ్ నటించారు. ఈ దృశ్య కావ్యంలోని మిల్-మినాజ్ల ప్రణయ భావన వ్యక్తీకరణలు... చూడడానికి తప్ప వర్ణించేందుకు వీలు కానివి. మిల్కి, మినాజ్‌కి మధ్య నిజజీవిత రహస్య బాంధవ్యం ఏదో ఉందన్న వదంతులకు ఈ వీడియోలోంచి వెలువడే శక్తిమంతమైన తరంగాలు బలాన్ని చేకూర్చేవిధంగా ఉన్నాయి. క్రిస్టియానో రెనాల్డో ఇన్ డిజ్గైజ్ నిడివి : 4 ని. 4 సె. హిట్స్ : 76,80,906 విగ్గు, పెట్టుడు గడ్డం, మీసాలతో ఇటీవల స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ వీధులలో సరదాగా ఫుట్‌బాల్‌తో తనకు తాను ఆడుకున్న పోర్చుగల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో వీడియో యూ ట్యూబ్ వీక్షకులను అమితంగా అలరిస్తోంది. మారువేషంలో ఉన్న రొనాల్డోను ఒక్కరు కూడా గుర్తుపట్టలేకపోవడం ఒక విశేషం కాగా, దారిన పోతున్న ఓ మహిళను రొనాల్డో ఫోన్ నెంబరు అడగడం, ఆమె సున్నితంగా తిరస్కరించడం ఒక చిలిపి సన్నివేశం. వీడియో చివర్లో రొనాల్డో తన వేషం తొలగించినప్పుడు అతడిని గుర్తుపట్టి అంతా చుట్టుముడతారు. వైనల్ టీజర్ (హెచ్‌బివో) నిడివి : 1 ని. హిట్స్ : 12,71,010 వచ్చే ఏడాది హెచ్.బి.వో. చానెల్లో రాబోతున్న టెలివిజన్ సీరీస్... వైనల్. అమెరికన్ రచయిత ఈ టెలివిజన్ డ్రామాను రూపొందించారు. మరో అమెరికన్ స్కార్సేస్ దర్శకత్వం వహించారు. దీని టీజర్ ఇలా మొదలౌతుంది. ‘‘ ఇది నా కథ. నా నోరు మూయించాలంటే రికార్డు ఆన్ చెయ్యండి. నీడిల్‌ను దానిపై ఉంచండి. వాల్యూమ్‌ని పెంచండి’. వైనల్ అనేది గ్రామఫోన్ రికార్డుల తయారీలో ఉపయోగించే పూత. ఇంతకీ వైనల్ థీమ్ ఏమిటి? ఇదొక రాక్ అండ్ రోల్ డ్రామా. డెబ్బైల నాటి ‘అమెరికన్ సెంచరీ రికార్డ్’ అధినేత సంగీత ప్రియత్వపు సంక్షోభంపై సీరీస్ నడుస్తాయి. మోటోబిఎఫ్ఎఫ్ చాలెంజ్ నిడివి : 4 ని. 46 సె. హిట్స్ : 2,91,070 లైవ్‌లో ప్రేక్షకుల ముందు నిలబడి కామెడీని పండించడాన్ని ‘స్టాండ్-అప్’ కామెడీ అంటారు. అలాంటి కామెడీలో తలపండిన పాతికేళ్ల భారతీయ యువకుడు కనన్ గిల్ (ఫొటోలో ఉన్నది అతడే) ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మోటరోలా ఇండియా కంపెనీ కోసం తయారుచేసి ఇచ్చిన గేమ్ ‘హూ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్’, MOTOBFFCHALLENGE అనే హ్యాష్‌టాగ్ (ు) తో యూట్యూబ్‌లో నవ్వులు కురిపిస్తోంది. కనీజ్ సుర్కా, అబిష్ మ్యాథ్యూ, కెన్నీ సెబాస్టియన్లు పాల్గొన్న ఈ గేమ్‌లో చివరికి ఎవరు విన్ అవుతారో తెలుసా? మీరు ఊహిచలేరంతే!! -
టాప్ వీడియో షేరింగ్ సైట్ గా ఫేస్ బుక్!
న్యూయార్క్: వీడియో షేరింగ్ లో ప్రపంచ నెంబర్-1గా ఉన్న యూ ట్యూబ్ ను ఫేస్ బుక్ తలదన్నే రోజు దగ్గర్లోనే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏడాది పాటు 20 వేల ఫేస్ బుక్ పేజీలు,1.8 లక్షల పోస్టులను పరిశీలించి మరీ వీరు జోస్యం చెబుతున్నారు. ' కంటెంట్ మార్కెట్ చేసేవారు నేరుగా తమ వీడియోలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తున్నారు.దీంతో ఫేస్ బుక్ అధిక సంఖ్యలో యూజర్లను నిలబెట్టుకోగలుగుతోంది.యూజర్లు ఫేస్ బుక్ ను విడిచి వెళ్లకుండా అలానే ఉండేందుకు ఇది తోడ్పడుతోంది'అని సోషల్ బేకర్స్ అనే సోషల్ మీడియా విశ్లేషణ కంపెనీ తన వెబ్ సైట్ లో పేర్కొంది. ఇదిలా ఉండగా రోజూ 100 కోట్ల(బిలియన్) వీడియోలను అప్ లోడ్ చేస్తున్నట్లు గత సెప్టెంబర్ లో ఫేస్ బుక్ ప్రకటించడం కూడా ఇందుకు బలం చేకూర్చుతోంది. -
అభి షార్ట్ జర్నీ
వెండితెర వెనక్కి పంపినా.. తగ్గలేదు. తనలోని సృజనకు యుూట్యూబ్ను వేదికగా చేసుకున్నాడు. పొట్టి చిత్రాలతో గట్టి మెసేజ్లిస్తూ లక్షల్లో లైక్స్ కొట్టేస్తున్నాడు అభిరామ్. ఎంబీఏ పూర్తి చేసిన ఈ కుర్రాడు ఉద్యోగానికి టాటా చెప్పి షార్ట్‌ఫిల్మ్స్ రూట్లోకి వచ్చిపడ్డాడు. స్నేహితుడి సహకారంతో ఫేస్బుక్ ద్వారా ఆర్టిస్టులను బుక్ చేసుకుని ‘తరుణ్ ఫ్రమ్ తెలుగు మీడియుం’ షార్ట్ ఫిల్మ్ తీసి యుట్యూబ్లో అప్లోడ్ చేశాడు. నాలుగు నెలల్లో ఈ చిత్రం రెండున్నర లక్షల లైక్స్ సంపాదించింది. ఇదే స్ఫూర్తితో ‘బ్రేకప్ తరవాత’ షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఇదీ లక్షల్లో లైక్స్ కొల్లగొట్టింది. తాజాగా ‘రంభతో రాముడు’ చేస్తున్న అభిరామ్ తన గురించి ఇలా చెబుతున్నాడు. ఎంబీఏ కాగానే ఒక కంపెనీలో చేరాను. సినిమాలపై ఉన్న మోజుతో.. ఉద్యోగం మానేసి ఓ ఏడాది ఇండస్ట్రీ చుట్టూ తిరిగాను. ఎక్కడకు వెళ్లినా హారుుగా ఉద్యోగం చేసుకోవునే వాళ్లే తప్ప చాన్స్ దొరకలేదు. అరుునా నిరాశ పడలేదు. నా పనితనాన్ని రుజువు చేసుకోవాలనుకున్నాను. అందుకు షార్ట్ ఫిల్మ్స్‌కు మించిన వూర్గం లేదనిపించింది. వాటిని ప్రమోట్ చేయుడానికి యుూట్యూబ్ను వేదికగా వులచుకోవాలని ఫిక్సయ్యూను. అదే టైంలో అసిస్టెంట్ కెమెరామన్ శ్రీకాంత్ అరుపాలతో పరిచయుమైంది. అలా నా కెరీర్ మొదలైంది. కథ.. స్క్రీన్‌ప్లే.. డెరైక్షన్ నా చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం నేనే చేస్తాను. ఇప్పటి వరకు తీసిన ఈ మూడు చిత్రాల కథలు నా జీవితంలో ఎదురైన సంఘటనల ఆధారంగా తీసినవే. మెయిన్ పాయింట్ ఒకటి తీసుకుని దానికనుగుణంగా కథ సిద్ధం చేసుకుంటాను. ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటూనే వీకెండ్స్‌లో షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాను. నా చిత్రంలో హెల్దీ కామెడీతో పాటు వుంచి సందేశం ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. తరుణ్ ఫ్రమ్ తెలుగు మీడియుం తెలుగు భాష గురించి ప్రత్యేకంగా తీసిన లఘు చిత్రం ‘తరుణ్ ఫ్రం తెలుగు మీడియుం’. చాలామంది తెలుగులో మాట్లాడితే తప్పనుకుంటారు. తెలుగులో మాట్లాడేవారిని, తెలుగుదనం నిండిన వస్త్రాలు కట్టుకునేవారిని చులకనగా చూడటం ఒక హాబీగా మారిపోరుుంది. మోడ్రన్ డ్రెస్, కాస్ట్లీ సెల్‌ఫోన్, వచ్చీరాని ఇంగ్లిష్‌లో ఏదో ఒకటి మాట్లాడేవారికే ఇప్పుడు సవూజంలో విలువ ఇస్తున్నారు. ఇవన్నీ పారుుంటవుట్ చేస్తూ.. మన తెలుగును మరచిపోవద్దనే సందేశాన్ని ఇందులో చూపించాను. కొసమెరుపు తాజాగా రంభతో రాముడు చేస్తున్న అభిరామ్ ఎప్పటికైనా వుంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకుంటానని చెబుతున్నాడు. కథ, కథనంలో వైవిధ్యం, ఆర్టిస్టుల సెలక్షన్లో కొత్తదనంతో అభిరామ్ బెటర్ అవుట్‌పుట్ ఇస్తున్నాడు. ఈ యుంగ్ టాలెంట్ వుుందు వుుందు వురిన్ని వుంచి చిత్రాలు చేయూలని ఆశిద్దాం. -
కాంగ్రెస్.. డోంగ్రెస్!
యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్న పొలిటికల్ పేరడీలు ఎన్నికల వేడి నెట్టింటికీ పాకింది. బ్లాగ్స్ ద్వారా, ఫేస్బుక్, ట్విటర్ వంటి సోషల్ నెట్‌వర్కింట్ సైట్ల ద్వారా హాట్‌హాట్ చర్చలు గిగా బైట్ల లెక్కన ఇంటర్నెట్లో పోగుపడుతున్నాయి. అయితే, ఆ వేడిని చల్లార్చే కామెడీ పేరడీలు కూడా నెట్లో దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ముఖ్యమైన నినాదాలు, ప్రచార చిత్రాలు.. విపరీతంగా పేరడీకి గురవుతున్నాయి. వీడియో నెట్వర్కింగ్ సైట్ యూట్యూబ్‌లో వీటికి మంచి స్పందన లభిస్తోంది. ఆయా నినాదాలు, ప్రచార చిత్రాలను హస్యభరితంగా అనుకరిస్తూ ఆ స్పూఫ్స్ను రూపొందిస్తున్నారు. నెట్లో హల్చల్ చేస్తున్న కొన్ని పేరడీలు.. కాంగ్రెస్‌పై.. ‘కట్టర్ సోచ్ నహీ.. యువ జోష్’(చాంధసవాదం కాదు.. యువ శక్తి) పేరడీ.. ‘కోయీ సోచ్ నహీ.. ఖాళీ పీలీ కా జోష్( ఏ ఆలోచనా లేదు.. అర్థంలేని ఆవేశమే) హర్ హాత్ కీ శక్తి.. హర్ హాత్ కీ తరక్కీ ( ప్రతీ వ్యక్తికి అధికారం.. ప్రతీ వ్యక్తికి అభివృద్ధి) పేరడీ.. ‘హర్ హాత్ హరీ పట్టీ.. వికాస్ కో లాల్బత్తీ’(ప్రతీ చేతిలో పచ్చనోటు.. అభివృద్ధికి రెడ్ సిగ్నల్) మరో స్పూఫ్లో కాంగ్రెస్‌ను డోంగ్రెస్ అని, రాహుల్‌ను కాహుల్ అని పేర్కొన్నారు. బీజేపీపై.. ‘నయీ సోచ్.. నయీ ఉమ్మీద్.. బీజేపీ’( కొత్త ఆలోచన.. కొత్త ఆశ) పేరడీ ‘నా హీ సోచ్.. నా హీ ఉమీద్.. పీజేపీ’ (ఆలోచనా లేదు.. ఆశలూ లేవు) అరవింద్ కేజ్రీవాల్‌పై.. రాజకీయాల్లో కేజ్రీవాల్ ఎదుగుదలను ఓ పేరడీలో సినిమా ట్రైలర్‌లా రూపొందించారు. అందులో బాలీవుడ్ నటుడు అలోక్నాథ్లా ఉండే ఒక వ్యక్తి కేజ్రీవాల్‌లా ఉండే మరో వ్యక్తికి.. సామాన్యుడిలా, పేదవాడిలా కనిపించాలంటే ఏమేం చేయాలో చెబుతుంటాడు. స్వెటర్ ధరించడం, తన చౌకీదారు నుంచి మఫ్లర్ అరువు తీసుకుని మెడలో వేసుకోవడం, గాంధీ టోపీ పెట్టుకోవడం.. తదితర సలహాలు ఇస్తుంటాడు. -
సోషల్ సైట్ల ద్వారా ఆటో ప్రచారం
గ్రేటర్ నోయిడా: యువ వినియోగదారులను ఆకట్టుకోవడానికి కార్ల కంపెనీలు కొత్త వ్యూహాలు అవలంబిస్తున్నాయి. ఇందులో భాగంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్ల తలుపు తడుతున్నాయి. షెవర్లే(జనరల్ మోటార్స్), మెర్సిడెస్, హీరో, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆడి కంపెనీలు యూ ట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లతో యువ వినియోగదారులకు చేరువ అవుతున్నాయి. మెర్సిడెస్ బెంజ్ సంస్థ 12వ ఆటో ఎక్స్‌పోలో తమ స్టాల్ వీడియోలను యూట్యూబ్‌లో పెట్టింది. యువ వినియోగదారులకు తాజా సమాచారం కావాలని, అందుకే తాము డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా వారికి నేరుగా కనెక్ట్ అయ్యేలా వినూత్నమైన మార్కెటింగ్ విధానాలను అనుసరిస్తున్నామని హ్యుందాయ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇక జనరల్ మోటార్స్ కంపెనీ షెవర్లె బ్రాండ్ కోసం చాటెరెట్టి పేరుతో వినూత్నమైన ప్రచారాన్ని నిర్వహిస్తోంది. సందర్శకుల అభిప్రాయాలను, ప్రతిస్పందలను యూట్యూబ్‌లో షేర్ చేస్తోంది. హీరో మోటొకార్ప్ కంపెనీ బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌తో గూగుల్ ప్లస్ హ్యాంగవుట్ సెషన్‌ను నిర్వహించింది. భారత్‌లో 20 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారని అంచనా. వాహనాలకు సంబంధించిన సమాచారానికి వినియోగదారులు టీవీ, వార్తాపత్రికల కంటే ఇంటర్నెట్పైననే అధికంగా అధారపడుతున్నారని గూగుల్ ఇండియా ఇండస్ట్రీ హెడ్ గౌరవ్ కపూర్ చెప్పారు. వాహన కంపెనీలు ఇంటర్నెట్ను ఈ ఆటో షోకు కూడా బాగానే వినియోగించుకుంటున్నాయని ఆయన చెప్పారు. -
మిస్సమ్మ తెలుగు చిత్రం
అండ్ లిటరేచర్: హవ్వ! ఈ సినిమాను యూ ట్యూబ్‌లో చూస్తారా? ప్రతి ఇంట్లో ఉండాల్సిన డి.వి.డి కదా ఇది. పిల్లలకు ఎనిమిదేళ్లు నిండగానే ప్రతి నెలా మొదటి ఆదివారం వాళ్లకేం కావాలో కొనిచ్చి మిస్సమ్మను చూపించాలి. అప్పుడే సరిగ్గా తెలుగులో పెంచినట్టు. మిస్సమ్మ 1956లో వచ్చింది. కాని ఇప్పటికీ అప్పుడే కోసుకొచ్చిన ఆకుకూరలా తాజాగా ఉంటుంది. ఎవరు ఏది కావాలంటే అది వేసి వొండుకుని రుచిని ఆస్వాదించవచ్చు. జ్యోతిష్ బెనర్జీ రాసిన బెంగాలీ హాస్యనవల ‘మన్మోయీ గర్ల్స్ స్కూల్’ దీనికి మూలం. దీనిని చక్రపాణి తెలుగులోకి ‘ఉదరపోషణార్థం’ పేరుతో అనువదించి పనిలో పనిగా సినిమాగా బాగుంటుందని ‘మిస్సమ్మ’ స్క్రిప్ట్‌గా అడాప్ట్ చేశారు. కాని ఆ పాయింట్ ఒక్కటే సినిమాకు సరిపోకపోవడంతో తాను అనువదించిన ‘డిటెక్టివ్’ అనే మరో బెంగాలి నవలలోని పాయింట్‌ను తీసుకొని దీనికి జత చేశారు. ఆ తర్వాతేముంది? ఇప్పటివరకూ వచ్చిన అన్ని తెలుగు సినిమాల్లోంచి లెక్క తీసినా టాప్ టెన్‌లో ఇది తప్పదు. ఇందులో జనానికి నచ్చేదేమిటి? కులాలు మతాలు అనే గొడవ పట్టించుకోకుండా హాయిగా నవ్వుతూ తుళ్లుతూ ఉల్లాసంగా బతకండిరా అనడమే. ఒక ఉల్లాసవంతమైన తెలుగు సినిమా అంటే మిస్సమ్మను మించింది లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్... ఇంకో హీరో సావిత్రి... ఇంకో హీరో సాలూరి... ఇంకో హీరో పింగళి... ఇంకో హీరో ఎల్.వి. ప్రసాద్. ఆ రోజులే వేరూ... ఆ బంగారమూ వేరే. ఈ ముత్తూట్ రోజుల్లో మిగిలింది మిస్సమ్మను చూసి ఆనందించడమే కదా. ఈ సండే దీనికే కేటాయించండి. -
ఛేంజ్, హోప్... ప్రచార పదాలు, పథాలు
విశ్లేషణం: ‘‘ఒక గొంతు ఒక గదిని మార్చగలదు. ఒక గదిని మార్చిన గొంతు ఒక సిటీని మార్చగలదు. ఒక సిటీని మార్చిన గొంతు ఒక రాష్ట్రాన్ని మార్చగలదు. ఒక రాష్ట్రాన్ని మార్చిన గొంతు ఒక దేశాన్ని మార్చగలదు. ఒక దేశాన్ని మార్చిన గొంతు ప్రపంచాన్నే మార్చగలదు. అది మీ గొంతే. మీ గొంతు ప్రపంచాన్నే మార్చగలదు’’. అతనేం గొప్ప కుటుంబంలో పుట్టలేదు... అతని కుటుంబానికి రాజకీయ నేపథ్యమూ లేదు... అతనేం ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకోలేదు... ప్రపంచం గుర్తించేటంత గొప్ప విజయాలూ సాధించలేదు.. కానీ అనూహ్యంగా అమెరికా ప్రజల మనసులు కొల్లగొట్టాడు... అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు... తొలి నల్లజాతి, ముస్లిం నేపథ్యమున్న అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో అడుగుపెట్టాడు... ప్రపంచం మొత్తం తన వైపే చూసేలా చేసుకున్నాడు... అతనే బరాక్ హుస్సేన్ ఒబామా! ఈ అద్భుతం ఒబామా వ్యక్తిత్వం, వాక్చాతుర్యం వల్లనే సాధ్యమైంది. మీరెప్పుడైనా ఒబామా ఉపన్యాసం విన్నారా? లేదంటే ఈ రోజే వినండి యూ ట్యూబ్‌లో. అతని ఉపన్యాసాల్లో ‘నేను’ అనే పదం కన్నా ‘మీరు’, ‘మనం’ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తాయి. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని తన కళ్లతోనే కాక ప్రజల దృష్టినుంచి కూడా పరిశీలిస్తాడు. గతం కంటే వర్తమానానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. అందమైన భవిష్యత్తు పట్ల విశ్వాసం కల్పిస్తాడు. ‘ఛేంజ్’, ‘హోప్’... ఒబామా ప్రచార పదాలు, పథాలు. ఆశలేని వ్యక్తి, మార్పులేని వ్యక్తి ప్రపంచంలో కానరాడు. ఆ రెండు పదాలను తన ప్రచారానికి ఎంచుకోవడంలోనే ఒబామా తెలివితేటలు కనిపిస్తాయి. ఎడమచేతి వాటం కల ఒబామా సృజనాత్మకంగా ఆలోచిస్తాడు. గొప్ప లక్ష్యాలను ఊహిస్తాడు, వాటిని సాధించేందుకు శ్రమిస్తాడు, రిస్క్ తీసుకునేందుకు వెనకాడడు. అందంగా, ఆకట్టుకునేలా మాట్లాడటం ఆయన బలం. ఒబామా ఉపన్యసించేటప్పుడు చూపుడువేలు, బొటనవేలు కలిసి ఉండే ఒబామా మార్కు ముద్రను చూడండి. తాను మాట్లాడుతున్న అంశాలపట్ల తన సంతృప్తికి ఆ ముద్ర అద్దం పడుతుంది. అంతేకాదు... ఎవరైనా కలం పట్టుకుని సంతకం చేయాలంటే ఆ ముద్రనే వాడాలి. అంటే... ఓటు వేయడానికి ముందు సంతకం చేసేటప్పుడు ఓటరు మనసులో ఒబామా రూపం కదలాడుతుందన్న మాట. దీన్నే ‘స్టీలింగ్ ఆఫ్ యాంకర్’ అంటారు. అంతేకాదు... తన ప్రత్యర్థి గురించి మాట్లాడేటప్పుడు పెదవులు బిగిస్తాడు. తద్వారా తన అనంగీకారాన్ని ప్రజలకు తెలపడమే కాకుండా వారు కూడా అలాగే ఫీల్ అయ్యేలా చేస్తాడు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు... ‘మనకు మార్పు కావాలి’, ‘మనం కోరుకునే మార్పు మన నుంచే రావాలి’, మార్పుకోసం నినదించే లక్షల గొంతుకల ముందు ఏ శక్తీ ఎదురునిలవలేదు’, ‘మార్పు తీసుకువచ్చే సామర్థ్యం మాకుందని విశ్వసించమని అడగడంలేదు, మీ సామర్థాన్ని మీరు విశ్వసించండి’, ‘మీ పరాజయాలు మీ జీవితాన్ని నిర్దేశించకూడదు, మీకు జీవితపాఠాలు నేర్పాలి’, ‘మార్పు సులభం కాదు, కానీ సాధ్యమే’, ‘మనం భిన్న ప్రాంతాలనుంచి వచ్చి ఉండవచ్చు, మనకు భిన్న కథనాలు ఉండవచ్చు. కానీ మనందరి ఆశ ఒక్కటే, అది మన అమెరికన్ కల’... ఇవన్నీ ఏ వ్యక్తిత్వ వికాస నిపుణుడో చెప్పిన మాటలు కాదు. బరాక్ ఒబామా తన ఉపన్యాసాల్లో పలికిన పలుకులు. మార్పు తప్పదనే విషయం అమెరికన్లకు అర్థమయ్యేలా చెప్పగలిగాడు. ఆ మార్పు తానేనని వారి మనసులకు చేరేలా చేయగలిగాడు. ‘మనం సాధించగలం’ అనే నమ్మకాన్ని వారికి కల్పించాడు. తాను సాధించి చూపించాడు. తన ఆశను, ఆశయాన్ని అమెరికన్లందరి ఆశగా, ఆశయంగా మార్చగలగడమే ఒబామా విజయరహస్యం. - విశేష్, సైకాలజిస్ట్