ఈ వారం యూట్యూట్‌ హిట్స్ | You tube hits this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూట్‌ హిట్స్

Published Sun, Aug 9 2015 10:40 PM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM

ఈ వారం యూట్యూట్‌ హిట్స్ - Sakshi

ఈ వారం యూట్యూట్‌ హిట్స్

లెర్న్ టు ఫ్లై
నిడివి : 7 ని. 28 సె.
హిట్స్ : 2,12,12,736

 వివిధ దేశాల నుంచి ఇటలీలోని చెసానా పట్టణానికి చేరుకున్న 350 మంది గిటారిస్టులు, 250 మంది సింగర్లు, 250 మంది డ్రమ్మర్లు, 150 బైసిస్టులు (బేస్ గిటారిస్టులు) కలిసి అమెరికన్ రాక్ బ్యాండ్ ‘ఫూ ఫైటర్స్’ కోసం ‘లెర్న్ టు ఫ్లై’ అనే ఈ థౌజండ్ వాలా కచేరీని ప్రదర్శించారు. ఆ వీడియో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. హిట్లు రెండు కోట్లు దాటాయి! దాదా
 పు రెండు దశాబ్దాలుగా ఇటలీ ముఖం చూడని ఫూ ఫైటర్స్ బ్యాండ్‌ను ఇటలీకి తెప్పించడం కోసం ఫాబియో జఫాగ్నినీ అనే దేశభక్త మ్యూజిక్ లవర్ ఈ స్థాయిలో కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశాడు!!
 
డెడ్‌పూల్ ట్రైలర్
నిడివి : 2 ని 54 సె.
హిట్స్ : 1,62,30,832

 ఈ వీడియోను తిలకించాలంటే ముందు మీ వయసును కన్ఫామ్ చెయ్యాల్సి ఉంటుంది. అరె! ఇందులో అంతగా ఏముంది? ‘జిలియన్’ థ్రిల్స్ ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్న డెడ్‌పూల్ హాలీవుడ్ మూవీ ట్రైలర్ ఇది. ఇందులో కిరాయి సైనికుడైన ర్యాన్ రెనాల్డ్‌పై క్యాన్సర్ ట్రీట్‌మెంట్ ప్రయోగం జరుగుతుంది. దాంతో అతడికి అతీంద్రియ శక్తులు లభిస్తాయి. ఆ శక్తులను ఉపయోగించి తనపై ప్రయోగం చేసిన వ్యక్తిని కనుక్కుని అతడిపై ప్రతీకారం తీర్చుకోడానికి బయల్దేరతాడు ర్యాన్.  మార్వెల్ కామిక్స్‌లోని వేడ్ విల్సన్ పాత్ర ఆధారంగా తయారైన సూపర్‌హీరో చిత్రం డెడ్‌పూల్.
 
ఆల్ ఐస్ ఆన్ యు
నిడివి : 3 ని. 54 సె.
హిట్స్ : 1,52,88,202

 అమెరికన్ హిప్‌హాప్ రికార్డింగ్ ఆర్టిస్ట్ మీక్ మిల్ తన రెండో ఆల్బమ్ ‘డ్రీమ్స్ వర్త్ మోర్ దేన్ మనీ’ లోని సింగిల్ ట్రాక్ ‘ఆల్ ఐస్ ఆన్ యు’. ఇందులో మిల్ సరసన ట్రినిడాడ్‌లో పుట్టిన అమెరికా అమ్మాయి నిక్కీ మినాజ్ నటించారు. ఈ దృశ్య కావ్యంలోని మిల్-మినాజ్‌ల ప్రణయ భావన వ్యక్తీకరణలు... చూడడానికి తప్ప వర్ణించేందుకు వీలు కానివి. మిల్‌కి, మినాజ్‌కి మధ్య నిజజీవిత రహస్య బాంధవ్యం ఏదో ఉందన్న వదంతులకు ఈ వీడియోలోంచి వెలువడే శక్తిమంతమైన తరంగాలు బలాన్ని చేకూర్చేవిధంగా ఉన్నాయి.
 
క్రిస్టియానో రెనాల్డో
ఇన్ డిజ్‌గైజ్
నిడివి : 4 ని. 4 సె.
హిట్స్ : 76,80,906

 విగ్గు, పెట్టుడు గడ్డం, మీసాలతో ఇటీవల స్పెయిన్  రాజధాని మాడ్రిడ్ వీధులలో సరదాగా ఫుట్‌బాల్‌తో తనకు తాను ఆడుకున్న పోర్చుగల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో వీడియో యూ ట్యూబ్ వీక్షకులను అమితంగా అలరిస్తోంది. మారువేషంలో ఉన్న రొనాల్డోను ఒక్కరు కూడా గుర్తుపట్టలేకపోవడం ఒక విశేషం కాగా, దారిన పోతున్న ఓ మహిళను రొనాల్డో ఫోన్ నెంబరు అడగడం, ఆమె సున్నితంగా తిరస్కరించడం ఒక చిలిపి సన్నివేశం. వీడియో చివర్లో రొనాల్డో తన వేషం తొలగించినప్పుడు అతడిని గుర్తుపట్టి అంతా చుట్టుముడతారు.
 
 వైనల్ టీజర్
 (హెచ్‌బివో)
 నిడివి : 1 ని.
 హిట్స్ : 12,71,010

వచ్చే ఏడాది హెచ్.బి.వో. చానెల్‌లో రాబోతున్న టెలివిజన్ సీరీస్... వైనల్. అమెరికన్ రచయిత ఈ టెలివిజన్ డ్రామాను రూపొందించారు. మరో అమెరికన్ స్కార్సేస్ దర్శకత్వం వహించారు. దీని టీజర్ ఇలా మొదలౌతుంది. ‘‘ ఇది నా కథ. నా నోరు మూయించాలంటే రికార్డు ఆన్ చెయ్యండి. నీడిల్‌ను దానిపై ఉంచండి. వాల్యూమ్‌ని పెంచండి’. వైనల్ అనేది గ్రామఫోన్ రికార్డుల తయారీలో ఉపయోగించే పూత. ఇంతకీ వైనల్ థీమ్ ఏమిటి? ఇదొక రాక్ అండ్ రోల్ డ్రామా. డెబ్బైల నాటి ‘అమెరికన్ సెంచరీ రికార్డ్’ అధినేత సంగీత ప్రియత్వపు సంక్షోభంపై సీరీస్ నడుస్తాయి.
 
 
మోటోబిఎఫ్‌ఎఫ్
చాలెంజ్
నిడివి : 4 ని. 46 సె.
హిట్స్ : 2,91,070

లైవ్‌లో ప్రేక్షకుల ముందు నిలబడి కామెడీని పండించడాన్ని ‘స్టాండ్-అప్’ కామెడీ అంటారు. అలాంటి కామెడీలో తలపండిన పాతికేళ్ల భారతీయ యువకుడు కనన్ గిల్ (ఫొటోలో ఉన్నది అతడే) ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా మోటరోలా ఇండియా కంపెనీ కోసం తయారుచేసి ఇచ్చిన గేమ్ ‘హూ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్’, MOTOBFFCHALLENGE  అనే హ్యాష్‌టాగ్ (ు) తో యూట్యూబ్‌లో నవ్వులు కురిపిస్తోంది. కనీజ్ సుర్కా, అబిష్ మ్యాథ్యూ, కెన్నీ సెబాస్టియన్‌లు పాల్గొన్న ఈ గేమ్‌లో చివరికి ఎవరు విన్ అవుతారో తెలుసా? మీరు ఊహిచలేరంతే!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement