
Keerthi Suresh Launched YouTube Channel: టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తెరకెక్కిన 'నేను శైలజ' సినిమాతో తెలుగులో తెరంగ్రేటం చేసిన ఈ బొద్దుగుమ్మ 'మహానటి' చిత్రంతో జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉంది కీర్తి. ప్రస్తుతం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న 'గుడ్ లక్ సఖి' చిత్రంలో నటించింది. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పలు మార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ నెల 28న థియేటర్లలో విడుదల కానుంది.
అయితే తాజాగా కీర్తి సురేష్ తన యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 'ఈరోజు (జనవరి 26) నా అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. సబ్‌స్క్రైబ్ చేసి వీడియోలు చూడండి.' అని ట్విటర్లో ట్వీట్ చేసింది కీర్తి సురేష్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తన బ్యూటిఫుల్ ఫొటోస్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన షార్ట్ వీడియోస్, ఫిట్నెస్ తదితర వీడియోలను అభిమానులతో పంచుకోనున్నట్లు తెలుస్తోంది.
Hello! Excited to be launching my official YouTube channel today! Do click on the link to subscribe and keep watching! 😊✨https://t.co/W3UqhVHvD8 @YouTubeIndia #youtubeshorts pic.twitter.com/uolMqnfdqP
— Keerthy Suresh (@KeerthyOfficial) January 26, 2022
Comments
Please login to add a commentAdd a comment