సౌత్ ఇండియా నటి కీర్తీ సురేష్(Keerthy Suresh) చాలా లక్కీ అనే చెప్పాలి. బాలనటిగా రంగప్రవేశం చేయడం వల్లో ఏమోగానీ, కథానాయకిగానూ చాలా త్వరగా క్లిక్ అయ్యారు. అదేవిధంగా మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనూ వెనువెంటనే రంగప్రవేశం చేసి అంతే వేగంగా విజయాలను తన ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా నాయకిగా గుర్తింపు పొందారు. అంతేకాదు అతి పిన్న వయసులోనే మహానటి చిత్రంలో అద్భుతమైన హావభావాలను పలికించి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. అంతే స్వీడ్‌గా పెళ్లి చేసుకున్నారు. ఇదంతా నటిగా దశాబ్ద కాలంలోనే జరిగిపోయింది.
గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన తన 15 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ ఆంటోనిని(Antony Thattil) కుటుంబ సభ్యుల సమ్మతితో పెళ్లి చేసుకున్న ఆ వెంటనే తాను నటించిన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. కాగా ఇటీవలే తన భర్తతో హనీమూన్ కోసం థాయ్‌ల్యాండ్ వెళ్లి వచ్చిన ఈ బ్యూటీని ఒక భేటీలో కీర్తీసురేశ్ తన వివాహ జీవితం గురించి అగిడిన ప్రశ్నకు తాను వివాహానికి ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే సంతోషంగా ఉన్నానని చెప్పారు. కారణం తాము సుదీర్ఘ కాలంగా డేటింగ్‌లో ఉండటం వల్ల ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసన్నారు.
అందువల్ల తనకు పెద్దగా ఛేంజ్ అంటూ ఏమీ లేదని అన్నారు. తాను ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటుంటానని, అది తన భర్తకు కాస్త సంకటంగా ఉంటుందన్నారు. అయినా దాన్ని ఆయన ఇబ్బందిగా భావించడం లేదన్నారు. తనను అర్థం చేసుకున్న వ్యక్తి కావడంతో చాలా విషయాల్లో సర్దుకు పోతుంటారని చెప్పారు. అందువల్ల తమ సంసార జీవితం చాలా సంతోషంగా సాగుతుందని నటి కీర్తీసురేశ్ పేర్కొన్నారు. కాగా హిందీ చిత్రం బేబీ జాన్ ఇటీవల విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం నూతన చిత్రాలేమీ అంగీకరించలేదు. కీర్తీసురేశ్ నటించిన రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment