జయాపజయాలు ఎవరి చేతుల్లోనూ ఉండవు. అయితే విజయాలకంటే అపజయాల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎవరైనా తాము నటించే చిత్రాలు సక్సెస్ కావాలనే కోరుకుంటారు. అయితే ఒక్కొక్కసారి లెక్క తప్పుతుంది. తాజాగా నటి కీర్తిసురేశ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. నిజం చెప్పాలంటే ఈమెకు విజయాలేమీ కొత్త కాదు. అయితే కోలీవుడ్‌లోనే వాటి శాతం చాలా తక్కువగా ఉందన్నది గమనార్హం. చాలా కాలం క్రితం విజయ్‌కు జంటగా నటించిన సర్కార్ చిత్రం విజయాన్ని సాధించింది. ఆ తరువాత రజనీకాంత్‌కు చెల్లెలిగా నటించిన ఆన్నాత్తే (పెద్దన్న) చిత్రం నిరాశ పరిచింది.
ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటించిన మామన్నన్ చిత్రం సక్సెస్ అయ్యింది. ఆ తరువాత నటించిన సైరన్ చిత్రం అపజయాన్నే మిగిల్చింది. ఇకపోతే ఇటీవల ఈమె నటించిన 'రఘుతాత' చిత్రాన్ని కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోమ్‌బలే సంస్థ నిర్మించడం, ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రం కావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తంగలాన్, డీమాంటీ కాలనీ 2 చిత్రాల మధ్య విడుదలైన రఘుతాత వసూళ్ల పరంగా వెనుకపడిపోయిందన్నది ట్రేడ్ వర్గాల మాట. కాగా ప్రస్తుతం బేబీజాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంటర్ అయిన కీర్తిసురేశ్ చేతిలో రివాల్వర్ రీటా, కన్నివెడి అనే రెండు తమిళ చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఈ రెండు లేడీ ఓరియన్‌టెడ్ కథా చిత్రాలు కావడం విశేషం. బేబీ జాన్ అనే హిందీ సినిమాలో కూడా ఆమె నటిస్తుంది. ఈ చిత్రాలపైనే కీర్తి సురేశ్ ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment