సినీ తారల ప్రేమ, పెళ్లి అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం ఇలాంటి సీజనే నడుస్తోందని చెప్పవచ్చు. ఇటీవల నటుడు నాగచైతన్య, శోభిత వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగిన విషయం తెలిసిందే. మరుపక్క నటి సమంత బాలీవుడ్‌కు చెందిన ఓ నటుడి ప్రేమలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇకపోతే కురక్రారుల డ్రీమ్ గర్ల్ కీర్తి సురేష్ కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం ఆమె నటిస్తున్న హిందీ చిత్రం బేబీ జాన్‌తో ఈ అమ్మడు పాన్ ఇండియా కథానాయకిగా పేరు తెచ్చుకున్నారు. ఇలా కథానాయకిగా ఉన్నత స్థాయిలో రాణిస్తున్న సమయంలోనే కీర్తి సురేష్ పెళ్లికి సిద్ధమవడం చాలామందిని ఆసక్తికి గురిచేసింది. 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న తన పాఠశాల స్నేహితుడు ఆంటోనితో ఏడడుగులు నడవడానికి కీర్తి సురేష్ సిద్ధమవుతున్నారు. కాగా తను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి క్రిస్టియన్ మతానికి చెందినవాడు కావడంతో నటి కీర్తి సురేష్ కూడా మతం మారడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
అయితే అది నిజం కాదంటూ తమ ప్రేమ, పెళ్లికి మతం సమస్య కాదని ఈ క్రేజీ జంట నిరూపించుకున్నారు. ఆ విధంగా ఇరు కుటుంబాల సమ్మతితో రెండు మతాలను సంప్రదాయాలనూ గౌరవించే విధంగా ఆంటోనీ, కీర్తి సురేష్ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. వీరి పెళ్లి ఈనెల 12న గోవాలో జరగనుంది. అక్కడ 12వ తేదీ ఉదయం హిందూ మత సంప్రదాయ ప్రకారం, అదేరోజు సాయంత్రం చర్చిలో క్రిస్టియన్ మత సాంప్రదాయ ప్రకారం కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి రెండు సార్లు జరగనుందని తెలిసింది. వీరి వివాహ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment