
హీరోయిన్ కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తాటిల్‌ను పెళ్లి చేసుకుంది. గోవా వేదికగా వారిద్దరూ మూడుముళ్ల బంధంతో ఏడడుగులు నడిచారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇరుకుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కీర్తి మెడలో ఆంటోనీ మూడుముళ్ల వేయడంతో నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను అభిమానులతో కొత్త దంపతులు పంచుకున్నారు.
గోవా వేదికగా జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొందిమంది సన్నిహితులు పాల్గొన్నారు. నూతన వధూవరులను వారందరూ ఆశీర్వదించారు. దీంతో అభిమానులు కూడా వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఏడాది దీపావళి రోజున ఆంటోనీ తాటిల్‌తో తన ప్రేమ విషయాన్ని కీర్తి సురేశ్ తెలియజేసింది. సౌత్‌లో బిజీ హీరోయిన్‌గా ఉన్న ఆమె కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. బేబీ జాన్ మూవీతో ఆమె బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ త్వరలోనే విడుదలకానుంది.

కీర్తి సురేష్ పెళ్లిలో పాల్గొన్న వారందరికీ KA అని ముద్రించి ఉన్న హ్యాండ్ బ్యాండ్స్ ఇచ్చారట.. వాటిని ధరించిన వారికి మాత్రమే పెళ్లి వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించారట. ఆంటోనీతో ప్రేమ, వివాహం గురించి ఇటీవల కీర్తి ఇన్‌స్టా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఒక ఫొటో విడుదల చేసిన ఆమె.. దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనున్నట్లు తెలిపింది. ఆంటోనీ కుటుంబం వ్యాపార రంగంలో రానిస్తుంది. కొచ్చి, చెన్నైలలో వారికి వ్యాపారాలున్నాయి. స్కూల్ డేస్ నుంచి కలిసే ఉన్న కీర్తి, ఆంటోనీ కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డారట. ఇప్పుడు పెళ్లితో ఒక్కటిగా కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు.

Comments
Please login to add a commentAdd a comment