మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కి ఆ తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కథానాయకిగా దుమ్ము రేపుతున్న నటి కీర్తి సురేష్. రెగ్యులర్ కమర్షియల్ పాత్రలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ కూడా ఆమె చేస్తుంటారు. ఆమె నటించిన కొత్త సినిమా రఘు తాత ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల కానుందన ప్రచారం జరుగుతుంది. కీర్తీ సురేష్ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆగష్టు 15న తమిళ్ వర్షన్ విడుదల అయింది.
రవీంద్ర విజయ్, ఎమ్మెస్ భాస్కర్ ఆనంద్ సామి, దేవదర్శిని తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. హిందీ భాషకు వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ చిత్రం కోలివుడ్ ప్రేక్షకులను మెప్పించింది. కాగా, రఘు తాత మూవీ ఓటీటీ హక్కులను జీ5 సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం,మలయాళం, కన్నడ స్ట్రీమింగ్ హక్కులను జీ5 మంచి ధరకు కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. సెప్టెంబర్ మొదటి వారం లేదా సెప్టెంబర్ 14న ఓటీటీలో తెలుగు వర్షన్ డైరెక్ట్‌గా విడుదల అవుతుందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి.
హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనలను ఖండిస్తూ సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైయినర్‌గా రఘుతాత సినిమా ఉంది. హిందీకి వ్యతిరేకంగా ఈ సినిమాలో కీర్తి పోరాడుతుంది. మొదటి నుంచి హిందీ భాషను వ్యతిరేకిస్తూ వచ్చిన ఆమె ఫైనల్‌గా హిందీ ఎగ్జామ్ రాయాలని ఎందుకు పూనుకుంటుంది అనేది సినిమా.
Comments
Please login to add a commentAdd a comment