ఆ సినిమాను యూట్యూబ్ లో చూడలేరు! | 'Kriti' plagiarism charges: Shirish Kunder's short film pulled down from YouTube | Sakshi
Sakshi News home page

ఆ సినిమాను యూట్యూబ్ లో చూడలేరు!

Published Wed, Jun 29 2016 3:38 PM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

ఆ సినిమాను యూట్యూబ్ లో చూడలేరు!

ఆ సినిమాను యూట్యూబ్ లో చూడలేరు!

ముంబై: మనోజ్ బాజపేయి, రాధిక ఆప్టే నటించిన షార్ట్ ఫిలిమ్ 'కృతి' యూట్యూబ్ నుంచి తొలగించారు. కాపీ రైట్ వివాదం తలెత్తడంతో ఈ సినిమాను యూట్యూబ్ తొలగించింది. ఈ విషయాన్ని దర్శకుడు శిరీష్ కుందర్ ధ్రువీకరించారు. యూట్యూబ్ నుంచి తమ సినిమాను తొలగించారని ట్వీట్ చేశారు. తమకు మద్దతుగా నిలిచినందుకు ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

'కృతి' షార్ట్ ఫిలిమ్ ను యూట్యూబ్ లో 25 లక్షల మంది వీక్షించారు. 18 నిమిషాల నిడివున్న ఈ సినిమాను యూట్యూబ్ లో జూన్ 22న విడుదల చేశారు. తన షార్ట్ ఫిలిమ్ 'బాబ్'ను కాపీ కొట్టి 'కృతి' తీశారని నేపాల్ దర్శకుడు అనీల్ న్యుపనె ఆరోపించడంతో వివాదం రేగింది. 'కృతి' కంటే ఏడు నెలల ముందే 'బాబ్' తీశానని వెల్లడించాడు. అనీల్ న్యుపనె ఆరోపణలను శిరీష్ తోసిపుచ్చాడు. తనపై ఆరోపణలు చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అతడికి లీగల్ నోటీసు పంపాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement